
ఇళయ దళపతి విజయ్(Vijay)తమిళనాడు ఎన్నికల్లో విజయదుంధిబితో దూసుకుపోతున్నాడు. సిఎం అయ్యే ఛాన్స్ కూడా ఉండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. తాజాగా విజయ్ ఇంటికి త్రిష(Trisha)వెళ్లిన పిక్స్ సోషల్ మీడియాని బ్రేక్ డాన్స్ చేయిస్తున్నాయి.
ఎన్నికలకి ముందు త్రిష, విజయ్ మధ్య ఇల్లీగల్ రిలేషన్ ఉందని ప్రత్యర్థి రాజకీయ పార్టీలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. స్వయంగా విజయ్ వైఫ్ కూడా ఇదే కారణాన్ని చూపిస్తూ విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కింది. ఆ తర్వాత విజయ్ ఎంతో దైర్యంగా త్రిషని తీసుకొని ఒక మ్యారేజ్ ఫంక్షన్ కి హాజరయ్యాడు. పైగా ఒకే కలర్ కోడ్ డ్రెస్ తో. దీంతో ప్రత్యర్డులు విజయ్ పని రాజకీయంగా అవుట్ అనుకున్నారు. కానీ తమిళ ఓటర్లు ఇవేం పట్టించుకోలేదు. విజయ్ ని ముఖ్యమంత్రి పీఠం దగ్గరకి దగ్గరుండి మరి తీసుకెళ్లే పనిలో బిజీగా ఉన్నారు.
Also read: Vijay: ఈ రోజు త్రిష పుట్టిన రోజు.. ఎన్నికల రిజల్ట్ విజయ్ ఇచ్చిన గిఫ్ట్ అనుకోవచ్చా!
పైగా ఈ రోజు త్రిష పుట్టిన రోజు కూడా కావడంతో విజయ్ కి త్రిష ఇచ్చిన గిఫ్ట్ అనే కామెంట్స్ కూడా చేస్తున్నారు. త్రిష ఈ రోజు ఉదయం తిరుమల తిరుపతి ఏడుకొండలవాడిని దర్శించుకొని డైరెక్ట్ గా విజయ్ ఇంటికి వెళ్లినట్టుగా తెలుస్తుంది.




.webp)
