LATEST NEWS
తెలంగాణ రాజకీయాల్లో భూ వివాదాలు మరోసారి తారస్థాయికి చేరాయి. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి, ప్రధాన ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితికి   మధ్య మాటల యుద్ధం  ముదిరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది. అయితే  అసంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఆన్ రికార్డ్ యటపెట్టిన భూముల వివరాలతో బీఆర్ఎస్ డిఫెన్స్ లో పడినట్లే కనిపిస్తోంది. ఆ పార్టీ చేస్తున్న ఎదురుదాడి ఆత్మరక్షణ యత్నంగా కనిపిస్తోందే తప్ప ప్రజలను నమ్మించడంలో విఫలమైంది. మామూలుగా సాధారణంగా రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శలు చేయడం వేరు.. సాక్షాత్తూ అసెంబ్లీ వేదికగా  సర్వే నంబర్లు, విస్తీర్ణాల ఆధారంగా లెక్కలు బయటపెట్టడం వేరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే పని చేశారు.   ధరణి పోర్టల్‌ను అడ్డం పెట్టుకుని పేద రైతుల భూములను లాక్కున్నారని, దీని వెనుక పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని సీఎం అన్నారు. ప్రాథమిక సమాచారం ఆధారంగానే ఈ వివరాలు బయటపెడుతున్నామని, పూర్తి స్థాయి ఫోరెన్సిక్ ఆడిట్,  లోతైన విచారణ జరిగితే మరిన్ని నిజాలు వెలుగులోకి వస్తాయని రేవంత్ రెడ్డి చెప్పారు.   ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా రేవంత్ వెల్లడించిన వివరాలను ఖండిస్తూనే.. కేసీఆర్ కుటుంబం ఆ భూములన్నీ నిజమే, వాటిని  మేం దాచిపెట్టిందేమీ లేదు, ఎన్నికల అఫిడవిట్లలో స్వయంగా పొందుపరిచినవే అని చెప్పుకుంటోంది. అవన్నీ తమకు తరతరాలుగా వస్తున్న వేల ఎకరాల వారసత్వ భూములున్నాయనీ, తమది జమీందారీ నేపథ్యమని చెప్పుకుంటోంది. అయితే.. ఇక్కడ కేసీఆర్ కుటుంబం మరీ ముఖ్యంగా కేసీఆర్ చిన్న లాజిక్ మరిచిపోయారు. 1973 నాటి భూమి పరిమితి చట్టం  ప్రకారం ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు మించి ఉండటానికి లేదన్న విషయాన్ని ఆయన ఉద్దేశపూర్వకంగానో లేదా నిజంగానే అయినా మరచిపోయారు.  దీంతో కల్వకుంట్ల కుటుంబం, బీఆర్ఎస్ రేవంత్ ఆరోపణలను తిప్పి కొట్టే ప్రయత్నం పెద్దగా ఫలిచడం లేదని పరిశీలకులు అంటున్నారు.   ఇక పోతే ఆ ఆరోపణల తీవ్రతను తగ్గిండానికి, ప్రస్తుతానికి తప్పించుకోవడానికి కేటీఆర్ పొలిటికల్ అస్త్రంగా సిట్టింగ్ జడ్డి విచారణ అంటూ సవాల్ చేస్తున్నారు.  అయితే..  సిట్టింగ్ జడ్జి విచారణ డిమాండ్ అనేది సమస్యను పక్కదారి పట్టించే, పాతచింతకాయపచ్చడి వ్యూహంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.  కేటీఆర్ డిమాండ్ కేవలం కాలయాపనకే తప్ప.. రేవంత్ రెడ్డి ఆరోపణలకు సమాధానం కాదని అంటున్నారు.  అన్నిటికంటే ప్రధానంగా... ఆ భూములు తమవేననీ, వాటిని చట్టబద్ధంగా కొన్నామనీ చెప్పుకుంటున్న కేటీఆర్   భూములు ఎవరి హయాంలో, ఎంత ధరకు  కొన్నారు అన్న వివరాలను వెల్లడించాల్సి ఉంది.  వాటిని కొనుగోలు చేయడానికి వెచ్చించిన నిధులు, అవి వచ్చిన మార్గం, దాని మూలాలు అన్నీ వివరించాల్సిన అవసరం ఉంది. అది వదిలేసి.. వ్యక్తిగత దూషణలు, ప్రత్యారోపణలు చేయడం వల్ల ఉపయోగం ఉండదు. ప్రత్యారోపణలు, వ్యక్తిగత దూషణలు ప్రజలలో కల్వకుంట్ల కుటుంబ వాదనను బలహీన పరుస్తాయో తప్ప మరో ప్రయోజనం ఉండదని పరిశీలకులు అంటున్నారు.  అన్నిటికీ మించి అవి వారసత్వ భూములు అన్న ఒక్క మాటతో ఈ వివాదాన్ని ముగించేయడం కల్వకుంట్ల కుటుంబానికి అంత తేలిక కాదు. ఏది ఏమైనా అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి సృష్టించిన ‘భూ’ కంపం కేసీఆర్ కుటుంబాన్ని, అలాగే బీఆర్ఎస్ పార్టీనీ ఆత్మరక్షణలో పడేసిందన్నది మాత్రం ఎవరూ కాదనలేని వాస్తవమని చెప్పాలి.  [Revanth Reddy, KCR Family Lands, BRS Counter Attack, Telangana Politics, Dharani Portal Row]
వైద్య రంగంలో జరిగే చిన్నపాటి తప్పులు ఒక్కోసారి మనుషుల జీవితాలనే తీవ్రంగా మార్చేస్తుంటాయి. అలాంటి ఒక విషాదకరమైన సంఘటన బెక్కీ జోన్స్ అనే మహిళ జీవితంలో చోటుచేసుకుంది. 2012లో ఆమె తీవ్రమైన మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లారు. వైద్యులు ఆమెకు బ్రెయిన్ స్కాన్ నిర్వహించగా మెదడులో ఒక పెద్ద మచ్చ కనిపించింది. ఆ మచ్చను చూసి అది ప్రమాదకరమైన బ్రెయిన్ ట్యూమర్ అని, ప్రాణాంతక క్యాన్సర్ అని వైద్యులు నిర్ధారించారు. చికిత్స వెంటనే ప్రారంభించకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని పదే పదే హెచ్చరించడంతో, ఆమె కీమోథెరపీ తీసుకోవడం ప్రారంభించారు. అది ఒక ఏడాది కాదు, రెండేళ్లు కాదు.. ఏకంగా 11 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. కొద్ది నెలల వ్యవధిలోనే ముగియాల్సిన మానసిక, శారీరక వేదన ఆమె జీవితంలో దాదాపు దశాబ్ద కాలానికి పైగా నిత్యకృత్యమైంది. కీమోథెరపీ వల్ల కలిగే తీవ్రమైన పార్శ్య ప్రభావాలు, వెంట్రుకలు రాలిపోవడం, వికారంగా ఉండటం, శరీరం బలహీనపడటం వంటి నరకయాతనను ఆమె ప్రతిరోజూ అనుభవించారు. చికిత్స ఆపేస్తే ఎక్కడ క్యాన్సర్ తిరగబెట్టి తన ప్రాణాలను తీస్తుందో అనే భయంతోనే ఆమె 11 ఏళ్ల పాటు ఆ నరకాన్ని భరిస్తూ వచ్చారు. అయితే 2025లో ఆమె వైద్య రిపోర్టులను కొందరు న్యూరోసర్జన్లు మరియు రేడియాలజిస్టులు మరొకసారి క్షణ్ణంగా పరిశీలించినప్పుడు అసలు షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. బెక్కీ జోన్స్‌కు అసలు ఎప్పుడూ బ్రెయిన్ క్యాన్సరే లేదని వైద్యులు తేల్చి చెప్పారు. స్కాన్‌లో కనిపిస్తున్న మచ్చ క్యాన్సర్ ట్యూమర్ కాదని, అది  ట్యూమర్‌ఫ్యాక్టివ్ డిమైలినేషన్  అనే అరుదైన నాడీ సంబంధిత సమస్య అని స్పష్టం చేశారు. నరాల పొర దెబ్బతినడం వల్ల వచ్చే ఒక రకమైన వాపు కారణంగా అది స్కాన్‌లో చూడటానికి హానికరమైన ట్యూమర్‌లా కనిపించిందని వివరించారు. ఈ నిజం తెలుసుకున్న బెక్కీ జోన్స్‌కు ఉపశమనం లభించడం కంటే తీవ్రమైన దిగ్భ్రాంతి, వేదన మిగిలాయి. తన జీవితంలోని అమూల్యమైన 11 సంవత్సరాల కాలాన్ని, ఆరోగ్యాన్ని కేవలం ఒక తప్పుడు వైద్య నిర్ధారణ వల్ల అనవసరంగా కోల్పోయానని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.  నాకు అసలు బ్రెయిన్ ట్యూమరే లేదు, పదేళ్లకు పైగా ఏ కారణం లేకుండానే నరకాన్ని అనుభవించాను  అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన అరుదైన లేదా క్లిష్టమైన వైద్య పరీక్షలు ఎదురైనప్పుడు సెకండ్ ఒపినియన్ ఎంత కీలకమో అందరికీ కన్నువిప్పు కలిగిస్తోంది.     [ Becky Jones, Medical Misdiagnosis, Brain Tumor, Tumefactive Demyelination, Brain Scan, Chemotherapy, Neurology, Neurosurgery, Radiology, Second Opinion ]
