ఏదో ఒక సందర్భంలో మనం ఫోన్ మర్చిపోతుంటాం. తెలిసిన తరువాత గాబరా పడిపోతాం. ఇప్పుడు దాని గురించి కంగారు పడాల్సిన పనిలేదు. ఎందుకంటే కనిపించకుండా పోయిన ఫోన్ వెతికేందుకు గూగుల్ కొత్తగా ఓ ఫీచర్ ను రూపొందించింది. మొబైల్ డెస్క్ టాప్ పై ఉండే గూగుల్ సెర్చ్ లో ఫైండ్ మై ఫోన్ అని టైప్ చేస్తే అది మన ఫోన్ ఉన్న లొకేషన్ ను తెలుపుతుంది. దీనికి మనం చేయాల్సింది ఏంటంటే మొబైల్ కొనుగోలుదారులు తమ ఫోన్ లో లేటెస్ట్ వెర్షన్ తో ఉన్న గూగుల్ యాప్, స్మార్ట్‌ఫోన్ లొకేషన్ సర్వీస్ ఆప్షన్ పనిచేసే విధంగా చూసుకోవాలి. రింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆండ్రాయిడ్ డివైజ్ మేనేజర్ ద్వారా ఫోన్ ఐదు నిమిషాలపాటు రింగ్ అయ్యేలా చేస్తుందని గూగుల్ అధికారులు తెలిపారు.
ఇప్పుడు అందరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. ఎంత మాత్రం స్మార్ట్ ఫోన్లు అయినా అవి కూడా అప్పుడప్పుడు సతాయిస్తుంటాయి. అయితే స్మార్ట్‌ఫోన్‌తో చిక్కులు  అందరికీ కామనే. అయితే వాటిలో కొన్ని మనం సులభంగా పరిష్కరించుకోవచ్చు. అవేంటో చూద్దాం. గూగుల్ ప్లే స్టోర్ క్రాష్ అవుతూంటే... స్మార్ట్‌ఫోన్‌లలో ఇన్‌బిల్ట్‌గా వచ్చే గూగుల్ ప్లే స్టోర్ తరచూ క్రాష్ అవడం అందరికీ అనుభవమైన సమస్య. క్యాష్ మెమరీలో తేడాలు రావడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా క్యాష్ మెమరీని తీసేస్తే సమస్య తీరినట్లే. దీనికి ముందుగా సెట్టింగ్స్‌లోకి వెళ్లి తరువాత ఆప్స్‌ను సెలెక్ట్ చేసుకోండి. కుడివైపునకు స్వాప్ చేస్తూ వెళితే ‘ఆల్’ అన్న ట్యాబ్ కనిపిస్తుంది.  ఆల్ ను క్లిక్ చేసి దాంట్లో గూగుల్ ప్లే స్టోర్‌ను గుర్తించి దానిలో ఉన్న క్యాష్ మెమరీని తుడిచేయండి. సిస్టమ్ యూజర్ ఇంటర్ఫేస్ ఆగిపోతే... స్మార్ట్‌ఫోన్ స్క్రీన్  ఉన్నట్టుండి ఫ్రీజ్ అవడం.. మళ్లీ రీస్టార్ట్ చేస్తే పనిచేయడం చూస్తాం. కొన్నిసార్లు రీస్టార్ట్ చేసినా కూడా స్క్రీన్‌లోని యూజర్ ఇంటర్ఫేస్ పనిచేయదు. అప్పుడు దీనికి సంబంధించి క్యాష్ మెమరీని తొలగించాలి. దీనివల్ల సమస్య తీరుతుంది. క్యాష్ మెమరీని తొలగించాలి అంటే మొదట్లో చెప్పినట్లుగా సెట్టింగ్స్‌లోని ఆప్ ట్యాబ్‌కు, అందులోని ఆల్ సెక్షన్‌కు వెళ్లి ఇప్పుడు యూజర్ ఇంటర్ఫేస్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. దానిలో ఉన్న క్యాష్ మెమరీని క్లియర్ చేసుకోవాలి. వైఫై నెట్‌వర్క్‌ సరిగా కనెక్ట్ కాకపోతే... కొన్నిసార్లు వైఫై కనెక్షన్ సరిగా కనెక్ట్ కాదు. ఈ సమస్యకు ఎక్కువగా మీ స్మార్ట్‌ఫోన్‌లోని రూటర్ లోపం కారణమవుతుంటుంది. అలాంటప్పుడు ఫోన్‌ను, రూటర్ ను ఒకసారి రీస్టార్ట్ చేయడం ద్వారా వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ కావచ్చు. ప్లే స్టోర్‌ ద్వారా అప్లికేషన్లు డౌన్‌లోడ్ కాకపోతే... సాధారణంగా మనకు కావలసిన ఆప్స్ ను ప్లే స్టోర్‌ నుండి డౌన్‌లోడ్ చేసుకుంటాము. కొన్ని సార్లు అప్లికేషన్లు డౌన్‌లోడ్ కాకుండా ఇబ్బంది పెడుతూంటాయి. అప్పుడు గూగుల్ ప్లే స్టోర్ క్యాష్ మెమరీని వైప్ చేసుకోవాలి. ఇంకో పద్ధతి కూడా ఉంది. గూగుల్ ప్లే హిస్టరీని ఇరేజ్ చేయడం. ముందు చూసిన విధంగానే హిస్టరీని తొలగించాలంటే ప్లే స్టోర్‌లోకి వెళ్లి సెట్టింగ్స్‌ను ఓపెన్ చేసి, అందులో క్లియర్ హిస్టరీని సెలెక్ట్ చేసుకుంటే సరి.   వీడియో ప్లే కాకపోతే... వీఎల్‌సీ, ఎంఎక్స్ ప్లేయర్లు చాలావరకూ ఫార్మాట్లను సపోర్ట్ చేస్తాయి.వీటిని ఉపయోగించి చూడండి. అప్పటికీ ప్లే కాకపోతే దాంట్లోని ఫార్మాట్ సపోర్ట్ చేయడం లేదని అర్ధం. స్కానింగ్ కోసం... మనకేదైనా స్కానింగ్ కావాలంటే ఏం చేస్తాం? దగ్గర్లో ఉన్న డీటీపీ సెంటర్‌కు వెళ్తాం. అలా కాకుండా చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే ఒక చిన్న అప్లికేషన్ ద్వారా ఈ పని మీరు ఎక్కడుంటే అక్కడే చేసుకోవచ్చు. కొత్తగా స్మార్ట్ ఫోన్లకు ఆఫీస్ లెన్స్ పేరుతో ఓ అప్లికేషన్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది. మీరు స్కాన్ చేయాలనుకుంటున్న రసీదు లేదా కాగితాన్ని ఫొటో తీసి అప్లికేషన్‌ను రన్ చేస్తే చాలు. మీకు నచ్చిన ఫార్మాట్ (పీడీఎఫ్, డాక్స్, పీపీటీఎక్స్, జేపీజీ)లోకి మార్చేసి ఇస్తుంది.
