LATEST NEWS
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై రాజమహేంద్రవరంలో తాజాగా  కేసు నమోదయింది. ఆయనతో పాటు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పలువురు వైసీపీ నేతలపై కూడా రాజమండ్రి పోలీసులు కేసులు నమోదు చేశారు. కారణమేంటంటే.. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో   18 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబు బెయిలుపై జైలు నుంచి విడుదలైన సందర్భంగా ఈ నెల 19న నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ రాజమహేంద్ర వరం నుంచి గుంటూరు వరకూ సాగింది. అయితే రాజమహేంద్రవరంలో భారీగా కార్లతో ర్యాలీ నిర్వహించరాదంటూ పోలీసులు సెక్షన్ 30 కింద నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైలు బ్రిడ్జిపై నుంచి అధిక  సంఖ్యలో కవాహనాలతో వెళ్ల కూడదని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ అంబడి రాంబాబు, జక్కంపూడి రాజా ఆ నోటీసులను ధిక్కరించి భారీ ర్యాలీ నిర్వహించడమే కాకుండా  రైల్ కం రోడ్డ బ్రిడ్జిపై పెద్ద సంఖ్యలో వాహనాలతో వెళ్లడంతో రాజమహేంద్రవరం పోలీసులు కేసు నమోదు చేశారు.
  తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో మాజీ సీఎం, అన్నాడీఎంకే బహిష్కృ నేత ఓ. పన్నీర్ సెల్వం భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా పన్నీర్ సెల్వం మీడియాతో మాట్లాడుతూ.. డీఎంకే ఐదేళ్ల పాలనను ప్రశంసించారు. త్వరలో రానున్న ఎన్నికల్లో డీఎంకే ప్రభుత్వం మళ్లీ ఏర్పడుతుందని, .గత ఐదేళ్లుగా సీఎం స్టాలిన్ విజయవంతమైన, సుపరిపాలన అందించారని కితాబిచ్చారు.  అందుకే తాను ఈరోజు సీఎం స్టాలిన్‌ను కలిసి.. అభినందనలు తెలిపానన్నారు. శుక్రవారం చెన్నైలోని అసెంబ్లీ ప్రాంగణంలో వారి భేటీ జరిగింది . ఈ సమావేశ సందర్భంగా పన్నీర్‌సెల్వం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు పుష్పగుచ్ఛం అందజేసి తన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశం స్నేహపూర్వకంగా జరిగిందని, అలానే ఇద్దరు సీనియర్ రాజకీయ నాయకుల మధ్య పరస్పర గౌరవాన్ని ప్రతిబింబిస్తుందని రాజకీయ వర్గాలు సూచిస్తున్నాయి. త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.  ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడక ముందే అన్ని పార్టీలు తమ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే, కాంగ్రెస్, బీజేపీలు అధికారమే లక్ష్యంగా కీలక భేటీలు నిర్వహిస్తున్నాయి. ఆ క్రమంలో ఈ సారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా ఉండనున్నాయి. ఈ ప్రధాన పార్టీలతో పాటు సినీ నటుడు విజయ్ కూడా టీవీకే పార్టీని స్థాపించి.. ఎన్నికల బరిలోకి దిగనున్న సంగతి తెలిసిందే. దీంతో దేశమంతా తమిళనాడు రాజకీయాల వైపు ఆసక్తిగా చూస్తోంది.    
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు వైసీపీ అధినేత జగన్ తో భేటీ అయ్యారు. రాజమహేంద్రవరం జైలు నుంచి బెయిలుపై విడుదల అయిన తరువాత అంబటి జగన్ తో భేటీ అవ్వడం ఇదే మొదటి సారి. తాడేపల్లిలోని జగన్ నివాసానికి అంబటి శుక్రవారం (ఫిబ్రవరి 20) వెళ్లి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అంబటి తనపై ప్రభుత్వం పెట్టిన  కేసులను వివరించారు. అలాగే గుంటూరులోని తన నివాసంపై తెలుగుదేశం శ్రేణుల దాడి, తనపై హత్యయాత్నం చేయడం తదితర విషయాలను జగన్ కు తెలియజేశారు.  ఈ సందర్భంగా జగన్ అంబటికి కేసులకు భయపడవద్దని ధైర్యం చేప్పారు. కేసులను చట్టపరంగా ఎదుర్కొందామని భరోసా ఇచ్చారు. అంబటితో పాటు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపీ నందిగం సురేశ్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు కూడా జగన్ ను కలిశారు.     
ALSO ON TELUGUONE N E W S
  -ముస్తాబవుతున్న సరస్వతి  -ట్రైలర్ తో అంచనాలు రెట్టింపు  -సెల్యులాయిడ్ పై భారీ తారాగణం   -వరలక్ష్మి శరత్ కుమార్ ఏమంటుంది సౌత్ సినీ పరిశ్రమకి దొరికిన అరుదైన మంచి నటీమణుల్లో 'వరలక్ష్మి శరత్ కుమార్'(varalaxmi sarathkumar )కూడా ఒకరు.క్యారక్టర్ ఏదైనా సరే తన చరిష్మాని చాలా బలంగా చాటగలదు. ఎంత బలంగా అంటే టోటల్ సినిమాకే ప్లస్ పాయింట్ అయ్యేంతలా. అందుకే వరలక్ష్మి శరత్ కుమార్ తమ సినిమాలో ఉండాలని కోరుకొని మేకర్స్ ఉండరంటే అతిశయోక్తి కాదు.అంతటి క్రేజ్ ఉన్న   వరలక్మి శరత్ కుమార్ తాజాగా తన అప్ కమింగ్ సినిమా ఫంక్షన్ స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకోవడం ఇప్పుడు వైరల్ గా మారింది. వరలక్ష్మి శరత్ కుమార్ అప్ కమింగ్ మూవీ 'సరస్వతి'(Saraswathi).దర్శకత్వ బాధ్యతలని కూడా తనే చేపట్టింది. ఈ రోజు ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరగగా వీరసింహ రెడ్డి డైరెక్టర్ గోపీచంద్ మలినేని ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా వరలక్షి కన్నీళ్లు పెట్టుకుంటు  సరస్వతి గుడ్ సినిమా. బాగా ప్రమోట్ చెయ్యడానికి ట్రై చేస్తున్నాం.ఒక అమ్మాయిగా ఈ ఇండస్ట్రీలో ఉండటం చాలా కష్టం. ఇండస్ట్రీ లో ఆడవాళ్లు ముందుకెళ్లడానికి అందరు సపోర్ట్ చెయ్యండని చెప్పుకొచ్చింది. also read: ఇద్దరిలో హీరో ఎవరు! మీకైనా తెలుసా ట్రైలర్ అయితే ఒక రేంజ్ లో ఉండటంతో పాటు డాటర్ సెంటిమెంట్ తో తెరకెక్కినట్టుగా అర్ధమవుతుంది.ప్రకాష్ రాజ్,రాధికా శరత్ కుమార్, ప్రియమణి, నాజర్ కీలకమైన క్యారెక్టర్స్ లో కనిపిస్తున్నారు. ఈటీవీ విన్, దోశ డైరీ సంయుక్తంగా నిర్మించగా రిలీజ్ డేట్ ని త్వరలోనే రానుంది. థమన్(Thaman)మ్యూజిక్ ని అందించడం విశేషం.     