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. ! తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ అలాగే వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన జారీ చేసింది. వచ్చే ఏడాది 2027 మార్చి నెలలో సిట్టింగ్ ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో, ఈ రెండు స్థానాలకు కొత్తగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జూరీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి షెడ్యూల్‌ను అధికారులు తాజాగా విడుదల చేయడంతో పట్టభద్రుల్లో ఉత్కంఠ నెలకొంది.  ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలనుకునే అర్హులైన అభ్యర్థుల కోసం అధికారిక యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టింది.  ఈ ప్రత్యేక ఓటర్ల నమోదు ప్రక్రియకు సంబంధించి సెప్టెంబర్ 28వ తేదీన అధికారికంగా ప్రజా నోటీసు లేదా ప్రకటన వెలువడనుంది. నవంబర్ 1, 2026 నాటికి డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత సాధించిన పట్టభద్రులందరూ ఈ ఓటర్ల నమోదుకు పూర్తిగా అర్హులుగా ఉంటారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అర్హులైన నిరుద్యోగులు, ఉద్యోగులు మరియు పట్టభద్రులు తమ ఓటు హక్కు కోసం నవంబర్ 6వ తేదీ వరకు ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.  అక్టోబర్ 15న పత్రికల్లో తొలి పునఃప్రచురణ, అక్టోబర్ 25న రెండో పునఃప్రచురణ చేపట్టనున్నారు. గడువు ముగిసిన తర్వాత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నవంబర్ 25వ తేదీన ముసాయిదా (డ్రాఫ్ట్) ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు.  ఒకవేళ ముసాయిదా జాబితాలో పేర్లు లేకపోతే లేదా తప్పులు ఉంటే, వాటి సవరణలు మరియు అభ్యంతరాల స్వీకరణ కోసం నవంబర్ 25 నుండి డిసెంబర్ 10వ తేదీ వరకు ప్రత్యేక సమయం కేటాయించడం జరిగింది.  ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను నిశితంగా పరిశీలించి అన్ని రకాల మార్పు చేర్పులు పూర్తి చేసిన అనంతరం, డిసెంబర్ 30వ తేదీన తుది ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేయనున్నట్లు ఎన్నికల సంఘం తేల్చిచెప్పింది. అయితే, ఇక్కడ పట్టభద్రులు అత్యంత గమనించాల్సిన కీలక విషయం ఏమిటంటే.. గతంలో పాత ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నవారు సైతం ఈసారి కొత్తగా మార్పు చేసిన ఫారం-18 ద్వారా విధిగా దరఖాస్తు చేసుకోవాలని ఈసీ స్పష్టం చేసింది. దరఖాస్తుతో పాటు అర్హతకు సంబంధించిన ధ్రువీకరించిన సర్టిఫికెట్ల కాపీలను జతచేయాల్సి ఉంటుంది. పట్టభద్రులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సకాలంలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.        [ graduate mlc elections, telangana voters list, form 18 registration, mlc election schedule, telangana news, graduate voters, Mlc Tinmar Malanna, Telugu one, Telugu News ]
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో తెలంగాణ భూములపై చేసిన ప్రసంగం ప్రకంపనలు సృష్టించింది. రాజకీయ నాయకులకు భూమి, భారీ ప్రాజెక్టుల్లో కమిషన్లు అనేవి ప్రధాన ఆదాయ వనరులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ భూమికి సంబంధించిన అక్రమాలు, కబ్జాలు లెక్కకు మించి జరిగాయనే విమర్శలు ఉన్నాయి.  దీనికి సంబంధించి అధికార, ప్రతిపక్ష సభ్యులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. బడా రాజకీయ నాయకుల నుంచి గ్రామ స్థాయి రాజకీయ నాయకుల వరకు భూకబ్జాలకు, అక్రమ భూఆక్రమణలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ప్రచారంలో ఉన్నాయి.   పోరంబోకు, అటవీ, అసైన్డ్ భూములు ఆక్రమణకు గురయ్యాయి. వాటిని ధరణి ద్వారా న్యాయబద్దత లేదా చట్టబద్ధత కల్పించుకోవడానికి ప్రయత్నించారనే ఆరోపణలు కూడా వున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల్లో నిజం వుంది. అయితే, ఇది బిఆర్ఎస్ నాయకులకు మాత్రమే వర్తిస్తుందా, కాంగ్రెస్ పార్టీ నాయకులకు వర్తించదా అనేది ప్రశ్న. అదికారంలో వున్న పార్టీకి భూములను భుక్తం చేసుకునే వెసులుబాటు ఎక్కువగా వుంటుంది. చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది. ఈ చట్టానికి లోబడి భూమిని కలిగి వుండేలా చాలా మంది జాగ్రత్త పడి వుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో అది అతిక్రమణకు గురైంది. భూ పరిమితి చట్టం అమలులో వుందనే విషయం తెలియని ఓ నాయకుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను సమర్పించిన అఫిడవిట్‌లో 110 ఎకరాలు ఉన్నట్లు చెప్పుకున్నాడు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి టిఆర్ఎస్, ఆ తర్వాతి బిఆర్ఎస్ ప్రభుత్వాలు భూ హక్కుల పాబందిని ధ్వంసం చేశాయి. ఆ విధ్వంసం బహుశా 2018 నుంచి ఎక్కువగా జరుగుతూ వచ్చింది. ఆ ఏడాది నుంచి పహణీ రాయడం ఆపేశారు. పహాణీ అనేది భూ యాజమాన్యాన్ని పక్కా చేస్తుంది. అంటే ఏ భూమి ఎవరి పేరు మీద వుందనే విషయాన్ని అది తేటతెల్లం చేస్తుంది.  ఇది వేర్వేరు సర్వే నెంబర్లలో ఒక వ్యక్తి కలిగి వున్న భూమిని తెలియజేస్తుంది. ఆసామీవారి ఖాతాలు మాయమయ్యాయి.  పట్వారీ వ్యవస్థను ఎన్‌టీ రామారావు ప్రభుత్వం రద్దు చేస్తే, వీఆర్వో వ్యవస్థను కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేసింది మస్కూర్ వ్యవస్థను కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఒక గ్రామంలో ఏ భూమి ఎవరి పేరు మీద ఉందనే విషయం తెలియకుండా పోయింది, ఆర్డీవోలకు ఉన్న హక్కులను రద్దు చేసి కలెక్టర్ చేతిలో పెట్టారు. దీంతో భూముల యాజమాన్య హక్కులు తెలుసుకోవడం సమస్యగా తయారైంది. రాత్రికి రాత్రి బలవంతులు భూములను ధరణిలో ఎక్కించుకుని కబ్జాలు చేసిన వైనాలున్నాయనే విషయం ఏ గ్రామానికి వెళ్లినా తెలుస్తుంది. దీంతో గ్రామాల్లో భూ తగాదాలు పెరిగాయి.  కేసీఆర్ ప్రభుత్వం భూములకు సంబంధించి కొత్త పద్ధతి ప్రవేశపెట్టడం వల్ల కూడా భూ యాజమాన్యానికి సంబంధించిన వివరాలు తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. ఎవరైనా తమ భూమి వివరాలను దాచి పెట్టుకునే అవకాశం అది. అంటే ఒక వ్యక్తి తన భూమి వివరాలను రెండో కంటికి కనిపించకుండా దాచి పెట్టుకోవచ్చు  రేవంత్ రెడ్డి భూ వివరాలను బయటపెడతానని చెబుతున్నారు. కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ మీద చాలా గట్టి ప్రకటనే చేశారు. దాన్ని అమలు చేస్తారా, లేదా అనేది తర్వాతి విషయం. బీఆర్ఎస్ బడా నేతల భూముల లెక్కలు కూడా చెప్పారు. కాంగ్రెస్ నాయకులు, ఇతర పార్టీల నాయకుల భూముల వివరాలను కూడా బయటపెడతారా, చూడాలి.  మరో విషయం..  చోటా మోటా నాయకులు గ్రామాల్లో వందల ఎకరాలు సంపాదించుకున్న వైనం కూడా వుంది. వాటిని బయటకు తీస్తారా? రేవంత్ రెడ్డి మీద కూడా భూములకు సంబంధించి ఆరోపణలు వున్నాయి. తన విషయాన్ని ఆయన స్పష్టం చేస్తారా? తెలంగాణలో భూమి అనేదే ఇప్పుడు ప్రధానమైన చర్చ. దాని అంతు తేలిస్తే చాలా సమస్యలకు పరిష్కారం లభించవచ్చు. అందుకు రాజకీయ నాయకులు సిద్ధపడుతారా అనేది సందేహం. Telangana Lands, Telangana Politcs, Revanth reddy, KCR, BRS, Dharni, Telugu One
భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక సరికొత్త మైలురాయిగా నిలిచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదిన వేడుకలు మరియు ఆయన ప్రజా జీవితంలో అప్రతిహతంగా పాతికేళ్లు  పూర్తి చేసుకున్న సందర్భంగా వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం (సెప్టెంబర్ 17) ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.    సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా ఒక నెల రోజుల పాటు కొనసాగే సేవ మరియు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు  ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గం కాశీ నగరంలో  గురువారం (సెప్టెంబర్ 17) శ్రీకారం చుట్టారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రధాని మోదీ జన్మస్థలమైన గుజరాత్‌లోని వడ్నగర్ నుండి వారణాసి వరకు  అలాగే వారణాసి నుండి వడ్నగర్ వరకు రెండు భారీ బైక్ ర్యాలీలను అగ్రనేతలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ యాత్రలు  10 రాష్ట్రాల గుండా ప్రయాణించి, 193 జిల్లాలు మరియు దాదాపు 1,159 గ్రాగాలను తాకుతూ అక్టోబర్ 7న ముగియనున్నాయి. ఈ బృహత్తర బైక్ ర్యాలీలు మొత్తం 40,000 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయనుండగా, ఇందులో  వెయ్యి మంది  భాగస్వాములు కావడం విశేషం. ఈ  కార్యక్రమంలో  పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ నుండి బయలుదేరి వారణాసి  చేరుకున్నారు. అక్కడ తొలుత ప్రసిద్ధ శ్రీ కాశీ విశ్వనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, రుద్రాక్ష ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన సేవా యాత్ర ప్రారంభ వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఇదే సమయంలో గుజరాత్‌లోని వడ్నగర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తదితరులు వ్యతిరేక దిశ నుంచి సాగే బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ యాత్రల ద్వారా దేశవ్యాప్తంగా ప్రతి గ్రామానికి, ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేరవేయడంతో పాటు, ప్రజా భాగస్వామ్యం,  సామాజిక బాధ్యత ప్రాముఖ్యతను చాటిచెప్పాలన్నది  లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒకవైపు వారణాసిలో కాశీ విశ్వనాథ ధామ్‌లో పవిత్ర జలాలతో జలాభిషేకం చేసేందుకు దేశంలోని వివిధ నదుల నుండి నీటిని సేకరించి ఈ యాత్ర ద్వారా తరలిస్తున్నారు.   నెల రోజుల పాటు సాగే  సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా రక్తదాన శిబిరాలు, ఆరోగ్య పరీక్షలు, స్వచ్ఛతా కార్యక్రమాలు, అట్టడుగు స్థాయి లబ్ధిదారుల సన్మానం,  వికసిత్ భారత్-2047 లక్ష్యంగా పలు యువజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గ గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమై, దేశ ప్రధాని స్థాయి వరకు సాగిన మోదీ పరిపాలనా ప్రస్థానాన్ని, సంక్షేమ పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.  [Seva Sankalp Abhiyan, PM Modi birthday, Chandrababu Naidu Varanasi, Yogi Adityanath, Vadnagar Varanasi bike rally, NDA leaders Varanasi, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
  మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఏం చేసినా అందులో వైవిధ్యం అనేది ఉండటం పక్కా. సామాజిక సేవ పరంగా కూడా ఆ వైవిధ్యాన్ని ప్రదర్శించడంలో  ఏ మాత్రం వెనుకాడడు. అందుకు  ఈ రోజు జరుగుతున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సాక్ష్యం. సినీ, రాజకీయ, సామాజిక ప్రముఖులు మోదీకి జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తున్నారు. అయితే  చరణ్ మాత్రం కేవలం శుభాకాంక్షలకే పరిమితం కాకుండా, సమాజానికి మేలు చేకూరే ఒక అద్భుతమైన సామాజిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దేశాభివృద్ధిలో మహిళా సాధికారతే కీలకమని నమ్ముతున్న చరణ్, మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని చేపట్టిన ఒక బృహత్తర ప్రకటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో  ట్రెండ్ అవుతోంది. మోదీ నిరంతరం దేశం కోసం చేస్తున్న నిస్వార్థ సేవలు, వికసిత్ భారత్ సాధన కోసం ఆయన చూపుతున్న దూరదృష్టి తనకు ఎంతగానో స్ఫూర్తినిచ్చాయని రామ్ చరణ్ తెలిపారు. ఈ స్ఫూర్తితోనే బిజెపి ప్రారంభించిన ‘సేవా సంకల్ప్ అభియాన్’ అనే మహత్తర కార్యక్రమంలో తాను కూడా భాగస్వామిని అవుతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ అభియాన్ లో భాగంగా రామ్ చరణ్ ఒక కీలకమైన హామీ ఇచ్చారు. రాబోయే కొద్ది నెలల్లో సరిగ్గా 1000 మంది మహిళలకు ఉచితంగా స్కిల్ డెవలప్‌మెంట్ (నైపుణ్యాభివృద్ధి) శిక్షణ అందించనున్నట్లు ప్రకటించాడు.     Also read: సూర్య కొత్త మూవీ టీజర్ వచ్చేసింది: రామాయణకి పోటీ తప్పదా!  ఈ 1000 మంది మహిళలకు ఇచ్చే నైపుణ్య శిక్షణ వల్ల వారు స్వయం ఉపాధి అవకాశాలను పొంది తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపుకోగలుగుతారు. కేవలం సోషల్ మీడియా వేదికగా విష్ చేసి ఊరుకోకుండా, ఏకంగా 1000 మంది మహిళల జీవితాలను మార్చే దిశగా అడుగులు వేయడం చరణ్ యొక్క ఉదారతకు, సామాజిక బాధ్యతకి  అద్దం పడుతోంది.       [Ram Charan, Modi, Upasana, Ram charan Joins Seva Sankalp Abhiyan Pledges Skill Development,Seva Sankalp Abhiyan, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]  
    హిట్టు నా ఇంటి పేరు.. సూపర్ హిట్ నా ఒంటి పేరు అంటూ కరుప్పు( వీరభద్రుడు), విశ్వనాధ్ అండ్ సన్స్ తో  సూర్య ఫామ్ లో ఉన్న విషయం తెలిసిందే. రాబోయే మూవీ కూడా అదే  ఫామ్ ని కంటిన్యూ పక్కా అంటూ అప్ కమింగ్ మూవీ 'సీన్' తో రాబోతున్నాడు. అవును 'జితు మాధవన్' దర్శకత్వంలో చేస్తున్న సూర్య 47వ చిత్రానికి  'సీన్' (Scene) అనే  టైటిల్‌ని  ఖరారు చేస్తూ చిత్రబృందం ఒక గ్లింప్స్ టీజర్‌ ని కాసేపటి క్రితం విడుదల చేసింది.  సుమారు నిమిషం 15 సెకన్లు ఉన్న టీజర్  చూస్తుంటే  సూర్య క్యారక్టర్ ఊహించని షేడ్స్ లో సాగబోతుందనే విషయం అర్ధమవుతూ ఉంది. పక్కా  యాక్షన్ ఎంటర్ టైనర్ అనే విషయం తెలుస్తుండటంతో ఈ సారి గత రెండు చిత్రాలకి భిన్నంగా సరికొత్త సూర్య మెస్మరైజ్ చేయడం పక్కా. సూర్య సొంత నిర్మాణ సంస్థ '2D ఎంటర్‌టైన్‌మెంట్స్' మరియు కొత్తగా స్థాపించిన 'ఝగరం స్టూడియోస్' బ్యానర్లపై జ్యోతిక, సూర్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నజ్రియా నజీమ్, 'ప్రేమలు' ఫేమ్ నాస్లేన్, ఆనంద్ రాజ్, జాన్ విజయ్ మరియు ప్రముఖ యూట్యూబర్ రాజ్ ప్రియన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టైటిల్ టీజర్ విడుదలైన కేవలం కొద్ది సమయంలోనే యూట్యూబ్‌లో 15 మిలియన్లకు పైగా డిజిటల్ వ్యూస్ దాటేసి సోషల్ మీడియాలో విశేషంగా ట్రెండ్ అవుతోంది. Also Read: భూఆరోపణలపై సరికొత్త ట్విస్ట్: ఇక వాళ్ళకి నిద్ర ఉండదు మలయాళ చిత్రసీమలో తన సరికొత్త మ్యూజిక్‌తో సంచలనాలు సృష్టించిన సుషిన్ శ్యామ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. సుషిన్ కి మొదటి తమిళ చిత్రం కావడంతో ఆడియో లవర్స్ మరియు అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి దీపావళి కానుకగా నవంబర్ 6, న  రిలీజ్ కానుంది. రామాయణ పార్ట్ 1  కూడా అదే రోజు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇండియా వైడ్ గా మాత్రం 8 న రిలీజ్. ఈ నేపథ్యంలో ఇప్పుడు సీన్ vs  రామాయణ గా పిలుచుకోవాల్సిన పరిస్థితి. ఫాహద్ ఫాజిల్ తో 'ఆవేశం' తెరకెక్కించి 150 కోట్ల మార్కుని అందుకున్న జితు మాధవన్ దర్శకుడు.       [Scene Teaser, Suriya, Jithu Madhavan, Nazriya Nazim, Naslen, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]  
భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది. రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు విష్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సినీ దిగ్గజాలు, అగ్ర కథానాయకులు ప్రధానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన సేవలను కొనియాడారు. మెగాస్టార్ చిరంజీవి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, కింగ్ అక్కినేని నాగార్జున తదితర ప్రముఖులు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రధాని మోదీ ప్రజాసేవను, దేశాభివృద్ధి పట్ల ఆయనకున్న అంకితభావాన్ని ప్రశంసించారు. మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ .. నవభారత నిర్మాణంలో ప్రధాని చూపుతున్న క్రమశిక్షణ, దూరదృష్టి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. దేశాన్ని ఆత్మనిర్భర్ భారత్ దిశగా నడిపిస్తున్న ఆయనకు నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ సుదీర్ఘ సందేశాన్ని ఇస్తూ.. గత పాతిక సంవత్సరాలుగా ప్రజాసేవకే అంకితమైన మోదీ నాయకత్వం ఎంతో ఆదర్శవంతమైనదని కొనియాడారు. భారత ప్రాభవాన్ని ప్రపంచ స్థాయిలో పెంపొందించడంలో ప్రధాని కృషి అపూర్వమని పవన్ విష్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎక్స్‌లో స్పందిస్తూ.. "ఎప్పుడూ విశ్రమించకుండా, నిరంతరం దేశ సంక్షేమమే పరమావధిగా శ్రమించే మహోన్నత నాయకుడు ప్రధాని మోదీ" అని కొనియాడారు. ఆయన స్ఫూర్తి ప్రతి భారతీయుడిలో నిండుగా ఉందని విష్ చేశారు. కింగ్ అక్కినేని నాగార్జున సైతం ప్రధాని మోదీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, దేశాన్ని మరింత ప్రగతి పథంలోకి తీసుకెళ్లడానికి ఆయనకు భగవంతుడు మరింత శక్తిని ఇవ్వాలని ఆకాంక్షించారు. ప్రధాని మోదీకి టాలీవుడ్ స్టార్స్ శుభాకాంక్షలు తెలిపిన పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అభిమానులు, నెటిజన్లు ఈ పోస్టులను రీట్వీట్ చేస్తూ ప్రధానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పై భూకబ్జా ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై  మీడియా సముఖంగా మాట్లాడుతు 'నాపై వస్తున్న వార్తలన్నీ పూర్తిగా నిరాధారమైనవి. అందులో ఎలాంటి నిజం లేదు.  