ఐదేళ్లు వైసీపీ పాలనలో జిల్లాలో ప్రతిపక్ష పార్టీలు వాటి నాయకులు పర్యటన చేసే పరిస్థితి లేకుండా చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏ నాయకుడు రావాలన్నా తీవ్ర అడ్డంకులు సృష్టించారు. పోలీసులను ఇష్టం వచ్చినట్టు తిప్పుకుని పర్యటన అనుమతు కోసం వెళ్తే 30 యాక్ట్ అంటూ హడావుడి చేసి అనుమతులు ఇవ్వకుండా చేశారు. ఆనుమతులు ఇచ్చ కూడా ముఖ్య నాయకులను హౌస్ అరెస్టులు చేసి ప్రజాస్వామ్యంలో ఇలాంటివి కూడా ఉంటాయని చూపించిన ఘనత వైసీపీకే దక్కుతుందని ప్రజలు అంటున్నారు. అయితే జగన్ ఐదేళ్ల పాలన ముగిసింది. ఇప్పుడు జగన్ పార్టీకి రాష్ట్రంలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఐదేళ్ల నిర్బంధ కాండ నుంచి ప్రజలకు విముక్తి లభించింది. ఇప్పుడు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ గాడిలో పడింది. పోలీసులు సైతం తమ విధులు స్వేచ్ఛగా, సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. ఇక అధికారం కోల్పోయిన వైసీపీ మాత్రం ప్రశాంతంగా పర్యటనలు చేసుకుంటే   మైలేజ్ రాదని పరామర్శ యాత్రల పేరిట వెళ్తు గొడవలు, దాడులకు పాల్పడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ప్రజల, చివరికి సొంత పార్టీ కార్యకర్తల ప్రాణాలతో చెలగాటాలాడుతోంది.   మామిడి రైతుల సమస్యలు అంటూ చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యంకు రానున్న జగన్ కు గతంలో జరిగిన కారణాలతో పోలీసులు ఆంక్షలు విధిస్తే దాన్ని సైతం రాజకీయం చేస్తున్నారు. గతంలో వైసీపీ చేసిన పనిని కూటమి ప్రభుత్వం చేయడం లేదు. ప్రజాస్వామ్యం లో తిరిగే హక్కుతో పాటు భద్రత కూడా కల్పిస్తున్నది. 30 యాక్ట్ అంటూ అరెస్టులు చేయడం లేదు. శాంతి భద్రతల దృష్ట్యా ఆంక్షలు మాత్రమే విధిస్తున్నది. దీనికే జగన్ అంటే, జగన్ వస్తుంటే.. కూటమి ప్రభుత్వం భయపడుతోంది అంటూ నానా యాగీ చేస్తున్నది వైసీపీ. జగన్  బంగారుపాల్యం యాత్రనే తీసుకుంటే.. మామిడి సీజన్ ముగిసిన దశలో మామిడిరైతుకు పరామర్శ, భరోసా కోసం అంటూ జగన్ కుట్ర కోణం దాగి ఉందన్నది ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం. అయితే నిజమైన రైతులతో మాట్లాడుతారా లేక పేటీఎం బ్యాచ్ ను జిల్లా వైసీపీ నాయకులు ఏర్పాటు చేస్తారా అన్న అనుమానాలు మాత్రం వ్యక్తం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో జగన్ యాత్ర ఏ తీరున సాగుతుందో చూడాలి. 
  సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచీ పార్మా ప్యాక్టరీలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ బృందం పరిశీలించింది.   పేలుడు గల కారణాలపై బృందం అధ్యయనం చేసింది. దీనిపై నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయనుంది. కాగా ఘటనపై ఇప్పటి వరకు 44కు మృతుల సంఖ్య చేరింది. అనంతరం ఎన్‌డీఎంఏ అక్కడే సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్వహణ లోపాలపై సిగాచీ యాజమాన్యంపై ఎన్‌డీఎంఏ ప్రశ్నలు సంధించింది. యాజమాన్యం సరిగా సమాధానాలు ఇవ్వలేకపోవడంతో సీరియస్ అయింది. పేలుడు ఎలా సంభవించిందో చెప్పాలని ఘాటుగా వ్యాఖ్యానించింది.  సమావేశం అనంతరం పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అంచనా వేసింది.  సంగారెడ్డిలోని ధ్రువ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అఖలేశ్వర్, బీరంగూడ సమీపంలోని పనేసియా మెరిడియన్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆరిఫ్ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పేలుడు తర్వాత ఆసుపత్రుల్లో చేరిన వారిలో గత వారం రోజుల్లో ఇప్పటివరకు 8 మంది మరణించారు. ప్రస్తుతం మరో 16 మంది కార్మికులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జూన్ 30న పటాన్‌చెరు మండలం పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే.  ఈ ఘటనలో మరో 8 మంది కార్మికుల ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. వారి కోసం అగ్నిమాపక, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, పోలీసు బృందాలు శిథిలాల కింద గాలింపు చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. గల్లంతైన తమ వారి కోసం బాధితుల కుటుంబాలు సహాయ కేంద్రం వద్ద ఆందోళనతో ఎదురుచూస్తున్నాయి. మరోవైపు మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున పరిహారం అందిస్తామని సిగాచి ఇండస్ట్రీస్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
వన్ నేషన్.. వన్ ఎలక్షన్ నినాదంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశంలో జమిలి ఎన్నికలకు సిద్ధమౌతున్నది. ఇందు కోసం మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీని వేసి నివేదిక తీసుకుంది. ఆ నివేదిక జమిలిని సానుకూలంగా ఉండటంతో దేశంలో అన్ని ఎన్నికలూ ఒకే సారి జరిపే దిశగా అడుగులను వేగవంతం చేసింది. ఈ విషయంగా రాష్ట్రాలతోనూ చర్చించింది.  బీజేపీ పాలిత రాష్ట్రాలూ, ఎన్డీయే కూటమి పార్టీలూ జమిలికి సై అన్నాయి. బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలూ, బీజేపీ ప్రత్్యర్థి పార్టీలూ జమిలికి నో అన్నాయి.  ముఖ్యంగా కాంగ్రెస్ స‌హా.. స్థానిక పార్టీల నేతృత్వంలో న‌డుస్తున్న ప్ర‌భుత్వం ఉన్న రాష్ట్రాలు జ‌మిలికి   గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేదు. విషయం అలా ఉండగా కొందరు న్యాయవాదులు కేంద్రం నిర్ణయాన్ని ప్రశ్నించారు.  జమిలి ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సామర్థ్యంపై సందేహాలు వ్యక్తం చేశారు. అలాగే జమిలి నిర్వహణ వల్ల వ్యయం తగ్గుతుందన్న విషయంలోనూ వారు అనుమానాలు వ్యక్తం చేశారు. ఒకే దఫా ఎన్నికల నిర్వహణ ఎన్నికల అవినీతి పెచ్చరిల్లడానికే దారి తీస్తుందని విమర్శలు గుప్పించారు. అయితే వీటిలో వేటికీ కేంద్రం బదులివ్వకపోవడంతో ఢిల్లీ బార్ అసోసియేషన్ సహా దేశ వ్యాప్తంగా సుప్రీం కోర్టులో పెద్ద సంఖ్యలో జమిలి ఎన్నికలకు వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలయ్యాయి. సరే సుప్రీం కోర్టు ఆ పటిషన్లను ఏకకాలంలో విచారించేందుకు అంగీకరించడంతో కేంద్రం కూడా సుప్రీం కు మాజీ రాష్ట్రపతి కోవింద్ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ నివేదికను సుప్రీం కు సమర్పించింది. ఆ నివేదిక ప్రకారమే ముందకు వెడుతున్నట్లు పేర్కొంది. ఈ నివేదికపై అధ్యయనం చేసి జమిలికి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్లను క్వాష్ చేయాలని సుప్రీం ను కోరింది. దీనిపై నివేదికను పరిశీలించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం జమిలి ఎన్నికలకు సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. దేశం మొత్తం మీద ఒకేసారి ఎన్నికల వల్ల ఖర్చు భారీగా తగ్గుతుందన్న అంశంతో ఏకీభవించింది.  అలాగే జమిలికి ఓకే చెప్పింది. దీంతో జమిలికి ఇక అడ్డంకులన్నీ తొలగిపోవడంతో కేంద్రం తన కార్యాచరణను స్పీడప్ చేసింది. జమిలికి దేశ వ్యాప్తంగా మెజారిటీ రాష్ట్రాలు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ఈ వర్షాకాల సమావేశాలలోనే జమిలి బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టి ఆమోదం పొందాలని కేంద్రం భావిస్తోంది.  