  మనం ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడాలని అనుకున్నప్పుడే మొబైల్ లో ఛార్జింగ్ అయిపోతుంది. మళ్లీ అది ఛార్జ్ అవ్వాలంటే ఎలా లేదనుకున్నా ఓ 15 నిమిషాలు పడుతుంది. అలా కాకుండా ఒక్క నిమిషంలోనే రీఛార్జయ్యే అల్యూమినియం బ్యాటరీని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది ప్రస్తుతం వాడుకలో ఉన్న లిథియం-ఐయాన్ బ్యాటరీలా పేలదని, అల్కాలైన్ బ్యాటరీలా పర్యావరణానికి హాని కలిగించదని యూనివర్సిటీ ప్రొఫెసర్ హోంగ్జీ దాయ్తె తెలిపారు. ఆ బ్యాటరీల కంటే ఈ అల్యూమినియం బ్యాటరీ చాలా తక్కువ ధర అని తెలిపారు. ఈ బ్యాటరీని స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లకు అనుగుణంగా మలుచుకోవచ్చని ఆయన చెప్పారు. మామూలు బ్యాటరీలకు రీఛార్జ్ సైకిల్ 1000 సార్లు మాత్రమే ఉంటుందని, దీనిని మాత్రం 7,500 సార్లు రీఛార్జ్ చేసుకోవచ్చని అన్నారు.
మైక్రోసాఫ్ట్ సంస్థ మరో రెండు కొత్త మొబైల్ మోడల్స్ లూమియా 640, లూమియా 640 xL లను భారత మార్కెట్ లోకి విడుదల చేసింది. లూమియా 640 ధర రూ. 11,999 లూమియా 640 xL ధర 15,799 గా ఉన్నాయి. రెండు మోడల్స్ ఎల్టీఈ వెర్షన్ లో కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం భారత్ లో మాత్రం ఈ ఎల్టీఈ వెర్షన్ అందుబాటులో లేదని మైక్రోసాఫ్ట్ మొబైల్స్ డైరెక్టర్ టీఎస్ (సౌత్) శ్రీధర్ తెలిపారు. కాగా లూమియా 640 మాత్రం ఆన్ లైన్ సైట్ ఫ్లిఫ్ కార్ట్ ద్వారా మాత్రమే విక్రయించబడుతుంది. లూమియా 640 xL బయట మొబైల్ మార్కెట్లో దొరుకుతోంది. లూమియా 640 ప్రత్యేకతులు: * డ్యుయల్ సిమ్ * 5 అంగుళాల డిస్ ప్లే * 1.2 GHz క్వాడ్ కోర్ క్వాలికమ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ * 8.1 లూమియా డెనిమ్ ఓఎస్ * 8 ఎంపీ బ్యాక్ కెమెరా, 1 ఎంపీ ఫ్రంట్ కెమెరా * 8 జీబీ ఇంటర్నల్ మెమరీ లూమియా 640 XL ప్రత్యేకతులు: * 5.7 అంగుళాల డిస్ ప్లే * 13 ఎంపీ బ్యాక్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా * 3000 ఎంఏహెచ్ బ్యాటరీ * 1.2 GHz క్వాడ్ కోర్ క్వాలికమ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్
  కంప్యూటర్ దిగ్గజం ఆపిల్ సెల్‌ఫోన్ల రంగంలోకి కూడా ప్రవేశించి తన సత్తా ఏమిటో నిరూపించుకుంది. ఇటీవలి కాలంలో ఆపిల్ సంస్థ తన పరిధిని మరింత విస్తృతం చేసుకుంటూ ఇతర రంగాలలో కూడా ప్రవేశించే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఆపిల్ సంస్థ కారును రూపొందించే పనిలో నిమగ్నమై వుంది. ఇప్పుడు ఈ సంస్థ ఇళ్ళకు, కార్యాలయాలకు వేసే తాళాల తయారీ రంగంలో కూడా కృషిని ప్రారంభించింది. తాళం చేతుల అవసరం లేకుండా కేవలం ఫోన్ల ద్వారా వేయగలిగిన తాళాలను రూపొందించే పనిలో ఆపిల్ సంస్థ వుంది. ఈ తాళాల తయారీకి సంబంధించిన ప్రయోగాలు చివరి దశలో వున్నట్టు తెలుస్తోంది. సాధ్యమైంత త్వరలో ఆపిల్ తాళాలు మార్కెట్లోకి రానున్నాయి. ఆపిల్ వర్గాలు చెబుతున్నదాని ప్రకారం ఈ సంస్థ రూపొందిస్తున్న తాళాలకు మన చేతిలో వుండే సెల్‌ఫోనే తాళం చెవి. ఈ తాళాలు పూర్తిగా ఎలక్ట్రానిక్‌గా వుంటాయి. ఆపిల్ సంస్థ రూపొందించే తాళాలు ఇప్పుడున్న విధంగా తాళం కప్పల రూపంలో వుంటాయా లేక తలుపులోనే ఇమిడిపోయి వుంటాయా అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. అయితే తాము విడుదల చేయబోయే తాళలు తాళాల రంగంలోనే కొత్త శకానికి నాంది అవుతాయని ఆపిల్ సంస్థ వర్గాలు చెబుతున్నాయి.
  ద్విచక్ర వాహనాలు తయారుచేసే హీరో ఎలక్ట్రిక్ సంస్థ విద్యుత్ తో నడిచే ఇ-రిక్షా రాహీని గురువారం ఆవిష్కరించింది. దీని ఖరీదు రూ 1. 10 లక్షలు. ఈ వాహనానికి 1000 వాట్ల సామర్ధ్యం కలిగిన మోటార్ ఉందని, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 90 కి.మీలు ప్రయాణించవచ్చని హీరో ఎలక్ట్రిక్ సీఈఓ సోహిందర్ గిల్ తెలిపారు. దీని లోపల ఎల్ఈడీ దీపాలు, యూఎస్బీ మొబైల్ ఛార్జర్, కర్టెన్లు వంటి సౌకర్యాలు ఉన్నాయి. సంస్థలో ఉన్న 120 మంది డీలర్ల వద్ద ఈ వాహనాలు లభిస్తున్నాయని, తాము ఇప్పటికే లక్షకు పైగా ద్విచక్ర వాహనాలు విక్రయించామని సోహిందర్ తెలిపారు. ఇ- రిక్షాకు పశ్చిమ బంగా, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో మంచి ఆదరణ లభించే అవకాశం ఉందని అన్నారు.
