LATEST NEWS
భక్తులు శ్రీరాముడిపై ఉన్న అపారమైన విశ్వాసంతో తమ కష్టార్జితాన్ని హుండీలో కానుకలుగా సమర్పిస్తారు. అలా సమర్పించిన ప్రతి రూపాయి వెనుక పవిత్రమైన విశ్వాసం, ఆధ్యాత్మిక చింతన  ఉంటాయి. అలాంటి కానుకలు దుర్వినియోగమైతే భక్తల మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటాయి. అయోధ్య రామాలయానికి భక్తుల సమర్పించిన విరాళాల విషయంలో అదే జరిగింది. అయోథ్య రాముడికి భక్తుల సమర్పించిన విరాళాల్లో 7.5 కోట్ల రూపాయల మేర  అవకతవకలు జరిగా యన్నవార్తలు దేశవ్యాప్తంగా కోట్ల మంది భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీశాయి.  ఆ అవకతవకలకు, అక్రమాలకు నిరసనగా పార్లమెంటు ఆవరణలో విపక్షాలు వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేశాయి.  అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పరిధిలో దాదాపు రూ. 7.5 కోట్ల విరాళాల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలపై పార్లమెంట్‌ ద్వారం వద్ద స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ కాషాయ వస్త్రాలు ధరించి, పూజారి వేషంలో ఒక పెద్ద హుండీతో కూర్చుని సేకరించిన విరాళాలను జేబులో వేసుకుంటూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఆ పూజారికి  లోక్‌సభలో  ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సహా పలువురు  విపక్ష ఎంపీలు   విరాళాలు వేస్తుండగా, పప్పు యాదవ్ వారిచ్చిన సొమ్మును తన జేబులో వేసుకుంటూ చోరీ జరిగిన విషయాన్ని చాటారు. ఆ సందర్భంగా ఎంపీలు చఢావా చోర్, గద్దీ ఛోడ్ అంటూ   బిగ్గరగా నినాదాలు చేశారు. అయోధ్య విరాళాల అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.   Ayodhya donation row, Pappu Yadav protest, Rahul Gandhi, Parliament Makar Dwar, Ram Mandir hundi theft, Opposition protest
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చబోతున్న, ఏపీ అభివృద్ధి విషయంలో గేమ్ చేంజర్ కాబోతున్నభోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం (ఆగస్టు 1)న ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు.  ఈ నేపథ్యంలో  భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ  ఎయిర్‌పోర్ట్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఇది చంద్రబాబు నాయుడి దార్శనికతాఅసలీ క్రెడిట్ వార్ ఏమిటి?  వంటి అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు.   హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయాన్ని డిజైన్ చేస్తున్న సమయంలోనే, ఉత్తరాంధ్ర భవిష్యత్తు కోసం భోగాపురంలో ఓ భారీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఉండాలని చంద్రబాబు భావించి ఆ మేరకు ప్రతిపాదనలు కూడా ఇచ్చారని అడుసుమిల్లి చెప్పారు.  నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే విశాఖను గ్లోబల్ ఐటీ, ఇండస్ట్రియల్ హబ్‌గా మార్చాలనే ఆలోచనతో ఈ భోగాపురం ప్రాజెక్టుకు చంద్రబాబు బీజం వేశారనీ, అయితే..  కాలక్రమంలో ప్రభుత్వాలు మారాయి, ప్రాజెక్టు ప్రతిపాదనలు మడతపడ్డాయన్నారు.  2019 ఎన్నికల ప్రచారంలో  జగన్.. ఉన్న విశాఖ ఎయిర్‌పోర్ట్‌లోనే ఈగలు తోలుకుంటున్నారు, అక్కడకి వెళ్లేవాళ్లే లేరు, ఇక భోగాపురంలో ఎయిర్‌పోర్ట్ దేనికి?  అంటూ చేసిన విమర్శలను అడుసుమిల్లి అజ్ణానం అంటూ కొట్టి పారేశారు.   గతంలో ఈ ప్రాజెక్ట్ కోసం ప్రతిపాదించిన భూ సేకరణపై ఎన్నో అనుమానాలు, వివాదాలు రేకెత్తించారు. కానీ చరిత్రను పరిశీలిస్తే ఒక నిజం స్పష్టంగా కనిపిస్తుందన్న ఆయన..  నాడు సైబర్ టవర్స్ కట్టినప్పుడు, శిల్పారామం కట్టినప్పుడు కూడా అందరూ ఇలాగే ఎగతాళి చేశారు. అక్కడెవడు ఉంటాడు? అంత దూరం ఎవడు వెళ్తాడు? అని ప్రశ్నించారు. కానీ ఈ రోజు హైదరాబాద్ గ్రోత్ ఇంజిన్‌గా మారిన మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాలను చూస్తే... చంద్రబాబు విజన్ ఏమిటో అర్ధమౌతుందన్నారు.   ముందుచూపుతో వ్యవహరించినవారు ఎప్పుడూ నష్టపోరన్న ఆయన..  శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ఎలాగైతే తెలంగాణ అభివృద్ధికి ప్రధాన చోదక శక్తిగా మారిందో, భోగాపురం ఎయిర్‌పోర్ట్ కూడా ఆంధ్రప్రదేశ్‌కు, ముఖ్యంగా ఉత్తరాంధ్రకు అతిపెద్ద గ్రోత్ ఇంజిన్‌గా మారబోతోంది. అందులో ఇసుమంతైనా సందేహం అవసరం లేదని అడుసుమిల్లి అన్నారు.  వైజాగ్  నుంచి  40 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నప్పటికీ, ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే గ్లోబల్ ఇన్వెస్టర్లు,  పారిశ్రామిక దిగ్గజాలు, ఐటీ కంపెనీలు ఉత్తరాంధ్రకు పోటెత్తడం ఖాయమన్నారు.  జగన్ హయాంలో  భూసేకరణను తగ్గించడం, ప్రాజెక్టు పనులను రెండేళ్లపాటు పక్కన పెట్టడాన్నీ గుర్తు చేసిన అడుసుమిల్లి,   2024లో జగన్ సర్కార్ పతనమై చంద్రబాబు నేతృత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత  భోగాపురం పనులు వేగం పుంజుకున్నాయనీ, ఇప్పుడు ప్రారంభోత్సవానికి సిద్ధమైందనీ చెప్పారు.  అయితే తగుదునమ్మా అంటూ ఇప్పుడు జగన్ భోగాపురం క్రెడిట్ కోసం ప్రాకులాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. అయినా  ప్రారంభంలో వ్యతిరేకించడం, తర్వాత విమర్శించడం, చివరకు నిజం తెలుసుకుని  క్రెడిట్ చోరీకి పాకులాడటం జగన్ రాజకీయం అని ఎద్దేవా చేశారు.   ఉత్తరాంధ్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే ఈ బృహత్తర ప్రాజెక్ట్ ప్రారంభం కావడం యావత్ రాష్ట్రానికి గర్వకారణం. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్ర గ్లోబల్ మ్యాప్‌లోకి ఎక్కబోతోంది. ఇది నిస్సందేహంగా చంద్రబాబు విజన్ తో రూపుదిద్దుకుని సాకారమైన ప్రాజక్ట్ అని అడుసుమిల్లి ముక్తాయించారు.  Bhogapuram Airport Launch,  Chandrababu Vision, Jagan Credit Chori Attempts, Uttarandhra Development,   PM Modi Bhogapuram, Telogu One