ఆ వివాదాస్పద భూమికి సంబంధించిన అన్ని హక్కులు తమకే స్పష్టంగా ఉన్నాయి. దానికి తగిన లీగల్ డాక్యుమెంట్లు అన్నీ తమ వద్ద పక్కాగా ఉన్నాయి. తాము ఎలాంటి అక్రమ మార్గాల్లో భూమిలోకి ప్రవేశించలేదు. నేను, మరో వ్యక్తి సునీల్ కలిసి నానక్‌రామ్‌గూడలోని అసలైన రైతుల దగ్గరే  భూములని చట్టబద్ధంగా కొనుగోలు చేసాం.      Also Read: అందర్నీ అలరిస్తుందనే నమ్మకం లేదు: ది పారడైజ్ పై నాని సంచలన కామెంట్స్ భూమి వద్ద ఉన్న గేట్లను తామే స్వయంగా పగులగొట్టారంటూ వస్తున్న ప్రచారమంతా కూడా అవాస్తవం. ఇతరుల ఆస్తులను ఆక్రమించే ఉద్దేశం మాకు ఎంత మాత్రం లేదు.  నిరాధారమైన ఆరోపణలతో కొందరు కావాలనే మా ప్రతిష్టని  దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారని చంద్రశేఖర్ రెడ్డి  మండిపడ్డారు. ఇక ఈ వీడియోతో చంద్ర శేఖర్ రెడ్డి యాంటీ బ్యాచ్ కి పెద్ద దెబ్బె.   [Allu Arjun, Allu Arjun Father In Law Chandrasekhar Reddy Clarifies Land Dispute, Nanakramguda land dispute, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]  
మలయాళంలో విలక్షణమైన కథాంశాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు సైజు కురుప్. ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘భరత్ నాట్యం’. థియేటర్లలో మంచి విజయాన్ని సాధించిన ఈ చిత్రం ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ (Aha) లో అందుబాటులోకి వచ్చి డిజిటల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కథ విషయానికొస్తే.. భరత్ నాయుడు (సాయికుమార్) పదవీ విరమణ పొంది కుటుంబంతో సరదాగా గడుపుతుంటాడు. ఆయన పెద్ద కొడుకు శశిధర్ (సైజు కురుప్) ఇంటి వ్యవహారాలు, పొలం పనులు చూసుకుంటుంటాడు. అంతా సజావుగా సాగుతున్న సమయంలో హఠాత్తుగా భరత్ నాయుడికి గుండెపోటు వస్తుంది. ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న తండ్రి, తనకు ‘రుక్మిణి’ అనే మరో భార్య, ‘అజయ్’ అనే కొడుకు ఉన్నారనే నిజం శశిధర్‌కి చెప్పి వాళ్లను చూడాలని కోరతాడు. తండ్రి చివరి కోరిక అని భావించి శశిధర్ రహస్యంగా ఆ రెండో కుటుంబాన్ని ఇంటికి తీసుకొస్తాడు. కానీ ఊహించని విధంగా తండ్రి కోలుకోవడంతో అసలు డ్రామా మొదలవుతుంది. ఆ రెండో కుటుంబం ఊళ్లో ఎవరి కంటా పడకుండా ఇంటి పైగదిలోనే దాచిపెడుతూ శశిధర్ పడే పాట్లు, ఆస్తి ఎక్కడ చేజారిపోతుందోననే భయం కథను ఎంతో వినోదాత్మకంగా ముందుకు నడిపిస్తాయి. దర్శకుడు క్రిష్ణదాస్ మురళి ఈ కథను ఎక్కడా బోర్ కొట్టకుండా సున్నితమైన హాస్యంతో మలిచారు. ముఖ్యంగా మొదటి భార్య కొడుకు, రెండో భార్య కొడుకును పోలికల విషయంలో కన్ఫ్యూజ్ చేస్తూ నడిపించే ట్రాక్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ఆశలు, అవసరాలు మానవ సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో సహజంగా చూపించారు. నటీనటుల పనితీరు విషయానికి వస్తే సైజు కురుప్ తన నటనతో మరోసారి మెప్పించారు. ఆస్తిని కాపాడుకోవడానికి పడే తపన, తండ్రి రహస్యం బయటపడకుండా చేసే విన్యాసాల్లో ఆయన కామెడీ టైమింగ్ అద్భుతంగా కుదిరింది. సాయికుమార్, అభినవ్ రాధాకృష్ణన్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సాంకేతికంగా బబ్లూ సినిమాటోగ్రఫీ, శామ్యూల్ అబీ అందించిన నేపథ్య సంగీతం సినిమా మూడ్‌కి సరిగ్గా సరిపోయాయి. నిర్మాణ విలువలు కూడా కంటెంట్‌కి తగ్గట్టుగా కుదిరాయి. మొత్తానికి ‘భరత్ నాట్యం’ ఓ చక్కటి ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్. బంధాలు, ఆస్తుల చుట్టూ తిరిగే ఈ కన్ఫ్యూజన్ డ్రామాను కుటుంబ సమేతంగా హాయిగా చూసి ఆస్వాదించవచ్చు.       [Bharath Natyam Review, Aha OTT Telugu, Saiju Kurup, Krishnadas Murali, Malayalam Telugu Dubbed Movie]
  ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా ఉన్న తెలుగు ప్రేక్షకుల్లో ప్యారడైజ్ మానియా స్టార్ట్ అయ్యిందని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి  నాని చేస్తున్న ప్రమోషన్స్  ఆ విధంగా ఉన్నాయి. దీంతో ఫ్యాన్స్, ప్రేక్షకులు ప్యారడైజ్ ఎలా ఉంటుందో అని ఎవరికీ వారు కథకులు, దర్శకులుగా మారి ఆలోచించుకుంటున్న మంచి టైంలో నాని రీసెంట్ గా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. తాజాగా జరిగిన ప్రెస్ మీట్‌లో  నాని మాట్లాడుతు కొన్ని సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి అనే నమ్మకం ఉండదు. మా ప్యారడైజ్ చిత్రం కూడా అలాంటిదే. కేవలం జెన్ జీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని తెరకెక్కించిన చిత్రమిది’ అంటూ చెప్పుకొచ్చాడు. విడుదలకు ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నాని అభిమానుల్లో సరికొత్త టెన్షన్ ని తెచ్చిపెట్టింది. ఎందుకంటే రీసెంట్ గా విడుదలైన ‘టాక్సిక్’ చిత్రాన్ని కూడా ఇదే తరహా లో ప్రమోట్ చేసి విడుదల చేశారు. కానీ ఆ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్యారడైజ్ కి కూడా అలాంటి ఫలితం వస్తే పరిస్థితి ఏంటో అని సోషల్ మీడియాలో కామెంట్స్ మొదలయ్యాయి.      Also Read: మృతి కేసులో ట్విస్ట్: టాప్ రాజకీయనాయకుడి పేరు బయటకి: 500 కోట్లు డిమాండ్!  ఏది ఏమైనా ఒక్కటి మాత్రం నిజం ప్యారడైజ్ కోసం నాని చాలా చాలా కష్టపడ్డాడు. మేకర్స్ పరిస్థితి కూడా అదే. కానీ కష్టపడ్డారని ప్రేక్షకులు హిట్ చెయ్యరు. కంటెంట్ బాగుంటే హిట్ చేస్తారు. మరి ప్యారడైజ్ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూద్దాం. 'A 'సర్టిఫికెట్ తో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.    [Nani, The Paradise, Nani Viral Comments On The Paradise Movie, Srikanth Odela, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