సోషల్ నెట్ వర్కింగ్ లో ఫేస్బుక్ చాలా ప్రాచుర్యం పొందిందని మనకు తెలుసు. ఇప్పుడు ఈ ఫేస్ బుక్ రిఫ్ అనే మరో కొత్త యాప్ ను ప్రపంచ వ్యాప్తంగా 15 భాషల్లో విడుదల చేసింది. ఆండ్రాయిడ్ ఫోన్లు, ఐవోఎస్ ఫోన్లకు సపోర్ట్ చేసేలా దీనిని ప్రారంభించింది. 20 సెకన్ల నిడివిలో ఒక వీడియోను రికార్డు చేసి అవతలి వ్యక్తికి పంపించవచ్చు. కొద్ది నిడివి ఉన్న వీడియోలను రికార్టు చేసేందుకు ఈ రిఫ్ యాప్ చాలా బాగా ఉపయోగపడుతుందని ఫేస్ బుక్ రిఫ్ ప్రొడక్ట్ మేనేజర్ జోష్ మిల్లర్ తెలిపారు. ఫేస్బుక్ ద్వారా కానీ, మరే విధంగానైనా కానీ వీటిని పంచుకోవచ్చని చెప్పారు. ఈ రిఫ్ యాప్ రూపొందించడానికి ఈ మధ్య కాలంలో ఎక్కువ వార్తల్లో కనిపించిన ఐస్ బకెట్ తో స్నానం చేసిన వీడియోల ప్రోత్సాహమే అని జోష్ మిల్లర్ అన్నారు.   రిఫ్ యాప్ ప్రత్యేకతలు:   * రిఫ్ ద్వారా వీడియోలు మాత్రమే రికార్డు చేయగలము. కొత్తవి అప్లోడ్ చేయడం సాధ్యం కాదు.  * వీడియో రికార్డింగ్ స్టార్ట్ అవగానే 3-2-1 అంటూ కౌంట్ డౌన్ ప్రారంభమవుతుంది. * దీనికి పోస్టింగ్ ముందు ధ్రువీకరించుకునే అవకాశం మాత్రం ఉంది. * ఒకేసారి పలు వీడియోలను రికార్డు చేసే అవకాశంగానీ, ఎడిట్ చేసే అవకాశంగానీ లేదు. * కామెంట్పం పిండం, లైక్ కొట్టడం సాధ్యం కాదు. * వీడియో వచ్చిన తరువాత దానికి బదులుగా మరో వీడియోను షూట్ చేసి మాత్రమే పంపించేందుకు అవకాశం ఉంది.
  యాపిల్ ఐ ఫోన్ 6కు పోటీగా శామ్‌సంగ్ కంపెనీ గెలాక్సీ ఎస్6 గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. సోమవారం భారత మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్‌లను శామ్‌సంగ్ కంపెనీ ఆవిష్కరించింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌లను ముందు బార్సినాలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో కంపెనీ ఆవిష్కరించింది. అంతర్జాతీయంగా విడుదల చేసిన 3 వారాల తర్వాత వీటిని భారత మార్కెట్లోకి తీసుకొచ్చామని శామ్‌సంగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మార్కెటింగ్ (మొబైల్ అండ్ ఐటీ) అశిమ్ వార్సి చెప్పారు. సోమవారం నుండి బుకింగ్ లు ప్రారంభించామని, వచ్చే నెల 10 నుంచి ఫోన్ విక్రయాలు జరుగతాయని తెలిపారు. ఈ ఫోన్‌ల తయారీలో భారత రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ టీమ్ తగిన పాత్ర పోషించిందని ఆశిమ్ వార్సి తెలిపారు.   గెలాక్సీ ఎస్6 ప్రత్యేకతలు: లాలీపాప్ ఓఎస్, 5.1 అంగుళాల డిస్‌ప్లే 16 మెగా పిక్సెల్ రియర్ కెమెరా 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా వెర్లైస్ చార్జింగ్, 10 నిమిషాల చార్జింగ్‌తో 4 గంటల పాటు ఉపయోగించుకోవచ్చు. గెలాక్సీ ఎస్6లో 2,550 ఎంఏహెచ్ బ్యాటరీ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ ప్రత్యేకతలు: లాలీపాప్ ఓఎస్, 5.1 అంగుళాల డిస్‌ప్లే, ఎస్6 ఎడ్జ్‌లో డ్యూయల్ ఎడ్జ్ స్కీన్ ఉంటుంది 16 మెగా పిక్సెల్ రియర్ కెమెరా 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా వెర్లైస్ చార్జింగ్, 10 నిమిషాల చార్జింగ్‌తో 4 గంటల పాటు ఉపయోగించుకోవచ్చు. గెలాక్సీ ఎస్6 ఎడ్జ్‌లో 2,600 ఎంఏహెచ్ బ్యాటరీ ధరలు..  మెమరీ        ఎస్6    ఎస్6 ఎడ్జ్  32 జీబీ        49,000    58,900  64 జీబీ        55,900    64,900  128 జీబీ        61,900    70,900
  త్వరలో గూగుల్ నుండి డ్రైవర్ అవసరం లేని కార్లు కూడా రాబోతున్నాయి. టెక్నాలజీలో ఎప్పుడూ వినూత్న ప్రయోగాలు చేసే గూగుల్ సంస్థ ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను తయారుచేయబోతోంది. డ్రైవర్ అవసరం లేని ఈ కార్లను 2020 నాటికి మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తున్నామని గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల విభాగం అధిపతి క్రిస్ ఉర్మ్ సన్ తెలిపారు. అయితే భద్రత విషయంలో అత్యాధునిక టెక్నాలజీతో ఇప్పుడు ఎన్నో కార్లు అందుబాటులో ఉన్నా.. అవి అన్ని సమయాలలో రక్షణ కల్పించలేవని, రోడ్డు ప్రమాదాలు తగ్గాలంటే డ్రైవర్ లేని కార్లతోనే సాధ్యమని ఆయన అన్నారు. మరోవైపు ఆపిల్ సంస్థ కూడా గూగుల్ కు పోటీగా ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను తయారుచేస్తున్నట్లు సమాచారం. ఈ సంస్థ కూడా గూగుల్ మాదిరిగానే 2020 నాటికే కారును విడుదుల చేయాలని నిర్ణయించుకొంది. అయితే ఈ కారు పూర్తిగా సాఫ్ట్ వేర్ నియంత్రణలో రాడార్, సెన్సర్ల ఆధారంగా పనిచేస్తుంది. స్మార్ట్ ఫోన్ తో అనుసంధానమైన ఈ కారు వెళ్లాల్సిన, రావాల్సిన ప్రదేశం ఏమిటో ఆదేశిస్తే చాలు తన పని తాను చేసుకుపోతోంది.
  డాటావిండ్ సంస్థ ఇంటర్నెట్ సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సంస్థ 2జి 4స్మార్ట్ ఫోన్, 3జి 4స్మార్ట్ ఫాన్ అను రెండు సరికొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ సంస్థ సీఈఓ సునీత్ సింగ్ తులి హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో వీటిని విడుదల చేశారు. 2జి 4స్మార్ట్ ఫోన్ ను 1,999 రూపాయలకు, 3జి 4స్మార్ట్ ఫాన్ ను 2,999 రూపాయలకు అందిస్తున్నట్లు తులి వెల్లడించారు. 2జి 4స్మార్ట్ ఫోన్ 3.5 అంగుళాల డిస్ ప్లే, డ్యూయల్ సిమ్, ఎడ్ట్ నెట్ వర్క్ కంపాటబుల్ కలిగి ఉంటుందని, 3జి 4స్మార్ట్ ఫాన్ 4 అంగుళాల డిస్ ప్లే, డ్యూయల్ సిమ్, డ్యూయల్ కెమెరా కలిగి ఉంటుందని తెలిపారు. ఉచిత ఇంటర్నెట్ సేవలు అందించడానికి రిలయన్స్ కమ్యూనికేషన్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నామని, మరో 90 రోజుల్లో తమ వ్యాపారాన్ని భారత్ లో నెలకొల్పనున్నట్లు చెప్పారు.
