LATEST NEWS
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు వైసీపీ అధినేత జగన్ తో భేటీ అయ్యారు. రాజమహేంద్రవరం జైలు నుంచి బెయిలుపై విడుదల అయిన తరువాత అంబటి జగన్ తో భేటీ అవ్వడం ఇదే మొదటి సారి. తాడేపల్లిలోని జగన్ నివాసానికి అంబటి శుక్రవారం (ఫిబ్రవరి 20) వెళ్లి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అంబటి తనపై ప్రభుత్వం పెట్టిన  కేసులను వివరించారు. అలాగే గుంటూరులోని తన నివాసంపై తెలుగుదేశం శ్రేణుల దాడి, తనపై హత్యయాత్నం చేయడం తదితర విషయాలను జగన్ కు తెలియజేశారు.  ఈ సందర్భంగా జగన్ అంబటికి కేసులకు భయపడవద్దని ధైర్యం చేప్పారు. కేసులను చట్టపరంగా ఎదుర్కొందామని భరోసా ఇచ్చారు. అంబటితో పాటు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపీ నందిగం సురేశ్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు కూడా జగన్ ను కలిశారు.     
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం (ఫిబ్రవరి 20) సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. కేసు దర్యాప్తులో పోలీసుల నిర్లక్ష్యంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పట్లో అధికారపార్టీలో ఉన్న అనంతబాబుతో  పోలీసులు కుమ్మక్కయ్యారని వ్యాఖ్యానించింది. డీఫాల్ట్ బెయిల్ వచ్చేలా ఛార్జ్‌షీట్ దాఖలు చేశారని న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. తప్పుచేసిన పోలీసులపై ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీసింది. డీజీపీ, ఎస్పీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. పోలీసులు.. నిందితుడితో ఇప్పటికీ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు కనిపిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసులో ఏపీ పోలీసుల దర్యాప్తు తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు ట్రయల్ పూర్తయ్యే వరకు అనంతబాబు డీఫాల్ట్ బెయిల్‌ను పొడగించిన న్యాయస్థానం.. నవంబర్‌ 30లోగా ట్రయల్ పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ కేసులో జోక్యం చేసుకుని దర్యాప్తునకు ఎలాంటి అడ్డంకులు రాకుండా చూడాలని ఏపీ హైకోర్టుకు సుప్రీం ధర్మాసనం సూచించింది. వేగంగా ట్రయల్ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని హైకోర్టుకు ఉన్నత న్యాయస్థానం పలు మార్గదర్శకాలు ఇచ్చింది.
 మండలిలో వైసీపీ సభ్యులపై మంత్రుల ఆగ్రహం వైసీపీ సభ్యుల ఆందోళనలతో ఏపీ శాసనమండలిలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. శుక్రవారం సభ ఆరంభం కాగానే  వైసీపీ రెండు వాయిదా తీర్మానాలు ఇచ్చింది. టీటీడీకి నెయ్యి సరఫరా చేయడంపై సభలో చర్చించాలని కోరుతూ వైసీపీ సభ్యులు ఈ తీర్మానాలిచ్చారు. ఆ తీర్మానాలను ఛైర్మన్ తిరస్కరించారు. దీంతో వారు ఛైర్మన్ పోడియం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వైసీపీ సభ్యులు వేంకటేశ్వర స్వామి ఫొటోలు, ప్లకార్డులతో   పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. సభలో వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామివారి ఫొటోలతో రాజకీయం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. వేంకటేశ్వర స్వామి ఫొటోలతో నిరసన తెలపడంపై అభ్యంతరం తెలిపిన ఆయన.. దేవుడి ఫొటోలను పట్టుకుని నిరసనకు దిగడం అనైతికమన్నారు. సభలో దేవుడి చిత్రాలను అనుమతించవద్దని మంత్రి కోరారు. చెప్పులు వేసుకుని వేంకటేశ్వర స్వామి ఫొటోలను ఎలా పట్టుకుంటారని పలువురు మంత్రులు ప్రశ్నించారు. పోడియంను చుట్టుముట్టి వైసీపీ సభ్యులు ఆందోళనను కొనసాగించడంతో ఛైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు.
ALSO ON TELUGUONE N E W S
తారాగణం: శివ కందుకూరి, తేజు అశ్విని, రాజీవ్ కనకాల, చైతన్య కృష్ణ, రాజ్‌కుమార్ కసిరెడ్డి, వడ్లమాని శ్రీనివాస్ తదితరులు సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి  డీఓపీ: క్రాంతి వర్ల  ఎడిటింగ్: పవన్ నరవ  దర్శకత్వం: ప్రమోద్ హర్ష  నిర్మాతలు: రాధా వి. పాపుడిప్పు, వెంకట్ ఆర్. పాపుడిప్పు బ్యానర్: హర్షిక ప్రొడక్షన్స్  విడుదల తేదీ: ఫిబ్రవరి 20, 2026 శివ కందుకూరి, తేజు అశ్విని, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'నవాబ్ కేఫ్'(Nawab Cafe). ప్రమోద్ హర్ష దర్శకత్వంలో హర్షిక ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రానికి మొదట అనుకున్న టైటిల్ 'చాయ్ వాలా'. సెన్సార్ అభ్యంతరంతో 'నవాబ్ కేఫ్'గా మారింది. విచిత్రంగా స్క్రీన్ మీద మాత్రం 'నవాబ్స్ కేఫ్' అని పడింది. సరే టైటిల్ విషయాన్ని పక్కన పెడితే.. తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో ఒక 'చాయ్ వాలా' కథగా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందంటే..? కథ: రాజా(శివ కందుకూరి) హైదరాబాద్ పాతబస్తీకి చెందిన యువకుడు. రాజా తాత అప్పట్లో చాయ్ పెట్టడంలో గొప్ప పేరు సంపాదిస్తాడు. అతని చాయ్ కి ఫిదా అయిన హైదరాబాద్ నవాబ్.. విలువైన భూములను రాసిస్తాడు. వాటాలో భాగంగా ఆ భూములను పెద్ద కొడుకు తీసుకోగా, చిన్న కొడుకైన రాజా తండ్రి రంగనాథ్(రాజీవ్ కనకాల) మాత్రం వారసత్వంగా నవాబ్ కేఫ్ ని తీసుకుంటాడు. రంగనాథ్ చాయ్ కి, నవాబ్ కేఫ్ కి ఎంతో క్రేజ్ ఉంటుంది. రాజాకి మాత్రం ఈ లైఫ్ నచ్చదు. 'చాయ్ వాలా' అని పిలిపించుకోవడం అసలు ఇష్టముండదు. అమెరికా వెళ్ళాలని, కోట్లకు కోట్లు సంపాదించాలని కలలు కంటుంటాడు.  మరోవైపు రాజా పెదనాన్న కొడుకు కుమార్(చైతన్య కృష్ణ) కన్ను 'నవాబ్ కేఫ్'పై పడుతుంది. కోట్ల విలువ చేసే ఆ కేఫ్ స్థలాన్ని తీసుకొని, అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలి అనుకుంటాడు. అన్నయ్య కుమార్ సూచనతో 'నవాబ్ కేఫ్'ని అమ్మేసి, రిచ్ లైఫ్ బతకాలని రాజా నిర్ణయించుకుంటాడు. రాజా తీసుకున్న నిర్ణయంతో అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? తను ప్రాణంగా భావించే నవాబ్ కేఫ్ ని అమ్మడానికి రంగనాథ్ ఒప్పుకున్నాడా? నవాబ్ కేఫ్ చరిత్రలో కలిసిపోయిందా లేక చరిత్ర సృష్టించిందా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. విశ్లేషణ: వారసత్వం, విలువలు అంటూ తండ్రి మడి కట్టుకొని కూర్చుంటే.. కొడుకు మాత్రం డబ్బు, రిచ్ లైఫ్ అంటూ గాలిలో మేడలు కడుతుంటాడు. ఒకానొక సమయంలో తండ్రి విలువ తెలుసుకొని కొడుకు రియలైజ్ అయ్యి.. తండ్రి బాటలోనే పయనిస్తాడు. ఈ తరహా కథలు ఇప్పటికే తెరపై ఎన్నో వచ్చాయి. 