Home

»

Latest News

Peddi: ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్... ఆ ఏరియాలో పెద్ది సంచలన రికార్డు 

May 27, 2026 9:18AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వన్ మాన్ షో  స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతోంది. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. సినిమా విడుదలకు ముందే ఓవర్సీస్ మార్కెట్లలో 'పెద్ది' క్రేజ్ మామూలుగా లేదు. ఇప్పటికే నార్త్ అమెరికా, అమెరికా బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తున్న ఈ చిత్రం, తాజాగా యూకే (United Kingdom) మార్కెట్లోనూ ఊహించని రేంజ్‌లో విధ్వంసం సృష్టిస్తోంది. రామ్ చరణ్ గ్లోబల్ పాపులారిటీకి అద్దం పడుతూ యూకే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే ఏకంగా 12,500 పైగా టిక్కెట్లు అమ్ముడైపోవడం ట్రేడ్ వర్గాలని సైతం విస్మయానికి గురిచేస్తోంది.

యూకేలో ఉన్న మెగా అభిమానులు, తెలుగు ప్రేక్షకులు థియేటర్ల వద్ద టికెట్ల కోసం ఎగబడుతుండటంతో చాలా చోట్ల షోలు ఇప్పటికే హౌస్‌ఫుల్ అయిపోయాయి. ఈ చిత్రం నార్త్ అమెరికాలో బుకింగ్స్ ఓపెన్ అయిన కేవలం 5 గంటల్లోనే 1,00,000 డాలర్ల (100K USD) మార్కుని  దాటి అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న ఇండియన్ సినిమాగా సరికొత్త రికార్డు నెలకొల్పింది. మొదటి 24 గంటల్లోనే అమెరికాలో 5,035 టిక్కెట్లు అమ్ముడవడమే కాకుండా, 1,052 షోల ద్వారా 1,45,000 డాలర్ల గ్రాస్ వసూలు చేసి పవన్ కళ్యాణ్ 'OG' పేరిట ఉన్న 82,000 డాలర్ల రికార్డును సులువుగా బ్రేక్ చేసింది. రామ్ చరణ్ గత చిత్రం 'గేమ్ ఛేంజర్' మొదటి 48 గంటల్లో సాధించిన 38,000 డాలర్ల వసూళ్లతో పోలిస్తే, 'పెద్ది' కేవలం ఒక్క రోజులోనే దానికి నాలుగు రెట్లు ఎక్కువ కలెక్షన్లు సాధించి బాక్సాఫీస్ వద్ద తన అసలు సిసలైన సత్తా చాటింది.


Also read: Dhurandhar 2: ధురంధర్ 2 ప్రొడక్షన్ డిజైర్ పై లైంగిక వేధింపుల కేసు.. చేసింది ఎవరో తెలిస్తే షాక్ అవుతారు

 దాదాపు 3 గంటల 9 నిమిషాల (189 నిమిషాలు) సుదీర్ఘ రన్‌టైమ్‌తో సెన్సార్ బోర్డ్ నుండి యు/ఎ (U/A 16+) సర్టిఫికేట్ పొందిన ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘హెల్లాళ్లాలో’, ‘మాస్ మాస్ మాస్’ పాటలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఒక యువకుడి ప్రతిభ, క్రికెట్, కుస్తీ, రన్నింగ్ వంటి క్రీడల్లో అతను ఎదుర్కొన్న సవాళ్లు, ఆపై సాధించిన విజయాల చుట్టూ తిరిగే ఈ కథ ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేయడం ఖాయంగా కనిపిస్తోంది. సరికొత్త 'ప్రమోషన్ ఆన్ వీల్స్' వ్యూహంతో పాటు యూకే, యూఎస్‌ఏ దేశాల్లో కనిపిస్తున్న ఈ అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే, జూన్ 3న పడబోయే ప్రీమియర్ షోలతోనే 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.  చరణ్ తో పాటు చిత్ర బృందం మొత్తం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. 

 

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com