LATEST NEWS
పార్లమెంట్‌లో కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్న వేళ ఢిల్లీ రాజకీయాలు వేడెక్కాయి. డీలిమిటేషన్ బిల్లు, రాజ్యాంగ సవరణ బిల్లు-2026 ఆమోదమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో బీజేపీ అగ్రనేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ కీలక భేటీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌తో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఉభయ సభల్లో బిల్లులను ప్రవేశపెట్టినప్పుడు అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు లోతుగా చర్చించారు. రాజ్యాంగ సవరణ బిల్లుకు అవసరమైన ప్రత్యేక మెజార్టీ సాధించడం ప్రధాన సవాల్‌గా నిలిచింది. దీని కోసం మిత్రపక్షాలతో పాటు ఇతర పార్టీల ఎంపీల హాజరు, ఓటింగ్ సమీకరణాలపై సమావేశంలో ప్రత్యేకంగా దృష్టి సారించారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ, లోక్‌సభ అసెంబ్లీలలో మహిళా రిజర్వేషన్ల అమలు వంటి సున్నితమైన అంశాలు ఈ బిల్లులలో ఉన్నాయి. గతంలో ఎదురైన అడ్డంకులను అధిగమించి, ఈసారి ఎలాంటి ఆటంకాలు లేకుండా బిల్లులను ఆమోదింపజేసుకోవాలని బీజేపీ అధిష్టానం పట్టుదలగా ఉంది. మరోవైపు, డీలిమిటేషన్ ప్రతిపాదనలపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. నియోజకవర్గాల విభజన, సీట్ల పెంపు అంశాలపై విపక్ష కూటమి నేతలు భేటీ అవుతూ ప్రభుత్వ వ్యూహాలను తిప్పికొట్టేందుకు సిద్ధమవుతున్నారు. దక్షిణాది రాష్ట్రాలు సహా వివిధ ప్రాంతాల ప్రాతినిధ్యంపై తలెత్తుతున్న చర్చల నేపథ్యంలో ఈ బిల్లులు జాతీయ రాజకీయాల్లో పెద్ద కుదుపునకు కారణమవుతున్నాయి. రానున్న పార్లమెంట్ సమావేశాలలో అధికార, విపక్షాల మధ్య ఈ బిల్లులపై తీవ్ర వాడీవేడి చర్చలు జరిగే అవకాశం ఉంది. సభ్యుల మద్దతు కూడగట్టడంలో ప్రభుత్వం ఎంతవరకు సఫలమవుతుందనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. మీకు నచ్చవచ్చు: డీలిమిటేషన్ బిల్లు మద్దతుపై ఉత్కంఠ: స్టాలిన్‌తో ఇండియా కూటమి నేతల భేటీ.! మీకు నచ్చవచ్చు: డీలిమిటేషన్ బిల్లుపై విపక్షాల కసరత్తు: స్టాలిన్, శరద్ పవార్‌లతో ఇండియా కూటమి నేతలు భేటీ.!   [ Delimitation Bill 2026, Constitution Amendment Bill, PM Narendra Modi, Women Reservation Bill, Parliament Session ]  
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు (83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, గుంటూరులోని రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గతంలో ప్రొస్టేట్ క్యాన్సర్‌కు చికిత్స తీసుకున్నప్పటికీ, ఇటీవల అనారోగ్యం తిరగబెట్టడంతో ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1943 జూన్ 7న గుంటూరు జిల్లా ఉంగుటూరులో జన్మించిన రాయపాటి సాంబశివరావు, 1972లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఆయన మొత్తం ఆరుసార్లు పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు. 1982 నుంచి 1988 వరకు రాజ్యసభ సభ్యుడిగా సేవలందించిన ఆయన, ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో వరుస విజయాలతో సత్తా చాటారు. గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి 1996, 1998, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. 2014లో రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన, అదే ఏడాది నరసరావుపేట లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. రాజకీయాలతో పాటు వ్యాపార, విద్యా రంగాల్లోనూ రాయపాటి సాంబశివరావు తన సేవలను అందించారు. గుంటూరు ప్రాంతంలో విద్యాసంస్థల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడంతో పాటు, పార్లమెంటులో ఉమ్మడి రాష్ట్రం  ప్రాంతీయ అంశాలపై బలమైన గొంతు వినిపించారు. ఆయన మృతి వార్త తెలియగానే గుంటూరు, నరసరావుపేట నియోజకవర్గాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రాజకీయ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వివిధ పార్టీల ప్రముఖులు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, రాయపాటి సేవలను స్మరించుకుంటున్నారు.సుదీర్ఘకాలం ప్రజాప్రతినిధిగా పనిచేసిన నేతగా, గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఆయన జ్ఞాపకాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని స్థానిక ప్రజలు భావిస్తున్నారు. మీకు నచ్చవచ్చు: ప్రేమ కోసం ఇంటి గడప దాటిన యువతి.. ప్రియుడితో నిఖా, చివరకు పోలీసుల చెంతకు.!  మీకు నచ్చవచ్చు: హైదరాబాద్‌లో ర్యాపిడో డ్రైవర్‌పై దారుణ దాడి.. తీవ్ర గాయాలు.!    [ Former MP Rayapati Sambasiva Rao passes away, Former MP from Guntur, Former MP from Narasaraopet,Andhra Pradesh Politics, Guntur hospital ]
రూ.25 లక్షలకు సుపారీ ఒప్పందం..అడ్వాన్స్‌ రూ.5 లక్షలు.! హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ మాజీ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్‌ను హత్య చేసేందుకు జరిగిన భారీ కుట్రను బోరబండ పోలీసులు భగ్నం చేశారు. పక్కా ప్రణాళికతో సుపారీ ఇచ్చి హత్యకు పథకం రచించిన నిందితుల కుట్రను కేసు నమోదైన కొన్ని గంటల్లోనే పోలీసులు ఛేదించారు. ఈ ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది. రూ.25 లక్షలకు హత్యకు సుపారీ.! పోలీసుల వివరాల ప్రకారం.. బోరబండలోని స్వరాజ్ నగర్‌కు చెందిన ఇమ్రాన్ ఖాన్, తన సోదరుడు ఫయాజ్ ఖాన్‌తో కలిసి సుమారు నెల రోజుల క్రితం మహ్మద్ కాషిఫ్ మిస్బాను సంప్రదించారు. బాబా ఫసియుద్దీన్‌ను హత్య చేసేందుకు రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు సుపారీ ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కుట్రకు సంబంధించి ముందస్తు ఏర్పాట్ల కోసం రూ.5 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మారణాయుధాలతో రెక్కీ.. కదలికలపై నిఘా.! హత్యా పథకంలో భాగంగా కొందరు వ్యక్తులు మారణాయుధాలతో బాబా ఫసియుద్దీన్ నివాస పరిసరాల్లో రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. ఆయన కదలికలను గమనిస్తూ, హత్యకు అనువైన సమయం కోసం ఎదురుచూస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కుట్రపై సమాచారం అందడంతో బోరబండ పోలీసులు అప్రమత్తమయ్యారు. గంటల్లోనే ఐదుగురు అరెస్ట్.. మరొకరు పరారీ.! ఈ కేసును తీవ్రంగా పరిగణించిన హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఫిర్యాదుదారుడు, సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయడంతో పాటు సాంకేతిక ఆధారాలను సేకరించారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా దర్యాప్తు చేపట్టి కేసు నమోదైన గంటల వ్యవధిలోనే ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో ఇమ్రాన్ ఖాన్, దేవర రాజా, ఫయాజ్ ఖాన్, మహ్మద్ కాషిఫ్ మిస్బా, షేక్ నవాజ్ ఉన్నారు. మరో నిందితుడు సయ్యద్ హాదీ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. రెండు కత్తులు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం.! నిందితుల నుంచి రెండు కత్తులు, ఐదు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కుట్ర నేపథ్యంలో బాబా ఫసియుద్దీన్‌కు అవసరమైన భద్రతా చర్యలు చేపట్టారు. నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. సుపారీ హత్యలపై పోలీసుల హెచ్చరిక.! నగరంలో సుపారీ హత్యలు, నేరపూరిత కుట్రలు, అక్రమ ఆయుధాల వినియోగం వంటి కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. రెక్కీ నిర్వహించడం, అక్రమ ఆయుధాలు కలిగి ఉండటం, హత్యలకు కుట్ర పన్నడం వంటి నేరాలకు పాల్పడే వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఇది కూడ చదవండి: ఏపీ పంచాయతీ ఎన్నికల రెండో దశలో పోలింగ్ జోరు.. పలుచోట్ల ఉద్రిక్తతలు.! అలవాటుపడిన నేరస్థులపై పీడీ యాక్ట్ ప్రయోగించడంతో పాటు, అవసరమైన చోట రౌడీ షీట్లు తెరిచి వారి కదలికలపై నిఘా ఉంచుతామని తెలిపారు. రాజకీయ, ఆర్థిక పలుకుబడి ఉన్నా నేరస్థులను కాపాడలేదని స్పష్టం చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, రెక్కీ కార్యకలాపాలు లేదా ఆయుధాలతో సంచరించే వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. [ Baba Fasiuddin, Baba Fasiuddin Murder Plot, Hyderabad Crime News, Former Deputy Mayor, Borabanda Police, Supari Gang, Hyderabad Police, Murder Conspiracy, BNS, PD Act ]   మీకు నచ్చవచ్చు: ఓటు వేసేందుకు వస్తూ మృత్యుఒడికి..నలుగురు దుర్మరణం.! మీకు నచ్చవచ్చు: పెళ్లి పేరుతో మోసం: రూ. 10 లక్షలకు కుచ్చుటోపీ.!   
