LATEST NEWS
  జగన్‌లో మార్పు వుంటుందా, వుండదా అన్న అయోమయంలో వైసీపీ నేతలు.. ఆయనలో మార్పు వుండదన్న నిశ్చయానికి వచ్చేస్తున్నారు. జగన్ మాటలు, ప్రకటనలు ప్రజలలో పార్టీని చులకన చేస్తున్నాయని ఆవేదన..ప్రభుత్వ వ్యతిరేకతను మించి జగన్ మీద అపనమ్మకం ప్రజలను ప్రభావితం చేస్తుందనే భయం...రాష్ట్రంలో విచిత్రమైన రాజకీయ పరిస్థితులు నెలకొంటున్నాయి. కూటమి ప్రభుత్వం మీద ప్రజలలో ఎంత మాత్రం అసంతృప్తి లేదని అందరికీ అర్ధమైపోయింది. తెలుగుదేశం ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఆ నిజం ఒప్పుకొంటున్నారు. పరిస్థితి ఇట్లనే వుంటే రేపటి ఎన్నికలలో నెగ్గుక రావడం దుర్లభం అన్న భయం కూడా వారిని కలత పెడుతున్నది. చాలామంది ఎమ్మెల్యేలు ఈ భయాన్ని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మలచుకోవడానికి వైసీపీ ఎంత మాత్రం సన్నద్ధం కాలేకపోతున్నది. జిల్లా స్థాయి నాయకులు కొందరు మాత్రమే భవిష్యత్ మీద ఆశతో కొంత చురుకుగా కనిపిస్తున్నారు. కానీ కార్యకర్తలలో ఆ ఉత్సాహం, విశ్వాసం కనిపించడం లేదు. మూడు పార్టీల కూటమి, రెండు ప్రధాన కులాల కలయిక కొనసాగినంత కాలం మనమెట్లా గెలుస్తామనే నిరాశ కార్యకర్తలలో కనిపిస్తున్నది. రాజకీయ చర్చలు ఆ కోణంలోనే కొనసాగుతున్నాయి. పైస్థాయి నాయకులు మాత్రం, జగన్ ధోరణి చూసి బాధ పడిపోతున్నారు. ప్రజలలో వున్న ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకోవడానికి పార్టీ అధినేతగా జగన్ సరైన రీతిలో స్పందించడం లేదన్నది వారి అభిప్రాయం. గత పాలనలో జరిగిన పొరపాట్లు లేదా మహా పాపాల వల్ల తాము ఓడిపోయామని, మళ్లీ అధికారం వస్తే ఆ పొరపాట్లు జరగకుండా చూసుకుంటామనే విశ్వాసాన్ని ప్రజలలో కలిగించడానికి జగన్ ఎంత మాత్రం ప్రయత్నం చేయడం లేదు.  జమీన్ రైతు సౌజన్యంతో...!
  రాజకీయాల్లో విజయం అనేది కేవలం నాయకుల ఉపన్యాసాల వల్ల మాత్రమే సాధ్యం కాదు. అధికారం, రాజకీయ వేధింపులు, ఆంక్షలు ఎన్ని ఎదురైనా వెరవక.. నిలబడి పోరాడే క్షేత్రస్థాయి కార్యకర్తల స్వార్థరహిత త్యాగాల పునాదులపైనే మార్పు రూపుదిద్దుకుంటుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో నిర్వహించిన నియోజకవర్గాల కార్యకర్తల సమావేశంలో మంత్రి నారా లోకేష్ ప్రసంగిస్తూ వ్యక్తపరిచిన భావోద్వేగం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, తీవ్ర ఆంక్షలు ఎదురైన క్లిష్ట పరిస్థితుల్లో క్షేత్రస్థాయి పసుపు సైన్యం ప్రదర్శించిన తెగువ, చూపించిన ఆత్మీయతను ఆయన గుర్తు చేసుకున్న తీరు సభలోని ప్రతి ఒక్కరి గుండెలను తాకింది. ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలోని 14 నియోజకవర్గాల్లో సుదీర్ఘంగా 45 రోజుల పాటు సాగిన 'యువగళం' పాదయాత్ర రోజుల నాటి పరిస్థితులను లోకేష్ భావోద్వేగంతో వివరించారు. ఆ రోజుల్లో అడుగడుగునా ఎదురైన తీవ్ర ప్రతిబంధకాలు, భయానక రాజకీయ వాతావరణం, సరైన పోలీసు భద్రత లేకపోవడం వంటి సవాళ్లను సభ ముందుకు తెచ్చారు. తీవ్ర రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అధికార యంత్రాంగం వైపు నుంచి తగినంత రక్షణ లభించకపోయినా, రోప్ పార్టీ సరిగా లేని సమయంలో కూడా సామాన్య పసుపు సైనికులు స్వయంగా రక్షణ కవచంగా నిలిచారని పేర్కొన్నారు. "నడువు అన్న.. ఎవరు వస్తారో తోలు తీద్దాం" అంటూ సామాన్య గ్రామీణ యువకులు, పార్టీ కార్యకర్తలు తమ ప్రాణాలను పణంగా పెట్టి అండగా నిలబడడం కేవలం ఒక రాజకీయ సంఘటన కాదు; అది ఒక లోతైన భావోద్వేగ బంధానికి నిదర్శనం. ఈ పోరాట ప్రయాణంలో కేసులు, వేధింపులు, ఆర్థిక నష్టాలను తట్టుకుని నిలబడిన కార్యకర్తల త్యాగమే నేడు పార్టీకి మళ్లీ ఊపిరి పోసిందని లోకేష్ ఆవేదనతో, కృతజ్ఞతతో వ్యాఖ్యానించారు. "ఈ రోజు మేమందరం వేదికపై గౌరవప్రదంగా కూర్చున్నామంటే, దానికి వెనుక ఉంది కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అపారమైన త్యాగం" అని విస్పష్టంగా ప్రకారించారు. తమ నాయకుడికి ఆపద వస్తుందేమోనన్న భయంతో స్వయంగా వీధుల్లోకి వచ్చి, కంటికి రెప్పలా కాపాడుకున్న ఆ దృశ్యాలు తన గుండెల్లో ఎప్పటికీ పదిలంగా ఉంటాయని చెప్పారు. కష్టకాలంలో తోడుగా నిలిచిన వారిని అధికారంలోకి వచ్చాక కూడా గుర్తుపెట్టుకోవడం ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యం. భయం నీడలో జీవించిన ప్రజలకు, కార్యకర్తలకు ఆనాడు లభించిన ధైర్యమే నేటి మార్పుకు బీజం వేసింది. ఈ రోజు ఉమ్మడి కర్నూలు జిల్లా వేదికగా సాగిన ఈ సమావేశం, కేవలం ఒక సాధారణ రాజకీయ ఉపన్యాసంగా కాకుండా, క్షేత్రస్థాయిలో రక్తం చిందించిన సామాన్య కార్యకర్తలకు నాయకుడు అర్పించిన భావోద్వేగ కృతజ్ఞతా నీరాజనంగా నిలిచింది. Nara Lokesh Speech, Nara Lokesh Kurnool Visit, Yuva Galam Padayatra Kurnool, TDP Cadre Sacrifice, Nara Lokesh Emotional Speech, Kurnool TDP Meeting, Lokesh Kurnool Padayatra 45 Days,Telugu Desam Party Activists https://youtube.com/shorts/Q-CVoV6OKuo?si=3ri-MoSdU9wLQZsG
భక్తులు శ్రీరాముడిపై ఉన్న అపారమైన విశ్వాసంతో తమ కష్టార్జితాన్ని హుండీలో కానుకలుగా సమర్పిస్తారు. అలా సమర్పించిన ప్రతి రూపాయి వెనుక పవిత్రమైన విశ్వాసం, ఆధ్యాత్మిక చింతన  ఉంటాయి. అలాంటి కానుకలు దుర్వినియోగమైతే భక్తల మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటాయి. అయోధ్య రామాలయానికి భక్తుల సమర్పించిన విరాళాల విషయంలో అదే జరిగింది. అయోథ్య రాముడికి భక్తుల సమర్పించిన విరాళాల్లో 7.5 కోట్ల రూపాయల మేర  అవకతవకలు జరిగా యన్నవార్తలు దేశవ్యాప్తంగా కోట్ల మంది భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీశాయి.  ఆ అవకతవకలకు, అక్రమాలకు నిరసనగా పార్లమెంటు ఆవరణలో విపక్షాలు వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేశాయి.  అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పరిధిలో దాదాపు రూ. 7.5 కోట్ల విరాళాల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలపై పార్లమెంట్‌ ద్వారం వద్ద స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ కాషాయ వస్త్రాలు ధరించి, పూజారి వేషంలో ఒక పెద్ద హుండీతో కూర్చుని సేకరించిన విరాళాలను జేబులో వేసుకుంటూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఆ పూజారికి  లోక్‌సభలో  ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సహా పలువురు  విపక్ష ఎంపీలు   విరాళాలు వేస్తుండగా, పప్పు యాదవ్ వారిచ్చిన సొమ్మును తన జేబులో వేసుకుంటూ చోరీ జరిగిన విషయాన్ని చాటారు. ఆ సందర్భంగా ఎంపీలు చఢావా చోర్, గద్దీ ఛోడ్ అంటూ   బిగ్గరగా నినాదాలు చేశారు. అయోధ్య విరాళాల అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.   Ayodhya donation row, Pappu Yadav protest, Rahul Gandhi, Parliament Makar Dwar, Ram Mandir hundi theft, Opposition protest
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చబోతున్న, ఏపీ అభివృద్ధి విషయంలో గేమ్ చేంజర్ కాబోతున్నభోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం (ఆగస్టు 1)న ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు.  ఈ నేపథ్యంలో  భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ  ఎయిర్‌పోర్ట్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఇది చంద్రబాబు నాయుడి దార్శనికతాఅసలీ క్రెడిట్ వార్ ఏమిటి?  వంటి అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు.   హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయాన్ని డిజైన్ చేస్తున్న సమయంలోనే, ఉత్తరాంధ్ర భవిష్యత్తు కోసం భోగాపురంలో ఓ భారీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఉండాలని చంద్రబాబు భావించి ఆ మేరకు ప్రతిపాదనలు కూడా ఇచ్చారని అడుసుమిల్లి చెప్పారు.  నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే విశాఖను గ్లోబల్ ఐటీ, ఇండస్ట్రియల్ హబ్‌గా మార్చాలనే ఆలోచనతో ఈ భోగాపురం ప్రాజెక్టుకు చంద్రబాబు బీజం వేశారనీ, అయితే..  కాలక్రమంలో ప్రభుత్వాలు మారాయి, ప్రాజెక్టు ప్రతిపాదనలు మడతపడ్డాయన్నారు.  2019 ఎన్నికల ప్రచారంలో  జగన్.. ఉన్న విశాఖ ఎయిర్‌పోర్ట్‌లోనే ఈగలు తోలుకుంటున్నారు, అక్కడకి వెళ్లేవాళ్లే లేరు, ఇక భోగాపురంలో ఎయిర్‌పోర్ట్ దేనికి?  అంటూ చేసిన విమర్శలను అడుసుమిల్లి అజ్ణానం అంటూ కొట్టి పారేశారు.   గతంలో ఈ ప్రాజెక్ట్ కోసం ప్రతిపాదించిన భూ సేకరణపై ఎన్నో అనుమానాలు, వివాదాలు రేకెత్తించారు. కానీ చరిత్రను పరిశీలిస్తే ఒక నిజం స్పష్టంగా కనిపిస్తుందన్న ఆయన..  నాడు సైబర్ టవర్స్ కట్టినప్పుడు, శిల్పారామం కట్టినప్పుడు కూడా అందరూ ఇలాగే ఎగతాళి చేశారు. అక్కడెవడు ఉంటాడు? అంత దూరం ఎవడు వెళ్తాడు? అని ప్రశ్నించారు. కానీ ఈ రోజు హైదరాబాద్ గ్రోత్ ఇంజిన్‌గా మారిన మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాలను చూస్తే... చంద్రబాబు విజన్ ఏమిటో అర్ధమౌతుందన్నారు.   