మాజీ మంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజును జైలులో పరామర్శించేందుకు   వైసీపీ అధినేత   జగన్  శ్రీకాకుళం పర్యటన సందర్భంగా ఆయన చేసినన వ్యాఖ్యలు   కొత్త వివాదానికి తెరలేపాయి. సీదిరి అప్పలరాజును జైలులో పెట్టడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుట్ర చేశారని, అప్పలరాజు అంటే చంద్రబాబుకు అసలు పడదని, కక్షపూరితంగానే ఆయన కుటుంబాన్ని వేధిస్తున్నారంటూ జగన్ గుప్పించిన విమర్శలు పరిశీలకులనే కాదు సామాన్య జనాన్ని సైతం విస్మయపరుస్తున్నాయి. ఎందుకంటే.. జగన్ చెబుతున్నట్లుగా ఈ కేసులో  రాజకీయ ప్రమేయం ఇసుమంతైనా కనిపించడం లేదు. సిదిరి అప్పలరాజు కుమారుడు బైక్ నిర్లక్ష్యంగా నడిపి ఒకరి మృతికి కారణమయ్యారన్న కేసు దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల మేరకు  ఇందులో ఎలాంటి రాజకీయ కుట్రలు లేవు.   సీదిరి అప్పలరాజు చేసిన  అతే..  ఆయనను చట్టపరంగా ఇబ్బందుల్లోకి నెట్టింది.  నిర్లక్ష్యంగా బైక్ నడిపి  ఒక అమాయక వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటనలో..  నిజాన్ని దాచిపెట్టి ప్రభుత్వంపై ఎదురుదాడి చేయడమేంటన్న చర్చ ఇప్పుడు జనంలో విస్తృతంగా జరుగుతోంది. కేసు ఏమిటంటే..  శ్రీకాకుళం జిల్లా పరిధిలో బుల్లెట్ బైక్‌తో ప్రమాదం జరిగి ఒక సామాన్య గొర్రెల కాపరి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఆ సమయంలో బైక్ నడుపుతోంది సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ కాగా, తన కుమారుడిని ఈ కేసు నుండి తప్పించడానికి మాజీ మంత్రి తీవ్రంగా ప్రయత్నించారు.  తన కొడుకు ఆరవ్‌ను బయట పడేసే క్రమంలో, ఆరవ్ స్నేహితుడైన  వేరే యువకుడిని ఈ కేసు ఒప్పుకునేలా ఒత్తిడి తెచ్చారు.  బైకు ప్రమాదం సదరు యువకుడే చేశాడని పోలీసులను తప్పుదోవ పట్టించి కేసు కూడా నమోదు చేయించారు.  అప్పట్లో సీదిరి మాటలను, ఆయన చెప్పిన కథనాన్ని నమ్మిన స్థానిక పోలీసులు, ఆరవ్ స్నేహితుడిపై  కేసు నమోదు చేశారు. అయితే ఈ  వ్యవహారం మీడియాలో ప్రముఖంగా రావడంతో అసలు విషయం బయటపడింది. అంతేకాకుండా, ప్రమాదానికి గురైన గొర్రెల కాపరికి సీదిరి అప్పలరాజు రోడ్డుపై సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేశారని ప్రచారం చేసుకున్నప్పటికీ..  అది కూడా వాస్తవం కాదని, దారిన పోతున్న ఒక సాధారణ వ్యక్తి మాత్రమే ఆ సహాయం చేశారని పోలీసుల విచారణలో తేలింది. మరోవైపు సీదిరి అప్పలరాజు   అబద్ధపు కథనాన్ని నమ్మి, అక్రమంగా కేసు నమోదు చేసినందుకు గాను శాఖాపరమైన విచారణ చేపట్టిన ప్రభుత్వం, సంబంధిత సీఐ, ఎస్సైతో సహా పలువురు పోలీసులపై   చర్యలు తీసుకుంది. మొత్తం నలుగురు పోలీసు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేయడమే కాకుండా వారిపై సమగ్ర విచారణకు ఆదేశించింది. ఈ తప్పుడు కేసు కారణంగా నలుగురు పోలీసు అధికారుల ఉద్యోగాలు ప్రమాదంలో పడగా, మరోవైపు ఒక సామాన్య గొర్రెల కాపరి కుటుంబం తమ ఇంటి పెద్దను కోల్పోయి రోడ్డున పడింది. సీదిరి కుమారుడు చేసిన తప్పుకు ప్రాణాలు కోల్పోయిన ఆ నిరుపేద కుటుంబానికి న్యాయం చేయాల్సింది పోయి, నిందితుడిని తప్పించేందుకు కుట్రపూరితంగా వేరే వారిపై కేసు పెట్టించడంతో సిదిరి అప్పలరాజు కటకటాల పాలయ్యారు. ఈ మొత్తం వ్యవహారంలో ఒక రాజకీయపార్టీ అధినేతగా జగన్ చేయాల్సిందేంటంటే.. బాధితుడి అంటే రోడ్డు ప్రమాదంలో మరణించిన గొర్రెల కాపరి కుటుంబాన్ని పరామర్శించాలి. అది వదిలేసి.. నిందితులకు పరామర్శలేంటన్న విమర్శలు వ్యక్తమౌతున్నాయి.   Jagan Mohan Reddy, Seediri Appalaraju, Palasa accident case, Chandrababu Naidu, AP Political News, AP Police suspension
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన బలప్రదర్శన బ్యాక్ ఫైర్ అయ్యింది. 2024 ఎన్నికలలో ఓటమి తరువాత నుంచి   జనం మధ్యకు రావడం మానేసిన జగన్.. కేసులలో జైలు పాలైన వైసీపీ నేతల పరామర్శకు మాత్రమే బయటకు వస్తున్నారు. మిగిలిన సమయం అంతా బెంగళూరు ప్యాలెస్ కో, తాడేపల్లి ప్యాలెస్ కో పరిమితమౌతున్నారు. ప్రెస్ మీట్లతోనే గడిపేస్తున్నారు.  అలా ఎప్పుడో ఓ సారి జైల్లో ఉన్న నేతకు పరామర్శ పేరుతో బయటకు వచ్చే సందర్భాలలో కూడా సదరు నేతను పరామర్శించడం కంటే.. బల ప్రదర్శనకు, తనకు జనం మద్దతు ఉందని నిరూపించుకునే ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన అలా బయటకు వచ్చిన ప్రతి సారీ అభాసుపాలౌతూనే ఉన్నారు. తాజాగా మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు జగన్ శ్రీకాకుళం పర్యటనలో కూడా అదే జరిగింది. బలప్రదర్శన ర్యాలీ కారణంగా అయన ఎందుకు  వచ్చారో  ఆ పని చేయలేకపోయారు.   అసలు సీదిరి అప్పలరాజు ఎందుకరస్టయ్యారు అంటే.. అదేదో రాజకీయ కారణం కాదు. తన కుమారుడు నిర్లక్ష్యంగా బైక్ నడిపి ఒక వ్యక్తి మరణానికి కారకుడైతే.. ఆ కేసుకు సంబంధించి దర్యాప్తును పక్కదోవపట్టించడానికి చేసిన ప్రయత్నం బెడిసి కొట్టి సీదిరి అప్పలరాజు అరెస్టయ్యారు. ఒక క్రిమినల్ కేసులో అరెస్టై రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి అప్పలరాజును పరామర్శించేందుకు జగన్ వచ్చారు.  జైలులో ఉన్న అప్పలరాజును ములాఖత్ రోజున కలడానికి వచ్చిన జగన్ ఈ పర్యటనను బలప్రదర్శన వేదికగా మార్చుకోవాలని ప్రయత్నించారు. అందుకే విశాఖ నుంచి శ్రీకాకుళం వరకూ రోడ్డు మార్గంలో ప్రయాణించారు. ఈ కారణంగా జగన్ జైలు ప్రాంగణం దగ్గరకు చేరుకునే సరికే సమయం గడిచిపోయింది. దీంతో జైలు అధికారులు అప్పలరాజును కలిసేందుకు జగన్ ను అనుమతించలేదు.   దీని ఫలితంగా, జైలులో ఉన్న  న మాజీ కేబినెట్ మంత్రిని కలవకుండానే వెనుదిరిగారు.  YS Jagan Mohan Reddy, Seediri Appalaraju, Srikakulam jail meeting, YCP politics, Andhra Pradesh news, Telugu One
  ఢిల్లీ వీధుల్లో రగిలిన ఆగ్రహ జ్వాలలు, పోలీసుల లాఠీఛార్జీలు, కన్నీటి ధారలు, నిర్బంధాలను సైతం లెక్కచేయక హక్కుల కోసం వీధిపోరాటానికి దిగిన యువత ఆక్రందనలు దేశ రాజధానిని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. ఇన్నాళ్లూ నిశ్శబ్దంగా ఉన్న గొంతుకలు ఒక్కసారిగా గర్జించడంతో కేంద్ర పాలకులు సైతం భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇది కేవలం ఒక నిరసన మాత్రమే కాదు... ఏళ్ల తరబడి అనుభవిస్తున్న నైరాశ్యం, ఉపాధి లేమి, విద్యా వ్యవస్థలోని లోపాలు, ప్రజాస్వామ్య హక్కుల కాలరాచివేతపై సామాన్యుడు విసిరిన సమరభేరి. ఈ అంశాలపై టోన్ న్యూస్ వాస్తవ వేదిక కార్యక్రమంలో తెలుగువన్‌ మేనేజింగ్ డైరెక్టర్ కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకులు డోలేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో విశ్లేషణాత్మకంగా చర్చ నిర్వహించారు.  అధికార గర్వాన్ని ఎదిరించిన సామాన్యుడి ఆక్రోశం..! దేశంలో గత కొన్ని ఏళ్లుగా ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఒకరి చేతుల్లో బందీ అయిపోయాయన్న ఆవేదన ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఏళ్ల తరబడి కష్టపడి చదివినా ఉద్యోగాలు రాక, రోజువారీ బతుకుదెరువు కోసం గిగ్ వర్కర్లుగా మారుతున్న యువత కడుపు మంట ఈ ఉద్యమానికి ఇంధనంగా మారింది. ఏటా ఫలితాల్లో అక్రమాలు, నిరుద్యోగం, మరోవైపు కార్పొరేట్ల లబ్ధి కోసం అమలవుతున్న విధానాలు సామాన్య కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. తమ భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడుతోందని గ్రహించిన యువత, ఇళ్లలోని నిశ్శబ్దాన్ని వీడి వీధుల్లోకి వచ్చింది. రక్తమోడిన వీధులు... గుండె బలంతో నిలబడిన యువత..! ఢిల్లీ వీధుల్లో కనిపించిన దృశ్యాలు ప్రతీ భారతీయుడి హృదయాన్ని ద్రవీంపజేసాయి. లాఠీలు దెబ్బ తింటున్నా, రక్షక భటులే రక్షకులు కాక భయానక వాతావరణం సృష్టిస్తున్నా యువకులు వెనక్కి తగ్గలేదు. "మమ్మల్ని కాల్చండి... కానీ మా భవిష్యత్తును కాపాడండి" అంటూ నినదిస్తూ పోలీసుల ముందే నిలబడిన దృశ్యాలు స్వాతంత్ర్య పోరాట సమయాలను గుర్తుచేశాయి. ఒక సాధారణ అమ్మాయి రక్షణ వాహనానికి అడ్డంగా నిలబడి తన నిరసనను వ్యక్తం చేయడం, తమ హక్కుల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడిన సామాన్యుల తెగువకు అద్దం పడుతోంది. 