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది. రాష్ట్రంలోని 27 జిల్లాల్లో 3,880 పంచాయతీల పరిధిలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. విశాఖపట్నం జిల్లా మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో ఎన్నికల సందడి నెలకొంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. అయితే, కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు, ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఈ విడతలో మొత్తం 3,803 సర్పంచ్ పదవులతో పాటు 29,603 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. సుమారు 83.52 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 42.46 లక్షల మందికి పైగా మహిళా ఓటర్లు ఉండగా.. పురుష ఓటర్లు 41.05 లక్షల మంది ఉన్నారు. ఇప్పటికే పలు చోట్ల ఏకగ్రీవాలు పూర్తయ్యాయి. 1,170 సర్పంచ్ స్థానాలు, 19,655 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవంగా ఖరారయ్యాయి. మిగిలిన స్థానాలకు మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆయా పోలింగ్ కేంద్రాల్లోనే ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. దీంతో సాయంత్రానికల్లా ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. మొత్తం 37,019 పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. సీసీటీవీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తోంది. అయితే, రెండో దశ పోలింగ్ సందర్భంగా ప్రకాశం జిల్లాలోని తాళ్లూరు మండలం నాగంబొట్లపాలెంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ వర్గానికి చెందిన నేతలు పోలింగ్ కేంద్రంలోకి చొరబడి విధ్వంసానికి పాల్పడినట్లు సమాచారం. బ్యాలెట్ బాక్సులో ఇంకు, నీళ్లు పోయడంతో పాటు పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటన కారణంగా అక్కడ దాదాపు రెండున్నర గంటల పాటు పోలింగ్ నిలిచిపోయింది. మరోవైపు, అనంతపురం జిల్లా యల్లనూరులోనూ పోలింగ్ వేళ ఉద్రిక్తత నెలకొంది. స్థానిక జడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ కార్యకర్తలపై వైసీపీ వర్గీయులు దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. పోలింగ్ కొనసాగుతున్న సమయంలో టీడీపీ ఏజెంట్లపై మూకుమ్మడిగా దాడి చేయడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలింగ్ కేంద్రం ఆవరణలో రాళ్లు రువ్వడంతో పది మంది టీడీపీ కార్యకర్తలు గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలతో ఆయా ప్రాంతాల్లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అదనపు బలగాలతో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టారు.మొత్తంగా రెండో దశ పంచాయతీ ఎన్నికలు గ్రామీణ రాజకీయాల్లో మరోసారి వేడిని పెంచాయి. గ్రామస్థాయి పాలనపై పట్టు సాధించేందుకు ప్రధాన రాజకీయ పక్షాలు తమ మద్దతుదారుల గెలుపు కోసం ప్రయత్నించాయి. పోలింగ్ ముగిసిన వెంటనే ప్రారంభమయ్యే కౌంటింగ్‌తో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఈ ఫలితాలు రాష్ట్రంలోని స్థానిక రాజకీయ సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: పెళ్లి పేరుతో మోసం: రూ. 10 లక్షలకు కుచ్చుటోపీ.!     [ AP Panchayat Elections, Second Phase Polling, AP Panchayat Elections, Sarpanch Elections, Vote Counting, Prakasam District, Anantapur District, State Election Commission ]
డీలిమిటేషన్ కు బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది.  దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటులో ప్రస్తుతం ఉన్న ప్రాతినిధ్య వాటా తగ్గకుండా, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా డీలిమిటేషన్ ప్రక్రియ జరగాలని  బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు.  లోక్‌సభ స్థానాలను ప్రస్తుత సంఖ్య కంటే 50 శాతం పెంచడంతో పాటు, 2051 వరకు రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా రక్షణ కల్పించే కేంద్ర ప్రభుత్వ తాజా ప్రతిపాదనకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు.  పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాలకు ప్రస్తుతం ఉన్న   24 శాతం ప్రాతినిధ్య వాటాను యథాతథంగా నిలబెట్టాలని బీఆర్ఎస్ మొదటి నుంచీ డిమాండ్ చేస్తోందన్న అందుకు అనుగుణంగానే కేంద్రం బిల్లును తీసుకురావడానికి అంగీకరించినందునే మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.  కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన తాజా ఫార్ములా అమల్లోకి వస్తే తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 17 లోక్‌సభ స్థానాల సంఖ్య 26కు పెరిగే అవకాశం ఉందన్న కేటీఆర్ వివరించారు. అన్ని రాష్ట్రాల్లోనూ దామాషా ప్రకారం 50 శాతం మేర లోక్‌సభ సీట్లను పెంచడం వల్ల రాష్ట్రాల మధ్య ప్రస్తుత ప్రాతినిధ్య నిష్పత్తి చెక్కుచెదరకుండా కొనసాగుతుందని, అదే సమయంలో ప్రజలకు మరింత విస్తృతమైన పార్లమెంటరీ ప్రాతినిధ్యం లభిస్తుందని అన్నారు. తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు. రాష్ట్రానికి అదనపు లోక్‌సభ స్థానాలు దక్కడంతో పాటు దక్షిణాది రాష్ట్రాల వాటాకు రక్షణ కల్పించే అంశాలను బీఆర్ఎస్ స్వాగతిస్తోందని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ల అంశంపై..    చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న నిర్ణయానికి బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా నిలుస్తోందని, ఆ రిజర్వేషన్ల అమలుకు తమ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. డీలిమిటేషన్ ప్రక్రియలో రాష్ట్రాల హక్కులు, సమాన ప్రాతినిధ్యం, మహిళా ప్రాధాన్యత వంటి అంశాలకు సముచిత స్థానం కల్పించాలన్నారు. ఇది కూడా చదవండి:  డీలిమిటేషన్ బిల్లు: ఆమోదం కోసం కేంద్రం వ్యూహాలు.!​   పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లు చర్చకు రానున్న నేపథ్యంలో ప్రాంతీయ పార్టీల వైఖరులు జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారాయి. లోక్‌సభలో ప్రస్తుతం బీఆర్ఎస్‌కు సభ్యులు లేనప్పటికీ, రాజ్యసభలో ఉన్న ముగ్గురు ఎంపీల మద్దతు  ప్రాధాన్యత సంతరించుకుంది. దక్షిణాది రాష్ట్రాల వాటా పరిరక్షణపై కేంద్రం ఇచ్చిన 2051 స్థిరీకరణ ప్రతిపాదన ప్రాంతీయ పార్టీల ఆందోళనలను  తగ్గించిదని పరిశీలకులు అంటున్నారు.    మొత్తం మీద, దక్షిణాది రాష్ట్రాల 24 శాతం వాటా రక్షణ, 2051 వరకు సీట్ల నిష్పత్తి స్థిరీకరణ,  వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని డీలిమిటేషన్ ప్రతిపాదనకు మద్దతు ఇవ్వాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. రా మీకు నచ్చవచ్చు:  డీలిమిటేషన్‌ ముసుగులో రాజ్యాంగాన్ని మార్చే యత్నం.. కేంద్రంపై గౌరవ్‌ గొగోయ్‌ విమర్శలు డీలిమిటేషన్ ఎందుకు అవసరం: దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరిగేదెలా.?​ [BRS Support Delimitation, KTR Announce,   Lok Sabha seats, Telangana, TeluguOne]
ALSO ON TELUGUONE N E W S
Megastar Chiranjeevi has put an end to all speculation surrounding his Sankranti releases. After rumours suggested that Kaaka might share the festive season with Vishwambhara, the actor has now confirmed that Bobby Kolli's directorial will be his only release for Mega Sankranti. Taking to X, Chiranjeevi shared a new poster of the film and wrote, "Looking forward to entertaining you all this Sankranthi with a whole new side of Auto Johnny." He also assured audiences that the film would arrive in theatres worldwide on January 13, 2027. The new poster introduces Chiranjeevi as Auto Johnny in a stylish and youthful avatar. Sporting a brown shirt, trendy trousers, sunglasses and a hand band, the Megastar looks exceptionally stylish, showcasing a refreshing side of his screen persona. Director Bobby Kolli appears to have designed a character that perfectly blends Chiranjeevi's trademark mass appeal with a younger, stylish makeover. The actor's latest look has already generated considerable excitement among fans. Produced by KVN Productions, the film features Anaswara Rajan in a prominent role, while S Thaman is composing the music. The makers are expected to unveil the first single soon. With Chiranjeevi himself confirming the release date, the confusion surrounding the Mega Sankranti releases has finally come to an end.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
Megastar Chiranjeevi has once again shown his appreciation for good cinema by hosting the team of Dulquer Salmaan's Aakasamlo Oka Tara at his residence. After watching the film and praising it on social media, the Megastar invited the cast and crew for a special gathering, where he personally congratulated them with bouquets. Chiranjeevi particularly appreciated Dulquer Salmaan's compelling performance and newcomer Satvika Veeravalli's mature acting. He also praised Ruhani Sharma for her dedication and director Pavan Sadineni for presenting an emotionally engaging story. Recalling an emotional sequence in the second half featuring Shruti Haasan and Satvika, Chiranjeevi revealed that the moment Satvika achieves her dream brought tears to his eyes. He also appreciated GV Prakash Kumar's music and background score, besides praising the film's impressive VFX and technical standards. Mega Power Star Ram Charan also joined the gathering and congratulated Dulquer Salmaan and the entire team. Chiranjeevi wished the film widespread recognition and major awards, stating that Telugu cinema needs more inspiring stories like Aakasamlo Oka Tara. Meanwhile, the film continues to enjoy strong word-of-mouth and has maintained its momentum at the box office during its second weekend. It has crossed the Rs. 50 crore gross mark worldwide and entered the coveted $1 million club in North America. The appreciation from Chiranjeevi and Ram Charan has made the film's success even more special for the team. With its emotional content finding acceptance among audiences, Aakasamlo Oka Tara has emerged as a major box-office success for Dulquer Salmaan and everyone associated with the film.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.     