  అమెరికన్ రోబోటిక్ శాస్త్రవేత్తలు వెరైటీ రోబోలను తయారుచేయడంలో ముందంజలో ఉన్నారు. వాళ్లు ఈసారి రెండుకాళ్లతో అత్యంత వేగంగా పరిగెత్తే రోబోను అభివృద్ధిపరిచారు. అయితే ఇందుకు ముందే రోబోలు ఉన్నా... వాటికి ధీటుగా అన్నింటికన్నా వేగంగా పరిగెత్తగలదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీనికి ఏట్రియాన్ అనే పేరు పెట్టారు. రెండు కాళ్లతో వేగంగా దూసుకెళ్లగలిగే పక్షుల శరీర నిర్మాణం ఆధారంగా ఈ రోబోను రూపొందించినట్లు పరిశోధనలో పాల్గొన్న జొనాథన్ హర్ట్స్ తెలిపారు. మార్గమధ్యంలో ఎలాంటి ఎగుడుదిగుళ్లు ఉన్నా కూడా కింద పడిపోకుండా పరిగెత్తే సామర్ధ్యం ఈ రోబోకు ఉందన్నారు. అంతే కాకుండా ఏదైనా ప్రమాదం సంభవించినపుడు అక్కడికి సహాయక సిబ్బంది వెళ్లడం సాధ్యం కానప్పుడు ఈ రోబోను పంపించి తగు చర్యలు చేపట్టవచ్చని వారు తెలిపారు. ఈ రోబోను ఒరెగాన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇంజినీరింగ్ కళాశాల నిపుణులు 'రక్షణ ఆధునిక పరిశోధన ప్రాజెక్టుల సంస్థ', 'మానవ శాస్త్రపరిజ్ఞాన పథకం' ఆర్ధికసాయంతో తయారుచేశారు.
  ఇప్పటి వరకూ మార్కెట్ లో బ్లాక్ బెర్రీ టాబ్లెట్లకు మంచి క్రేజ్ లేదు. ఇది మొదట తెచ్చిన ప్లేబుక్ సరైన సాఫ్ట్ వేర్ అనుసంధానం లేకపోవడం వల్ల మార్కెట్ లో ఫ్లాప్ అయింది. అప్పటి నుండి ఈ కంపెనీ టాబ్లెట్ లను మార్కెట్ లోకి విడుదల చేయలేదు. అయితే ఇప్పుడు ఈ కంపనీ సెక్యూటాబ్లెట్ పేరు మీద ఒక టాబ్లెట్ ను మార్కెట్ లోకి విడుదుల చేయనుంది. శామ్సంగ్ గెలాక్సీ టాబ్ s 10.5 హార్డ్ వేర్ లో కొన్ని మార్పులు చేసి ఈ టాబ్లెట్ కి ఉపయోగించారు. డేటా కమ్యూనికేషన్, వాయిస్ గుప్తీకరించడానికి సెక్యూస్మార్ట్ ను ఉపయోగిస్తున్నారు. దీనిని బ్లాక్ బెర్రీ గత సంవత్సరమే సెక్యూస్మార్ట్ టెక్ నుండి కొనుగోలు చేసింది. ఫేస్ బుక్, యూ ట్యూబ్ లాంటి యాప్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా రావడానికి దీనిలో సాఫ్ట్ వేర్ సిస్టమ్ కొరకు ఐబీఎంతో టైఅప్ అయింది.
  యూట్యూబ్... ద మోస్ట్ వాచ్డ్ వీడియో సైట్... నో డౌట్! గూగుల్ సంస్థకు చెందిన ఈ సైట్ ఇప్పుడు సరికొత్తగా 360 డిగ్రీ వీడియోలు (రీచోస్ తీటా, కోడాక్ పిక్స్ ప్రో ఎస్పీ360 వంటి ప్రత్యేక కెమెరాలతో తీసిన వీడియోలు) అప్ లోడ్ చేసుకునేందుకు వీలుగా మార్పులు తీసుకొస్తొంది. ఆండ్రాయిడ్ మొబైల్ లో యూ ట్యూబ్ యాప్ లో వీడియో ప్లే అవుతున్నప్పుడు ఫోన్ కానీ టాబ్లెట్ కానీ అటూ ఇటూ తిప్పడం వల్ల వివిధ కోణాలు చూడగలుగుతాం. అలాగే యూట్యూబ్.కామ్ లో ఈ ఎఫెక్ట్ ద్వారా మౌస్ ఉపయోగించి వ్యూ పాయింట్ నుండి డ్రాగ్ చేస్తే చుట్టూ ఉన్న ప్రదేశం చూడగలుగుతాం. దీనికి బుబల్ కామ్, గిరోప్టిక్స్ 360 కామ్, ఐసీ రియల్ టెక్స్ ఎలై, కోడాక్స్ ఎస్పీ360, రీచోస్ తీటా కెమెరాలు అనువైనవిగా కంపెనీ చెపుతోంది. అలాగే వీడియోస్ ఎలా అప్ లోడ్ చేయాలో స్క్రిప్ట్ ద్వారా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుందట. ఐఫోన్, ఐ పాడ్ లాంటి డివైస్ లలో టెస్ట్ చేయాడానికి ఈ ఫీచర్ రెడీ అయిందని చెప్పారు.
  చైనా యాపిల్ గా పేరొందిన షియోమి కంపెనీ రెడ్ ఎంఐ2 స్మార్ట్ ఫోన్ తోపాటు ఎంఐ ప్యాడ్ టాబ్లెట్ పేరుతో మరో రెండు కొత్త డివైజ్ లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. వీటిలో రెడ్ ఎంఐ2 ధరను రూ. 6999గా, ఎంఐ ప్యాడ్ ధరను రూ. 12,999గా నిర్ణయించింది. రెడ్ ఎంఐ2 స్మార్ట్ ఫోన్ రిజిస్ట్రేషన్ గురువారం సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభం.మార్చి 24వ తేదీ నుండి ఫ్లిప్ కార్ట్ల్ లో ఫ్లాష్ అమ్మకాలు ఉంటాయి. మొదటి విడతలో 30 వేల నుండి 40 వేల ఫోన్లు అమ్మే అవకాశం ఉందని షియోమి ఇండియా హెడ్ మను జైన్ చెప్పారు. రెడ్ ఎంఐ2 ప్రత్యేకతలు: * 4.7 అంగుళాల డిస్ప్లే * క్వాడ్ కోర్ 64 బిట్ స్నాప్డ్రాగన్ 410 ప్రాసెసర్, * 4జి డ్యూయల్ సిమ్ * 8 ఎంపీ బ్యాక్ కెమెరా * 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఎంఐ ప్యాడ్ ప్రత్యేకతలు: 7.9 అంగుళాల డిస్ప్లే.  అయితే వీటిలో కేవలం వై-ఫై ఆధారంగానే నెట్ అందుబాటులోకి వస్తుంది.