బాహుబలి సిరీస్, ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప సిరీస్ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేశాయి. ముఖ్యంగా తెలుగు సినిమాలంటే జపాన్‌లో మంచి క్రేజ్ ఉంది. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్‌చరణ్ వంటి హీరోలకు అక్కడ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే టాలీవుడ్ హీరోలు జపాన్ వెళ్లినపుడు వారికి ఘన స్వాగతం లభిస్తూ ఉంటుంది. అక్కడ మన హీరోలకు హార్డ్‌కోర్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అలాంటి ఓ జపాన్ అభిమాని హైదరాబాద్ వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు.    సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌కి ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఆ షాపింగ్ మాల్ కోసం ఎన్టీఆర్ చేసిన యాడ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ యాడ్స్ సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయ్యాయి. ఆ యాడ్స్ చూసి ఇన్‌స్పైర్ అయిన జపాన్ అభిమాని భర్తతో కలిసి షాపింగ్ చేసేందుకు హైదరాబాద్‌కి వచ్చారు. ఎన్టీఆర్ యాడ్స్ చూసే ఇక్కడికి వచ్చానని.. తనకు, తన భర్తకు డ్రెస్సులు తీసుకున్నామంటూ చూపించారు. ఇది తన జీవితంలో గొప్ప షాపింగ్ ఎక్స్‌పీరియన్స్ అని ఆమె చెప్పారు. అంతేకాదు, ఆ అభిమాని వాడుతున్న బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్‌లపై కూడా ఎన్టీఆర్ ఫోటోలు ఉండడం విశేషం.
Universal Star Kamal Haasan and Superstar Rajinikanth have grown together in the late 1970's and early 1980's as upcoming stars of Tamil and Indian Cinema. They stopped acting together after becoming two gigantic stars and after 46 years, they are back to create history together on screen. The announcement glimpse for their upcoming film, directed by Nelson, is a masterclass in style and nostalgia taking back to 80's vibe. The video showcases pure Nelson style quirky, stylish, and self-aware humor. It begins with the director himself caught in a hilarious dilemma: whom to approach first, the Superstar or the Ulaganayagan? But the moment the legends appear, the humor shifts into pure swag.  Both Kamal and Rajini are seen in retro avatars, twinning in a garage setting that further gives tribute to their 1980's swag. Seeing them walk side-by-side again is thrilling and their chemistry is effortless. They both know how to burn the screen effortlessly and the Rajni mannerism compensated by Kamal's swag is whistle-worthy.  The banter about their costumes and the final, meta question—"Who is the hero?"—is a stroke of genius. It perfectly captures the spirit of two legends who have ruled the industry for decades without ever losing their mutual respect. Anirudh’s background score with a mix of Bappi Lahiri's style Disco Heavy theme also adds to the total vibe.  The announcement video itself feels like a festival and whenever movie releases, it will create huge box office storm Pan-India. With Red Giant Movies backing this historic reunion, the scale is massive and the legends comic timing with banter would be a celebration to witness on big screens.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.  
  -కమల్, రజినీ ల  ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది -నెల్సన్, అనిరుద్ ఏమంటున్నారు -రికార్డుల వేట గ్యారంటీ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ కి రెస్ట్ అనేది లేకుండా చేయడానికి ముస్తాబవుతున్న కాంబో కమల్ హాసన్(kamal Haasan),రజనీకాంత్(Rajinikanth).అసలు ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తుందని అభిమాన మేధావుల ఊహలకి కూడా అందలేదు. దీంతో అనౌన్స్ మెంట్ వచ్చిన దగ్గర్నుంచి అప్ డేట్స్ కోసం అభిమానులతో పాటు ఇండియన్  సినిమా లవర్స్ మొత్తం సోషల్ మీడియా వద్ద తిష్ట వేసుకొని కూర్చుకున్నారు. ఈ క్రమంలో ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. అలా రిలీజ్ అయ్యిందో లేదో ఇద్దరి అభిమానులకి పూనకాలు తెప్పిస్తుంది. అంత పూనకాలు తెప్పించేలా గ్లింప్స్ లో ఏముందో చూద్దాం. సుమారు మూడు నిమిషాల ముపై ఆరు సెకన్ల నిడివితో గ్లింప్స్ ఉండగా రజనీ,కమల్ లు  డైరెక్టర్ నెల్సన్ తో 'ఒకరు వాడిన వస్తువులని ఒకరు వాడమని చెప్పి కోటు, షూస్, బెల్ట్, వాచీ, స్పెక్ట్స్ తీసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు తమ గదుల్లోని నుంచి బయటకి వచ్చి కోపంగా చూసుకొని స్టైలిస్ట్ గా  ఒక కారు మెకానిక్ షెడ్ లో నడుచుకుంటూ వచ్చారు.మరో పక్క  ఫారిన్ లేడీస్ కార్ వాష్ చేస్తుండటం స్పెషల్ అట్రాక్షన్ గా ఉంది. ఆ తర్వాత కారు ఎక్కి తమ వెనక ఉన్న నెల్సన్, మ్యూజిక్ ని అందిస్తున్న అనిరుద్ తో హీరో ఎవరని కమల్, రజినీ అడిగారు.   గ్లింప్స్ స్టార్టింగ్ లోనే నెల్సన్(Nelson),అనిరుద్(Anirudh)కనిపించి తమ మాటలతో మెస్మరైజ్ చేసారు.ఈ ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్ ని దక్కించుకునే అవకాశం రెడ్ జయింట్ మూవీస్ ని పొందగా, లెజండ్రీ డైరెక్టర్ అండ్ కెమెరామెన్ రాజీవ్ మీనన్(Rajeev Menon)ఛాయాగ్రహణ బాధ్యతలు అందిస్తుండటం విశేషం. హీరోయిన్స్ తో పాటు మిగతా నటీనటులు వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.     