ముందుచూపుతో వ్యవహరించినవారు ఎప్పుడూ నష్టపోరన్న ఆయన..  శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ఎలాగైతే తెలంగాణ అభివృద్ధికి ప్రధాన చోదక శక్తిగా మారిందో, భోగాపురం ఎయిర్‌పోర్ట్ కూడా ఆంధ్రప్రదేశ్‌కు, ముఖ్యంగా ఉత్తరాంధ్రకు అతిపెద్ద గ్రోత్ ఇంజిన్‌గా మారబోతోంది. అందులో ఇసుమంతైనా సందేహం అవసరం లేదని అడుసుమిల్లి అన్నారు.  వైజాగ్  నుంచి  40 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నప్పటికీ, ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే గ్లోబల్ ఇన్వెస్టర్లు,  పారిశ్రామిక దిగ్గజాలు, ఐటీ కంపెనీలు ఉత్తరాంధ్రకు పోటెత్తడం ఖాయమన్నారు.  జగన్ హయాంలో  భూసేకరణను తగ్గించడం, ప్రాజెక్టు పనులను రెండేళ్లపాటు పక్కన పెట్టడాన్నీ గుర్తు చేసిన అడుసుమిల్లి,   2024లో జగన్ సర్కార్ పతనమై చంద్రబాబు నేతృత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత  భోగాపురం పనులు వేగం పుంజుకున్నాయనీ, ఇప్పుడు ప్రారంభోత్సవానికి సిద్ధమైందనీ చెప్పారు.  అయితే తగుదునమ్మా అంటూ ఇప్పుడు జగన్ భోగాపురం క్రెడిట్ కోసం ప్రాకులాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. అయినా  ప్రారంభంలో వ్యతిరేకించడం, తర్వాత విమర్శించడం, చివరకు నిజం తెలుసుకుని  క్రెడిట్ చోరీకి పాకులాడటం జగన్ రాజకీయం అని ఎద్దేవా చేశారు.   ఉత్తరాంధ్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే ఈ బృహత్తర ప్రాజెక్ట్ ప్రారంభం కావడం యావత్ రాష్ట్రానికి గర్వకారణం. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్ర గ్లోబల్ మ్యాప్‌లోకి ఎక్కబోతోంది. ఇది నిస్సందేహంగా చంద్రబాబు విజన్ తో రూపుదిద్దుకుని సాకారమైన ప్రాజక్ట్ అని అడుసుమిల్లి ముక్తాయించారు.  Bhogapuram Airport Launch,  Chandrababu Vision, Jagan Credit Chori Attempts, Uttarandhra Development,   PM Modi Bhogapuram, Telogu One
మాజీ మంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజును జైలులో పరామర్శించేందుకు   వైసీపీ అధినేత   జగన్  శ్రీకాకుళం పర్యటన సందర్భంగా ఆయన చేసినన వ్యాఖ్యలు   కొత్త వివాదానికి తెరలేపాయి. సీదిరి అప్పలరాజును జైలులో పెట్టడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుట్ర చేశారని, అప్పలరాజు అంటే చంద్రబాబుకు అసలు పడదని, కక్షపూరితంగానే ఆయన కుటుంబాన్ని వేధిస్తున్నారంటూ జగన్ గుప్పించిన విమర్శలు పరిశీలకులనే కాదు సామాన్య జనాన్ని సైతం విస్మయపరుస్తున్నాయి. ఎందుకంటే.. జగన్ చెబుతున్నట్లుగా ఈ కేసులో  రాజకీయ ప్రమేయం ఇసుమంతైనా కనిపించడం లేదు. సిదిరి అప్పలరాజు కుమారుడు బైక్ నిర్లక్ష్యంగా నడిపి ఒకరి మృతికి కారణమయ్యారన్న కేసు దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల మేరకు  ఇందులో ఎలాంటి రాజకీయ కుట్రలు లేవు.   సీదిరి అప్పలరాజు చేసిన  అతే..  ఆయనను చట్టపరంగా ఇబ్బందుల్లోకి నెట్టింది.  నిర్లక్ష్యంగా బైక్ నడిపి  ఒక అమాయక వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటనలో..  నిజాన్ని దాచిపెట్టి ప్రభుత్వంపై ఎదురుదాడి చేయడమేంటన్న చర్చ ఇప్పుడు జనంలో విస్తృతంగా జరుగుతోంది. కేసు ఏమిటంటే..  శ్రీకాకుళం జిల్లా పరిధిలో బుల్లెట్ బైక్‌తో ప్రమాదం జరిగి ఒక సామాన్య గొర్రెల కాపరి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఆ సమయంలో బైక్ నడుపుతోంది సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ కాగా, తన కుమారుడిని ఈ కేసు నుండి తప్పించడానికి మాజీ మంత్రి తీవ్రంగా ప్రయత్నించారు.  తన కొడుకు ఆరవ్‌ను బయట పడేసే క్రమంలో, ఆరవ్ స్నేహితుడైన  వేరే యువకుడిని ఈ కేసు ఒప్పుకునేలా ఒత్తిడి తెచ్చారు.  బైకు ప్రమాదం సదరు యువకుడే చేశాడని పోలీసులను తప్పుదోవ పట్టించి కేసు కూడా నమోదు చేయించారు.  అప్పట్లో సీదిరి మాటలను, ఆయన చెప్పిన కథనాన్ని నమ్మిన స్థానిక పోలీసులు, ఆరవ్ స్నేహితుడిపై  కేసు నమోదు చేశారు. అయితే ఈ  వ్యవహారం మీడియాలో ప్రముఖంగా రావడంతో అసలు విషయం బయటపడింది. అంతేకాకుండా, ప్రమాదానికి గురైన గొర్రెల కాపరికి సీదిరి అప్పలరాజు రోడ్డుపై సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేశారని ప్రచారం చేసుకున్నప్పటికీ..  అది కూడా వాస్తవం కాదని, దారిన పోతున్న ఒక సాధారణ వ్యక్తి మాత్రమే ఆ సహాయం చేశారని పోలీసుల విచారణలో తేలింది. మరోవైపు సీదిరి అప్పలరాజు   అబద్ధపు కథనాన్ని నమ్మి, అక్రమంగా కేసు నమోదు చేసినందుకు గాను శాఖాపరమైన విచారణ చేపట్టిన ప్రభుత్వం, సంబంధిత సీఐ, ఎస్సైతో సహా పలువురు పోలీసులపై   చర్యలు తీసుకుంది. మొత్తం నలుగురు పోలీసు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేయడమే కాకుండా వారిపై సమగ్ర విచారణకు ఆదేశించింది. ఈ తప్పుడు కేసు కారణంగా నలుగురు పోలీసు అధికారుల ఉద్యోగాలు ప్రమాదంలో పడగా, మరోవైపు ఒక సామాన్య గొర్రెల కాపరి కుటుంబం తమ ఇంటి పెద్దను కోల్పోయి రోడ్డున పడింది. సీదిరి కుమారుడు చేసిన తప్పుకు ప్రాణాలు కోల్పోయిన ఆ నిరుపేద కుటుంబానికి న్యాయం చేయాల్సింది పోయి, నిందితుడిని తప్పించేందుకు కుట్రపూరితంగా వేరే వారిపై కేసు పెట్టించడంతో సిదిరి అప్పలరాజు కటకటాల పాలయ్యారు. ఈ మొత్తం వ్యవహారంలో ఒక రాజకీయపార్టీ అధినేతగా జగన్ చేయాల్సిందేంటంటే.. బాధితుడి అంటే రోడ్డు ప్రమాదంలో మరణించిన గొర్రెల కాపరి కుటుంబాన్ని పరామర్శించాలి. అది వదిలేసి.. నిందితులకు పరామర్శలేంటన్న విమర్శలు వ్యక్తమౌతున్నాయి.   Jagan Mohan Reddy, Seediri Appalaraju, Palasa accident case, Chandrababu Naidu, AP Political News, AP Police suspension
ALSO ON TELUGUONE N E W S
After the release of Srinivasa Mangapuram on July 30, debutant Jai Krishna Ghattamaneni has been receiving encouraging feedback from audiences for his performance, screen presence, dialogue delivery, dancing, and action sequences. To celebrate the positive response, senior producer Adi Seshagiri Rao organized a special press meet, where several prominent producers, including Mythri Naveen, Anil Sunkara, K.S. Ramarao, and Tammareddy Bharadwaja, came together to congratulate the young actor. Speaking at the event, Mythri Naveen praised Jai Krishna's confident debut, particularly highlighting how he held his own while sharing screen space with veteran actor Mohan Babu. He also revealed that Mythri Movie Makers intends to collaborate with Jai Krishna in the future, expressing confidence in the youngster's potential. An emotional Adi Seshagiri Rao thanked audiences for warmly welcoming the third generation of the Ghattamaneni family to Telugu cinema. He said it was heartening to see fans extend the same affection they have shown to Superstar Krishna and Mahesh Babu to Jai Krishna. He expressed hope that the young actor would successfully carry forward the Ghattamaneni legacy for the next 25 to 30 years and also urged audiences to support Telugu cinema by watching films in theatres. Jai Krishna, meanwhile, expressed gratitude to everyone who appreciated his debut performance. He revealed that Mahesh Babu personally complimented his acting after watching the film, calling it a memorable moment for him. The actor said he would continue to learn from audience feedback and improve with every film. Thanking Ghattamaneni fans for their unwavering support, Jai Krishna appealed to moviegoers to watch Srinivasa Mangapuram in theatres, stating that those who have seen the film have appreciated its entertainment value. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
