TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

డీలిమిటేషన్ కు బీఆర్ఎస్ మద్దతు: అధికారికంగా ప్రకటించిన కేటీఆర్.!

Published on: Sat Nov 28, 2026 3:44PM

డీలిమిటేషన్ కు బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది.  దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటులో ప్రస్తుతం ఉన్న ప్రాతినిధ్య వాటా తగ్గకుండా, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా డీలిమిటేషన్ ప్రక్రియ జరగాలని  బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు.  లోక్‌సభ స్థానాలను ప్రస్తుత సంఖ్య కంటే 50 శాతం పెంచడంతో పాటు, 2051 వరకు రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా రక్షణ కల్పించే కేంద్ర ప్రభుత్వ తాజా ప్రతిపాదనకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు. 

పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాలకు ప్రస్తుతం ఉన్న   24 శాతం ప్రాతినిధ్య వాటాను యథాతథంగా నిలబెట్టాలని బీఆర్ఎస్ మొదటి నుంచీ డిమాండ్ చేస్తోందన్న అందుకు అనుగుణంగానే కేంద్రం బిల్లును తీసుకురావడానికి అంగీకరించినందునే మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.  కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన తాజా ఫార్ములా అమల్లోకి వస్తే తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 17 లోక్‌సభ స్థానాల సంఖ్య 26కు పెరిగే అవకాశం ఉందన్న కేటీఆర్ వివరించారు. అన్ని రాష్ట్రాల్లోనూ దామాషా ప్రకారం 50 శాతం మేర లోక్‌సభ సీట్లను పెంచడం వల్ల రాష్ట్రాల మధ్య ప్రస్తుత ప్రాతినిధ్య నిష్పత్తి చెక్కుచెదరకుండా కొనసాగుతుందని, అదే సమయంలో ప్రజలకు మరింత విస్తృతమైన పార్లమెంటరీ ప్రాతినిధ్యం లభిస్తుందని అన్నారు.

తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు. రాష్ట్రానికి అదనపు లోక్‌సభ స్థానాలు దక్కడంతో పాటు దక్షిణాది రాష్ట్రాల వాటాకు రక్షణ కల్పించే అంశాలను బీఆర్ఎస్ స్వాగతిస్తోందని పేర్కొన్నారు.

మహిళా రిజర్వేషన్ల అంశంపై..    చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న నిర్ణయానికి బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా నిలుస్తోందని, ఆ రిజర్వేషన్ల అమలుకు తమ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. డీలిమిటేషన్ ప్రక్రియలో రాష్ట్రాల హక్కులు, సమాన ప్రాతినిధ్యం, మహిళా ప్రాధాన్యత వంటి అంశాలకు సముచిత స్థానం కల్పించాలన్నారు.

ఇది కూడా చదవండి:  డీలిమిటేషన్ బిల్లు: ఆమోదం కోసం కేంద్రం వ్యూహాలు.!​

  పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లు చర్చకు రానున్న నేపథ్యంలో ప్రాంతీయ పార్టీల వైఖరులు జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారాయి. లోక్‌సభలో ప్రస్తుతం బీఆర్ఎస్‌కు సభ్యులు లేనప్పటికీ, రాజ్యసభలో ఉన్న ముగ్గురు ఎంపీల మద్దతు  ప్రాధాన్యత సంతరించుకుంది. దక్షిణాది రాష్ట్రాల వాటా పరిరక్షణపై కేంద్రం ఇచ్చిన 2051 స్థిరీకరణ ప్రతిపాదన ప్రాంతీయ పార్టీల ఆందోళనలను  తగ్గించిదని పరిశీలకులు అంటున్నారు. 

 

మొత్తం మీద, దక్షిణాది రాష్ట్రాల 24 శాతం వాటా రక్షణ, 2051 వరకు సీట్ల నిష్పత్తి స్థిరీకరణ,  వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని డీలిమిటేషన్ ప్రతిపాదనకు మద్దతు ఇవ్వాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. రా

మీకు నచ్చవచ్చు:  డీలిమిటేషన్‌ ముసుగులో రాజ్యాంగాన్ని మార్చే యత్నం.. కేంద్రంపై గౌరవ్‌ గొగోయ్‌ విమర్శలు

డీలిమిటేషన్ ఎందుకు అవసరం: దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరిగేదెలా.?​

[BRS Support Delimitation, KTR Announce,   Lok Sabha seats, Telangana, TeluguOne]