అందరికి టెస్ట్‌ చేయ‌డం ఆచరణ సాద్యం కాదు!

ఇప్పుడు ఏదైనా పొరపాటు చేసి క‌రోనా వ్యాప్తికి అవకాశం ఇస్తై భవిష్యత్తులో మనల్ని మనం క్షమించుకోలేం. కరోనా వ్యాప్తి అగిన తర్వతానే లాక్ డౌన్ ఎత్తేయాలి. కరోనా కట్టడికి సామాజిక దూరం ఒక్కటే మార్గం. అభివృద్ది చెందిన దేశాలు సైతం కరోనా మహ్మమారిని ఎదుర్కోలేక కష్టాలు పడుతున్నాయ‌ని మంత్రి కెటి రామారావు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో అందరికి టెస్టులన్న అలోచన ఆచరణ సాద్యం కాదు. విచ్చలవిడి టెస్టులకు అనుమతిస్తే ప్రజల భయాందోళనల నేపధ్యంలో టెస్టు సెంటర్ల దోపిడీకి దారి తీస్తుంది. అవసరం అయిన వారీకీ టెస్టులు చేసే వీలుండని పరిస్ధితి ఏర్పడుతుంది. అందుకే విచ్చలవిడి టెస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. కరోనా ను ఎదుర్కోనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్దంగాఉన్నది. అవసరం అయిన సౌకర్యాలు, వైద్యసామాగ్రిన సిద్దం చేసి ఉంచుతున్నాం. లాక్ డౌన్లో ఒక్క అకలి చావు లేకుండా చూడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నం. మద్యతరగతి, పేదల సమస్యలను పరిగణలోకి తీసుకుని పనిచేస్తున్నాం. పారిశ్రామిక వర్గాలు, కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నామ‌ని మంత్రి కె.తారక రామారావు మీడియాతో మాట్లాడారు.   లాక్ డౌన్ పొడగించేందుకు సిద్దంగా ఉన్నామని ముఖ్యమంత్రి చెప్పారు. అమెరికా, యూరప్ లోని ఇటలీ, స్పెయిన్ లాంటి పరిస్థితులు ఇక్కడ తలెత్తకుండా ఉండాలంటే లాక్ డౌన్, సామాజిక దూరం ఒక్కటే మార్గమని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. మూడు దశల్లో కరోనా వైరస్ ని ఎదుర్కోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని కెటిఆర్ అన్నారు. ఇప్పుడు ఏదైనా పొరపాటు చేసి క‌రోనా వ్యాప్తికి అవకాశం ఇస్తై భవిష్యత్తులో మనల్ని మనం క్షమించుకోలేం. కరోనా వ్యాప్తి అగిన తర్వతానే లాక్ డౌన్ ఎత్తేయాలి. కరోనా కట్టడికి సామాజిక దూరం ఒక్కటే మార్గం. అభివృద్ది చెందిన దేశాలు సైతం కరోనా మహ్మమారిని ఎదుర్కోలేక కష్టాలు పడుతున్నాయ‌ని మంత్రి కెటి రామారావు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో అందరికి టెస్టులన్న అలోచన ఆచరణ సాద్యం కాదు. విచ్చలవిడి టెస్టులకు అనుమతిస్తే ప్రజల భయాందోళనల నేపధ్యంలో టెస్టు సెంటర్ల దోపిడీకి దారి తీస్తుంది. అవసరం అయిన వారీకీ టెస్టులు చేసే వీలుండని పరిస్ధితి ఏర్పడుతుంది. అందుకే విచ్చలవిడి టెస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.     కరోనా ను ఎదుర్కోనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్దంగాఉన్నది. అవసరం అయిన సౌకర్యాలు, వైద్యసామాగ్రిన సిద్దం చేసి ఉంచుతున్నాం. లాక్ డౌన్లో ఒక్క అకలి చావు లేకుండా చూడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నం. మద్యతరగతి, పేదల సమస్యలను పరిగణలోకి తీసుకుని పనిచేస్తున్నాం. పారిశ్రామిక వర్గాలు, కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నామ‌ని మంత్రి కె.తారక రామారావు మీడియాతో మాట్లాడారు.     లాక్ డౌన్ పొడగించేందుకు సిద్దంగా ఉన్నామని ముఖ్యమంత్రి చెప్పారు. అమెరికా, యూరప్ లోని ఇటలీ, స్పెయిన్ లాంటి పరిస్థితులు ఇక్కడ తలెత్తకుండా ఉండాలంటే లాక్ డౌన్, సామాజిక దూరం ఒక్కటే మార్గమని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. మూడు దశల్లో కరోనా వైరస్ ని ఎదుర్కోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని కెటిఆర్ అన్నారు.