తమిళ చిత్రసీమలో విభిన్నమైన కాన్సెప్ట్‌లతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం సాధించే చిన్న చిత్రాలకు కొదవలేదు. అలా ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను విశేషంగా అలరించిన తమిళ రొమాంటిక్ కామెడీ చిత్రం ‘మొద రాత్రి’ ఇప్పుడు ఓటీటీ ప్రియులను పలకరించడానికి సిద్ధమైంది. ఈ సినిమా ప్రముఖ డిజిటల్ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ స్ట్రీమింగ్‌కు రాబోతోంది. పెద్దలు కుదిర్చిన పెళ్లి, ఆ తర్వాత జరిగే శోభనం అనే ఆసక్తికరమైన నేపథ్యంతో ఈ చిత్రాన్ని దర్శకుడు రాజా కరుప్పస్వామి ఎంతో వినోదాత్మకంగా తెరకెక్కించారు. రిషికాంత్, అనిష్మా అనిల్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 18వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ 'నెట్‌ఫ్లిక్స్' (Netflix) లో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, మరియు హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి వస్తుండటంతో దక్షిణాది డిజిటల్ ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. కథ విషయానికొస్తే.. అసలు పరిచయమే లేని ఒక యువకుడు, యువతి పెద్దలు కుదిర్చిన వివాహబంధంతో ఒకటవుతారు. వివాహానంతరం వారి శోభనానికి ముహూర్తం నిశ్చయమవుతుంది. అయితే ఆ ప్రత్యేకమైన రాత్రి వారి జీవితాల్లోని ఊహించని రహస్యాలు బయటపడటం, దానివల్ల ఉత్పన్నమయ్యే వరుస హాస్య ఘట్టాలు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతాయి. భారత్ శంకర్ అందించిన స్వరాలు, వినోదాత్మక సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి. థియేటర్లలో చిన్న సినిమాగా వచ్చి మంచి కలెక్షన్లు సాధించిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్, ఓటీటీలో కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ చిత్రం ఓటీటీ విడుదలపై మంచి చర్చ జరుగుతోంది. శోభనం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే కామెడీ డ్రామాలకు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది కాబట్టి, ఈ చిత్రం వీకెండ్ వినోదానికి మంచి ఆప్షన్ అవుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని ప్రధాన భాషలకు సంబంధించిన స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్, ఐదు భాషల్లో ఒకేసారి విడుదల చేస్తుండటంతో ఈ ఓటీటీ రిలీజ్ పై మంచి స్పందన లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.     [Modha Rathiri OTT Release, Netflix Telugu Movies, Rishikanth, Anishma Anil Kumar, Tamil Romantic Comedy]
Venkatesh and Trivikram Srinivas has come together for Aadarsha Kutumbam - AK47 film after a long time. The movie has Srinidhi Shetty, Nivetha Pethuraj among the cast with Nara Rohith. The movie is produced by Haarika Haasine Creations and it is schduled for 2nd October release.  According to industry talk, a song is presently being shot and is expected to be wrapped up by this weekend. The team would then reportedly need another two to three days for patchwork, with the entire shooting process likely to be completed only around September 24.  That would leave the makers roughly a week for the remaining post-production work before the release. This has now triggered speculation that the film could be pushed by a week to October 9.  The team is said to be waiting for the shooting to conclude before taking a final call on the release date. For now, October 2 remains the officially announced date, while the possible change is only industry gossip. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  యూట్యూబర్ గా రాణించడమంటే అంత తేలికైన విషయం కాదు. అలాంటిది ఆ రంగాన్ని ఎంచుకొని ఎంతో మంది అభిమానాన్ని  సంపాదించుకుంది చిత్తరి వైష్ణవి  సుమారు 50,000 మందికి పైగా సబ్‌స్క్రైబర్లతో గ్రామీణ జీవనశైలి వీడియోలతో అలరించిన 20 ఏళ్ల వైష్ణవి, 3 నెలల గర్భిణిగా ఉన్న సమయంలోనే దారుణ హత్యకు గురైంది. పెళ్లయిన 10 నెలలకే అదనపు కట్నం వేధింపుల కారణంగా భర్త గందం హరిబాబు కత్తులతో విచక్షణారహితంగా పొడిచి ఆమెను పొట్టనబెట్టుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో కేసు నమోదై జైలుకు వెళ్లిన నిందితుడు హరిబాబు ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చాడు. అయితే, బెయిల్‌పై బయట తిరుగుతున్న హరిబాబుపై తాజాగా ప్రతీకార దాడి జరగడం మళ్లీ కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అత్యంత రద్దీగా ఉండే ఆర్‌ఆర్‌ చౌరస్తాలో  హరిబాబు ప్రయాణిస్తున్న కారును లక్ష్యంగా చేసుకుని గుర్తుతెలియని దుండగులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. కారులో వచ్చిన నిందితులు హరిబాబుపై కత్తులు, వేటకొడవళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన 26 ఏళ్ల హరిబాబు రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు, దారిన పోయే ప్రయాణికులు చూస్తుండగానే నడిరోడ్డుపై ఈ పగతీర్చుకునే హత్య జరగడంతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి. దాడి చేసిన వెంటనే దుండగులు కారులో వేగంగా పరారయ్యారు. Also Read: శోభిత అక్కినేని ఆసక్తికర పోస్ట్: మన శత్రువులు ఎవరో తెలుసా.. ఫ్యాన్స్ షాక్! గతంలో జరిగిన వైష్ణవి దారుణ హత్యకు ప్రతీకారంగానే ఈ దాడి జరిగిందా లేదా ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విస్తృతంగా దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆర్‌ఆర్‌ చౌరస్తా పరిసరాల్లోని సిసిటివి (CCTV) కెమెరాల దృశ్యాలను విశ్లేషిస్తూ నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. వైష్ణవి కుటుంబం చుట్టూ తిరిగిన పగ మరియు కట్నం వివాదాలే ఈ వరుస హత్యలకు మూలమని స్థానికులు చర్చించుకుంటున్నారు.     [YouTuber Vaishnavi, YouTuber Vaishnavi Husband Murder, Nizamabad crime news, Haribabu murdered, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]  
Nani’s The Paradise is gearing up for a theatrical release on September 24, and the actor has begun the film’s promotional tour with director Srikanth Odela. The duo interacted with the media in Chennai as part of the promotions for the highly anticipated action drama. Speaking about the film, Nani said, “The Paradise is the kind of mass film that I am waiting to watch on the big screen. I love films with a strong emotional core, and even though this film has a lot of action, the mother emotion connects with the audience.” He also praised Anirudh Ravichander’s music and said his song with Kayadu Lohar would be another special attraction. Nani also opened up about his character Jadal and expressed confidence that the role would stay with audiences after the film’s release. “People will identify me as Jadal post release. I am confident that everyone will have a blasting theatrical experience,” he said, while promising an intense and emotional theatrical experience. Srikanth Odela revealed that The Paradise revolves around a revolution and an uprising against oppression, with the story drawing from real incidents he witnessed in his hometown. The director stressed that the film combines a grand revolutionary setting with a strong mother-son emotional core. Produced by Sudhakar Cherukuri, the film also stars Kayadu Lohar, Mohan Babu, Raghav Juyal and Sonali Kulkarni in prominent roles, with Anirudh composing the music. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