ALSO ON TELUGUONE N E W S
Shah Rukh Khan at the height of his undisputed box office success run in 2000's, been a part of Don Remake. Farhan Akhtar, after making films like Dil Chahta Hain, Lakshya, decided to remake Amitabh Bachchan's Don with a climax twist, keeping him alive. Later, they made Don 2, which became a success but not a blockbuster.  The movie became a cult favorite for fans of Shah Rukh Khan for his entry as Don in the sequel. Now, Farhan Akhtar has decided to make Don 3 without SRK and with Ranveer Singh. The media reports stated that SRK and Farhan had a fall-out as the writer-director wanted to take the idea of Don Verse with Amitabh also joining.  SRK did not like the idea and he did not think YRF Spy Universe kind of integration doesn't work. Farhan released a teaser with Ranveer as Don and people rebuked this version. It took almost 2 years for them to even talk about taking the movie on to sets while reports stated that it has been shelved due to Ranveer's box office form. Now, recent updates state that Shah Rukh Khan will appear in a cameo from earlier Don films. How Farhan wants to integrate this is not revealed. But the reports suggest that SRK could appear as OG Don while Ranveer as his biggest fan, imposter. If these reports to be believed, then Don verse idea could come alive.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)పోరాటయోధుడుగా నటించిన హిస్టారికల్ మూవీ 'హరిహర వీరమల్లు' పార్ట్ 1(Hari Hara Veera Mallu)ఈ నెల 24 న వరల్డ్ వైడ్ గా విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ తో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో వీరమల్లుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ ని సైతం ట్రైలర్ రాబట్టింది. మెగా సూర్య పతాకంపై ఏఎం రత్నంతో కలిసి ఆయన సోదరుడు దయాకర్ అత్యంత భారీ వ్యయంతో వీరమల్లుని నిర్మించగా జ్యోతికృష్ణ(Jyothikrishna),క్రిష్ జాగర్లమూడి(Krish)సంయుక్తంగా దర్శకత్వం వహించడం జరిగింది.   వీరమల్లుకి సంబంధించిన టికెట్ బుకింగ్స్ ఓవర్ సీస్(Overseas)లోని కొన్ని ఏరియాల్లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఒక టికెట్ బుకింగ్ ఫ్లాట్ ఫార్మ్ సంస్థ తమ సైట్ లో వీరమల్లు రన్ టైంని రెండు గంటల నలభై నిమిషాలుగా పేర్కొంది. దీంతో వీరమల్లు రన్ టైం న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయంపై చిత్ర యూనిట్ ఎక్కడా స్పందించలేదు. కొన్ని రోజులు అయితే గాని రన్ టైం విషయంలో పూర్తి  క్లారిటీ వచ్చే అవకాశం ఉండదని ఫిలిం సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. వీరమల్లులో పవన్ కి జోడిగా పంచమి అనే క్యారక్టర్ లో 'నిధిఅగర్వాల్'(Nidhhi Agerwal)చేస్తుంది. ఆమె ఇటీవల ఒక  ఇంటర్వ్యూ లో  వీరమల్లు గురించి మాట్లాడుతు దేవుడు నాకు ఇచ్చిన గొప్ప బహుమతి వీరమల్లు. మూవీ చాలా అద్భుతంగా ఉంటుంది. అభిమానులకి ప్రేక్షకులకి తప్పకుండా నచ్చుతుందని చెప్పుకొచ్చింది. బాలీవుడ్ అగ్ర నటుడు బాబీ డియోల్(Bobby Deol) ఔరంగజేబుగా చేస్తుండగా నర్గిస్ ఫక్రి,నోరా ఫతేహి, అనసూయ, రఘుబాబు, సునీల్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ కీరవాణి(Keeravani)సంగీతాన్ని అందిస్తున్నాడు.   
Shiva Shakti Datta, father of MM Keeravaani passed away today. The multi-faceted writer, artist, lyricist, story-writer, musician and director worked hard to find his feet in Telugu Film Industry. Before Vijayendra Prasad, his younger brother and celebrated writer, became independent, they both wrote films as Datta Brothers.  He never gave up his love for arts and music, which helped MM Keeravaani to grow as an Oscar Winning composer, today. But his contribution in SS Rajamouli films has always been huge. Many, who follow SSR's films closely know that his family members come together to work with him and help him in designing his huge films.  Shiva Shakti Datta wrote Chatrapati song lyrics - "Agni Sakalani". When SSR wanted to refer his main character to legendary Maratha King Chatrapathi Shivaji, it is him, who wrote lyrics accordingly. Always, he used to be the person to help him in finding best references from history to bring them on screen.  Vijayendra Prasad in an interview, stated that his elder brother, used to help him in finding apt references to create memorable characters. In fact, Baahubali characters have been established around the references that Shiva Shakti Dutta improvised on taking basic ideas from SSR.  A person who was well-versed in Sanskrit, Telugu, Hindi and many languages, he used to bring historical references to SSR films, enriching them with great character depth. His passing away would be a great loss to Keeravaani, SSR and their family. Let's wish they find solace and strength to overcome this grave sorrow.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
Vijay Deverakonda has found himself in the middle of the controversies due to his statements. A perception among people has been framed that he is still trying to leverage his 'no background actor' card into sympathy for better box office performance. While he understands this, he is still found ending up in some controversy. The actor is waiting for the release of his long due in production, Kingdom. The movie has been confirmed to release on 31st July and makers are working day and night to complete all post production works. Vijay sat with Anupama Chopra for an interview and while talking about his position, early in his career, he said that he never had leverage that a star kid or nepo-kid has. He stated that he couldn't ask a producer or a director to give the script a good two to three months time to finish it properly. Even though he knew there have been issues, he would just work along as he is a newcomer. At the same time, he stated that he knew another young actor with similar stature like him could take that time. Talking about this further, he stated that today, he has that time and leverage to ask a producer and director to work on the script further, if he feels, it needs that time. He even stated that somehow people have framed a negative perception against him and he is unable to erase it.  