
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (Peddi) చిత్రం బాక్సాఫీస్ వద్ద అప్పుడే తన విశ్వరూపాన్ని చూపించడం ప్రారంభించింది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరికొత్త పాత్రలో కనిపించబోతుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ క్రేజీ ప్రాజెక్టులో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, విలక్షణ నటుడు జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి అందించిన అద్భుతమైన సంగీతం, ముఖ్యంగా 'హెల్లాల్లల్లో' వంటి చార్ట్ బస్టర్ సాంగ్స్ ఇండస్ట్రీలో మునుపెన్నడూ లేనంత హైప్ క్రియేట్ చేశాయి. ఈ క్రేజ్ కాస్తా ఇప్పుడు ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో కనిపిస్తూ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఇంకా సినిమా రిలీజ్ కావడానికి సమయం ఉన్నప్పటికీ, నార్త్ అమెరికా (North America) బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ సృష్టించిన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రభంజనం టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ట్రేడ్ వర్గాల తాజా సమాచారం ప్రకారం, నార్త్ అమెరికాలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే 5,10,000 డాలర్ల ($510K+) మార్కును దాటి అత్యంత వేగంగా దూసుకుపోతోంది. అక్కడ ఉన్న దాదాపు 475 లొకేషన్లలో బుకింగ్స్ ఓపెన్ అవ్వగా, కేవలం ప్రీ-సేల్స్ ద్వారానే 18,000 కంటే ఎక్కువ టిక్కెట్లు అమ్ముడైపోయాయి. ముఖ్యంగా అక్కడి ప్రముఖ సినీమార్క్ (Cinemark) థియేటర్ల చైన్‌లో ఈ చిత్రానికి అపూర్వమైన ఆదరణ లభిస్తోంది. సాధారణంగా టాలీవుడ్‌లో వచ్చే కొన్ని భారీ బడ్జెట్ చిత్రాల కంటే కూడా ‘పెద్ది’ సినిమా ప్రీ-సేల్స్ నెంబర్స్ చాలా రెట్లు ఎక్కువగా ఉండటం విశేషం.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఈ సినిమా భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. జూన్ 3న నార్త్ అమెరికా, యూకే (UK), యూరప్, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ వంటి ప్రముఖ అంతర్జాతీయ మార్కెట్లలో ‘పెద్ది’ ప్రీమియర్ షోలు పడబోతున్నాయి. ఆ మరుసటి రోజు, అంటే జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది.
ప్రస్తుతం యుఎస్ఏ లో నడుస్తున్న ఈ అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ మరియు మెగా ఫ్యాన్స్ లో ఉన్న ఊపును చూసి ఇండస్ట్రీ ప్రముఖులు, ట్రేడ్ విశ్లేషకులు ఒక అంచనాకు వచ్చారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ ఓపెనర్ (Biggest Opener) కాబోతుందని వారు బలంగా అంచనా వేస్తున్నారు. కేవలం బుకింగ్స్ తోనే హాట్ టాపిక్‌గా మారిన ‘పెద్ది’ బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకెన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.