'నవాబ్ కేఫ్' కూడా అలాంటి కథే. పైగా ఇందులో 'ఇడ్లీ కడై', 'ఉస్తాద్ హోటల్', 'మిస్ ఇండియా' వంటి సినిమాల ఛాయలు కనిపిస్తాయి. ఇష్టంగా, నిజాయితీగా చేస్తే ఏ పనిలోనైనా విజయం సాధిస్తామనే విషయాన్ని ఈ చిత్రం ద్వారా చెప్పదలుచుకున్నాడు దర్శకుడు. మనం కోరుకునే జీవితం ఒకటైతే, మన తలరాత మరోలా ఉంటుంది. ఆ రెండింటి మధ్య నగిలిపోయే జీవితమే ఇందులో హీరో పాత్రది. 'నవాబ్ కేఫ్'ని పరిచయం చేస్తూ సినిమా ప్రారంభమవుతుంది. ఒత్తిడిలో ఉన్నవారికి తన చాయ్ ద్వారా కాస్త ఉపశమనం కలిగితే చాలు అనుకునే ఒక సాధారణమైన, స్వచ్ఛమైన మనిషిగా రంగనాథ్ పాత్రను పరిచయం చేశారు. ఇక అతని కొడుకు రాజా పాత్రను పెద్దగా బాధ్యతలు పట్టవు అన్నట్టుగా, రిచ్ లైఫ్ బతకాలని కలలు కంటున్నట్టు పరిచయం చేశారు. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు విసుగు తెప్పించాయి. ఫస్ట్ హాఫ్ లో పేరుకి శివ కందుకూరి, రాజ్‌కుమార్ కసిరెడ్డి పాత్రల మధ్య కామెడీ సన్నివేశాలు ఉంటాయి కానీ.. అవి ఏమాత్రం నవ్వు తెప్పించవు. ఒక్క కామెడీ డైలాగ్ కూడా పేలలేదు. ఇక శివ కందుకూరి-తేజు అశ్విని మధ్య లవ్ ట్రాక్ కూడా మెప్పించలేదు. ఇంటర్వెల్ ముందే తండ్రీకొడుకుల మధ్య సంఘర్షణ మొదలవుతుంది. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సెకండ్ హాఫ్ లో సినిమా పూర్తిగా ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. అయితే ఫస్ట్ హాఫ్ లో ఏమాత్రం ఆకట్టుకొని కామెడీ సీన్స్, లవ్ సీన్స్ తో బోర్ కొట్టించే కంటే.. తండ్రీకొడుకుల మధ్య అనుబంధాన్ని ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేసి ఉండాల్సింది. అప్పుడు సెకండ్ హాఫ్ లో ఎమోషన్ బాగా వర్కౌట్ అయ్యుండేది. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కాస్త బెటరే అయినప్పటికీ.. సన్నివేశాల్లో కొత్తదనం కనిపించదు. హీరో పాత్ర తాలూకు సంఘర్షణను కూడా అంత ప్రభావవంతంగా చూపించలేదు. పతాక సన్నివేశాలు ఊహించినట్టుగానే సాగుతాయి. పెద్దగా మెరుపులు ఉండవు. ఓవరాల్ గా కథాంశం బాగానే ఉంది. కామెడీ, ఎమోషన్స్ కి స్కోప్ ఉంది. కానీ అవి పండలేదు. సెకండాఫ్ పరవాలేదు కానీ, ఫస్ట్ హాఫ్ మరీ విసిగించింది. నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు: రాజా పాత్రలో శివ కందుకూరి బాగానే రాణించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో మెప్పించే ప్రయత్నం చేశాడు. తేజు అశ్విని పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఇక కథకు కీలకమైన రంగనాథ్ పాత్రను తన సీనియారిటీతో నిలబెట్టాడు రాజీవ్ కనకాల. చైతన్య కృష్ణ, రాజ్‌కుమార్ కసిరెడ్డి, వడ్లమాని శ్రీనివాస్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. ప్రమోద్ హర్ష దర్శకుడిగా పెద్దగా ప్రభావం చూపలేదు. ఎమోషనల్ సీన్స్ తెరకెక్కించడంలో కొంతవరకు పరవాలేదు. రచన తేలిపోయింది. కథనాన్ని ఆసక్తికరంగా రాసుకోవడం, సన్నివేశాల్లో కొత్తదనం ఉండేలా చూసుకోవడంపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా సంభాషణలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. సెకండాఫ్ లో డైలాగ్స్ కొంతవరకు పర్లేదు కానీ, ఫస్ట్ హాఫ్ లో మరీ సిల్లీగా ఉన్నాయి. క్రాంతి వర్ల కెమెరా పనితనం బాగానే ఉంది. పాతబస్తీ వాతావరణాన్ని, చార్మినార్ చుట్టుపక్కల అందాన్ని తన కెమెరాలో చక్కగా బంధించాడు. ప్రశాంత్ ఆర్. విహారి మ్యూజిక్ మ్యాజిక్ చేయలేకపోయింది. పాటలు పూర్తిగా తేలిపోయాయి. ఎడిటర్ పవన్ నరవ కత్తెరకు ఇంకా చాలా పని చెప్పవచ్చు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్: కథాంశం ఇంటర్వెల్  సెకండాఫ్ లో కొన్ని సీన్స్ మైనస్ పాయింట్స్: ఫస్ట్ హాఫ్ డైలాగ్స్ ఫైనల్ గా.. ఒక మంచి చాయ్ పెట్టడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. కానీ, రుచికరమైన చాయ్ ని మాత్రం అందించలేకపోయారు. రేటింగ్: 2.25/5 Disclaimer: Views expressed in this review are personal opinions of the reviewer and organisation doesn't take any liability. Viewers discretion is advised before commenting or reacting to this review.  
సూపర్‌స్టార్ మహేష్(Superstar Mahesh babu), ఎస్.ఎస్.రాజమౌళి(S.S.Rajamouli) కాంబినేషన్‌లో రూపొందుతున్న గ్లోబ్ ట్రాటింగ్ ఎడ్వంచరస్ మూవీ ‘వారణాసి’(Varanasi). ఈ చిత్రానికి సంబంధించి ఎప్పటికప్ప్పుడు వస్తున్న అప్‌డేట్స్ సినిమాపై ఉన్న హైప్‌ను మరింత పెంచుతున్నాయి. మహేష్, రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా అనగానే సహజంగానే ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. దానికి తగ్గట్టుగానే సినిమాకి అన్ని హంగులు కల్పించడానికి రాజమౌళి కషి చేస్తున్నారు.    తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషించనున్నారనే వార్త వినిపిస్తోంది. నాని హీరోగా రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ చిత్రంలో విలన్‌గా సుదీప్ ఎక్స్‌ట్రార్డినరీ పెర్‌ఫార్మెన్స్ ఇచ్చారు. నటుడిగా అతన్ని ఎక్కడికో తీసుకెళ్లిందా సినిమా. ఆ తర్వాత ‘బాహుబలి’ చిత్రంలో ఒక సీన్ చేశారు.    ఇప్ప్పుడు ‘వారణాసి’ చిత్రంలో సుదీప్ కోసం రాజమౌళి ఒక పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ను క్రియేట్ చేశారని తెలుస్తోంది. సినిమాలో 30 నిమిషాల పాటు సుదీప్ క్యారెక్టర్ ఉంటుందని సమాచారం. కథను మలుపు తిప్పే కీలక పాత్ర అతనిదని చెబుతున్నారు. ఒక తెలుగు సినిమాలా కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చే సినిమాగా ‘వారణాసి’ రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ హీరో పథ్విరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్ప్పుడు సుదీప్ కూడా ఈ సినిమాలో భాగం కానుండడంతో మరింత హైప్ వచ్చే అవకాశం ఉంది.    1000 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా రాజమౌళి కెరీర్‌లోనే మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ అవుతుందని అంచనా వేస్తున్నారు.  గతంలో రాజమౌళి చేసిన కొన్ని సినిమాలు సంవత్సరాల తరబడి నిర్మాణం జరుపుకున్నాయి. దానికి భిన్నంగా ‘వారణాసి’ చిత్రాన్ని శరవేగంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తయింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్ రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. 
