Home

»

Latest News

టాలీవుడ్‌లో మరో విషాదం: ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత.!

Nov 15, 2026 3:10PM

తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు గిరిబాబు మరణ వార్త మరువక ముందే మరో విషాద వార్త వచ్చింది.

ప్రముఖ సంగీత దర్శకుడు పి. విజయశేఖర్‌ (72) కన్నుమూశారు. నెల్లూరులో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం రాత్రి మరణించారు.

దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన ‘భారత్‌ బంద్‌’ సినిమాకు సంగీతం అందించడం ద్వారా విజయశేఖర్‌ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన చివరిగా 2010లో విడుదలైన ‘ఆకారం’ సినిమాకు సంగీతం అందించారు.

సినిమాలతో పాటు నాటక రంగంలోనూ ఆయనకు మంచి అనుబంధం ఉంది. పలు నాటకాలకు సంగీతం సమకూర్చడంతో పాటు భక్తి గీతాల ద్వారా కూడా శ్రోతలను ఆకట్టుకున్నారు.

విజయశేఖర్‌ మృతికి పలువురు సినీ, సంగీత రంగ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com