The excitement surrounding Ramayana continues to reach unprecedented heights as the film's official trailer has crossed a staggering 350 million views across official platforms within just 48 hours of its release. The phenomenal response from audiences in India and across the globe has cemented the film's position as one of the most eagerly awaited cinematic events of the year. Ever since its launch, the trailer has dominated social media, with viewers praising its breathtaking scale, stunning visual effects, and emotionally charged presentation of the timeless epic. The film's tagline, "Our Truth. Our History.", has particularly resonated with audiences, who have appreciated the makers' respectful and grand cinematic interpretation of one of India's most cherished stories. The star cast has emerged as one of the biggest talking points. Ranbir Kapoor has won widespread acclaim for his calm and dignified portrayal of Lord Shri Ram, while Yash has impressed with his powerful and intimidating presence as Raavana. Sai Pallavi has been appreciated for bringing grace and emotional depth to Sita, and Rakul Preet Singh has generated curiosity with her striking appearance as Surpanakha. Apart from the performances, audiences have applauded the film's world-class VFX, lavish production design, and impactful background score, all of which contribute to its larger-than-life appeal. The record-breaking trailer response has further amplified anticipation for Ramayana Part 1, which is slated for a grand worldwide release during the Diwali festival, with expectations now soaring to an entirely new level. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
Following a sensational theatrical run and emerging as the biggest blockbuster of Akhil Akkineni's career, LENIN is now gearing up for its much-awaited digital premiere. The action-packed rural entertainer will begin streaming exclusively on Telugu ZEE5 from August 7, giving audiences across the world another opportunity to experience one of Telugu cinema's biggest successes of the year from the comfort of their homes. Directed by Murali Kishor Abburu, LENIN features Akhil Akkineni in a career-defining role alongside Bhagyashri Borse. The film also stars Sivaji, Sunil, Easwari Rao, Brahmaji, Getup Srinu, Ramki, Pramod Panju and several acclaimed actors in pivotal roles. Produced by Nagarjuna Akkineni and Suryadevara Naga Vamsi under the banners of Manam Enterprises and Sithara Entertainments, the film boasts music by Thaman S., cinematography by Leon Britto and editing by Navin Nooli. Set in the heartland of rural Andhra Pradesh, LENIN tells the story of a fearless young man whose personal journey soon evolves into a larger battle against injustice. What begins as an emotional love story gradually unfolds into an intense conflict rooted in family bonds, power struggles and the unwavering determination to protect one's people. Blending action, emotion, romance, humour and strong commercial moments, the film delivers a complete cinematic experience that appeals to audiences across age groups. The film struck an instant chord with moviegoers upon its theatrical release. Akhil Akkineni's commanding screen presence, Murali Kishor Abburu's rooted storytelling, Thaman S.'s powerful background score and the film's emotionally charged narrative received widespread appreciation. Packed with memorable elevations, gripping action episodes and heartfelt emotional moments, LENIN went on to become Akhil's highest-grossing film, firmly establishing itself as one of the standout Telugu blockbusters of the year. With an ever-growing library of blockbuster movies, acclaimed originals and beloved Telugu entertainment, Telugu ZEE5 continues to strengthen its position as one of the leading destinations for premium regional content. From family entertainers and action dramas to critically appreciated originals, the platform consistently brings diverse storytelling to audiences, ensuring that blockbuster cinema reaches viewers anytime, anywhere. The arrival of LENIN further enriches Telugu ZEE5's impressive content slate, offering subscribers yet another celebrated theatrical success on the platform. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
  ఘట్టమనేని జై కృష్ణ(Jai krishna)ప్రస్తుతం 'శ్రీనివాస మంగాపురం'(Srinivasa Mangapuram)తో సెల్యులాయిడ్ పై సందడి చేస్తున్నాడు. మొదటి సినిమా అయినా కూడా ఎక్కడా ఎలాంటి బెరుకు లేకుండా నటించి ఘట్టమనేని అనే బ్రాండ్ కి తెలుగు చిత్ర సీమ సాహో అనాల్సిందే అని చాటి చెప్పాడు. అభిమానులు, ప్రేక్షకులతో పాటు రివ్యూస్ కూడా పాజిటివ్ గానే వస్తున్నాయి. దీంతో  జై కృష్ణ తన ఆనందం వ్యక్తం చేస్తూ రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేసాడు.  జై కృష్ణ మాట్లాడుతు నాకు మంచి వెల్కమ్ ఇచ్చిన తెలుగు ఆడియెన్స్ కి, మొదటి నుంచీ తమకి అండగా ఉన్న ఘట్టమనేని అభిమానులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సినిమా చూసినవారు నన్ను అభినందించడం ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ముఖ్యంగా  యాక్షన్, ఎమోషనల్ సీన్స్ లో పెర్ఫామెన్స్ ని అంతా మెచ్చుకుంటున్నారు అని చెప్పడంతో పాటు  ఈ వారాంతంలో మీకు ఫ్రీ టైం ఉంటే చూడాల్సిందిగా కోరాడు. Also read: సీతమ్మతల్లి సాయిపల్లవి పై ట్రోల్స్.. ఇది వాళ్ళ పనే  దీనితో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందించగా పి కిరణ్,  వైజయంతి మూవీస్ అధినేత అశ్వని దత్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఆర్ ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకుడు కాగా జై కృష్ణ సరసన మాజీ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు  రష తడాని జత కట్టింది.  jai krishna, srinivasa mangapuram, Rasha Thadani, Bollywood
  రామభక్తులు, సీతమ్మ భక్తులు, హనుమాన్ భక్తులు ఎంతో రీగర్ గా వెయిట్ చేస్తున్న రామాయణ(Ramayana)రిలీజ్ కి శరవేగంగా ముస్తాబు అవుతుంది. భారతీయ సినీ చరిత్రలోనే ఎన్నడూ లేనంత అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ అంచనాల నడుమ  4,000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న'రామాయణం' రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. నితీష్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ దృశ్య కావ్యం ఫస్ట్ పార్ట్ ట్రైలర్‌ని రెండు రోజుల క్రితం తెల్లవారుజామున 4:15 గంటల పవిత్రమైన బ్రహ్మముహూర్తాన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. భారతీయ సంస్కృతి, పురాణ కావ్యమైన రామాయణాన్ని హాలీవుడ్ ప్రమాణాలకు తగ్గట్టుగా అంతర్జాతీయ వేదికలపైకి తీసుకెళ్లేందుకు నిర్మించిన ఈ ట్రైలర్ యూట్యూబ్‌తో పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలోట్రెండ్ అవుతోంది. అయితే, ట్రైలర్ బయటకి  వచ్చిన కొన్ని గంటల్లోనే ఒకవైపు విశేష ప్రశంసలు వెల్లువెత్తుతుండగా, మరోవైపు నెట్టింట రచ్చ, విమర్శలు, నెగెటివ్ ట్రోల్స్ దావానలంలా వ్యాపించాయి. ముఖ్యంగా దక్షిణ భారత లేడీ పవర్ హౌస్ సాయి పల్లవి, బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ క్యారెక్టర్స్ తీరుపై కొన్ని వర్గాల నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ఆసక్తికరంగా మారింది.  ముఖ్యంగా సాయి పల్లవిని సీతాదేవిగా చూసిన కొంతమంది ఆమె లుక్స్, కాస్ట్యూమ్స్, మేకప్ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్,నార్త్ ఇండియాకి  చెందిన కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో 'రామాయణం వంటి దివ్యమైన కథలో సీతమ్మ తల్లికి ఉండాల్సిన ఆభరణాల భవ్యత, మెరుపు లోపించాయి. సాయి పల్లవి చాలా సాధారణంగా కనిపిస్తోంది. గతంలో నార్త్ మీడియా ప్రతిపాదించిన బాలీవుడ్ గ్లామర్ తారల రేంజ్ వైభవం ఇందులో కనిపించడం లేదు అని సాయి పల్లవి ఆర్మీ మరియు కొన్ని చారిత్రక కోణాలపై చేసిన పాత వ్యాఖ్యల వీడియోలని  మళ్ళీ తవ్వి తీస్తూ బాలీవుడ్‌లో ట్రోలింగ్ మొదలుపెట్టారు. Also read: పవన్ కళ్యాణ్ బాటలో అన్నా కొణిదెల..  6,30,000 రూపాయలతో  అయితే ఈ అసత్య ప్రచారాలకు మరియు హేట్ ట్రోల్స్‌కు సౌత్ సినీ ప్రియులతో పాటు లక్షలాది మంది రామాయణ అభిమానులు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. సీతాదేవి అంటే కేవలం భారీ మేకప్, ఆభరణాలు తొడిగిన గ్లామర్ బొమ్మ కాదని, పవిత్రత, అమాయకత్వం, సాత్వికత, భక్తి మరియు అంతర్గత సాధికారతకు ప్రతీక. సాయి పల్లవి ముఖంలో కనిపించే ఆత్మీయత, పవిత్రమైన హావభావాలు సీతాదేవిగా  నూటికి నూరు శాతం సరిగ్గా సరిపోయాయని ఫ్యాన్స్ ఆమెకి మద్దతుగా నిలుస్తున్నారు. రామాయణ వరల్డ్ వైడ్ గా దీవాలి కానుకగా నవంబర్ 8 న విడుదల కానుంది.  
