Home

»

Latest News

భూఆరోపణలపై సరికొత్త ట్విస్ట్: ఇక వాళ్ళకి నిద్ర ఉండదు

Sep 17, 2026 8:42PM


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పై భూకబ్జా ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై  మీడియా సముఖంగా మాట్లాడుతు 'నాపై వస్తున్న వార్తలన్నీ పూర్తిగా నిరాధారమైనవి. అందులో ఎలాంటి నిజం లేదు.  ఆ వివాదాస్పద భూమికి సంబంధించిన అన్ని హక్కులు తమకే స్పష్టంగా ఉన్నాయి.


దానికి తగిన లీగల్ డాక్యుమెంట్లు అన్నీ తమ వద్ద పక్కాగా ఉన్నాయి. తాము ఎలాంటి అక్రమ మార్గాల్లో భూమిలోకి ప్రవేశించలేదు. నేను, మరో వ్యక్తి సునీల్ కలిసి నానక్‌రామ్‌గూడలోని అసలైన రైతుల దగ్గరే  భూములని చట్టబద్ధంగా కొనుగోలు చేసాం. 

 

 


Also Read: అందర్నీ అలరిస్తుందనే నమ్మకం లేదు: ది పారడైజ్ పై నాని సంచలన కామెంట్స్


భూమి వద్ద ఉన్న గేట్లను తామే స్వయంగా పగులగొట్టారంటూ వస్తున్న ప్రచారమంతా కూడా అవాస్తవం. ఇతరుల ఆస్తులను ఆక్రమించే ఉద్దేశం మాకు ఎంత మాత్రం లేదు.  నిరాధారమైన ఆరోపణలతో కొందరు కావాలనే మా ప్రతిష్టని  దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారని చంద్రశేఖర్ రెడ్డి  మండిపడ్డారు. ఇక ఈ వీడియోతో చంద్ర శేఖర్ రెడ్డి యాంటీ బ్యాచ్ కి పెద్ద దెబ్బె.

 

[Allu Arjun, Allu Arjun Father In Law Chandrasekhar Reddy Clarifies Land Dispute, Nanakramguda land dispute, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com