ఆదాయమైన వదులుకుంటా, జనం ప్రాణాలు నాకు ముఖ్యం

* సఫాయన్న సేవకు చేతులెత్తి నమస్కరిస్తాడు  * బతుకుంటే బలుసాకైనా తినొచ్చంటడు  ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద రెండు రోజుల పాటు నిరంతరాయంగా సోషల్ మీడియా లో చర్చ..ఆయన నిరాఘాట, నిరుపమాన శబ్ద ప్రకటన మీద అన్ని సోషల్ మీడియా వేదికలు విస్మయం వ్యక్తం చేయటం... ఈ మధ్య కాలం లో ఎక్కడా చూడలేదు, వినలేదు కూడా.. సోషల్ మీడియా ను మోడీ మ్యానియా కమ్మేసిన వేళ, వాస్తవాల ప్రకటన తో, విస్తుపోయే నిజాలతో ఆయన విసిరిన మాటల మంత్రదండం ముందు చాలా మంది నాయకుల వాక్పటిమ వెలవెలపోయింది. ఎందుకంటే, ఆయన మాటల్లో నిజాయితీ ఉంది కాబట్టి, నిజముంది కాబట్టి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులలో -టంగుటూరి ప్రకాశం పంతులు, ఎన్ టీ రామారావు ల తర్వాత, సామాన్యుడిని ఆకట్టుకునే నాయకత్వ పటిమను సాంతం సొంతం చేసుకున్న ముఖ్యమంత్రిగా కె సి ఆర్ చరిత్ర సృష్టించారు. ఇది పొగడ్త కాదు, ప్రశంసా కాదు... సోషల్ మీడియా ఎనాలిసిస్.  సిబ్బందిని మోటివేట్ చేయడంలో, ప్రత్యర్థులకు వార్నింగ్ ఇవ్వడంలో, వినేవాళ్ళకి విసుగు రాకుండా మాట్లాడటంలో ఆయనకు పోటీ లేదు.... ఎదురు ఒక్క పేపర్ ఉండదు.., ఒక్క నోట్ ఉండదు.... తడబాటు ఉండదు... చెప్పాల్సింది సూటిగా, సుత్తి లేకుండా....జనానికి అర్థం అయ్యేలా....భరోసా ఇచ్చేలా....ఇంగ్లీష్, హిందీ, తెలుగు అన్ని భాషల్లో.... ఇంకో బైట్ అని అడిగే పని కూడా ఉండదు. అది ఆయన గొప్పతనం.. అది ఆయన దక్షత. ఇదేదో ఆయన్ను పొగిడే ప్రహసనం కాదు. కరోనా లాక్ డౌన్ విషయం లో మరో రెండు వారాలు కొనసాగించాలని కుండబద్దలు కొట్టిన కె సి ఆర్, బతికుంటే బలుసాకు తిందామంటూ చెప్పుకొచ్చిన తీరు, ఈ పదిహేను రోజుల్లో తెలంగాణ 435 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయిందని చెపుతూనే, ప్రజల ప్రాణాల కాన ఆర్ధిక మాంద్యం తనకు లెక్క కాదని తేల్చిపారేశారు. ఈ 15 రోజుల్లో తెలంగాణ కు కేవలం రెండు కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందనీ, అయినా కూడా జనాన్ని బతికుంచుకోవటమే తనకు ముఖ్యమని స్పష్టం చేసిన ఆయన నాయకత్వం దేశాన్ని ఆకట్టుకుంది. నరేంద్ర మోడీ వారాంతపు కార్యక్రమాలలో ఒవైసీ కి కనిపించిన ఎంటర్టైన్మెంట్, కె సి ఆర్ అనర్గళ ఉపన్యాసం లో కనిపించకపోవటానికి కారణం ఏమిటంటే, ఈయన జనం బాగు కోరుకుని లాక్ డౌన్ కొనసాగించాలని చెప్పటం. తాను మాట్లాడుతున్న అంశం మీద విపరీతమైన అధారిటీ, కాగితాలు చూసి చదివే అలవాటు ఏ మాత్రం లేని క్షుణ్ణమైన పరిజ్ఞానం, ఎదుటివాడు ప్రశ్నించటానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వని కూలంకుష పరిశోధన కె సి ఆర్ కు పెట్టని ఆభరణాలు. ప్రజలను మానసికంగా సిద్ధం చేయటానికి ఆయన వారి మీద ఎలాంటి ఒత్తిడీ చేయలేదు. ఉన్న వాస్తవాలను మాత్రమే అందరిముందూ పరిచారు. సామాన్యుడికి అర్ధమయ్యే భాషలో చెప్పారు.. ఈ సాహసోపేత కార్యక్రమంలో సేవలందిస్తున్న డాక్టర్లందరికీ, నర్సులు, పారిశుధ్య కార్మికులు అందరికీ మొక్కుతున్నానంటూ ముందుకు వచ్చిన ముఖ్యమంత్రి కె సి ఆర్. కష్ట కాలంలో ప్రజలను, ప్రభుత్వ యంత్రాంగాన్ని కె సి ఆర్ మోటివేట్ చేసిన తీరు తో దేశం యావత్తూ చకితమై చూసింది.  సోషల్ మీడియా అనలిటిక్స్ అంతా కూడా కె సి ఆర్ లోని వినూత్న కోణాన్ని తమకర్ధమైన భాషలో అనువదించే పనిలో బిజీ అయిపొయింది. ఒక జగన్మోహన్ రెడ్డి, ఒక నవీన్ పట్నాయక్, ఒక మమతా  బెనర్జీ, ఒక అరవింద్ కేజ్రీ వాల్, ఒక  నితీష్ కుమార్..మీరందరూ కూడా అద్భుతంగా శ్రమిస్తూ ఉండవచ్చు గాక.. కానీ, ఒక కె సి ఆర్ దగ్గరున్న మోటివేషన్ టెక్నాలజీ మాత్రం మీ దగ్గర లేదనేది సోషల్ మీడియా ఎనాలిసిస్. అంతే కాదు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మీద సోషల్ మీడియా వేసిన సెటైర్ల పైన కూడా కె సి ఆర్ విరుచుకుపడటాన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ విస్తారంగా చర్చించాయి. సంక్షోభ సమయం లో దేశ ప్రధాని కి దన్నుగా నిలబడటం ద్వారా కె సి ఆర్, సరైన రాజకీయ స్ఫూర్తిని ప్రదర్శించారని, సఫాయన్న నీకు సలామన్నా అంటూ వినమ్రపూర్వక విజ్ఞప్తి చేయటం ద్వారా జన హృదయాన్ని చూరగొన్నారని కూడా సోషల్ మీడియా వేదికలు ప్రశంసించాయి. భేష్ కె సి ఆర్.. మీ స్ఫూర్తి మా గుండెలకు ఊపిరినిచ్చింది. రేపటి మీద ఆశ చిగురింప చేసింది.

