Home

»

Latest News

Janhvi Kapoor: అచ్చాయమ్మా ఇచ్చిపడేసింది.. వ్యూస్ కోసం అలాంటివి రాస్తారా

May 4, 2026 11:27AM

 

అతిలోక సుందరి తనయ జాన్వీకపూర్(Janhvi kapoor)జూన్ 4 న అచ్చాయమ్మాగా 'పెద్ది'(Peddi)ని ఎన్ని ముప్ప తిప్పలకి గురి చేసిందో తెలియబోతుంది. అభిమానులు అయితే పెద్దితో జాన్వీ అగ్ర హీరోయిన్ గా ఎదగడం పక్కా అనే నమ్మకంతో ఉన్నారు. రీసెంట్ గా కొన్ని రోజుల క్రితం జాన్వీ కపూర్ మాట్లాడుతూ జీవితంలో జరిగిన ఒక బాధాకరమైన సంఘటన తర్వాత ఆల్కహాల్ కి బానిస అయ్యానని చెప్పిందనే మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పుడు ఈ విషయంపై జాన్వీ స్పందించింది. ఆ మాటలేంటో చూద్దాం.


మద్యానికి సంబంధించిన వార్తలుని స్క్రీన్ షాట్ తీసి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి  'ఇలాంటి వార్తలు రాయడానికి మీకు సిగ్గుగా అనిపించడం లేదా. క్లిక్ బైట్స్ కోసం ఎంతటి అబద్ధాలనైనా ప్రచారం చేస్తారా. నేను ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తాను. ఫిట్‌నెస్ విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా ఉంటాను. కేవలం వ్యూస్ కోసం ఒకరి వ్యక్తిత్వాన్ని కించపరచడం సరైంది కాదు. కనీస వాస్తవాలని తెలుసుకోకుండా ఇలాంటి క్లిక్ బైట్ వార్తలు రాయడం మానుకోవాలని పేర్కొంది.

Also Read: Varanasi: వారణాసికి షాక్ ఇచ్చిన హైదరాబాద్ వాటర్ బోర్డు అధికారులు.. రద్దు తప్పదా!


సెలబ్రిటీల గురించి వార్తలు రాసేటప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలని, కేవలం సంచలనం కోసం అబద్ధాలను ప్రచారం చేయకూడదని నెటిజన్లు కూడా జాన్వీకి మద్దతు తెలుపుతున్నారు. 


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com