Home

»

Latest News

Allu Arjun: క్రిష్‌ జగర్లమూడి దర్శకత్వంలో అల్లు అర్జున్‌.!

Nov 15, 2026 4:27PM

'పుష్ప'తో పాన్ ఇండియాను షేక్ చేసిన ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ను బ్రాండ్ అంబాసిడర్ చేసుకోవడానికి పలు కంపెనీలు పోటీ పడుతున్నాయి. తాజాగా ఆయన మరో కొత్త యాడ్ షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ యాడ్‌కు టాలీవుడ్‌ దర్శకుడు క్రిష్‌ జగర్లమూడి దర్శకత్వం వహించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

శనివారం అల్లు అర్జున్‌ ఈ యాడ్‌ షూటింగ్‌లో పాల్గొన్నట్లు సమాచారం. టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకులలో క్రిష్ ఒకరు. గతంలో బన్నీ, క్రిష్ కాంబినేషన్ లో ‘వేదం’ వంటి విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమా వచ్చింది. అలాంటి దర్శకుడు ఇప్పుడు బన్నీతో యాడ్‌ రూపొందించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

ప్రస్తుతం అల్లు అర్జున్‌ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమాతో బిజీగా ఉన్నారు. మరోవైపు లోకేష్ కనగరాజ్ తో చేయనున్న AA23 కూడా అభిమానుల్లో భారీ అంచనాలు పెంచుతోంది. ఈ బిజీ షెడ్యూల్‌ మధ్యలో కొత్త యాడ్‌ షూటింగ్‌లో పాల్గొనడం విశేషం.

అయితే ఈ ప్రకటన ఏ బ్రాండ్‌కు సంబంధించినది? ఎప్పుడు విడుదలవుతుంది? ఇందులో బన్నీని క్రిష్‌ ఎలా చూపించబోతున్నారు? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

 

 

 

[Allu Arjun, New Ad, Krish Jagarlamudi, Raaka, AA23 Movie]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com