చంద్రబాబు సైకాలజీ పై సైంటిస్ట్ పేర్ని నాని రిపోర్ట్

* ఐ సి యు లో ఉన్న టీ డీ పీ కి రోజూ ఆక్సిజన్ ఎక్కిస్తున్న వై ఎస్ ఆర్ సి పీ * నాయుడు అంతర్జాతీయ తీవ్రవాది అని తేల్చిన పేర్ని నాని * ఏజెంట్ పేర్ని నాని పరిశోధనలో బయటపడ్డ నాయుడు అంతర్రాష్ట్ర లింకులు పిచ్చ పీక్ కు వెళిపోతే, ఇలాంటి ఆరోపణలే చేస్తారు మరి. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడేటప్పుడు, ఉండాల్సిన కనీస మర్యాదను కరకట్ట దారిలో తొక్కేసి మరీ, కసిగా రాష్ట్ర రవాణా,సమాచార పౌరసంబంధాల శాఖమంత్రి పేర్నినాని చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్రం లో నిరుటి ఎన్నికల్లో పరువు కోల్పోయి, 23 సెగ్మెంట్స్ కు పరిమితమైన చంద్రబాబు నాయుడు, పార్టీ ఉనికి కోసం ఏదో తనదైన శైలిలో రోజు వారీ చేసే అనుగ్రహ భాషణాల్లో కూడా కుట్ర కోణాలు వెతికే పేర్ని నాని ని చూసి సోషల్ మీడియా జాలిపడుతోంది. ఐ సి యు లో ఉన్న తెలుగు దేశం పార్టీకి మూడు రాజధానుల ఇష్యూ తో తిరిగి ఆక్సిజన్ ఎక్కించిన పాలక వై ఎస్ ఆర్ సి పీ నాయకులు , తాజాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పై ఒళ్ళు మరిచి చేస్తున్న విమర్శలూ, ఆరోపణలూ కూడా సోషల్ మీడియా కి కావాల్సినంత ఆహారం ఇస్తున్నాయి. ఈ కోవలోనే పేర్ని నాని సైంటిస్ట్, ఇంకా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అవతారాలు ఎత్తారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు , ఎక్కడ, ఏమి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారనే మినిట్ to మినిట్ ప్రోగ్రాం వివరాలు తన దగ్గర ఉన్నాయంటూ విలేకర్ల సమావేశం లో వెల్లడించారు.  చంద్రబాబు పక్కరాష్ట్రం లో బతుకుతున్నారని కనుక్కున్న ఆయన, తన పరిశోధనలో చంద్రబాబుకు, అంతర్జాతీయ తీవ్రవాదులకు పెద్ద  తేడా కనిపించడం లేదనే విషయాన్ని కనుక్కున్నారు. చంద్రబాబు మనస్తత్త్వం చూస్తే అంతర్జాతీయ తీవ్రవాదిలా ఉన్నారన్న పేర్ని నాని, తన పరిశోధన లో వెల్లడైన మరిన్ని సంచలన విషాలను షేర్ చేశారు.  "తీవ్రవాదులు కూడా వేరే దేశంలో ఉంటూ ఇక్కడ బాంబులు పెడుతూ,రకరకాల వైరస్ లు పంపుతుంటారు. నాశనం కోరుకుంటారు. పాజిటివ్ కేసులు వచ్చినచోట్ల కూడా(రెడ్ జోన్లు) వైద్యులు,పారిశుధ్యకార్మికులు,రెవిన్యూ, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు వాలంటీర్లు వీరంతా చిరుద్యోగులు ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నారు.మిలటరీలో దేశాన్ని కాపాడటానికి ఏ విధంగా సైనికులు పోరాడుతున్నారో అదే విధంగా వారందరూ సేవలందిస్తున్నారు.విలేకరులను చూసైనా చంద్రబాబు సిగ్గుతెచ్చుకోవాలి.ఆర్దిక బాధలు దిగమింగి ప్రజలను అప్రమత్తం చేయడం లో, ప్రభుత్వసూచనలు ప్రజలకు చేరవేయడంలో ప్రజలను మేలుకొల్పుతూ వ్యాధిని అరికట్టడంలో విలేకరులు సేవలందిస్తున్నారు. మీడియా వారు సామాజిక బాధ్యతగా పనిచేస్తున్నారు. ఇంకా వ్యాధి ప్రబలుతుందని చంద్రబాబు చెబుతున్నారు.అంటే మీరు ఎవర్ని దెబ్బతీయదలుచుకున్నారు.ఎవరి ఆత్మస్దైర్యం దెబ్బతీస్తున్నారు.ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నవారిని వారి ఆత్మస్ధైర్యాన్ని దెబ్బతీస్తున్నారా. కరోనా వ్యాధి వస్తుందనే ముందువరకు కూడా చాలా డిపార్ట్ మెంట్లను తిట్టుకునే పరిస్దితి నుంచి ఈరోజు ఆ యా డిపార్ట్ మెంట్లను,ఉద్యోగులను ప్రజలు నేడు వారి సేవలు చూసి వేనోళ్ల కొనియాడుతున్నారు. కరోనా లెక్కలు దాచామని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు.చంద్రబాబు లెక్కలు చెబితే వారికి పరీక్షలు చేయిస్తాం," అని కూడా పేర్ని నాని సవాల్ చేశారు. ఆంధ్ర  రాష్ట్రంలో ఐదుకోట్ల మంది ఉంటే ఐదుకోట్ల మందికి పరీక్షలు చేస్తారా.ఎక్కడైతే వ్యాధిప్రబలుతుంటే అక్కడ పరీక్షలు చేస్తారు.14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన తనకు ఇవి తెలియవా, అంటూ కూడా పేర్ని నాని ప్రశ్నించారు.  దొంగలెక్కలు రాయడం చంద్రబాబుకే అలవాటు.దుర్మార్గమైన ఆలోచనలు చంద్రబాబు మానుకోవాలని సూచించిన పేర్ని నాని పరిశోధన లో తేలిన విషయాలేమిటంటే, చంద్రబాబు కు మానవత్వం లేదు.మానవీయకోణం లేవని. వేల సంఖ్యలో మరణాలు ఉన్నాయి కాని ప్రభుత్వం దాస్తుందనే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారంటే విలేకరులు వాస్తవాలు దాస్తున్నట్లుగా మాట్లాడుతున్నట్లేకదా అని కొత్త లాజిక్ ని కూడా పేర్ని నాని తీశారు. కరోనా సోకిందనే బాధ కంటే ఇలాంటి దిక్కుమాలిన వ్యక్తి మమ్మల్ని ఇన్నాళ్లు పాలించారా అని ప్రజలు బాధపడుతున్నారని కూడా పేర్ని నాని కనుగొన్నారు.  ఈ యుధ్ద వాతావరణంలోనే కాదు చంద్రబాబు పాలనలో రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీలు ఇవ్వకుండా, ధాన్యం కొని వారికి డబ్బులు చెల్లించకుండా, విత్తనాలు అందించకుండా అన్ని విధాలా బాధ పెట్టిన విషయాన్నీ కూడా పేర్ని నాని కనుగొన్నారు.

జాన్వీకి సారీ చెప్పిన అమితాబ్

జాన్వీకి బిగ్ బి అమితాబ్ బచ్చన్ సారీ చెప్పారు. ఈమె శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ కాదు, జాన్వీ మఖీజా. ఓ సాధారణ మహిళ. ఆమెకు అమితాబ్ ఎందుకు సారీ చెప్పారో తెలుసా? అయితే, అసలు వివరాల్లోకి వెళ్లి చదవండి. ముంబైలోని నానావతి ఆస్పత్రిలో అమితాబ్ బచ్చన్ కరోనా చికిత్స తీసుకున్నారు. ఆ ఆస్పత్రిలో వైద్యులు, నర్సుల గురించి, వాళ్ళు వ్యవహరించిన తీరు గురించి గొప్పగా సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. అదే నానావతి ఆస్పత్రిలో జాన్వీ మఖీజా తండ్రి కరోనా చికిత్స తీసుకున్నారు. తరవాత వేరే ఆస్పత్రిలో యాంటీ బాడీస్ టెస్ట్ చేయించగా, ఆయనకు అసలు కరోనా సోకలేదనే విషయం బయటపడింది. దాంతో సోషల్ మీడియాలో ఆమె ఒక పోస్ట్ చేసింది.      "మా నాన్నకు కరోనా సోకలేదు. కానీ, కొవిడ్19 పాజిటివ్ అని నానావతి ఆస్పత్రిలో తప్పుగా చూపించారు. ఆయనకు 80 ఏళ్ళు. ట్రీట్మెంట్ సమయంలో కుటుంబ సభ్యులు ఎవరినీ కలవనివ్వలేదు. డిశ్చార్జ్ అయిన తరవాత పేరున్న మరో ఆస్పత్రిలో యాంటీ బాడీస్ టెస్ట్ చేయించగా, అసలు కరోనా సోకలేదని తెలిసింది. ఆస్పత్రిలో ఉండటం వల్ల నాన్నకు ఇన్ఫెక్షన్ వచ్చింది.  మనుషుల ప్రాణాలకు విలువ ఇవ్వని, డబ్బు సంపాదన లక్ష్యమైన అటువంటి ఆస్పత్రికి మీరు ప్రచారం చేయడం దురదృష్టకరం. సారీ. మీరంటే గౌరవం పోయింది" అని జాన్వీ మఖీజా పేర్కొన్నారు.  జాన్వీ మఖీజా పోస్ట్ పట్ల అమితాబ్ బచ్చన్ స్పందించారు. "జాన్వీ జీ... మీ నాన్నగారి పరిస్థితి తెలిసి బాధ పడ్డాను. అయామ్ సారీ. యంగ్ ఏజ్ నుండి నేను ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నాను. పేషెంట్ల గురించి డాక్టర్లు, నర్సులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. యస్... ల్యాబ్ టెస్టులు తప్పుగా రావచ్చు. కానీ, డాక్టర్లు కావాలని ఏదీ చేయరు. డబ్బు కోసం ట్రీట్మెంట్ చేయరు. నానావతి ఆస్పత్రికి ప్రచారం చేస్తున్నాని మీరన్న మాటతో నేను ఏకీభవించడం లేదు. వాళ్ళకు థాంక్స్ చెప్పారు. మీకు నాపై గౌరవం పోవచ్చు. కానీ,వైద్యవృత్తి, వైద్యులపై నాకు ఎప్పటికీ గౌరవం ఉంటుంది" అని అమితాబ్ బచ్చన్ పేర్కొన్నారు. 