‘ప్రేమదేశం’ సినిమా గుర్తుందా? అందులో తన స్టైలిష్ లుక్స్, లవర్ బాయ్ ఇమేజ్‌తో అప్పట్లో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న అబ్బాస్ గుర్తున్నారా? చాలా కాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న ఆయన ఇప్పుడు మళ్లీ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అది కూడా సంక్రాంతి బరిలోకి వస్తున్న అనిల్ రావిపూడి సినిమాలో కావడం విశేషం. వెంకటేశ్, నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ ‘జనవరి 12 విడుదల’లో అబ్బాస్ ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో ఆయన పాత్ర ప్రత్యేకంగా ఉండబోతుందని సమాచారం. ఒకప్పుడు అబ్బాస్‌కు తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉండేది. ముఖ్యంగా ‘ప్రేమదేశం’ సినిమాతో ఆయన క్రేజ్ ఒక్కసారిగా పెరిగింది. లవర్ బాయ్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన అబ్బాస్.. అప్పట్లో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. అయితే ఆ తర్వాత సినిమాలకు దూరమై విదేశాల్లో స్థిరపడ్డారు. సుమారు 12 ఏళ్ల విరామం తర్వాత ఇటీవల జీవీ ప్రకాశ్ కుమార్ నటించిన తమిళ సినిమా ‘హ్యాపీ రాజ్’తో మళ్లీ నటనలోకి వచ్చారు. ఇప్పుడు అదే ఉత్సాహంతో తెలుగు సినిమాల్లోనూ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. చివరిగా 2014లో వచ్చిన 'అలా జరిగింది ఒకరోజు' అనే తెలుగు సినిమాలో కనిపించిన ఆయన, ఈ ప్రాజెక్ట్‌తో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. అబ్బాస్ మరో రెండు సినిమాలకు కూడా చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంటే ఈసారి కేవలం ఒకటి రెండు సినిమాలు చేసి ఆగిపోకుండా, నటుడిగా తన సెకండ్ ఇన్నింగ్స్‌ను కొనసాగించాలనే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఒకప్పుడు ‘ప్రేమదేశం’తో అమ్మాయిల కలల రాకుమారుడిగా గుర్తింపు తెచ్చుకున్న అబ్బాస్.. ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమాలో ఎలాంటి పాత్రతో కనిపించబోతున్నారు? ఆయన సెకండ్ ఇన్నింగ్స్‌కు ఈ సినిమా ఎలాంటి గుర్తింపు తీసుకొస్తుంది? అనేది ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: ఎన్టీఆర్-అనిల్ రావిపూడి సినిమాలో రవితేజ?       [Abbas Comeback, January 12 Vidudala, Anil Ravipudi, Venkatesh, Kalyan Ram]  
‘హనుమాన్’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. తేజ సజ్జా నటన, ప్రశాంత్ వర్మ దర్శకత్వం ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చాయి. అయితే సినిమా సక్సెస్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్ రెడ్డి మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ వివాదం సీక్వెల్ హక్కుల దగ్గరకు చేరింది. ఇటీవల ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ‘హనుమాన్ 2’ను ప్రకటించింది. ఇందులో పంజా వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, వీఐ ఆనంద్ దర్శకత్వం వహించనున్నారు. మరోవైపు ప్రశాంత్ వర్మ ఇప్పటికే రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో ‘జై హనుమాన్’ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. దీంతో ఒకే కథా ప్రపంచానికి సంబంధించి రెండు ప్రాజెక్టులు తెరపైకి రావడం చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో ‘శ్రీమతి’ సిరీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న నిర్మాత చైతన్య రెడ్డిని మీడియా ప్రతినిధులు ఈ వివాదంపై ప్రశ్నించారు. ‘హనుమాన్’ ఐపీ రైట్స్ ప్రశాంత్ వర్మకు ఉన్నాయని, మైత్రీ మూవీ మేకర్స్‌తో రూ.23 కోట్ల సెటిల్మెంట్ జరిగిందని వస్తున్న ప్రచారంపై ఆమెను అడిగారు. దీనికి చైతన్య రెడ్డి స్పందిస్తూ.. “హనుమాన్ ఎవరి సొంతం కాదు.. మా దగ్గర కూడా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి” అని స్పష్టం చేశారు. తమ దగ్గర కూడా హక్కులకు సంబంధించిన పత్రాలు ఉన్నాయని చెప్పడం ద్వారా ఈ వివాదంలో తమ వాదనను బలంగా వినిపించారు. అంతేకాదు, మైత్రీ మూవీ మేకర్స్‌తో రూ.23 కోట్ల సెటిల్మెంట్ జరిగిన మాట వాస్తవమేనని ఆమె అంగీకరించారు. అయితే ఆ డబ్బు వేరే విషయాలకు సంబంధించినదని, దానికి ‘హనుమాన్ 2’ హక్కులను అప్పగించడానికి సంబంధం లేదని వివరించారు. రూ.23 కోట్ల వ్యవహారాన్ని సీక్వెల్ రైట్స్‌తో ముడిపెట్టడం సరికాదన్నది ఆమె మాటల్లో స్పష్టమైంది. ఇప్పుడు చైతన్య రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ‘హనుమాన్ 2’ హక్కుల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఒకవైపు తమ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయని ప్రైమ్ షో నిర్మాత చెబుతుంటే, మరోవైపు ప్రశాంత్ వర్మకు ఐపీ హక్కులు ఉన్నాయనే ప్రచారం కొనసాగుతోంది. ఈ రెండు ప్రాజెక్టుల విషయంలో అసలు హక్కులు ఎవరికి ఉన్నాయి? ఈ వివాదం చర్చలతో పరిష్కారమవుతుందా లేక న్యాయపరమైన మలుపు తిరుగుతుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: అనిల్ రావిపూడి డ్రీమ్ ప్రాజెక్ట్.. రామాయణం అనౌన్స్‌మెంట్!       [HanuMan 2, Chaitanya Reddy, Niranjan Reddy, Prasanth Varma, Jai Hanuman]  
సోనియా గాంధీ జీవిత కథను వెండితెరపైకి తీసుకురావాలన్న కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ప్రయత్నాలు మరో అడుగు ముందుకు వెళ్లాయి. ఈ సినిమాకు దర్శకుడిగా క్రాంతి మాధవ్‌ను ఎంపిక చేసినట్లు జగ్గారెడ్డి ప్రకటించారు. దీంతో సోనియా గాంధీ బయోపిక్‌పై ఆసక్తి మొదలైంది. అయితే సినిమా పట్టాలెక్కాలంటే ఇంకా సోనియా గాంధీ అనుమతి తీసుకోవాల్సి ఉంది. గతంలో ‘ఓనమాలు’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ వంటి సినిమాలను తెరకెక్కించిన క్రాంతి మాధవ్ ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించనున్నారు. జగ్గారెడ్డితో పాటు గాంధీ భవన్ పీఆర్వో హరిప్రసాద్ కలిసి దర్శకుడి ఎంపికను ప్రకటించారు. డిసెంబర్ 10 నుంచి ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీని కలిసి సినిమా నిర్మాణానికి అనుమతి తీసుకుంటామని జగ్గారెడ్డి తెలిపారు. సోనియా గాంధీ రాసిన ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ అనే ఆత్మకథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించనున్నారు. ఆమె వ్యక్తిగత జీవితం, రాజీవ్ గాంధీతో ప్రేమ, వివాహం, గాంధీ కుటుంబంలోకి అడుగుపెట్టిన తర్వాత ఎదురైన పరిస్థితులను ఇందులో చూపించనున్నట్లు జగ్గారెడ్డి వెల్లడించారు. ముఖ్యంగా ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల హత్యల తర్వాత సోనియా గాంధీ ఎదుర్కొన్న పరిస్థితులు, పిల్లలను పెంచిన తీరు, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన నేపథ్యం సినిమాలో కీలకంగా ఉండనున్నాయి. అలాగే ప్రధానమంత్రి పదవిని చేపట్టే అవకాశం వచ్చినప్పటికీ ఆమె వెనక్కి తగ్గిన సందర్భాలు, దేశ రాజకీయాల్లో ఆమె పాత్రను కూడా కథలో చూపించనున్నట్లు జగ్గారెడ్డి చెప్పారు. ఈ సినిమా నిర్మాణం విషయంలోనూ జగ్గారెడ్డి ఓ కీలక విషయం వెల్లడించారు. ఎలాంటి రాజకీయ లేదా ఆర్థిక ప్రయోజనాలు ఆశించకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తామని తెలిపారు. బయటి వ్యక్తుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా, సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన 50 మంది కార్యకర్తలతో ఫైనాన్స్ కమిటీ ఏర్పాటు చేసి సినిమా నిర్మాణ బాధ్యతలు చేపడతామని చెప్పారు. ఇది కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డితో మహేశ్ బాబు భేటీ.. అసలు కారణం ఏంటి.?       [Sonia Gandhi Biopic, Director Kranthi Madhav, Jagga Reddy, Sonia Gandhi]  