16 మెట్రో స్టేషన్లను మూసివేసి, ఇంటర్నెట్‌ను నిలిపివేసి ఉద్యమాన్ని అణచివేయాలని చూసినా, గుండెల్లో రగులుతున్న కడుపు మంట ముందు ఏ ఆంక్షలూ నిలవలేకపోయాయి. ప్రజాస్వామ్యంలో కొత్త ఆశల చిగురు..! ఈ సుదీర్ఘ పోరాటం వెనుక ఏ రాజకీయ పార్టీ ప్రయోజనాలూ లేవు, ఏ నాయకుడి స్వార్థమూ లేదు. ఇది స్వచ్ఛందంగా, ఆవేదనలోంచి ఉద్భవించిన ఒక అగ్నిపర్వతం. ఎండనక, వాననక వీధుల్లో రాత్రంతా గడిపిన ప్రతీ యువకుడి వెనుక ఒక పేద కుటుంబం ఆశలు ఉన్నాయి. "మా పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో" అని రాత్రంతా కంటిమీద కునుకు లేకుండా తల్లడిల్లిన తల్లిదండ్రుల కన్నీళ్లు ఉన్నాయి. రాజ్యాంగ వ్యవస్థలన్నీ మౌనం వహించిన చోట, ఈ యువ శక్తి చూపించిన సాహసమే ఈనాడు పాలకవర్గాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఈ ఉద్యమం మనకు నేర్పిన పాఠం ఒకటే... ఎంతటి బలమైన అధికారమైనా ప్రజల ఆక్రోశం ముందు తలవంచక తప్పదు. ఇలాంటి అంశాలపై  పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి.     Vasthava Vedika, Kanthamneni Ravi Shankar, Dolendra Prasad, Cockroach party, Gig Workers Strike Delhi, BJP
ALSO ON TELUGUONE N E W S
The makers of Nenu Ready have unveiled the latest single, Merupule, adding another energetic track to the film's promotional campaign. Renowned director VV Vinayak unveiled the song wishing team huge success. Starring Havish and Kavya Thapar as leads, with Nargis Fakhri playing a special role, the film has been generating positive buzz with its glimpse, teaser, and previously released songs.  Merupule is a vibrant celebration number that captures the joy of a major victory achieved by the protagonist. Set against the backdrop of a lively neighborhood celebration, the song showcases Havish dancing with his family and the entire street, reflecting the warmth and togetherness of his character. The festive atmosphere and colorful visuals make the track an entertaining watch. One of the major highlights of the song is Havish's energetic screen presence and impressive dance performance. The choreography is designed to bring out his effortless moves and charisma, while also establishing his character as someone who shares his happiness with everyone around him. The celebratory mood is infectious, with people of all ages joining the festivities. Composed by Mickey J. Meyer, the song carries an upbeat and catchy tune, complemented by Ritesh G Rao's energetic vocals. Krishnakanth's lively lyrics further enhance the festive spirit, making Mabbullo an instantly enjoyable track. Directed by Trinadha Rao Nakkina and produced by Kanchana Koneru on a lavish scale, Nenu Ready promises to be a wholesome family entertainer. With its engaging promotional material and entertaining songs continuing to strike a chord with audiences, the film has steadily built curiosity ahead of its release. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.  
The actress is currently working on the films Ranabaali and Mysaa. According to reports, the continuous action sequences and dance performances for these projects resulted in a complete tendon detachment in her hip area. Doctors are said to have been surprised by the severity of the injury, noting that such tendon damage is usually seen only in athletes who undergo intense physical training. Medical experts have advised Rashmika to take complete rest for six weeks. They have also recommended a rehabilitation program to help the tendon heal and regain strength. Rashmika is currently one of the busiest pan-India actresses, juggling the shoots of four major films. In addition, she serves as the brand ambassador for around 30 products. Due to her injury, the shooting schedules for her films as well as several advertising campaigns are expected to be affected. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
The much-awaited teaser of Sardar 2 is finally out, and it has lived up to the massive expectations surrounding the sequel. After the blockbuster success of Sardar, director P.S. Mithran returns with an even bigger and more ambitious spy action entertainer, with Prince Pictures and Ivy Entertainment backing the film on a grand scale. Annapurna Studios will release the film in Telugu. The teaser promises a thrilling cinematic experience packed with high-octane action, larger-than-life visuals, and intense drama. Karthi, reprising his dual roles, once again impresses with his remarkable transformation as both the veteran spy and his younger counterpart. The teaser offers glimpses into the father's journey as a legendary spy while teasing the son's dangerous new missions, raising the stakes significantly. One of the biggest highlights is SJ Suryah, whose commanding screen presence instantly grabs attention. His chilling monologue, powerful dialogue delivery, and menacing performance establish him as a formidable antagonist, adding a new level of intensity to the spy thriller. Every frame featuring him leaves a lasting impact and hints at an epic face-off with Karthi. Director P.S. Mithran appears to have expanded the scale of the franchise with stylish action sequences and impressive visuals, while Sam C.S.'s electrifying background score amplifies the tension throughout the teaser. The film also stars Malavika Mohanan and Ashika Ranganath in key roles, with the production values reflecting the franchise's ambitious vision. With its gripping teaser, spectacular action, and strong performances, Sardar 2 has significantly raised expectations ahead of its worldwide theatrical release on September 10. Fans of the original now have every reason to look forward to another high-stakes spy adventure. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