   -రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి ఈ నెల 26 ఫిక్స్ అయ్యిందా! -పెళ్లి సందర్భంగా కన్నడ నటుడు ప్రమోద్ శెట్టి చేసిన వ్యాఖ్యలేంటి! -మరి రష్మిక ఆ ఇద్దరని పీలుస్తుందా! -పూర్తి డీటెయిల్స్ చూద్దాం.  అధికారకంగా ప్రకటించకపోయినా అధికారకంగా చెలామణిలో ఉన్న వార్త రష్మిక(Rashmika Mandanna),విజయ్ దేవరకొండ(vijay Deverakonda)మ్యారేజ్. ఫిబ్రవరి 26 న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ కోటలో చాలా గ్రాండ్ గా జరగనుందనేది టాక్. మరి ఇద్దరి అభిమానులు సైలెంట్ గా ఉంటారా? పెళ్ళికి సంబంధించిన స్పెషల్స్ చెప్పమని రష్మిక, విజయ్ ల ఇనిస్టాగ్రమ్ అకౌంట్స్ కి కౌంట్ చెయ్యడానికి వీలు లేని మెసేజెస్.ఎక్స్ వేదికగా కూడా సేమ్ సిట్యువేషన్. దీంతో సోషల్ మీడియాలో సందడి వాతావరణం నెలకొని ఉంది. మరో వైపు  రష్మిక మమల్ని పెళ్ళికి పిలుస్తుందని అనుకోవడం లేదని ప్రమోద్ శెట్టి(Pramod Shetty)చేసిన వ్యాఖ్యలకి కూడా సోషల్ మీడియా ఆతిధ్యం ఇవ్వాల్సిన పరిస్థితి. పూర్తి డీటెయిల్స్ చూద్దాం. ప్రమోద్ శెట్టి.. కన్నడ చిత్ర సీమలో మంచి క్రేజ్ ఉన్న యాక్టర్. 2010 లో కెరీర్ ప్రారంభించగా స్టిల్  ముపైకి పైగా చిత్రాలు వచ్చాయి. కాంతార లో గుడ్డి సుధాకర గా మెప్పించాడు. రీసెంట్ గా ప్రమోద్ శెట్టి దగ్గర కొంత మంది మీడియా ప్రతినిధులు రష్మిక వివాహం గురించి ప్రస్తావించారు. దీంతో ప్రమోద్ శెట్టి మాట్లాడుతు రష్మిక తన వివాహానికి నన్ను, రక్షిత్ శెట్టిని  ఆహ్వానిస్తుందని భావించడం లేదు.పిలవకపోవడంలో ఆశ్చర్యం కూడా లేదు. రక్షిత్ శెట్టి(Rakshit Shetty)తన సినిమాలతో బిజీగా ఉన్నాడు.రష్మిక తో  జరిగిన ఎంగేజ్ మెంట్     రద్దు పై రక్షిత్  ఏమాత్రం బాధపడటం లేదు. ఈ విషయం ఆయన శ్రేయోభిలాషులందరికీ తెలుసని ప్రమోద్ శెట్టి చెప్పుకొచ్చాడు.  also read:  అల్లు అర్జున్ కొత్త పార్టీ.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పిక్స్  2017 జులై 3 న రక్షిత్, రష్మిక ల నిశ్చితార్థం జరిగింది.ఇప్పటికి కారణం తెలియదు గాని   పరస్పర అంగీకారంతో ఎంగేజ్‌మెంట్ కాన్సిల్ చేసుకున్నారు. రష్మిక తొలి చిత్రం 'కిరిక్ పార్టీ' లో ఆ ఇద్దరు జంటగా చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రమోద్ శెట్టి ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత సోషల్ మీడియా సైలెంట్ గా ఉండటం జరగని పని కదా! పైగా వీకెండ్. దీంతో  రష్మిక తన వివాహానికి రక్షిత్ శెట్టి, ప్రమోద్ శెట్టి ని పిలుస్తుందా లేదా అని పోల్ లాంటిది ఏర్పాటు చేసుకొని ఎక్కువ వోట్స్ ని ఆసక్తిగా గమనిస్తున్నారు. 'కిరిక్ పార్టీ' లో ప్రమోద్ శెట్టి చేసిన విషయం తెలిసిందే.    
