చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ: ఏం చర్చించారంటే.?
Published on: Tue Oct 13, 2026 6:18PM
.webp)
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా మంగళవారం (అక్టోబర్ 13) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో భేటీ అయ్యారు. అంతకు ముందు ఆయన బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక చంద్రబాబుతో భేటీలో తెలుగు గంగ ద్వారా చెన్నైకు నీటి విడుదలపై చర్చించారు. చెన్నైలో తాగునీటి అవసరాలు, జలాశయాల్లో నిల్వలు, తెలుగు గంగ ద్వారా అందుతున్న నీటి పరిమాణం వంటి అంశాలపై వీరి మధ్య చర్చ జరిగింది.

రాష్ట్రంలోని సాగునీటి, తాగునీటి అవసరాలు, జలాశయాల్లో నీటి నిల్వలు, భవిష్యత్తు అవసరాలను అంచనా వేసిన తర్వాతే అదనపు నీటి విడుదలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏపీ నుంచి ఈ ఏడాది చెన్నైకి 4.08 టీఎంసీల నీరు అందిందని చెప్పిన విజయ్.. నీటి విడుదల పెంచాలని చంద్రబాబును కోరారు. నీటి లభ్యతను బట్టి నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్బంగా చంద్రబాబు అన్నారు. అలాగే ఈ భేటీలో నదుల అనుసంధానంపై కూడా ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య చర్చ జరిగింది. కాగా చంద్రబాబుతో భేటీ అనంతరం తమిళనాడు సీఎం విజయ్ విజయవాడ ఉత్సవ్ లో పాల్గొన్నారు.
[Chandrababu Naidu Vijay Meeting, Telugu Ganga Water Release, Tamil Nadu CM Vijay, Chennai Drinking Water, Godavari Cauvery River Linking, Andhra Pradesh Tamil Nadu Water Sharing, Telugu One]


