Publish Date:Nov 11, 2013
Publish Date:Nov 7, 2013
Publish Date:Oct 30, 2013
Publish Date:Sep 21, 2013
Publish Date:Sep 16, 2013
Publish Date:Sep 13, 2013
Publish Date:Sep 10, 2013
Publish Date:Jul 30, 2013
Publish Date:Jul 29, 2013
Publish Date:Jul 25, 2013
Publish Date:Jul 19, 2013
Publish Date:Jul 17, 2013
Publish Date:Jul 16, 2013
Publish Date:Jul 13, 2013
Publish Date:Jul 2, 2013
Publish Date:Jun 26, 2013
Publish Date:Jun 22, 2013
Publish Date:Jun 20, 2013

EDITORIAL SPECIAL
తెలంగాణలో ఖాళీ అవుతోన్న రెండు రాజ్యసభ సీట్లపై ఎప్పట్నుంచో రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లే ఈ రెండు స్థానాలపై పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే, మొదట్నుంచీ కవిత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. లోక్ సభలో గట్టిగా తెలంగాణ వాణి వినిపించి పేరు తెచ్చుకున్న కవిత... అనూహ్యంగా నిజామాబాద్లో ఓటమిపాలు కావడంతో... రాజ్యసభకు పంపుతారనే ప్రచారం జరిగింది. అంతలోనే రాజ్యసభకు కాదు ఏకంగా రాష్ట్ర కేబినెట్లోకి తీసుకుంటారంటూ కథనాలు వచ్చాయి. అయితే, కవితను రాజ్యసభకు పంపడం ఖాయమైనట్లు తెలుస్తోంది.  టీఆర్ఎస్ కు దక్కనున్న రెండు రాజ్యసభ సీట్లలో ఒక స్థానానికి కవిత పేరు దాదాపు ఫైనల్ అంటున్నారు. ఢిల్లీ స్థాయిలో అన్ని రాజకీయ వర్గాలతో సత్సబంధాలు కలిగివుండటం... వాక్చాతుర్యం, హిందీ, ఇంగ్లీష్ మీద పట్టు ఉండటం.... తెలంగాణ సమస్యలు, అంశాల మీద సమగ్ర అవగాహన కలిగివున్న కవితను, రాజ్యసభకు పంపితే... హస్తినలో టీఆర్ఎస్ పాత్ర మరింత పెరుగుతుందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, కేసీఆర్ కూతురుగా ఉండే ఇమేజ్ ఎలాగూ ఉండనుంది. ఇలా, అన్నీ కవితకు కలిసొస్తున్నందున రాజ్యసభకు వెళ్లడం ఖాయమంటున్నారు. ఇక, మిగిలిన మరో సీటుపైనే మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, సీనియర్లు గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఇప్పటికే హమీ లభించినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. ఖమ్మం ఎంపీ టికెట్ నిరాకరించినా..పొంగులేటి పార్టీకి విధేయులుగానే ఉన్నారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తూ.. పార్టీ అభ్యర్ధుల విజయం కోసం పనిచేశారు. దీంతో అన్నా నువ్వు రాజ్యసభకు వెళుతున్నావు..రెడీ అవ్వు అని కేటీఆర్..పొంగులేటికి హమీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పెద్దల సభకు పొంగులేటి అని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏదైనా, చివరి నిమిషంలో మార్పులు చేస్తే తప్ప, కవిత అండ్ పొంగులేటి రాజ్యసభకు వెళ్లడం ఖాయమంటున్నారు.
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదేనేమో... ఏ.బీ. వెంకటేశ్వర రావు ఇంటెలిజెన్స్ అదనపు డి.జి.పి. గా ఉన్న సమయంలో విశేషంగా సేవలందించిన ముగ్గురు డి.ఎస్.పి. లకు వై ఎస్ ఆర్ సి పీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇంటెలిజెన్స్ కే సేవలందించే భాగ్యాన్ని పోలీసు బాస్ లు కల్పించారు. ఇంతకీ, ఆ ముగ్గురూ కూడా ఉన్నది ఉన్నట్టు, లేనిది లేనట్టు గానే నిజాయితీ తో కూడిన నివేదికలను ఏ.బి. కి ఇస్తూ వచ్చే వారు. నాయుడు పార్టీ గల్లంతవుతుందని, 50 కి మించి సీట్లు రావని మరీ ఢంకా బజాయించి సమగ్ర నివేదికలు, నియోజకవర్గాల వారీగా ఇచ్చారు. మిగిలిన డి.ఎస్.పి ల మాదిరి, ఏ.బి. అడుగులకు మడుగులు కొట్టకుండా...ఉన్న వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టు గా వివరించిన ఆ ముగ్గురు డి ఎస్ పి లకు ఆశ్చర్యకరంగా ఇప్పుడు లా ఎండ్ ఆర్డర్ లో కానీ, ఏ సి బీ లో కానీ, విజిలెన్స్ ఎండ్ ఎంఫోర్సుమెంట్ లో కానీ అవకాశం ఇవ్వటానికి పోలీసు బాస్ లు ససేమిరా అంటున్నారు. ఆ ముగ్గురూ కూడా తెలుగు దేశం హయాం లో నిక్కచ్చిగా పనిచేశారు కాబట్టి, ఎలాంటి రాగ ద్వేషాలకు లొంగకుండా పని తీరు ప్రదర్శించారు కాబట్టి వారి సేవలు ఇంటెలిజెన్స్ కె అవసరం పడతాయని పోలీసు బాస్ లు సూత్రీకరించారు. దరిమిలా...వారి ముగ్గురికీ ఇంటెలిజెన్స్ లోనే కొనసాగాల్సిన గతి ఏర్పడింది. వాస్తవానికి లా ఎండ్ ఆర్డర్ లో కానీ, ఏ సి బి లో కానీ వారికి అవకాశం కల్పించటానికి దారులు ఉన్నప్పటికీ, వారిని మినహాయించి వేకెన్సీ రిజర్వ్ (వీ.ఆర్.) లో ఉన్న చాలా మందికి పోస్టింగులు ఇవ్వటానికి కూడా పోలీసు బాస్ లు ప్రయత్నిస్తున్నారు. విషయం తెలిసిన ఆ ముగ్గురు ఇంటెలిజెన్స్ డి ఎస్ పి లు ఇక తమకు కీలకమైన విభాగాల్లో అవకాశం రాదనీ నిర్ధారించుకుని, రాజీనామా ఇవ్వటానికి సింథ్పడినట్టు పోలీస్ హెడ్ క్వార్ట్రర్స్ భోగట్టా. ఈ విషయమై వారు ఇప్పటికే, పలువురు సీనియర్ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఎలాంటి ఫలితమూ కనపడక పోవటం తో , గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ ముగ్గురూ కూడా తమ పోస్టులకు రాజీనామా చేసేద్దామని నిర్ణయానికి వచ్చినట్టు ఒక సీనియర్ మోస్ట్ పోలీస్ బాస్ తన ఆంతరంగికుల దగ్గర సమాచారాన్ని షేర్ చేసుకున్నట్టు వెలగపూడి సెక్రెటేరియట్ లో చెప్పుకుంటున్నారు. ఇదే గనుక జరిగితే, ప్రభుత్వానికి కొంత ఇబ్బందికర మైన పరిస్థితి ఏర్పడుతుందని, హోమ్ మంత్రి నేరుగాఈ వ్యవహారం పై దృష్టిపెట్టి , ముఖ్యమంత్రి దృష్టి లో సమస్యను ఉంచాలని సీనియర్ పోలీస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. డి ఎస్ పీ స్థాయి అధికారులు కూడా నైరాశ్యానికి లోనై, ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటే, పోలీస్ శాఖపై ప్రజలకు తప్పు సంకేతాలు వెళతాయని ఆందోళనను పోలీసు అధికారులే వ్యక్తం చేస్తున్నారు. అసలు పోలీస్ శాఖపై హోమ్ మంత్రికి సమగ్ర అవగాహనా ఉండేలా ఇంతవరకూ ఒక కార్యాచరణ తో కూడిన ప్లాన్ ను ఏదైనా సీనియర్ అధికారులతో డిస్కస్ చేశారా, లేదా అనేది కూడా తెలియని ఒక అయోమయ స్థితి నెలకొంది.  వాస్తవానికి ఆ ముగ్గురు డి ఎస్ పి లు కూడా వాస్తవాలతో కూడిన నివేదికలు ఇవ్వటం అనేది, ఎన్నికల ముందు వై ఎస్ ఆర్ సి పీ కి కూడా కొంత నైతిక స్థైర్యాన్ని ఇచ్చింది. ఇప్పుడు పాలక పక్షం లో ఉన్న వై ఎస్ ఆర్ సి పీ ప్రస్తుతమ్ ఈ తరహా అన్యాయం పై నోరు మెదపకపోవటం తో ఆ ముగ్గురు డి ఎస్ పి లు అనివార్యంగా తమ రాజీనామా నిర్ణయాన్ని నేరుగా హోమ్ మంత్రి దృష్టి కె తీసుకెళ్లాలని  భావిస్తున్నారు. చిత్రం కాకపొతే, వారి నిక్కచ్చి తనమే ...వారికి ఇపుడు కీలక విభాగాల్లో పోస్టింగులు రాకుండా అడ్డు పడటమేమిటని సెక్రెటేరియేట్ సీనియర్లు ఆశ్చర్య పోతున్నారు. వాస్తవానికి అవినీతీ నిరోధక శాఖ (ఏ సి బీ) కి ఇప్పుడు 14 మంది డి ఎస్ పి ల అవసరం ఉన్నప్పటికీ, ఇటువంటి నిజాయితీ పరులైన అధికారులని ఏ సి బీ కోసం వదులుకోవటానికి ఇంటెలిజెన్స్ శాఖ సిద్ధంగా లేదని ఆ శాఖ లో ఒక పెద్ద ఆఫీసర్ వాక్రుచ్చారు. మరి ఎల్లా కాలమూ, వారు అక్కడే సేవలందించాలా అనే ప్రశ్నకు మాత్రం ఆ పెద్దాయన దగ్గర సమాధానం లేదు. మొత్తానికి, మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏమిటంటే--మరీ ముక్కు సూటిగా పొతే, ఒకో సారి అవసరాలకు కూడా వెతుక్కునే పరిస్థితి ఎదురవ్వచ్చు అని...