మన ఆరోగ్య సంరక్షణలో పీచు పదార్థం లేదా ఫైబర్ (Fiber) పాత్ర ఎంత కీలకమైనదో అందరికీ తెలిసిందే. జీర్ణక్రియ మెరుగుపడాలన్నా, మలబద్ధకం సమస్య దూరమవ్వాలన్నా, బరువు అదుపులో ఉండాలన్నా ప్రతీ ఒక్కరూ ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోమని సలహా ఇస్తుంటారు. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, చిరుధాన్యాలు మరియు పప్పుధాన్యాలలో లభించే ఈ పీచు పదార్థం పేగులలోని మంచి బాక్టీరియాకు ఆహారంగా పనిచేసి పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అయితే, ఏదైనా అతిగా తింటే అమృతమైనా విషమవుతుందనే నానుడి ఫైబర్ విషయంలోనూ నూటికి నూరు శాతం వర్తిస్తుంది. ఫైబర్ ఆరోగ్యానికి మంచిదే కదా అని మోతాదుకు మించి ఎక్కువగా తీసుకోవడం వల్ల పేగుల ఆరోగ్యం బాగుపడటానికి బదులుగా తీవ్రంగా పాడయ్యే ప్రమాదం ఉందని పోషకాహార నిపుణులు మరియు గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ఒక ఆరోగ్యవంతమైన మానవ శరీరానికి రోజువారీగా సుమారు 25 నుండి 30 గ్రాముల ఫైబర్ మాత్రమే అవసరమవుతుంది. కానీ చాలామంది బరువు వేగంగా తగ్గాలనే ఉద్దేశంతో లేదా జీర్ణ సమస్యల నుండి త్వరగా ఉపశమనం పొందాలని ఒక్కసారిగా తమ ఆహారంలో ఫైబర్ పరిమాణాన్ని 50 నుండి 60 గ్రాములకు పైగా పెంచేస్తుంటారు. ఇలా హఠాత్తుగా లేదా అతిగా పీచు పదార్థాన్ని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై విపరీతమైన భారం పడుతుంది. మన పేగుల్లో ఉండే బాక్టీరియా ఈ అధిక ఫైబర్‌ను వేగంగా ఫర్మెంటేషన్ (కిణ్వ ప్రక్రియ) చేయడం ప్రారంభిస్తుంది. దీని ఫలితంగా కడుపులో విపరీతమైన గ్యాస్ తయారవ్వడం, కడుపు ఉబ్బరంగా అనిపించడం, కడుపులో తీవ్రమైన నొప్పి మరియు అసౌకర్యం వంటి సమస్యలు వెంట వెంటనే తలెత్తుతాయి. అంతేకాకుండా, పరిమితికి మించిన ఫైబర్ తీసుకోవడం వల్ల విరోచనాలు (Diarrhea) లేదా కొందరిలో విరుద్ధంగా మరింత తీవ్రమైన మలబద్ధకం (Constipation) ఏర్పడే అవకాశం ఉంది. మనం తినే ఫైబర్ సరిగ్గా జీర్ణం కావాలంటే శరీరానికి తగినంత నీరు అత్యంత అవసరం. శరీరం లోపల నీటి శాతం తక్కువగా ఉండి, ఫైబర్ మాత్రమే ఎక్కువగా తీసుకుంటే, ఆ పీచు పదార్థం పేగుల్లోని నీటిని పీల్చేసుకుని గట్టిపడిపోతుంది. దీనివల్ల ఆహారం పేగుల్లో ముందుకు కదలకుండా అడ్డుపడి మలబద్ధకాన్ని మరింత క్లిష్టం చేస్తుంది. ఇది క్రమంగా కడుపులో తీవ్రమైన తిమ్మిర్లు మరియు పేగులలో వాపునకు దారితీస్తుంది. అధిక ఫైబర్ వల్ల మరొక ప్రధానమైన ముప్పు ఏమిటంటే పోషకాల లోపం. మనం తీసుకునే ఆహారంలో పీచు పదార్థం మోతాదుకు మించి ఉంటే, అది శరీరంలో కీలకమైన కాల్షియం, ఐరన్, జింక్ మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలను పేగులు పీల్చుకోకుండా అడ్డుకుంటుంది. ఫైబర్ ఈ ఖనిజాలతో బంధాన్ని ఏర్పరచుకుని, అవి శరీరానికి అందకుండానే మలం ద్వారా బయటకు పంపేస్తుంది. ఫలితంగా దీర్ఘకాలంలో రక్తహీనత (Anemia) మరియు ఎముకల బలహీనత వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి రోజువారీ డైట్‌లో ఫైబర్‌ను ఒక్కసారిగా కాకుండా క్రమక్రమంగా పెంచుకోవాలి. ప్రతిరోజూ కనీసం 2.5 నుండి 3 లీటర్ల నీరు తాగుతూ, శరీరానికి సరిపడా సమతుల్య ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం ద్వారా పొట్టను, పేగులను ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.     [ Fiber, High Fiber Diet, Digestive Health, Constipation, Diarrhea, Gut Health, Bloating, Hydration, Nutrient Deficiency, Healthy Diet ]
నేటి వేగవంతమైన జీవనశైలి మరియు మార్పుచెందిన ఆహార అలవాట్ల కారణంగా మధుమేహం లేదా టైప్ 2 డయాబెటిస్ అనేది ప్రతి ఇంటా సాధారణ సమస్యగా మారిపోయింది. రక్తంలో చక్కెర స్థాయిలు ఎప్పుడు ఏ విధంగా పెరుగుతాయో తెలియక చాలామంది ప్రతిరోజూ ఆందోళన చెందుతుంటారు. ముఖ్యంగా ఉదయం పూట తినే అల్పాహారం లేదా బ్రేక్‌ఫాస్ట్ మన రోజంతా ఉండే బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను నేరుగా ప్రభావితం చేస్తుంది. ఉదయాన్నే మైదా, ప్రాసెస్ చేసిన పిండి వంటకాలు లేదా అధిక కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా స్పైక్ అవుతాయి. ఇలాంటి సమయంలో శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తూ, బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను స్థిరంగా ఉంచే ఆరోగ్యకరమైన టిఫిన్ ఎంచుకోవడం అత్యంత ఆవశ్యకం. మధుమేహ బాధితులకు దివ్యౌషధంగా పనిచేసే అలాంటి ఒక అద్భుతమైన సాంప్రదాయక ఉదయపు ఆహారమే జొన్న మెంతి పరోటా (Jowar Methi Paratha). జొన్నలు మరియు మెంతులు రెండూ కూడా ఆయుర్వేదంలో మరియు ఆధునిక పోషకాహార శాస్త్రంలో అత్యుత్తమ ఆహారాలుగా గుర్తించబడ్డాయి. సాధారణంగా మనం తినే గోధుమలు లేదా బియ్యంతో పోలిస్తే జొన్నలలో గ్లైసీమిక్ ఇండెక్స్ (GI) చాలా తక్కువగా ఉంటుంది. జొన్నల పిండిని ఆహారంగా తీసుకున్నప్పుడు అది శరీరంలో చాలా నెమ్మదిగా జీర్ణమవుతుంది. దీనివల్ల రక్తంలోకి గ్లూకోజ్ ఒక్కసారిగా విడుదల కాకుండా క్రమంగా విడుదలవుతుంది. తద్వారా ఇన్సులిన్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా అదుపులో ఉంటాయి. అంతేకాకుండా జొన్నలలో పుష్కలంగా ఉండే డైటరీ ఫైబర్ లేదా పీచు పదార్థం జీర్ణ వ్యవస్థను మెరుగుపరచి, ఎక్కువ సేపు కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. ఇది పదే పదే ఆకలి వేయకుండా ఆపుతుంది, తద్వారా బరువు పెరగకుండా సమర్థవంతంగా అదుపు చేయవచ్చు. ఇక ఈ పరోటాలో ఉపయోగించే మరో ముఖ్యమైన దినుసు మెంతి ఆకులు. మెంతి ఆకులలో లభించే విశిష్టమైన గెలాక్టోమన్నన్ అనే పీచు పదార్థం మరియు అమైనో ఆమ్లాలు శరీరంలో ఇన్సులిన్ సున్నితత్వాన్ని (Insulin Sensitivity) పెంచుతాయి. మెంతి ఆకులు రక్తంలోని గ్లూకోజ్ శోషణను నెమ్మదింపజేసి డయాబెటిస్ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయి. జొన్న పిండికి సన్నగా తరిగిన పచ్చి మెంతి ఆకులు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, వాము మరియు తగినంత ఉప్పు కలిపి కొద్దిగా గోరువెచ్చని నీటితో సాఫ్ట్‌గా కలుపుకోవాలి. జొన్న పిండిలో గ్లూటెన్ ఉండదు కాబట్టి రొట్టెలు చేయడం కొద్దిగా కష్టంగా అనిపించినా, కొద్దిపాటి నూనె లేదా నెయ్యి రాసి నిదానంగా ఒత్తి పెనంపై కాల్చుకోవాలి. ఈ జొన్న మెంతి పరోటాను ప్రతిరోజూ ఉదయం టిఫిన్‌గా తీసుకోవడం వల్ల కేవలం షుగర్ లెవెల్స్ అదుపులో ఉండటమే కాకుండా, శరీరానికి అవసరమైన ప్రోటీన్, కాల్షియం, ఐరన్ మరియు విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. నిత్యం బిపి, షుగర్ సమస్యలతో బాధపడేవారు మరియు బరువు తగ్గాలనుకునే వారు తమ రోజువారీ ఉదయపు ఆహారంలో ఒకట్రెండు జొన్న మెంతి పరోటాలను పెరుగు లేదా పుదీనా చట్నీతో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. సంపూర్ణ ఆరోగ్యం కోసం ఈ రుచికరమైన, పోషకాల గని వంటి బ్రేక్‌ఫాస్ట్‌ను మీ ఆహారంలో భాగం చేసుకోండి.     [ Jowar Methi Paratha, Diabetes, Type 2 Diabetes, Blood Sugar, Jowar, Methi Leaves, Low GI Foods, Dietary Fiber, Insulin Sensitivity, Healthy Breakfast ]  
