Home

»

Latest News

Varanasi: వారణాసికి షాక్ ఇచ్చిన హైదరాబాద్ వాటర్ బోర్డు అధికారులు.. రద్దు తప్పదా!

May 04, 2026

 

మహేష్, రాజమౌళిలు వారణాసి(Varanasi)షూట్ కి ఇప్పుడు కొంచం గ్యాప్ ఇచ్చినా తిరిగి ఈ నెల 18 నుంచి హైదరాబాద్ లో స్టార్ట్ చేయనున్నారు. కానీ ఇప్పుడు ఆ  షూట్ జరిగే అవకాశాలు చాలా  తక్కువగా ఉన్నాయనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.

మేకర్స్ ఈ నెల 18 న హైదరాబాద్ గగన్ పహాడ్ ఏరియాలో వేసిన సెట్ లో నీటి అడుగున సన్నివేశాలు తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. సదరు సన్నివేశాలకి శుద్ధి చేసే నీరు చాలా అవసరం అవుతుంది. సుమారు పదివేల లీటర్ల కావాలనేది అంచనా. దీంతో పదివేల లీటర్ల కెపాసిటీ ఉన్న 150 ట్యాంకర్ల నీరు కావాలని టీం హైదరాబాద్ వాటర్ బోర్డుకి దరఖాస్తు చేసుకుంది. కానీ  నగరంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు నీటి కొరత కూడా ఉండటంతో వాటర్ బోర్డు వారణాసి టీం రిక్వెస్ట్ ని రద్దు చేసినట్టుగా సమాచారం. మరి ఊహించని ఈ సంఘటనతో షూట్ ని పోస్ట్ పోన్ చేస్తారా లేక వేరే మార్గాలతో స్టార్ట్ చేస్తారా అనేది చూడాలి.

also read: Vijay: సినిమాకి ఉన్న పవర్ చూపిస్తూ 100 స్థానాల్లో విజయ్.. తిరుమల కొండపై త్రిష 


మహేష్ అయితే ప్రెజెంట్ జర్మనీలోని అడవుల్లో వారణాసి కోసమే ట్రెక్కింగ్ కి వెళ్ళాడు. మరో రెండు రోజుల్లో అక్కడనుంచి రానున్నట్టుగా సమాచారం. ఇప్పటికే  కొంత భాగం షూటింగ్ ని పూర్తి చేసుకున్న వారణాసి వచ్చే ఏడాది ఏప్రిల్ 7 న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే
   

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com