The wait is finally coming to an end for fans of Natural Star Nani. The makers of The Paradise, one of the most anticipated Telugu films in recent times, have officially locked August 6 as the release date for the film's much-awaited teaser. Directed by Srikanth Odela, The Paradise has generated tremendous buzz ever since its announcement. The excitement reached another level with the release of Aaya Sher, composed by Anirudh Ravichander, which became a sensational chartbuster by crossing 200 million views and evolving into a mass anthem. The song's success has only amplified expectations for the film and its promotional content. The upcoming teaser is expected to introduce audiences to the gritty, raw, and violent world of Jadal, with Nani appearing in what is being described as the most intense and massiest role of his career. Set against the backdrop of 1980s Secunderabad, the film promises a hard-hitting action drama with a unique visual style and immersive storytelling. Produced by Sudhakar Cherukuri on a lavish scale, The Paradise features Raghav Juyal, Kayadu Lohar, and Mohan Babu in pivotal roles. With Srikanth Odela aiming to deliver a cult action spectacle and every update from the film creating massive excitement, all eyes are now on the teaser, which is expected to offer the first glimpse into the dark and brutal world of The Paradise. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
టాలీవుడ్ ను వరుస గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే బాలకృష్ణ, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్స్ గాయపడి కోలుకుంటున్నారు. ఇక ఇప్పుడు స్టార్ హీరోయిన్ రష్మిక కూడా గాయపడ్డారు డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా రష్మిక తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆమె రణబాలి, మైసా సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. రణబాలి, మైసా చిత్రాల్లో వరుసగా యాక్షన్ సీక్వెన్సులు, డ్యాన్స్ పర్ ఫార్మెన్స్ లు చేయడం వల్ల రష్మిక హిప్ ఏరియాలో పూర్తిగా టెండన్ డిటాచ్ మెంట్ అయ్యింది. ఆమె గాయం వైద్యులను సైతం షాక్ కు గురి చేసింది. తీవ్రంగా సాధన చేసే క్రీడాకారుల్లో మాత్రమే ఇలాంటి గాయాలు అవుతుంటాయని వైద్యులు చెబుతున్నారు.  రష్మిక 6 వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. టెండన్ తిరిగి బలపడేందుకు రీహాబిలిటేషన్ కూడా అవసరం అని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం రష్మిక పాన్ ఇండియా స్థాయిలో బిజీయెస్ట్ హీరోయిన్ గా కెరీర్ కొనసాగిస్తున్నారు. ఆమె 4 భారీ చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. అలాగే 30 ప్రాడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. రష్మికకు అయిన తీవ్ర గాయంతో ఆయా సినిమాల, వ్యాపార ప్రకటనల షూటింగ్స్ నిలిచిపోనున్నాయి. ఆమె త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్, వెల్ విషర్స్ కోరుకుంటున్నారు.     Rashmika Mandanna, Ranabaali, Mysaa
టాలీవుడ్‌ ఫోర్ పిల్లర్స్ లో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున బాండింగ్ ఎప్పుడూ ప్రత్యేకమే. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. ఓ రకంగా బ్రదర్స్ లా ఉంటారు. వీరిద్దరి కాంబినేషన్ లో మల్టీస్టారర్ వస్తే చూడాలనేది.. అభిమానులు దశాబ్దాల కల. ఇప్పుడు ఆ కలను నిజం చేసే బాధ్యతను డైరెక్టర్ అనిల్ రావిపూడి తన భుజాలపై వేసుకున్నారనే వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.  నలుగురు సీనియర్ స్టార్స్ లో నాగార్జునతో తప్ప మిగతా ముగ్గురు స్టార్స్ తో రావిపూడి సినిమాలు చేశారు. చిరంజీవితో 'మన శంకర వరప్రసాద్ గారు', బాలకృష్ణతో 'భగవంత్ కేసరి' చేశారు. ఇక వెంకటేష్ అయితే 'ఎఫ్ 2', 'ఎఫ్ 3', 'సంక్రాంతికి వస్తున్నాం' చేశారు. అలాగే 'మన శంకర వరప్రసాద్ గారు'లోనూ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో సందడి చేయడం విశేషం. ప్రస్తుతం వెంకటేష్, కళ్యాణ్ రామ్ తో మరో మల్టీస్టారర్ చేస్తున్నారు రావిపూడి. అయితే నాగార్జునతో సినిమా చేస్తే.. నలుగురు స్టార్స్ తో సినిమాలు చేసిన డైరెక్టర్ గా అరుదైన ఘనత సాధించే అవకాశం అనిల్ రావిపూడికి ఉంటుంది. రావిపూడి సైతం ఇదే విషయాన్ని చెబుతూ.. నాగ్ తో సినిమా చేయాలని ఉందనే విషయాన్ని ఇప్పటికే బయటపెట్టారు. ఈ క్రమంలోనే నాగార్జునతో సినిమా ప్లాన్ చేస్తున్న అనిల్ రావిపూడి.. సోలోగా కాకుండా, చిరంజీవితో మల్టీస్టారర్ గా చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఒకవేళ నిజంగానే ఈ కాంబినేషన్ పట్టాలెక్కితే.. బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ ఖాయం.     Anil Ravipudi, Chiranjeevi, Nagarjuna, Multistarrer  
భారతీయ చిత్ర పరిశ్రమ సగర్వంగా చెప్పుకునే దర్శకుడు రాజమౌళి(Rajamouli). దర్శక ధీరుడు హోదాలో ఇప్పుడు మహేష్ బాబు(Mahesh Babu)తో కలిసి ప్రపంచ సినిమా టార్గెట్ గా 'వారణాసి'ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అందుకు తగ్గట్టే పూర్తిస్థాయిలో ఐమాక్స్ (IMAX) ఫార్మాట్‌లో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో చిత్రీకరిస్తున్నారు. ఈ అత్యంత భారీ విజువల్ వండర్ ‘వారణాసి' (Varanasi)పూర్తయిన తర్వాత జక్కన్న తన తదుపరి ప్రాజెక్ట్‌ ఎవరితో చేయబోతున్నారు అనే దానిపై సినీ విశ్లేషకులు, పరిశ్రమ వర్గాలు అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడి చేస్తున్నాయి. ప్రధానంగా మూడు విషయాల గురించి చెప్తున్నారు. మొదటిది:  రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతం’ అని అనేక అంతర్జాతీయ వేదికలపై స్వయంగా ప్రకటించారు. ఈ మహాకావ్యాన్ని 10 భాగాల భారీ ఫ్రాంచైజీగా లేదా ఒక భారీ వెబ్ సిరీస్ / సినిమా సిరీస్‌గా ప్రపంచ స్థాయి సాంకేతికతతో రూపొందించాలనేది ఆయన సుదీర్ఘకాల లక్ష్యం. ఈ భారీ ప్రాజెక్ట్‌లో పాన్-ఇండియా వ్యాప్తంగా ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అమితాబ్ బచ్చన్ వంటి దాదాపు 80% మంది అగ్ర తారలను ఒకే వేదికపైకి