  -థియేటర్స్ లోకి అడుగుపెట్టిన హే బలవంత్  -టాక్ ఎలా ఉంది  -హిట్టా! ఫట్టా! -ప్రేక్షకుల తీర్పు ఎలా ఉంది  ప్రచార చిత్రాలతో మూవీ లవర్స్, ప్రేక్షకుల్లో మంచి హైప్ ని క్రియేట్ చేసిన మూవీ 'హే బలవంత్'(Hey Balwanth). రిలీజ్ కి నాలుగు రోజుల ముందే 'హే భగవాన్' టైటిల్ ని హే బలవంత్ గా మార్చడంతో మరింత ఫ్రీ పబ్లిసిటీ వచ్చిందనే టాక్ కూడా సోషల్ మీడియాలో రన్ అవుతు ఉంది. ఈ నేపథ్యంలో రిలీజ్ ఈ రోజు అయినా నిన్న ప్రీమియర్స్ నుంచే థియేటర్స్ లో అడుగుపెట్టింది. ప్రేక్షకుల నుంచి నెగిటివ్ టాక్ మాత్రం రావడం లేదు. కొన్ని హైలెట్స్ తో పాటు కథ మెయిన్ ఫ్లాట్ పై నెగిటివ్ ఆలోచన రాకుండా ఉంటే మూవీ   పెద్ద హిట్ అనే అభిప్రాయాన్ని సదరు ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. మరి వాళ్ళు ఏం చెప్తున్నారో చూద్దాం. కథ మెయిన్ పాయింట్ ప్రకారం బలవంత్ అనే వ్యక్తి తన పేరుపై లాడ్జిని నడుపుతుంటాడు. సదరు లాడ్జిలో కొంత మంది ఆడవాళ్లు తమ జీవన భృతి కోసం శరీరాల్ని అమ్ముకుంటూ ఉంటారు. వాళ్లంతా అలా చెయ్యడానికి పలు రకాల కారణాలు ఉంటాయి.బలవంత్ కి కూడా ఒక కారణం ఉంటుంది. ఈ పాయింట్ ని పాజిటివ్ గా  తీసుకుంటే సినిమా హిట్ రేంజ్ మరింత పెరుగుతుందని  అంటున్నారు.  హైలెట్స్ విషయానికి వస్తే  1 .బలవంత్ గా నరేష్ పెర్ ఫార్మెన్స్  2 .సుహాస్, శివాని నాగారం జర్నీ  3 .ఫస్ట్ హాఫ్ లో వెన్నెల కిషోర్ ఎపిసోడ్  4 .హర్షవర్ధన్ క్యారక్టర్ డిజైన్  5 .ఇంటర్వెల్ బ్లాక్  6 .బలవంత్ లాడ్జి చుట్టూ జరిగిన కథ  7 . సెకండ్ హాఫ్ లో వచ్చిన నరేష్, సుహాస్ మధ వచ్చిన సెంటిమెంట్ సీన్స్  8 .క్లైమాక్స్  also read:  toxic: టాక్సిక్ టీజర్ వచ్చేసింది..  ఫకింగ్ మానర్స్  ఆ విధంగా పలు అంశాలు మెప్పించాయని మెజారిటీ ప్రేక్షకులు చెప్తున్నారు. గోపి అచ్చెర(Gopi atchera)దర్శకత్వంలో నరేంద్ర రెడ్డి నిర్మించగా బన్నీ వాసు, వంశీ నందిపాటి  సమర్పకులుగా ఉన్నారు. హర్షవర్ధన్, స్రవంతి,వెన్నెల కిషోర్, అన్నపూర్ణ,సుదర్శన్, అజయ్ ఘోష్ తదితరులు ముఖ్యమైన క్యారక్టర్ లో కనిపించారు.    
మెగాస్టార్ చిరంజీవి(MegaStar Chiranjeevi) కెరీర్‌ని టర్న్ చేసిన సినిమా ఖైదీ అనే విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఆయన్ని తిరుగులేని స్టార్‌గా నిలబెట్టిన సినిమా జగదేకవీరుడు అతిలోక సుందరి. తెలుగు సినిమా చరిత్రలోనే ఓ మైల్‌స్టోన్‌గా నిలిచిన సినిమా అది. ఆ సినిమాకి సీక్వెల్ రాబోతోందని గత కొన్ని సంవత్సరాలు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎలాంటి కన్‌ఫర్మేషన్ లేదు. తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్(Nag Aswin) ఆ ప్రయత్నం చేయబోతున్నారనే సమాచారం అందుతోంది.    2024లో ప్రభాస్‌(Prabhas)తో ‘కల్కి 2898 ఎడి’ వంటి భారీ కమర్షియల్ హిట్‌ని రూపొందించిన నాగ్ అశ్విన్.. ఇప్ప్పుడు మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక ఎక్స్‌ట్రార్డినరీ కథను రెడీ చేశారని తెలుస్తోంది. ఇప్ప్పుడీ వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. పురాణాలను, ఫాంటసీని మిక్స్ చేసి అద్భుతాలు చెయ్యొచ్చు అని కల్కి చిత్రంతో ప్రూవ్ చేసిన నాగ్ అశ్విన్.. మరోసారి ఆ తరహా కథతో రాబోతున్నారని సమాచారం. అయితే చిరంజీవి కోసం సిద్ధం చేసిన కథ జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రానికి సీక్వెల్ అనే ప్రచారం జరుగుతోంది.    త్వరలోనే చిరంజీవిని కలిసి కథ వినిపించేందుకు నాగ్ అశ్విన్ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఈ కథ ఓకే అయితే చిరంజీవి కెరీర్‌లో మరో మైల్‌స్టోన్ లాంటి సినిమా వస్తుందని అభిమానులు ఆశించవచ్చు. జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రాన్ని నిర్మించిన అశ్వనీదత్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తారని సమాచారం. నాగ్ అశ్విన్‌తో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘మహానటి’, ‘కల్కి’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన అశ్వినీదత్.. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారని సమాచారం. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం నాగఅశ్విన్ ‘కల్కి’ సీక్వెల్ పనుల్లో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. 
  -టాక్సిక్ టీజర్ ఆగయా -రిలీజైన నిమిషాల్లోనే రికార్డు వ్యూస్  -కేజిఎఫ్ సిరీస్ ని మించి ఉండబోతుందా! 'టాక్సిక్'(Toxic)ద్వారా వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై మరో బ్లాక్ బస్టర్ లోడింగ్ కి రాకింగ్ స్టార్ యష్ స్పాట్ పెట్టేసాడు.కొద్దీసేపటి క్రితం రిలీజైన టీజర్ తో ఈ విషయం క్లియర్ కట్ గా అర్ధమవుతుంది. టీజర్ అనే కంటే అణు విస్ఫోటనం అని చెప్పవచ్చు. నిమిషం నలభై ఎనిమిది సెకన్ల నిడివితో ఉన్న టీజర్ అణు విస్ఫోటనం లాంటి పదాలని ఉపయోగించే అవకాశాన్ని కల్పించింది. మరి టీజర్ లో ఏముందో ఒక లుక్ వేద్దాం.  ఈ సారి యుద్ధం వేరు.. వాళ్ళ కుతంత్రాలు వేరు.. అందరితో విరోధం పెట్టుకొని బతకలేం.ఫకింగ్ మానర్స్ అనే మాటలతో టీజర్ స్టార్ట్ అయ్యింది. ఆ సందర్భగా వస్తున్న సీన్స్ లోని కొన్ని షాట్స్, యష్ పెర్ ఫార్మ్ చూస్తుంటే అభిమానులకి, ప్రేక్షకులకి కేజిఎఫ్ సిరీస్ ని మించిన  అనుభూతి ఖాయమనే భరోసా దొరికినట్టుగానే భావించవచ్చు. యష్ ఒంటరి పోరాటం ఏ రేంజ్ లో ఉండబోతుందో కూడా అర్ధమవుతుంది.యాక్షన్ సీక్వెన్స్ కి సరికొత్త పేరు ఫిక్స్ చెయ్యడం ఖాయం. విజువల్స్ తో పాటు టోటల్ 24 క్రాఫ్ట్స్ పోటాపోటీగా టాక్సిక్ ని హై రేంజ్ లో ఉంచడానికి  పని చేశాయనే విషయంలో కూడా ఎలాంటి డౌట్ లేదు. టీజర్ ని మీరు కూడా ఒకసారి చూస్తే  మార్చి 19 డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని డైలీ క్యాలండర్ ని చూస్తుండటం పక్కా. కథ, కథనంపై ఉన్న క్యూరియాసిటీ అంతకి అంత పెరిగింది. also read:  Hey Balwanth Movie Review : హే బల్‌వంత్ మూవీ రివ్యూ   లేడీ డైనమిక్ డైరెక్టర్ గీతు మోహన్ దాస్(Geethu Mohandas)తెరకెక్కించగా  తార సుతారియా, రుక్మిణి వసంత్, నయనతార, కియారా అద్వానీ, టోమినో థామస్, సుదేవ్ నాయర్  స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. అనిరుద్ రవిచందర్ నుంచి సాంగ్స్ రవి బసూర్ నుంచి  బిజిఏం రావడం స్పెషల్. యష్, కెవిఎన్ ప్రొడక్షన్స్ సుమారు 600 వందల కోట్ల బడ్జెట్ తో  నిర్మించాయి.  
