Home

»

Latest News

RRR రికార్డ్ అవుట్: 'వారణాసి' మూవీ బిజినెస్ విధ్వంసం.!

Sep 29, 2026 7:06PM

టాలీవుడ్ చరిత్రలో ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిన సినిమా 'RRR'. ఆ సినిమా థియేట్రికల్ రైట్స్ ఏపీ, తెలంగాణ కలిపి దాదాపు 225 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేస్తోంది ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబుల మోస్ట్ అవైటెడ్ మూవీ 'వారణాసి'.

ప్రస్తుతం టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు 'వారణాసి' ఏపీ, తెలంగాణ రైట్స్ కోసం పోటీ పడుతున్నారు. ముఖ్యంగా దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్.. 'వారణాసి' తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ దక్కించుకోవడానికి తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఒక్కొక్కరు ఆఫర్ చేస్తున్న అమౌంట్ రూ.275 కోట్ల కోట్లకు పైగానే ఉందట. అంటే 'RRR' సాధించిన ఆల్ టైమ్ రికార్డ్ కంటే ఏకంగా 50 కోట్ల రూపాయలు ఎక్కువ. ఒక సినిమాకు కేవలం తెలుగు రాష్ట్రాల నుండి ఈ రేంజ్ ఆఫర్స్ రావడం అంటే మామూలు విషయం కాదు. ఫైనల్ డీల్ రూ.300 కోట్లకు అటుఇటుగా క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది.

'వారణాసి' సినిమా 2027, ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో, మైథలాజికల్ టచ్ తో వస్తున్న ఈ విజువల్ వండర్ విడుదల తర్వాత ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

ఇది కూడా చదవండి: ఒకే ఏడాది 5 బ్లాక్‌బస్టర్స్.. శోభన్‌బాబుకి 'సోగ్గాడు' పేరు ఎలా వచ్చిందో తెలుసా.?

 

 

[Varanasi Telugu States Rights, Varanasi Telugu states Business, Varanasi 275 Crore business, Varanasi Movie Business, Varanasi Theatrical Rights, Varanasi Movie, RRR Vs Varanasi, Mahesh Babu, SS Rajamouli, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com