Home

»

Latest News

Toxic: టాక్సిక్ కొత్త డేట్ ఇదేనా! సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న తాజా న్యూస్ 

May 27, 2026 9:55AM

 

 

రాకింగ్ స్టార్ యష్(Yash)మోస్ట్ అవైటెడ్ వన్ మాన్ షో యాక్షన్ డ్రామా 'టాక్సిక్' (TOXIC). మలయాళ టాలెంటెడ్ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్(Geethu MOhandas)దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ సినిమా థియేట్రికల్ విడుదల విషయంలో మాత్రం వరుసగా బ్రేకులు పడుతుండటం అభిమానులను కలవరపెడుతోంది. ఇప్పటికే మూడు సార్లు విడుదల తేదీలని మార్చుకుంది.  జూన్ 4వ తేదీ కూడా అందులో ఉన్న విషయం తెలిసిందే. సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న కధనాల ప్రకారం  ఈ సినిమా వాయిదా పడటం వెనుక బలమైన ఓటీటీ మరియు గ్లోబల్ బిజినెస్ కారణాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది.

సినిమా ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం, 'టాక్సిక్' చిత్ర డిజిటల్ రైట్స్  కోసం నిర్మాతలు ఆశిస్తున్న భారీ రేటుకి , ప్రముఖ ఓటీటీ సంస్థలు ఆఫర్ చేస్తున్న మొత్తానికి మధ్య అస్సలు సింక్ కుదరడం లేదు. దాదాపు 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం డిజిటల్ హక్కుల కోసం నిర్మాతలు భారీ ఆశలే పెట్టుకున్నారు. గతంలో 'కేజీఎఫ్' సాధించిన రికార్డు స్థాయి వసూళ్లు మరియు క్రేజ్‌ను ప్రాతిపదికగా తీసుకుని మేకర్స్ భారీ ధరను డిమాండ్ చేస్తుంటే, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు మాత్రం ప్రస్తుత మార్కెట్ మందగమనాన్ని చూపిస్తూ కేవలం 100 కోట్ల రూపాయలను మాత్రమే ఆఫర్ చేస్తున్నట్లు గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఈ వంద కోట్ల ఆఫర్ నిర్మాతలకు ఏమాత్రం గిట్టుబాటు కాకపోవడం మరియు ఓటీటీ సంస్థలు విధిస్తున్న కఠినమైన నిబంధనల వల్ల డిజిటల్ డీల్ ఒక కొలిక్కి రాలేదు. సాధారణంగా ఇలాంటి భారీ పాన్ ఇండియా చిత్రాలకు థియేటర్ల విడుదలకు ముందే డిజిటల్ మరియు శాటిలైట్ హక్కుల ద్వారా వచ్చే ముందస్తు ఆదాయం అత్యంత కీలకం. ఈ వ్యాపార ఒప్పందాలు ఆలస్యం కావడం వల్లే ప్రమోషన్స్ మరియు విడుదల తేదీలని  వెనక్కి నెట్టాల్సి వచ్చింది.

Also read: Peddi: ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్... ఆ ఏరియాలో పెద్ది సంచలన రికార్డు 


మరోవైపు, సినిమా మేకర్స్ అధికారికంగా వెల్లడించిన దాని ప్రకారం.. సినిమా షూటింగ్ పూర్తిగా పూర్తయింది. రీసెంట్‌గా ప్రతిష్టాత్మక 'సినిమాకాన్' ఈవెంట్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించినప్పుడు అంతర్జాతీయ డిస్ట్రిబ్యూటర్ల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ చిత్రాన్ని కేవలం భారతీయ భాషల్లోనే కాకుండా, ఇంగ్లీష్‌తో పాటు పలు అంతర్జాతీయ భాషల్లో ఒకేసారి భారీ గ్లోబల్ రిలీజ్ ప్లాన్ చేయాలని యష్ భావిస్తున్నారు. అంతర్జాతీయ భాగస్వామ్యాలు, ప్రపంచవ్యాప్త పంపిణీ ఒప్పందాలని  చక్కదిద్దేందుకే ఈ సమయం తీసుకుంటున్నట్లు హీరో యష్ తన ప్రకటనలో తెలిపారు. అయితే, ఈ గ్లోబల్ బిజినెస్ ఇష్యూస్ , ఓటీటీ డీల్స్ గనుక త్వరగా సెటిల్ అవ్వకపోతే, కనీసం ఆగస్టు నాటికైనా 'టాక్సిక్' థియేటర్లలోకి రావడం కష్టమేనని ఇండస్ట్రీ టాక్. ఒకవేళ ఆగస్టు నెల కూడా మిస్ అయితే, ఈ మెగా ప్రాజెక్ట్ ఏకంగా వచ్చే ఏడాది అంటే 2027 కి షిఫ్ట్ అయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి కీ రోల్స్ 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com