వయస్సు పెరుగుతున్న కొద్దీ లేదా మారుతున్న జీవనశైలి కారణంగా మన శరీరంలో వచ్చే అత్యంత ప్రధానమైన మార్పు ఎముకల బలహీనత. చిన్న వయస్సులోనే కీళ్ల నొప్పులు రావడం, కొద్దిపాటి దెబ్బలకే ఎముకలు విరగడం లేదా అరిగిపోవడం వంటి సమస్యలు నేడు చాలామందిని వేధిస్తున్నాయి. సాధారణంగా ఎముకల ఆరోగ్యం అనగానే మనకు వెంటనే గుర్తుకువచ్చేది పాలు మరియు పాల ఉత్పత్తులు మాత్రమే. కానీ మన ఇంట్లోనే లభించే కొన్ని సంప్రదాయ మరియు సహజ సిద్ధమైన ఆహార పదార్థాలు పాలకంటే అత్యంత శక్తివంతంగా ఎముకలను దృఢపరచగలవని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా నల్ల నువ్వులు, పొన్నగంటి కూర, తోటకూర మరియు రాగులు వంటి పదార్థాలలో లభించే కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం మరియు విటమిన్లు మన ఎముకల సాంద్రతను (Bone Density) ఊహించని రీతిలో పెంచి, వాటిని ఉక్కులా బలంగా మారుస్తాయి. నల్ల నువ్వులు (Black Sesame Seeds) ఎముకల ఆరోగ్యానికి ఒక గొప్ప నిధి లాంటివి. వీటిలో సాధారణ తెల్ల నువ్వుల కంటే అత్యధిక పరిమాణంలో కాల్షియం మరియు యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. కేవలం వంద గ్రాముల నల్ల నువ్వులను తీసుకుంటే దాదాపు 1450 మిల్లీగ్రాముల వరకు ఉపాధి కలిగించే కాల్షియం శరీరానికి అందుతుంది. ఇది మనం రోజువారీ తాగే ఒక గ్లాసు పాలలో లభించే కాల్షియం కంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ కావడం విశేషం. అంతేకాకుండా, వీటిలోని జింక్ మరియు రాగి (Copper) కండరాలు, ఎముకల అనుసంధాన కణజాలాన్ని బలోపేతం చేస్తాయి. క్రమం తప్పకుండా ప్రతిరోజూ ఒక స్పూన్ వేయించిన నల్ల నువ్వులను లేదా నువ్వుల లడ్డును ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆస్టియోపోరోసిస్ (Osteoporosis) వంటి తీవ్రమైన ఎముకల వ్యాధులు రాకుండా అరికట్టవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఆకుకూరల విషయానికి వస్తే పొన్నగంటి కూర మరియు తోటకూర ఎముకల బలానికి అద్భుతంగా తోడ్పడతాయి. పొన్నగంటి కూరలో కాల్షియంతో పాటు విటమిన్ ఎ, విటమిన్ సి మరియు పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకల అరుగుదలను నివారించడమే కాకుండా, కీళ్ల మధ్య ఉండే సైనోవియల్ ద్రవం ఇంకిపోకుండా కాపాడుతుంది. మరొకవైపు, తోటకూర (Amaranth Leaves) అత్యధిక కాల్షియం మరియు మెగ్నీషియం కలిగిన ఆకుకూరగా పేరుగాంచింది. వంద గ్రాముల తోటకూరలో సుమారు 330 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. ఇది శరీరంలో ఎముకల నిర్మాణికి అవసరమైన ఆస్టియోబ్లాస్ట్ కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. వారానికి రెండు లేదా మూడు సార్లు ఈ ఆకుకూరలను పప్పు లేదా వేపుడు రూపంలో తీసుకోవడం వల్ల ఎముకల మాతృక (Bone Matrix) ఎంతో దృఢపడుతుంది. వీటితో పాటు మన సంప్రదాయ చిరుధాన్యమైన రాగులు (Ragi/Finger Millet) ఎముకల ఆరోగ్యానికి ఒక పవర్‌హౌస్‌గా పనిచేస్తాయి. శాకాహార ఆహారాలలో రాగులలో ఉన్నంత కాల్షియం మరే ఇతర ధాన్యంలోనూ లభించదు. ప్రతి వంద గ్రాముల రాగులలో దాదాపు 344 మిల్లీగ్రాముల సులభంగా జీర్ణమయ్యే కాల్షియం నిండి ఉంటుంది. ప్రతిరోజూ ఉదయాన్నే రాగి జావ తాగడం లేదా రాగి సంకటి, రాగి రొట్టెలు తీసుకోవడం వల్ల ఎముకల సాంద్రత క్రమంగా పెరుగుతుంది. చిన్నపిల్లల పెరుగుదలకు, గర్భిణులకు మరియు రుతుస్రావం ముగిసిన (Menopause) మహిళలకు ఎముకలు బలహీనపడకుండా ఉండటానికి రాగులు ఎంతో మేలు చేస్తాయి. ఈ నాలుగు సహజ ఆహారాలను మన రోజువారీ జీవనశైలిలో భాగం చేసుకోవడం ద్వారా ఎముకల నొప్పులకు స్వస్తి చెప్పి, సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండవచ్చు.     [ Bone Health, Bone Density, Calcium Rich Foods, Black Sesame Seeds, Ponnaganti Leaves, Amaranth Leaves, Ragi, Osteoporosis, Joint Health, Strong Bones ]
అమరాంత్ సీడ్స్.. తోటకూర గింజలు లేదా రాజ్‌గిరా అని వీటిని పిలుస్తారు. ఇవి ఇటీవల కాలంలో సూపర్ ఫుడ్‌గా విపరీతమైన ప్రజాదరణ పొందుతున్నాయి. ప్రాచీన కాలం నుండి మన సాంప్రదాయ ఆహారంలో భాగమైన ఈ గింజలు, ఆధునిక ఆరోగ్య నిపుణుల ప్రశంసలు అందుకుంటున్నాయి. మన నిత్య జీవితంలో తోటకూరను ఆకుకూరగా ఎంతగా ఉపయోగిస్తామో, దాని గింజలలో ఉన్న పోషక విలువలు కూడా అంతకంటే ఎక్కువే. సాధారణంగా కనిపించే ఈ చిన్న గింజలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి. అవేంటో తెలుసుకుంటే.. అమరాంత్ సీడ్స్ అంటే.. అమరాంత్ సీడ్స్ అనేది 'అమరాంథస్' అనే మొక్క నుండి లభించే గింజలు. తెలుగులో వీటిని తోటకూర గింజలు అని పిలుస్తారు. ఉత్తర భారతదేశంలో వీటిని 'రాజ్‌గిరా' లేదా 'రామ్‌దానా' అని అంటారు. అమరాంత్ గింజలను ధాన్యాల జాబితాలో చేర్చినప్పటికీ, వృక్షశాస్త్రం ప్రకారం ఇవి నిజానికి సూడోసిరియల్స్ గా పిలుస్తున్నారు. అంటే బియ్యం, గోధుమల లాగా కాకుండా, ఇవి ఆకుకూరల జాతికి చెందిన గింజలు. అందుకే వీటిలో ఇతర సాధారణ ధాన్యాల కంటే పోషకాలు ఎంతో ఎక్కువగా ఉంటాయి. ఇందులో గ్లూటెన్ ఉండకపోవడం వల్ల ఇది గ్లూటెన్ అలర్జీ ఉన్నవారికి సురక్షితమైన ప్రత్యామ్నాయంగా మారుతుంది. ఆరోగ్యానికి అమరాంత్ సీడ్స్ చేసే మేలు.. పోషకాల గని: అమరాంత్ గింజలలో శరీరానికి కావలసిన అత్యంత ముఖ్యమైన విటమిన్లు , ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫోస్ఫరస్ , పోటాషియం సమృద్ధిగా లభిస్తాయి. ముఖ్యంగా ఎముకల ఆరోగ్యానికి అవసరమైన క్యాల్షియం ఇతర ధాన్యాలతో పోలిస్తే ఇందులో చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రొటీన్: సాధారణంగా వృక్ష సంబంధిత ఆహారాలలో అన్ని రకాల అమైనో ఆసిడ్లు లభించడం చాలా అరుదు. కానీ అమరాంత్ లో శరీరానికి అవసరమైన తొమ్మిది రకాల అవసరమైన అమైనో ఆసిడ్లు ఉంటాయి. ముఖ్యంగా 'లైసిన్' అనే అమైనో ఆసిడ్ ఇందులో ఉండటం వల్ల ఇది శరీరంలో ప్రొటీన్ శోషణకు ఎంతగానో తోడ్పడుతుంది. శాఖాహారులకు, కండరాల పుష్టిని కోరుకునే వారికి ఇది సరైన పోషకాహారం. జీర్ణవ్యవస్థ మెరుగుదల: అమరాంత్ గింజలలో  ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను వేగవంతం చేసి మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. అలాగే ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఫైబర్ ఎక్కువ సమయం కడుపు నిండిన భావనను కలిగిస్తుంది కాబట్టి, అతిగా తినే అలవాటు తగ్గుతుంది. గుండె ఆరోగ్యం , కొలెస్ట్రాల్ నియంత్రణ: అమరాంత్ లో ఉండే సహజ నూనెలు , ఫైబర్ రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులో ఉన్న యాంటీఆక్సిడెంట్లు గుండె నాళాల్లో పూడికలు ఏర్పడకుండా నిరోధించి, రక్తప్రసరణను నార్మల్ గా ఉండేలా చేస్తాయి. తద్వారా రక్తపోటు నియంత్రణలో ఉండి గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. బరువు తగ్గడానికి: బరువు తగ్గాలనుకునే వారికి అమరాంత్ సీడ్స్ చక్కని ఎంపిక. తక్కువ క్యాలరీలు, అధిక ప్రొటీన్ , పీచు పదార్థం కలిగి ఉండటం  వల్ల శరీర జీవక్రియ రేటు అంటే మెటబాలిజం  పెరుగుతుంది. కొవ్వును కరిగించే ప్రక్రియ వేగవంతమై, ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గడానికి ఇది దోహదపడుతుంది. డయాబెటిస్ నియంత్రణ: ఈ గింజలలో ఉన్న గ్లైసెమిక్ ఇండెక్స్ సాధారణ ధాన్యాల కంటే తక్కువగా ఉంటుంది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా క్రమబద్ధంగా ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ రోజువారీ ఆహారంలో అమరాంత్ ను చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. వ్యాధి నిరోధక శక్తి.. అమరాంత్ లో స్క్వాలేన్ , లోనాఫిన్ వంటి శక్తివంతమైన సమ్మేళనాలు  ఉంటాయి. ఇవి శరీరంలో  ఇన్ఫ్లమేషన్ తగ్గించడమే కాకుండా, క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవడంలో తోడ్పడతాయి. శరీర కణజాలాన్ని రక్షించే యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఆహారంలో అమరాంత్ సీడ్స్ ఎలా తీసుకోవాలి? అమరాంత్ సీడ్స్ ని వివిధ రకాలుగా ఆహారంలో భాగం చేసుకోవచ్చు. వీటిని వేయించి, పాప్‌కార్న్ లాగా మార్చి పాలు లేదా తేనెతో కలిపి ఉదయపు అల్పాహారంగా తీసుకోవచ్చు. వరి అన్నం లాగే వీటిని ఉడికించి తీసుకోవచ్చు లేదా ఉప్మా రూపంలో వండుకోవచ్చు. అమరాంత్ గింజలను పిండిగా తయారుచేసి  గోధుమ పిండితో కలిపి రొట్టెలు, చపాతీలు తయారు చేసుకోవచ్చు. పాయసం లేదా పానీయాలలో ఉడకబెట్టిన అమరాంత్ గింజలను చేర్చి పౌష్టికాహారంగా తీసుకోవచ్చు. సలాడ్లు లేదా సూప్‌లలో వేయించిన అమరాంత్ గింజలను పైన చల్లుకోవడం ద్వారా పోషక విలువలతో పాటు రుచిని పెంచుకోవచ్చు.                      *రూపశ్రీ.  