    Cast: Suhas, Shivani Nagaram, VK Naresh, Sudharshan, Harshavardhan, Babu Mohan, Annapurna, Anchor Sravanthi Crew:  Music Direction by Vivek Sagar  Cinematography by Mahi Reddy Pandugula Edited by Viplav Nyshadam  Written and Directed by Gopi Atchara Produced by B. Narendar Reddy  Suhas has grown into a dependable performer and upcoming star with strong box office presence in Telugu Cinema. But his recent films have ended up being failures and he is expecting a change of fortune with Hey Balwanth. VK Naresh has been prominently highlight of several new releases and with him in a lengthy role, this movie did have a good anticipation. Let's discuss about the 20th February release, at length.  Plot:  Krishna Balwanth (Suhas) aspires to become a rich businessman taking over his father Balwanth(Naresh)'s business. But his father doesn't want him to enter into it and asks him to do a job that suits his profile. He decides to prove his worth to his father and meets Mithra (Shivani Nagaram). She runs an NGO, Mithra Foundation and funds small-scale industries in Guntur. Krishna starts to give practical business advices to improve their financial condition.. They develop a romantic relationship and she wants him to meet her family. Her father, local political leader, PVB (Harshavardhan) aims to tarnish his rival, sitting MLA (Ajay Ghosh)'s image. Meanwhile, due to Balwanth's medical condition, Krishna enters into the business and decides to not attach his name to it. What is the business? How it affects him and his life? Watch the movie to know more.  Analysis:  Suhas is good in his role and he improved in his dramatic skills. He needed much better lines to shine through as the actor is able to be in character from start to finish. Shivani Nagaram is fine and Naresh runs the show. Writera have given him tough portions to carry emotionally and comically. He does it very well. Others are fine in their respective roles while Sudharshan shines, Vennela Kishore is a mixed bag.  Naresh does a great job in comedy scenes and awkward moments but asking him to imitate current stars did not really come across as anticipated. He did try his best but the scene seem to have dragged a little too much. His interaction with Sudarshan and mainly, later's punches provided some laugh-out-loud moments.  Vivek Sagar's music is passable for the film but doesn't really shine as a highlight. Scenes involving Sravanthi and other ladies could have been much better thought out and written. Also, some places had potential for even better comic punches and scenes but they are left under explored. Even the predictability factor kicks into narrative undermining the impact.  Strong climax and slightly less draggy scenes in second hour could have made it compact. Still, with Naresh and Sudharshan shining through, the movie manages to be a decent watchable entertainer with slightly edgy theme. Technically, movie doesn't really offer much and editing, cinematography could have been better. Overall, Hey Balwanth ends up as a watchable entertainer.  Positives: Suhas and Naresh performances  Sudharshan punches and timing  Story set-up and laugh-out-loud moments  Few songs  Negatives:  Draggy scenes in second hour  Few portions could have been written better  Missed opportunities for better jokes in second hour.  Bottomline:  A decent entertainer with laugh-out-loud moments sprinkled here and there.                                                                                                               Rating: 2.75/5  Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them
   -సినిమా పేరు:హే బలవంత్ -న‌టీన‌టులు: సుహాస్,శివానీ నగరం,నరేష్, హర్షవర్ధన్, స్రవంతి,వెన్నెల కిషోర్, అన్నపూర్ణ,సుదర్శన్, -అజయ్ ఘోష్ తదితరులు -సినిమాటోగ్ర‌ఫీ: మహీ రెడ్డి పండుగుల -ఎడిట‌ర్‌: విప్లవ్ నైషధం -మ్యూజిక్: వివేక్ సాగర్ -నిర్మాత‌: బి. నరేంద్ర రెడ్డి -సమర్పణ: బన్నీ వాస్, వంశీ నందిపాటి -బ్యానర్: త్రిశూల్ విజనరీ స్టూడియోస్  -రచన, దర్శకత్వం: గోపి అచ్చర  -రిలీజ్ డేట్ : ఫిబ్రవరి 20 , 2026    సుహాస్(Suhas),లిటిల్ హార్ట్స్ బ్యూటీ శివాని నాగారం(Shivani Nagaram)ఈ రోజు 'హే బలవంత్'(Hey Balwanth) తో థియేటర్స్ లో అడుగు పెట్టారు. నిన్న ప్రీమియర్స్ కూడా ప్రదర్శించడం చూస్తే మేకర్స్ కి మూవీ పై ఉన్న నమ్మకం అర్థమవుతుంది. మరి ఆ నమ్మకానికి తగ్గ ఫలితం వచ్చిందా లేదా చూద్దాం. కథ కృష్ణ(సుహాస్) కి చిన్నప్పటి నుంచి తన తండ్రి బలవంత్(నరేష్) లాగా పెద్ద బిజినెస్ మెన్ అవ్వాలనేది గోల్. కానీ బలవంత్ మాత్రం కృష్ణ ని తన బిజినెస్ దరిదాపుల్లోకి కూడా రానివ్వడు. మిత్ర(శివాని) బిజినెస్ నడిపే వాళ్ళకి ఐడియాస్ ఇచ్చే కన్సల్టెంట్. కృష్ణ, మిత్ర ఒకరినొకరు ఇష్టపడతారు.కృష్ణ కి తన తండ్రి బిజినెస్ గురించి తెలుస్తుంది.దాంతో  తండ్రి పై ద్వేషం పెంచుకుంటాడు. పీవీపీ(హర్ష వర్ధన్) పెద్ద కోటీశ్వరుడుతో పాటు రాజకీయ నేపధ్యం ఉన్న కుటుంబం. ఎంఎల్ ఏ టికెట్ కోసం ప్రయత్నిస్తుంటాడు. దుర్గారావు( అజయ్ ఘోష్) పేరు మోసిన రౌడీ షీటర్ తో పాటు ఆర్ధికంగా బలమైన వ్యక్తి. ఫ్యామిలీ ఎమోషన్ ఉన్న వాళ్ళతో తన కొడుకు(వెన్నెల కిషోర్) పెళ్లి చెయ్యాలని అనుకుంటాడు.