  - చిన్న సినిమాను బ్రతికించుకునేందుకు కొత్త స్ట్రాటజీ - టికెట్ రేట్లు తగ్గించడం వల్ల ఎవరికి లాభం? - తగ్గించిన టికెట్ రేట్లపై నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఏమంటున్నారు?   గత కొన్ని సంవత్సరాలుగా ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే ఎంతో ఆలోచిస్తున్నారు. హాయిగా ఇంట్లోనే కూర్చొని ఓటీటీలో సినిమాలు చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఇది నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎంత మంచి సినిమా తీసినా థియేటర్లకు ప్రేక్షకుల్ని రప్పించడం వారి వల్ల కావడం లేదు. అయినా అప్ప్పుడప్ప్పుడు కొన్ని చిన్న సినిమాలు మెరుపులు మెరిపిస్తున్నాయి. థియేటర్లను ప్రేక్షకులతో నింపేస్తున్నాయి. ఒక విధంగా మిగతా మేకర్స్‌కి ఈ చిన్న సినిమాలు ఇన్‌స్పిరేషన్ అనే చెప్పాలి.   అయితే ప్రతి వారం ఎన్నో చిన్న సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. కానీ, వాటిలో కొన్ని రిలీజ్ అయిన విషయం కూడా చాలా మందికి తెలీదు. ఇక ఒకటి, రెండు సినిమాలు కాస్తో, కూస్తో ప్రభావం చూపిస్తున్నాయి. ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడం కష్టతరంగా మారిన ప్రస్తుత తరుణంలో ఇటీవల విడుదలైన ‘నిలవే’ టీమ్ ఒక కొత్త స్ట్రాటజీని ఫాలో అవుతోంది.    హైదరాబాద్‌లోని ఒక సింగిల్ స్క్రీన్‌లో సాయంత్రం, నైట్ షోలకు కేవలం 11 రూపాయలుగా టికెట్ ధర నిర్ణయించింది. ఇది అందర్నీ షాక్‌కి గురి చేస్తోంది. మామూలుగా సోషల్ మీడియాలో ఉచితంగా టికెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసే ట్రెండ్ చాలా కాలంగా నడుస్తోంది. అయితే అవి బుక్ మై షోలో అందుబాటులో ఉండవు. ఇన్ ఫ్లూయెన్సర్లు పెట్టే కండీషన్లు ఫాలో అయిపోయి వాళ్లకు సంతృప్తి అనిపించే లక్కీ విన్నర్స్ కు మాత్రమే వాటిని అందజేస్తారు.    అయితే ఇప్ప్పుడు 11 రూపాయలకే టికెట్ అనే స్కీమ్‌లో అలాంటి ఇబ్బంది లేదు. బుక్ మై షోలో టికెట్ బుక్ చేసుకొని థియేటర్‌కి వెళ్లిపోవచ్చు. ఎన్ని టికెట్స్ కావాలన్నా ఇస్తారు. అయితే ఇక్కడ మరో సమస్య కూడా ఉంది. గత ఏడాది రాజు వెడ్స్ రాంబాయి చిత్రానికి 99 రూపాయలకు టికెట్ పెట్టారు. దాన్ని కొందరు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు వ్యతిరేకించారు. ఇప్ప్పుడు మరీ 11 రూపాయలకే సినిమా చూపిస్తున్నారు. దీనిపై వారు ఎలా స్పందిస్తారో చూడాలి.    టికెట్ ధరలు తగ్గించి సినిమా చూపించే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చిన్న సినిమాలను ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లేందుకు అంత తక్కువ ధర కాకపోయినా 50 నుంచి 100 రూపాయల రేటుకు టికెట్స్ అందిస్తే మంచి రిజల్ట్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీనిపై చిత్ర పరిశ్రమ దృష్టి సారిస్తే చిన్న సినిమాలు బ్రతికే ఛాన్స్ ఉంది. మ‌రో ప‌క్క స్టార్ హీరోల సినిమాల‌కు సాధార‌ణ రేట్ల కంటే ఎక్కువ రేటుకి టికెట్స్ అమ్ముతున్నారు. దానికి ప్ర‌భుత్వాలు కూడా ఆమోద ముద్ర వేస్తున్నాయి. అదే విధంగా చిన్న సినిమాల‌ను త‌క్కువ ధ‌ర‌లో చూపిస్తే ఆక్యుపెన్సీ పెరిగే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి.  
  -సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పిక్స్  -పార్టీకి ఎవరెవరు హాజరయ్యారు -టోటల్ బ్లాక్ కోడ్   ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)ప్రస్తుతం అట్లీ(Atlee)సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మరో వైపు లోకేష్ కనగరాజ్(LOkesh Kanagaraj)తో కమిట్ అయిన మూవీని కూడా ఈ ఏడాదే స్టార్ట్ చెయ్యబోతున్నాడు. అల్లు అర్జున్ కి ఉన్న సినీ ఫామ్ దృష్ట్యా పాన్ ఇండియా రేంజ్ లో ఆ రెండు చిత్రాలపై  అంచనాలు  ఏ విధంగా ఉంటాయో చెప్పక్కర్లేదు.అంత బిజీలో కూడా తన సోదరుడు శిరీష్,  పెళ్లి పనులు తనే దగ్గర్నుండి చూసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే రీసెంట్ గా ఒక పార్టీని ఇవ్వడం జరిగింది. సదరు పార్టీకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan),ఉపాసన(Upasana)హాజరయ్యారు. రామ్ చరణ్ అయ్యప్ప స్వామి మాలతో నల్లటి వస్త్రాలని ధరించగా అల్లుఅర్జున్,స్నేహ, అల్లు శిరీష్, నయనిక కూడా  బ్లాక్ కలర్ డ్రెస్ తో ఉన్నారు. ప్రస్తుతం ఈ పిక్  మెగా అండ్ అల్లు అభిమానులని విశేషంగా ఆకర్షిస్తూ ఉంది.  సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ ఇచ్చిన కొత్త పార్టీకి చరణ్ హాజరు కావడం సూపర్ అని కామెంట్స్ చేస్తున్నారు. Also read:  Bookie Movie Review : బూకి మూవీ రివ్యూ రామ్ చరణ్ దంపతులు ఇటీవల కవల పిల్లలకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఒక అబ్బాయి, అమ్మాయి. చరణ్ ప్రస్తుతం పెద్ది(Peddi)తో బిజీగా ఉండగా ఏప్రిల్ 30 న వరల్డ్ వైడ్ గా ల్యాండ్ కానుంది. శిరీష్(Allu Sirish)నయనిక పెళ్లి డేట్ మార్చి 6 .    
