
సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth)కి ఉన్న స్టార్ డమ్ ఇంచు కూడా తగ్గలేదంటూ నిరూపించిన చిత్రం జైలర్(Jailer). రజినీ వరుస పరాజయాలకి కూడా భారీ సైజులోనే గుమ్మడి కాయ కొట్టింది. అలాంటి ఈ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన జైలర్ 2 పై అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పక్కర్లేదు. తెలుగునాట కూడా అదే క్రేజ్. ఇప్పుడు తెలుగు బిజినెస్ కి సంబంధించిన ఆసక్తికర న్యూస్ సోషల్ మీడియాకి నూతనోత్సాహాన్ని తీసుకొస్తుంది. ఆ న్యూస్ ఏంటో చూద్దాం.
రజినీ కాంత్ సినిమాలకి తెలుగులో మంచి మార్కెట్ ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల డబ్బింగ్ మరియు పంపిణీ హక్కుల కోసం టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ మధ్య గట్టి పోటీ నెలకొంది. మేకర్స్ జైలర్ సీక్వెల్ తెలుగు హక్కులని 60 కోట్లుగా నిర్ణయించారు. పార్ట్ 1 రెండు తెలుగు రాష్ట్రాల్లో 70 కోట్ల గ్రాస్ సాధించడంతోనే 60 కోట్లుగా నిర్ణయించారు. కానీ ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే జైలర్ తర్వాత వచ్చిన రజినీ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా నిలిచాయి. కూలీ తెలుగు రైట్స్ మాత్రం 52 కోట్లకి అమ్మగా సుమారు 50 కోట్ల కలెక్షన్స్ దగ్గరే ఆగింది.
also read: Janhvi Kapoor: అచ్చాయమ్మా ఇచ్చిపడేసింది.. వ్యూస్ కోసం అలాంటివి రాస్తారా
మరి ఇప్పుడు జైలర్ 2 తెలుగు హక్కులని 60 కోట్లకి తీసుకుంటే అంత వసూలు చేస్తుందా అనే చర్చలు మొదలైనట్టుగా టాక్ . పైగా జూన్ 12 న థియేటర్స్ లోకి వచ్చే వారం ముందే చరణ్ జూన్ 4 న 'పెద్ది'తో వస్తున్నాడు. మరి పెద్దికి హిట్ టాక్ వస్తే జైలర్ 2 కి థియేటర్స్ దొరుకుతాయా అనే చర్చ కూడా మొదలైంది. సన్ పిక్చర్స్ పై కళానిధి మారన్ నిర్మిస్తుండగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు అనే విషయం తెలిసిందే.