The Liger actor also stated that he asked his team to drop, "The Vijay Deverakonda" and "Rowdy Star" tags as he would love to be just Vijay. But as many of his contemporaries have tags, his team felt a need for it. He stated that he is happy with being recognised as himself and all the statements he make are also part of it. He candidly explained that Kingdom could have reincarnation storyline but he doesn't want to give away too much at the moment. Also, he stated that his fans ask him to not give interviews due to the controversies but he cannot avoid meeting press when a film is about to release.  Well, Vijay seems to have a tendency to make some or the other statement even in fun and good faith, which can still pull him into controversies.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda sai srinivas)మంచు మనోజ్(Manchu Manoj), నారా రోహిత్(Nara Rohith)కాంబోలో మే 30 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ భైరవం(Bhairavam). యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీకి నాంది, ఉగ్రం చిత్రాల ఫేమ్ 'విజయ్ కనకమేడల' దర్శకత్వం వహించాడు. ఆదితి శంకర్‌, దివ్యా పిళ్లై, ఆనంది, జయసుధ, అజయ్, రాజా రవీంద్ర, శరత్ లోహిత్సవ ఇతర పాత్రల్లో కనిపించారు.  ఇప్పుడు ఈ మూవీ జూలై 18  నుంచి ఓటిటి వేదికగా జీ 5 (Zee 5)లో స్ట్రీమింగ్ కాబోతుంది. తెలుగుతో పాటు హిందీ  లాంగ్వేజ్ లో అందుబాటులో ఉండనుంది. థియేటర్స్ లో మంచి అదరణనే దక్కించుకున్న భైరవం ఓటీటీ లో కూడా అంతే ఆదరణని దక్కించుకుంటుందనే ఆశాభావంతో చిత్ర బృందం ఉంది. శీను, గజపతి వర్మ, వరద అనే ప్రాణ స్నేహితుల క్యారెక్టర్స్ లో సాయి శ్రీనివాస్, మనోజ్, రోహిత్ లు తమ కెరీర్ లోనే భైరవం ద్వారా అత్యుత్తమ పెర్  ఫార్మెన్సు ని ప్రదర్శించారు. మిగతా ఆర్టిస్టులు కూడా తమ సహజ నటనతో మూవీకి నిండు తనాన్ని తీసుకొచ్చారు. వెయ్యి కోట్లు విలువైన వారాహి అమ్మవారి ఆలయ భూముల్ని రాజకీయ నాయకుడు ఆక్రమించాలని అనుకుంటాడు. ఆ భూమిని కాపాడేందుకు శీను, గజపతి వర్మ, వరద ఏమైనా ప్రయత్నాలు చేసారా? లేక రాజకీయం వాళ్ళ స్నేహాన్ని చెడగొట్టి గుడి భూముల విషయంలో వేరు వేరు నిర్ణయాలు తీసుకునేలా చేసిందా? చివరకి ఆ ముగ్గురు  పాత్రలు ఎలా ముగుస్తాయి? అనే పాయింట్స్ తో భైరవం తెరకెక్కింది. శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందించాడు   
  ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి.. సినీ పరిశ్రమలో స్టార్స్ గా ఎదగడం అంత తేలిక కాదు. ఈ జనరేషన్ లో నాని, విజయ్ దేవరకొండ వంటి వారు.. బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి.. తమకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. అయితే బ్యాక్ గ్రౌండ్ గురించి తాజాగా విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. (Vijay Deverakonda)   ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ చెప్పిన స్క్రిప్ట్ తో తాను పూర్తిగా సంతృప్తి చెందనప్పటికీ, దానిని మార్చమని చెప్పే పొజిషన్ లో తాను లేనని, ఎందుకంటే తనకు బ్యాక్ గ్రౌండ్ లేదని అన్నాడు. అదే బ్యాక్ గ్రౌండ్ ఉన్న యాక్టర్ అయితే.. వాళ్ళ ఫాదర్ వచ్చి, స్క్రిప్ట్ మీద వర్క్ చేయమని చెప్పడం లేదా కొందరు రచయితలను ఇవ్వడం వంటివి జరుగుతాయని విజయ్ చెప్పాడు.   విజయ్ దేవరకొండ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు విజయ్ కామెంట్స్ కి మద్దతు ఇస్తుంటే.. మరికొందరు మాత్రం ఆ కామెంట్స్ ని తప్పుబడుతున్నారు. ఇప్పుడు విజయ్ చిన్న హీరో కాదని, దర్శకులకు చెప్పే పొజిషన్ లోనే ఉన్నాడని గుర్తు చేస్తున్నారు. ఆ మాటకొస్తే.. కొత్త వాళ్ళకు అవకాశాలు ఇవ్వగలిగే స్థాయి ఉందని అంటున్నారు. ఒకవేళ నిజంగానే ఏవైనా కారణాల వల్ల సీనియర్ దర్శకులకు చెప్పలేకపోతే.. నానిలా యంగ్ డైరెక్టర్స్ కి ఎక్కువ అవకాశాలు ఇస్తూ.. విభిన్న కథలు చేయొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.   
పవన్ కళ్యాణ్(pawan Kalyan)అప్ కమింగ్ మూవీ 'హరిహర వీరమల్లు'(Hari Hara Veera Mallu)ఈ నెల 24 న విడుదల కానున్న విషయం తెలిసిందే.  ఈ మూవీలో 'పంచమి' అనే రాజనర్తకి క్యారక్టర్ లో ప్రముఖ హీరోయిన్ 'నిధి అగర్వాల్'(Nidhhi Agerwal)కనిపించనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ తో వీరమల్లు లో నిధి  పెర్ఫార్మెన్స్ తో కూడిన క్యారక్టర్ ని పోషిస్తుందనే విషయం   అర్ధమవుతుంది. తనపై చిత్రీకరించిన సాంగ్స్ కూడా యూ ట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో ముందుకు దూసుకుపోతున్నాయి. ఇక  సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే 'నిధి'ని 'ఎక్స్' వేదికగా అభిమానులు కొన్ని ప్రశ్నలు అడగడటం జరిగింది. ఈ సందర్భంగా ఒక అభిమాని ట్వీట్ చేస్తు 'మీ అమ్మ గారి ఫోన్ నెంబర్ ఇస్తే మన పెళ్లి సంబంధం గురించి మాట్లాడతాను. ప్లీజ్ నిధి నెంబర్ ఇవ్వు' అని ఒక హార్ట్ ఎమోజీ తో రిక్వెస్ట్ చేసాడు. 'అవునా చిలిపి' అంటూ నిధి సమాధానం ఇచ్చింది. దీంతో అభిమాని ప్రశ్నకి నిధి క్యూట్ సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హరి హర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటేనే భయమేస్తుంది. పవన్ సార్ ముందు ఎలా మాట్లాడగలను, మీ సపోర్ట్ కావాలంటూ కూడా మరో అభిమాని వేసిన ప్రశ్నకి సమాధానంగా నిధి  చెప్పుకొచ్చింది. ప్రభాస్(Prabhas)వన్ మాన్ షో 'దిరాజాసాబ్'(The Raja Saab)లో కూడా నిధి హీరోయిన్ గా చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో రెండు భారీ సినిమాల రిలీజ్ లతో ఒక్కసారిగా పరిశ్రమ దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆ రెండు చిత్రాల రిలీజ్ తర్వాత నిధి టాప్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగే అవకాశం ఉందని ఫిలిం వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. రాజాసాబ్ డిసెంబర్ 5 న విడుదల కానున్న విషయం తెలిసిందే.   