తాము చేసే సినిమాల ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకుంటారు హీరోలు, హీరోయిన్లు. ముఖ్యంగా కొందరు హీరోలు లవర్ బాయ్స్‌గా అమ్మాయిల మనసులు దోచుకుంటూ ఉంటారు. అలాంటి హీరోల్లో మాధవన్ ఒకరు. తమిళ్‌లోనే కాదు, తెలుగు, హిందీ భాషల్లో కూడా ఎన్నో మంచి సినిమాలు చేశారు. లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్నారు. ఎన్నో ప్రేమకథా చిత్రాల ద్వారా ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్నారు.    2000లో వచ్చిన అలైపాయుతే అనే తమిళ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు మాధవన్. తెలుగులో ఈ సినిమా సఖి పేరుతో విడుదలైంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ఘనవిజయం సాధించి ఒక కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేసింది. ఈ సినిమాలో మంచి లుక్‌తో లవర్ అంటే ఇలా ఉండాలి అన్నట్టుగా తన నటనతో యూత్‌ని విపరీతంగా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా అమ్మాయిలకు లవర్ బాయ్ అయిపోయారు. ఆరోజుల్లో మాధవన్‌కి అమ్మాయిల ఫాలోయింగ్ చాలా ఎక్కువగా ఉండేది. మిన్నలే సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో అతడి క్రేజ్ మారిపోయింది. ఈ సినిమా తెలుగులో చెలి పేరుతో రిలీజ్ అయింది. అప్పటి నుంచి పలు భాషల్లో సినిమాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా దురంధర్ చిత్రంతోనూ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు.    సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. కమ్యూనికేషన్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్‌కి సంబంధించి దేశంలోని పలు పట్టణాల్లో వర్క్ షాప్స్ నిర్వహించారు మాధవన్. మహారాష్ట్రలో వర్క్‌షాప్ చేస్తున్నప్ప్పుడు తన స్టూడెంట్ అయిన సరితా బిర్జే పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అప్పటి నుంచి ఇద్దరూ డేటింగ్ చేస్తూ 1999లో వివాహం చేసుకున్నారు. వీరి కుమారుడు వేదాంత్. ఇప్ప్పుడతని వయసు 20 సంవత్సరాలు. వేదాంత్ స్పోర్ట్స్ రంగంలో రాణిస్తున్నాడు. స్విమ్మింగ్‌లో అంతర్జాతీయ స్థాయిలో పలు మెడల్స్ సాధించాడు. 
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభానికి గుర్తుగా బుధవారం దేశంలో రంజాన్ చంద్రుడు కనిపించాడు. అంతకుముందు సౌదీ అరేబియాలో ఫిబ్రవరి 17న చంద్రుడు కనిపించాడు.  ఫిబ్రవరి 18న అక్కడ రంజాన్ ఉపవాసం ప్రారంభానికి గుర్తుగా చంద్రుడు కనిపించాడు. భారతదేశంలో ఉపవాసం సాధారణంగా మరుసటి రోజు ప్రారంభమవుతుంది. రంజాన్ ఇస్లామిక్ క్యాలెండర్‌లో తొమ్మిదవ నెల.  దీనిని అత్యంత పవిత్రమైన మాసంగా  పరిగణిస్తారు. ఈ నెల చాలా ప్రత్యేకమైనది.  ఈ సమయంలోనే పవిత్ర ఖురాన్ అవతరణ ప్రారంభమైందని చెబుతారు. రంజాన్ ఉపవాసం,  దాహం గురించి మాత్రమే కాదు, రంజాన్ మాసంలో చెయవలసిన పనులు,  చేయకూడని పనులు కూడా ఉంటాయి.  అవేంటో తెలుసుకుంటే.. రంజాన్ ప్రాముఖ్యత.. రంజాన్ మాసం దయ, ఆశీర్వాదం,  క్షమాపణల మాసంగా పరిగణించబడుతుంది. ఈ కాలంలో ముస్లింలు ఉపవాసం ఉండి, తమ పాపాలకు క్షమాపణ కోసం అల్లాహ్‌ను ప్రార్థిస్తారు. ఉపవాసం సహనం, క్రమశిక్షణ,  స్వీయ నియంత్రణను నేర్పుతుంది. రోజంతా ఆకలితో,  దాహంతో ఉండటం వల్ల పేదవారి కష్టాలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. మనుషులలో స్పందించే గుణం పెరుగుతుంది. రంజాన్ నెలలో జకాత్,  సదఖా (దానధర్మాలు) ఇవ్వడం  చాలా ముఖ్యమైనదిగా చెబుతారు. పేదలకు  ఆదాయంలో కొంత భాగాన్ని ఇవ్వడం సమాజంలో సమానత్వాన్ని,  సోదరభావాన్ని పెంపొందిస్తుంది.  రంజాన్ చివరి పది రాత్రులు ప్రత్యేకంగా పరిగణించబడతాయి. షబ్-ఎ-ఖదర్ రాత్రి వెయ్యి నెలల కంటే మెరుగైనదిగా పరిగణించబడుతుంది. రంజాన్ మాసంలో ఏం చెయ్యాలి.. ఐదుసార్లు ప్రార్థన చేయడం చాలా ముఖ్యం అని చెబుతారు.  అది కూడా  సరైన సమయానికి చేయాలి. ప్రతిరోజూ ఖురాన్‌లో కొంత భాగం చదవడం లేదా వినడం చేయాలి. ఈ నెల ఖురాన్‌తో అనుసంధానం కావడానికి ఉత్తమ సమయం. ఖర్జూరం,  నీటితో ఉపవాసం విరమించడం సున్నత్‌గా పరిగణించబడుతుంది. జకాత్,  సదఖా ఇవ్వడం ద్వారా పేదవారికి సహాయం చేయాలి.  ప్రవర్తనను నియంత్రించుకోవాలి. కోపం, వాదనలు,  కఠినమైన మాటలు నివారించాలి. ఇఫ్తార్ సమయంలో  ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి,  సమతుల్య భోజనం తినాలి. రంజాన్ లో చేయకూడనివి.. అబద్ధాలు చెప్పడం, గాసిప్ చెప్పడం,  ఇతరులను   బాధపెట్టడం మానుకోవాలి. చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకోకూడదు. ఇఫ్తార్ సమయంలో ఆహారం వృధా చేయకూడదు.  లేదా వృధా ఖర్చులు చేయకూడదు. ప్రార్థనలో అజాగ్రత్తగా ఉండకూడదు. పనికిరాని కార్యకలాపాలలో లేదా చెడు అలవాట్లలో సమయాన్ని వృధా చేయకూడదు.                                                     *రూపశ్రీ