బలవంత్ దగ్గర పని చేసే చెంప(స్రవంతి) ని వెన్నెల కిషోర్ ప్రేమిస్తాడు. ఈ మొత్తం క్యారెక్టర్స్ మధ్య కంబైన్డ్ గా జరిగిన కథ ఏంటి ? వాళ్ళ పరిచయానికి  దారి తీసిన పరిస్థితులేంటి? బలవంత్ చేసే బిజినెస్ ఏంటి? తన కొడుకుకి ఎందుకు చెప్పలేదు? అసలు ఎందకు చెయ్యాల్సి వచ్చింది? చివరికి సదరు బిజినెస్ విషయంలో కృష్ణ తీసుకున్న నిర్ణయం ఏంటనేదే హే బలవంత్ ఎనాలసిస్  ఇలాంటి సబ్జెట్స్ పులిపై చేసే స్వారీ లాంటివి. ఏ మాత్రం తేడా వచ్చినా అసలుకే మోసం వస్తుంది. అందుకే మేకర్స్ సెకండ్ హాఫ్  లో సదరు సబ్జెట్ కి  మరో కథనం రన్ చేస్తు  దానిపైనే ఫోకస్ చేసారు. ట్రైలర్ లో కూడా రిలీజ్ చేయని సీక్రెట్ పాయింట్ కి సదరు క్యారెక్టర్స్ చేత సరైన రీజన్ చెప్పించలేకపోయారు. ఆల్కహాల్, సిగరేట్ తాగే వాళ్ళందరూ చెడ్డ వాళ్ళు కాదు. కాకపోతే ఒక సారి అలవాటైన తర్వాత అందులో నుంచి బయటకి రావడం కష్టం. కాబట్టి  సదరు  సీక్రెట్ పాయింట్ కి ఇదే సూత్రం అన్వయించాల్సింది.ఆ తర్వాత  కృష్ణ ఆ అందరి విషయంలో చేసిన మంచి ఏంటనేది ఎంటర్ టైన్ మెంట్ కోణంలో రన్ చేసి ఉంటే బాగుండేదేమో. దాంతో హే బలవంత్ హిట్ పొజిషన్ మరో రేంజ్ లో ఉండేది. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే బలవంత్ చేసే బిజినెస్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతాం. సుహాస్ చిన్నప్పటి సీన్స్ తో పాటు పెద్దయ్యాక వచ్చిన సీన్స్ బాగున్నాయి. శివాని, సుహాస్ మధ్య వచ్చిన సీన్స్ కూడా ఫ్రెష్ గా ఉన్నాయి. ముఖ్యంగా సుదర్శన్,కృష్ణ,బలవంత్  మధ్య వచ్చిన కామెడి పంచ్ డైలాగ్స్ సూపర్. బలవంత్ బిజినెస్ సీన్స్ పర్లేదు. ఈ కథకి పారలల్ గా పీవీపీ, దుర్గ తో  సీన్స్ వచ్చి నెక్స్ట్ ఏం జరగబోతుందనే క్యూరియాసిటీ కలిగింది.ప్రకృతి వైద్యుడుగా వెన్నెల కిషోర్ ఎపిసోడ్ ఫస్ట్ హాఫ్ కి చాలా ప్లస్. పివిపి ఫాదర్ గా బాబు మోహన్ సైలెంట్ యాక్టింగ్ ఓకే. బాబూమోహన్ పైనే వచ్చిన  ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయింది. సెకండాఫ్ మాత్రం  స్లో అయింది. ఫ్లో దెబ్బ తినలేదు కానీ ఫస్టాఫ్ ఇచ్చిన కిక్ అయితే లేదు. గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ లా  బలవంత్  చెప్పిన డైలాగ్స్  సూపర్. వెన్నెల కోశోర్, చెంపల పెళ్లి సంబంధం ఒకే చెయ్యడానికి బలవంత్ బిజినెస్ కి సంబంధించిన వాళ్ళందరూ రావడం, ఆ సందర్భంగా వచ్చిన సీన్స్ వర్క్ అవుట్ కాలేదు. క్లైమాక్స్ తో పాటు బలవంత్ ఫ్లాష్ బ్యాక్ సీన్ మెప్పిస్తుంది.. నటీనటులు సాంకేతిక నిపుణుల పని తీరు  సుహాస్ మరోసారి తన నాచురల్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. కామెడీ టైమింగ్  అదుర్స్. హీరోగా తన జర్నీకి ఇప్పట్లో బ్రేక్ ఉండదని మరోసారి నిరూపించుకునేలా తన పెర్ ఫార్మ్ ఉంది.శివాని నాగారం కూడా తన క్యారక్టర్ పరిధి మేరకు ఈజీ యాక్టింగ్ తో మెప్పించింది. నరేష్ గారి గురించి చెప్పాల్సిన పని లేదు. మరోసారి తన నట విశ్వ రూపంతో హే బలవంత్ కి అతి పెద్ద ప్లస్ గా నిలిచాడు. సదరు క్యారక్టర్ లో నరేష్ గారు కాకుండా ఇంకొకరు ఆ స్థాయి పెర్ఫార్మ్ ఇవ్వడం జరగని పని. ముఖ్యంగా కొడుకు తనపై ద్వేషం చూపిస్తుంటే టైట్ క్లోజ్ షాట్ లో నరేష్ గారు ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ సూపర్.   అజయ్ ఘోష్ పెర్ ఫార్మ్ లో మెరుపులు లేకపోయినా పర్లేదు. వెన్నెల కిషోర్ మరో సారి తన స్టైల్ ఆఫ్ కామెడీ తో మెప్పించాడు. సుహాస్ ఫ్రెండ్ గా చేసిన సుదర్శన్  బాగానే పెర్ఫార్మ్ చేసినా రెగ్యులర్ బాడీ లాంగ్వేజ్ తో ఎంటర్ టైన్ మెంట్ ని పండించినట్టుగా ఉంది. ఆ ప్లేస్ లో సత్య లాంటి ఆర్టిస్ట్ అయితే బాగుందేమో. చెంప గా చేసిన స్రవంతి మెప్పించింది. మరిన్ని సినిమాల్లో తనకి అవకాశాలు రావడం గ్యారంటీ. హర్షవర్ధన్ మరో సారి తాను ఎంత వాల్యుబుల్ నటుడో మరో సారి చాటి చెప్పాడు. ఫొటోగ్రఫీ, నిర్మాణ విలువలు సూపర్. గోపి(Gopi Atchara)దర్శకుడిగా భారీగానే సక్సెస్ అయ్యాడు. రచయితగా మాత్రం తాను ఎంచుకున్న కథకి సరైన కథనాన్ని,రీజన్స్ ని ఎంచుకోడంలో తడబడ్డాడు. డైలాగ్ రైటర్ విషయానికి వస్తే తన డైలాగ్స్ తో నవ్వులు పూయించాడు. ఎడిటింగ్ బాగుంది చివరిగా చెప్పాలంటే రిస్కీ ప్లాట్ ని ఎంతో గట్స్ తో తెరకెక్కించారు. ఈ విషయంలో నిర్మాత, దర్శకుడు, హీరోని అభినందించాలి. బలాలు 1 . ఊహించని కథ 2 . ఎంటర్ టైన్మెంట్  3 . డైలాగ్స్  4 . నరేష్ పెర్ ఫార్మెన్స్  5 . ఫస్ట్ హాఫ్ లో వచ్చే వెన్నెల కిషోర్ ఎపిసోడ్  6 . ఇంటర్ వెల్ ట్విస్ట్  7 .సుహాస్  బలహీనతలు  1 .సెకండ్ హాఫ్ స్లో గా వెళ్లడం  2 .  క్యారెక్టర్స్ కి సరైన రీజన్ ఇవ్వకపోవడం   3 .సాంగ్స్  రేటింగ్ 2 .75 /5                                                                                                       అరుణాచలం   
జనవరిలో పెద్ద సినిమాల సందడి బాగానే ఉంది కానీ, ఫిబ్రవరిలో ఎక్కువగా చిన్న సినిమాలే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. గత వారం 'ఫంకీ', 'కపుల్ ఫ్రెండ్లీ', 'సీతా పయనం' వంటి సినిమాలు విడుదల కాగా ఈ వారం 'హే బల్‌వంత్', 'నవాబ్ కేఫ్' సినిమాలు విడుదలవుతున్నాయి. హే బల్‌వంత్: (Hey Balwanth) సుహాస్, శివాని నగరం జంటగా గోపి అచ్చర దర్శకత్వంలో రూపొందిన మూవీ 'హే బల్‌వంత్'. త్రిశూల్ విజనరీ స్టూడియోస్ నిర్మించిన ఈ మూవీ, ఫిబ్రవరి 20న థియేటర్లలో అడుగుపెడుతోంది. అసలు ఈ చిత్ర టైటిల్ 'హే భగవాన్' కాగా.. సెన్సార్ అభ్యంతరం తెలపడంతో చివరి నిమిషంలో 'హే బల్‌వంత్'గా మార్చారు. హీరో ఫ్యామిలీ చేస్తున్న సీక్రెట్ బిజినెస్ ఏంటి? అంటూ ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా ఎలా ఉంటుందో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. నవాబ్ కేఫ్: (Nawab Cafe) శివ కందుకూరి, తేజు అశ్విని, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'నవాబ్ కేఫ్'. ప్రమోద్ హర్ష దర్శకుడు. హర్షిక ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం, ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రానికి కూడా మొదట అనుకున్న టైటిల్ 'చాయ్ వాలా'. సెన్సార్ అభ్యంతరంతో 'నవాబ్ కేఫ్'గా మారింది. విదేశాలకు వెళ్ళాలి, గొప్పగా బతకాలని కలలు కనే చాయ్ వాలా కొడుకు కథగా ఇది తెరకెక్కింది.  ఓటీటీలోనూ ఈ వారం పలు సినిమాలు సందడి చేయనున్నాయి. భర్త మహాశయులకు విజ్ఞప్తి, శ్రీ చిదంబరం గారు వంటి సినిమాలు ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నాయి. ఈటీవీ విన్: శ్రీ చిదంబరం గారు మూవీ - ఫిబ్రవరి 19  నెట్ ఫ్లిక్స్: చథా పచ్చ మూవీ -  ఫిబ్రవరి 19  ప్రైమ్ వీడియో: 'తూ మేరీ మై తేరా మై తేరా తూ మేరీ' మూవీ - ఫిబ్రవరి 19 జీ5: భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ - ఫిబ్రవరి 20  రాక్షస వెబ్ సిరీస్ - ఫిబ్రవరి 20  జియో హాట్ స్టార్: లక్కీ ది సూపర్ స్టార్ మూవీ - ఫిబ్రవరి 20  Also Read: ప్రభాస్ గురించి వినిపిస్తున్న ఆ షాకింగ్ న్యూస్ నిజమేనా?    