తెలంగాణ సీఎం కేసీఆర్ నిరంతర శ్రామికుడు. అలుపెరుగని పోరాట యోధుడు. ఎప్పుడూ ప్రజాకాంక్షే ప్రధానంగా ప్రజానురంజకంగా పాలన సాగించే ఓ మేధావి. గొప్ప రాజకీయ వేత్త. అసాధారణ పట్టుదల, అచంచలమైన ఆత్మవిశ్వాసం, సాధించాలనే తపన కలగలసి ప్రజల్లో ఓశక్తిగా ఎదిగాడు కేసీఆర్. ఎన్నింటినో అసాధ్యం అనుకున్న వాటిని చేపట్టి సుసాధ్యం చేసుకొనేలా వ్యూహాలను.. తెగింపుతో కూడిన పోరాట పటిమను ప్రదర్శించి ప్రజలతో హ్యాట్సాప్ అనిపించుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రసాధన కోసం అలుపెరుగని కృషి చేశారుడ. తెలంగాణ ఏర్పాటుతో తిరిగులేని నేతగా ప్రజల హృదయాలను గెలిచాడు. వరుసగా రెండోసారి కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి ప్రజానురంజకంగా పాలన చేస్తున్నాడు. దేశంలోని ఎన్నో రాష్ట్రాలకు కేసీఆర్ తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలు ఆదర్శంగా నిలిచాయి. రోల్ మోడల్ సీఎం కేసీఆర్ ను తీసుకొని ఇతర రాష్ట్రాలు పాలన సాగిస్తున్నాయి. సంక్షేమం, అభివృద్ధికి సముచిత ప్రాధాన్యం ఇస్తూ.. కేసీఆర్ పాలన సాగిస్తున్న తీరు అందర్నీ ఎంతో ఆకర్షిస్తుంది. తెలంగాణ చెరువులకు జలకళ తెచ్చాడు. అందుకోసం మిషన్ కాకతీయ.. ఇంటింటికి తాగునీటి కోసం మిషన్ భగీరథ ఎన్నో గొప్ప పథకాలతో దూసుకుపోతున్నారు. ముందు చూపున్న నేతగా కేసీఆర్ చేపట్టిన ఈ పథకాలను నీతి ఆయోగ్ కూడా ప్రశంసించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో అపర భగీరథుడుగా మారారు కేసీఆర్. అంతేకాకుండా సంక్షేమం విషయంలో కేసీఆర్ తనదైన శైలిని ఎంచుకున్నారు. కళ్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్, ఆసరా ఫించన్లు వంటి  పథకాలు పేదలకు భరోసాని కల్పించాయి. కేసీఆర్ తీసుకొచ్చిన రైతు బంధు పథకమైతే.. కేంద్రానికే ఆదర్శప్రాయంగా నిలిచింది. అలాగే.. కేసీఆర్ సంక్షేమానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో.. అంతకు మించి అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం కీలకంగా చెప్పవచ్చు. గత ఐదేళ్లలో హైదరాబాద్ ఐటీ రంగం భారీగా పుంజుకుంది. మళ్లీ బెంగళూరుకు పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది. పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. ఇదంతా కేసీఆర్ సర్కారు అందిస్తోన్న సుస్థిర పాలన వల్లే సాధ్యమైందని చెప్పవచ్చు. కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజల గొంతుక. ఎవరికీ కష్టం వచ్చినా.. వారికి తెలిస్తే చాలు.. వెంటనే ఫోన్ చేసి ఆరా తీస్తాడు. పేద ధనిక అన్న తేడా లేకుండా అందరితో కలివిడిగా మాట్లాడతాడు. స్థానిక ప్రజలను నవ్వించాలన్నా.. ఏడిపించాలన్నా అది కేసీఆర్ కే సాధ్యం... కాదు కాదు.. ఆయన స్పీచ్ కు సాధ్యం. ప్రజల్లో ఊరమాస్ లెక్క ఉండే ఆయన స్పీచ్ లకు జనాలు దాసోహమౌతారు.  అక్షరం ముక్క రానోడి కూడా ఆయన మాటలకు పడిపోతాడు. అలాంటి కట్టిపడేసే నైజం కేసీఆర్ మాటకు ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే కేసీఆర్. ఆ స్థాయి ఇమేజ్ తెచ్చుకున్న కేసీఆర్ నిజంగా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్. కాగా ఈరోజు కేసీఆర్ జన్మదినం సందర్భంగా కేసీఆర్ గారికి మా తెలుగుఒన్.కామ్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు.
ALSO ON TELUGUONE N E W S
  'భీష్మ' మూవీ సక్సెస్ మీట్‌లో యంగ్ హీరో నాగశౌర్యకు గట్టి చురకవేశాడు నితిన్. ఫిబ్రవరి 21న విడుదలైన 'భీష్మ' మూవీ సూపర్ హిట్ దిశగా దూసుకెళ్తూ, విడుదలైన ఐదో రోజే బ్రేకీవెన్ సాధించేసింది. ఆ క్రిడిట్ అంతా డైరెక్టర్ వెంకీ కుడుములదేనంటూ అంతా ప్రశంసిస్తున్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్లో జరిగిన సక్సెస్ మీట్‌లో మాట్లాడిన నితిన్, "నితిన్ బాగా నవ్వించాడు, బాగా చేశాడంటుంటే హ్యాపీగా ఉంది. నేను చేసిందల్లా డైరెక్టర్ వెంకీని కాపీ కొట్టడమే. అతను ఎలా చెయ్యమంటే అలా చేశాను కాబట్టే నా నటన బాగుందంటున్నారు. ఈ సినిమా కోసం వెంకీ చాలా కష్టపడ్డాడు. ఈ హిట్‌తో చాలామందికి అతను జవాబు చెప్పాడు. నాలుగేళ్ల తర్వాత నాకు హిట్ వచ్చింది. అందుకే ఎమోషనల్ అవుతున్నా" అని చెప్పాడు. "ఈ హిట్‌తో చాలామందికి అతను జవాబు చెప్పాడు" అని నితిన్ చెప్పింది నాగశౌర్యను ఉద్దేశించేనని ఎవరైనా చెప్పేస్తారు. అంతేకాదు.. వెంకీ మాట్లాడుతున్న సమయంలో మధ్యలో వచ్చి "వెంకీ.. ఈ కథ నీదేకదూ" అని అడగటం కూడా శౌర్యను ఉద్దేశించే. డైరెక్టర్‌గా వెంకీ ఫస్ట్ ఫిల్మ్ 'ఛలో' అనీ, అందులో నాగశౌర్య హీరో అనీ మనకు తెలిసిందే. అయితే ఇటీవల 'ఛలో' సినిమా కథ తను ఇచ్చాననీ, కానీ ఆ విషయం వెంకీ చెప్పలేదనీ అంటూ అతనిపై నాగశౌర్య విమర్శలు గుప్పించడం వివాదానికి దారితీసింది. అయితే వెంకీ మాత్రం దానికి ప్రతిస్పందించకుండా మౌనం వహించాడు.  'అశ్వథ్థామ' కథను కూడా నాగశౌర్య సమకూర్చిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. అయితే.. కథ ఎవరు ఇచ్చినా, ఆ సినిమాను డైరెక్టర్ రూపొందించే తీరువల్లే దాని జయాపజయాలు ఆధారపడి ఉంటాయి. 'భీష్మ' సినిమాతో వెంకీ సక్సెస్ సాధిస్తే, 'అశ్వథ్థామ'తో ఫ్లాప్ చూశాడు నాగశౌర్య. దాంతో శౌర్యపై వెంకీ పైచేయి సాధించినట్లయింది. ఈ విషయమే ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇప్పుడు నితిన్ ఆ విషయాన్ని ఇన్‌డైరెక్టుగా ప్రస్తావిస్తూ వెంకీని పొగడటంతో ఆపకుండా నాగశౌర్యకు చురకలు వేసేట్లు మాట్లాడాడని ఫిలింనగర్ జనాలు చెప్పుకుంటున్నారు.
  నిజమే... వంశీ పైడి పల్లి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాను తాత్కాలికంగా పక్కన పెట్టారు. ఇదీ నిజమే... ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి మహేష్ బాబు సిద్ధమవుతున్నారు. అయితే... మధ్యలో మనకు ఏమైనా అవకాశాలు వస్తాయేమో అని కొందరు దర్శకులు సూపర్ స్టార్ ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. మహేష్ బాబుకు కథ చెప్పి ఆయన చేత 'అయామ్ ఇంప్రెస్డ్' అనే మాట చెప్పించుకోవాలని తెగ తాపత్రయపడుతున్నారు.  రాజమౌళి, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి అగ్ర దర్శకులు అందరూ ఇప్పుడు ఇతర సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. మహేష్ బాబుతో సుకుమార్ సినిమా చేసే దారులు దాదాపుగా మూసుకుపోయాయి. మహేష్ మీద కోపంతో అల్లు అర్జున్ దగ్గరకు సుకుమార్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక అనిల్ రావిపూడి మెన్ననే మహేష్ హీరోగా 'సరిలేరు నీకెవ్వరు' తీశాడు. ఇప్పుడు అతడు 'ఎఫ్3' స్క్రిప్ట్ పనులు మీద ఉన్నాడు. దాంతో టాప్ లీగ్ లో చేరాలని ఆశపడుతున్న దర్శకులు మహేష్ దగ్గరకు వెళ్లి కథలు చెబుతున్నారు. పరశురామ్ కాకుండా మహేష్ దగ్గరకు వెళ్ళిన దర్శకుల్లో ప్రవీణ్ సత్తారు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. 'చందమామ కథలు', 'గుంటూరు టాకీస్' వంటి చిన్న సినిమాలు తీసిన అతడు... రాజశేఖర్ హీరోగా 'గరుడవేగా' తీసి, తాను పెద్ద సినిమాలు కూడా హ్యాండిల్ చేయగలనని నిరూపించుకున్నాడు. అలాగే, 'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా ఈ మధ్యనే మహేష్ బాబును కలిశాడట. గతంలో వీరిద్దరి మధ్య ఒక కథ విషయమై చర్చలు జరిగాయి. ఇప్పుడు ఆ కథను మళ్లీ పట్టాలు ఎక్కించే ప్రయత్నాలు చేస్తున్నాడు సందీప్. వీరితో పాటు కృష్ణవంశీ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన సత్య, శ్రీను వైట్ల పేర్లు కూడా మహేష్ దగ్గరకు వెళ్ళిన దర్శకుల జాబితాలో వినబడుతున్నాయి. ప్రస్తుతం శ్రీను వైట్ల ఫామ్ లో లేరు. ఆయనతో మహేష్ సినిమా చేసే అవకాశాలు లేనట్లే. పరశురామ్ తర్వాత మిగతా దర్శకుల్లో ఎవరో ఒకరితో సినిమా చేస్తే చేయవచ్చు. పరశురామ్ సినిమా పూర్తయ్యేలోపు మహేష్ నటించే కథ తో వంశీ పైడిపల్లి వెళితే అతడు సినిమా పట్టాలెక్కుతుంది.
పాయల్ రాజ్ పుత్ పేరు చెబితే కుర్రకారుకు పిక్ ఎక్కించే ఫిగర్ గుర్తొస్తుంది.‌ 'ఆర్.ఎక్స్.100', 'ఆర్.డి.ఎక్స్. లవ్' సినిమాల్లో హాట్ హాట్ సన్నివేశాల్లో ఒక రేంజ్ లో ఆమె అందాలు ఆరబోసింది. అందువల్ల, ఆమెను హాట్ ఫిగర్ గానే చాలా మంది ప్రేక్షకులు చూస్తున్నారు. చూడడమే కాదు... సోషల్ మీడియాలో బికినీ ఫోటోలు పోస్ట్ చేయమని అడుగుతున్నారు. అటువంటి హాట్ ప్రేక్షకులందరికీ పాయల్ గట్టి ఝలక్ ఇచ్చారు. తనకు బికినీ వేసుకోవాలని అనిపించడం లేదని స్పష్టంగా చెప్పారు. "అందరూ నా బికినీ ఫోటోలు ఎందుకు పడుతున్నారో తెలియడం లేదు. బికినీలో నాకు కంఫర్టబుల్ అనిపిస్తే వేసుకుంటా. ఇప్పట్లో బికినీ వేసుకోవాలి అనిపించడం లేదు" అని పాయల్ తెలిపారు. తన జీవితంలో తాను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయాలలో 'ఆర్ఎక్స్ 100' సినిమా చేయడం ఒకటి అని అన్నారు.  ఒకవేళ తాను కథానాయిక కాకపోయి ఉంటే న్యూస్ యాంకర్ అయ్యేదని పాయల్ ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 'డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయా?' అని అడిగితే... "అతిలోక సుందరి శ్రీదేవి బయోపిక్ చేయాలనుంది" అని ఆమె సమాధానం ఇచ్చారు. ప్రతినాయిక ఛాయలున్న పాత్రలు చేయడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని మంచి పాత్రలు వస్తే చేస్తానని ఆమె పేర్కొన్నారు. తెలుగులో తనకు ఇష్టమైన కథానాయిక తమన్నా అని, తాను శాఖాహారిని అని పాయల్ తెలిపారు.
