Home

»

Latest News

Peddi: రామ్ చరణ్ 'పెద్ది' బాక్సాఫీస్ ర్యాంపేజ్.. ఏపీ బుకింగ్స్‌పై మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్!

May 26, 2026 7:29PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'పెద్ది' (Peddi). జూన్ 4న విడుదల కాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేయగా, తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కు సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో 'పెద్ది' చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ మే 30 నుండి పూర్తిస్థాయిలో ఓపెన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. సినిమా విడుదలకి సరిగ్గా ఐదు రోజుల ముందే టికెట్ సేల్స్ ప్రారంభించి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడానికి డిస్ట్రిబ్యూటర్లు రంగం సిద్ధం చేస్తున్నారు. మే 30న బుకింగ్స్ ఓపెన్ అయిన నిమిషాల్లోనే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరోవైపు, అభిమానుల కోరిక మేరకు ఏపీలోని పలు కీలక ప్రాంతాలలో జూన్ 3 రాత్రి నుంచే స్పెషల్ షోలు ప్రదర్శించేలా ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా, ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి టికెట్ ధరల పెంపు మరియు అదనపు షోలకు సంబంధించిన ప్రత్యేక అనుమతులు కూడా లభించనున్నాయని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక జీవో వచ్చే అవకాశం ఉంది.

ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ పీరియాడిక్ విలేజ్ యాక్షన్ డ్రామాను వృద్ధి సినిమాస్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. విజయనగరం బ్యాక్‌డ్రాప్‌లో రామ్ చరణ్ సరికొత్త మాస్ మేకోవర్‌తో నటిస్తున్న ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు నుంచే సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. మే 30 నుంచి ప్రారంభం కాబోయే ఏపీ బుకింగ్స్ ట్రెండ్ చరణ్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌కు దారితీయబోతోంది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com