Home

»

Latest News

NTR: ఎన్టీఆర్‌ను చూసి మిగతా స్టార్స్‌ మారతారా.?

Nov 15, 2026 3:53PM

ప్రస్తుతం టాలీవుడ్‌లో పాన్‌ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. స్టార్‌ హీరోలంతా భారీ బడ్జెట్‌ చిత్రాలు, పాన్‌ ఇండియా మార్కెట్‌ అంటూ ఒక్కో సినిమాకు రెండుమూడేళ్ల సమయం తీసుకుంటున్నారు. దీంతో తమ అభిమాన నటుల సినిమాల కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌లో అసహనం పెరుగుతోంది. కనీసం ఏడాదికి ఒక్క సినిమా అయినా విడుదల చేయాలని సోషల్‌ మీడియా వేదికగా డిమాండ్లు చేస్తున్నారు.

నిజానికి పాన్‌ ఇండియా సినిమాలంటే కథ, స్కేల్‌, మేకింగ్‌ పరంగా భారీగా ప్లాన్‌ చేయాల్సి ఉంటుంది. అందుకే షూటింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులకు ఎక్కువ సమయం పడుతోంది. కానీ ఈ క్రమంలో అభిమానులకు తమ అభిమాన నటుల సినిమాలు చూసే అవకాశం తగ్గిపోతోంది. అందుకే భారీ పాన్‌ ఇండియా ప్రాజెక్టులు చేస్తూనే.. మధ్యలో తక్కువ సమయంలో పూర్తయ్యే రీజినల్‌ సినిమాలు కూడా చేయాలని కోరుతున్నారు.

ఈ నేపథ్యంలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అభిమానులకు ఓ గుడ్‌ న్యూస్‌ అందింది. ప్రశాంత్‌ నీల్‌తో ‘డ్రాగన్‌’, త్రివిక్రమ్‌తో ‘గాడ్‌ ఆఫ్‌ వార్‌’ వంటి భారీ ప్రాజెక్టులు లైన్‌లో ఉండగానే.. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ ఎంటర్‌టైనర్‌ చేయనున్నట్లు ఎన్టీఆర్‌ ప్రకటించారు. భారీ సినిమాల మధ్యలో అనిల్‌ రావిపూడి మార్క్‌ ఎంటర్‌టైనర్‌ ఉంటుందనే వార్తతో ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

అనిల్‌ రావిపూడి సినిమాలంటే కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు ప్రాధాన్యం ఉంటుంది. పైగా ఆయన సినిమాలను వేగంగా పూర్తి చేయడంలోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే ఎన్టీఆర్‌ ఈ నిర్ణయం తీసుకోవడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాన్‌ ఇండియా సినిమాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితిలో.. ఇలాంటి ప్రాజెక్టులు వస్తే ఫ్యాన్స్‌కు కొంత ఊరట లభించినట్లే.

ఇక ఎన్టీఆర్‌ బాటలో మిగతా స్టార్‌ హీరోలు కూడా నడవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్‌ అట్లీ దర్శకత్వంలో ‘రాకా’, లోకేష్ కానగరాజ్ తో ‘AA23’ వంటి భారీ సినిమాలు చేయనున్నారు. వీటి మధ్యలో బోయపాటి శ్రీనుతో ఓ కమర్షియల్‌ సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గీతా ఆర్ట్స్‌ ఈ ప్రాజెక్టును నిర్మించవచ్చనే టాక్‌ కూడా వినిపిస్తోంది.

పాన్‌ ఇండియా సినిమాలు చేయడం తప్పు కాదు. కానీ ఆ పేరుతో అభిమానులు తమ అభిమాన హీరో సినిమా కోసం మూడేళ్లు, నాలుగేళ్లు ఎదురుచూడాల్సి వస్తే మాత్రం నిరాశ తప్పదు. అందుకే భారీ చిత్రాలతో పాటు వేగంగా పూర్తయ్యే సినిమాలు కూడా చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు.

మరి ఎన్టీఆర్‌ తీసుకున్న ఈ నిర్ణయం ఇతర స్టార్‌ హీరోలకు కూడా స్ఫూర్తిగా మారుతుందా? అల్లు అర్జున్‌తో పాటు మిగతా నటులు కూడా ఏడాదికి కనీసం ఒక్క సినిమా విడుదలయ్యేలా ప్లాన్‌ చేసుకుంటారా? రాబోయే రోజుల్లో టాలీవుడ్‌లో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి.

 

 

 

[Jr NTR, Anil Ravipudi, Dragon, God Of War, Allu Arjun]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com