  టాలీవుడ్ కి చెందిన పలువురు స్టార్స్ వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నారు. వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. మల్టీప్లెక్స్ బిజినెస్ లో అల్లు అర్జున్ రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఏషియన్ సినిమాస్ తో కలిసి AAA సినిమాస్ ను హైదరాబాద్ లో స్థాపించి సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ AAA సినిమాస్ ను వైజాగ్ లోనూ ప్రారంభించబోతున్నారు.   విశాఖ ఇనార్బిట్ మాల్ లో AAA మల్టీప్లెక్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు బుధవారం ప్రారంభం కానున్నాయి. 8 స్క్రీన్ లు, 1500 సీటింగ్ కెపాసిటీతో ఈ మల్టీప్లెక్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది వేసవి నుంచి వైజాగ్ AAA సినిమాస్ అందుబాటులోకి రానుందని సమాచారం.   సినిమాల విషయానికొస్తే.. పుష్ప-2 తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అల్లు అర్జున్.. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ భారీ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. వైజాగ్ ఫ్యాన్స్.. తమ హీరోకి చెందిన AAA మల్టీప్లెక్స్ లో.. ఆ మూవీని భారీగా సెలబ్రేట్ చేసే అవకాశముంది.   ఇదిలా ఉంటే.. వైజాగ్ AAA మల్టీప్లెక్స్ లో ఫస్ట్ ఏ మూవీ ప్రదర్శించబడుతుందనే ఆసక్తి కలుగుతోంది. ఈ మల్టీప్లెక్స్.. 2026 వేసవిలో ప్రారంభం కానుంది అంటున్నారు. 2026 మార్చిలో రామ్ చరణ్ 'పెద్ది', జూన్ లో ఎన్టీఆర్ 'డ్రాగన్' విడుదల కానున్నాయి. మరి ఈ రెండిట్లో ఏదైనా మూవీ.. ఆ ఫస్ట్ ఛాన్స్ ని దక్కించుకుంటుందేమో చూడాలి.  
శివశక్తి దత్తా.. ఈ తరం వారికి ఈ పేరు పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. తెలిసినా.. కీరవాణి తండ్రిగానో, రాజమౌళి తండ్రిగానో గుర్తుపెట్టుకుంటారు. కానీ, శివశక్తి దత్తా ఓ గొప్ప రచయిత. ఆయన కలం నుండి ఎన్నో గొప్ప రచనలు జాలువారాయి. శివశక్తి దత్తా 1932 అక్టోబరు 8న జన్మించారు. ఆయన అసలు పేరు కోడూరి సుబ్బారావు. ఆయన కుటుంబం రాజమండ్రి సమీపంలోని కోవూరుకు చెందినది. శివశక్తి దత్తా ఏలూరు సి. ఆర్. రెడ్డి కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతూ మధ్యలోనే చదువు ఆపేశారు. చిన్న వయస్సు నుండే కళల వైపు మొగ్గు చూపిన శివశక్తి దత్తా.. ఇంటి నుండి పారిపోయి ముంబై సర్ జె. జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్ కళాశాలలో చేరారు. ఇంటి నుండి పారిపోయిన రెండు సంవత్సరాల తర్వాత.. డిప్లమా పట్టా అందుకుని కొవ్వూరుకు తిరిగి వచ్చారు.  కమలేష్ అనే కలం పేరుతో రచనలు చేసేవారు. తరువాత సుబ్బారావు అనే తన అసలు పేరును శివశక్తి దత్తాగా మార్చుకున్నారు. శివశక్తి దత్తాకు సంగీతంపై కూడా ఆసక్తి ఉండేది. గిటార్, సితార్, హార్మోనియం వాయించడం నేర్చుకున్నారు. శివశక్తి దత్తాకు సినిమాలు మీద ఉన్న ఆసక్తి.. ఆయన్ని మద్రాసుకి వెళ్లేలా చేసింది. మద్రాసు వెళ్లి కొంతకాలం ఇద్దరు దర్శకుల వద్ద పనిచేసి.. ఆ తర్వాత పిల్లనగ్రోవి అనే సినిమాను ప్రారంభించారు. కానీ, ఆ సినిమా ఆర్థిక కారణాల వల్ల మధ్యలో ఆగిపోయింది. తరువాత శివశక్తి దత్తాకు తన స్నేహితుడైన సమతా ముఖర్జీ ద్వారా.. దర్శకుడు కె. రాఘవేంద్రరావుతో పరిచయం ఏర్పడింది. రాఘవేంద్రరావు శివశక్తి దత్తాకు తన సినిమాలలో అవకాశాలు ఇచ్చేవారు. 'జానకి రాముడు'తో ఆయనకు రచయితగా మొదటి అవకాశం లభించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. శివశక్తి దత్తా.. సై, ఛత్రపతి, రాజన్న, బాహుబలి, ఆర్ఆర్ఆర్, హనుమాన్ వంటి సినిమాలకు సాహిత్యం అందించారు.  సై సినిమాలోని "నల్లా నల్లని కళ్ళ", ఛత్రపతి చిత్రంలోని "అగ్ని స్ఖలన, రాజన్న సినిమాలోని "అమ్మ అవని", బాహుబలి చిత్రంలోని "మమతల తల్లి", ఆర్ఆర్ఆర్ లోని "రామం రాఘవమ్" వంటి పాటలు ఆయనకు ఎంతో పేరు తీసుకొచ్చాయి. శివశక్తి దత్తా 2007లో దర్శకుడిగా చంద్రహాస్ అనే సినిమా చేశారు. శివశక్తి దత్తా కుటుంబ సభ్యులు సినీ రంగంలో గొప్పగా రాణిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి.. శివశక్తి దత్తా కుమారుడే. మరో కుమారుడు కల్యాణి మాలిక్ కూడా సంగీత దర్శకుడిగా తనదైన ముద్ర వేశారు. అలాగే ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఆయనకు సోదరుడు. దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళికి, సంగీత దర్శకురాలు ఎం. ఎం. శ్రీలేఖకు శివశక్తి దత్తా పెదనాన్న అవుతారు. సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన శివశక్తి దత్తా.. 92 ఏళ్ల వయసులో జూలై 8, 2025న అనారోగ్యంతో కన్నుమూశారు.    
తమిళ చిత్రం 'జో' లోని సుచిత్ర అనే క్యారక్టర్ ద్వారా ఎంతో మందిని తన నటనతో ఆకట్టుకున్న నటి  'మాళవిక మనోజ్'(Malavika Manoj).సుహాస్(Suhas)హీరోగా రామ్ గోదల(Ram Godhala)దర్సకత్వంలో తెరకెక్కిన 'ఓ భామ అయ్యో రామ'(O Bhama Ayyo Rama)అనే చిత్రం ద్వారా మాళవిక తొలిసారిగా తెలుగు తెరకి పరిచయం కాబోతుంది.   ఈ సందర్భంగా జరుగుతున్న ప్రమోషన్స్ లో  మాళవిక మీడియాతో మాట్లాడుతు 'జో'లో నా నటన నచ్చి దర్శకుడు రామ్ నన్ను సంప్రదించారు. ఈ కథలో ప్రేమ, వినోదంతో పాటు చాలా కోణాలు ఉన్నాయి. స్కిప్ట్ వినగానే ఏ మాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పేసాను. సత్యభామ అనే మోడరన్ అమ్మాయిగా, నా క్యారక్టర్ చాలా హైపర్ గా, గడుసుతనంతో ఉంటుంది. నా నిజ జీవితానికి మాత్రం ఈ క్యారక్టర్ చాలా దూరం. కానీ ఓన్ చేసుకొని నటించా. స్విమ్మింగ్ రాకపోయినా, ఒక సీన్ కోసమని నీళ్ళలోకి దూకి భయపడుతూనే స్విమ్ చేసాను. ప్రతి నటి కూడా తన కెరీర్ లో ఈ మూవీలో నేనే చేసే క్యారక్టర్ లాంటి దాన్ని పోషించాలని అనుకుంటుంది. ఇలాంటి పాత్ర ద్వారా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం కావడం ఎంతో ఆనందంగా ఉంది. కథ నచ్చి సౌకర్యంగా అనిపిస్తే గ్లామర్ పాత్రలు చేయడానికైనా సిద్ధమని మాళవిక మనోజ్ చెప్పుకొచ్చింది.  ఓ భామ అయ్యో రామని 'వి' ఆర్ట్స్ బ్యానర్ పై హరీష్ నల్ల నిర్మించగా బబ్లూ పృథ్వీ రాజ్, ప్రభాస్ శ్రీను, రఘు కారుమంచి, మొయిన్, సాత్విక్ ఆనంద్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.     