మహిళలకు పెళ్లికి ముందు ఒక గుర్తింపు ఉంటుంది. పెళ్లయ్యాక మాత్రం ఫలానా వ్యక్తి భార్యగానో, ఒక ఇంటి కోడలిగానో వారి గుర్తింపు మారిపోతుంటుంది. అయితే ప్రతి మహిళకు తనకంటూ కొన్ని ఆశయాలు, కలలు ఉంటాయి. వాటిని పక్కనపెట్టి కుటుంబం కోసమే జీవించాలనే పరిస్థితి ఎందుకు ఉండాలి? ఇదే విషయంపై నటి రేణు దేశాయ్‌ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ‘శ్రీమతి’ సిరీస్‌ ప్రీ రిలీజ్‌ వేడుకలో పాల్గొన్న ఆమె.. మహిళల వ్యక్తిగత గుర్తింపు, భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అవగాహన గురించి మాట్లాడారు. "ఆడవాళ్లేమీ రోబోలు కాదు.. ప్రతి మహిళకు ఒక మనసుంటుంది. ఏదో చేయాలి, సాధించాలనే తపన ఉంటుంది. దాన్ని అర్థం చేసుకుని సపోర్ట్ చేయాలి" అని రేణు దేశాయ్‌ అన్నారు. అది మహిళలను కని పెంచిన తల్లిదండ్రులైనా, పెళ్లి చేసుకున్న భర్త అయినా వారి ఆశయాలను గౌరవించాలని ఆమె అభిప్రాయపడ్డారు. భార్యాభర్తలిద్దరూ కలిసి ఆలోచించుకుని జీవితాన్ని ముందుకు తీసుకెళ్తేనే ఆ బంధం సంతోషంగా ఉంటుందని చెప్పారు. భార్యలకు అండగా నిలిచే భర్తల సంఖ్య ఇంకా పెరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. Watch Renu Desai Full Speech Here 2026లో కూడా మహిళలకు సొంత గుర్తింపు రావడం లేదని రేణు దేశాయ్‌ వ్యాఖ్యానించారు. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి ఫలానా వారి అమ్మాయి అని, పెళ్లయ్యాక ఫలానా వ్యక్తి భార్య అని గుర్తిస్తారని చెప్పారు. ఆ గుర్తింపులు తప్పు కాకపోయినా, వాటికి మించి మహిళకంటూ ఒక ప్రత్యేకమైన అస్తిత్వం ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. భార్యలకు భర్తలు ఇచ్చే ప్రోత్సాహం వారి జీవితాలను ఎంతగా మార్చగలదో కూడా రేణు ప్రస్తావించారు. ఇంటి బాధ్యతలు చూసుకుంటూనే మహిళలు తమకు నచ్చిన రంగంలో ఎదగడానికి అవకాశం ఇవ్వాలని సూచించారు. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని, ఒకే మాట మీద ముందుకు సాగితే జీవితం మరింత ఆనందంగా ఉంటుందని చెప్పారు. ఇది కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డితో మహేశ్ బాబు భేటీ.. అసలు కారణం ఏంటి.?       [Renu Desai, Srimathi Series, Nivetha Thomas]
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌, డైరెక్టర్ అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో సినిమా అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఈ సినిమాలో మాస్‌ మహారాజా రవితేజ కూడా భాగం కాబోతున్నారనే ప్రచారం మొదలైంది. అనిల్‌ రావిపూడి రవితేజ కోసం ఓ ప్రత్యేకమైన పాత్రను సిద్ధం చేస్తున్నారనే వార్త సోషల్‌ మీడియాలో ఆసక్తి రేపుతోంది. ఎన్టీఆర్‌లోని కామెడీ టైమింగ్‌ను మరోసారి బయటకు తీసుకొచ్చేలా అనిల్‌ రావిపూడి ఈ కథను సిద్ధం చేస్తున్నారట. పూర్తిస్థాయి వినోదంతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌, మాస్‌ ఎలివేషన్స్‌, ఊహించని ట్విస్టులు ఉండేలా స్క్రిప్ట్‌ను రూపొందిస్తున్నట్లు ఫిలింనగర్‌ టాక్‌. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో రవితేజ పాత్ర కూడా కీలకంగా ఉండబోతోందని ప్రచారం జరుగుతోంది. కేవలం గెస్ట్‌ రోల్‌ కాకుండా కథను మలుపు తిప్పే కీలక పాత్రను ఆయన కోసం రాస్తున్నారట. గతంలో అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రవితేజ నటించిన ‘రాజా ది గ్రేట్‌’ మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమా తర్వాత వీరిద్దరూ మరోసారి కలిసి పనిచేస్తే ఎలా ఉంటుందనే ఆసక్తి అభిమానుల్లో ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో రవితేజ నటిస్తున్నారని ప్రచారంతో ఈ ప్రాజెక్టుపై మరింత బజ్‌ ఏర్పడింది. ఈ సినిమాని ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై నందమూరి కళ్యాణ్ రామ్‌ నిర్మించనున్నారు. ఎన్టీఆర్‌ ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ‘డ్రాగన్‌’ షూటింగ్‌తో బిజీగా ఉండగా, అనిల్‌ రావిపూడి ‘జనవరి 12 విడుదల’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయ్యాక ఎన్టీఆర్‌–అనిల్‌ రావిపూడి సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. మరి రవితేజ కూడా ఈ సినిమాలో నటిస్తారా? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఒకవేళ ఈ కాంబినేషన్‌ నిజమైతే టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన మల్టీస్టారర్‌ చూడొచ్చు. ఇది కూడా చదవండి: అనిల్ రావిపూడి డ్రీమ్ ప్రాజెక్ట్.. రామాయణం అనౌన్స్‌మెంట్!       [Jr NTR, Ravi Teja, Anil Ravipudi, January 12 Vidudala, Dragon]  
టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన ‘బేబీ’ సినిమా కథ చుట్టూ మరోసారి వివాదం మొదలైంది. తన ‘ప్రేమించొద్దు’ కథను అనుమతి లేకుండా ‘బేబీ’ సినిమాకు ఉపయోగించారని దర్శకుడు శిరిన్‌ శ్రీరామ్‌ చేసిన ఆరోపణలు ఇప్పుడు న్యాయస్థానం వరకు చేరాయి. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. ‘బేబీ’ దర్శకుడు సాయి రాజేష్‌, నిర్మాత SKNకు నోటీసులు జారీ చేసింది. అసలు ఈ వివాదం ‘ప్రేమించొద్దు’ అనే కథతో మొదలైంది. శిరిన్‌ శ్రీరామ్‌ తన రచయితల బృందంతో కలిసి ఈ కథను అభివృద్ధి చేశారట. తొలుత ఈ సినిమాను నిర్మించాలనే ఆసక్తితో సాయి రాజేష్‌ తనను సంప్రదించారని శిరిన్‌ చెబుతున్నారు. ఈ క్రమంలో దాదాపు ఏడాది పాటు కష్టపడి కథను సిద్ధం చేశామని ఆయన పేర్కొన్నారు. అయితే కథకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత సాయి రాజేష్‌ తమను పక్కనపెట్టి, అదే కథాంశంతో ‘బేబీ’ సినిమాను తెరకెక్కించారని శిరిన్‌ ఆరోపిస్తున్నారు. తమ అనుమతి లేకుండా కథను ఉపయోగించారని, దీనివల్ల మోసం జరగడంతో పాటు మేధో సంపత్తి హక్కులు ఉల్లంఘనకు గురయ్యాయని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వివాదం తొలిసారిగా 2024 ఫిబ్రవరిలో బయటకు వచ్చింది. తన కథను కాపీ చేశారంటూ శిరిన్‌ శ్రీరామ్‌ రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఈ వ్యవహారంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. తన వాదనలకు సంబంధించిన వివరాలను ‘బేబీ లీక్స్‌’ పేరుతో ఓ పుస్తకంగా కూడా విడుదల చేశారు. తాజాగా తెలంగాణ హైకోర్టులో ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది జి. సురేందర్‌ వాదనలు వినిపించారు. వాటిని పరిశీలించిన న్యాయస్థానం సాయి రాజేష్‌, నిర్మాత SKNకు నోటీసులు జారీ చేసింది. పిటిషన్‌లో చేసిన ఆరోపణలపై తమ వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో అప్పట్లో మొదలైన ‘బేబీ’ కథ వివాదం మరోసారి టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. అయితే హైకోర్టు నోటీసులు జారీ చేయడం మాత్రమే జరిగింది. కథను కాపీ చేశారనే ఆరోపణలు ఇంకా నిర్ధారణ కాలేదు. మరి ఈ వ్యవహారంపై సాయి రాజేష్‌, SKN ఎలాంటి వివరణ ఇస్తారు? ఈ కేసు తదుపరి విచారణలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: వృషకర్మ మొదటి పది నిమిషాలు మిస్ అవొద్దు!       [Baby Movie, Story Controversy, Sai Rajesh, SKN, Preminchoddu]  
