Home

»

Latest News

Aaya Sher: నాని 'ఆయా షేర్' మాస్ జాతర.. యూట్యూబ్‌లో 150 మిలియన్ల రికార్డు వ్యూస్!

May 27, 2026 10:15AM

న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'ది పారడైజ్' (The Paradise). 'దసరా' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో అనౌన్స్‌మెంట్ నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ అంచనాలకు తగ్గట్టే, చిత్ర యూనిట్ విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ 'ఆయా షేర్' (Aaya Sher) సోషల్ మీడియాను ఊపేస్తోంది. కేవలం యూట్యూబ్‌లోనే కాకుండా ప్రతి పబ్లిక్ ఈవెంట్, కాలేజ్ ఫెస్ట్‌లలోనూ ఈ సాంగ్ ఒక రేంజ్‌లో మారుమోగిపోతోంది. సికింద్రాబాద్ స్లమ్స్ నేపథ్యంలో సాగే ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాలోని హీరో ఎలివేషన్ సాంగ్, ఇప్పుడు సరికొత్త రికార్డులను తిరగరాస్తూ టాలీవుడ్‌లోనే అత్యంత వేగంగా దూసుకుపోతున్న చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.

ప్రస్తుతం ఈ మాస్ యాంథమ్ యూట్యూబ్‌లో ఒక అరుదైన మైలురాయిని చేరుకుంది. కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే ఏకంగా 150 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సరికొత్త సంచలనం సృష్టించింది. కేవలం వ్యూస్ పరంగానే కాకుండా, ఏకంగా 1.6 మిలియన్ల కంటే ఎక్కువ లైక్‌లతో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై ఈ పాట ప్రభంజనం సృష్టిస్తోంది. 

నాని కెరీర్‌లోనే ఇంత తక్కువ సమయంలో 150 మిలియన్ల మార్కును దాటిన తొలి సాంగ్‌గా 'ఆయా షేర్' నిలిచింది. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన బీట్స్, కిల్లర్ బేస్ లైన్స్ శ్రోతలకు పూనకాలు తెప్పిస్తున్నాయి. 

ఈ సాంగ్‌కు కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం, పాటలోని మాస్ ఆటిట్యూడ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకువెళ్లింది. దానికి తోడు జంగిరెడ్డి, అర్జున్ చండి తమ పవర్‌ఫుల్ వాయిస్‌తో ఈ పాటను పాడిన విధానం వింటుంటేనే గూస్‌బంప్స్ వస్తున్నాయి. సుధన్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో నాని వేసిన మాస్ స్టెప్పులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. 

శ్రీకాంత్ ఓదెల మార్క్ రా అండ్ రస్టిక్ విజువల్స్, నాని ఇంటెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ మైలురాయిని అందుకోవడంలో కీలక పాత్ర పోషించాయి. 1980ల నాటి యాటిట్యూడ్‌ను పక్కాగా ప్రజెంట్ చేస్తూ విజువల్స్ అదిరిపోయేలా ప్లాన్ చేశారు.

సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ పాన్-ఇండియా మూవీ ఆగస్ట్ 21, 2026 న థియేటర్లలో విడుదల కానుంది. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com