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  వర్షాకాలంలో గాలిలోని చల్లదనం హాయిని,  విశ్రాంతిని కలిగిస్తుంది. అందుకే చాలామందికి వర్షాకాలం అంటే బాగా ఇష్టం ఉంటుంది.  కానీ దీని కారణంగా చాలా సమస్యలు కూడా ఉన్నాయి.  వాటిలో ఒకటి ఇంట్లో పెరుగు సరిగా తోడు కాకపోవడం. చలికాలంలో జరిగేది ఏంటంటే.. పెరుగు తొందరగా తోడు కాకపోవడం ఒకటైతే.. పెరుగు బాగా క్రీమ్ లాగా కాకపోవడం మరొకటి.    కాలాన్ని బట్టి అన్ని మారుతున్నట్టే ఈ ప్రక్రియలో కూడా మార్పు చోటు చేసుకుంటుంది.  అయితే ఈ చలికాలంలో పెరుగు బాగా తోడు కావాలన్నా, క్రీమ్ గా గడ్డ పెరుగు రావాలన్నా ఈ కింది చిట్కాలు గమనించి వాటిని ఫాలో అవ్వాలి. ఉష్ణోగ్రత.. పెరుగు చిక్కగా రావాలంటే పాల ఉష్ణోగ్రత చాలా ముఖ్యం.  కొంతమంది పాలను వేడి చేసి అలా వదిలేసి ఉష్టోగ్రత చెక్ చేయకుండా తోడు పెడుతుంటారు. వాతావరణం కారణంగా పాలు తొందరగా చల్లగా అవుతాయి. అందుకే పాలు గోరువెచ్చగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. పాత్ర.. పెరుగు తోడు పెట్టాలి అనుకునే పాత్ర శుభ్రంగా ఉండాలి.  కొందరు ఏం చేస్తారంటే.. పాలు కాచిన గిన్నెలో అట్లాగే కాసింత పెరుగు వేసేస్తుంటారు. ఇది పెరుగు అదొక రకమైన వాసన,  పెరుగు రుచి మారడానికి కారణం అవుతుంది.  శుభ్రంగా, పొడిగా ఉన్న గిన్నెలో పాలు వేసి అందులో తోడు పెడితే పెరుగు బాగా అవుతుంది. పెరుగు కంటెంటే.. పాలు తోడు పెట్టడానికి పెరుగును జోడించడం మామూలే. అయితే  చలికాలంలో వాతావరణం కారణంగా కేవలం కొద్దిగా పెరుగు వేస్తే అది తోడు కావడం చాలా ఆలస్యం అవుతుంది.  పుల్లగా లేకుండా ఫ్రెష్ గా ఉన్న పెరుగును వినియోగించాలి.  ఒక లీటరు పాలకు ఒకటి నుండి రెండు స్పూన్ల తాజా పెరుగుతో తోడు పెడితే పెరుగు చాలా బాగా తోడవుతుంది. ఒక చిట్కా.. పెరుగును పాలలో ఒక చెంచా మొత్తంలో వేసి అలా మూత పెట్టేస్తుంటారు. అయితే ఇలా చేస్తే పెరుగు తోడు కావడం లేటవుతుంది. అలా కాకుండా పెరుగును పాలలో వేయగానే పాలు మొత్తం బాగా కలపాలి.  ఇలా చేస్తే పెరుగు చక్కగా సమంగా తయారవుతుంది. ప్రదేశం.. పెరుగు బాగా తోడు కావాలి అంటే ఇంట్లో స్థిరమైన, కాస్త వెచ్చగా ఉన్న ప్రదేశంలో పాల గిన్నెను ఉంచాలి. దీని వల్ల పెరుగు బాగా తోడవుతుంది. చల్లని ప్రదేశంలో ఉంచితే పెరుగు తొందరగా తోడు కాదు.                                     *రూపశ్రీ.  
  పిల్లలు పెరిగేకొద్దీ వారి అవసరాలు, ఆలోచనలు,  అవగాహన కూడా మారుతూ ఉంటాయి. దీనికి తగినట్టు  తల్లిదండ్రులు కూడా తమ పెంపకం విధానాన్ని తదనుగుణంగా మార్చుకోవాలి. ఎందుకంటే ప్రతి వయస్సులోనూ తమ పిల్లలకు సరైన విషయాలను నేర్పించడం తల్లిదండ్రుల బాధ్యత. ఇది ఈరోజు మాత్రమే కాకుండా భవిష్యత్తులో కూడా పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆడపిల్లలు  టీనేజ్‌లోకి ప్రవేశించినప్పుడు వారికి కొన్ని ముఖ్యమైన విషయాలను నేర్పించడం చాలా ముఖ్యం. ఇవి వారి జీవితాంతం వారికి ఉపయోగపడే విషయాలు. కాబట్టి పెరుగుతున్న ఆడపిల్లలు ఉంటే  తప్పనిసరిగా తల్లిదండ్రులు 5 విషయాలను నేర్పించాలని అంటున్నారు. అవేంటో తెలుసుకుంటే.. నో చెప్పడం.. తల్లిదండ్రులు 12 నుండి 15 సంవత్సరాల వయస్సు ఆడపిల్లలకు  ఏదైనా తమకు నచ్చని,  తమకు నష్టం కలిగించే  విషయానికి మొహమాటం లేకుండా 'కాదు' అని చెప్పడం నేర్పించాలని పిల్లల పెంపకం నిపుణులు అంటున్నారు.  ఎందుకంటే ప్రతి పరిస్థితిలోనూ 'అవును' అని చెప్పాల్సిన అవసరం లేదు. అది పిల్లలకు ఒక్కోసారి చాలా నష్టం కలిగించే అవకాశం ఉండవచ్చు.  కాబట్టి తల్లిదండ్రులు దీన్ని గుర్తుంచుకోవాలి. సెల్ఫ్ సపోర్ట్.. ఆడపిల్లలు తమను తాము ఎలా సమర్థించుకోవాలో కూడా వారికి నేర్పించాలి.  ఏ విషయంలో అయినా వారు తమ అభిప్రాయాలను ముందుకు తీసుకురావాలి.  ఏదైనా తప్పు జరిగితే  తప్పుకు వ్యతిరేకంగా తమ స్వరాన్ని పెంచాలి. అలాగే ఎప్పుడైనా తాము చెయ్యని తప్పుకు వారిని దోషులను చేయాలని అనుకున్నప్పుడు తమ తప్పు లేదని చెప్పడంలో వారు తమ స్వరాన్ని వినిపించడాన్ని,  తప్పొప్పులను వివరించే సామర్థ్యాన్ని కూడా వారికి నేర్పించాలి.  అది అమ్మాయిలను ధైర్యంగా ఉంచుతుంది. నమ్మకం.. ఎదుటివారు నమ్మకం ఉంచితేనే తాము సరైన వారు అనుకునే వారు చాలామంది ఉంటారు.  ఇందులో ముఖ్యంగా ఆడపిల్లలకు ఎక్కువగా ఉంటారు.  ఏ పని చేసినా ఆడపిల్లలను సులువుగా నిందించే వారు ఉంటారు.   ఎవరూ తమను నమ్మకపోయినా, వారు ఎప్పుడూ తమపై తాము నమ్మకాన్ని కోల్పోకూడదని కూతుళ్లకు చెప్పాలి . ఆత్మవిశ్వాసమే ఆడపిల్లలకు  నిజమైన బలం, అదే వారి సూపర్ పవర్. ఆడపిల్లలకు ఎదురయ్యే ప్రతి కష్టాన్ని అధిగమించడంలో వారి ఆత్మవిశ్వాసం ఎంతగానో సహాయపడుతుంది. సెల్ఫ్ ప్రొటెక్షన్..  ఆడపిల్లల విషయంలో తల్లిదండ్రులు ఇవ్వాల్సిన   మొదటి ప్రాధాన్యత భద్రత.  