ప్రియ అంటే ప్రియమణి! ఆమె నటించాల్సిన పాత్ర ఇప్పుడు పూర్ణ దగ్గరకు వచ్చింది! తెలుగులో 'నువ్విలా నేనిలా', 'అవును' చిత్రాల్లో నటించిన హీరోయిన్ పూర్ణ గుర్తుందా? ఇప్పుడు రియాలిటీ షోలో జడ్జిగా చేస్తోంది. ఆ పూర్ణ!! అఫ్ కోర్స్... ప్రియమణి కూడా అదే షోలో జడ్జిగా చేస్తున్నారు. అసలు వివరాల్లోకి వెళితే.... దివంగత నటి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా రూపొందుతున్న బయోపిక్ 'తలైవి'. ఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జయలలిత పాత్రలో కంగనా రనౌత్ నటిస్తున్నారు. జయలలిత నిచ్చెలి శశికళ పాత్రకు తొలుత ప్రియమణిని తీసుకున్నారు. ఇప్పుడు ఆ పాత్ర పూర్ణ దగ్గరకు వచ్చింది. 'తలైవి' దర్శకుడు కావాలనే ప్రియమణి తప్పించి పూర్ణను తీసుకోలేదు. ప్రియమణి డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆమె చేయలేనని సినిమా నుండి తప్పుకున్నారు. దాంతో పూర్ణను ఎంపిక చేశారు. అది సంగతి!! నటిగా పూర్ణకూ ఇది చాలా పెద్ద అవకాశం అని చెప్పాలి. ఇటీవల కాలంలో ఆమెకు కథానాయికగా అవకాశాలు తగ్గాయి. కొన్ని పెద్ద సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా చేశారు. మహేష్ బాబు 'శ్రీమంతుడు' సినిమాలో అయితే ఒక పాటలో తళుక్కుమని మెరిశారు. ఈ సమయంలో హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానున్న 'తలైవి'లో ఆమెకు శశికళ పాత్ర చేసే అవకాశం వచ్చింది. కంగనా రనౌత్ క్రేజ్ వల్ల సినిమాకు ఓపెనింగ్స్ గట్టిగా వస్తాయని బలంగా చెప్పవచ్చు. పైగా, జయలలిత బయోపిక్ కదా! ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి ఉంటుంది. శశికళ పాత్రను పూర్ణ బాగా నటిస్తే మళ్ళీ ఆమె కెరీర్ స్పీడ్ గా పరుగులు తీస్తుంది.
  యస్.యస్. రాజమౌళి సినిమా 'ఆర్ఆర్ఆర్'కు ఇటు ప్రేక్షకుల్లో, అటు ట్రేడ్‌లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో తెలిసిందే. రాజమౌళి మునుపటి బ్లాక్‌బస్టర్ మూవీస్ 'బాహుబలి', 'బాహుబలి 2'లను చాలా వెనక్కి నెట్టేలా 'ఆర్ఆర్ఆర్' మూవీకి ప్రి బిజినెస్ జరిగింది. 'బాహుబలి 2' వంటి ఇండియన్ ఇండస్ట్రీ రికార్డ్స్ ఫిల్మ్ తర్వాత రాజమౌళి తీస్తున్న సినిమా కావడంతో 'ఆర్ఆర్ఆర్'పై అందరి దృష్టీ ఉండటం సహజం. దానికి తగ్గట్లే ఒక్క ఇండియాలోనే 400 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ జరిగిన సినిమాగా 'ఆర్ఆర్ఆర్' రికార్డుల్లోకి ఎక్కింది. అదీ రాజమౌళికి ఉన్న క్రేజ్. ఇద్దరు మాస్ స్టార్లు జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా నటిస్తుండటం ఆ సినిమాపై క్రేజ్‌ను మరింత పెంచింది. అసలు సిసలు మల్టీస్టారర్‌గా ఆ సినిమా టాలీవుడ్‌లో సరికొత్త చరిత్రను సృష్టించేందుకు ఉరకలు వేస్తోంది. మొదట జూలై 30న విడుదల చేయాలనుకున్న ఆ మూవీని 2021 జనవరి 8న రిలీజ్ చెయ్యాలని కొద్ది రోజుల క్రితం నిర్ణయించారు. ఈ మార్పు కొంతమంది స్టార్ల సినిమాలకు విఘాతంగా మారింది. వాటిలో చిరంజీవి సినిమా 'ఆచార్య' కూడా ఉంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని మొదట ఆగస్టులో విడుదల చెయ్యాలనుకున్నారు. తర్వాత దసరా సీజన్ అయితే బెటర్ అనుకున్నారు. కానీ ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు', 'అల.. వైకుంఠపురములో' సినిమాలు ఒకదానితో ఒకటి పోటీపడుతూ ఇటు మహేశ్, అటు అల్లు అర్జున్ కెరీర్లలో బిగ్గెస్ట్ గ్రాసర్స్‌గా నిలవడంతో చిరంజీవి దృష్టి సంక్రాంతి సీజన్‌పై పడింది. 'ఆచార్య'ను సంక్రాంతికి తీసుకొస్తే బాక్సాఫీసును మరింతగా కొల్లగొట్టవచ్చనే అభిప్రాయానికి వచ్చిన ఆయన, అదే అభిప్రాయాన్ని నిర్మాతలైన రాంచరణ్, నిరంజన్ రెడ్డిలతో పంచుకున్నారు. వారు కూడా ఓకే అన్నారు. అందుకు అనుగుణంగా సినిమాని పూర్తి చెయ్యడానికి కొరటాల శివ కూడా సరేనన్నాడు. కానీ జూలై బదులు దసరా సెలవుల్లో వస్తుందని ఇండస్ట్రీ అంతా ప్రచారం జరుగుతూ వచ్చిన 'ఆర్ఆర్ఆర్' సినిమాను అనూహ్యంగా సంక్రాంతికి తీసుకొస్తున్నట్లు రాజమౌళి బృందం ప్రకటించడంతో 'ఆచార్య' బృందం అవాక్కయ్యింది. ఇక 'ఆచార్య' దగ్గర ఉన్న ఆప్షన్స్ మూడు. ఒకటి- 2020 దసరా సీజన్‌కు రావడం, రెండు- 2021 వేసవిలో విడుదల కావడం, మూడు- 2021 సంక్రాంతికి 'ఆర్ఆర్ఆర్'తో పోటీపడటం. ఎప్పుడూ సినిమాల్లో నంబర్ వన్‌గా ఉండేందుకే ఇష్టపడే చిరంజీవి.. 'ఖైదీ నంబర్ 150'తో రీ ఎంటీ ఇచ్చి, ఆ సినిమా బ్లాక్‌బస్టర్ అవడంతో లభించిన ఉత్సాహం, ఉత్తేజంతో 'సైరా.. నరసింహారెడ్డి' మూవీ చేశారు. దానితో 'బాహుబలి' రికార్డుల్ని బద్దలు కొట్టాలని ఆశించారు. కానీ ఆ ప్రయత్నం ఫెయిలైంది. ఇప్పుడు 'ఆచార్య'తో ఆ ఫీట్ చెయ్యాలని ఆయన కోరుకుంటున్నారు. కానీ 'బాహుబలిని 2'ను మించి 'ఆర్ఆర్ఆర్'కు వచ్చిన క్రేజ్, దానికి రికార్డ్ స్థాయిలో జరిగిన ప్రి బిజినెస్ చూసిన ఆయన, 'ఆచార్య'కు సైతం ఆ తరహా క్రేజ్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.  అందుకే మొదట.. సినిమాలోని ఒక కీలకపాత్రను రాంచరణ్‌తో చేయించాలని ఆయన భావించారు. చరణ్ ఆ క్యారెక్టర్ చేస్తే, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో 'ఆచార్య'కు మరింత బూస్ట్ లభిస్తుందనుకున్నారు. చరణ్ కూడా ఆ క్యారెక్టర్ చెయ్యడానికి సరేనన్నాడు. కానీ అతని ఆశలకు రాజమౌళి చెక్ పెట్టాడు. అగ్రిమెంట్ ప్రకారం 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ పూర్తయ్యే దాకా మరో సినిమా చెయ్యడానికి వీల్లేదని తేల్చేశాడు. దాంతో గత్యంతరం లేని స్థితిలో 'ఆచార్య'లో నటించే ఆలోచనను విరమించుకున్నాడు చరణ్. ఈ వ్యవహారం చిరంజీవికి ఆగ్రహం తెప్పించిందని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. చరణ్ విషయంలో రాజమౌళి పెట్టిన ఆంక్షలు ఆయనకు ఏమాత్రం నచ్చలేదనీ, అందుకే మరో బిగ్ స్టార్‌తో ఆ క్యారెక్టర్ చేయించి, 'ఆచార్య'కు రాజమౌళి ఊహించనంతటి క్రేజ్ తీసుకు రావాలని భావించారని తెలుస్తోంది. తన బదులు ఆ స్పెషల్ క్యారెక్టర్‌ను అల్లు అర్జున్‌తో చేయించాలని చరణ్ తలచాడు. మాస్‌లో బన్నీకి ఉన్న ఇమేజ్, ఇటీవల 'అల.. వైకుంఠపురములో' సాధించిన బ్రహ్మాండమైన విజయం 'ఆచార్య'కు లాభం చేకూరుస్తాయని అతను అనుకున్నాడు. కానీ చరణ్ సూచనను చిరంజీవి తిరస్కరించారు. మహేశ్ నటిస్తే వచ్చే క్రేజ్ వేరని ఆయన కొడుక్కి చెప్పాడు. ఒక మెగాస్టార్, ఒక సూపర్‌స్టార్ కలిసి నటిస్తే, 'ఆచార్య' క్రేజ్ డబుల్ అవుతుందని ఆయన చెప్పడంతో చరణ్‌కూ ఆ ఆలోచన నచ్చింది. అయితే ఇంతదాకా మరో హీరో సినిమాలో స్పెషల్ రోల్ చేయని మహేశ్.. ఈ క్యారెక్టర్ చెయ్యడానికి ఒప్పుకుంటాడా? అని అతను సందేహపడ్డాడు. కానీ అతని సందేహాలు పటాపంచలు చేస్తూ ఆ క్యారెక్టర్ చెయ్యడానికి మహేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. చిరంజీవి ఫోన్ చేసి, విషయం చెప్పి, కొరటాలను మహేశ్ వద్దకు పంపించారు. మహేశ్‌కు సన్నిహితుడైన కొరటాల ఆ క్యారెక్టర్ చెప్పగానే ఎక్కువ సమయం తీసుకోకుండా సరేననేశాడు మహేశ్. దీంతో చిరంజీవి చాలా ఆనందపడ్డారు. చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవడం తనకూ ఆనందమేనని అతను చెప్పాడు. మహేశ్‌కు అధిక రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినా, అతను దానికంటే తక్కువ తీసుకోవడానికే మొగ్గుచూపాడు. 'ఆచార్య'లో మహేశ్ రాకతో ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. మెగాస్టార్, సూపర్‌స్టార్ కలిసి నటిస్తున్న తొలి సినిమాగా 'ఆచార్య' మూవీకి రాత్రికి రాత్రే మహా మహా క్రేజ్ వచ్చింది. ఇప్పుడు అసలైన ప్రశ్న ఎదురవుతోంది. అది.. 'ఆచార్య'ను ఎప్పుడు విడుదల చెయ్యాలి?.. అని. 'ఆర్ఆర్ఆర్'కు పోటీగా సంక్రాంతికే తీసుకురావాలని చిరంజీవి పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. 'ఆర్ఆర్ఆర్' మూవీ జనవరి 8 శుక్రవారం రిలీజవుతోంది కాబట్టి జనవరి 10 ఆదివారం 'ఆచార్య'ను విడుదల చేస్తే బాగుంటుందనేది ఆయన ఆలోచన. ఈ సంక్రాంతికి 'అల.. వైకుంఠపురములో' విడుదలైంది కూడా ఆదివారమే (జనవరి 12) కావడాన్ని ఆయన ఉదహరిస్తున్నారు. కానీ చరణ్ మాత్రం.. కుదిరితే దసరాకు, లేదంటే 2021 సమ్మర్‌కు 'ఆచార్య'ను విడుదల చేస్తే బాగుంటుందని సూచిస్తున్నాడు. ఏదేమైనా ఇప్పుడు చిరంజీవి టార్గెట్ 'బాహుబలి 2' కాదు, 'ఆర్ఆర్ఆర్'. అందుకే 'ఆచార్య' మూవీని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఆయన తీసుకున్నారు. రాబోయే రోజుల్లో 'ఆర్ఆర్ఆర్' వర్సెస్ 'ఆచార్య' కథ మరింత రసవత్తరం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో సొంతంగానే బలపడతాం అని ప్రతి రోజూ ప్రకటనలు గుప్పిస్తున్న భారతీయ జనతా పార్టీ అందుకు ఎలాంటి వ్యూహాలు రచిస్తోంది అంటే? భలే ప్రశ్న అడిగారండి, ఆ విషయం ఆ పార్టీ నాయకులకే తెలియడం లేదు మనకేం తెలుస్తుంది? అంటున్నారు జనాలు. ఆంధ్రప్రదేశ్ లో బిజెపి రెండు పడవలపై కాళ్లు పెట్టి అటూ ఇటు కాకుండా పోతోంది. అధికార వైసిసి పట్ల ఏం వైఖరి అవలంబించాలనే విషయంలో పార్టీ ఒక నిర్ణయానికి రాలేకపోతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. వైసిపి లోక్ సభ సభ్యులతో బిజెపికి పని లేకపోయినా రాజ్యసభ సభ్యులతో మాత్రం ఆ పార్టీకి ఇంకా పని ఉంది. పైగా వచ్చే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలతో తెలుగుదేశం పార్టీకి ఉన్న సీట్లు బాగా తగ్గి అన్ని సీట్లూ వైసీపీకి రాబోతున్నాయి. అందువల్ల వైసిపి రాజ్యసభ సభ్యులతో బిజెపికి పని ఉంది. ఈ కారణంతో ఆంధ్రప్రదేశ్ లో బిజెపి ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి వేస్తోంది. ఈ బలహీనతతో బాటు వైసిపిని పూర్తిగా కట్టడి చేస్తే మళ్లీ తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుందేమోననే అనుమానం, బెంగ  బిజెపిని పట్టి పీడిస్తున్నాయి.  