తమిళ స్టార్ హీరో కార్తీ, డైరెక్టర్ పి.ఎస్.మిత్రన్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ స్పై థ్రిల్లర్ 'సర్దార్' కు సీక్వెల్ గా వస్తున్న 'సర్దార్ 2' టీజర్ విడుదలై సోషల్ మీడియాలో అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. విలన్ పాత్ర పోషించిన ఎస్.జె.సూర్య అడిగే  పొడుపుకథతో 'సర్దార్ 2' టీజర్ ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. తండ్రీకొడుకులైన ఇద్దరు గూఢచారుల చుట్టూ ఈ స్పై థ్రిల్లర్ తిరుగుతుంది. అందులో తండ్రి పాత్ర నాటుగా కనిపించినప్పటికీ, అపారమైన శారీరక బలం, మేధాశక్తి ఉన్న జీనియస్ గూఢచారిగా కథలో కనిపించనున్నాడు. ఇక కొడుకు విషయానికి వస్తే, మోడర్న్ లుక్ లో కూల్ గా కనిపించినప్పటికీ, అత్యంత ప్రమాదకరమైన మిషన్లను సైతం సునాయాసంగా పూర్తి చేయగల పవర్ ఫుల్ టఫ్ గై గా కనిపిస్తున్నారు. తండ్రీకొడుకులైన ఈ ఇద్దరు స్పైస్ చుట్టూ కథ నడుస్తున్నప్పటికీ, వారి అసలు టార్గెట్ తానేనంటూ విలన్ ప్రవేశించడంతో కథ ఊహించని మలుపు తిరుగుతుంది. టీజర్ లో ఎస్.జె.సూర్య చెప్పే డైలాగ్స్, డిఫరెంట్ మేనరిజమ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా సినిమాల్లో హీరోలు మంచివారు, విలన్లు చెడ్డవారుగా ఉంటారు. కానీ ఈ సినిమాలో సాంకేతికంగా నేనే మంచివాడిని, ఆ ఇద్దరు గూఢచారులే చెడ్డవారంటూ ఎస్.జె.సూర్య చెప్పే వినూత్న విలనిజం విశ్లేషణ కథపై తీవ్రమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. చివరికి ఈ హై-వోల్టేజ్ పోరులో గెలిచేది మంచి విలనా లేక చెడ్డ హీరోలా అనేది ఈ చిత్రంలో అసలు ప్రశ్నగా నిలవనుంది. కార్తీతో పాటు మాలవికా మోహనన్, ఆషికా రంగనాథ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ బిగ్ బడ్జెట్ స్పై థ్రిల్లర్ ను ఎస్.లక్ష్మణ్ కుమార్, ఇషాన్ సక్సేనా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా తెలుగులో విడుదల కానుంది. హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు, ఉత్కంఠభరితమైన ఛేజింగ్ సీన్లతో నిండిన ఈ సర్దార్ 2 మూవీ సెప్టెంబర్ 10న విడుదల కానుంది.     Sardar 2 Teaser, Karthi, SJ Suryah  
  ఈ రోజుపవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)సతీమణి అన్నాకొణిదెల(Anna Konidela)పుట్టినరోజు. ఈ సందర్భాన్నిపురస్కరించుకుని విశాఖపట్నంలోని ప్రముఖ ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్ లో ఉన్న రెండు అరుదైన మూగజీవులని  ఏడాది కాలం పాటు దత్తత తీసుకుని, వన్యప్రాణి సంరక్షణ పట్ల తనకున్న అమితమైన ప్రేమ చాటుకున్నారు. పండగలు, పుట్టినరోజులు అంటే కేవలం ఆడంబరాలు, కేక్ కటింగ్ వేడుకలకే పరిమితం కాకుండా, ప్రకృతికి, జీవ వైవిధ్యానికి తోడ్పడేలా అత్యంత ఆదర్శవంతమైన రీతిలో ఆమె తన ప్రత్యేక దినాన్ని జరుపుకోవడం విశేషం. విశాఖ ఇందిరా గాంధీ జూ పార్క్ లోని జంతువుల సంరక్షణ పథకం కింద అన్నా కొణిదెల ఒక ఆసియా ఏనుగును, ఒక రాయల్ బెంగాల్ టైగర్ ను దత్తత తీసుకున్నారు. భారత జాతీయ వారసత్వ జంతువుగా గుర్తింపు పొందిన ఆసియా ఏనుగు ఆహారం, వైద్యం, పోషణ మరియు వసతి సౌకర్యాల సంరక్షణ నిమిత్తం ఏడాదికి రూ. 4,30,000 సమర్పించారు. అదేవిధంగా భారత జాతీయ జంతువైన, గంభీరతకు ప్రతీకగా నిలిచే రాయల్ బెంగాల్ టైగర్ సంరక్షణ కోసం 2,00,000 విరాళంగా అందించారు. ఇలా రెండు వన్యప్రాణుల దత్తత కోసం మొత్తం  6,30,000 భారీ మొత్తాన్ని చెల్లించారు. ఈ దత్తత ద్వారా సమకూరిన  6.30 లక్షల నిధులను జూలోని ఈ రెండు జీవుల దైనందిన ఆహార అవసరాలు, సంపూర్ణ పోషకాహారం, నిరంతర పశువైద్య సేవలు, ఎన్విరాన్మెంటల్ ఎన్రిచ్మెంట్ మరియు ఇతర సంరక్షణ చర్యల కోసం వినియోగించనున్నట్లు విశాఖ జూ పార్క్ క్యూరేటర్ జి. మంగమ్మ వెల్లడించారు. సమాజంలో ప్రతిష్టాత్మక హోదాలో ఉన్న వ్యక్తులు ఇలా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వన్యప్రాణి సంరక్షణలో భాగస్వాములు కావడం ఎంతో అభినందనీయమని క్యూరేటర్ పేర్కొన్నారు. అన్నా కొణిదెల తీసుకున్న ఈ సత్సంకల్పం మూగజీవుల సంక్షేమానికి తోడ్పడటమే కాకుండా, ప్రజల్లో అటవీ జీవుల పట్ల అవగాహన పెంచడానికి ఎంతగానో దోహదపడుతుందని అధికారులు హర్షం వ్యక్తం చేశారు. అటవీ మరియు పర్యావరణ పరిరక్షణ శాఖను పర్యవేక్షిస్తున్న పవన్ కళ్యాణ్ కుటుంబం నుండి ఇలాంటి పర్యావరణ అనుకూలమైన నిర్ణయం రావడం పట్ల ప్రకృతి ప్రేమికులు, జనసైనికులు మరియు సామాన్య ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాల వంటి శుభకార్యాల సందర్భంగా విశాఖ జూలోని జంతు దత్తత కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చని అధికారులు గుర్తుచేస్తున్నారు. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80జి(5) కింద ఈ దత్తత విరాళాలకు పన్ను మినహాయింపు కూడా లభిస్తుండటం గమనార్హం. Also read: Toxic: మరోసారి టాక్సిక్ వైరల్.. కియారా అద్వానీ భర్త సిద్ధార్థ్ మల్హోత్రా పోస్ట్  అన్నా కొణిదెల చూపిన ఈ ఉదారత సోషల్ మీడియాలో సైతం విస్తృతంగా ప్రశంసలు అందుకుంటోంది. జంతువులను దత్తత తీసుకోవడం ద్వారా మానవత్వంతో పాటు ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవచ్చని ఆమె నిరూపించారు. 625 ఎకరాల విస్తీర్ణంలో 1000కి పైగా జంతువులకు నిలయంగా ఉన్న విశాఖ ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్ అభివృద్ధికి, జీవుల శ్రేయస్సుకు ఇటువంటి విరాళాలు ఎంతో తోడ్పడతాయి. పవన్ కళ్యాణ్ సతీమణి తీసుకున్న ఈ నిర్ణయం స్పూర్తితో మరింత మంది యువత, ప్రముఖులు ముందుకు వచ్చి మూగజీవులను ఆదుకుంటారని ఆశిద్దాం. పవన్ కళ్యాణ్ ఇప్పటికే కొన్ని ఏనుగులని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. Anna konidela, Pawan Kalyan