ప్రతి వ్యక్తి జీవితం గురించి చాలా ఆలోచిస్తారు.  తమ జీవితం ఎలా ఉండాలో,  ఎలా ఉంటే బాగుంటుందో అని చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.  సరిగ్గా గమనిస్తే.. కొందరు నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది అని అంటూ ఉంటారు.  కొందరు మాత్రం ఇలాంటి మాటలు విన్నప్పుడు అదేదో కామెడీ అన్నట్టు రియాక్ట్ అవుతూ ఉంటారు.  మనిషి వ్యక్తిత్వంలో సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా కీలకపాత్ర పోషిస్తుంది.  అయితే మనిషిలో ఉండే లక్షణాలను బట్టి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎంత ఉందనేది చెప్పవచ్చట. సెల్ప్ రెస్పెక్ట్ లేకపోతే.. ఎప్పుడూ తమను తాము తక్కువ చేసుకుంటూ ఉంటారు చాలామంది.  ఇంతకీ మనుషుల్లో ఏ లక్షణాలు ఉంటే అవి వ్యక్తిత్వం మీద ప్రభావితం చూపిస్తాయి? సెల్ప్ రెస్పెక్ట్ తక్కువ ఉందని ఏ లక్షణాలు సూచిస్తాయి?  మనస్తత్వవేత్తలు ఏం చెబుతున్నారు? తెలుసుకుంటే.. తప్పు చేయకపోయినా క్షమాపణ చెప్పడం.. తప్పు లేకుండా క్షమాపణ చెప్పడం లేదా  అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు అపరాధ భావన కలిగి ఉండటం.. తక్కువ సెల్ప్ రెస్పెక్ట్ కలిగి ఉన్నారని  సూచిస్తుందని మనస్తత్వవేత్తలు అంటున్నారు.  నిజంగా ఎవరికైనా హాని చేశారా అని  ఎవరికి వారు ప్రశ్నించుకోవాలని మనస్తత్వవేత్తలు సలహా ఇస్తున్నారు. ఎవరికి  ఎలాంటి హాని చేయకపోతే ధైర్యంగా, నమ్మకంతో నిలబడాలని చెబుతున్నారు. తక్కువ చేసి మాట్లాడే వారి ముందు.. ఎవరైనా తక్కువ చేసి మాట్లాడుతుంటే.. కుటుంబ సభ్యులు లేదా లైఫ్ పార్ట్నర్.. స్నేహితులు, ఇతరులు తక్కువ చేసి మాట్లాడినప్పుడు వారికి ఎలాంటి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోతే.. వారి మాటలను అంగీకరించినట్టే.. ఇలా చేస్తే తమను తాము తక్కువ చేసుకున్నట్టే. ఇలాంటి వారికి సెల్ప్ రెస్పెక్ట్ తక్కువగా ఉంటుందని అంటున్నారు. ఫెయిల్యూర్.. తమను తాము ఫెయిల్యూర్ పర్సన్ గానూ,  తెలివి తక్కువ వారి గానూ భావించే వారికి సెల్ప్ రెస్పెక్ట్ కూడా తక్కువగానే ఉంటుంది. ఇలాంటి వారు తమకు తాము హాని చేసుకుంటారని అంటున్నారు. ప్రశంసలు, భరోసా.. ఎప్పుడూ తమను ఎవరో ఒకరు పొగుడుతూ, మెచ్చుకుంటూ,  భరోసా ఇస్తూ తమ వెంట ఉండాలని కోరుకునేవారు ఉంటారు. ఇలాంటి వారికి సెల్ప్ రెస్పెక్ట్ తక్కువగా ఉంటుందట.  మెచ్చుకోలు,  భరోసా లోపించినప్పుడు తాము వేస్ట్ అనుకునే మెంటాలిటీ వీరిలో ఏర్పడుతుందట. ఇది ఎమోషనల్ గా తమను తాము దెబ్బతీసుకోవడానికి దోహదం చేస్తుందట. ఇతరుల కోసం.. ఇతరుల కోసం బాధపడటం,  అన్నం తినడం మానేయడం,  ఇతరుల కోసం తమను తాము హింసించుకోవడం, ఇతరుల ముందు తమను తాము తక్కువ చేసుకోవడమేనని అంటున్నారు. ప్రతి ఒక్కదానికి ఒక హద్దు అనేది ఉంటుంది. ఈ హద్దులను నిర్ణయించుకోలేని వారు సెల్ఫ్ రెస్పెక్ట్ తక్కువ కలిగి ఉంటారు. బంధాలు.. తెలిసో, తెలియకో.. బంధాలు ఏర్పడిపోతాయి. అయితే ఒక చెడు బంధంలో ఉన్నప్పుడు.. అవతలి వ్యక్తి మారతారనే ఆశతో బాధ కలిగించే విషయాలను మభ్యపుచ్చుకోవడం, భరించడం అనేది సెల్ప్ రెస్పెక్ట్  తక్కువగా ఉందని సూచిస్తుంది. అవతలి వ్యక్తి తప్పు ఉంటే తప్పు ఉందని చెప్పకపోగా,  తమదే తప్పు అని అంగీకరించే వారు సెల్ప్ రెస్పెక్ట్ చాలా తక్కువ కలిగి ఉంటారు. పోలిక.. ఇతరులతో పోల్చుకునే వారు కూడా తక్కువ సెల్ప్ రెస్పెక్ట్ కలిగి ఉంటారు. ఇతరుల జీవితాలతో తమను తాము పోల్చుకోవడం అనేది ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. సెల్ప్ కేర్.. సెల్ప్ కేర్ ఎంత ఎక్కువ ఉంటే వారు అంత  సెల్ప్ రెస్పెక్ట్ కూడా కలిగి ఉంటారు.  చాలామందిలో సెల్ప్ కేర్ అనేది ఉండదు.  తమ చుట్టూ ఉన్నవారి గురించి ఆలోచించి,  వారి కోసం అన్నీ చేసి, కష్టపడి.. వారు మెచ్చుకుంటే ఆ మాటలతోనే తృప్తి పడుతుంటారు. అయితే ఇది చాలా తప్పు.  తమ గురించి తాము కేర్ తీసుకోని వ్యక్తులు తమను తాము ఇతరుల ముందు రెస్పెక్ట్ గా నిలబెట్టుకోలేరు.                               *రూపశ్రీ.