తీసుకురావాలని ఆయన ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ‘వారణాసి’ సినిమాతో హాలీవుడ్ నిర్మాతలు మరియు స్టూడియోలతో నేరుగా భాగస్వామ్యం ఏర్పడుతున్నందున, ఆ తర్వాత రాజమౌళి నేరుగా మహాభారతం వైపు అడుగులు వేసే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. రెండు: ఆస్కార్ గెలుచుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత రాజమౌళికి హాలీవుడ్ ప్రముఖ ఏజెన్సీ CAA (Creative Artists Agency) తో ఒప్పందం కుదిరింది. మహేష్ బాబు కాంబినేషన్‌లోని ‘వారణాసి’ చిత్రం కూడా దాదాపు 40% పైగా హాలీవుడ్ సాంకేతిక నిపుణుల భాగస్వామ్యంతోనే రూపొందుతోంది. కాబట్టి, వారణాసి విడుదలైన తర్వాత రాజమౌళి కేవలం భారతీయ నటులతో కాకుండా, ప్రసిద్ధ హాలీవుడ్ నటులతో ఒక పూర్తి స్థాయి గ్లోబల్ యాక్షన్ లేదా సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్‌ను చేపట్టే అవకాశం ఉందనేది మరో బలమైన అంచనా. మూడు:  మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లేదా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌లతో మళ్లీ కాంబినేషన్ కుదరడం. రాజమౌళి ఇప్పటికే ఎన్టీఆర్‌తో 4 సినిమాలు తెరకెక్కించాడు. ప్రభాస్‌తో తీసిన ‘బాహుబలి’ సిరీస్ 2,400 కోట్లకు పైగా వసూళ్లను సాధించి భారతీయ సినిమా చరిత్రను తిరగరాసింది. ఈ ఇద్దరు హీరోలు కూడా రాజమౌళి విభాగానికి పూర్తి సహకారం అందించేవార కావడంతో, మహాభారతం కన్నా ముందు ఒక మీడియం రేంజ్ పాన్ ఇండియా   యాక్షన్ థ్రిల్లర్‌ను ప్లాన్ చేస్తే వీరిద్దరిలో ఒకరితో ప్రాజెక్ట్ ఉండే అవకాశం ఉందంటున్నారు.  Also read: సర్దార్ 2 షాకింగ్ అప్ డేట్.. ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి మరి! సాధారణంగా రాజమౌళి ఒక సినిమాని ముగించిన వెంటనే మరో పెద్ద ప్రాజెక్ట్‌ను ప్రకటించడానికి చాలా సమయం తీసుకుంటారు. గతంలో ‘బాహుబలి’ రెండు భాగాలు పూర్తి చేయడానికి దాదాపు 5 ఏళ్ల సమయం పట్టగా, ఆ తర్వాత తీసిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పూర్తి కావడానికి 4 ఏళ్లు పట్టింది. ఇప్పుడు మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ కోసం కూడా రాజమౌళి దాదాపు 3 నుంచి 4 ఏళ్ల సమయం తీసుకున్నాడు. వారణాసి 2027 ఏప్రిల్ 7 న విడుదల కానున్న విషయం తెలిసిందే.    Rajamouli, Mahesh Babu, Varanasi, Priyanka Chopra
బుల్లితెరపై తనదైన చలాకీతనంతో, విభిన్నమైన యాంకరింగ్‌తో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన విష్ణుప్రియ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. నిత్యం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై ఎంతో యాక్టివ్‌గా ఉండే ఈ గ్లామరస్ యాంకర్, తాజాగా పంచుకున్న అత్యంత హాట్ అండ్ బోల్డ్ ఫోటోషూట్ పిక్స్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వన్-షోల్డర్ హై-స్లిట్ సీక్విన్ గౌన్‌లో ఆమె ఇచ్చిన విభిన్నమైన పోజులు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకోవడమే కాకుండా కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. జుట్టును స్టైలిష్‌గా దువ్వి ముఖంపై పడేలా చేసుకున్న హెయిర్‌స్టైల్, కైపెక్కించే సైడ్ యాంగిల్ పోజులతో తన గ్లామర్ డోస్‌ను మైండ్ బ్లాకింగ్ రేంజ్‌లో పెంచేసింది. ఈ పిక్స్ చూసిన ఫాలోవర్లు ఆమె అందాలపై కొంటె కామెంట్లతో కామెంట్ సెక్షన్‌ను హోరెత్తిస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన విష్ణుప్రియ, గ్లామర్ రంగంపై ఉన్న ఆసక్తితో మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 2010లో సినీ రంగానికి శ్రీకారం చుట్టిన ఈ చిన్నది పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ముఖ్యంగా 2014లో విడుదలైన జాతీయ అవార్డు గ్రహీత చిత్రం 'చందమామ కథలు'లో నటనకు గానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆమె కెరీర్‌ను మలుపు తిప్పిన ప్లాట్‌ఫామ్ మాత్రం బుల్లితెర అని చెప్పవచ్చు. ఈటీవీలో ప్రసారమైన ప్రజాదరణ పొందిన 'పోవే పోరా' కామెడీ షో ద్వారా సుడిగాలి సుధీర్‌తో కలసి యాంకరింగ్ చేసి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. ఆ తర్వాత పలు ప్రముఖ రియాలిటీ షోలు, ప్రత్యేక ఈవెంట్లలో సందడి చేస్తూ డిజిటల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఎదిగింది. కేవలం గ్లామరస్ పోస్టులతోనే కాకుండా కాంట్రవర్సీలతో కూడా విష్ణుప్రియ వార్తల్లో నిలుస్తుంటుంది. గతంలో తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఎక్స్‌క్లూజివ్ ఫోటోలు, వీడియోల కోసం పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ మోడల్‌ను ప్రారంభించి తీవ్ర వివాదంలో చిక్కుకుంది. నెలకు సరిగ్గా రూ. 399 ఫీజుగా నిర్ణయించి సబ్‌స్క్రిప్షన్ మొదలుపెట్టడం పెద్ద దుమారాన్నే రేపింది. ఇలాంటి పెయిడ్ కంటెంట్ వల్ల యువత తప్పుదోవ పడుతోందంటూ పలు విద్యార్థి సంఘాలు హైదరాబాద్, విజయవాడ నగరాల్లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా నమోదు చేశాయి. ఈ వ్యవహారంపై ఒకవైపు తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తినప్పటికీ, మరోవైపు ఆమె ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఈ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా ఆమె నెలకు దాదాపు రూ. 10 లక్షల వరకు భారీ ఆదాయాన్ని గడిస్తున్నట్లు ట్రెండింగ్ కథనాలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల ఒక నెటిజన్ సోషల్ మీడియాలో స్పందిస్తూ సబ్‌స్క్రిప్షన్ ఫీజు రూ. 399 కాస్త తగ్గించాలని విజ్ఞప్తి చేయగా, విష్ణుప్రియ ఇచ్చిన ఘాటు రిప్లై నెట్టింట బాగా వైరల్ అయింది. "ఇలాంటి అనవసర విషయాలను పక్కన పెట్టి ముందు నీ చదువుపై దృష్టి పెట్టు" అంటూ ఆమె నెటిజన్‌కు హితవు పలకడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ట్రోల్స్, విమర్శలు ఎన్ని ఎదురైనా సరే తన మార్గం తనదే అని నిరూపిస్తూ, విష్ణుప్రియ సోషల్ మీడియా వేదికగా తన గ్లామర్ షోతో నిత్యం ట్రెండింగ్‌లో ఉంటోంది. బుల్లితెరపై చిలిపి ముచ్చట్లతో అలరించిన ఈ భామ, ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో తన కిల్లింగ్ లుక్స్‌తో కుర్రకారును నిద్రలేకుండా చేస్తూ డిజిటల్ స్పేస్‌ను షేక్ చేస్తోంది.     Vishnu Priya Bhimeneni, Anchor Vishnu Priya Latest Pics, Vishnu Priya Hot Photoshoot