  టాక్సిక్(Toxic)కి సంబంధించి రొమాన్స్ సన్నివేశాలపై కొంత మంది వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో సైతం రొమాన్స్ సన్నివేశాలపై  ట్రోల్స్  మొదలయ్యాయి.  మేకర్స్ మాత్రం కంటెంట్ కి తగ్గ లింక్ అనే మాటలు చెప్తున్నారు. ఏది ఏమైనా మాత్రం రొమాన్స్ మాటర్ అనేది టాక్సిక్ కి ట్యాగ్ లైన్ గా మారింది. రీసెంట్ గా టాక్సిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిన్న జూలై 31న కియారా అద్వానీ పుట్టినరోజును పురస్కరించుకుని ఆమె భర్త, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా ఇన్స్టాగ్రామ్‌లో ఒక ఎమోషనల్, రొమాంటిక్ ఫొటో షేర్ చేశాడు. 'నా ప్రతి రోజును మరింత తీపిగా మార్చే వ్యక్తికి జన్మదిన శుభాకాంక్షలు.. నా ఐస్‌క్రీమ్‌ను దొంగిలించినప్పటికీ" అంటూ చాలా ముద్దుగా క్యాప్షన్ రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌కు లక్షలాది మంది అభిమానులతో పాటు సినీ ప్రముఖులు లైక్‌లు కొడుతూ కియారాకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే, ఈ హ్యాపీ మూమెంట్స్ మధ్య కొందరు నెటిజన్లు అనవసర వివాదానికి తెరలేపారు.  'టాక్సిక్' (Toxic)లో కియారా అద్వానీ 'నాదియా' అనే పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాలోని 'తబాహి' (Tabaahi) పాట విడుదలై యూట్యూబ్‌లో కాంబినేషన్ కుమ్మేసింది. ఆ సినిమాలో ఆమె నటన, కొన్ని సీన్స్, అలాగే బోల్డ్ లుక్‌ గురించి కొందరు నెటిజెన్స్ ద్వంద్వార్థాలతో కూడిన అనుచిత కామెంట్లు చేయడం ప్రారంభించారు. Also read: ఇండియన్ సినీ హిస్టరీని షేక్ చేసిన అత్యంత ఖరీదైన సినిమాలు ఇవే  ఈ దాడిపై కియారా అభిమానులు, సాధారణ నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. ఒక నటిగా సినిమా పాత్ర డిమాండ్ మేరకు ప్రొఫెషనల్‌గా నటించడం వేరు, వ్యక్తిగత జీవితం వేరు అనే కనీస స్పృహ లేకుండా ప్రవర్తించడంపై ట్రోలర్లకు గట్టిగా బుద్ధి చెప్పారు. "సినిమాలోని   క్యారెక్టర్స్ కి ,పర్సనల్ లైఫ్‌కు ముడిపెట్టి ఇలా నీచంగా కామెంట్స్ చేయడం నెటిజన్ల సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం. ఒక నటుడు లేదా నటి ప్రొఫెషన్‌లో ఎలాంటి పాత్రనైనా పోషించవచ్చు. దాన్ని వారి సొంత జీవితంతో ముడిపెట్టి దారుణంగా వ్యాఖ్యానించడం అత్యంత దారుణమని కామెంట్ సెక్షన్‌లో అభిమానులు ట్రోలర్లని  నిలదీస్తున్నారు. ఇక టాక్సిక్  ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.  Sidharth malhotra, Kiara Advani, Toxic, yash
అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, నరేష్, అఖిల్ రాజ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న 'క్రేజీ కళ్యాణం' మూవీ టీజర్ తాజాగా విడుదలైంది. భద్రప్ప గాజుల దర్శకత్వంలో యారో సినిమాస్ నిర్మించిన ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది. టీజర్ తండ్రి కూతుళ్ల మధ్య జరిగే సంభాషణతో స్టార్ట్ అవుతుంది. "నా చిన్న బిడ్డ ఇంగ్లీష్ లో కూడా బాగా మాట్లాడుతాది.. ఇంగ్లీష్ లో మాట్లాడు బిడ్డ" అని నరేష్ అనగానే.. అనుపమ అమాయకంగా చెప్పే "ఓ మై గాడ్" డైలాగ్ తోనే నవ్వులు మొదలవుతాయి. అక్కడి నుంచి అసలు కథ మలుపు తిరుగుతుంది. పెళ్లి సంబంధాల గోల, అక్కా చెల్లెళ్ల మధ్య పోటీ, కుటుంబాల మధ్య చిచ్చు... ఇలా ప్రతీ సీన్ నవ్వు పూయించేలా డిజైన్ చేశారు. "నీ కొడుకే మొండోడు అనుకుంటున్నాడేమో.. నాలో కూడా ఆయన రక్తమే ప్రవహిస్తుంది" అంటూ అనుపమ చెప్పే డైలాగ్ అదిరిపోయింది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్ అండ్ ఫ్రెష్‌గా కనిపిస్తోంది. ఇప్పటి వరకు గ్లామరస్, ఎమోషనల్ రోల్స్ లో చూసిన అనుపమను, ఇందులో పక్కా పల్లెటూరి చలాకీ అమ్మాయిగా, అంతే మొండి పట్టుదల ఉన్న క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేశారు.  ఇక తరుణ్ భాస్కర్ స్క్రీన్ ప్రెజెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దర్శకుడిగా ప్రతిభ చూపించిన తరుణ్.. నటుడిగా కూడా తనదైన టైమింగ్, ఈజ్ తో నవ్విస్తున్నారు. ఇందులో తగిన మత్తులో ఉంటూ కొత్తగా కనిపించారు. ముఖ్యంగా "బతుకనివ్వరు.. చావనివ్వరు", "దీన్ని ఎవడు చేసుకుంటాడో గానీ వాడు చచ్చినట్టే!" అంటూ తరుణ్ చెప్పిన డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయి. "దేవుడా.. మా పెద్దల్లుడి కంటే ఇంకా దరిద్రపోడు మా అన్నకు అల్లుడుగా రావాలి" అని నరేష్ అనుకునే సన్నివేశాలు పల్లెటూరి మధ్య తరగతి ఇంట్లో జరిగే అల్లరిని, మనస్పర్థలను చాలా హ్యూమరస్‌గా ప్రతిబింబిస్తున్నాయి. మొత్తానికి 'క్రేజీ కళ్యాణం' టీజర్ చూస్తుంటే థియేటర్లలో నవ్వుల పంట పండించడం ఖాయంగా కనిపిస్తోంది. ఫ్యామిలీ డ్రామా, పెళ్లి సందడి, కన్ఫ్యూజన్ కామెడీ ఇష్టపడే ప్రేక్షకులకు ఇది పక్కా విందు కానుంది.    Crazy Kalyanam Teaser, Anupama Parameswaran, Tharun Bhascker, Naresh  
  సినిమాని అల్లాటప్పగా తీసుకోవడానికి వీలు లేదు దేశాన్ని ఏలతారని పోతులూరి వీర బ్రహ్మం గారు చెప్పిట్టుగానే జరుగుతుంది. అందుకు తగ్గట్టే మేకర్స్ కూడా సినిమాని తమ చంటి బిడ్డలా భావించి అత్యంత భారీ వ్యయంతో, ఎన్నో హంగులని సమకూర్చి నిర్మిస్తున్నారు. దీంతో సినిమా ఖరీదైన సినీ దినుసులతో ముస్తాబవుతు అభిమానులు, మూవీ లవర్స్ కి ఎనలేని ఆనందాన్ని ఇస్తుంది.   భారతీయ చలనచిత్ర పరిశ్రమ గత కొన్నేళ్లుగా ప్రపంచ స్థాయి సాంకేతిక ప్రమాణాలను అందుకోవడమే కాకుండా, బడ్జెట్ విషయంలోనూ హాలీవుడ్‌కి సవాల్ విసురుతోంది. ఒకప్పుడు పది, ఇరవై కోట్లతో ముగిసే సినిమా నిర్మాణాలు, నేడు వందల నుంచి వేల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతూ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా మన నిర్మాతలు, దర్శకులు ఇండియన్ సినిమా స్థాయిని గ్లోబల్ విపణిలో సగర్వంగా చాటుతున్నారు. భారీ విజువల్ ఎఫెక్ట్స్, గ్లోబల్ ప్రొడక్షన్ వాల్యూస్, మరియు టాప్ స్టార్‌కాస్ట్‌తో రూపొందుతున్న అత్యంత ఖరీదైన చిత్రాల జాబితా ఇప్పుడు సినీ అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ అసాధారణ బడ్జెట్ చిత్రాల జాబితాలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ మొదటి స్థానంలో నిలిచింది 'రామాయణ' ప్రాజెక్ట్. ప్రసిద్ధ నిర్మాత నమిత్ మల్హోత్రా అత్యంత ప్రతిష్టాత్మకంగా, నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిస్తున్న ఈ పౌరాణిక దృశ్యకావ్యం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు భాగాల అంచనా బడ్జెట్ ఏకంగా  4,000 కోట్లు  భారతీయ సినిమా చరిత్రలోనే కాకుండా, ఆసియా ఖండంలోనే అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా ఇది సరికొత్త రికార్డులని నెలకొల్పబోతోంది. ఇక ఈ జాబితాలో రెండో స్థానంలో నిలుస్తోంది దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా 'వారణాసి'. ఈ సినిమా కోసం మేకర్స్ సుమారు 1,200 కోట్ల నుంచి 1,400 కోట్ల బడ్జెట్‌ని కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి. వీటి తర్వాతి స్థానంలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'కల్కి 2898 ఏడీ' స్థానం దక్కించుకుంది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై భారీ నిర్మాణ విలువలతో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ వండర్ బడ్జెట్ సుమారు రూ. 