సినిమా ఇండస్ట్రీలో స్నేహాలు ఉంటాయి.. కానీ కొందరి మధ్య ఉండే అనుబంధం మాత్రం ప్రత్యేకంగా నిలిచిపోతుంది. నాని, నితిన్‌ మధ్య ఉన్న స్నేహం కూడా అలాంటిదే. ఒకప్పుడు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన నానికి అప్పట్లో హీరోగా ఉన్న నితిన్‌ గొడుగు పట్టారు. ఇప్పుడు దాదాపు 20 ఏళ్ల తర్వాత అదే సన్నివేశాన్ని ఇద్దరూ మరోసారి రీక్రియేట్‌ చేశారు. ‘అలియాస్‌ రుక్మిణి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో జరిగిన ఈ సంఘటన అందరినీ ఆకట్టుకుంది. ఈ కథ 2005లో విడుదలైన ‘అల్లరి బుల్లోడు’ సినిమా షూటింగ్‌ సమయంలో మొదలైంది. ఆ సినిమాలో నితిన్‌ హీరోగా నటించగా.. నాని క్లాప్‌ అసిస్టెంట్‌గా పనిచేశారు. అప్పటికి నాని సినిమాల్లో తన ప్రయాణాన్ని మొదలుపెడుతున్న సమయం. ఇద్దరూ దాదాపు ఒకే వయసు కావడంతో నాని, నితిన్‌ను నేరుగా పేరుతోనే పిలిచేవారట. అయితే సినిమా సెట్స్‌లో హీరోలను ‘బాబు’ అని పిలవాలంటూ ఓ ప్రొడక్షన్‌ మేనేజర్‌ నానికి సూచించారట. దీంతో తర్వాత నితిన్‌ను పిలిచినప్పుడు ‘బాబు.. షాట్‌ రెడీ’ అని అన్నారు. ఒక్కసారిగా నాని పిలుపు మారడంతో నితిన్‌ ఆశ్చర్యపోయారు. ఎందుకు తనను అలా పిలుస్తున్నావని అడిగినా నాని మొదట చెప్పలేదట. చివరకు అసలు విషయం తెలుసుకున్న నితిన్‌.. ఆ మేనేజర్‌కు మరింత ఆశ్చర్యం కలిగించేలా ఓ సరదా ప్లాన్‌ వేశారట. నాని క్లాప్‌ బోర్డ్‌ పట్టుకుని వస్తుంటే తాను గొడుగు పట్టుకుని రావాలని నిర్ణయించుకున్నారు. అలా ఒక హీరో తనకు గొడుగు పట్టుకుని రావడం చూసి అప్పట్లో సినిమా యూనిట్‌ కూడా ఆశ్చర్యపోయిందని నాని గుర్తుచేసుకున్నారు. ఇటీవల ‘అలియాస్‌ రుక్మిణి’ గ్లింప్స్‌ షూటింగ్‌ సమయంలోనూ వర్షం పడుతుండగా నితిన్‌ నానికి గొడుగు పట్టారట. దీంతో అప్పటి జ్ఞాపకం మరోసారి గుర్తుకొచ్చింది. ఇప్పుడు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పాత ఫొటోలను ప్రదర్శించడంతో పాటు, ఇద్దరూ అదే సన్నివేశాన్ని స్టేజ్‌పై రీక్రియేట్‌ చేశారు. నాని క్లాప్‌ బోర్డ్‌ పట్టుకోగా.. నితిన్‌ గొడుగు పట్టుకుని ఆయనతో కలిసి వేదికపైకి వచ్చారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఒకప్పుడు నితిన్‌ సినిమా సెట్స్‌లో అసిస్టెంట్‌గా పనిచేసిన నాని, ఇప్పుడు అదే నితిన్‌ నటిస్తున్న ‘అలియాస్‌ రుక్మిణి’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మురళీకాంత్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను నాని తన యూనానిమస్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. డిసెంబర్‌ 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తానికి 20 ఏళ్ల క్రితం మొదలైన చిన్న సరదా సంఘటన.. ఇప్పుడు ఇద్దరి మధ్య ఉన్న స్నేహానికి గుర్తుగా మారింది. ఇండస్ట్రీలో ఎవరు ఎంత ఎదిగినా పాత అనుబంధాలను మర్చిపోకూడదనే విషయాన్ని నాని, నితిన్‌ మరోసారి గుర్తుచేశారు. ఇది కూడా చదవండి: ఆటో జానీ గుర్తున్నాడా?.. కాకాలో చిరంజీవి వింటేజ్ అవతార్‌ అదిరింది.!       [Nani, Nithiin, Friendship, Umbrella, Alias Rukmini]  
సూపర్‌స్టార్ మహేశ్ బాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCRHRD)లో శనివారం (నవంబర్ 28) ఈ సమావేశం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డికి మహేశ్ పుష్పగుచ్ఛం అందించగా, ముఖ్యమంత్రి ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. మహేశ్ బాబు, రేవంత్ రెడ్డి కొద్దిసేపు సమావేశమై పలు అంశాలపై మాట్లాడుకున్నట్లు సమాచారం. అయితే ఈ భేటీలో ఏయే విషయాలు చర్చకు వచ్చాయనే దానిపై అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఇది మర్యాదపూర్వక భేటీగానే జరిగినట్లు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికారిక సోషల్ మీడియా ఖాతా పేర్కొంది. అయితే ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలు బయటకు రావడంతో అసలు వీరిద్దరి మధ్య ఏం చర్చ జరిగిందనే ఆసక్తి మొదలైంది. సినిమా రంగానికి సంబంధించిన విషయాలపై మాట్లాడుకున్నారా? లేక ఇతర అంశాలపై చర్చించారా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మరోవైపు మహేశ్ బాబు ప్రస్తుతం ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. మొత్తానికి మహేశ్ బాబు, రేవంత్ రెడ్డి భేటీ ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సమావేశం వెనుక ప్రత్యేక కారణం ఏదైనా ఉందా? అన్నది మాత్రం అధికారికంగా తెలియాల్సి ఉంది. ఇది కూడా చదవండి: ఆటో జానీ గుర్తున్నాడా?.. కాకాలో చిరంజీవి వింటేజ్ అవతార్‌ అదిరింది.! https://x.com/Theteluguone/status/2126895775401787879       [Mahesh Babu, Revanth Reddy, Telangana, Hyderabad, Varanasi]  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
వయసు పెరిగినా యవ్వనంగా కనిపించాలంటే.. ఇవి అలవాటు చేసుకోండి..! వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో అలసట పెరగడం, బరువు పెరగడం, ముఖంలో కాంతి తగ్గడం చాలా మందికి ఎదురయ్యే సమస్యే. కానీ గంటల తరబడి జిమ్‌లో కష్టపడకుండా లేదా కఠినమైన డైట్లు చేయకుండా, మన రోజువారీ అలవాట్లలో చిన్న మార్పులు చేసుకుంటే ఎప్పటికీ ఉత్సాహంగా, ఫిట్‌గా, యవ్వనంగా ఉండొచ్చు.  ఆ అలవాట్లు ఏమిటో అవి వయసు పెరిగినా యవ్వనంగా ఉండటంలో ఎలా సహాయపడతాయో వివరంగా  తెలుసుకుంటే.. ఉదయం లేవగానే ఫోన్ చూడకుండా ప్రశాంతంగా రోజును ప్రారంభించాలి. ఫోన్ చూస్తే వెంటనే అనవసరపు ఆలోచనలు, ఒత్తిడి మొదలవుతాయి. కనీసం మొదటి 15 నిమిషాలు ఫోన్‌కు దూరంగా ఉండటం మంచిది. లేవగానే టీ లేదా కాఫీ తాగే బదులు ఒకటి రెండు గ్లాసుల నీళ్లు తాగాలి. తర్వాత కాసేపు ఉదయపు ఎండలో నిలబడి కనీసం 10 నిమిషాలు నడవాలి. ఇది శరీరానికి కొత్త శక్తిని ఇచ్చి, బద్ధకాన్ని తగ్గిస్తుంది. భోజనం చేసేటప్పుడు టీవీ లేదా ఫోన్ చూడకూడదు. ఆహారాన్ని గమనిస్తూ నెమ్మదిగా నమిలి తింటే కడుపు నిండిన భావన సమయానికి తెలిసి, అతిగా తినకుండా ఉంటాము. ఇది కూడా చదవండి   ఈ ఐదు ఆరోగ్య సూత్రాలు పాటిస్తే చాలు.. జీవితం మారిపోతుంది.. జిమ్‌కు వెళ్లే సమయం లేకపోయినా రోజంతా శరీరానికి కదలిక ఉండేలా చూసుకోవాలి. లిఫ్ట్‌కు బదులు మెట్లు ఎక్కడం, ఫోన్ మాట్లాడేటప్పుడు నడవడం, భోజనం తర్వాత 10 నిమిషాలు వాకింగ్ చేయడం వంటి చిన్న అలవాట్లు శరీరాన్ని చురుకుగా ఉంచుతాయి. కడుపు పూర్తిగా నిండేంత వరకు కాకుండా 80 శాతం నిండగానే తినడం ఆపేయాలి. అలాగే ప్లేట్‌లో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో జంక్ ఫుడ్, చిప్స్, కూల్ డ్రింక్స్ కనిపించేలా ఉంచుకోకుండా, పండ్లు , నీళ్ల బాటిళ్లను కళ్ల ముందు ఉంచుకోవాలి. చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చుకుంటే ఆటోమేటిక్‌గా మంచి ఆహారం తీసుకునే అలవాటు పెరుగుతుంది. ఒకేసారి పెద్ద పెద్ద మార్పులు చేసుకోవాలని గట్టి నిర్ణయాలు తీసుకుని తర్వాత వదిలేయడం కంటే, రోజుకు కొంచెం కొంచెంగా చిన్న అలవాట్లు మార్చుకోవడం ఉత్తమం. అలాగే ఒకరోజు తప్పు జరిగినా నిరుత్సాహపడకుండా మరుసటి రోజు మళ్లీ కొనసాగించడం ముఖ్యం. రాత్రి పడుకునే కనీసం గంట ముందు ఫోన్, టీవీ స్క్రీన్లకు దూరంగా ఉండాలి. గాఢ నిద్ర సరిగ్గా లభిస్తే మరుసటి రోజు శరీరం ఉత్సాహంగా ఉంటుంది, అనవసరమైన ఆకలి కోరికలు కూడా తగ్గుతాయి.                                                                                                                                            *రూపశ్రీ.   మీకు నచ్చవచ్చు   రిలేషన్‌షిప్‌లో పర్సనల్ స్పేస్..భాగస్వామి ఒంటరిగా గడపాలని కోరుకోవడానికి      అసలు కారణాలు..!                                   జీవితంలో డబ్బు, గౌరవం రెండూ కావాలంటే.. ఈ నియమాలు పాటించండి..!
