Home

»

Latest News

నందమూరి vs అక్కినేని.. 11 ఏళ్ళ తర్వాత బరిలోకి!

May 27, 2026 10:33AM


-2027 సంక్రాంతి బరిలో బాలకృష్ణ, నాగార్జున సమరం తప్పదా 
-శరవేగంగా ఇరు చిత్రాల షూటింగ్స్ 
-11 ఏళ్ళ తర్వాత పోటీ పడటంతో ఫ్యాన్స్, ప్రేక్షకుల్లో ఆసక్తి

తెలుగు చిత్రసీమలో దశాబ్దాల చరిత్ర కలిగిన నందమూరి, అక్కినేని కుటుంబాల బాక్సాఫీస్ సమరం మరోసారి పునరావృతం కానుంది. గత నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్‌ని  ఏలుతున్న అగ్ర నటులు నందమూరి బాలకృష్ణ(Balakrishna),కింగ్ అక్కినేని నాగార్జున(Nagarjuna)రాబోయే 2027 సంక్రాంతి బరిలో నేరుగా తలపడనున్నారు. వెండితెరపై ఈ ఇద్దరి మధ్య సాగే బాక్సాఫీస్ పోటీ ప్రేక్షకులకి ఎప్పుడూ అసలైన వినోదాన్ని పంచుతుంది. నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావుల కాలం నుంచే మొదలైన ఈ సాంప్రదాయం, వారి నటవారసులైన బాలయ్య, నాగ్ ల వరకు విజయవంతంగా కొనసాగుతోంది. గతంలో వీరిద్దరూ బాక్సాఫీస్ బరిలో దాదాపు 10 సార్లు తలపడగా సినీ పండగ సీజన్ సంక్రాంతి రేసులో మాత్రం మూడుసార్లు తలపడ్డారు. ఇప్పుడు సుమారు 11 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ సంక్రాంతి రేసులో నిలవనున్నారనే న్యూస్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది.

కింగ్ నాగార్జున తన కెరీర్‌లో  ప్రతిష్టాత్మకమైన,100వ చిత్రం 'లాటరీ కింగ్'తో ఈ సంక్రాంతి రేసులోకి నిలవనున్నాడనే వార్తలు వస్తున్నాయి.  ఆర్ కార్తీక్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుండగా 'సోగ్గాడే చిన్ని నాయన', 'బంగార్రాజు' వంటి చిత్రాలతో సంక్రాంతి సీజన్ లో వరుసగా బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్న నాగార్జున, ఈసారి తన 100వ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించాలని భావిస్తున్నాడు. మరోవైపు, ఫ్లాష్ స్పీడ్‌తో సినిమాలు పూర్తి చేసే గాడ్ ఆఫ్ మాసెస్  బాలకృష్ణ సైతం మరో సారి సంక్రాంతికి తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నాడు.  గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'NBK 111' ని  డిసెంబర్ కల్లా పూర్తి చేసి, పక్కాగా 2027 పొంగల్ రేసులో నిలపాలని చిత్రబృందం ప్రణాళికలు రచిస్తోంది. 

Also read: Toxic: టాక్సిక్ కొత్త డేట్ ఇదేనా! సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న తాజా న్యూస్ 


ఈ ఇద్దరు అగ్ర హీరోల పోరుతో పాటు, 2027 సంక్రాంతి టాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద "మహా సంగ్రామం"గా మారబోతోంది. ఎందుకంటే తెలుగు సినీ ఇండస్ట్రీకి నాలుగు స్తంభాలుగా భావించే మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కూడా ఇదే పండగ రేసులో జాయిన్ అవుతున్నారు. చిరంజీవి(Chiranjeevi)బాబీ కాంబోలో రాబోతున్న పవర్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్, అనిల్ రావిపూడి, వెంకటేష్(venkatesh)కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలు కూడా ఈ పండగ బరిలోనే నిలుస్తున్నాయి. టాలీవుడ్ చరిత్రలోనే ఈ నలుగురు సీనియర్ అగ్ర హీరోల సినిమాలు ఒకే సీజన్‌లో, ఒకేసారి విడుదల కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. మునుపెన్నడూ లేని విధంగా ఒకే పండక్కి 4 పెద్ద సినిమాలు థియేటర్లలో సందడి చేయనుండటంతో అభిమానులకి  కన్నుల పండుగగా మారనుంది. ముఖ్యంగా నందమూరి వర్సెస్ అక్కినేని పోరు 11 ఏళ్ల తర్వాత కుదరడంతో  ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com