ప్రతి ఆడపిల్ల ఇతరులతో సంబంధం లేకుండా మొదటగా తనను తాను రక్షించుకోవడం ఎలాగో నేర్చుకోవాలి.  ప్రతికూల పరిస్థితుల్లో తనను తాను ఎలా సురక్షితంగా ఉంచుకోవచ్చో నేర్పించాలి.  నేటి సమాజానికి ఇది ఎంతో అవసరం. సెల్ఫ్ లవ్.. ఆడపిల్లలకు సెల్ఫ్ లవ్ గురించి నేర్పించాలి.  ఒక దశ తర్వాత ఆడపిల్లలు తమ శరీరాన్ని కూడా పట్టించుకోకుండా కుటుంబ ఒత్తిడులలో,  కుటుంబ బాధ్యతలలో మునిగిపోతారు.  అలాంటి వారికి జీవితంలో తొందరగా విరక్తి వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే తన గురించి తాను కూడా ఆలోచించుకోవాలి.  తనను తాను ప్రేమించుకోవాలి.  తన డ్రెస్సింగ్ స్టైల్,  తన ఆరోగ్యం, తను తీసుకునే ఆహారం, తన ఇష్టాలు, అభిరుచులు.. ఇట్లా అన్ని విషయాలలో ఆడపిల్లలు అవగాహన కలిగి ఉండాలి.  ఇవన్నీ ఆడపిల్లను ఒక శక్తిగా మారుస్తాయి.                               *రూపశ్రీ.
  మనిషి జీవితంలో విజయం సాధించాలంటే చాలా కష్టాలు ఎదుర్కోవాలి. కానీ విజయం సాధించి మళ్ళీ కింద పడి, ఎమ్మల్లి లేచి నిలదొక్కుకోవాలంటే మాత్రం కష్టం, తెలివి, ఆత్మవిశ్వాసం, తన మీద తనకు నమ్మకం.. ఇవ్ణనే ఉండాలి. దేనికి ఒక కథ ఉదాహరణగా నిలుస్తుంది. విదేశంలోని ఒక వ్యాపారవేత్త అనుకోని పరిస్థితుల్లో ఘోరంగా దివాళా తీశాడు. ఫలితంగా అప్పుల్లో కూరుకుపోయాడు. మరోవైపు ఆయనకు డబ్బులు ఇవ్వాల్సిన వ్యక్తులు కూడా ముఖం చాటేస్తూ ఉన్నారు. ఈ విషయం తెలిసిన అప్పుల వాళ్ళు తీవ్రంగా ఒత్తిడి తెస్తూ ఉన్నారు. పరిస్థితి అగమ్యగోచరమైపోయింది. ఎంతో ఆందోళనతో ఆ వ్యాపారి ఒక రోజు తన ఇంటికి సమీపంలోని ఓ పార్క్ కు  వెళ్ళి, తలపై చేతులు పెట్టుకొని విషాదంగా కూర్చున్నాడు. ఇంతలో హుందాగా వస్త్రధారణ చేసుకున్న ఓ అరవై ఏళ్ళ వృద్ధుడు ఆయన వద్దకు వచ్చాడు. "ఏదో కోల్పోయిన వాడిలా ఉన్నావు. జీవితంలో ఏమైనా నష్టం వాటిల్లిందా?" అని అడిగాడు. ఎంతో ఆత్మీయంగా పలకరించే సరికి, కదలిపోయిన ఆ వ్యాపారి తన కష్టనష్టాల్ని ఆ పెద్దాయనకు వివరించాడు. వెంటనే ఆ వృద్ధుడు స్పందించి "నేను నీకు ఏదైనా సహాయం చేద్దామనుకుంటున్నాను" అంటూ, "నీ పేరేంట"ని అడిగాడు. ఆ వ్యాపారి తన పేరు చెప్పగానే వెంటనే తన చెక్ బుక్ జేబులో నుంచి తీసి, ఆ పేరుతో చెక్ రాసి, సంతకం చేసి వ్యాపారి చేతిలో పెట్టాడు. "ఈ చెక్కు తీసుకో. నేను దీన్ని నీకు అప్పుగా ఇస్తున్నాను. సరిగ్గా సంవత్సరం తరువాత నేను నిన్ను ఇక్కడే కలుస్తాను. అప్పుడు నా అప్పు తీర్చేయ్" అన్నాడు. అయిదు లక్షల డాలర్ల చెక్కు అది. పైగా ఇచ్చిన వ్యక్తి ఎవరో కాదు - ప్రపంచంలోనే అత్యంత శ్రీమంతుల్లో ఒకరైన రాక్ఫెల్లర్ అని తెలిసి వ్యాపారికి నోట మాట రాలేదు. ఆ చెక్కు తీసుకొని ఇంటికి చేరుకున్నాడు ఆ వ్యాపారి. కానీ దాన్ని నగదుగా మార్చుకొని అప్పులు తీర్చుకోలేదు. దాన్ని బీరువా అరలో పెట్టుకొని, అది ఉందన్న నమ్మకంతో ముందు తన వ్యాపారాన్ని చక్కదిద్దుకోవడం మొదలుపెట్టాడు. ఆ అయిదు లక్షల డాలర్లు తన వెనుక ఉన్నాయన్న విశ్వాసంతో ధైర్యంగా ముందడుగు వేశాడు. అప్పుల వాళ్ళ వద్దకు వెళ్ళి, కొద్దిరోజులు గడువు ఇవ్వమని అడిగాడు. తనకు రావలసిన మొత్తాన్ని చాకచక్యంతో రాబట్టుకున్నాడు. తిరిగి కొంత పెట్టుబడితో కొత్త వ్యాపారం ప్రారంభించాడు. కొన్నాళ్ళకు మళ్ళీ తన పూర్వవైభవానికి చేరుకున్నాడు. సరిగ్గా సంవత్సరం తరువాత అదే చెక్కు తీసుకొని, కృతజ్ఞతలు చెప్పుకొని ఇచ్చేసేందుకు అదే పార్క్ కు వెళ్ళాడు. సాయంత్రానికి ఆ వృద్ధుడు మళ్ళీ అక్కడకు వచ్చాడు. ఎంతో ఆనందంతో ఈ వ్యాపారి ఆయన వద్దకు వెళ్ళబోతుండగా, దూరంగా ఉన్న ఓ మొబైల్ వ్యాన్ నుంచి నర్సు దిగి పరుగెత్తుకుంటూ వచ్చింది. ఆ వృద్ధుడిని పట్టుకొని "హమ్మయ్య! ఇప్పటికి దొరికాడు. పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చి, కనిపించిన వారికల్లా. 'నేను రాక్ఫెల్లర్ని' అంటూ చెక్కులు రాసి ఇచ్చేస్తున్నాడు" అంటూ డ్రైవర్ సహాయంతో ఆ వాహనంలోకి అతణ్ణి ఎక్కించుకొని తీసుకువెళ్ళి పోయింది. వ్యాపారి ఆనందాశ్చర్యాలకు గురయ్యాడు. ఇన్నాళ్ళూ తన దగ్గర ఉన్నది ఓ చెల్లని చెక్కనీ, దానిపై భరోసా పెట్టుకొని ఇంత సాధించానా అనీ ఆత్మశోధన చేసుకొని పులకరించి పోయాడు. నిజానికి ఆ వ్యాపారికి బయట నుంచి ఏ సహాయమూ అందలేదు. కానీ తనలో అచేతనంగా ఉన్న ఆత్మవిశ్వాసాన్ని తట్టి లేపేందుకు ఆ చెల్లనిచెక్కు ఉపయోగపడింది అంతే! అదే విధంగా చాలాసార్లు మనం బయట నుంచి ఏదో ఒక ఆలంబన కావాలని తపించిపోతూ ఉంటాం. కానీ అది కొంత వరకే మనకు సహకరిస్తుంది. ఎప్పుడైనా మనకు వాటిల్లిన ఉపద్రవం నుంచి బయటపడడానికి పూర్తిగా బాధ్యత వహించాల్సింది మనమే!  బాహ్యప్రపంచం నుంచి ఎవరికీ, ఎప్పుడూ ఏ సహాయమూ అందదు. ఎవరికి వారే ఆలంబనగా నిలిచి, నిలదొక్కుకోవాలి. అలాంటివారే గొప్ప విజయాలను సాధించగలరు. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి.                                         *నిశ్శబ్ద.
