TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట: తదుపరి విచారణపై స్టే విధించిన సుప్రీం కోర్టు.!

Published on: Tue Oct 13, 2026 7:29PM

భారతీయ రాజకీయాల్లో అత్యంత చర్చనీయాంశంగా మారిన పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీకి సర్వోన్నత న్యాయస్థానంలో భారీ  ఊరట లభించింది. దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఈ పరిణామం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై గతంలో చేసిన  చోర్‌ కీ సర్దార్‌ వ్యాఖ్యలకు సంబంధించి రాహుల్‌ గాంధీపై పరువునష్టం కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై కోర్టులో విచారణ కొనసాగుతోంది.

అయితే.. తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

సుప్రీం కోర్టులో  రాహుల్‌ గాంధీ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ పిటిషన్‌ను అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా పరిగణించిన సర్వోన్నత న్యాయస్థానం, దీనిపై   విచారణ జరిపింది. ఈ క్రమంలోనే రాహుల్‌ గాంధీకి ఊరటనిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. పరువునష్టం కేసుకు సంబంధించి దిగువ కోర్టులో జరుగుతున్న తదుపరి విచారణపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 

ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ స్టే ఉత్తర్వులు కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులకు రాహుల్‌ గాంధీకి  ఊరటనిచ్చాయి. గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ అంశాలు, న్యాయపోరాటాలతో బిజీగా ఉన్న రాహుల్‌ గాంధీకి ఈ పరిణామం పెద్ద ఉపశమనం కలిగించిందని పరిశీలకులు అంటున్నారు.

[Big Relief Rahul Gandhi, Supreme Court, Defamation Case, Bombay High Court, Narendra Modi, Congress Party, Telugu One]