
-సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పిక్స్
-పార్టీకి ఎవరెవరు హాజరయ్యారు
-టోటల్ బ్లాక్ కోడ్
ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)ప్రస్తుతం అట్లీ(Atlee)సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మరో వైపు లోకేష్ కనగరాజ్(LOkesh Kanagaraj)తో కమిట్ అయిన మూవీని కూడా ఈ ఏడాదే స్టార్ట్ చెయ్యబోతున్నాడు. అల్లు అర్జున్ కి ఉన్న సినీ ఫామ్ దృష్ట్యా పాన్ ఇండియా రేంజ్ లో ఆ రెండు చిత్రాలపై అంచనాలు ఏ విధంగా ఉంటాయో చెప్పక్కర్లేదు.అంత బిజీలో కూడా తన సోదరుడు శిరీష్, పెళ్లి పనులు తనే దగ్గర్నుండి చూసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే రీసెంట్ గా ఒక పార్టీని ఇవ్వడం జరిగింది.
సదరు పార్టీకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan),ఉపాసన(Upasana)హాజరయ్యారు. రామ్ చరణ్ అయ్యప్ప స్వామి మాలతో నల్లటి వస్త్రాలని ధరించగా అల్లుఅర్జున్,స్నేహ, అల్లు శిరీష్, నయనిక కూడా బ్లాక్ కలర్ డ్రెస్ తో ఉన్నారు. ప్రస్తుతం ఈ పిక్ మెగా అండ్ అల్లు అభిమానులని విశేషంగా ఆకర్షిస్తూ ఉంది. సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ ఇచ్చిన కొత్త పార్టీకి చరణ్ హాజరు కావడం సూపర్ అని కామెంట్స్ చేస్తున్నారు.
Also read: Bookie Movie Review : బూకి మూవీ రివ్యూ
రామ్ చరణ్ దంపతులు ఇటీవల కవల పిల్లలకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఒక అబ్బాయి, అమ్మాయి. చరణ్ ప్రస్తుతం పెద్ది(Peddi)తో బిజీగా ఉండగా ఏప్రిల్ 30 న వరల్డ్ వైడ్ గా ల్యాండ్ కానుంది. శిరీష్(Allu Sirish)నయనిక పెళ్లి డేట్ మార్చి 6 .







