Home

»

Latest News

Chiranjeevi: మెగాస్టార్‌పై పిచ్చి కూతలు కూస్తే జైలుకే.. యూట్యూబ్ ఛానెల్‌పై కేసు నమోదు!

May 27, 2026 10:53AM

- మెగాస్టార్ చిరంజీవిపై అసత్య ప్రచారాలు
- వ్యూస్ కోసం చిరంజీవి మార్ఫింగ్ వీడియోలు
- లాయర్ రామకృష్ణ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు
- యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకులపై కేసు నమోదు

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) గురించి అవాస్తవాలను ప్రచారం చేస్తున్న ఒక యూట్యూబ్ ఛానెల్‌పై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సమాజంలో ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం, ప్రతిష్ట కలిగిన చిరంజీవిపై సదరు ఛానెల్ పూర్తిగా బోగస్ కంటెంట్‌తో దుష్ప్రచారం చేస్తోందని, తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోందని పోలీసులు నిర్ధారించారు. మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలను వాడుతూ ఆయన ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేలా వ్యవహరిస్తున్న ఛానెల్ నిర్వాహకులను శిక్షించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

ఈ కేసుకు సంబంధించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్, కమలాపురి కాలనీకి చెందిన ప్రముఖ న్యాయవాది రామకృష్ణ మిర్యాల జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు యూట్యూబ్ ఛానెల్ చిరంజీవి ఆరోగ్యంపై పూర్తిగా అభ్యంతరకరమైన, అవాస్తవమైన కంటెంట్‌ను క్రియేట్ చేసిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చిరంజీవి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారంటూ కొన్ని మార్ఫింగ్ చేసిన విజువల్స్‌తో వీడియోలు రూపొందించి, వాటిని వ్యూస్ కోసం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వైరల్ చేశారని లాయర్ రామకృష్ణ ఫిర్యాదులో వెల్లడించారు.

ఇలాంటి ఫేక్ వీడియోల వల్ల సమాజంలో అనవసర అలజడి సృష్టిస్తున్నారని, కోట్లాది మంది మెగా అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నారని లాయర్ రామకృష్ణ పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. ఫిర్యాదుతో పాటు సదరు యూట్యూబ్ ఛానెల్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్లు, అభ్యంతరకరమైన వీడియో లింకులను పక్కా ఆధారాలుగా పోలీసులకు అందజేశారు. ఈ ఆధారాలను పరిశీలించిన జూబ్లీహిల్స్ పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టి, నిబంధనల ప్రకారం కోర్టు అనుమతి తీసుకుని ఛానెల్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.

ఇటీవలి కాలంలో వ్యూస్, లైక్స్ కోసం సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు, ఆరోగ్యంపై థంబ్‌నైల్స్ మార్చి అడ్డగోలుగా అబద్ధాలు ప్రచారం చేసే యూట్యూబ్ ఛానెళ్ల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలోనే మెగాస్టార్‌పై జరిగిన ఈ తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com