మగాళ్ల రహస్యం..  భార్యకు,  కుటుంబ సభ్యులకు ఈ విషయాలు అస్సలు చెప్పరట..! మన సమాజంలో ఎన్నో ఏళ్లుగా మగవారికి ఒక రకమైన  నియమం ఉంది. ఎంత కష్టం వచ్చినా, ఎంత ఒత్తిడి ఉన్నా మొహంలో చిరునవ్వు చెరగకూడదు, ఎవరి ముందూ కన్నీళ్లు పెట్టుకోకూడదు, అన్ని బాధ్యతలను ఒంటిచేత్తో మోయాలి అనే మాటలు చిన్నప్పటి నుంచే వారి మనసులో బలంగా నాటుకుపోతాయి. ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలైనా, ఆర్థిక ఇబ్బందులైనా, శారీరక అలసటైనా వాళ్లు చాలావరకు బయటకు చెప్పుకోరు. కానీ బయటకు గట్టిగా కనిపించే ప్రతి మనిషి లోపలా ఎన్నో సున్నితమైన భావోద్వేగాలు, చిన్న చిన్న ఆశలు దాగి ఉంటాయి. మగవారు తమ భార్య నుంచి, కుటుంబ సభ్యుల నుంచి మనసులో ఏం కోరుకుంటారో, కానీ బయటకు ఎందుకు చెప్పలేరో వివరంగా తెలుసుకుంటే.. అసలు మీరు ఎలా ఉన్నారు అని ఎవరైనా అడిగితే బాగుంటుందని.. కుటుంబంలోని ప్రతి ఒక్కరి బాగోగులు మగవారే చూసుకుంటూ ఉంటారు. పిల్లల చదువు, అమ్మానాన్నల ఆరోగ్యం, ఇంటి ఖర్చులు ఇలా అన్నింటి గురించి ఆలోచిస్తారు. కానీ వారిని ఎవరైనా ఒక్కసారి మీరు ఎలా ఉన్నారు, ఈరోజు మీకు ఎలా గడిచింది అని అడిగితే చాలా సంతోషిస్తారు. తమ మనసులోని మాటలను ఎలాంటి భయం లేకుండా, మొహమాటం లేకుండా చెప్పుకునే మనిషి ఒకరు పక్కన ఉండాలని వాళ్లు లోలోపల కోరుకుంటారు. ప్రతి సమస్యకు పరిష్కారం వాళ్లే చూపించాలని అనుకోరు.. ఇంట్లో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, ఏ పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా అందరి చూపు ముందుగా ఇంటిలోని మగవారి వైపే ఉంటుంది. ఆర్థిక సమస్యలైనా, ఇతర కష్టాలైనా వాళ్లే పరిష్కరించాలని అందరూ ఆశిస్తారు. కానీ కష్టకాలంలో తమను ఒంటరిని చేయకుండా, కుటుంబ సభ్యులు కూడా అండగా నిలబడాలని, కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకోవాలని వాళ్లు కోరుకుంటారు. ప్రతి భారాన్ని వాళ్ల మీదే వేయకుండా పంచుకుంటే ఎంతో ఊరటగా ఉంటుందని భావిస్తారు. చేసే కష్టానికి చిన్న మెచ్చుకోలు ఆశిస్తారు.. కుటుంబం కోసం మగవారు తమ సొంత ఆనందాలను, కోరికలను చాలాసార్లు పక్కన పెడతారు. రోజుల తరబడి కష్టపడి పని చేస్తారు. అయితే తమ పనికి పెద్ద పెద్ద బహుమతులు లేదా ఘనమైన సన్మానాలు ఏమీ ఆశించరు. కానీ మీ కష్టం నాకు కనిపిస్తోంది, మీరు చేస్తున్న పని చాలా గొప్పది లేదా ఒక్క చిన్న థ్యాంక్స్ వంటి మాటలు వినాలని మనసులో ఆశపడతారు. ఆ చిన్న ప్రశంస వాళ్లకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇది కూడా చదవండి  రోజూ వాకింగ్ చేయలేకపోతున్నామని బాధపడుతున్నారా ఎలాంటి గిల్టీ ఫీలింగ్ లేకుండా కాస్త విశ్రాంతి కావాలి.. సంపాదన, బాధ్యతలు అంటే జీవితకాలం పరుగెడుతూనే ఉండాలి అన్నట్టు కొందరు ప్రవర్తిస్తుంటారు. దానివల్ల కాసేపు తీరిక తీసుకుందామన్నా, సరదాగా గడుపుదామన్నా మగవారికి ఎక్కడో ఒక మూల తప్పు చేస్తున్నామనే భావన కలుగుతుంది. స్నేహితులతో కలవడమో, ఇష్టమైన సినిమా లేదా ఆట చూడటమో, లేదంటే కాసేపు ప్రశాంతంగా ఒంటరిగా ఉండటమో వాళ్లకు కూడా అవసరం. ఏ విధమైన అపరాధ భావన లేకుండా అలాంటి సమయాన్ని కుటుంబం ఇస్తే వాళ్లు ఎంతో రిలాక్స్ అవుతారు. భావోద్వేగాలను తక్కువ చేసి చూడకూడదు.. చాలామంది మగవారు తమ బాధలను బయటకు చెప్పడానికి జంకుతారు. ఎక్కడ నన్ను బలహీనుడు అనుకుంటారో, ఎక్కడ హేళన చేస్తారో అనే భయం వారిలో ఉంటుంది. బాధ వచ్చినప్పుడు కన్నీళ్లు రావడం లేదా మనసు విప్పి మాట్లాడటం బలహీనత కాదు, అది సహజమైన మనిషి స్వభావం. తాము ఏడ్చినా, బాధపడినా దాన్ని తేలికగా తీసుకోకుండా, అర్థం చేసుకుని గౌరవించాలని వాళ్లు కోరుకుంటారు. భార్య, కుటుంబం నుంచి ప్రేమ, ఆత్మీయతతో కూడిన తోడు.. భార్యాభర్తల బంధం కేవలం ఖర్చులు, బాధ్యతలు, అవసరాలకే పరిమితం కాకూడదు అని ప్రతి భర్త కోరుకుంటాడు. ఇద్దరూ కలిసి మనసు విప్పి మాట్లాడుకోవడం, ఒకరికొకరు సమయం కేటాయించడం, కష్టసుఖాల్లో తోడుగా నిలబడటం ఎంతో ముఖ్యం. కుటుంబ సభ్యుల నుంచి కూడా ప్రేమ, నమ్మకం, ఆత్మీయత లభిస్తే ఆ మనిషికి అంతకంటే పెద్ద బలం మరొకటి ఉండదు. సొంత ఇష్టాలు, వ్యక్తిత్వాన్ని కూడా గౌరవించాలి.. పెళ్లయ్యాక, కుటుంబ బాధ్యతలు పెరిగాక చాలామంది మగవారు తమ సొంత అభిరుచులను, కలలను, ఇష్టాలను వదులుకుంటూ ఉంటారు. కేవలం డబ్బు సంపాదించే యంత్రంలానో, బాధ్యతల మనిషిలానో కాకుండా, తమకూ ఒక వ్యక్తిత్వం ఉందని, సొంత ఇష్టాలు ఉంటాయని కుటుంబం గుర్తించాలని వాళ్లు ఆశిస్తారు. తమ కలలను, స్నేహాలను, ఆసక్తులను గౌరవిస్తే వాళ్లు మరింత సంతోషంగా, సంతృప్తిగా ఉంటారు. మొత్తానికి బయటకు ఎంత గట్టిగా, ధైర్యంగా కనిపించినా మగవారికి కూడా ప్రేమ, ఓదార్పు, విశ్రాంతి, అండ అవసరం. ఈ విషయాలను వాళ్లు మాటల్లో చెప్పకపోయినా, మనసులో మాత్రం ఎంతో బలంగా కోరుకుంటారు. ఇంటిల్లిపాది కలిసి ఆ చిన్న చిన్న విషయాలను అర్థం చేసుకుంటే కుటుంబంలో ప్రేమ, సంతోషం ఇంకా పెరుగుతాయి.                                                                                                                                                *రూపశ్రీ.   మీకు నచ్చవచ్చు   ప్రేమ, నమ్మకం ఉన్నప్పటికీ.. లైఫ్ పార్ట్నర్ ఎందుకు మారిపోతారు.!                                    ఈ నాలుగు పాటిస్తే అత్తాకోడళ్ల మధ్య గొడవలే ఉండవు