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభానికి గుర్తుగా బుధవారం దేశంలో రంజాన్ చంద్రుడు కనిపించాడు. అంతకుముందు సౌదీ అరేబియాలో ఫిబ్రవరి 17న చంద్రుడు కనిపించాడు.  ఫిబ్రవరి 18న అక్కడ రంజాన్ ఉపవాసం ప్రారంభానికి గుర్తుగా చంద్రుడు కనిపించాడు. భారతదేశంలో ఉపవాసం సాధారణంగా మరుసటి రోజు ప్రారంభమవుతుంది. రంజాన్ ఇస్లామిక్ క్యాలెండర్‌లో తొమ్మిదవ నెల.  దీనిని అత్యంత పవిత్రమైన మాసంగా  పరిగణిస్తారు. ఈ నెల చాలా ప్రత్యేకమైనది.  ఈ సమయంలోనే పవిత్ర ఖురాన్ అవతరణ ప్రారంభమైందని చెబుతారు. రంజాన్ ఉపవాసం,  దాహం గురించి మాత్రమే కాదు, రంజాన్ మాసంలో చెయవలసిన పనులు,  చేయకూడని పనులు కూడా ఉంటాయి.  అవేంటో తెలుసుకుంటే.. రంజాన్ ప్రాముఖ్యత.. రంజాన్ మాసం దయ, ఆశీర్వాదం,  క్షమాపణల మాసంగా పరిగణించబడుతుంది. ఈ కాలంలో ముస్లింలు ఉపవాసం ఉండి, తమ పాపాలకు క్షమాపణ కోసం అల్లాహ్‌ను ప్రార్థిస్తారు. ఉపవాసం సహనం, క్రమశిక్షణ,  స్వీయ నియంత్రణను నేర్పుతుంది. రోజంతా ఆకలితో,  దాహంతో ఉండటం వల్ల పేదవారి కష్టాలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. మనుషులలో స్పందించే గుణం పెరుగుతుంది. రంజాన్ నెలలో జకాత్,  సదఖా (దానధర్మాలు) ఇవ్వడం  చాలా ముఖ్యమైనదిగా చెబుతారు. పేదలకు  ఆదాయంలో కొంత భాగాన్ని ఇవ్వడం సమాజంలో సమానత్వాన్ని,  సోదరభావాన్ని పెంపొందిస్తుంది.  రంజాన్ చివరి పది రాత్రులు ప్రత్యేకంగా పరిగణించబడతాయి. షబ్-ఎ-ఖదర్ రాత్రి వెయ్యి నెలల కంటే మెరుగైనదిగా పరిగణించబడుతుంది. రంజాన్ మాసంలో ఏం చెయ్యాలి.. ఐదుసార్లు ప్రార్థన చేయడం చాలా ముఖ్యం అని చెబుతారు.  అది కూడా  సరైన సమయానికి చేయాలి. ప్రతిరోజూ ఖురాన్‌లో కొంత భాగం చదవడం లేదా వినడం చేయాలి. ఈ నెల ఖురాన్‌తో అనుసంధానం కావడానికి ఉత్తమ సమయం. ఖర్జూరం,  నీటితో ఉపవాసం విరమించడం సున్నత్‌గా పరిగణించబడుతుంది. జకాత్,  సదఖా ఇవ్వడం ద్వారా పేదవారికి సహాయం చేయాలి.  ప్రవర్తనను నియంత్రించుకోవాలి. కోపం, వాదనలు,  కఠినమైన మాటలు నివారించాలి. ఇఫ్తార్ సమయంలో  ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి,  సమతుల్య భోజనం తినాలి. రంజాన్ లో చేయకూడనివి.. అబద్ధాలు చెప్పడం, గాసిప్ చెప్పడం,  ఇతరులను   బాధపెట్టడం మానుకోవాలి. చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకోకూడదు. ఇఫ్తార్ సమయంలో ఆహారం వృధా చేయకూడదు.  లేదా వృధా ఖర్చులు చేయకూడదు. ప్రార్థనలో అజాగ్రత్తగా ఉండకూడదు. పనికిరాని కార్యకలాపాలలో లేదా చెడు అలవాట్లలో సమయాన్ని వృధా చేయకూడదు.                                                     *రూపశ్రీ
ప్రతి వ్యక్తి జీవితం గురించి చాలా ఆలోచిస్తారు.  తమ జీవితం ఎలా ఉండాలో,  ఎలా ఉంటే బాగుంటుందో అని చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.  సరిగ్గా గమనిస్తే.. కొందరు నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది అని అంటూ ఉంటారు.  కొందరు మాత్రం ఇలాంటి మాటలు విన్నప్పుడు అదేదో కామెడీ అన్నట్టు రియాక్ట్ అవుతూ ఉంటారు.  మనిషి వ్యక్తిత్వంలో సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా కీలకపాత్ర పోషిస్తుంది.  అయితే మనిషిలో ఉండే లక్షణాలను బట్టి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎంత ఉందనేది చెప్పవచ్చట. సెల్ప్ రెస్పెక్ట్ లేకపోతే.. ఎప్పుడూ తమను తాము తక్కువ చేసుకుంటూ ఉంటారు చాలామంది.  ఇంతకీ మనుషుల్లో ఏ లక్షణాలు ఉంటే అవి వ్యక్తిత్వం మీద ప్రభావితం చూపిస్తాయి? సెల్ప్ రెస్పెక్ట్ తక్కువ ఉందని ఏ లక్షణాలు సూచిస్తాయి?  మనస్తత్వవేత్తలు ఏం చెబుతున్నారు? తెలుసుకుంటే.. తప్పు చేయకపోయినా క్షమాపణ చెప్పడం.. తప్పు లేకుండా క్షమాపణ చెప్పడం లేదా  అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు అపరాధ భావన కలిగి ఉండటం.. తక్కువ సెల్ప్ రెస్పెక్ట్ కలిగి ఉన్నారని  సూచిస్తుందని మనస్తత్వవేత్తలు అంటున్నారు.  నిజంగా ఎవరికైనా హాని చేశారా అని  ఎవరికి వారు ప్రశ్నించుకోవాలని మనస్తత్వవేత్తలు సలహా ఇస్తున్నారు. ఎవరికి  ఎలాంటి హాని చేయకపోతే ధైర్యంగా, నమ్మకంతో నిలబడాలని చెబుతున్నారు. తక్కువ చేసి మాట్లాడే వారి ముందు.. ఎవరైనా తక్కువ చేసి మాట్లాడుతుంటే.. కుటుంబ సభ్యులు లేదా లైఫ్ పార్ట్నర్.. స్నేహితులు, ఇతరులు తక్కువ చేసి మాట్లాడినప్పుడు వారికి ఎలాంటి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోతే.. వారి మాటలను అంగీకరించినట్టే.. ఇలా చేస్తే తమను తాము తక్కువ చేసుకున్నట్టే. ఇలాంటి వారికి సెల్ప్ రెస్పెక్ట్ తక్కువగా ఉంటుందని అంటున్నారు. ఫెయిల్యూర్.. తమను తాము ఫెయిల్యూర్ పర్సన్ గానూ,  తెలివి తక్కువ వారి గానూ భావించే వారికి సెల్ప్ రెస్పెక్ట్ కూడా తక్కువగానే ఉంటుంది. ఇలాంటి వారు తమకు తాము హాని చేసుకుంటారని అంటున్నారు. ప్రశంసలు, భరోసా.. ఎప్పుడూ తమను ఎవరో ఒకరు పొగుడుతూ, మెచ్చుకుంటూ,  భరోసా ఇస్తూ తమ వెంట ఉండాలని కోరుకునేవారు ఉంటారు. ఇలాంటి వారికి సెల్ప్ రెస్పెక్ట్ తక్కువగా ఉంటుందట.  