  బిపి ని సాధారణంగా  రక్తపోటు అని కూడా పిలుస్తారు.  హై బిపి ఉంటే మాత్రం దాన్ని అధిక రక్తపోటు అంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేసే ఆరోగ్య సమస్య. అధిక రక్తపోటు  గుండెపోటు,  స్ట్రోక్‌లకు కారణమవుతుంది.   వృద్ధాప్యంలో చిత్తవైకల్యం వచ్చే ప్రమాద కారకంగా కూడా ఉంటుంది. ప్రతి నలుగురు పురుషులలో ఒకరు,  దాదాపు ఐదుగురు స్త్రీలలో ఒకరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. కానీ చాలా మందికి దీని గురించి స్పష్టంగా తెలియదు.  అందుకే దీనిని  సైలెంట్ కిల్లర్ అని కూడా పిలుస్తారు. బిపిని నిర్వహించడానికి సరైన ఆహారం,  క్రమం తప్పకుండా వ్యాయామం చాలా ముఖ్యమైనవి.  వ్యాయామం చేయడం వల్ల రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే వారానికి ఎన్నినిమిషాలు లేదా గంటలు వ్యాయామం చేయాలనే విషయం గురించి పూర్తీగా తెలుసుకుంటే.. హై బిపి అంటే.. అధిక రక్తపోటు అనేది ఒక తీవ్రమైన సమస్య. దీనిలో ధమని గోడలపై రక్త పీడనం సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. దీని అర్థం  గుండె రక్తాన్ని పంప్ చేయడానికి ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. అధిక రక్తపోటు గుండెపోటు, స్ట్రోక్,  మూత్రపిండాల వ్యాధితో సహా అనేక వ్యాధులకు కారణమవుతుంది. హై బిపి ప్రమాదం తగ్గించాలంటే.. అధిక రక్తపోటు నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనుకుంటే ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు,  క్రమం తప్పకుండా వ్యాయామం,  వ్యాయామ అలవాట్లను కూడా అలవర్చుకోవాలి. శరీరంలో  అన్ని అవయవాలు సరిగ్గా పనిచేయడానికి ఈ అలవాట్లు కూడా అవసరం.  ఇది అనేక ఇతర వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఎన్ని గంటల వ్యాయామం? ఏ వ్యాయామాలు చేయాలి? వయోజన వ్యక్తులు అయితే  ప్రతి వారం కనీసం ఐదు గంటలు మితమైన వ్యాయామం చేస్తే అధిక రక్తపోటు ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ముఖ్యంగా వారు 60 సంవత్సరాల వయస్సు వరకు వ్యాయామ అలవాటును కొనసాగించడం మంచిది. వారానికి 5 గంటల వ్యాయామం, ఇందులో కొన్ని తీవ్రమైన ఏరోబిక్ కార్యకలాపాలు,  మితమైన తీవ్రత కలిగిన వ్యాయామాల  కలయిక ఉండాలి. ఇది  రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. వ్యాయామం ఎలా హెల్ప్ అవుతుంది? వ్యాయామం రక్తపోటును ఎలా నియంత్రించడంలో సహాయపడుతుందో  అని చాలామందికి కన్ఫ్యూషన్ ఉంటుంది.   క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే అది గుండెను బలపరుస్తుంది.  బలమైన గుండె ఎక్కువ కష్టపడకుండానే ఎక్కువ రక్తాన్ని పంప్ చేయగలదు. ఈ విధంగా రక్త నాళాలపై బలం తగ్గుతుంది.  ఫలితంగా రక్తపోటు తగ్గుతుంది. సాధారణ రక్తపోటు 120/80 mmHg లేదా అంతకంటే తక్కువగా ఉండాలి.                               *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
  సీజన్ ను బట్టి ఆహారపు అలవాట్లు మార్చుకోవలసి ఉంటుంది. ముఖ్యంగా సీజన్ తో పాటు కొన్ని రకాల కూరగాయలను కొత్తగా జత చేసుకోవడం లేదా కొన్ని తినకుండా వదిలిపెట్టడం వంటివి చేస్తారు.  అదే విధంగా వర్షాకాలంలో  5 రకాల కూరగాయలు తినడం మంచిది కాదని, సాధ్యమైతే వీటిని ఈ వర్షాకాలంలో పూర్తీగా వదిలిపెట్టడం మంచిదని అంటున్నారు వైద్యులు,  ఆహార నిపుణులు. ఇంతకీ వర్షాకాలంలో వదిలిపెట్టాల్సిన కూరగాయలు ఏమిటి? వాటిని ఎందుకు వదిలిపెట్టాలి? తెలుసుకుంటే.. వర్షాకాలం వచ్చిందంటే చాలు.. చాలామంది క్యాబేజీ తినడం తగ్గిస్తారు. దాని నుండి వచ్చే పురుగులు చాలా ప్రమాదకరమైనవిగా భావిస్తారు. కానీ క్యాబేజీ మాత్రమే కాకుండా పురుగులు ఉన్న కూరగాయలు చాలా ఉన్నాయి.  అవి శుభ్రం చేసిన తర్వాత కూడా అందులో పురుగులు  పూర్తిగా బయటకు రావు.  అందుకే వర్షాకాలంలో  కొన్ని కూరగాయలు అస్సలు తినకూడదని అంటారు. ఆకుకూరలు.. పాలకూర, మెంతికూ,  ఆవాల చెట్టు ఆకులు  .. ఇలా చాలా రకాల ఆకుకూరలు వర్షాకాలంలో తినకపోవడమే మంచిది.   వాటిని ఎంత బాగా కడిగినా కొన్ని కంటికి కనిపించనంత సన్నని పురుగులు, సూక్ష్మజీవులు అలాగే ఉంటాయి. క్యాబేజీ,  క్యాలిఫ్లవర్.. క్యాబేజీ,  కాలీఫ్లవర్ లలో పొరలు, పువ్వులు ఉంటాయి.  ఈ పొరల మధ్య తేమ, బ్యాక్టీరియా,  ఫంగస్ సులభంగా పెరుగుతాయి. వీటిని తినకపోవడమే మంచిది.  ఒకవేళ వీటిని తినాలని అనుకుంటే గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి ఆ నీటిలో వీటిని బాగా కడగాలి. పుట్టగొడుగు.. వర్షాకాలంలో సూర్యకాంతి తక్కువగా ఉంటుంది.  ఈ కారణంగా చాలామంది విటమిన్-డి కోసం అయినా పుట్టగొడుగులను తినాలని అనుకుంటారు. పైగా వర్షాల కారణంగా పుట్టగొడుగులు కూడా బాగా పండుతాయి.  