నేటి ప్రపంచంలో మనం ఒక బటన్ నొక్కితే ప్రపంచంలోని ఏ మూలకైనా ఇమెయిల్‌లు, మెసేజ్ లు  పంపవచ్చు, కానీ ఆకాశం గుండా ఉత్తరాలు పంపడం అనే ఆలోచన కూడా ఒక మాయా కలలా అనిపించే కాలం ఉండేది. భారతదేశంలోని పవిత్ర భూమి అయిన ప్రయాగ్‌రాజ్ ఈ కలను నిజం చేసింది.  114 సంవత్సరాల క్రితం కుంభమేళా సమయంలో, ప్రపంచంలో మొట్టమొదటి అధికారిక ఎయిర్ మెయిల్ సేవ ప్రారంభించబడింది. ఈ సేవ ఎలా ప్రారంభమైందో,  దాని వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసుకుంటే..  ఫిబ్రవరి 18, 1911..  ఫిబ్రవరి 18, 1911 సాయంత్రం మొదలైన ప్రస్థానం ఇద. ప్రయాగ్‌రాజ్‌లోని యమునా నది ఒడ్డున ఉత్తర ప్రదేశ్ ఎగ్జిబిషన్ జరుగుతోంది. సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో, దాదాపు లక్షమందితో కూడిన భారీ జనసమూహం అక్కడ గుమిగూడింది. ఆ రోజుల్లో, విమానాలు ఒక అద్భుతం.  ప్రతి ఒక్కరూ  చారిత్రాత్మక క్షణాన్ని చూడాలని అక్కడ గుమిగూడారు. ఫ్రెంచ్ పైలట్ మాన్సియర్ హెన్రీ పెక్వెట్ తన విమానంలో 6,500 ఉత్తరాలతో నిండిన మెయిల్ బ్యాగ్‌ను ఎక్కించుకుని ప్రయాగ్‌రాజ్ నుండి నైనికి ప్రయాణించాడు. ఇది కేవలం ఒక విమానం కాదు, ప్రపంచ కమ్యూనికేషన్ విప్లవానికి నాంది. 13నిమిషాల యాత్ర.. ప్రయాగ్‌రాజ్ నుండి నైని వరకు ఉన్న దాదాపు 15 కిలోమీటర్ల దూరాన్ని పైలట్ పాకెట్ కేవలం 13 నిమిషాల్లోనే అధిగమించాడు. విమానం నైని జంక్షన్ సమీపంలో విజయవంతంగా ల్యాండ్ అయింది. మెయిల్ బ్యాగ్‌పై "ఫస్ట్ ఎయిర్ మెయిల్",  "ఉత్తర ప్రదేశ్ ఎగ్జిబిషన్, అలహాబాద్" అని ముద్ర కూడా వేశారు. ఈ చిన్న విమానం ప్రపంచ పోస్టల్ చరిత్రలో భారతదేశం పేరును సువర్ణాక్షరాలతో లిఖించింది. విద్యకు మార్గం.. విరాళం.. ఈ ప్రత్యేక ఎయిర్ మెయిల్ సేవలో పాల్గొనడానికి రుసుము ఆరు అణాలు.  బరువు పరిమితుల కారణంగా ఈ మొదటి బ్యాగ్‌లో 6,500 ఉత్తరాలు మాత్రమే చేర్చబడ్డాయి. ఈ చారిత్రాత్మక సేవ నుండి వచ్చిన మొత్తం ఆదాయాన్ని ఆక్స్‌ఫర్డ్-కేంబ్రిడ్జ్ హాస్టల్‌కు విరాళంగా ఇచ్చారు. భారతదేశ మైలు రాయి.. ప్రయాగ్‌రాజ్‌లో సాధించిన ఈ విజయం ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా పోస్టల్  విమానయాన చరిత్రలో ఒక మైలురాయిగా పరిగణించబడుతుంది. ఈ విమానం భారతదేశపు మొట్టమొదటి ఎయిర్ మెయిల్ డెలివరీ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా మెయిల్ డెలివరీ చేయడానికి కొత్త,  వేగవంతమైన మార్గానికి కూడా మార్గం సుగమం చేసింది.                                             *రూపశ్రీ.
నేటికాలంలో కిడ్నీలో రాళ్లు ఏర్పడటం చాలా సాధారణం అయిపోయింది.   ఏ వయసు వారికైనా ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం వల్ల పిల్లలు,  యువకులలో కిడ్నీలో రాళ్ల సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ ప్రకారం దాదాపు 10 మందిలో ఒకరు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో కిడ్నీలో రాళ్ల సమస్యను ఎదుర్కుంటూ ఉన్నారట. ఈ సమస్యలు సాధారణంగా తేలికపాటి చికిత్స లేదా శస్త్రచికిత్స ద్వారా సులభంగా  పరిష్కారం అవుతాయి.  కానీ కొంతమందిలో రాళ్ల సమస్యలు తీవ్రమైన మూత్రపిండాల సమస్యలకు దారితీయవచ్చు. అసలు కిడ్నీలో రాళ్ల సమస్య ఎలా ఏర్పడుతుంది? బీర్ తాగితే కిడ్నీలో రాళ్ల సమస్య తగ్గుతుందనే మాట నిజమా? దీని గురించి వైద్యులు ఏం చెబుతున్నారు? తెలుసుకుంటే.. మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడటానికి కారణాలు.. మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడటానికి అతిపెద్ద కారణం తగినంత నీరు తీసుకోకపోవడం. తగినంత నీరు త్రాగనప్పుడు మూత్రం ఘాడతగా మారుతుంది.  దానిలోని ఖనిజాలు స్ఫటికాలను ఏర్పరుస్తాయి. ఇవే   కిడ్నీలో రాళ్లుగా రూపాంతరం చెందుతాయి.    ఉప్పు అధికంగా తీసుకోవడం, ప్రోటీన్ అధికంగా తీసుకోవడం, ఆక్సలేట్ అధికంగా ఉండే ఆహారాలైన పాలకూర, చాక్లెట్  వంటివి తినడం,  అధికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా కిడ్నీలో రాళ్ల  ప్రమాదం పెరుగుతుంది. ఊబకాయం, మధుమేహం,  జీవక్రియ సమస్యలు కూడా రాళ్ళు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతాయి. మూత్రపిండాలలో రాళ్లు ఎలా నయమవుతాయి? వైద్యులు చెబుతున్న దాని ప్రకారం..  కిడ్నీలో రాళ్ళు సాధారణంగా  ఎక్కువ నీరు త్రాగడం ద్వారా వాటంతట అవే బయటకు వస్తాయి.  నొప్పిని తగ్గించడానికి,  రాళ్ల పరిమాణాన్ని తగ్గించడానికి వైద్యులు  మందులను సూచించవచ్చు. అయితే రాళ్ల పరిమాణం పెద్దగా ఉన్నప్పుడు  శస్త్రచికిత్స అవసరం ఏర్పడవచ్చు. కిడ్నీలో రాళ్లను ముందుగానే తొలగించడం చాలా ముఖ్యం ఎందుకంటే అవి కాలక్రమేణా కిడ్నీ లోపలి పొరను దెబ్బతీస్తాయి. బీరు తాగితే కిడ్నీలో రాళ్లు తగ్గుతాయా? బీరు తాగడం వల్ల మూత్ర ఉత్పత్తి పెరుగుతుందని, తరచుగా మూత్ర విసర్జన జరుగుతుందని,  రాళ్లు బయటకు వెళ్లడానికి సహాయపడుతుందని  చాలామంది నమ్ముతారు. కానీ వైద్యులు  ఈ నమ్మకాన్ని తోసిపుచ్చుతున్నారు. బీరు తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు బయటకు వెళ్లడానికి సహాయపడతాయనే నమ్మకం ప్రజలలో ఉన్నా.. బీరు తాగితే చాలు కిడ్నీలో రాళ్లు తొలగిపోతాయి అనుకోవడం చాలా తప్పని, అది వైద్యులు రికమెండ్ చేయరని చెబుతున్నారు. బీరు తాత్కాలికంగా మూత్ర ఉత్పత్తిని పెంచుతుంది, కానీ అది శరీరం డీహైడ్రేట్ అవ్వడానికి కారణం అవుతుంది.  ఇది రాళ్లు ఏర్పడటానికి ప్రధాన కారణం అవుతుంది. బీరులో ప్యూరిన్లు కూడా ఉంటాయి, ఇవి యూరిక్ ఆమ్లాన్ని పెంచుతాయి, మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతాయి, అప్పటికే కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు బీర్ తాగితే.. ఈ రాళ్ల ప్రమాదం మరింత పెరుగుతుంది. కాబట్టి కిడ్నీలో రాళ్ల సమస్యకు ఔషదంగా బీర్ ను తీసుకోవడం అస్సలు మంచిది కాదు.                            *రూపశ్రీ.  