అందుకోసం కూడా బిజెపి అనుకున్న విధంగా వైసీపీని కట్టడి చేయలేకపోతున్నట్టు కనపడుతుంది. వైసిపికి వ్యతిరేకంగా పూర్తి స్థాయి ఉద్యమం నడుపుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు విపరీతమైన స్పందన వస్తోంది. జనసేన పార్టీ నిర్మాణం పూర్తిగా లేకపోయినా ఆయన చేపడుతున్న కార్యక్రమాలతో ప్రజల్లో తిరుగుబాటు మనస్తత్వం కనపడుతోంది.. పవన్ కల్యాణ్ వెనుక ఉండేది అందరూ యూత్ కాబట్టి ఆయన మాటలపై వారికి  విశ్వాసం ఉంది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత ఎంతో వేగంగా విస్తరిస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ కు పార్టీ నిర్మాణం చేయడం, అందుకు ఆర్ధిక వనరులు లేకపోవడం లాంటి బలహీనతలు ఉన్నాయి. ఈ బలహీనతలను ఆసరాగా చేసుకుని జనసేన తమ ఆధీనంలోకి వచ్చే విధంగా బిజెపి చేసుకుంది. ఈ ఎత్తుగడతో వైసిపికి వ్యతిరేకంగా ఉద్యమం చేసే పవన్ కల్యాణ్ ను కూడా కట్టడి చేసి వైసిపిని బిజెపి అన్ని రకాలుగా రక్షిస్తున్నట్టు సామాన్యులు సైతం అనుకుంటున్నారు. అమరావతి నుంచి రాజధానిని ఎత్తేయడం పై ఒక దశలో పెద్ద ఎత్తున వచ్చిన ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొనేందుకు బిజెపి ముందుకు వచ్చింది. అయితే కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలతోనే బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆ ఉద్యమాన్ని పూర్తిగా నీరుగార్చే విధంగా మాట్లాడారని ప్రజలు అనుకుంటున్నారు. జీవీఎల్ చేస్తున్న వ్యాఖ్యలకు అనుగుణంగానే కేంద్రం నుంచి సంకేతాలు వస్తుండటంలో రాష్ట్ర బిజెపి పూర్తిగా నీరుగారి పోయింది. ఉద్యమం చేస్తున్న పవన్ కల్యాణ్ ను కూడా చల్లార్చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి అధికారం లోకి వచ్చిన తర్వాత మాట మార్చిన బిజెపి తొలి ఐదేళ్లలో ఏపిలో బిజెపి పెరిగే అవకాశాన్ని చేజేతులా కొల్పోవడమే కాక  ఏపి ప్రజలకు విరోధిగా మారింది. తెలుగుదేశం ఘోరంగా ఓడిపోయిన తర్వాత  బీజేపీకి ఏపిలో మళ్లీ పెరిగే అవకాశం వచ్చింది. అయితే అమరావతి తరలింపు తదితర అంశాలకు పరోక్షంగా మద్దతు ఇస్తూ బిజెపి తన పెరుగుదలకు తానే పాతర వేసుకుంటోంది.  ఆంధ్రా రాజకీయాల్లో కమలం పార్టీ కన్స్యూజన్ లో ఉందని, తాజా పరిణామాలతో నేతలు అయోమయంలో వున్నారన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తోంది. ఆంధ్ర నాయకులు ఒకలా.. ఢిల్లీ నాయకులు మరోలా మాట్లాడుతూ నానా  గందరగోళాన్ని సృష్టిస్తున్నారు.  మూడు రాజధానుల నుంచి మండలి రద్దు అంశం వరకూ  బీజేపీ నేతల వైఖరి భిన్నమైన దారుల్లో వెళ్లడంతో రాష్ట్ర పార్టీ వ్యూహానికి కేంద్ర ప్రభుత్వ వ్యూహానికి తేడా స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో కమలం పార్టీలో అసలేం జరుగుతోందో అర్థంకాక నేతలతో పాటు జనాలు కూడా జుట్టు పీక్కుంటున్నారు. ఈ పరిణామాలతో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, వైసీపీలను వ్యతిరేకించినా ప్రత్యామ్నాయంగా బీజేపీని ఎంచుకునే పరిస్థితులు లేకుండా పోతున్నాయని ప్రజలు అనుకుంటున్నారు.
60వ దశకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు' నినాదం మార్మోగింది. కుల,మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు విశాఖలో ఉక్కు కర్మాగారం కోసం ఉద్యమించి భారీ ఉద్యమం చేసి దాన్ని సాధించుకున్నారు. కానీ దాదాపు అర్ధ శతాబ్దం తర్వాత అమరావతిలో విభజన ఏపీ రాజధాని కోసం ప్రజలు ఉద్యమిస్తున్నారు. అయితే విశాఖ ఉక్కు ఉద్యమం నాటి పరిస్ధితులు మాత్రం కనిపించడం లేదు. విశాఖ ఉక్కు వల్ల మిగతా ప్రాంతాలకు ఎలాంటి లాభనష్టాలు లేకపోయినా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఉద్యమించిన ప్రజలు ఇప్పుడు అమరావతి నుంచి రాజధాని తరలింపు వల్ల నష్టమని తెలిసినా కూడా ఉద్యమాన్ని మాత్రం ఎందుకు తమదిగా భావించలేకపోతున్నారు? 1965లో కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఐదు ప్రాంతాల్లో భారీ ఉక్కు కర్మాగారాల్ని నిర్మించాలని భావించింది. అందులో విశాఖపట్నం కూడా ఒకటి. అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కూడా దీనికి అంగీకరించారు. అయితే 1966లో శాస్త్రి మరణం తర్వాత ప్రధాని అయిన ఇందిరా గాంధీ తన రాజకీయ అవసరాల కోసం ఉక్కు కర్మాగారాన్ని ఆంధ్రప్రదేశ్ లో కాకుండా వేరే రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీన్ని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల  ప్రజలు కుల, మత, ప్రాంతాలకతీతంగా వ్యతిరేకించారు. ప్రస్తుత రాజధాని అమరావతిలోని తాడికొండకు చెందిన కాంగ్రెస్ దళిత నాయకుడు టి.అమృత రావు కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి, సొంతపార్టీకి వ్యతిరేకంగా 1966 అక్టోబర్ 14న ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. విశాఖ ఉక్కు కోసం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఉద్యమంలో 32 మంది పోలీస్ కాల్పులలో ప్రాణాలు కోల్పోయారు. విశాఖలో ఉక్కు పరిశ్రమ రాకతో స్ధానికులకే ఎక్కువ ఉద్యోగాలు వస్తాయని తెలిసినా, మిగతా ప్రాంతాల వారు సంకుచితంగా ఆలోచించలేదు. ఉక్కు పరిశ్రమ రాకతో తెలుగు జాతి ఆర్ధికంగా వృద్ధి చెందుతుందని భావించారు.  చివరికి ఎవ్నో పోరాటాల తర్వాత 1971 నుంచి ఉక్కు ఉత్పత్తి ప్రారంభమైంది. ఆ తర్వాత 90వ దశకం వరకూ కేంద్రంలో వివిధ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. నలుగురు ప్రధానులు కూడా మారారు. రాష్ట్రంలోనూ వివిధ పార్టీలు, 10 మంది ముఖ్యమంత్రులు అధికారంలోకి వచ్చారు. రాజకీయ అవసరాల కోసమో, మరే ఇతర కారణాలతోనో విశాఖ స్టీల్ ప్లాంట్ ను మరో ప్రాంతానికి మార్చాలనే ఆలోచన ఏ ప్రభుత్వానికీ రాలేదు. స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి 24 వేల ఎకరాల భూసేకరణ చేసిన అప్పటి ప్రభుత్వం..  మార్కెట్ ధర కన్నా 8 నుండి 10 రెట్లు ఎక్కువ నష్టపరిహారం కూడా ఇచ్చింది. భూములు కోల్పోయిన కుటుంబాలకు శిక్షణ ఇచ్చి, వేలాదిగా ఉద్యోగాలు కూడా ఇచ్చారు. ఇళ్ళు కోల్పోయిన వారికి ఇంటిస్థలం, ఇల్లు నిర్మించుకోవటానికి సాయం కూడా అందించారు. కానీ గతేడాది డిసెంబర్ 17న అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటన తర్వాత అమరావతి ప్రాంతంలో అనిశ్చితి మొదలైంది. వాస్తవానికి 2014 లో ప్రాంతీయ తత్వం కారణంగా ఏపీ విభజన జరిగితే, సెప్టెంబర్ 4వ తేదీన రాష్ట్ర రాజధాని విజయవాడ పరిసర ప్రాంతాలలో  నిర్మాణం చేయాలని అసెంబ్లీ లో అధికార, ప్రతిపక్షాలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. రాజధానికి 29 వేల రైతు కుటుంబాల నుంచి 33 వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ విధానంలో చేపట్టిన ఈ భూసేకరణలో భూములిచ్చిన రైతులకు 25 శాతం అభివృద్ధి చేసిన ప్లాట్లను, పదేళ్ల పాటు కౌలు తప్ప చంద్రబాబు ప్రభుత్వం మరో పరిహారం ఇవ్వలేదు. ఆ తర్వాత గతేడాది డిసెంబర్ లో వైసీపీ ప్రభుత్వం మూడేళ్లుగా అమరావతిలో ఉన్న సచివాలయం, హైకోర్టును విశాఖ, కర్నూలుకు తరలించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. ఆ తర్వాత దాన్ని సమర్ధించుకునేందుకు జీఎన్ రావు కమిటీ, బోస్టన్ గ్రూప్ నివేదికలను తెరపైకి తెచ్చింది. చివరికి 10 మంది మంత్రులతో కూడిన హై పవర్ కమిటీ నివేదిక ఆధారంగా మూడు రాజదానుల నిర్ణయానికి ఆమోదముద్ర వేసింది. అయితే మూడు రాజధానులకు ఉద్దేశించిన రెండు బిల్లులు అసెంబ్లీలో నెగ్గించుకున్నా.. మండలిలో మాత్రం ఛైర్మన్ వాటిని సెలక్ట్ కమిటీకి పంపడంతో ఈ నిర్ణయం భవితవ్యం ఏమిటన్నది ఇంకా తేలడం లేదు.  