ఆరోగ్యం కోసం వాకింగ్ చేయాలని చాలామంది అనుకుంటారు. వాకింగ్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి. బ్రిస్క్ వాకింగ్ , బ్యాక్ వాకింగ్.. అంటూ చాలా రకాలు ఉన్నాయి. వీటిలో 8 ఆకారంలో వాకింగ్ చేయడం చాలా పవర్ఫుల్ అంటున్నారు. దీన్ని అష్టాంగ నడక లేదా ఎనిమిది ఆకారపు నడక అని కూడా అంటారు. ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే అద్భుతమైన సాంప్రదాయ వ్యాయామ పద్ధతి. దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. అష్టాంగ నడక.. సాధారణంగా మనం ప్రతిరోజూ నేరుగా లేదా పార్కుల్లో రౌండ్‌గా నడుస్తుంటాం. కానీ ఒకే రీతిలో నడిచే నడక కంటే,  ఎనిమిది ఆకారంలో నడవడం వల్ల శరీరానికి ఎన్నో రెట్ల అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. సరైన పద్ధతిలో ఈ నడకను  దినచర్యలో భాగం చేసుకుంటే, కొద్దిరోజుల్లోనే శరీరంలో వచ్చే మార్పులను ప్రత్యక్షంగా చూడవచ్చు. చిన్న స్థలం చాలు.. ఈ నడకను సాధన చేయడానికి పెద్దగా స్థలం లేదా ఖరీదైన పరికరాలు అవసరం లేదు.  ఇంటి ఆవరణలో లేదా ఒక ఖాళీ గదిలో దక్షిణం నుండి ఉత్తర దిశగా ఎనిమిది ఆకారాన్ని ఊహించుకుని లేదా సుద్ద ముక్కతో గీసుకుని నడవడం ప్రారంభించాలి. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పరగడుపున పరధ్యానం లేకుండా పాదరక్షలు లేకుండా నడవడం చాలా మంచిది. ఎలా నడవాలి?  నడిచేటప్పుడు శ్వాసపై ధ్యాస ఉంచుతూ ప్రశాంతంగా, నిలకడగా అడుగులు వేయాలి. దాదాపు పదిహేను నిమిషాలు ఒక దిశలో నడిచిన తర్వాత, తదుపరి పదిహేను నిమిషాలు వ్యతిరేక దిశలో నడవడం ఈ పద్ధతి లో ఉండే  ముఖ్య నియమం. అష్టాంగ నడక వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. గుండె ఆరోగ్యం.. ఎనిమిది ఆకారంలో తిరుగుతూ నడవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ ఎంతో మెరుగుపడుతుంది. రెండు వైపులా  అడుగులు వేయడం వల్ల శరీరంలోని అన్ని అవయవాలకు, ముఖ్యంగా గుండెకు తగినంత ప్రాణవాయువు అందుతుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతో తోడ్పడుతుంది. నాడీ వ్యవస్థ.. కాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఇది అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. ఎనిమిది ఆకారంలో నడిచేటప్పుడు మోకాళ్లు, తుంటి భాగాలు, వెన్నుముక సహజంగా వంగుతాయి. దీనివల్ల వెన్నుముక బలపడి, నడుము నొప్పి , సయాటికా వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. పాదాల కింద ఉండే ఆక్యుప్రెజర్ పాయింట్లు నేలను తాకడం వల్ల నాడీ వ్యవస్థ ఉత్తేజితమవుతుంది. మానసిక ఆరోగ్యం.. అష్టాంగ నడక మానసిక ఒత్తిడిని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఎనిమిది ఆకారాన్ని అనుసరిస్తూ నడిచేటప్పుడు మనస్సు పూర్తిగా ఆకారం పైన నడక పైన దృష్టి పెడుతుంది. దీనివల్ల అనవసరమైన ఆలోచనలు తగ్గి, మెదడు ప్రశాంతంగా మారుతుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు క్రమం తప్పకుండా ఈ నడకను సాధన చేస్తే మంచి నిద్ర పడుతుంది. డయాబెటిస్ కు మంచిది.. అష్టాంగ నడక వల్ల జీర్ణక్రియ సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ వ్యాయామం వల్ల పొత్తికడుపు భాగంలో కదలికలు ఏర్పడి, మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే శరీరంలో పేరుకుపోయిన అనవసర కొవ్వు కరిగి, బరువు అదుపులోకి వస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో ఇన్సులిన్ స్థాయిలు సమతుల్యంగా ఉండటానికి, రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించడానికి ఈ నడక ఎంతగానో సహాయపడుతుంది. ముఖ్యమైన విషయం.. సాధారణ నడకతో పోలిస్తే అష్టాంగ నడక శరీరంలోని రెండు వైపుల కండరాలను సమంగా ఉపయోగిస్తుంది. దీనివల్ల శరీర సమతుల్యత పెరుగుతుంది. వయసు పైబడిన వారు పడిపోకుండా స్థిరంగా నడవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. రోజూ  నార్మల్ బ్యాకింగ్  కు బదులుగా  ప్రతిరోజూ కనీసం అర్ధగంట సేపు ఈ అష్టాంగ నడకను సాధన చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని , కొత్త ఉత్సాహాన్ని సొంతం చేసుకోవచ్చు.                          *రూపశ్రీ.  
గర్భనిరోధక మాత్రలు మహిళల జీవితంలో ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తాయి. కుటుంబ నియంత్రణతో పాటు నెలసరి సరిగ్గా రానప్పుడు వాటిని రీసెట్ చేయడానికి, తీవ్రమైన కడుపునొప్పి, పిసిఓడి వంటి హార్మోన్ల సమస్యల చికిత్సకు కూడా వైద్యులు వీటిని సూచిస్తుంటారు. అయితే వీటిని కొద్దికాలం  పాటు వైద్యుల పర్యవేక్షణలో వాడటం సురక్షితమే..  అయినప్పటికీ, ఎక్కువ కాలం పాటు ముఖ్యంగా వైద్యుల సలహా లేకుండా క్రమం తప్పకుండా వాడటం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.  ముఖ్యంగా మహిళలు వైద్యుల సలహాతో అయినా సరే.. ఎక్కువకాలం గర్భనిరోధక మాత్రలు వాడటం మంచిది కాదు.. దీర్ఘకాలం గర్భనిరోధక మాత్రలు వాడటం వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు , సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది? మహిళలు ఎదుర్కొనే సమస్యలు ఏమిటి?  వివరంగా తెలుసుకుంటే.. హార్మోన్ల అసమతుల్యత , మూడ్ స్వింగ్స్...  గర్భనిరోధక మాత్రలలో ఈస్ట్రోజెన్ , ప్రొజెస్టిన్ అనే హార్మోన్లు ఉంటాయి. వీటిని ఎక్కువకాలం తీసుకోవడం వల్ల శరీరంలో సహజమైన హార్మోన్ల ఉత్పత్తి ప్రభావితమవుతుంది. దీనివల్ల మానసిక ఆందోళన, నిరాశ, చిరాకు, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు తరచూ ఎదురవుతాయి. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం..  ఎక్కువకాలం పాటు గర్భనిరోధక  మాత్రలు వాడటం వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే ముప్పు పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా కాళ్లలోని నాళాలలో లేదా ఊపిరితిత్తులలో రక్తం గడ్డకట్టడం వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అధిక బరువు ఉన్నవారిలో,   ముప్పై ఐదేళ్లు పైబడిన మహిళల్లో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. గుండె సంబంధిత సమస్యలు , అధిక రక్తపోటు..  గర్భనిరోధక మాత్రల వల్ల కొందరిలో రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. క్రమం తప్పకుండా చాలా ఏళ్ల పాటు వీటిని వాడటం వల్ల గుండె సంబంధిత వ్యాధులు ,  స్ట్రోక్ వచ్చే ముప్పు కూడా పెరుగుతుంది. విటమిన్లు , ఖనిజాల లోపం..  ఈ మాత్రలు ఎక్కువ కాలం పాటు వాడటం వల్ల జీర్ణ వ్యవస్థలో పోషకాల శోషణ తగ్గుతుంది. ముఖ్యంగా విటమిన్ బి6, విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి , మెగ్నీషియం, జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాల లోపం శరీరంలో ఏర్పడుతుంది. దీనివల్ల ఎప్పుడూ అలసట, నీరసం , రోగనిరోధక శక్తి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.  రొమ్ము నొప్పులు.. ఎక్కువ కాలం ఈ మాత్రల  వాడకం వల్ల శరీరంలో హార్మోన్ల స్థాయిలో వచ్చే మార్పుల కారణంగా రొమ్ములో బరువుగా అనిపించడం, వాపు లేదా నొప్పి రావడం జరుగుతుంది. కాలేయం , పిత్తాశయ సమస్యలు.. మాత్రల రూపంలో తీసుకునే ఈ హార్మోన్లను కాలేయం జీర్ణం చేయాల్సి ఉంటుంది. ఎక్కువ కాలం వీటిని వాడటం వల్ల కాలేయ పనితీరుపై ప్రభావం పడి కాలేయ గడ్డలు ఏర్పడటం లేదా పిత్తాశయంలో రాళ్లు తయారయ్యే ప్రమాదం ఉంటుంది. క్యాన్సర్ ప్రమాదం..  ఎక్కువ కాలం గర్భనిరోధక మాత్రలు వాడటం వల్ల గర్భాశయ ముఖద్వారం , రొమ్ము క్యాన్సర్ వచ్చే ముప్పు కొద్దిగా  పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి. అయితే అదే సమయంలో ఇవి అండాశయ , గర్భాశయ క్యాన్సర్ల నుండి రక్షణ ఇస్తాయట. మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. మహిళలు గర్భనిరోధక మాత్రలు వాడే ముందు , వాడే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం. సొంత వైద్యం చేసుకోవద్దు. వైద్యుల సలహా మేరకు మాత్రమే వీటిని ప్రారంభించాలి. ప్రతి కొన్ని నెలలకోసారి సాధారణ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. కొందరు వైద్యులు కేవలం సమస్యను తగ్గించాలనే కారణంతో ఈ మాత్రలను ఎక్కువ నెలలు రికమెండ్ చేస్తూ ఉంటారు. అవగాహన లోపం వల్ల కంటిన్యు గా ఎక్కువ నెలలు ఈ మాత్రలు రికమెండ్ చేయడం లేదా వాడటం మంచిది కాదు. రక్తపోటు , కాలేయ పనితీరును తరచూ సరిచూసుకోవాలి. మాత్రలు వాడుతున్న సమయంలో తరచూ తలనొప్పి, కాళ్ల వాపు, తీవ్రమైన కడుపునొప్పి లేదా చూపు మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.                        *రూపశ్రీ.