గ్యాస్ నొప్పా గుండెపోటా ..ఈ తేడా తప్పక తెలుసుకోండి!
Published on: Tue Sep 29, 2026 5:43PM

ఛాతిలో నొప్పి వస్తే అది గ్యాస్ సమస్యా? లేక గుండెపోటు లక్షణమా? ఈ రెండింటి మధ్య తేడాను ఎలా గుర్తించాలి? గుండెపోటు వచ్చినప్పుడు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఏమిటి? ఈ వీడియోలో కార్డియాలజిస్ట్ డాక్టర్ రాజేష్ నటువా గారు వివరంగా చెబుతున్నారు.
ఛాతీ మధ్యలో బరువుగా, బిగుతుగా లేదా పిండుతున్నట్టుగా అనిపించడం, నొప్పి ఎడమ చేయి, మెడ లేదా పొట్ట వైపు వ్యాపించడం వంటి లక్షణాలతో పాటు విపరీతమైన చెమటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆందోళన, త్వరగా అలసిపోవడం వంటి సంకేతాలను కూడా తెలుసుకోండి.
ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు, 70 ఏళ్లు పైబడినవారు, మహిళల్లో కొన్నిసార్లు సాధారణ ఛాతినొప్పికి బదులుగా గ్యాస్ లేదా హార్ట్‌బర్న్‌లా లక్షణాలు కనిపించవచ్చు. డయాబెటిస్, అధిక రక్తపోటు, ఊబకాయం, పొగతాగడం, మద్యం వంటి గుండెపోటు ప్రమాద కారకాలు ఉన్నప్పుడు లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సహాయం తీసుకోవడం ఎందుకు ముఖ్యమో తెలుసుకోండి.
చిన్న వయసులోనే గుండెపోటు ఎందుకు వస్తోంది? జంక్ ఫుడ్, శారీరక శ్రమ తగ్గిపోవడం, అధిక బరువు, కుటుంబ చరిత్ర, జన్యుపరమైన కారణాలు, కొలెస్ట్రాల్ వంటి అంశాలు గుండె ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతాయో కూడా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు.
ఛాతినొప్పిని సాధారణ గ్యాస్ సమస్యగా భావించే ముందు ఈ ముఖ్యమైన విషయాలను తప్పక తెలుసుకోండి.
మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)