అయితే మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న అమరావతి రాజధాని ప్రాంత ప్రజలు, రైతులు నిత్యం రోడ్లపై ఉద్యమాలు చేస్తున్నారు. కానీ మిగతా ప్రాంతాల నుంచి మాత్రం వారికి తగిన సహకారం, మద్దతు లభించడం లేదు. చివరికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు ప్రతి రోజూ రాజధాని గ్రామాల్లో తిరుగుతూ అక్కడి ప్రజలకు ధైర్యం చెబుతున్నారు. మరోవైపు సీఎం జగన్ తో పాటు వైసీపీ ప్రభుత్వ పెద్దలు మాత్రం మూడు రాజధానులకు మద్దతుగా మిగతా ప్రాంతాల్లో మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారు. అయితే ఇప్పటికే సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ వంటి కట్టడాలతో కుదురుకుంటున్న రాజధానిని తరలింపు చేపట్టడం అనేది వాస్తవంగా అవసరమా కాదా అన్నది ఇప్పుడు తేలాల్సిన అంశం. గతంలో విశాఖ ఉక్కు ఉద్యమంలో కుల, మత , ప్రాంతాలకు అతీతంగా పోరాడిన ప్రజలు ఇప్పుడు అమరావతిలోనే రాష్ట్ర రాజధాని ఉండాలన్న వాదనకు మద్దతుగా నిలవకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. గతంలో విశాఖ ఉక్కు కోసం ఊరూవాడా ఉద్యమించిన ప్రజలు రాజధాని విషయంలోనూ అదే చొరవ, తెలువ చూపితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచే అవకాశం కూడా లభిస్తుంది. అదే సమయంలో మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా మీడియాత పాటు మేథావులు కూడా నిర్ణయాత్మక రీతిలో గొంతు విప్పితే అమరావతిలోనే రాజధాని ఉండాలన్న వాదనకు బలం చేకూరినట్లవుతుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రెండు సార్లు ముఖ్యమంత్రి, నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు తెరిస్తే హైదరాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టింది నేనే. సైబరాబాద్ నిర్మాతను నేను. అని చెప్తూ ఉంటారు. అదే విధంగా భవిష్యత్తులో ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది తానేనని తప్పక చెప్పుకుంటారని, అందుకు ఆస్కారం ఇవ్వకుండా ఉండేందుకే ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమరావతిని తరలించడమే కాకుండా అమరావతిని సర్వ నాశనం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు కనపడుతోంది. అమరావతి అనే పేరు వినిపించకుండా చేసేందుకు వైఎస్ జగన్  నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పావులు కదుపుతోందని తెలుగుదేశం నేతలు అంటున్నారు. అమరావతే రాజధానిగా ఉండాలని ఎడతెగని ఉద్యమం చేస్తున్న రాజధాని గ్రామాల ప్రజలపైకి వేరే ప్రాంత ప్రజలను యుద్ధానికి పంపుతున్నది. అమరావతి భూములలో దాదాపు నాలుగు వేల ఎకరాలను పేదలకు పట్టాలుగా పంచి పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైందనే వార్తలు గుప్పు మనడంతో రాజధాని ప్రాంతాల రైతులు అలోలక్ష్మణా అంటూ ఏడుస్తున్నారు. రాజధాని తరలిపోవడం ఒక ఎత్తు అయితే రాజధాని ప్రాంతంలో పేదలకు పట్టాలు ఇచ్చేయడం మరొక ఎత్తు. పేదలకు పట్టాలు ఇచ్చేస్తే వారు వచ్చి ఆక్రమించుకుంటారు. దాంతో అమరావతి ప్రాంతంలో అంతర్యుద్ధం తప్పని పరిస్థితులు ఏర్పడతాయి. వేరే ఊరుకు చెందిన ప్రజలు తమకు ప్రభుత్వం ఇచ్చిన ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తారు, దాన్ని అమరావతి ప్రాంత ప్రజలు అడ్డుకుంటే అంతర్యుద్ధం తప్పదు. అమరావతి ప్రాంత రైతులు బాగా బలిసిన వారని అందుకే పేద ప్రజలకు భూములు ఇస్తుంటే అడ్డుకుంటున్నారని వైసిపి నేతలు ప్రచారం మొదలు పెడతారు. దాంతో ఈ సమస్య మరింత తీవ్ర తరం అయి అమరావతి సర్వ నాశనం అవుతుంది. దాదాపు నెల కిందటే అమరావతి భూములను పందేరం చేయాలనే ప్రతిపాదన పెట్టారు. అయితే ఆ విషయం బయటకు రాలేదు. గ్రామ సచివాలయం అధికారులు విజయవాడ గుంటూరు పట్టణాలలో భూముల కోసం అర్జీ పెట్టుకున్న పేదల నుంచి అమరావతి గ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమా అనే అభిప్రాయ సేకరణ మొదలు పెట్టేసరికి విషయం అమరావతి రైతులకు తెలిసింది. దాంతో వారి కలలు పటాపంచలు కావడమే కాకుండా సాటి ప్రజలతో పోరాడే స్థితికి తమను ప్రభుత్వం నెట్టివేస్తోందని ఆగ్రహిస్తున్నారు. తాము భూములు ఇస్తే తమ ప్రాంతం సింగపూర్ హాంకాంగ్ లాగా అవుతుందని కలలు కన్నారు. ఇప్పుడు రాజధాని అక్కడ నుంచి వెళ్లిపోవడమే కాకుండా తమ భూములను అందరికి పంచే వ్యూహాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వాన్ని ఏమనాలో వారికి అర్ధం కావడం లేదు. కసితో కక్షతో ప్రవర్తిస్తున్న ప్రభుత్వాన్ని ఏం చేయాలో వారికి అర్ధం కావడం లేదు. నాలుగు వేల ఎకరాలు పేదవారికి పట్టాలిచ్చి పంచితే అక్కడకు లక్షల సంఖ్యలో జనాభా వచ్చేస్తారు. వారంతా కాలకృత్యాలు తీర్చుకోవడానికి, చెత్త డంప్ చేయడానికి, ఉపయోగించిన ప్లాస్టిక్ ను పడేయడానికి కృష్ణానదిని వాడితే ఇక కృష్ణమ్మ మరో మూసీగా మారక తప్పదు. కృష్ణా నది గర్భంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలోనే కొందరు బడాబాబులు పెద్ద పెద్ద భవనాలు అక్కడ నిర్మించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబునాయుడు వాటిని పెద్దగా పట్టించుకోలేదు.  వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే ఆ భవనాలన్నింటిని కూలగొట్టి కృష్ణా నదిని కాపాడతానని చెప్పడమే కాదు..దానికి నాందిగా చంద్రబాబు ప్రభుత్వ కార్యకలాపాల కోసం నిర్మించిన ప్రజావేదికను కూలగొట్టారు కూడా. తర్వాత అక్కడ ఉన్న భవనాల యజమానులకు తాకీదులు కూడా ఇచ్చారు. కానీ కోర్టుల జోక్యంతో అక్కడ ఉన్న భవనాలను అంగుళం కూడా ఆయన కదిలించలేకపోయారు. ఇప్పుడు ఆ ప్రాంతం మొత్తాన్ని జనాలతో నింపేసేందుకు ప్లాన్ సిద్ధం చేస్తున్నట్టు కనపడుతోంది. నది ఓడ్డున రాజధాని కడితే మునిగిపోతుందని ఉదర కొట్టిన జగన్ ప్రభుత్వం అక్కడ పేదలకు పట్టాలు ఎలా ఇస్తుంది? నది పొంగి పేదలంతా మునిగిపోతే ఫర్వాలేదా? ప్రజల పైకి ప్రజలనే రెచ్చగొట్టి చోద్యం చూసే ప్లాన్ ఇది..అని రాజధాని ప్రాంత రైతులు, ప్రతి పక్షాలు అంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఐదు ఆర్ధిక సంవత్సరాల్లో మొత్తం 47,682.87 కోట్ల రూపాయల ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని పొందింది. దేశం మొత్తం మీద ఓవర్ డ్రాఫ్ట్ (ఓ.డి.) అత్యధిక మొత్తం పొందిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో నిలవటంతో, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి భవిష్యత్ లో ఏ విధంగా ఉంటుందనే విషయంలో ఆందోళనలు మొదలయ్యాయి. 2014-15 ఆర్ధిక సంవత్సరం నుంచి 2019-2020 జనవరి 23 వ తేదీ వరకూ, ఎక్కువ మొత్తం ఓ.డి. తీసుకున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండడటం ఆర్ధిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఐదు ఆర్ధిక సంవత్సరాలలో  ఓ.డి. పొందిన రోజులే 188 దినాలుగా నమోదు అయినట్టు, సమాచార హక్కు చట్టం (ఆర్టి ఐ యాక్ట్) కింద భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బిఐ) వెల్లడించింది.  వివరాల్లోకి  వెళితే, 2014-15 లో 14 రోజులకు గాను 4,313 కోట్లు, 2015-16 లో 6 రోజులకు గాను 95. 38 కోట్లు, 2016-17 లో 6 రోజులకు గాను 1,295.22 కోట్లు, 2017-18 లో 38 రోజులకు గాను 8,625. 81 కోట్లు, 2018-19 లో 88 రోజులకు గాను 19,616.71 కోట్లు, 2019 ఆర్ధిక సంవత్సరం మొదలనప్పటి నుంచి ఈ ఏడాది జనవరి 23 వరకూ మొత్తం 36 రోజులకు గాను 13, 736. కోట్ల రూపాయల ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకుందని ఆర్బీఐ.. ఆర్టిఐ చట్టం కింద సమాచారం పొందు పరిచింది. తెలుగు దేశం పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి, గడిచిన ఏడాది అంటే 2018-19 వరకూ అత్యధికంగా, 2018-19 లోనే ఆ ప్రభుత్వం అత్యధికం గా 88 రోజులకు గాను 19,616.71 కోట్ల రూపాయల ఓవర్ డ్రాఫ్ట్ మొత్తాన్నిడ్రా చేసింది. ఇప్పుడా పెను భారాన్ని, వైఎస్ఆర్సిపీ ప్రభుత్వం కూడా మోయాల్సిన పరిస్థితి రావటం తో, 2019 ఆర్ధిక సంవత్సరం మొదలైనపట్టి నుంచీ , ఈ ఏడాది జనవరి 23 వరకూ కేవలం 36 రోజులలో 13,736.75 కోట్ల రూపాయల ఓ.డి. సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం వినియోగించింది. నిజానికి ఓవర్ డ్రాఫ్ట్ పరిమితి మించి పోతోందంటూ, రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక శాఖ కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్ కు, నిరుడు జూన్ 11, జూన్ 12 తేదీల్లో ఆర్బీఐ జనరల్ మేనేజర్ అరవింద్ కుమార్ రెండు లేఖలు కూడా పంపారు. 2019 జూన్ 10 వ తేదీ నాటికి ఓవర్ డ్రాఫ్ట్ మొత్తం 699. 99 కోట్ల రూపాయల మొత్తం గా నమోదైందని, ఆ త్రైమాసికం లో 16 రోజులు ఓ.డి. సౌకర్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొందిందనీ, వరసగా 14 రోజుల పాటు ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఓ.డి. పొందిన పక్షం లో రిజర్వ్ బ్యాంక్ చెల్లింపులు నిలిపివేసే పరిస్థితి ఏర్పడుతుందని కూడా ఆ లేఖలో ఆర్బీఐ జనరల్ మేనేజర్ అరవింద్ కుమార్ హెచ్చరించారు. నిరుడు జూన్ 12 వ తేదీన ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం 17 వరస పని దినాల్లో 339. 17 కోట్ల రూపాయల ఓ.డి. పొందినట్టు పేర్కొన్నారు. తక్షణమే ఓవర్ డ్రాఫ్ట్ మొత్తాన్ని తిరిగి చెల్లించే ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆ లేఖలో ఆయన రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక శాఖ కార్యదర్శిని కోరారు. మొత్తం ఓవర్ డ్రాఫ్ట్ లెక్కలను పరిశీలించిన ఆర్ధిక నిపుణుల విశ్లేషణ ప్రకారం..రాష్ర ఆర్ధిక పరిస్థితి అంట ఆశాజనకం గా లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలుగు దేశం ప్రభుత్వం అప్పచెప్పిన ఓవర్ డ్రాఫ్ట్ లెక్కల నుంచి బయటపడాలంటే, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధికక్రమశిక్షణ చర్యలను తక్షణం చేపట్టాలని వారు సూచిస్తున్నారు.
