టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్, బాలీవుడ్ నటి రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ‘అక్క’ ఎట్టకేలకు స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ధర్మరాజ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ను యశ్ రాజ్ ఫిల్మ్స్‌కు చెందిన వైఆర్ఎఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. ఈ సిరీస్‌తో కీర్తి సురేష్ నేరుగా ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. తాజాగా ‘అక్క’ అక్టోబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
‘అక్క’ కథ 1980ల కాలంలో దక్షిణ భారతదేశంలోని కల్పిత నగరం పెర్నూరులో సాగుతుంది. అక్కడ మహిళల ఆధిపత్యం ఉండే సమాజంలో కీర్తి సురేష్, రాధికా ఆప్టే ఇద్దరూ శక్తివంతమైన గ్యాంగ్‌స్టర్ క్వీన్స్‌గా కనిపించనున్నారు. తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న ఈ ఇద్దరి ప్రపంచంలోకి ఓ బయటి వ్యక్తి ప్రవేశించడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. ఆ తర్వాత చోటుచేసుకునే పరిణామాలు, అధికారం కోసం జరిగే పోరాటం, ప్రతీకారం వంటి అంశాలతో సిరీస్ సాగనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
ఇప్పటికే విడుదలైన టీజర్‌లో కీర్తి సురేష్, రాధికా ఆప్టే పాత్రలను పవర్‌ఫుల్‌గా చూపించారు. ఇద్దరి మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు, గ్యాంగ్‌స్టర్ ప్రపంచం, 1980ల నాటి వాతావరణం సిరీస్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. కీర్తి, రాధికాతో పాటు తన్వీ అజ్మీ, విశాఖ నాయర్, దివ్య శ్రీపాద తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2025లోనే ఈ ప్రాజెక్ట్‌ను నెట్‌ఫ్లిక్స్ ప్రకటించగా.. ఇప్పుడు విడుదల తేదీ ఖరారు కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.
‘అక్క’ను వైఆర్ఎఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించగా.. ఆదిత్య చోప్రా, యోగేంద్ర మొగ్రే, అక్షయ్ విధానీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు నెట్‌ఫ్లిక్స్ అధికారిక పేజీలో విడుదల తేదీని ‘Coming Soon’గా చూపిస్తున్నప్పటికీ.. తాజా పరిశ్రమ నివేదికలు అక్టోబర్ 30న ప్రీమియర్ కానున్నట్లు వెల్లడించాయి. దీంతో కీర్తి సురేష్, రాధికా ఆప్టేలను గ్యాంగ్‌స్టర్ పాత్రల్లో చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
[Akka Web Series, Keerthy Suresh Akka, Radhika Apte Akka, Akka Netflix Release Date, Akka OTT Release, Keerthy Suresh OTT Debut, Akka Web Series Netflix, Dharmaraj Shetty Akka, YRF Entertainment Akka]