  తమిళ, తెలుగు చిత్ర సీమలో సమానమైన క్రేజ్ సంపాదించుకున్న కార్తీ, గత కొన్ని చిత్రాల నుంచి మిస్ చేయకుండా వరుస పరాజయాలని అందుకుంటున్నాడు. కానీ ఈ సారి 'సర్దార్ 2 'తో హిట్ అందుకోవడమే లక్ష్యంగా ఉన్నాడు. సెప్టెంబర్ 10 రిలీజ్ డేట్. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో రిలీజ్ డేట్‌ పేర్కొనకపోవడంతో సినిమా విడుదల వాయిదా పడుతోందేమోనని, సెప్టెంబర్ 10న రావడం లేదేమోనని సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు షురూ అయ్యాయి.  అయితే ఆ ఊహాగానాలకి స్వస్తి పలుకుతూ చిత్ర బృందం స్పష్టతనిచ్చింది. మేకర్స్ ముందే ప్రకటించినట్లుగా ఎలాంటి మార్పు లేకుండా సెప్టెంబర్ 10వ తేదీనే 'సర్దార్ 2' ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలోనే అభిమానులకు అసలైన సర్‌ప్రైజ్ ఇస్తూ 'సర్దార్ 2' టీజర్ లాంచ్ డేట్ అండ్ టైమ్‌  యూనిట్ అధికారికంగా ఖరారు చేసి ఊహించని ధమాకా ఇచ్చింది. ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'సర్దార్ 2' టీజర్ వీడియో విడుదలకు సమయం ఆసన్నమైంది. భారీ యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ విజువల్ వండర్ టీజర్‌ను త్వరలోనే లాంచ్ చేసేందుకు మేకర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ టీజర్‌లో కార్తీ ఏజెంట్ చంద్రబోస్ అలియాస్ సర్దార్‌గా మైండ్ బ్లోయింగ్ గెటప్‌లో, సరికొత్త యాక్షన్ అవతార్‌లో కనిపించబోతున్నాడు. 100 రోజులకు పైగా చైనా, కాంబోడియా వంటి విదేశీ లొకేషన్లలో చిత్రీకరించిన అత్యున్నత స్థాయి యాక్షన్ సీక్వెన్సె టీజర్‌లో హైలైట్‌గా నిలవనున్నాయి.  సామ్ సి.ఎస్ అందిస్తున్న మాసివ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌కి  ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.   Also read: టాలీవుడ్‌లో 100 కోట్ల మోజు.. ఫేక్ బాక్సాఫీస్ పోస్టర్ల వెనుక దాగున్న చేదు నిజాలు! సర్దార్ పార్ట్ 1 ఇచ్చిన విజయోత్సాహంతో, దర్శకుడు పి.ఎస్. మిత్రన్ సీక్వెల్‌ని  మరింత గ్రాండ్‌గా, అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిస్తున్నాడు. ప్రతిష్టాత్మక ప్రిన్స్ పిక్చర్స్ మరియు ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై ఎస్. లక్ష్మణ్ కుమార్, ఇషాన్ సక్సేనా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా కార్తీకి పోటీగా పవర్‌ఫుల్ విలన్ రోల్ లో  ప్రముఖ నటుడు వర్సటైల్ యాక్టర్ ఎస్.జె. సూర్య నటిస్తుండటం మూవీపై అంచనాలని ఒక్కసారిగా రెట్టింపు చేశాయి. గ్లామరస్ బ్యూటీస్ మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్, రజీషా విజయన్, యోగి బాబు కీ రోల్స్ .వినాయక చవితి పండగ సీజన్‌ను లక్ష్యంగా చేసుకుని సెప్టెంబర్ 10న రాబోతున్న ఈ స్పై యాక్షన్ ధమాకా కోసం అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  Sardar 2, Karthi,Malavika  Mohan, Ashika Ranganadh
  అడిగితే దేవుడు వారాలు ఇస్తాడో లేదో తెలియదు కానీ, సినిమా మాత్రం అభిమానులకి, ప్రేక్షకులకి వరాలు ఇస్తుంది. ఈ విషయం అభిమానులు, మూవీ లవర్స్ కి బాగా తెలుసు. అంత గొప్పది సినిమా. అసలు సినిమా అనే కళ పుట్టకపోయి ఉంటే ఈ దేశంతో పాటు   మనుషులు ఇంకా ఎక్కడో యాభై ఏళ్ళ క్రితం మైండ్ సెట్ తో వెనుకంజలో ఉండే వాళ్ళు. అంతలా సమాజానికి సినిమా మంచి చెప్పడంతో పాటు తెలివిని నేర్పిస్తూ వస్తుంది.   అటువంటి గొప్ప చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఒక కొత్త విచిత్రమైన ట్రెండ్ నడుస్తోంది. థియేటర్లలో జనాలు ఉన్నారా లేదా అనే విషయంతో  సంబంధం లేకుండా, సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే  50 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు అంటూ భారీ అంకెలతో రంగురంగుల పోస్టర్లు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. థియేటర్లలో బొమ్మ సరిగ్గా ఆడక, ప్రేక్షకులు పెదవి విరిచి మిక్స్‌డ్ టాక్ ఇచ్చినా సరే, నిర్మాతలు మాత్రం మా సినిమా ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్ అంటూ తెగ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. గ్రౌండ్ రియాలిటీ చూస్తే థియేటర్లు ఖాళీగా దర్శనమిస్తుంటే, సామాజిక మాధ్యమాల్లో మాత్రం వందల కోట్ల వసూళ్ల కలరింగ్ పోస్టర్లు కళ్ళు బైర్లు కమ్మేలా దాడి చేస్తున్నాయి. ఇటీవల కొన్ని సినిమాల విషయంలో బాక్సాఫీస్ దగ్గర అసలు వసూళ్లు  3 కోట్లు దాటడమే కష్టంగా మారిన తరుణంలో, మేకర్స్ ఏకంగా రూ. 25 కోట్ల గ్రాస్ వచ్చిందని, త్వరలోనే 100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెడుతోందని పోస్టర్లు వదలడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇటువంటి పోస్టర్లను చూసి నెటిజన్లు సోషల్ మీడియాలో మీ గ్రాఫిక్స్ కంటే మీ కలెక్షన్ పోస్టర్లు బాగున్నాయంటూ ఘాటుగా ట్రోల్స్ చేస్తున్నారు. Also read: Spider man brand new day: స్పైడర్ మెన్ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో తొలి చిత్రంగా రికార్డు   ఈ ఫేక్ ప్రచారం వెనుక ఉన్న అసలు నష్టం మాత్రం డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్ల పైనే పడుతోంది. పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాక బయ్యర్లు నెత్తీ నోరు మొత్తుకుంటుంటే, నిర్మాతలు మాత్రం భారీగా కేకులు కట్ చేస్తూ, గ్రాండ్ సక్సెస్ మీట్లు ఏర్పాటు చేసి ఆర్భాటం చేస్తున్నారు. మరి సోషల్ మీడియాలో వస్తున్న ఈ న్యూస్ లో నిజం ఎంత ఉందో తెలియదు గాని, సినిమా అనేది సాక్షాత్తు కారణ జన్మురాలు, కారణ జన్ముడు. కాబట్టి అలాంటి సినిమా కలెక్షన్స్ ని ఫేక్ పోస్టర్స్ తో నింపి సినిమాని చులకనగా చేసి మాట్లాడే అవకాశం ఎవరకి ఇవ్వదని సినిమా ప్రేమికులు కోరుకుంటున్నారు.   Tollywood, Cinema  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అంటూ ఉంటారు. కానీ ఆర్థిక అవసరం ఏర్పడినప్పుడు మానవ సంబందాలే ఆదుకుంటాయి.  ఆర్థిక ఇబ్బందులు ఏర్పడినప్పుడు చాలా వరకు స్నేహితులు,  బంధువులు, సన్నిహితులు,  ఆఫీసు కొలీగ్స్.. ఇలా చాలామందిని అప్పు అడుగుతూ ఉంటాం.  అలాగే వారు కూడా మనల్ని అడుగుతూ ఉంటారు. కానీ నేటికాలంలో డబ్బు తీసుకున్నంత సులువుగా దాన్ని తిరిగి ఇవ్వరు.  పైగా డబ్బు తీసుకుని.. ఇస్తాంలే ఎక్కడికి పోతాం.. అని దబాయించే వారు కూడా ఉంటారు. ఈ కారణంగానే కష్టపడి సంపాదించుకున్న డబ్బులను ఎవరికైనా అప్పు ఇవ్వాలంటే చాలా భయం వేస్తుంది.  కానీ ఎవరైనా అప్పు అడిగినప్పుడు.. లేదు అని చెప్పడం చిన్న పదమే అయినా.. అది తగిన కారణంగా కనిపించదు.  లేదని చెప్పినా కొందరు పదే పదే అప్పు కావాలని, ఎవరితో అయినా అప్పు ఇప్పించమని కూడా అడుగుతుంటారు.  అప్పు ఇవ్వడం అనే సమస్య నుండి తప్పించుకోవడం,  ఎదుటి వ్యక్తితో ఉన్న సంబంధం ఏదీ పాడు చేసుకోకుండా ఉండటం కత్తిమీద సాము లాంటిది.  ఎవరైనా అప్పు అడిగితే.. వారు బాధపడకుండా లేదని చెప్పడానికి కొన్ని మార్గాలు  ఉన్నాయి.  అవేంటో తెలుసుకుంటే.. వెంటనే సమాధానం ఇవ్వకూడదు.. ఎవరైనా అకస్మాత్తుగా డబ్బు అడిగినప్పుడు, ఆలోచించకుండా వెంటనే "అవును" లేదా "కాదు" అని చెప్పకుండా, కొంత సమయం తీసుకోవాలి. ఆ తరువాత ఎదుటివారితో మర్యాదగా "నాకు కొంచెం సమయం ఇవ్వండి. నేను ఈ నెలకు నా బడ్జెట్ , బ్యాంకు బ్యాలెన్స్ చూసుకోవాలి" అని చెప్పవచ్చు. ఇలా చెప్తే.. మీరే ఆర్థికంగా డబ్బుకు వెతుక్కుంటున్నారని అప్పు అడిగిన వారు అర్థం చేసుకుంటారు. ఇలా సమయం అడగడం వల్ల  ఆలోచించడానికి అవకాశం ఇస్తుంది, ఒకవేళ  తర్వాత లేదని చెప్పాల్సి  వచ్చినా..  