    ఒకరు సంక్షోభాలతో చెలిమి చేస్తే, మరొకరు పైనున్న దేవుడిపైన భారం వేశారు... ఇద్దరు నేతలు...వారి వ్యవహార శైలి.. ...ప్రస్తుతం రాష్ట్రం లో నలుగుతున్న చర్చ ఇదే. ఒకరు సంక్షోభాల నుంచి అవకాశాలను సృష్టించే ఫిలాసఫి నిర్మాతలైతే, మరొకరు..పైన దేవుడున్నాడు... నాన్న చూస్తున్నాడు అంటూ ప్రజలను ఎమోషనల్ గా టచ్ చేసిన యువ నేత జగన్మోహన రెడ్డి. తనపై రుద్దబడిన లక్ష కోట్ల అవినీతి బురదను వదిలించుకోవటానికి లేదా దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చటానికి ఈయనకు తొమ్మిదేళ్ల గడ్డు కాలం పట్టింది. నాయుడిదయితే  డిఫ్ఫరెంట్ స్టైల్. ఆధునికాంధ్ర ప్రదేశ్ టెక్నాలజీ పితగా తనను తాను  ఆయన మార్కెట్ చేసుకున్న తీరుకు నార్త్ ఇండియా ముఖ్యమంత్రులు సైతం ఫిదా అయిపోయి, ఆయన చేత రెండు దశాబ్దాలు జాతీయ స్థాయిలో చక్రం తిప్పించారు. వివిధ జాతీయ పార్టీల గోసలకు , వాటి మధ్య సమన్వయానికి ఆయనే చుక్కాని అయ్యారు. అటువంటి నాయుడిని ఈ రోజు 24 గ్రామాల చక్రబంధంలో ఇరికించింది  వై ఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే , తాజాగా... ఆయన ఒకప్పటి పర్సనల్ సెక్రెటరీ పెండ్యాల శ్రీనివాస్ మీద కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు, అతడి నుంచి  విలువైన ఆధారాలను కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి సేకరింపచేసిన అమిత్ షా-మోడీ ద్వయం తెలుగుదేశాన్ని ఇరకాటం లో పెట్టె ప్రయత్నం చేస్తున్నారు. ఓ సారి నాలుగేళ్ల వెనక్కు రీలు తిప్పితే--అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిసెంబర్ 2014లో విజయవాడ వచ్చేసి రాజధాని ప్రాంతాన్ని నిర్ణయించిన తర్వాత 2015 మధ్యలో ఒకసారి మాట్లాడుతున్నప్పుడు ఒక పాజిటివ్ అప్రోచ్ కనిపించింది. . 'విభజనలో అన్యాయం జరిగింది. అయినా రెట్టింపు ఉత్సాహంతో, ధృఢ సంకల్పంతో పనిచేయాలి. హైదరాబాద్ నగరాన్ని తలదన్నే మహా నగరాన్ని నిర్మించుకోవాలి' అనే పాజిటివ్ స్పిరిట్ఆ యన మాటల్లో ధ్వనించింది. ప్రజల్లో అనేక కొత్త ఆలోచనలు, ఆశలు రేకెత్తించే పదాలు ఆ సందర్భంలో వినిపించాయి. ఆ తర్వాత ఆలాంటి 'స్ఫూర్తి'నిచ్చే ప్రసంగాలే 2018 మార్చి వరకూ కొనసాగాయి. అయితే ప్రజలు ఆతర్వాత ఎన్నికల్లో భిన్నంగా స్పందించారు. ఇప్పుడు, అధికారంలోకి వచ్చిన 8 నెలల తర్వాత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి- రాష్ట్ర ఆర్ధిక వాస్తవ పరిస్థితి, తాను ప్రజలకిచ్చిన హామీలు, రెండింటి మధ్య సమన్వయము  చేస్తున్న తీరు, రాష్ట్ర పరిస్థితిపై తన ప్రణాళికలు చెపుతున్నప్పుడు వాస్తవాలకు దగ్గరగా ఉన్నట్టు .'గాలిలో మేడలు, అసాధ్యమైన హామీలు ఇచ్చే ఆలోచన తనకు లేదని, మన రాష్ట్ర పరిస్థితి అర్ధం చేసుకుని ఆ మేరకు ఎంత చేయగలమో అంతే మాట్లాడాలి' అనే భావం వినిపించింది.మరి అయినా సారం జగన్మోహన్ రెడ్డి ఎందుకింతగా ఆఫీసర్ల మధ్యన సమన్వయము సాధించుకోలేకపోతున్నారు. ఏ రాష్ట్ర చరిత్ర లోనూ లేని విధంగా ప్రస్తుతం, ఐ ఏ ఎస్, ఐ పి ఎస్ ల మధ్య ఆధిపత్య పోరుకు అమరావతి సెక్రెటేరియట్  వేదిక కావటం ప్రస్తుతం దేశం మొత్తం చూస్తున్న చోద్యం. ముఖ్యమంత్రులుగా అటు నాయుడు, ఇటు  జగన్ మోహన్ రెడ్డి వ్యవహార శైలి ని పరిశీలిస్తే, నాయుడి ఎడ్మినిస్ట్రేషన్ ఎప్పుడూ చాలా గుంభనం గా వ్యవహరించేది. లోపల తగువులున్నప్పటికీ, ఎక్కడా ఎవరూ బయటపడిన సందర్భాలు లేవు. ఇప్పుడు అందుకు భిన్నంగాఉంది... జాస్తి కృష్ణ కిషోర్, ఏ బి వెంకటేశ్వర రావు ల ఎపిసోడ్లు పరిశీలిస్తే, అమరావతి సచివాలయం నేషనల్ మీడియాకు కావలసినంత మసాలాను ఉత్తి  పుణ్యానికే అందించినట్టు తెలిసిపోతోంది. ఇది అవాంఛనీయ, అనభిలషణీయ పరిణామమని సీనియర్ అధికారులంటున్నారు. అమరావతి లో క్యాపిటల్ ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు కానీ, ఇలాంటి సంఘటనల ద్వారా రాష్ట్రం పరువు ఢిల్లీ వీధుల్లో మార్కెట్ వస్తువుగా మాత్రం మారిపోయింది. ఇక నైనా , అధికారం లో ఉన్న వారు పూర్తిగా ఐ ఏ ఎస్ ల మీద ఆధారపడి పాలన సాగించే ఛత్రం నుంచి బయట పడాలి. నాయుడి ఓటమి కి కారణం ఆయన పూర్తిగా బ్యూరోక్రాట్లమీదే ఆధారపడటం అని తెలుగుదేశం లో సీనియర్ నాయకులు ఇప్పటికే, ఒక పార్టీ అధ్యక్షడుకి ఒక ధీసిస్ కూడా సమర్పించిన విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా గుర్తు పెట్టుకోవాలి.