చలికాలం రాగానే వాతావరణం చల్లగా మారుతుంది, ఎండ వేడి తగ్గినట్టు అనిపిస్తుంది. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు చాలామంది సన్‌స్క్రీన్ వాడటం ఆపేస్తారు. కానీ మన చర్మం థర్మామీటర్ చూసి స్పందించదు, కాంతికి స్పందిస్తుంది. మిద్దె మీద లేదా ఆరుబయట కొన్ని గంటలు గడిపితే చల్లని గాలిలో కూడా ముఖం, చేతులు నల్లబడతాయి. నిపుణుల ప్రకారం, సన్ ట్యాన్ వేడి వల్ల కాదు, అతినీలలోహిత కిరణాల (UV rays) వల్ల వస్తుంది. వేడిని మనం అనుభవించగలం కానీ UV కిరణాలను అనుభవించలేం. చలికాలంలో UVB కిరణాలు తక్కువగా ఉన్నా, వృద్ధాప్య ఛాయలు మరియు ట్యానింగ్‌కు కారణమయ్యే UVA కిరణాలు మాత్రం చురుకుగానే ఉంటాయి. ఇవి మేఘాలను మరియు కిటికీ అద్దాలను కూడా దాటుకుని చర్మాన్ని తాకుతాయి. దీనివల్ల చర్మం తనను తాను కాపాడుకోవడానికి మెలనిన్ (melanin) ఉత్పత్తి చేస్తుంది, అదే ట్యాన్‌గా మారుతుంది. చలికాలపు ఎండ బయటకు కనిపించినంత అమాయకంగా ఉండదు. చల్లని గాలి వల్ల వేడి హెచ్చరిక తెలియక మనం ఎండలో ఎక్కువ సమయం గడిపేస్తాం. స్పష్టమైన రోజుల్లోనే కాకుండా పలుచని మేఘాలు ఉన్నప్పుడు కూడా గణనీయమైన UV కిరణాలు కిందకు వస్తాయి. మంచు, నీరు, లేదా ప్రకాశవంతమైన ఉపరితలాలు UV కిరణాలను తిరిగి చర్మంపై ప్రతిబింబిస్తాయి. ఎత్తైన ప్రాంతాలు లేదా హిల్ స్టేషన్లకు వెళ్లినప్పుడు UV తీవ్రత మరింత పెరుగుతుంది. 2024లో ప్రచురించబడిన ఒక అధ్యయన సమీక్ష ప్రకారం, UVA కిరణాలు మరియు దృశ్య కాంతి మేఘాలు, కిటికీ అద్దాల గుండా ప్రయాణించగలవు, అలాగే మెలస్మా వంటి నల్లటి మచ్చల సమస్యలో సూర్యకాంతి కీలక పాత్ర పోషిస్తుంది. భారతీయ చర్మతత్వానికి చలికాలపు ఎండ వల్ల అదనపు జాగ్రత్తలు అవసరం. ముదురు చర్మంలో మెలనిన్ ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా కమిలిపోదు కానీ సులభంగా ట్యాన్ అవుతుంది మరియు నల్లటి మచ్చలు ఏర్పడతాయి. చలికాలపు ఎండ ముఖం, చేతులు, మెడను నల్లబర్చడమే కాకుండా, మెలస్మా (బుగ్గలు, నుదురుపై గోధుమ లేదా బూడిద రంగు మచ్చలు)ను తీవ్రతరం చేస్తుంది మరియు మొటిమల మచ్చలను ఎక్కువకాలం ఉంచుతుంది. 2022లో జరిగిన ఒక సమీక్ష ప్రకారం, దృశ్య కాంతి మరియు దీర్ఘ తరంగ UVA కిరణాలు మెలస్మాకు ముఖ్య కారణాలుగా నిలిచాయి, అయినప్పటికీ మెలస్మా ఉన్నవారిలో ఎక్కువమంది సూర్యరశ్మి నుంచి రక్షణ చర్యలు సరిగ్గా పాటించడం లేదని తేలింది. అందుకే చలికాలంలోనూ ప్రతిరోజూ ఉదయం కనీసం SPF 30 మరియు PA+++ లేదా అంతకంటే ఎక్కువ రేటింగ్ ఉన్న బ్రాడ్-స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్ తప్పనిసరిగా వాడాలి. సన్‌స్క్రీన్ వాడటంలో సంఖ్య కంటే వాడే పద్ధతి, మోతాదు చాలా ముఖ్యం. ముఖం మరియు మెడ కోసం సుమారు రెండు వేళ్ల పొడవు (two finger lengths) అంత సన్‌స్క్రీన్ తీసుకోవాలి. బయట ఉన్నప్పుడు ప్రతి రెండు నుంచి మూడు గంటలకు ఒకసారి మళ్లీ రాయాలి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య నీడలో ఉండటం మంచిది. టోపీ, సన్‌గ్లాసెస్, ఫుల్ స్లీవ్ దుస్తులు ధరించాలి మరియు చేతుల వెనుక భాగం, చెవులు, మెడను కూడా కవర్ చేసుకోవాలి. చల్లని గాలి వల్ల చర్మం పొడిబారి సున్నితంగా మారుతుంది కాబట్టి మాయిశ్చరైజర్ కూడా వాడాలి. ఉష్ణోగ్రత కంటే వాతావరణ యాప్‌లో UV ఇండెక్స్ చూసి ప్రణాళిక వేసుకోవాలి. ఇది కూడా చదవండి:జలుబు, పొడి దగ్గు వేధిస్తోందా? ఇంట్లోనే ఈ సులభ పరిష్కారాలు విటమిన్ D కోసం గంటల తరబడి ఎండలో నిలబడాల్సిన అవసరం లేదు; అలా చేస్తే పిగ్మెంటేషన్ మరియు చర్మ సమస్యలు పెరుగుతాయి. విటమిన్ D లోపం గురించి ఆందోళన ఉంటే వైద్యుడిని సంప్రదించి రక్త పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. 2021లో ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో వచ్చిన సమీక్ష ప్రకారం, ముదురు చర్మం ఉన్నవారికి అదే స్థాయిలో విటమిన్ D ఉత్పత్తి కావడానికి ఎండలో ఎక్కువ సమయం పట్టవచ్చు, కాబట్టి అంచనా వేయడం సరికాదు.  అలాగే, విస్తరిస్తున్న లేదా తగ్గని నల్లటి మచ్చలు, ఆకారం లేదా రంగు మారుతున్న పుట్టుమచ్చలు, చర్మం కాలిపోవడం లేదా పొట్టు ఊడటం, లేదా సన్‌స్క్రీన్ వాడినా పెరుగుతున్న పిగ్మెంటేషన్ కనిపిస్తే వెంటనే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించాలి. చలికాలంలోనూ రోజూ సన్‌స్క్రీన్ రాయడం, చర్మాన్ని కప్పి ఉంచడం ద్వారా మీ చర్మాన్ని ఆరోగ్యంగా మరియు కాంతివంతంగా ఉంచుకోవచ్చు. మీకు నచ్చవచ్చు:ఆంధ్ర స్టైల్, మిరపకాయ బజ్జీ కూర.. సింపుల్ టిప్స్‌తో పర్ఫెక్ట్ గ్రేవీ!                              ఈజీగా చేసుకునే, రుచికరమైన పొట్లకాయ పచ్చిశనగపప్పు, కూర విధానం           Winter Sun Tan, Sun Tan In Winter Causes, Dermatologist Skincare Tips, Winter Sunscreen Tips, UV Rays In Winter, Prevent Tanning In Cold Weather, Skincare Tips In Telugu.