ఎదుటి వారు అపార్థం చేసుకోరు. ఎందుకంటే అడిగిన వెంటనే లేదని చెప్తే.. అప్పు అడిగిన వారు అపార్థం చేసుకుంటారు. అప్పు సూత్రం.. ఎవరైనా అప్పు అడిగినప్పుడు వారికి లేదని చెప్పడం కంటే.. అప్పు సూత్రం పాటించడం మంచిది.  అప్పు సూత్రం ప్రకారం.. ఎవరికీ అప్పు ఇవ్వడం అనేది పెట్టుకోకూడదు.  ఎలాంటి పరిస్థితులలో అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం చేయకూడదు.  అప్పు అనే కారణం వల్ల సంబంధాలు నాశనం అవుతాయి.  అప్పు తీసుకున్నవారు కొన్నిసార్లు తిరిగి ఇవ్వలేకపోతే.. అప్పు ఇచ్చిన వారు చాలా బాధపడాల్సి వస్తుంది.  డబ్బు అనేది అంత సులువుగా లభించేది కాదు.  కాబట్టి అప్పు అనే కారణంతో సంబంధాలు పాడు చేసుకోను,  ఎవరికీ అప్పు ఇవ్వకూడదని నేను నిర్ణయం తీసుకున్నాను అని చెప్పాలి.  ఇలా చెప్తే ఎదుటి వారు సంబంధాలకు విలువ ఇచ్చేవారు అయితే.. అర్థం చేసుకుంటారు. బాధ్యతలు, ఖర్చులు వివరించడం.. ప్రతి ఒక్కరికీ బాధ్యతలు ఉంటాయి. ఎవరైనా అప్పు అడిగితే, పరిస్థితిని వివరించవచ్చు. పిల్లల ఫీజులు కావచ్చు, ఆరోగ్య సమస్యల ఖర్చులు కావచ్చు,  బ్యాంకు లోన్లు కావచ్చు, అప్పులు కావచ్చు.. వాటిని వివరించి అప్పు ఇవ్వలేనని చెప్పవచ్చు. ఇలా సమస్యల గురించి చెబితే.. వివేకవంతుడైన మనిషి ఎవరైనా అర్థం చేసుకుంటారు. ప్రత్యామ్నాయ సహాయం.. చాలామంది డబ్బు అప్పుగా అడిగినప్పుడు.. అప్పు అడిగినవారు నిజంగా అవసరంలో ఉండి, మీరు అప్పు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే.. డబ్బు కాకుండా ఏదైనా పనుల రూపంలో డబ్బు వచ్చే మార్గంలో సహాయం చేయవచ్చు. ఆ పనుల ద్వారా వారికి డబ్బు సహాయం అందితే అప్పు అడిగిన వారు కూడా చాలా తృప్తి పడతారు. ఆరోగ్య సమస్యల కోసం డబ్బు అవసరమైన వారికి స్వచ్చంద సంస్థల నుండి డబ్బు ఇప్పించడం,  ఎవరైనా సహాయం చేసే వారి గురించి చెప్పడం లాంటివి చేయవచ్చు.  దీని వల్ల వారికి అవసరం తీరుతుంది. లేదని చెప్పడం.. కొన్నిసార్లు దాటవేసి మాట్లాడటం కంటే, నిజం సూటిగా చెప్పడమే మేలు. అయితే చెప్పే విధానం చాలా గౌరవంగా,  మర్యాదగా ఉండాలి. చెప్పడానికి నాకు బాధగానే ఉంది కానీ  నేను అప్పు ఇచ్చేంత ఆర్థిక స్థితిలో లేను అని సున్నితంగా ఎదుటివారిని నొప్పించకుండా చెప్పవచ్చు.. ఈ విషయం గుర్తుంచుకోవాలి.. చాలామంది అప్పు అడగగానే చాలా చులకనగా,  చిరాకుగా, కోపంగా రియాక్ట్ అవుతూ ఉంటారు.  కానీ ఇలా చేయడం తప్పు.. అప్పు అడిగిన వారు అవసరంలో అడుగుతారు.. వారికి మర్యాదగా,  గౌరవంగా సమాధానం చెప్పాలి.                                       *రూపశ్రీ.  
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విలువలు ఉండాలని కోరుకుంటారు, కానీ ఇది అంత సులభమైన పని కాదు. పిల్లలను పెంచడం అంటే కేవలం వారిని పెంచడం మాత్రమే కాదు,అందుకోసం ఎప్పుడూ ప్రయత్నం చేస్తుండాలి, ఇందుకోసం సహనం కూడా చాలా అవసరం.  ఈ విషయాన్ని చాలామంది  తల్లిదండ్రులు అర్థం చేసుకోరు. పిల్లలలో మంచి విలువలు, క్రమశిక్షణను పెంపొందించడం గురించి మాట్లాడినప్పుడల్లా, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు అనుసరించే పిల్లల పెంపకం విధానాల గురించి మాట్లాడుతుంటారు.. అయితే జపాన్ ప్రజలు అనుసరించే విధానాలు మాత్రం చాలా ఉన్నతంగా ఉంటాయి.  పిల్లలను కొట్టకుండా, తిట్టకుండా, అరవకుండా పిల్లలను క్రమశిక్షణలో ఉంచడం జపాన్ దేశీయుల ప్రత్యేకత.. అందుకోసం వారు ఏం చేస్తారో.. పిల్లలను కొట్టకుండా, తిట్టకుండా, అరవకుండా ఎలా క్రమశిక్షణలో ఉంచాలో తెలుసుకుంటే.. పిల్లలను  క్రమశిక్షణతో పెంచే జపనీస్ పెంపకం నియమాలు.. జపాన్ దేశం చాలా వేగంగా అభివృద్ది చెందుతోంది.   పిల్లల పెంపకం విషయంలో కూడా జపాన్ ఎప్పుడూ ముందుంటుంది. ఈ దేశంలోని ప్రజలు పిల్లల పెంపకంలో ఒక పద్ధతిగా మైండ్‌ఫుల్‌నెస్‌ను ఉపయోగిస్తారు. పిల్లలను క్రమశిక్షణలో పెట్టడానికి ఐదు పెంపక నియమాలను పాటిస్తారు. ఇతరులకు మర్యాద ఇవ్వడం.. జపాన్‌లో పిల్లలకు ఎంత చిన్నవారైనా సరే, మొదటి నుంచే ఇతరులను మర్యాదగా పలకరించడం నేర్పిస్తారు. ఈ పద్ధతి ఇతరుల పట్ల గౌరవాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది. వారి చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విధంగా ప్రవర్తించినప్పుడు, పిల్లలు  సహజంగానే క్రమశిక్షణను నేర్చుకుంటారు. ఇతరుల ఎమోషన్స్  పట్టించుకోవడం.. జపాన్ సామూహిక అవగాహనను పాటిస్తుంది, ఇది వ్యక్తులను క్రమశిక్షణతో ఉండేలా చేసే ఒక నియమం. ఇది ఒకరి ప్రవర్తన గురించి వారికి అవగాహన కల్పించడానికి, తమ ఎమోషన్స్ తో పాటు ఇతరుల ఎమోషన్స్ ను కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెబుతుంది.  దీని వల్ల కేవలం అందరికీ ఒకరి గురించి మరొకరు మీద శ్రద్ద,  గౌరవం ఏర్పడతాయి. ఇంట్లోకి వచ్చే ముందు షూ విప్పడం.. జపనీస్ జీవనశైలిలో ఇంటి బయట బూట్లు విప్పాలనే నియమాన్ని కచ్చితంగా పాటిస్తారు. ఇక్కడి ఇళ్లకు 'జెంకెన్' అని పిలువబడే ఒక ప్రత్యేక ప్రవేశ ద్వారం ఉంటుంది. అతిథులు , కుటుంబ సభ్యులు ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఈ ద్వారం వద్ద తమ బూట్లను తప్పనిసరిగా విప్పాలి. ఈ ఆచారం వెనుక  ఇంటి పరిశుభ్రత , మనస్సు  స్వచ్ఛతగా ఉండటం వంటి కారణాలు ఉంటాయట. ఒకసారి ఒక పనినే చేయడం.. పిల్లల ఏకాగ్రతను మెరుగుపరచడానికి, వారు ఒకేసారి అనేక పనులు చేయకుండా, ఒకే పనిపై దృష్టి పెట్టేలా ప్రోత్సహిస్తారు. దీనివల్ల పిల్లల ఆసక్తి, శ్రద్ద, పనులలో ఫలితాలు మెరుగ్గా ఉండటం వంటివే  కాకుండా, వారి వినికిడి, దృష్టి , గ్రహణశక్తి కూడా రెట్టింపు అవుతాయి.                                  *రూపశ్రీ.  
లోన్ తీసుకునే ముందు తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు నేటి కాలంలో ఇల్లు, కారు, పిల్లల చదువు, వ్యాపారం లేదా ఇతర అవసరాల కోసం లోన్ తీసుకోవడం చాలా సాధారణమైంది. కానీ లోన్ తీసుకున్న తర్వాత ప్రతి నెల EMI చెల్లించడం చాలా మందికి ఒత్తిడిగా మారుతోంది. సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోతే ఈ EMI భారం కుటుంబ ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రభావం చూపుతుంది. ఈ వీడియోలో ప్రముఖ ఫైనాన్షియల్ గైడ్ రామకృష్ణ మాగులూరి గారు లోన్ తీసుకునే ముందు ఏ విషయాలు ఆలోచించాలి, ఎంత వరకు అప్పు చేయడం మంచిది, EMI భారం తగ్గించుకోవడానికి ఎలాంటి అలవాట్లు పెంచుకోవాలి, ఆర్థిక ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి వంటి ఉపయోగకరమైన సూచనలను చాలా సులభంగా వివరించారు. అప్పుల భారం లేకుండా ప్రశాంతమైన ఆర్థిక జీవితాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కూడా తప్పకుండా షేర్ చేయండి.      