ఐదోరోజు విచారణలో కంట తడి పెట్టిన పెండ్యాల జరుగుతున్న దర్యాప్తు తీరుతో బిత్తరపోయిన తెలుగుదేశం శ్రేణులు దర్యాప్తు పూర్తయ్యేవరకూ ఎవరూ..ఏమీ మాట్లాడవద్దని పార్టీ క్యాడర్, లీడర్లకు నాయుడు ఆదేశం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పటి వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ దాదాపు గా అప్రూవర్ గా మారబోతున్నట్టు సమాచారం. ఈ సంగతి తెలుగుదేశాధినేతకు శరాఘాత సమానమైన విషయమైనప్పటికీ, దర్యాప్తు సంస్థలను ఉటంకిస్తూ కొందరు సీనియర్ అధికారులు ఈ అంశాన్ని ధృవీకరిస్తున్నారు. వరసగా ఐదోరోజు కూడా పెండ్యాల శ్రీనివాస్ ఇంటిలో జరిగిన సోదాల సందర్భంగా, పెండ్యాల శ్రీనివాస్ అటు ఎంఫోర్సుమెంట్ డైరెక్టరేట్ , ఇటు ఇన్ కమ్ ట్యాక్స్, మరో వైపు డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ సంస్థల బృందాల వద్ద తన వైపు నుంచి అప్రూవర్ గా మారటానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలిసింది. చంద్రబాబు నాయుడుకి సన్నిహితుడైన ఒక మాజీ ఐ.ఏ.ఎస్. అధికారికి బంధువైన పెండ్యాల శ్రీనివాస్, నాయుడు దగ్గర వ్యక్తిగత సహాయకునిగా చాలా సంవత్సరాలు పని చేశారు. 2014 లో తెలుగుదేశం అధికారం లోకి వచ్చిన తర్వాత నాయుడు, పెండ్యాల శ్రీనివాస్ ని వ్యక్తిగత కార్యదర్శిగా నియమించుకున్నారు. తర్వాత జరిగిన పరిణామాలలో, పెండ్యాల కొందరు ఐఏఎస్ లను ఏక వచనంతో సంబోధించేంతగా ఎదిగారు. నాయుడు దగ్గర పూర్తిగా ఆంతరంగిక సిబ్బందిలో భాగమైన పెండ్యాల శ్రీనివాస్ ద్వారా జరిగినట్టుగా ప్రచారమవుతున్న లావాదేవీలలో, ఎక్కువగా నాయుడికి అత్యంత సన్నిహితులైన వారి పేర్లు ఎక్కువ దఫాలు శ్రీనివాస్ ద్వారా జరిపిన బ్యాంక్ నగదు లావాదేవీల్లో రిఫ్లెక్ట్ అయినట్టు దర్యాప్తు సంస్థలు కనుగొన్నాయి. కోటి రూపాయలకు పైబడి నగదు లావాదేవీలు జరిపేంతటి స్థాయి లేని పెండ్యాల శ్రీనివాస్ , పలు దఫాలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, అందుకు బాధ్యులైన వారితో జరిపిన లావాదేవీలు, అలాగే ఫోన్ సంభాషణలన్నింటినీ కూడా దర్యాప్తు సంస్థలు క్షుణ్ణంగా సేకరించి, అధ్యయనం చేస్తున్నాయి. ఈ దర్యాప్తులో భాగంగా, వివిధ ప్రశ్నలకు ఉక్కిరి బిక్కిరి అయిన పెండ్యాల శ్రీనివాస్.. తాను అప్రూవర్ గా మారటానికి సిద్ధంగా ఉన్నాననీ, వచ్చే మాసం లో తన కుమార్తె వివాహం ఉన్న దృష్ట్యా తనను ప్రస్తుతానికి విడిచిపెట్టాలని అభ్యర్ధించినట్టు సమాచారం. అంతేకాకుండా, తన ద్వారా ప్రతిరోజూ పార్టీ లోని, ప్రభుత్వం లోని అత్యంత కీలకమైన వ్యక్తులకు ఏ మేరకు సొమ్ములు చేరవేసింది కూడా పెండ్యాల శ్రీనివాస్ దర్యాప్తు అధికారులకు వాంగ్మూలం ఇచ్చినట్టు సమాచారం. అతని కాల్ రికార్డు హిస్టరీని, అలాగే బ్యాంక్ నగదు లావాదేవీల హిస్టరీని అధ్యయనం చేస్తున్న దర్యాప్తు అధికారులకు విస్తుపోయే సంగతులు తెలిసాయి. ఒక ప్రముఖ నటుడు, మాజీ ఎం.పి కి చెందిన నిర్మాణ సంస్థ తోనూ, అలాగే, మరో మాజీ ఎం.పి, ఆటోమోబైల్ వ్యాపార రంగం లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తారంగా శాఖలున్న సంస్థ తోనూ...శ్రీనివాస్ ద్వారా జరిగిన ఆర్ధిక లావాదేవీలతో దర్యాప్తు సంస్థలు అనివార్యంగా తమ ఇంటరాగేషన్ ను మరి కొద్దీ రోజులు పొడిగించాల్సి వచ్చింది. వాస్తవానికి అటు హైదరాబాద్ లోనూ, ఇటు విజయవాడ లోనూ, ఇంకా శ్రీనివాస్ స్వస్థలంలోనూ జరుగుతున్న సోదాల సందర్భంగా తమ పేర్లు ఎక్కడ బయటకు వస్తాయో అని లోగడ ముఖ్యమంత్రి కార్యాలయం లో చక్రం తిప్పిన పలువురు సిబ్బంది ఆందోళన పడుతున్నారని తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా కూడా తెలుగు  దేశం హెడ్ క్వార్ట్రర్స్ నుంచి శ్రీనివాస్ ను ఆదుకునే వ్యవస్థేలేవీ ముందుకు రాకపోవడంతోనే, ఆయన అప్రూవర్ గా మారటానికి   నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
  Are men from Mars and Women from Venus ??.Why do they think and behave exactly the opposite way on emotions basis?? It is a classic complaint we always hear, that men accuse women of being too emotional and women accuse men of not being emotional enough. They both think that why cant this be the other way round?? Or why cant they behave a bit different?? But the basic issue lies with the brain circuitry system. The emotional processing is different in men and women. Until recently, the chasm between how men and women feel and express emotions was thought to be due to upbringing .Of course, parental upbringing dose make a difference in thought process but still we should also know that the emotional processing in the male and female brain will not be the same genetically. Research suggests that our brains have two emotional systems that work simultaneously: system or MNS (which allows us to emotionally empathize with people); and the parietal junction system or TPJ (which fires the brain's analyze-and-fix-it circuits to look for solutions to emotional problems - cognitive empathy). Males use the latter far more. This prevents their thought processes from being clouded by emotions, strengthening their ability to find practical solutions, but this obviously make them appear to be uncaring and un emotional. Male or female, when we see an emotion on someone else's face, our MNS (emotional empathy system) activates. But, for reasons scientists don't understand, the female brain stays in the sympathetic MNS longer, while the male brain, not built to wallow in anguish, switches to the practical mode. His way of showing that he cares is to try to solve your problems.  So when you see men not reacting to your emotional outburst don’t get worked up, or go bananas, just keep reminding yourself that they are men and they want results soon.  - Pushpa Bhaskar
Many times in life, we live some wasteful days. Days when life seems purposeless. You may think, there’s nothing that can be done to change this. But, you can! Making a day productive is in your hands. I’ll give you some ideas that’ll make everyday of your life meaningful. Firstly, to increase the number of hours in your day, you should wake up early. Psychology says man needs motivation to do anything in life. Even to wake up early, you will need to motivate yourself. Give yourself exciting reasons to look forward to the next day. Waking up for an interesting breakfast can for instance, motivate a food lover to start early day. Similarly, find your interest and motivate yourself to wake up to that. Learn to think fast. Dont brood over one thought forever! Act spontaneously. Put the first thought that crosses your mind, into action. Dont wait for the right time, because the right time is right now! Give more importance to your gut feeling. That always gives you the right answer and it thinks faster than your brain. Apply the same trick at work too! Work fast to keep up the enthusiasm and put small targets for each task. Listening to music to keep yourself interested in your work. To work well, your environment also needs to be appropriate. Tasks are better performed in a well lit room. So arrange your work space accordingly for best results. Have a nice day! ..............Kruti Beesam
  We must of have heard this sentence by many people, who are couples, just married or married for long and also from people who are couples to be. People often say that compatibility is the key for any relationship. But what is this compatibility all about? For example, when he/ she getting married or looking for partner, their selection may happen based on looks, professional outlooks, or pay cheques etc.. But the most important thing in choosing a partner should be campatibility of values. Because, looks, professions, careers, tastes will change but values will never change. They remain with you through out. We often say that, you have to take right decissions in marriage; but make the decisions right in your marriage should be the correct attitude. When we call life as a journey, partner is also sailing with us through out.  To make this journey beautiful,  happy and memorable, we certainly have to invest our time and energies. When marriage  is  commitment for the life time you have to keep up your word by working on it continuously. compatability is having this thought of "continuous work" from both sides. However,  when one is weak in the he pair then the other one has to walk that extra mile to reach the goal. For this  you need to have trust, faith and belief in self and others and the philosophy you follow. When this matches  with  each other's thought process, this is called compatibility of values. This is the only thing which can help the couple to hold the relationship. Here the issue is not about inter cast, inter religion or different social and financial status but it's all about how far your values are compatible with your partner's. For example if you both trust in God whether it is Jesus or Jagannath,  you "having trust in the devine" is your compatibility.  you can worship eighter of them but "praying" play important role here. But if one believe in prayers and one won't then this difference of openion may lead to arguments. In a marriage,  when your values differ with each other, belief system is different from each other , there you suffer and your kids suffer more than any body. To avoid such circumstances,  find out your partner,  who is campatible with you in values of life.  In this current scenario,  we have so many options to know each other beforeentering  in to the wedlock. This helps a lot to know about your compatibility levels. Remember, marriage is a relationship where you need to work constantly.  This bonding will be always under construction. Enjoy the journey. ...............Bhavana  
వచ్చే ఉగాది నాటికి ఏపీలో 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్ధలాలు ఇవ్వాలని పట్టుదలగా ఉన్న వైసీపీ సర్కారుకు అడుగడుగునా ఇబ్బందులు తప్పడం లేదు. పలు జిల్లాల్లో ప్రభుత్వ స్ధలాలు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు స్దలాలను కొనుగోలు చేయడం, గతంలో ఇచ్చిన పట్టాలని రద్దు చేసి మరీ తాజాగా వాటిని సేకరించడం వంటి చర్యలకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో భూసేకరణ కోసం క్షేత్రస్ధాయికి వెళుతున్న అధికారులకు ప్రజల నుంచి వ్యతిరేకత తప్పడం లేదు. మరోవైపు సమయం కూడా తక్కువగా ఉన్నందున సమస్య పరిష్కారానికి సీఎం జగన్ నేరుగా సీఎంవోలోని తన టీమ్ ను రంగంలోకి దింపుతున్నారు. ఏపీలోని వివిధ జిల్లాలో దాదాపు పాతిక వేల ఎకరాలకు పైగా భూమిని సేకరించి 25 లక్షల పేదలకు ఉగాది సందర్భంగా ఒక్కో సెంటు చొప్పున పంచేందుకు వైసీపీ సర్కారు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. నవరత్నాలు- పేదలకు ఇళ్ల స్ధలాలు పథకం కింద చేపడుతున్న ఈ కార్యక్రమానికి జిల్లాల్లో భూసేకరణలో పలు ఇబ్బందులు తలెత్తాయి. అనుకున్న స్ధాయిలో ప్రభుత్వ భూముల లభ్యత లేకపోవడంతో గతంలో పేదలకు ఇచ్చిన స్ధలాల్లో ఇళ్లు నిర్మించని వాటని వెనక్కి తీసుకుని తిరిగి వారికే ఇచ్చే కార్యక్రమానికి అధికారులు తెరలేపారు. దీంతో పేద ప్రజల్లో వ్యతిరేకత నానాటికీ పెరుగుతోంది. భూసేకరణ వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు క్షేత్రస్ధాయికి వెళుతున్న అధికారులకు ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదురవుతున్నాయి. పలు జిల్లాల్లో రెవెన్యూ అధికారులపై ప్రజలు తిరగబడే పరిస్ధితి ఉండటంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. మందుగా అనుకున్న ప్రకారం ఉగాది నాటికి భూసేకరణ పూర్తయితే కానీ పథకం అమలు చేయడం సాధ్యం కాదు. దీంతో తాజా పరిస‌్ధితిపై మంగళవారం జరిగిన స్పందన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన జగన్… క్షేత్రస్ధాయిలో తలెత్తుతున్న సమస్యల పరిష్కారానికి ఏకంగా సీఎంవోలోని తన టీమ్ ను రంగంలోకి దింపుతున్నట్లు వెల్లడించారు. సీఎస్ నీలం సాహ్ని, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం, రాజకీయ వ్యవహారాల కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ఇతర కార్యదర్శులు ధనుంజయ్ రెడ్డి, సాల్మన్ ఆరోక్య రాజ్ వంటి వారికి పలు జిల్లాల బాధ్యతలను సీఎం అప్పగించారు. నీలం, ప్రవీణ్ ప్రకాష్ లకు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలను అప్పగించిన సీఎం... అజయ్ కల్లంకు ప్రకాశం, నెల్లూరు జిల్లాలను, ఆరోక్య రాజ్ కు రాయలసీమ జిల్లాలను, ధనుంజయరెడ్డికి ఉత్తరాంధ్ర జిల్లాలను కేటాయించారు. ఆయా జిల్లాల్లో భూసేకరణలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించి ఈ ప్రక్రియ సాఫీగా జరిగేలా చేయడం వీరి బాధ్యత. మార్చి 1 నాటికి ఇళ్ల స్ధలాల కోసం భూములన్నీ పొజిషన్ లోకి తీసుకునేలా చూడాలని ముఖ్యమంత్రి జగన్ తన టీమ్ కు టార్గెట్ పెట్టారు. ప్లాట్లు మార్కింగ్ చేస్తే వెంటనే లాటరీ ద్వారా కేటాయించాలని వారికి సూచించారు. భూసేకరణలో జిల్లా కలెక్టర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, ఎవరి ఉసురూ తగలకుండా చూడాలని సైతం సీఎం జగన్ కోరారు. కలెక్టర్లు ఉదారంగా వ్యవహరించాలని సీఎం వీడియో కాన్ఫరెన్స్ లో పదేపదే కోరారు.