మెచ్చుకోలు,  భరోసా లోపించినప్పుడు తాము వేస్ట్ అనుకునే మెంటాలిటీ వీరిలో ఏర్పడుతుందట. ఇది ఎమోషనల్ గా తమను తాము దెబ్బతీసుకోవడానికి దోహదం చేస్తుందట. ఇతరుల కోసం.. ఇతరుల కోసం బాధపడటం,  అన్నం తినడం మానేయడం,  ఇతరుల కోసం తమను తాము హింసించుకోవడం, ఇతరుల ముందు తమను తాము తక్కువ చేసుకోవడమేనని అంటున్నారు. ప్రతి ఒక్కదానికి ఒక హద్దు అనేది ఉంటుంది. ఈ హద్దులను నిర్ణయించుకోలేని వారు సెల్ఫ్ రెస్పెక్ట్ తక్కువ కలిగి ఉంటారు. బంధాలు.. తెలిసో, తెలియకో.. బంధాలు ఏర్పడిపోతాయి. అయితే ఒక చెడు బంధంలో ఉన్నప్పుడు.. అవతలి వ్యక్తి మారతారనే ఆశతో బాధ కలిగించే విషయాలను మభ్యపుచ్చుకోవడం, భరించడం అనేది సెల్ప్ రెస్పెక్ట్  తక్కువగా ఉందని సూచిస్తుంది. అవతలి వ్యక్తి తప్పు ఉంటే తప్పు ఉందని చెప్పకపోగా,  తమదే తప్పు అని అంగీకరించే వారు సెల్ప్ రెస్పెక్ట్ చాలా తక్కువ కలిగి ఉంటారు. పోలిక.. ఇతరులతో పోల్చుకునే వారు కూడా తక్కువ సెల్ప్ రెస్పెక్ట్ కలిగి ఉంటారు. ఇతరుల జీవితాలతో తమను తాము పోల్చుకోవడం అనేది ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. సెల్ప్ కేర్.. సెల్ప్ కేర్ ఎంత ఎక్కువ ఉంటే వారు అంత  సెల్ప్ రెస్పెక్ట్ కూడా కలిగి ఉంటారు.  చాలామందిలో సెల్ప్ కేర్ అనేది ఉండదు.  తమ చుట్టూ ఉన్నవారి గురించి ఆలోచించి,  వారి కోసం అన్నీ చేసి, కష్టపడి.. వారు మెచ్చుకుంటే ఆ మాటలతోనే తృప్తి పడుతుంటారు. అయితే ఇది చాలా తప్పు.  తమ గురించి తాము కేర్ తీసుకోని వ్యక్తులు తమను తాము ఇతరుల ముందు రెస్పెక్ట్ గా నిలబెట్టుకోలేరు.                               *రూపశ్రీ.
నేటి ప్రపంచంలో మనం ఒక బటన్ నొక్కితే ప్రపంచంలోని ఏ మూలకైనా ఇమెయిల్‌లు, మెసేజ్ లు  పంపవచ్చు, కానీ ఆకాశం గుండా ఉత్తరాలు పంపడం అనే ఆలోచన కూడా ఒక మాయా కలలా అనిపించే కాలం ఉండేది. భారతదేశంలోని పవిత్ర భూమి అయిన ప్రయాగ్‌రాజ్ ఈ కలను నిజం చేసింది.  114 సంవత్సరాల క్రితం కుంభమేళా సమయంలో, ప్రపంచంలో మొట్టమొదటి అధికారిక ఎయిర్ మెయిల్ సేవ ప్రారంభించబడింది. ఈ సేవ ఎలా ప్రారంభమైందో,  దాని వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసుకుంటే..  ఫిబ్రవరి 18, 1911..  ఫిబ్రవరి 18, 1911 సాయంత్రం మొదలైన ప్రస్థానం ఇద. ప్రయాగ్‌రాజ్‌లోని యమునా నది ఒడ్డున ఉత్తర ప్రదేశ్ ఎగ్జిబిషన్ జరుగుతోంది. సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో, దాదాపు లక్షమందితో కూడిన భారీ జనసమూహం అక్కడ గుమిగూడింది. ఆ రోజుల్లో, విమానాలు ఒక అద్భుతం.  ప్రతి ఒక్కరూ  చారిత్రాత్మక క్షణాన్ని చూడాలని అక్కడ గుమిగూడారు. ఫ్రెంచ్ పైలట్ మాన్సియర్ హెన్రీ పెక్వెట్ తన విమానంలో 6,500 ఉత్తరాలతో నిండిన మెయిల్ బ్యాగ్‌ను ఎక్కించుకుని ప్రయాగ్‌రాజ్ నుండి నైనికి ప్రయాణించాడు. ఇది కేవలం ఒక విమానం కాదు, ప్రపంచ కమ్యూనికేషన్ విప్లవానికి నాంది. 13నిమిషాల యాత్ర.. ప్రయాగ్‌రాజ్ నుండి నైని వరకు ఉన్న దాదాపు 15 కిలోమీటర్ల దూరాన్ని పైలట్ పాకెట్ కేవలం 13 నిమిషాల్లోనే అధిగమించాడు. విమానం నైని జంక్షన్ సమీపంలో విజయవంతంగా ల్యాండ్ అయింది. మెయిల్ బ్యాగ్‌పై "ఫస్ట్ ఎయిర్ మెయిల్",  "ఉత్తర ప్రదేశ్ ఎగ్జిబిషన్, అలహాబాద్" అని ముద్ర కూడా వేశారు. ఈ చిన్న విమానం ప్రపంచ పోస్టల్ చరిత్రలో భారతదేశం పేరును సువర్ణాక్షరాలతో లిఖించింది. విద్యకు మార్గం.. విరాళం.. ఈ ప్రత్యేక ఎయిర్ మెయిల్ సేవలో పాల్గొనడానికి రుసుము ఆరు అణాలు.  బరువు పరిమితుల కారణంగా ఈ మొదటి బ్యాగ్‌లో 6,500 ఉత్తరాలు మాత్రమే చేర్చబడ్డాయి. ఈ చారిత్రాత్మక సేవ నుండి వచ్చిన మొత్తం ఆదాయాన్ని ఆక్స్‌ఫర్డ్-కేంబ్రిడ్జ్ హాస్టల్‌కు విరాళంగా ఇచ్చారు. భారతదేశ మైలు రాయి.. ప్రయాగ్‌రాజ్‌లో సాధించిన ఈ విజయం ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా పోస్టల్  విమానయాన చరిత్రలో ఒక మైలురాయిగా పరిగణించబడుతుంది. ఈ విమానం భారతదేశపు మొట్టమొదటి ఎయిర్ మెయిల్ డెలివరీ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా మెయిల్ డెలివరీ చేయడానికి కొత్త,  వేగవంతమైన మార్గానికి కూడా మార్గం సుగమం చేసింది.                                             *రూపశ్రీ.