కానీ పుట్టగొడుగులు ఎంత ఆరోగ్యమూ.. వీటిని  సరిగ్గా శుభ్రం చేయకపోతే లేదా కొద్దిగా కలుషితమైనా చాలా చెడ్డ చేస్తుంది. పుట్టగొడుగులు  ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదాన్ని పెంచుతాయి. బంగాళదుంపలు.. ఆహార నిపుణుల ప్రకారం వర్షాకాలంలో బంగాళాదుంపలు తినకపోవడం మంచిది.  ఎందుకంటే బంగాళదుంపలు  త్వరగా మొలకెత్తుతాయి. కాబట్టి బంగాళాదుంపలను ఇలా తినకూడదు. అయితే, సరిగ్గా నిల్వ చేస్తే బంగాళాదుంపలు త్వరగా మొలకెత్తవు . వీటిని అయితే తినవచ్చు. జాగ్రత్త.. వర్షాకాలంలో కూరగాయలు అయినా ఆకుకూరలు అయినా చాలా తాజాగా ఉండాలి.  తాజాగా ఉన్నా సరే.. వీటిని వేడి నీటిలో ఉప్పు వేసి బాగా శుభ్రం చేసుకున్న తర్వాత మాత్రమే వండుకోవాలి. లేకపోతే వీటిలో ఆరోగ్యానికి హాని కలిగించే పురుగులు, రసాయనాలు, సూక్ష్మక్రిములు ఉంటాయి.                                        *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
  ఈ రోజుల్లో చెడు జీవనశైలి,  తప్పుడు ఆహారపు అలవాట్లు  గుండె ఆరోగ్యంపై  చాలా చెడ్డ  ప్రభావాన్ని చూపుతాయి. అంతేకాకుండా మన చిన్న చిన్న రోజువారీ అలవాట్లు గుండెకు హాని కలిగిస్తాయి.  ఇవి క్రమంగా  గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. దీనితో పాటు నేటికాలంలో అన్ని సమస్యలకు మందులు వాడటం,  ఖరీదైన చికిత్సలు తీసుకోవడం  కూడా కొన్నిసార్లు  శరీరానికి హాని కలిగిస్తాయి.  అధిక వ్యాయామం కూడా గుండెపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.  ఇలా నేటి కాలంలో చాలా కారణాలుగా గుండె జబ్బుల ప్రమాదం క్రమేపీ పెరుగుతోంది.  గుండె ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలంటే.. కొన్ని సులభమైన,  ఆరోగ్యకరమైన పద్ధతులను పాటించడం చాలా ముఖ్యం. ఇది శరీరానికి ఎటువంటి హాని లేకుండా  చేస్తుంది. అటువంటి 5 సులభమైన అలవాట్ల గురించి తెలుసుకుంటే.. భోజనం తర్వాత నడక.. భోజనం తర్వాత 10 నిమిషాల నడక చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి భోజనం చేసిన వెంటనే కూర్చునే అలవాటును మార్చుకోవాలి.  ప్రతి భోజనం తర్వాత 10 నిమిషాల తేలికపాటి నడక చేయాలి. ఇది రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది,  బరువు పెరగకుండా నిరోధిస్తుంది. ఒమేగా-3 ఫ్యాట్స్.. రోజువారీ ఆహారంలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉండేలా చూసుకోవాలి. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె,  మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. ఇది గుండె, మెదడు,  వాపును నియంత్రించడంలో సహాయపడుతుంది. సాల్మన్, చేపలు, అవిసె గింజలు,  వాల్‌నట్‌ల వంటి వాటి నుండి  ఒమేగా-3ని పుష్కలంగా పొందవచ్చు. నిద్ర.. మంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ 7-9 గంటలు మంచి నిద్ర పొందడం ముఖ్యం. ఈ రోజుల్లో చాలా మందికి రాత్రిపూట ఫోన్ వాడటం,  టీవీ చూడటం అలవాటు కారణంగా నిద్ర సైకిల్ దారుణంగా దెబ్బతింటోంది. తక్కువ నిద్రపోవడం వల్ల ఊబకాయం, వ్యాధులు,  అలసట వంటి సమస్యలు వస్తాయి. ప్లాస్టిక్ నిషేధం.. మంచి గుండె ఆరోగ్యానికి ప్లాస్టిక్ వస్తువులను నివారించడం,  గాజు లేదా స్టీల్ కంటైనర్లు ఉపయోగించడం ముఖ్యం. ప్లాస్టిక్‌లో ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి.  ఇవి హార్మోన్లకు,  శరీరానికి హాని కలిగిస్తాయి. ప్లాస్టిక్ రసాయనాలు నెమ్మదిగా శరీరంలో విషాన్ని వ్యాపింపజేస్తాయి. ఇది క్యాన్సర్,  ఇతర వ్యాధులకు కారణమవుతుంది. అందువల్ల ఆహారాన్ని నిల్వ చేయడానికి గాజు లేదా స్టీల్  పాత్రలు మంచివి. ఇవి  గుండె ఆరోగ్యానికి అలాగే మొత్తం ఆరోగ్యానికి సురక్షితమైనవి. బరువు.. మంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి  బరువు,  BMI ని చూస్తే సరిపోదు. రక్త పరీక్షలపై కూడా శ్రద్ధ వహించాలి.  బరువు లేదా BMI కంటే రక్త పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యం. LDL, CRP,  ఫాస్టింగ్ ఇన్సులిన్ వంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. తద్వారా గుండె ఆరోగ్యాన్ని పర్యవేక్షించవచ్చు. గుండె జబ్బులను నివారించడానికి ఇది ఉత్తమ మార్గం. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం వల్ల సమస్యలను ముందుగానే గుర్తించవచ్చు. ఆహారం.. గుండె ఆరోగ్యాన్ని బాగా ఉంచుకోవాలంటే  ఆహారంలో పండ్లు,  ఆకుపచ్చ కూరగాయలను చేర్చుకోవాలి. వాటిలో  గుండెను బలంగా,  ఆరోగ్యంగా ఉంచే పోషకాలు ఉంటాయి.  వాటిని సరిగ్గా తినకపోతే, అది గుండెకు హాని కలిగిస్తుంది. ఈ రోజుల్లో, చాలా మంది ఏదో ఒక విషయం గురించి ఒత్తిడి తీసుకోవడం చాలా సహజం అయిపోయింది. ఇది గుండెపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.                                        *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..