తలనొప్పి చాలా కామన్ గా అందరికీ వచ్చే సమస్య.  ఆఫీసు ఒత్తిళ్లు, దినచర్య క్రమంగా ఉండకపోవడం,   భోజనం ఆలస్యం కావడం,  సరిపడని ఆహారం తినడం వంటివి  తలనొప్పి కలిగిస్తూ ఉంటాయి. కానీ ప్రతి తలనొప్పి ఒత్తిడి వల్ల లేదా పైన చెప్పుకున్న సమస్యల వల్ల  వస్తుందని అనుకుంటే పొరపాటే.. కొన్నిసార్లు  తలనొప్పికి పొట్ట ఆరోగ్యం కూడా కారణం అవుతుందని అంటున్నారు వైద్యులు.  దీనిని సాధారణంగా గ్యాస్ తలనొప్పి లేదా గ్యాస్ట్రిక్ తలనొప్పి అని పిలుస్తారు. అసలు గ్యాస్ తలనొప్పి ఎలా వస్తుంది? ఈ తలనొప్పి వల్ల జరిగేదేంటి? తెలుసుకుంటే.. గ్యాస్ తలనొప్పి.. గ్యాస్ట్రిక్ తలనొప్పి అనేది సాధారణ టెన్షన్ లేదా సైనస్ తలనొప్పి కాదు. జీర్ణవ్యవస్థలో అజీర్ణం, ఆమ్లత్వం లేదా గ్యాస్ వంటి సమస్యలు ఉన్నప్పుడు ఇది వస్తుంది. కడుపు, మెదడు దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి. కడుపులో అసమతుల్యత ఉన్నప్పుడు, శరీరం ప్రతిస్పందిస్తుంది.  చాలా మందిలో కడుపులో ఉండే సమస్య తలకు వ్యాపిస్తుంది. కారంగా ఉండే ఆహారాలు, సక్రమంగా భోజనం చేయకపోవడం, అధికంగా  టీ,  కాఫీ తీసుకోవడం,  నిరంతర ఒత్తిడి ఇవన్నీ వంటివన్నీ సమస్యను మరింత తీవ్రం చేస్తాయి. గ్యాస్ట్రిక్ తలనొప్పి.. గ్యాస్ట్రిక్ తలనొప్పి  లైట్ గా ఉండవచ్చు లేదంటే ఎప్పుడూ తలనొప్పిగా కూడా ఉండవచ్చు.  అయితే గ్యాస్ట్రిక్ మైగ్రేన్ మరింత తీవ్రంగా  ఉంటుంది. ఇది కాంతికి,  శబ్దాలకు చాలా రియాక్ట్ అవుతుంది. వికారం లేదా వాంతులు కూడా ఉండొచ్చు. రెండింటిలోనూ  అంతర్లీనంగా  జీర్ణ సమస్యలే కారణం. ఈ సమస్య అప్పుడప్పుడు వస్తే అది ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, కానీ తరచుగా  వస్తుంటే మత్రం లైట్ గా తీసుకోకూడదు.  గ్యాస్ తలనొప్పి పదే పదే వస్తుంటే దీర్ఘకాలిక గ్యాస్ట్రిటిస్, పెప్టిక్ అల్సర్లు, పిత్తాశయ వ్యాధి, ప్రకోప ప్రేగు సిండ్రోమ్ లేదా గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్  వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉండొచ్చు.   డాక్టర్ ను ఎప్పుడు కలవాలి.. వారానికి రెండుసార్లు కంటే ఎక్కువసార్లు తలనొప్పి వస్తే, ఎటువంటి కారణం లేకుండా బరువు తగ్గుతుంటే, వాంతులు అవుతున్నా లేదా తీవ్రమైన కడుపు నొప్పిని ఉంటున్నా, లేదా ఇంటి చిట్కాలు ఫాలో అయినా  ఉపశమనం కలగకపోతే, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను సంప్రదించాలి. అవసరమైతే, ఎండోస్కోపీ వంటి పరీక్షలు జీర్ణవ్యవస్థ పరిస్థితిని స్పష్టం చేస్తాయి. చికిత్స అంటే నొప్పి నివారణ మందులు మాత్రమే కాదు, జీర్ణక్రియను మెరుగుపరచడం. సమయానికి తినడం, తేలికైన,  సమతుల్య ఆహారం తీసుకోవడం, తగినంత నీరు త్రాగడం,  నిరాశకు దూరంగా ఉండటం వంటివి ఈ సమస్యకు మంచి ఉపశమనం లభిస్తుంది.                                       *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...