600 కోట్లు. అద్భుతమైన ఫ్యూచరిస్టిక్ వరల్డ్‌ను కళ్లముందు ఉంచిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను సాధించి సరికొత్త సంచలనం సృష్టించింది. ఆస్కార్ సాధించిన  'ఆర్ఆర్ఆర్' కూడా అత్యంత ఖరీదైన సినిమాల జాబితాలో ప్రముఖంగా నిలిచింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మాన్ ఆఫ్ మాసెస్  ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ఈ విజువల్ వండర్ కోసం నిర్మాతలు సుమారు  550 కోట్లు వెచ్చించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం సాధించిన ఘనవిజయం, అందుకున్న ఆస్కార్ అవార్డు ఇండియన్ సినిమా ఖ్యాతిని నలుదిశలా చాటిచెప్పాయి. ఈ విజువల్ స్పెక్టాకిల్స్ సరసన ప్రభాస్ నటించిన మరో భారీ పౌరాణిక చిత్రం 'ఆదిపురుష్' నిలిచింది. రామాయణ కథాంశంతో రూపుదిద్దుకోగా సుమారు 700 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. అదేవిధంగా ఇండియన్ రజనీకాంత్, శంకర్ ల  సంచలనాత్మక కాంబినేషన్‌లో వచ్చిన గ్రాండ్ విజువల్ ఎక్స్‌పీరియన్స్ రోబో '2.0' సినిమా నిర్మాణం కోసం 500 కోట్ల వరకు వ్యయం అయింది. ఇక అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చి ప్రపంచవ్యాప్తంగా రికార్డు వసూళ్లు సృష్టించిన  'పుష్ప 2: ది రూల్',బాలీవుడ్ మూవీ 'కింగ్' చిత్రాల బడ్జెట్ సుమారు 400 కోట్ల నుంచి 450  కోట్ల వరకు ఉండగా, విజయ్ 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' సినిమా 380 కోట్ల నుంచి  400 కోట్ల భారీ నిర్మాణ వ్యయంతో రూపుదిద్దుకుంది. Also read: ఆ విషయంపై నాది ఓపెన్ మైండ్.. ఫ్యాన్స్ ఎలా అయినా తీసుకోవచ్చు వీటితో పాటు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా వచ్చిన బాలీవుడ్ ఫాంటసీ అడ్వెంచర్ 'బ్రహ్మాస్త్ర పార్ట్ వన్: శివ'  375 కోట్ల నుంచి  410 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైంది.  రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన భారీ పొలిటికల్ యాక్షన్ డ్రామా 'గేమ్ చేంజర్' సుమారు  350 కోట్ల నుంచి 425 కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. ఇలా వేల, వందల కోట్ల భారీ పెట్టుబడులతో అద్భుతమైన విజువల్ వండర్స్‌ని అందిస్తూ, భారతీయ చిత్రసీమ అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తు ఇక్కడ ఉంది సినిమా అని సగర్వంగా చాటి చెప్తూ ఉంది. Cinema, Varanasi, Ramayana
ఆచార్య చాణక్యుడు   గొప్ప రాజనీతిజ్ఞుడు,  వ్యక్తిత్వ విశ్లేషణా నిపుణులు,  ఆర్థిక శాస్త్ర నిపుణులు.  ఆయన వేల సంవత్సరాల కిందటే మనిషి జీవితంలో ఎన్నో విషయాలను ఎంతో స్పష్టంగా, వివరంగా చెప్పాడు.  చాణక్య నీతిలో ఆయన చెప్పిన విషయాలు నేటికీ ప్రజలు ఆచరించదగిన  విధంగా ఉన్నాయి.  మనిషి జీవితంలో ఆప్తులకు,  సన్నిహితులకు, స్నేహితులకు.. ఎన్నో విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటాడు.  వీటి కారణంగా జీవితంలో ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది.  ముఖ్యంగా ఎవరితోనూ షేర్ చేసుకోకూడని విషయాలు కొన్ని ఉంటాయి.  ఆ విషయాలను గోప్యంగా ఉంచడం వల్ల లైఫ్ బిందాస్ గా ఉంటుందట. నలుగురిలో గౌరవంగా, మర్యాదగా,  బిందాస్ గా ఉండాలంటే.. చాణక్యుడు చెప్పిన నాలుగు విషయాలు తప్పక పాటించాలి. అవేంటో తెలుసుకుంటే..  ఆర్థిక నష్టాలు.. వ్యాపారంలో లేదా ఉద్యోగంలో  పెద్ద ఆర్థిక నష్టం వాటిల్లితే  ఆ విషయాన్ని ఇతరులతో పంచుకోకూడదని ఆచార్య చాణక్యుడు తన సిద్ధాంతంలో చెబుతాడు.  ఆర్థిక పరిస్థితి బలహీనపడినప్పుడు చుట్టూ ఉన్నవారు మెల్లిగా దూరం జరుగుతారు,  పైగా గౌరవించడం కూడా మానేస్తారు. అందుకే ఆర్థికంగా నష్టపోతే ఎవరికీ చెప్పకూడదు. ఇంటి గొడవలు.. ఇంట్లో గొడవ జరిగినా లేదా కుటుంబ సభ్యులతో  అభిప్రాయ భేదం వచ్చినా, ఆ విషయాన్ని ఎవరితోనూ పంచుకోకూడదు. కుటుంబ తగాదాలను గోప్యంగా ఉంచుకోవాలి. కుటుంబ తగాదాలను ఇతరులతో పంచుకోవడం వల్ల, దాన్నే అదనుగా తీసుకుని సంబంధాలను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించేవారు చాలా మంది ఉంటారు. ఇది  జీవితంలో తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు. అవమానం.. సమాజంలో మిమ్మల్ని ఎవరైనా అవమానించినా లేదా మాటలతో ఎవరైనా మిమ్మల్ని దూషించినా, ఆ విషయాన్ని  ఎదుటి వ్యక్తితో ఎప్పటికీ పంచుకోకూడదు. ఒకవేళ  ఆ అవమానం గురించి ఎవరికైనా చెబితే, ఆ వ్యక్తి మిమ్మల్ని గౌరవించడం మానేసే అవకాశం ఉంది. పైగా వాళ్లు అన్నప్పుడు లేని నొప్పి నేను అనగానే ఎందుకొచ్చింది వంటి మాటలు కూడా అంటారు. అందుకే  జీవితంలో ఎదురైన అవమానాల గురించి ఎప్పుడూ ఎవరికీ చెప్పకూడదు.  ప్రణాళికలు..   ఆచార్య చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం  పనిలో విజయం సాధించాలనుకుంటే చేయబోయే పనుల ప్రణాళికలు ఎవరికీ చెప్పకూడదు.  ఎవరైనా ఒక పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు,  తరచుగా తమ ప్రణాళికను ఇతరులతో షేర్ చేసుకుంటారు. కానీ కొందరు ఇలా గోల్స్ పెట్టుకున్న వారిని ఎగతాళి చేస్తారు, మరికొందరు మాటల ద్వారా  ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి దానిని సాధించకుండా అడ్డుకుంటారు.                                 *రూపశ్రీ
