Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఎయిర్ మెయిల్ సర్వీస్.. 114 ఏళ్ల కిందట కుంభమేళా సమయంలో మొదలు పెట్టిన ఈ సర్వీస్ ఏంటంటే..!
posted on: Feb 18, 2026 1:55PM

నేటి ప్రపంచంలో మనం ఒక బటన్ నొక్కితే ప్రపంచంలోని ఏ మూలకైనా ఇమెయిల్‌లు, మెసేజ్ లు పంపవచ్చు, కానీ ఆకాశం గుండా ఉత్తరాలు పంపడం అనే ఆలోచన కూడా ఒక మాయా కలలా అనిపించే కాలం ఉండేది. భారతదేశంలోని పవిత్ర భూమి అయిన ప్రయాగ్‌రాజ్ ఈ కలను నిజం చేసింది. 114 సంవత్సరాల క్రితం కుంభమేళా సమయంలో, ప్రపంచంలో మొట్టమొదటి అధికారిక ఎయిర్ మెయిల్ సేవ ప్రారంభించబడింది. ఈ సేవ ఎలా ప్రారంభమైందో, దాని వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసుకుంటే..
ఫిబ్రవరి 18, 1911..
ఫిబ్రవరి 18, 1911 సాయంత్రం మొదలైన ప్రస్థానం ఇద. ప్రయాగ్‌రాజ్‌లోని యమునా నది ఒడ్డున ఉత్తర ప్రదేశ్ ఎగ్జిబిషన్ జరుగుతోంది. సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో, దాదాపు లక్షమందితో కూడిన భారీ జనసమూహం అక్కడ గుమిగూడింది. ఆ రోజుల్లో, విమానాలు ఒక అద్భుతం. ప్రతి ఒక్కరూ చారిత్రాత్మక క్షణాన్ని చూడాలని అక్కడ గుమిగూడారు.
ఫ్రెంచ్ పైలట్ మాన్సియర్ హెన్రీ పెక్వెట్ తన విమానంలో 6,500 ఉత్తరాలతో నిండిన మెయిల్ బ్యాగ్‌ను ఎక్కించుకుని ప్రయాగ్‌రాజ్ నుండి నైనికి ప్రయాణించాడు. ఇది కేవలం ఒక విమానం కాదు, ప్రపంచ కమ్యూనికేషన్ విప్లవానికి నాంది.
13నిమిషాల యాత్ర..
ప్రయాగ్‌రాజ్ నుండి నైని వరకు ఉన్న దాదాపు 15 కిలోమీటర్ల దూరాన్ని పైలట్ పాకెట్ కేవలం 13 నిమిషాల్లోనే అధిగమించాడు. విమానం నైని జంక్షన్ సమీపంలో విజయవంతంగా ల్యాండ్ అయింది. మెయిల్ బ్యాగ్‌పై "ఫస్ట్ ఎయిర్ మెయిల్", "ఉత్తర ప్రదేశ్ ఎగ్జిబిషన్, అలహాబాద్" అని ముద్ర కూడా వేశారు. ఈ చిన్న విమానం ప్రపంచ పోస్టల్ చరిత్రలో భారతదేశం పేరును సువర్ణాక్షరాలతో లిఖించింది.
విద్యకు మార్గం.. విరాళం..
ఈ ప్రత్యేక ఎయిర్ మెయిల్ సేవలో పాల్గొనడానికి రుసుము ఆరు అణాలు. బరువు పరిమితుల కారణంగా ఈ మొదటి బ్యాగ్‌లో 6,500 ఉత్తరాలు మాత్రమే చేర్చబడ్డాయి. ఈ చారిత్రాత్మక సేవ నుండి వచ్చిన మొత్తం ఆదాయాన్ని ఆక్స్‌ఫర్డ్-కేంబ్రిడ్జ్ హాస్టల్‌కు విరాళంగా ఇచ్చారు.
భారతదేశ మైలు రాయి..
ప్రయాగ్‌రాజ్‌లో సాధించిన ఈ విజయం ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా పోస్టల్ విమానయాన చరిత్రలో ఒక మైలురాయిగా పరిగణించబడుతుంది. ఈ విమానం భారతదేశపు మొట్టమొదటి ఎయిర్ మెయిల్ డెలివరీ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా మెయిల్ డెలివరీ చేయడానికి కొత్త, వేగవంతమైన మార్గానికి కూడా మార్గం సుగమం చేసింది.
*రూపశ్రీ.