దేశవ్యాప్తంగా ఐటీ ఎగవేత దారులపై వరుస దాడులు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు ఇవాళ విజయవాడలోని కార్పోరేట్ ఆస్పత్రులే లక్ష్యంగా మెరుపు దాడులు చేపట్టారు. ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చూపిస్తున్న పలు కార్పోరేట్ ఆస్పత్రుల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దీంతో కార్పోరేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. నగరంలోని విజయ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రితో పాటు పలుచోట్ల ఇవాళ ఐటీ దాడులు కొనసాగాయి. ఇందులో పలు కీలక డాక్యుమెంట్లు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. రోగుల నుంచి లక్షలాది రూపాయలు ముక్కుపిండి వసూలు చేస్తన్న కార్పోరేట్ ఆస్పత్రులే లక్ష్యంగా ఇవాళ విజయవాడలో ఐటీ అధికారులు మెరుపు దాడలు చేపట్టారు. ఇందులో కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్న పలు కార్పోరేట్ ఆస్పత్రులు ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా ఎగవేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కొన్నిరోజులుగా వీరిపై నిఘా పెట్టిన ఐటీ బృందాలు ఇవాళ మెరుపు దాడులకు దిగాయి. దీంతో కార్పోరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఐటీ దాడుల్లో వివిధ ఆస్పత్రులకు సంబంధించిన కీలక ఆధారాలను ఐటీ అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించిన అన్ని ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇందులో ఆదాయపన్ను చెల్లించకుండా అక్రమాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో కోట్లాది రూపాయల ఆదాయం చూపుతున్నా పన్ను చెల్లించే సమయానికి తక్కువగా చూపుతున్నట్లు ఐటీ సోదాల్లో తేలింది. ఇవాళ ఉదయం నుంచి విజయవాడలోని పలు ఆస్పత్రుల్లో సోదాలు కొనసాగుతున్నాయి. దీంతో ఆయా ఆస్పత్రులకు వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఐటీ అధికారులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. ఐటీలో ఆదాయాన్ని తక్కువగా చూపుతున్న వారితో పాటు భవిష్యత్తులో రిటర్న్స్ దాఖలు చేయని ఆస్పత్రుల్లోనూ సోదాలు నిర్వహిస్తామని ఐటీ వర్గాలు వెల్లడించాయి.
“చేసుకున్నోడికి చేసుకున్నంత మహాదేవా” అన్న సామెత అందరికీ తెలిసిందే..అచ్చు అలానే ఉంది కొందరి పరిస్థితి. మింగలేక కక్కలేక అన్నట్లుంది వారి స్థితి. పైకి చెప్పలేరు లోపల దాచుకోనూలేక సతమతం అవుతున్నారు. ఇంతకీ వీరెవరు అనుకుంటున్నారా? రాజధాని గ్రామాల ప్రజలు.. ఆ ప్రజల్లో కూడా 15 వేల కుటుంబాలు.. ఈ 15 వేల కుటుంబాల ప్రత్యేకత ఏమిటనుకుంటున్నారా? వీరంతా రెడ్లు.. అమరావతి నుంచి రాజధాని తరలిపోతే వీరంతా అక్కడ ఒక్క రోజు కూడా ఉండలేరు. జీవనోపాధి కోసం బయటకు వెళ్లాల్సిందే. ఏం చేయాలో అర్ధం కాక రెడ్లంతా జుట్టుపీక్కుంటున్నారు. పైకి విమర్శించలేరు. ఊరుకోనూ లేరు. అలా అని రాజధాని ఉద్యమంలో పాలుపంచుకోనూ లేరు..పాపం. అసలేం జరిగిందో చూద్దాం.. ఈ కుటుంబాలు రాజధాని గ్రామాలలో తరతరాలుగా ఉంటున్నారు. వీరిలో చాలా మందికి ఇక్కడ ఎకరం నుంచి 20 ఎకరాల వరకూ భూములు ఉన్నాయి. ఇంతకాలం పంటలు పండించుకుంటూ సంతోషంగా ఉండేవారు. ఈ ప్రాంతానికి రాజధాని వస్తుందని వారు కూడా అనుకోలేదు. రాష్ట్ర విడిపోవడం రాజధాని రావడం జరిగిపోయింది. రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ లో ఈ 15 వేల కుటుంబాలూ పాలు పంచుకున్నాయి. కొందరు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. మరికొందరు అన్ని బేరీజు వేసుకుని చివరిలో ఇచ్చారు. మరి కొందరు సగం భూమి అమ్ముకున్నారు.. సగం ఉంచుకున్నారు. ఎప్పుడైతే రాజధాని వచ్చేసి భూముల విలువ పెరిగిందో అప్పటికే రాజధాని కోసం భూములు ఇచ్చిన ఈ 15 వేల కుటుంబాలలోని వారు చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులుగా మారిపోయారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంటే ఏదో కోట్ల రూపాయల టర్నోవర్ చేసేంత కాదు. తమకు పరిచయం ఉన్నవారి భూములు అమ్మిపెట్టడం, తమకు తెలిసిన వారు వస్తే భూములు కొనిపించడం.. మధ్య వర్తులుగా కొంత కమిషన్ తీసుకోవడం.. అంతే. ఏదోలా వ్యవసాయంపై తగ్గిన ఆదాయాన్ని భర్తీ చేసుకుంటూ సంతోషంగానే ఉన్నారు. ఇప్పుడు భూముల అమ్మకాలు కొనుగోళ్లు దాదాపుగా పూర్తి అయినందున ఫ్లాట్లు, ఇళ్లు అమ్మకాలపై వీరు ఆధారపడ్డారు. ఇంతవరకూ బాగానే ఉంది గత ఎన్నికల్లో వీరంతా చందాలు పోగేసుకుని మరీ వైసిపి అభ్యర్ధులను గెలిపించుకున్నారు. కమ్మ వాళ్ల రాజ్యం అంతరించిందని సంబరాలు చేసుకున్నారు. కట్ చేస్తే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు వారికి తెలిసి వచ్చింది. 15 వేల కుటుంబాలకు చెందిన దాదాపు 60 నుంచి 70 వేల మందికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. దాదాపు 12 నుంచి 14 వేల ఎకరాల భూమిని రాజధానికి ఇచ్చింది రెడ్డి కులస్తులే. ఇటు భూమీ పోయింది..అటు రియల్ ఎస్టేట్ వ్యాపారమూ పోయింది.. కమ్మ రాజ్యం అంతరించిందని, రెడ్డి రాజ్యం వచ్చిందని సంతోషించే లోపే వారి ఆనందం కూడా ఆవిరైంది. రెడ్డి రాజ్యాన్ని విమర్శిస్తే కమ్మోళ్ల దృష్టిలో చులకన అవుతామని, విమర్శించకపోతే జీవనోపాధి పోతోందని రెడ్లు అంతర్గతంగా కుమిలిపోతున్నారు.
    We all know that Holy Basil or the Tulsi as it is commonly known in Indian households is an integral part of the Hindu household. Popularly known in the western world as Holy Basil, where it is used in salads and Italian cusines and the Latin name is Ocimum tenuiflorum or Ocimum sanctum. Medicinal Value Tulsi is widely used in Ayurveda for medicinal purposes. Eugenol which is found in the plant is believed to be the main element responsible for the medicinal properties of the Holy basil. The plant has also been found to have antimicrobial properties, because of  the ursolic acid and carvacrol constituents found in it. The tulsi/basil plant is used to cure most the common diseases, has anti-aging benefits as well as being useful for diabetics and people with heart disorders, cleans the skin when the juice is applied on the face.  For Respiratory problems The leaves of the tulsi are effective expectorants and promote the release of mucus in bronchitis and asthma, thus, facilitating breathing. A decoction made of tulsi leaves, honey and ginger is effective for asthma, bronchitis and influenza. Immune-enhancing Along with antimicrobial properties, the phytochemicals present in tulsi offer antioxidant as well as immune-enhancing qualities. It also has adaptogenic properties, which enhances the body's ability to adapt to stress. If you have a garden, grow the plant in a single line closely in front of the door or if you have French Windows you could grow it near them.  The idea is  to grow them like a hedge and get as much benefit of the plant. It Is believed that air around the house gets purified because of  the phytochemicals present in tulsi/amla. If you live in an apartment you can always grow the Holy basil in a small pot as well and purify the air in your balcony. If you are living in cold countries where there is no sunlight throughout the year and it is not possible to grow the plant, you could buy a  bottle of basil/ tulsi juice or oil or dried tulsi/basil powder and keep it  in your home. You can banish the common cold and cough and is a wonderful medicine for children too .You could add a spoon of honey to the juice and give it to the children. It also makes a great mosquito repellant and keeps them away from you when you rub the tulsi/basil oil. So try and make this wonderful plant an integral part of your home!  
  We are all aware of the fact that the food that is popular among the population today, does not make any positive contribution to our health. So its time we give up our present food habits and turn towards a balanced diet. When I say balanced diet I mean, a meal consisting of fruits, vegetables, protein and dairy products. We have only read about this for a science exam in school. Its time we put that lesson to practice. This article will describe to you why each of the above mentioned things are essential and you decide whether to accept or reject my suggestion. Fruits and vegetables will give you those vitamins and nutrients that are exclusively available through them. They are low in fat content and high in water so you don't have to worry about adding to your calories. The next thing that must be on your plate is a good source of protein. The main function of proteins is to repair and help in the growth of your hair and nails along with helping in healing of wounds. So if you want lovely hair and quickly healing wounds, protein is a must! There is nothing new I can say about the importance of dairy products. Its known to all that they are the richest sources of calcium. So if you dont want a calcium deficiency, make sure you get at least 200ml of milk everyday. What are you waiting for? Start a healthy life today! -Kruti Beesam  
      Papaya is a deliciously sweet fruit which has numerous nutritional benefits. It is very low in calories and also contains no cholesterol. Excellent for those who want to lose weight, consider eating papaya every day to maximize its health benefits.   Also a beauty food, papaya is low in fructose and is excellent for digestion! The antioxidant nutrients found in it, including Vitamins C and E and beta-carotene, are great at reducing inflammation and acne. Moreover, Vitamin C may also protect your skin against sun damage. Once considered quite exotic, they can now be found in markets throughout the year and if you have tree at home you can enjoy its benefits year long. The fruit, as well as the other parts of the papaya tree, contain papain, an enzyme that helps digest proteins. This enzyme is especially concentrated in the fruit when it is unripe. Health Benefits Papayas are a rich source of nutrients like carotenes, vitamin C and flavonoids; e B vitamin, folate and pantothenic acid; and rich in minerals like potassium, copper, and magnesium; and fiber. To categorize the health benefits without going into depth, the health benefits of papaya include: ·        It’s an antioxidant ·        Protection against Heart Disease ·        Promotes digestive health ·        Anti-Inflammatory ·        Supports the Immune system ·        Protection against Macular degeneration ·        Protects  against Rheumatoid arthritis ·        Protects against colon cancer   276.00 grams of Papaya contains 119 Calories Nutrient Values Vitamin C 224.1% Folate        25.5% Fiber         18.7% Vitamin A 14.5% Magnesium 14.4% Potassium    14.3% Copper        13.3% Pantothenic Acid  10.6%
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.