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అంటూ ఉంటారు. కానీ ఆర్థిక అవసరం ఏర్పడినప్పుడు మానవ సంబందాలే ఆదుకుంటాయి.  ఆర్థిక ఇబ్బందులు ఏర్పడినప్పుడు చాలా వరకు స్నేహితులు,  బంధువులు, సన్నిహితులు,  ఆఫీసు కొలీగ్స్.. ఇలా చాలామందిని అప్పు అడుగుతూ ఉంటాం.  అలాగే వారు కూడా మనల్ని అడుగుతూ ఉంటారు. కానీ నేటికాలంలో డబ్బు తీసుకున్నంత సులువుగా దాన్ని తిరిగి ఇవ్వరు.  పైగా డబ్బు తీసుకుని.. ఇస్తాంలే ఎక్కడికి పోతాం.. అని దబాయించే వారు కూడా ఉంటారు. ఈ కారణంగానే కష్టపడి సంపాదించుకున్న డబ్బులను ఎవరికైనా అప్పు ఇవ్వాలంటే చాలా భయం వేస్తుంది.  కానీ ఎవరైనా అప్పు అడిగినప్పుడు.. లేదు అని చెప్పడం చిన్న పదమే అయినా.. అది తగిన కారణంగా కనిపించదు.  లేదని చెప్పినా కొందరు పదే పదే అప్పు కావాలని, ఎవరితో అయినా అప్పు ఇప్పించమని కూడా అడుగుతుంటారు.  అప్పు ఇవ్వడం అనే సమస్య నుండి తప్పించుకోవడం,  ఎదుటి వ్యక్తితో ఉన్న సంబంధం ఏదీ పాడు చేసుకోకుండా ఉండటం కత్తిమీద సాము లాంటిది.  ఎవరైనా అప్పు అడిగితే.. వారు బాధపడకుండా లేదని చెప్పడానికి కొన్ని మార్గాలు  ఉన్నాయి.  అవేంటో తెలుసుకుంటే.. వెంటనే సమాధానం ఇవ్వకూడదు.. ఎవరైనా అకస్మాత్తుగా డబ్బు అడిగినప్పుడు, ఆలోచించకుండా వెంటనే "అవును" లేదా "కాదు" అని చెప్పకుండా, కొంత సమయం తీసుకోవాలి. ఆ తరువాత ఎదుటివారితో మర్యాదగా "నాకు కొంచెం సమయం ఇవ్వండి. నేను ఈ నెలకు నా బడ్జెట్ , బ్యాంకు బ్యాలెన్స్ చూసుకోవాలి" అని చెప్పవచ్చు. ఇలా చెప్తే.. మీరే ఆర్థికంగా డబ్బుకు వెతుక్కుంటున్నారని అప్పు అడిగిన వారు అర్థం చేసుకుంటారు. ఇలా సమయం అడగడం వల్ల  ఆలోచించడానికి అవకాశం ఇస్తుంది, ఒకవేళ  తర్వాత లేదని చెప్పాల్సి  వచ్చినా..  ఎదుటి వారు అపార్థం చేసుకోరు. ఎందుకంటే అడిగిన వెంటనే లేదని చెప్తే.. అప్పు అడిగిన వారు అపార్థం చేసుకుంటారు. అప్పు సూత్రం.. ఎవరైనా అప్పు అడిగినప్పుడు వారికి లేదని చెప్పడం కంటే.. అప్పు సూత్రం పాటించడం మంచిది.  అప్పు సూత్రం ప్రకారం.. ఎవరికీ అప్పు ఇవ్వడం అనేది పెట్టుకోకూడదు.  ఎలాంటి పరిస్థితులలో అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం చేయకూడదు.  అప్పు అనే కారణం వల్ల సంబంధాలు నాశనం అవుతాయి.  అప్పు తీసుకున్నవారు కొన్నిసార్లు తిరిగి ఇవ్వలేకపోతే.. అప్పు ఇచ్చిన వారు చాలా బాధపడాల్సి వస్తుంది.  డబ్బు అనేది అంత సులువుగా లభించేది కాదు.  కాబట్టి అప్పు అనే కారణంతో సంబంధాలు పాడు చేసుకోను,  ఎవరికీ అప్పు ఇవ్వకూడదని నేను నిర్ణయం తీసుకున్నాను అని చెప్పాలి.  ఇలా చెప్తే ఎదుటి వారు సంబంధాలకు విలువ ఇచ్చేవారు అయితే.. అర్థం చేసుకుంటారు. బాధ్యతలు, ఖర్చులు వివరించడం.. ప్రతి ఒక్కరికీ బాధ్యతలు ఉంటాయి. ఎవరైనా అప్పు అడిగితే, పరిస్థితిని వివరించవచ్చు. పిల్లల ఫీజులు కావచ్చు, ఆరోగ్య సమస్యల ఖర్చులు కావచ్చు,  బ్యాంకు లోన్లు కావచ్చు, అప్పులు కావచ్చు.. వాటిని వివరించి అప్పు ఇవ్వలేనని చెప్పవచ్చు. ఇలా సమస్యల గురించి చెబితే.. వివేకవంతుడైన మనిషి ఎవరైనా అర్థం చేసుకుంటారు. ప్రత్యామ్నాయ సహాయం.. చాలామంది డబ్బు అప్పుగా అడిగినప్పుడు.. అప్పు అడిగినవారు నిజంగా అవసరంలో ఉండి, మీరు అప్పు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే.. డబ్బు కాకుండా ఏదైనా పనుల రూపంలో డబ్బు వచ్చే మార్గంలో సహాయం చేయవచ్చు. ఆ పనుల ద్వారా వారికి డబ్బు సహాయం అందితే అప్పు అడిగిన వారు కూడా చాలా తృప్తి పడతారు. ఆరోగ్య సమస్యల కోసం డబ్బు అవసరమైన వారికి స్వచ్చంద సంస్థల నుండి డబ్బు ఇప్పించడం,  ఎవరైనా సహాయం చేసే వారి గురించి చెప్పడం లాంటివి చేయవచ్చు.  దీని వల్ల వారికి అవసరం తీరుతుంది. లేదని చెప్పడం.. కొన్నిసార్లు దాటవేసి మాట్లాడటం కంటే, నిజం సూటిగా చెప్పడమే మేలు. అయితే చెప్పే విధానం చాలా గౌరవంగా,  మర్యాదగా ఉండాలి. చెప్పడానికి నాకు బాధగానే ఉంది కానీ  నేను అప్పు ఇచ్చేంత ఆర్థిక స్థితిలో లేను అని సున్నితంగా ఎదుటివారిని నొప్పించకుండా చెప్పవచ్చు.. ఈ విషయం గుర్తుంచుకోవాలి.. చాలామంది అప్పు అడగగానే చాలా చులకనగా,  చిరాకుగా, కోపంగా రియాక్ట్ అవుతూ ఉంటారు.  కానీ ఇలా చేయడం తప్పు.. అప్పు అడిగిన వారు అవసరంలో అడుగుతారు.. వారికి మర్యాదగా,  గౌరవంగా సమాధానం చెప్పాలి.                                       *రూపశ్రీ.  
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విలువలు ఉండాలని కోరుకుంటారు, కానీ ఇది అంత సులభమైన పని కాదు. పిల్లలను పెంచడం అంటే కేవలం వారిని పెంచడం మాత్రమే కాదు,అందుకోసం ఎప్పుడూ ప్రయత్నం చేస్తుండాలి, ఇందుకోసం సహనం కూడా చాలా అవసరం.  ఈ విషయాన్ని చాలామంది  తల్లిదండ్రులు అర్థం చేసుకోరు. పిల్లలలో మంచి విలువలు, క్రమశిక్షణను పెంపొందించడం గురించి మాట్లాడినప్పుడల్లా, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు అనుసరించే పిల్లల పెంపకం విధానాల గురించి మాట్లాడుతుంటారు.. అయితే జపాన్ ప్రజలు అనుసరించే విధానాలు మాత్రం చాలా ఉన్నతంగా ఉంటాయి.  పిల్లలను కొట్టకుండా, తిట్టకుండా, అరవకుండా పిల్లలను క్రమశిక్షణలో ఉంచడం జపాన్ దేశీయుల ప్రత్యేకత.. అందుకోసం వారు ఏం చేస్తారో.. పిల్లలను కొట్టకుండా, తిట్టకుండా, అరవకుండా ఎలా క్రమశిక్షణలో ఉంచాలో తెలుసుకుంటే.. పిల్లలను  క్రమశిక్షణతో పెంచే జపనీస్ పెంపకం నియమాలు.. జపాన్ దేశం చాలా వేగంగా అభివృద్ది చెందుతోంది.   పిల్లల పెంపకం విషయంలో కూడా జపాన్ ఎప్పుడూ ముందుంటుంది. ఈ దేశంలోని ప్రజలు పిల్లల పెంపకంలో ఒక పద్ధతిగా మైండ్‌ఫుల్‌నెస్‌ను ఉపయోగిస్తారు. పిల్లలను క్రమశిక్షణలో పెట్టడానికి ఐదు పెంపక నియమాలను పాటిస్తారు. ఇతరులకు మర్యాద ఇవ్వడం.. జపాన్‌లో పిల్లలకు ఎంత చిన్నవారైనా సరే, మొదటి నుంచే ఇతరులను మర్యాదగా పలకరించడం నేర్పిస్తారు. ఈ పద్ధతి ఇతరుల పట్ల గౌరవాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది. వారి చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విధంగా ప్రవర్తించినప్పుడు, పిల్లలు  సహజంగానే క్రమశిక్షణను నేర్చుకుంటారు. ఇతరుల ఎమోషన్స్  పట్టించుకోవడం.. జపాన్ సామూహిక అవగాహనను పాటిస్తుంది, ఇది వ్యక్తులను క్రమశిక్షణతో ఉండేలా చేసే ఒక నియమం. ఇది ఒకరి ప్రవర్తన గురించి వారికి అవగాహన కల్పించడానికి, తమ ఎమోషన్స్ తో పాటు ఇతరుల ఎమోషన్స్ ను కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెబుతుంది.  దీని వల్ల కేవలం అందరికీ ఒకరి గురించి మరొకరు మీద శ్రద్ద,  గౌరవం ఏర్పడతాయి. ఇంట్లోకి వచ్చే ముందు షూ విప్పడం.. జపనీస్ జీవనశైలిలో ఇంటి బయట బూట్లు విప్పాలనే నియమాన్ని కచ్చితంగా పాటిస్తారు. ఇక్కడి ఇళ్లకు 'జెంకెన్' అని పిలువబడే ఒక ప్రత్యేక ప్రవేశ ద్వారం ఉంటుంది. అతిథులు , కుటుంబ సభ్యులు ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఈ ద్వారం వద్ద తమ బూట్లను తప్పనిసరిగా విప్పాలి. ఈ ఆచారం వెనుక  ఇంటి పరిశుభ్రత , మనస్సు  స్వచ్ఛతగా ఉండటం వంటి కారణాలు ఉంటాయట. ఒకసారి ఒక పనినే చేయడం.. పిల్లల ఏకాగ్రతను మెరుగుపరచడానికి, వారు ఒకేసారి అనేక పనులు చేయకుండా, ఒకే పనిపై దృష్టి పెట్టేలా ప్రోత్సహిస్తారు. దీనివల్ల పిల్లల ఆసక్తి, శ్రద్ద, పనులలో ఫలితాలు మెరుగ్గా ఉండటం వంటివే  కాకుండా, వారి వినికిడి, దృష్టి , గ్రహణశక్తి కూడా రెట్టింపు అవుతాయి.                                  *రూపశ్రీ.  
