
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా ఉన్న తెలుగు ప్రేక్షకుల్లో ప్యారడైజ్ మానియా స్టార్ట్ అయ్యిందని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి నాని చేస్తున్న ప్రమోషన్స్ ఆ విధంగా ఉన్నాయి. దీంతో ఫ్యాన్స్, ప్రేక్షకులు ప్యారడైజ్ ఎలా ఉంటుందో అని ఎవరికీ వారు కథకులు, దర్శకులుగా మారి ఆలోచించుకుంటున్న మంచి టైంలో నాని రీసెంట్ గా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
తాజాగా జరిగిన ప్రెస్ మీట్‌లో నాని మాట్లాడుతు కొన్ని సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి అనే నమ్మకం ఉండదు. మా ప్యారడైజ్ చిత్రం కూడా అలాంటిదే. కేవలం జెన్ జీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని తెరకెక్కించిన చిత్రమిది’ అంటూ చెప్పుకొచ్చాడు. విడుదలకు ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నాని అభిమానుల్లో సరికొత్త టెన్షన్ ని తెచ్చిపెట్టింది. ఎందుకంటే రీసెంట్ గా విడుదలైన ‘టాక్సిక్’ చిత్రాన్ని కూడా ఇదే తరహా లో ప్రమోట్ చేసి విడుదల చేశారు. కానీ ఆ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్యారడైజ్ కి కూడా అలాంటి ఫలితం వస్తే పరిస్థితి ఏంటో అని సోషల్ మీడియాలో కామెంట్స్ మొదలయ్యాయి.

Also Read: మృతి కేసులో ట్విస్ట్: టాప్ రాజకీయనాయకుడి పేరు బయటకి: 500 కోట్లు డిమాండ్!
ఏది ఏమైనా ఒక్కటి మాత్రం నిజం ప్యారడైజ్ కోసం నాని చాలా చాలా కష్టపడ్డాడు. మేకర్స్ పరిస్థితి కూడా అదే. కానీ కష్టపడ్డారని ప్రేక్షకులు హిట్ చెయ్యరు. కంటెంట్ బాగుంటే హిట్ చేస్తారు. మరి ప్యారడైజ్ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూద్దాం. 'A 'సర్టిఫికెట్ తో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.
[Nani, The Paradise, Nani Viral Comments On The Paradise Movie, Srikanth Odela, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]