నేటికాలంలో కిడ్నీలో రాళ్లు ఏర్పడటం చాలా సాధారణం అయిపోయింది.   ఏ వయసు వారికైనా ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం వల్ల పిల్లలు,  యువకులలో కిడ్నీలో రాళ్ల సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ ప్రకారం దాదాపు 10 మందిలో ఒకరు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో కిడ్నీలో రాళ్ల సమస్యను ఎదుర్కుంటూ ఉన్నారట. ఈ సమస్యలు సాధారణంగా తేలికపాటి చికిత్స లేదా శస్త్రచికిత్స ద్వారా సులభంగా  పరిష్కారం అవుతాయి.  కానీ కొంతమందిలో రాళ్ల సమస్యలు తీవ్రమైన మూత్రపిండాల సమస్యలకు దారితీయవచ్చు. అసలు కిడ్నీలో రాళ్ల సమస్య ఎలా ఏర్పడుతుంది? బీర్ తాగితే కిడ్నీలో రాళ్ల సమస్య తగ్గుతుందనే మాట నిజమా? దీని గురించి వైద్యులు ఏం చెబుతున్నారు? తెలుసుకుంటే.. మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడటానికి కారణాలు.. మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడటానికి అతిపెద్ద కారణం తగినంత నీరు తీసుకోకపోవడం. తగినంత నీరు త్రాగనప్పుడు మూత్రం ఘాడతగా మారుతుంది.  దానిలోని ఖనిజాలు స్ఫటికాలను ఏర్పరుస్తాయి. ఇవే   కిడ్నీలో రాళ్లుగా రూపాంతరం చెందుతాయి.    ఉప్పు అధికంగా తీసుకోవడం, ప్రోటీన్ అధికంగా తీసుకోవడం, ఆక్సలేట్ అధికంగా ఉండే ఆహారాలైన పాలకూర, చాక్లెట్  వంటివి తినడం,  అధికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా కిడ్నీలో రాళ్ల  ప్రమాదం పెరుగుతుంది. ఊబకాయం, మధుమేహం,  జీవక్రియ సమస్యలు కూడా రాళ్ళు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతాయి. మూత్రపిండాలలో రాళ్లు ఎలా నయమవుతాయి? వైద్యులు చెబుతున్న దాని ప్రకారం..  కిడ్నీలో రాళ్ళు సాధారణంగా  ఎక్కువ నీరు త్రాగడం ద్వారా వాటంతట అవే బయటకు వస్తాయి.  నొప్పిని తగ్గించడానికి,  రాళ్ల పరిమాణాన్ని తగ్గించడానికి వైద్యులు  మందులను సూచించవచ్చు. అయితే రాళ్ల పరిమాణం పెద్దగా ఉన్నప్పుడు  శస్త్రచికిత్స అవసరం ఏర్పడవచ్చు. కిడ్నీలో రాళ్లను ముందుగానే తొలగించడం చాలా ముఖ్యం ఎందుకంటే అవి కాలక్రమేణా కిడ్నీ లోపలి పొరను దెబ్బతీస్తాయి. బీరు తాగితే కిడ్నీలో రాళ్లు తగ్గుతాయా? బీరు తాగడం వల్ల మూత్ర ఉత్పత్తి పెరుగుతుందని, తరచుగా మూత్ర విసర్జన జరుగుతుందని,  రాళ్లు బయటకు వెళ్లడానికి సహాయపడుతుందని  చాలామంది నమ్ముతారు. కానీ వైద్యులు  ఈ నమ్మకాన్ని తోసిపుచ్చుతున్నారు. బీరు తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు బయటకు వెళ్లడానికి సహాయపడతాయనే నమ్మకం ప్రజలలో ఉన్నా.. బీరు తాగితే చాలు కిడ్నీలో రాళ్లు తొలగిపోతాయి అనుకోవడం చాలా తప్పని, అది వైద్యులు రికమెండ్ చేయరని చెబుతున్నారు. బీరు తాత్కాలికంగా మూత్ర ఉత్పత్తిని పెంచుతుంది, కానీ అది శరీరం డీహైడ్రేట్ అవ్వడానికి కారణం అవుతుంది.  ఇది రాళ్లు ఏర్పడటానికి ప్రధాన కారణం అవుతుంది. బీరులో ప్యూరిన్లు కూడా ఉంటాయి, ఇవి యూరిక్ ఆమ్లాన్ని పెంచుతాయి, మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతాయి, అప్పటికే కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు బీర్ తాగితే.. ఈ రాళ్ల ప్రమాదం మరింత పెరుగుతుంది. కాబట్టి కిడ్నీలో రాళ్ల సమస్యకు ఔషదంగా బీర్ ను తీసుకోవడం అస్సలు మంచిది కాదు.                            *రూపశ్రీ.  
తలనొప్పి చాలా కామన్ గా అందరికీ వచ్చే సమస్య.  ఆఫీసు ఒత్తిళ్లు, దినచర్య క్రమంగా ఉండకపోవడం,   భోజనం ఆలస్యం కావడం,  సరిపడని ఆహారం తినడం వంటివి  తలనొప్పి కలిగిస్తూ ఉంటాయి. కానీ ప్రతి తలనొప్పి ఒత్తిడి వల్ల లేదా పైన చెప్పుకున్న సమస్యల వల్ల  వస్తుందని అనుకుంటే పొరపాటే.. కొన్నిసార్లు  తలనొప్పికి పొట్ట ఆరోగ్యం కూడా కారణం అవుతుందని అంటున్నారు వైద్యులు.  దీనిని సాధారణంగా గ్యాస్ తలనొప్పి లేదా గ్యాస్ట్రిక్ తలనొప్పి అని పిలుస్తారు. అసలు గ్యాస్ తలనొప్పి ఎలా వస్తుంది? ఈ తలనొప్పి వల్ల జరిగేదేంటి? తెలుసుకుంటే.. గ్యాస్ తలనొప్పి.. గ్యాస్ట్రిక్ తలనొప్పి అనేది సాధారణ టెన్షన్ లేదా సైనస్ తలనొప్పి కాదు. జీర్ణవ్యవస్థలో అజీర్ణం, ఆమ్లత్వం లేదా గ్యాస్ వంటి సమస్యలు ఉన్నప్పుడు ఇది వస్తుంది. కడుపు, మెదడు దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి. కడుపులో అసమతుల్యత ఉన్నప్పుడు, శరీరం ప్రతిస్పందిస్తుంది.  చాలా మందిలో కడుపులో ఉండే సమస్య తలకు వ్యాపిస్తుంది. కారంగా ఉండే ఆహారాలు, సక్రమంగా భోజనం చేయకపోవడం, అధికంగా  టీ,  కాఫీ తీసుకోవడం,  నిరంతర ఒత్తిడి ఇవన్నీ వంటివన్నీ సమస్యను మరింత తీవ్రం చేస్తాయి. గ్యాస్ట్రిక్ తలనొప్పి.. గ్యాస్ట్రిక్ తలనొప్పి  లైట్ గా ఉండవచ్చు లేదంటే ఎప్పుడూ తలనొప్పిగా కూడా ఉండవచ్చు.  అయితే గ్యాస్ట్రిక్ మైగ్రేన్ మరింత తీవ్రంగా  ఉంటుంది. ఇది కాంతికి,  శబ్దాలకు చాలా రియాక్ట్ అవుతుంది. వికారం లేదా వాంతులు కూడా ఉండొచ్చు. రెండింటిలోనూ  అంతర్లీనంగా  జీర్ణ సమస్యలే కారణం. ఈ సమస్య అప్పుడప్పుడు వస్తే అది ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, కానీ తరచుగా  వస్తుంటే మత్రం లైట్ గా తీసుకోకూడదు.  గ్యాస్ తలనొప్పి పదే పదే వస్తుంటే దీర్ఘకాలిక గ్యాస్ట్రిటిస్, పెప్టిక్ అల్సర్లు, పిత్తాశయ వ్యాధి, ప్రకోప ప్రేగు సిండ్రోమ్ లేదా గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్  వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉండొచ్చు.   డాక్టర్ ను ఎప్పుడు కలవాలి.. వారానికి రెండుసార్లు కంటే ఎక్కువసార్లు తలనొప్పి వస్తే, ఎటువంటి కారణం లేకుండా బరువు తగ్గుతుంటే, వాంతులు అవుతున్నా లేదా తీవ్రమైన కడుపు నొప్పిని ఉంటున్నా, లేదా ఇంటి చిట్కాలు ఫాలో అయినా  ఉపశమనం కలగకపోతే, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను సంప్రదించాలి. అవసరమైతే, ఎండోస్కోపీ వంటి పరీక్షలు జీర్ణవ్యవస్థ పరిస్థితిని స్పష్టం చేస్తాయి. చికిత్స అంటే నొప్పి నివారణ మందులు మాత్రమే కాదు, జీర్ణక్రియను మెరుగుపరచడం. సమయానికి తినడం, తేలికైన,  సమతుల్య ఆహారం తీసుకోవడం, తగినంత నీరు త్రాగడం,  నిరాశకు దూరంగా ఉండటం వంటివి ఈ సమస్యకు మంచి ఉపశమనం లభిస్తుంది.                                       *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...