పిల్లలకు పేరు పెట్టడం అనేది ప్రతి తల్లిదండ్రులకు ఎంతో ప్రత్యేకమైన మరియు పవిత్రమైన సందర్భం. అయితే పేరు అనేది కేవలం పిలవడానికి మాత్రమే కాకుండా, వ్యక్తి జీవితంపై, వ్యక్తిత్వంపై, ఆలోచనా విధానంపై కూడా ప్రభావం చూపుతుందని భారతీయ సనాతన సంప్రదాయం చెబుతోంది. ఈ భక్తివన్ ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డా. అనంత లక్ష్మి గారు, పిల్లలకు పేరు ఎలా ఎంపిక చేయాలి, నామకరణంలో పాటించాల్సిన శాస్త్ర నియమాలు, జన్మ నక్షత్రం ఆధారంగా పేరు ఎందుకు పెట్టాలి, పేరుకు ఉన్న ఆధ్యాత్మిక మరియు సాంప్రదాయ ప్రాముఖ్యత వంటి అనేక ఆసక్తికరమైన విషయాలను సులభంగా వివరిస్తారు. అలాగే పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు పేరు ఎంపికలో తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి అనే విషయాలపై కూడా విలువైన సూచనలు అందిస్తున్నారు. పిల్లలకు పేరు పెట్టాలని ఆలోచిస్తున్న ప్రతి తల్లిదండ్రులు, అలాగే హిందూ ధర్మం, నామకరణ సంప్రదాయాల గురించి తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన ఆధ్యాత్మిక కార్యక్రమం ఇది. ఈ వీడియోను పూర్తిగా వీక్షించి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో కూడా పంచుకోండి. ఆధ్యాత్మిక విశేషాలు, పూజా విధానాలు, దేవాలయాల మహిమ, పండుగల ప్రాముఖ్యత కోసం మా Bhakthi One యూట్యూబ్ ఛానల్‌ను సందర్శించండి. సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
మోకాళ్ల నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? తరచూ పెయిన్‌కిల్లర్ మాత్రలు వాడుతున్నారా? అయితే ఈ వీడియోను తప్పకుండా చూడండి. ఈ వీడియోలో ప్రముఖ వైద్యులు డా. చిట్బొట్ల మధుసూదన్ శర్మ మోకాళ్ల నొప్పిని తగ్గించేందుకు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే ఒక సహజమైన చిట్కాను వివరించారు. కేవలం మూడు సాధారణ వంటింటి పదార్థాలు అయిన వెల్లుల్లి, పసుపు, నూనెతో తయారయ్యే ఈ మిశ్రమాన్ని ఎలా ఉపయోగించాలి, ఎప్పుడు రాయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను స్పష్టంగా వివరించారు. ఈ చిట్కా మోకాళ్ల నొప్పి, కీళ్ల నొప్పులు, వాపు వంటి సమస్యలకు ఉపశమనం కలిగించడంలో సహాయపడవచ్చని ఆయన తెలిపారు. అయితే ఫలితాలు వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని బట్టి మారవచ్చు. తీవ్రమైన లేదా దీర్ఘకాలిక నొప్పి ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి. ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యాంశాలు: • మోకాళ్ల నొప్పికి సహజమైన ఇంటి చిట్కా • వెల్లుల్లి, పసుపు, నూనెతో మిశ్రమం తయారీ విధానం • రాత్రి ఎలా ఉపయోగించాలి? • ఈ చిట్కా వల్ల కలిగే ప్రయోజనాలు • ఎవరెవరు ఉపయోగించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మోకాళ్ల ఆరోగ్యం, కీళ్ల సంరక్షణ, సహజ వైద్య చిట్కాలు మరియు ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం TeluguOne Health ను ఫాలో అవుతూ ఉండండి.  
రాత్రంతా పడుకుని ఉదయం నిద్ర లేవగానే చాలా తాజాగా, రిఫ్రెషింగ్ గా అనిపించాలి. కానీ చాలామందికి ఉదయం నిద్ర లేవగానే రిఫ్రెషింగ్ గా అనిపించదు.  అంతేకాదు.. ఉదయం లేవగానే బాగా చిరాకుగా, తలనొప్పిగా కూడా అనిపిస్తుంది. ఉదయం లేవగానే ఇలా ఎందుకు తలనొప్పి వస్తుందని కొందరికి సందేహం కలిగినా దాని గురించి పెద్దగా పట్టించుకోరు.  కానీ ఇది నిర్లక్ష్యం చేయాల్సిన విషయం కాదని వైద్యులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే  తలలో బరువుగా, నొప్పిగా లేదా ఒత్తిడిగా అనిపించడం  అనేది లైట్ గా తీసుకోవాల్సిన విషయం కాదని అంటున్నారు.ఇది కొన్ని సందర్బాలలో తీవ్రమైన అనారోగ్యాలకు ప్రారంభ లక్షణం కావచ్చని అంటున్నారు. ఉదయం లేవగానే తలనొప్పి ఎందుకు వస్తుంది? దీని వెనుక ఉండే ఆరోగ్య సమస్యలు ఏమిటి? దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. డీహైడ్రేషన్.. రాత్రిపూట శరీరం చాలా గంటల పాటు విశ్రాంతిలో  ఉంటుంది.  దీనివల్ల ఉదయానికి లైట్ గా డీహైడ్రేషన్  ఏర్పడవచ్చు. డీహైడ్రేషన్  మెదడు చుట్టూ ఉన్న ద్రవ సమతుల్యతను ప్రభావితం చేస్తుంది, ఇది తలనొప్పికి దారితీస్తుంది. రోజంతా తక్కువ నీరు త్రాగినా లేదా వేసవిలో అధికంగా చెమట పట్టినా ఈ ప్రమాదం పెరుగుతుంది. నిద్రలేవగానే ఒకటి లేదా రెండు గ్లాసుల నీరు త్రాగడం , రోజంతా 2.5 నుండి 3 లీటర్ల నీటిని తీసుకోవడం ఈ సమస్యను నివారించడంలో సహాయపడుతుంది. నిద్రలేమి.. ఆరోగ్యకరమైన శరీరం , మనస్సు కోసం ప్రతిరోజూ 7 నుండి 8 గంటల గాఢ నిద్ర చాలా అవసరం. ఆలస్యంగా నిద్రపోవడం, తరచుగా మేల్కొనడం లేదా తగినంత నిద్ర లేకపోవడం  దినచర్యలో భాగమైతే, ఉదయం తలనొప్పులు రావడం చాలా కామన్ అంటున్నారు వైద్యులు. నిద్రలేమి మెదడుకు తగినంత విశ్రాంతిని ఇవ్వదు, దీనివల్ల ఒత్తిడి పెరిగి, నొప్పిని కలిగించే హార్మోన్లు ఉత్తేజితమవుతాయి. అందువల్ల, టైమ్ కు తగ్గట్టు  నిద్రపోవడం , తగినంత నిద్ర పొందడం ముఖ్యం. స్లీప్ అప్నియా.. స్లీప్ అప్నియా అనేది నిద్రలో కొన్ని సెకన్ల పాటు శ్వాస ఆగిపోయే ఒక పరిస్థితి. దీనివల్ల శరీరానికి, మెదడుకు తగినంత ఆక్సిజన్ అందదు. ఫలితంగా నిద్రలేచినప్పుడు తలనొప్పి, అలసట , మగతగా ఉండటం వంటివి సంభవించవచ్చు. బిగ్గరగా గురక పెట్టడం, తరచుగా నిద్రలేవడం , పగటిపూట నిద్రమత్తుగా ఉండటం వంటివి సాధారణ లక్షణాలు. ఈ సమస్యలు కొనసాగితే, వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. మైగ్రేన్.. మైగ్రేన్లు సాధారణ తలనొప్పుల కన్నా భిన్నంగా ఉంటాయి. ఇవి తలలోని ఒక భాగంలో తీవంగా, కొట్టుకుంటున్నట్లు ఉండే నొప్పిని కలిగిస్తాయి. ఇది గంటల తరబడి లేదా రోజుల తరబడి కూడా ఉంటుంది. చాలా మందికి ఉదయం నిద్రలేవగానే మైగ్రేన్లు మొదలవుతాయి. హార్మోన్ల మార్పులు, ఒత్తిడి, నిద్రలేమి, చాలా బ్రైట్ గా ఉండే కాంతికి గురికావడం లేదా కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంటుంది. మైగ్రేన్లతో పాటు వికారం, వాంతులు,  ఎక్కువ కాంతి లేదా శబ్దం వల్ల అసౌకర్యం కూడా కలగవచ్చు. మైగ్రేన్లు తరచుగా వస్తుంటే, నరాల వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. అధిక రక్తపోటు.. రక్తపోటు ఎక్కువ కాలం పాటు అధికంగా ఉంటే, ఉదయం పూట తలనొప్పి ఒక సంకేతం కావచ్చు. అధిక రక్తపోటు ఉన్న ప్రతి రోగికి తలనొప్పి రాకపోయినప్పటికీ, అదుపులో లేని రక్తపోటు మెదడులోని రక్తనాళాలపై ఒత్తిడిని పెంచుతుంది. తలనొప్పితో పాటు తల తిరగడం, దృష్టి మసకబారడం లేదా ఛాతీ నొప్పి వంటివి ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.  రక్తపోటును క్రమం తప్పకుండా పరీక్షించుకోవడం ,  వైద్యుడు సూచించిన విధంగా మందులు తీసుకోవడం చాలా ముఖ్యం. రాత్రిపూట కెఫీన్ లేదా మద్యం తీసుకోవడం.. రాత్రి సమయంలో ఎక్కువగా కెఫీన్ లేదా మద్యం తీసుకోవడం వల్ల శరీరం నిర్జలీకరణానికి గురై, మరుసటి రోజు ఉదయం తలనొప్పి రావడం సర్వసాధారణంగా జరుగుతుంది. అధికంగా కెఫీన్ తీసుకోవడం లేదా అకస్మాత్తుగా కెఫీన్‌ను మానేయడం కూడా తలనొప్పికి కారణం కావచ్చు. రాత్రి ఆలస్యంగా కాఫీ, ఎనర్జీ డ్రింక్స్ లేదా మద్యం సేవించడం వల్ల ఉదయం తలనొప్పి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఈ సమస్యను నివారించడానికి, కెఫీన్ తీసుకోవడాన్ని పరిమితం చేయాలి, మద్యానికి దూరంగా ఉండాలి,   పుష్కలంగా నీరు త్రాగాలి.                                           *రూపశ్రీ.