ప్రేమతో అన్నం పెడితే సరిపోదు.. పిల్లల ఎదుగుదలకు ఈ పోషకాలు తప్పనిసరి! 5 నుంచి 10 ఏళ్ల వయసు పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు సరైన పోషకాహారం ఎంతో అవసరం. ఈ వయసులో పిల్లలు వేగంగా ఎదుగుతుంటారు. వారి ఎముకలు, కండరాలు బలంగా అభివృద్ధి చెందడానికి, మెదడు చురుకుగా పనిచేయడానికి, రోజంతా ఉత్సాహంగా ఉండటానికి సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే పిల్లలకు ప్రతిరోజూ ఎలాంటి ఆహారం ఇవ్వాలి? వారి ఎదుగుదలకు అవసరమైన పోషకాలు ఏయే ఆహార పదార్థాల ద్వారా లభిస్తాయి? అనే విషయాలపై తల్లిదండ్రులకు ఎన్నో సందేహాలు ఉంటాయి. ఈ వీడియోలో డాక్టర్ శ్రీలత గారు 5-10 ఏళ్ల పిల్లల కోసం ఎలాంటి రోజువారీ డైట్ ప్లాన్ పాటించాలో వివరించారు. పిల్లల ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు ఎందుకు ముఖ్యమో, ఇవి శరీర ఎదుగుదలకు, కండరాల అభివృద్ధికి ఎలా తోడ్పడతాయో తెలియజేశారు. పిల్లలకు సరైన మోతాదులో పోషకాలు అందించడానికి ఎలాంటి ఆహారాన్ని ఎంచుకోవాలో వివరించారు. పిల్లల రోజువారీ ఆహారంలో అన్నం, పప్పులు, పాలు, పెరుగు, గుడ్లు, కూరగాయలు, పండ్లు వంటి పోషకవిలువలు కలిగిన పదార్థాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే పిల్లల వయసు, శారీరక ఎదుగుదల, చురుకుదనం, ఆహార అవసరాలను బట్టి వారి డైట్‌లో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. పిల్లలు భోజనం సరిగ్గా చేయకపోవడం, పోషకాహారం పట్ల ఆసక్తి చూపకపోవడం, బయట ఆహార పదార్థాలపై ఎక్కువగా ఆధారపడటం వంటి అలవాట్ల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. సరైన ఆహారపు అలవాట్లు చిన్నప్పటి నుంచే నేర్పించడం వల్ల పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పునాది పడుతుంది. మీ పిల్లలు ఆరోగ్యంగా, చురుకుగా ఎదగాలంటే వారి రోజువారీ ఆహారంలో ఎలాంటి మార్పులు చేయాలి? 5-10 ఏళ్ల పిల్లలకు ఎలాంటి డైట్ ప్లాన్ ఉపయోగపడుతుంది? పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు అవసరమైన పోషకాహారం గురించి డాక్టర్ శ్రీలత గారు అందించిన విలువైన సూచనలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోండి. పిల్లల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ఈ వీడియోను తల్లిదండ్రులు తప్పక చూడండి.
జుట్టు ఒత్తుగా పెరగాలంటే.. మజ్జిగలో ఈ మూడు పొడులు కలిపి తీసుకోండి!   జుట్టు రాలడం, పలుచబడటం, జుట్టు ఒత్తుగా పెరగకపోవడం వంటి సమస్యలతో చాలామంది ఇబ్బందిపడుతుంటారు. జుట్టు ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే బయట ఉపయోగించే నూనెలు, షాంపూలతో పాటు మనం తీసుకునే ఆహారం కూడా ఎంతో ముఖ్యం. ముఖ్యంగా పోషకాలు సమృద్ధిగా ఉండే సహజ ఆహారాలు తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. మునగాకు పొడి, కరివేపాకు పొడి, మెంతుల పొడిని మజ్జిగలో కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి పోషకాలు అందుతాయి? మునగాకులో ఉండే పోషకాలు జుట్టు ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయి? కరివేపాకును ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? మెంతులు మన ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తాయి? ఈ సహజ పదార్థాలను రోజువారీ ఆహారంలో ఎలా భాగం చేసుకోవాలి? అలాగే చిరుధాన్యాలు (Millets) మన ఆరోగ్యానికి అందించే ప్రయోజనాలు ఏమిటి? రాగులు, జొన్నలు, సజ్జలు వంటి చిరుధాన్యాలను తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి పోషకాలు లభిస్తాయి? సంప్రదాయ ఆహారపు అలవాట్లు, సహజంగా పండించిన ఆహార పదార్థాల ప్రత్యేకత ఏమిటి? అనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో ప్రముఖ నేచురల్ ఫార్మింగ్ నిపుణులు  గున్న రాజేందర్ రెడ్డి (Gunna Rajender Reddy) గారు వివరించారు. జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహారపు అలవాట్లు పాటించాలి? ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన సహజ ఆహారాలను మన రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి? వంటి ఎన్నో ఉపయోగకరమైన విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. జుట్టు ఆరోగ్యం, సహజ ఆహారం, మునగాకు, కరివేపాకు, మెంతులు, చిరుధాన్యాల పయోజనాల గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. గమనిక: ఈ ఆహార పదార్థాలు పోషకాలను అందించవచ్చు. అయితే 90 రోజుల్లో జుట్టు తప్పనిసరిగా ఒత్తుగా పెరుగుతుందని హామీ ఇవ్వలేము. జుట్టు అధికంగా రాలుతున్నట్లయితే కారణాన్ని గుర్తించేందుకు వైద్య నిపుణులను సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
భోజనం చేసిన కొద్దిసేపటికే మళ్లీ ఆకలి వేయడం లేదా ఎప్పుడూ ఏదో ఒకటి కొరుకుతూ ఉండాలని అనిపించడం చాలామందిలో కనిపిస్తుంది. ఎక్కువ పని చేసినప్పుడు లేదా సరిగ్గా తిననప్పుడు ఇలా అనిపిస్తే అది సాధారణమే. కానీ కడుపు నిండా తిన్నాక కూడా పదేపదే ఆకలి వేస్తుంటే మాత్రం దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. అది మన అలవాటా లేక శరీరంలో  ఏదైనా సమస్య గురించి అలా లక్షణం రూపంలో బయటకు తెలుస్తోందా అన్నది తెలుసుకోవడం ముఖ్యం. చాలామంది ఎప్పుడూ ఏదో ఒకటి తింటూ ఉంటారు.  అలాంటి వారు తప్పక తెలుసుకోవాల్సిన నిజాలివి. అవేంటో తెలుసుకుంటే.. అలవాట్లు.. మన రోజువారీ ఆహారపు అలవాట్లు, తినే సమయం, తినే ఆహారం మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయి. కొన్నిసార్లు ఆకలి వెనుక శరీరంలోని హార్మోన్లు లేదా ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. సాధారణ ఆకలికి, అనారోగ్య సంకేతానికి మధ్య తేడాను గుర్తించాలి. డయాబెటిస్.. డయాబెటిస్ ఉన్నవారిలో పదేపదే ఆకలి వేయడం ఒక సాధారణ లక్షణం. రక్తంలోని గ్లూకోజ్‌ను శరీర కణాలకు చేర్చడానికి ఇన్సులిన్ అవసరం. డయాబెటిస్‌లో ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కణాలకు తగినంత శక్తి అందదు. దాంతో ఆకలి ఎక్కువగా అనిపిస్తుంది. దీనికి తోడు ఎక్కువ దాహం, తరచుగా మూత్రవిసర్జన, బరువు తగ్గడం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. అలాగే రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా తగ్గినప్పుడు కూడా విపరీతమైన ఆకలి వేస్తుంది. అప్పుడు చెమట పట్టడం, వణుకు, తలతిరగడం, కంగారుగా అనిపించడం లాంటివి కలగవచ్చు. థైరాయిడ్.. థైరాయిడ్ సమస్య వల్ల కూడా ఆకలి పెరగవచ్చు. థైరాయిడ్ గ్రంథి అవసరం కంటే ఎక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేసే స్థితిలో శరీర జీవక్రియ వేగంగా జరుగుతుంది. దీనివల్ల ఆకలి పెరిగినా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. గుండె వేగంగా కొట్టుకోవడం, ఎక్కువ చెమట పట్టడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. నిద్ర సరిగ్గా లేకపోవడం, ఒత్తిడి, కొన్ని రకాల మందుల వల్ల కూడా ఆకలిని నియంత్రించే హార్మోన్లపై ప్రభావం పడి ఎక్కువ ఆకలి వేయవచ్చు. ఇది కూడా చదవండి   మునగాకు లడ్డూ రోజూ 2 తింటే.. శరీరానికి ఇన్ని పోషకాలా.! ఆకలితో పాటు బరువు తగ్గడం.. ఎప్పుడూ ఆకలి వేస్తూ దానితో పాటు బరువు తగ్గడం, ఎక్కువ దాహం, తరచుగా మూత్రానికి వెళ్లాల్సి రావడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్‌ను కలవడం మంచిది. అవసరమైన రక్త పరీక్షలు, థైరాయిడ్ పరీక్షలు చేయించుకుంటే అసలు కారణం తెలుస్తుంది.                                                                                                                                              *రూపశ్రీ.   మీకు నచ్చవచ్చు   అవిసె గింజలు ఎలా తింటే ఎక్కువ మేలు సరైన పద్ధతి ఇదే!                                   ఇదిగో ఈ ఆహారాలు తింటే గట్ హెల్త్ సేఫ్ గా ఉంటుంది..!