"పిల్లలకు డిప్రెషన్ వస్తుందా?" అనే ప్రశ్నకు చాలా మంది తల్లిదండ్రుల సమాధానం "రాదు" అనే ఉంటుంది. కానీ నిజానికి పిల్లలు కూడా డిప్రెషన్‌కు గురవుతారని ప్రముఖ నిపుణురాలు డాక్టర్ పూర్ణిమ నాగరాజ ఈ వీడియోలో వివరించారు. పిల్లలలో డిప్రెషన్ రావడానికి గల ప్రధాన కారణాలు ఏమిటి? ఇంట్లో, పాఠశాలలో లేదా సమాజంలో ఎదురయ్యే ఒత్తిళ్లు వారి మానసిక ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతాయి? పిల్లలు డిప్రెషన్‌లో ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు ఏమిటి? తల్లిదండ్రులు ఏ విషయాలను గమనించాలి? వంటి ఎన్నో ముఖ్యమైన అంశాలను ఈ వీడియోలో సులభంగా అర్థమయ్యేలా వివరించారు. అంతేకాకుండా, డిప్రెషన్‌తో బాధపడిన చిన్నారుల గురించి కొన్ని హృదయ విదారక సంఘటనలను కూడా ఆమె పంచుకున్నారు. పిల్లల భావోద్వేగాలను అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో, వారికి సరైన సమయంలో ప్రేమ, మద్దతు మరియు అవసరమైన చికిత్స అందించడం ఎందుకు అవసరమో కూడా వివరించారు. ప్రతి తల్లిదండ్రి, ఉపాధ్యాయుడు మరియు పిల్లలతో మమేకమయ్యే ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన అవగాహన కలిగించే వీడియో ఇది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
  పచ్చబొట్టు ప్రజల జీవితాలలో భాగమైపోయి కొన్ని వందల, వేల సంవత్సరాలు అయిపోయింది.  ఇప్పుడు పచ్చబొట్టును ప్యాషన్ లో భాగంగా మార్చేశారు.  పచ్చబొట్టును కొత్తగా టాటూ అని పిలుస్తున్నారు. ఈ టాటు పచ్చబొట్టుకు అప్డేడ్ వెర్షన్ అనుకోవచ్చు. పచ్చ బొట్టు గురించి కవులు ఎన్నో పాటలు కూడా రాశారు. నేటికాలంలో పచ్చబొట్టును చాలా కొత్తగా వేయించుకోవడం మాత్రమే కాకుండా చాలా కామన్ విషయంగా కూడా అయిపోంది. చాలామంది తమ  అభిరుచి కారణంగా టాటూలు , పియర్సింగ్‌లు చేయించుకుంటున్నారు. ఈ  టాటూలు లేదా పియర్సింగ్‌ల వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగదని అనుకుంటారు. అయితే ఇది పూర్తీ నిజం కాదు.. బాడీ ఆర్ట్ గా పిలువబడే పచ్చబొట్టు లేదా టాటు.. కాలేయాన్ని తీవ్రమైన ప్రమాదంలో పడేస్తుందని అంటున్నారు వైద్య నిపుణులు.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. బాడీ ఆర్ట్.. కాలేయానికి జరిగే హాని.. టాటు వేయించుకుంటే ఫ్యాషన్ లో భాగంగా కొత్తగా కనిపించవచ్చు అనుకుంటారు.  అయితే  ఈ ఫ్యాషన్ కాలేయానికి ప్రమాదాన్ని పెంచుతుందని చాలా తక్కువ మందికి తెలుసు. టాటూ వేసినప్పుడు  రక్తం వల్ల  హెపటైటిస్ బి , హెపటైటిస్ సి అనే వైరల్ ఇన్ఫెక్షన్లు  కాలేయంపై నేరుగా దాడి చేస్తాయట. ఇవి వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణం రక్త ఇన్ఫెక్షన్ కారణం అని చెబుతున్నారు. టాటూ నీడిల్స్.. టాటూ ఆర్టిస్ట్ లు శుభ్రపరచని సూదులను లేదా అవే పరికరాలను పదేపదే ఉపయోగిస్తే, వైరస్ రక్తప్రవాహంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుందట. ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, హెపటైటిస్ లక్షణాలు సంవత్సరాల తరబడి బయటపడకపోవచ్చని, ఈ కారణంగా ఇది ఎటువంటి సంకేతాలు లేదా లక్షణాలు లేకుండా నిశ్శబ్దంగా కాలేయాన్ని దెబ్బతీసి, సిరోసిస్ వంటి తీవ్రమైన సమస్యలు రావడానికి కారణం అవుతుందని అంటున్నారు. పచ్చబొట్టు  వేయించుకొనేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు.. మార్కెట్‌లో లైసెన్స్ పొంది, మంచి పేరున్న స్టూడియోలకు మాత్రమే వెళ్లాలి,  పార్టీలో లేదా ఇంట్లో టాటూ వేయించుకోవడం మంచిది కాదు. టాటూ ఆర్టిస్ట్ లను,  వారి సెటప్ ను జాగ్రత్తగా పరిశీలించాలి. వారు కొత్త, క్రిమిరహితం చేసిన సూదులను ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకున్న తర్వాతే టాటూ వేయించుకోవాలి.  అంతేకాదు.. వీటి గురించి ఏమైనా సందేహాలు ఉంటే వారిని అడిగి సందేహాలు తీర్చుకున్న తర్వాతే టాటూ వేయించుకోవాలి. టాటూ వేయడానికి ఉపయోగించే ఇంక్  ఒక చిన్న, ఒకేసారి వాడే కప్పులో ఉండాలి. అలాగే, టాటూ ఆర్టిస్ట్  సూదిని నేరుగా పెద్ద సిరా సీసాలో ముంచకూడదు. ఎందుకంటే, ఒకే సీసాను పదేపదే వాడటం వల్ల సిరా డబ్బా మొత్తం కలుషితం కావచ్చు. టాటూ ఆర్టిస్ట్ చేతులు కడుక్కొని, ఆ తర్వాత కొత్త డిస్పోజబుల్ గ్లౌజులు ధరించాలి. అలా ఉండే టాటూ ప్రాసెస్ శుభ్రంగా ఉన్నట్టు. జాగ్రత్త..  
40 సంవత్సరాల తర్వాత మహిళల శరీరంలో సహజంగానే అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. హార్మోన్లలో మార్పులు, మెటాబాలిజం తగ్గడం, బరువు పెరగడం, చర్మంపై ముడతలు, అలసట వంటి సమస్యలు కనిపించడం సాధారణం. అయితే సరైన ఆహారపు అలవాట్లు పాటిస్తే ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, యవ్వనంగా కూడా కనిపించవచ్చు. ఈ వీడియోలో ప్రముఖ సీనియర్ న్యూట్రిషన్ కన్సల్టెంట్ డా. పి. జానకి శ్రీనాథ్ 40 ఏళ్లు దాటిన మహిళలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన యాంటీ ఏజింగ్ ఆహారాల గురించి సులభంగా వివరిస్తున్నారు. శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, కాల్షియం, ఐరన్, ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఏ ఆహారాల్లో లభిస్తాయి, అవి ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. అలాగే బరువు నియంత్రణ, ఎముకల బలం, గుండె ఆరోగ్యం, చర్మ కాంతి, జుట్టు ఆరోగ్యం, హార్మోన్ల సమతుల్యత కోసం తీసుకోవాల్సిన ఆహారాలు, దూరంగా ఉండాల్సిన ఆహారాల గురించి కూడా విలువైన సూచనలు అందించారు. 40 ఏళ్ల తర్వాత కూడా ఫిట్‌గా, స్లిమ్‌గా, ఉత్సాహంగా ఉండాలనుకునే ప్రతి మహిళ ఈ వీడియోను తప్పక చూడాలి. ఈ వీడియోలో తెలుసుకునే అంశాలు: 40 ఏళ్ల తర్వాత మహిళలకు అవసరమైన పోషకాహారం యాంటీ ఏజింగ్ ఫుడ్స్ ప్రయోజనాలు బరువు పెరగకుండా ఉండే ఆహారాలు మెటాబాలిజం పెంచే ఆహారాలు చర్మం, జుట్టు ఆరోగ్యానికి ఉపయోగపడే ఫుడ్స్ ఎముకలు బలంగా ఉండేందుకు తీసుకోవాల్సిన ఆహారం ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం డైట్ సూచనలు ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం TeluguOne Health ను ఫాలో అవ్వండి.