తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం

posted on: Feb 20, 2026 8:03PM

 

తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో మాజీ సీఎం, అన్నాడీఎంకే బహిష్కృ నేత ఓ. పన్నీర్ సెల్వం భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా పన్నీర్ సెల్వం మీడియాతో మాట్లాడుతూ.. డీఎంకే ఐదేళ్ల పాలనను ప్రశంసించారు. త్వరలో రానున్న ఎన్నికల్లో డీఎంకే ప్రభుత్వం మళ్లీ ఏర్పడుతుందని, .గత ఐదేళ్లుగా సీఎం స్టాలిన్ విజయవంతమైన, సుపరిపాలన అందించారని కితాబిచ్చారు. 

అందుకే తాను ఈరోజు సీఎం స్టాలిన్‌ను కలిసి.. అభినందనలు తెలిపానన్నారు. శుక్రవారం చెన్నైలోని అసెంబ్లీ ప్రాంగణంలో వారి భేటీ జరిగింది . ఈ సమావేశ సందర్భంగా పన్నీర్‌సెల్వం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు పుష్పగుచ్ఛం అందజేసి తన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశం స్నేహపూర్వకంగా జరిగిందని, అలానే ఇద్దరు సీనియర్ రాజకీయ నాయకుల మధ్య పరస్పర గౌరవాన్ని ప్రతిబింబిస్తుందని రాజకీయ వర్గాలు సూచిస్తున్నాయి. త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 

ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడక ముందే అన్ని పార్టీలు తమ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే, కాంగ్రెస్, బీజేపీలు అధికారమే లక్ష్యంగా కీలక భేటీలు నిర్వహిస్తున్నాయి. ఆ క్రమంలో ఈ సారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా ఉండనున్నాయి. ఈ ప్రధాన పార్టీలతో పాటు సినీ నటుడు విజయ్ కూడా టీవీకే పార్టీని స్థాపించి.. ఎన్నికల బరిలోకి దిగనున్న సంగతి తెలిసిందే. దీంతో దేశమంతా తమిళనాడు రాజకీయాల వైపు ఆసక్తిగా చూస్తోంది.


 
 

google-ad-img
    Related Sigment News
    • Loading...