Home

»

news

తన స్టూడెంట్‌ని పెళ్లి చేసుకున్న హీరో.. వైరల్ అవుతున్న లవ్‌స్టోరీ!

Feb 20, 2026

తాము చేసే సినిమాల ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకుంటారు హీరోలు, హీరోయిన్లు. ముఖ్యంగా కొందరు హీరోలు లవర్ బాయ్స్‌గా అమ్మాయిల మనసులు దోచుకుంటూ ఉంటారు. అలాంటి హీరోల్లో మాధవన్ ఒకరు. తమిళ్‌లోనే కాదు, తెలుగు, హిందీ భాషల్లో కూడా ఎన్నో మంచి సినిమాలు చేశారు. లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్నారు. ఎన్నో ప్రేమకథా చిత్రాల ద్వారా ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్నారు. 

 

2000లో వచ్చిన అలైపాయుతే అనే తమిళ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు మాధవన్. తెలుగులో ఈ సినిమా సఖి పేరుతో విడుదలైంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ఘనవిజయం సాధించి ఒక కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేసింది. ఈ సినిమాలో మంచి లుక్‌తో లవర్ అంటే ఇలా ఉండాలి అన్నట్టుగా తన నటనతో యూత్‌ని విపరీతంగా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా అమ్మాయిలకు లవర్ బాయ్ అయిపోయారు. ఆరోజుల్లో మాధవన్‌కి అమ్మాయిల ఫాలోయింగ్ చాలా ఎక్కువగా ఉండేది. మిన్నలే సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో అతడి క్రేజ్ మారిపోయింది. ఈ సినిమా తెలుగులో చెలి పేరుతో రిలీజ్ అయింది. అప్పటి నుంచి పలు భాషల్లో సినిమాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా దురంధర్ చిత్రంతోనూ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. 

 

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. కమ్యూనికేషన్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్‌కి సంబంధించి దేశంలోని పలు పట్టణాల్లో వర్క్ షాప్స్ నిర్వహించారు మాధవన్. మహారాష్ట్రలో వర్క్‌షాప్ చేస్తున్నప్ప్పుడు తన స్టూడెంట్ అయిన సరితా బిర్జే పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అప్పటి నుంచి ఇద్దరూ డేటింగ్ చేస్తూ 1999లో వివాహం చేసుకున్నారు. వీరి కుమారుడు వేదాంత్. ఇప్ప్పుడతని వయసు 20 సంవత్సరాలు. వేదాంత్ స్పోర్ట్స్ రంగంలో రాణిస్తున్నాడు. స్విమ్మింగ్‌లో అంతర్జాతీయ స్థాయిలో పలు మెడల్స్ సాధించాడు. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com