క్యూట్ డార్లింగ్‌తో రామ్‌చరణ్ డాన్స్ 

లాక్‌డౌన్‌లో బోర్‌డమ్‌ను బీట్ చేయడానికి ఒక్కొక్కరూ ఒక్కో పని చేస్తున్నారు. ఇంట్లో వంటలు చేసేవాళ్ళు కొందరు. పెరట్లో మొక్కలకు నీళ్ళుపెట్టేవాళ్ళు, పనులు చేసేవాళ్ళూ ఇంకొందరు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అయితే ఈ రోజు మేనకొడలు నివిష్కతో డ్యాన్సులు చేశారు. చిరంజీవి చిన్నకుమార్తె శ్రీజ రెండో కూతురే ఈ నివిష్క. చిన్నారి వయసు రెండేళ్ల లోపే. అయితే పాటలకు చక్కగా డ్యాన్సులు చేస్తుంది. గతంలో చిరంజీవి ఒడిలో కూర్చుని 'ఖైదీ నంబర్ 150'లో 'మి మి మిమ్మిమ్మి' పాట ప్లే చేయమని మారం చేసింది. ముద్దుముద్దుగా నివిష్క చేసే డ్యాన్సులు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా మేనకోడలితో కలిసి కార్టూన్ ఛానల్ లో పాట వస్తుంటే డాన్స్ చేశారు. "డాన్సింగ్ ఆఫ్ విత్ థిస్ డార్లింగ్... నివిష్క" అని పేర్కొన్నారు. 

‘బిగ్‌బాస్' హౌస్‌లోకి వెళ్ళేది ఎంతమంది అంటే?

'బిగ్ బాస్' రియాలిటీ షో సీజన్ 4 స్టార్ట్ కావడానికి అంతా రెడీ. ఆల్రెడీ ఇంటిని కొత్తగా డెకరేట్ చేశారు. కింగ్‌ నాగార్జునతో ప్రోమోలు షూట్ చేశారు. కంటెస్టెంట్లను సెలెక్ట్ చేశారు. ఆగస్టు 30 నుండి షో స్టార్ట్ కానుందని టాక్. హౌస్‌లోకి పంపించే కంటెస్టెంట్లను కూడా సెలెక్ట్ చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. 'బిగ్ బాస్' ఆఫర్లకు యుంగ్ హీరోలు కార్తికేయ, సిద్ధూ జొన్నలగడ్డ, నందు తదితరులు హాట్ బ్యూటీలు శ్రద్ధా దాస్, పూనమ్ కౌర్ నో చెప్పారని ఫిలింనగర్ మాట. అయితే, ఇంకొంతమంది క్రేజీ సెలబ్రిటీలు ఎస్ అన్నారట. జూమ్ వీడియో కాలింగ్ ద్వారా చాలామంది ఆడిషన్లు చేసిన 'బిగ్ బాస్' టీమ్, చివరికి 30 మందిని ఫిల్టర్ చేసినట్టు స్టార్ మా ఛానల్ టాక్. అందులో 16 మందిని హౌస్‌లోకి పంపిస్తారట. లాస్ట్ సీజన్ కంటే ఈ సీజన్ తక్కువ రోజులు ఉంటుందని బయట జనాలు అనుకుంటున్నప్పటికీ... ప్రేక్షకుల నుండి వచ్చే స్పందన బట్టి పొడిగించే ఛాన్సులు కూడా ఉన్నాయట.

ఓ హోటల్‌లో 'కెజిఎఫ్ 2' టీమ్! ఎందుకంటే?

భారీ బడ్జెట్ సినిమాల షూటింగులు స్టార్ట్ చేయడానికి హీరోలు, దర్శకులు, నిర్మాతలు వెనుకడుగు వేస్తున్న ప్రస్తుత తరుణంలో 'కెజిఎఫ్ 2' టీమ్ ధైర్యంగా ముందడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. స్వాతంత్య దినోత్సవం సందర్భంగా మళ్లీ సినిమా షూటింగ్ మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది.  ఆగస్టు మూడో వారంలో షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామని 'కెజిఎఫ్ 2' నిర్మాత కార్తీక్ గౌడ తెలిపారు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ 90 పర్సెంట్ కంప్లీట్ అయ్యింది. మరో 10 పర్సెంట్ మాత్రమే బాలన్స్ ఉంది. త్వరలో దాన్ని కంప్లీట్ చేయాలనుకుంటున్నారు. ఇందులో కొన్ని యాక్షన్ సీక్వెన్సులు, మరికొన్ని సన్నివేశాలు ఉన్నాయట.  ప్రస్తుతం షూటింగ్ చేయబోయే టెక్నికల్ టీమ్ అందరికి లొకేషన్‌కి దగ్గరలోని ఓ హోటల్‌లో బస ఏర్పాటు చేశారు. షూటింగ్ మొదలయ్యేవరకు వాళ్లను క్వారంటైన్‌లో ఉంచాలని నిర్మాత డిసైడ్ అయ్యారు. టెస్టులు చేయించి షూటింగ్ స్టార్ట్ చేశారట. షెడ్యూల్ కంప్లీట్ అయ్యేవరకు ఎవరినీ బయటకు పంపించామని ఆయన స్పష్టం చేశారు. 

ఆశ్చ‌ర్యం.. ఆర్జీవీ 'మ‌ర్డ‌ర్' థియేట‌ర్ల‌లోనే విడుద‌ల‌వుతుంది!

  సంచ‌ల‌నం సృష్టించిన మిర్యాల‌గూడ ప‌రువు హ‌త్యోదంతంపై రామ్‌గోపాల్ వ‌ర్మ తీస్తున్న మ‌ర్డ‌ర్ మూవీ అంద‌రూ అనుకుంటున్న‌ట్లు నేరుగా ఏటీటీ ప్లాట్‌ఫామ్‌పై విడుద‌ల కావ‌ట్లేదు. థియేట‌ర్లు తెరుచుకున్నాక వాటిలోనే విడుద‌ల చేస్తారంట‌. ఈ విష‌యాన్ని మ‌ర్డ‌ర్‌కు నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తోన్న న‌ట్టి క‌రుణ‌, న‌ట్టి క్రాంతి (నిర్మాత న‌ట్టి కుమార్ పిల్ల‌లు) మంగ‌ళ‌వారం మీడియాకు విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఈ చిత్రంలోని "పిల్ల‌ల్ని ప్రేమించ‌డం త‌ప్పా?.." అంటూ సాగే పాట‌ను విడుద‌ల చేసిన సంద‌ర్భంగా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. వ‌ర్మ ఆస్థాన గేయ‌ర‌చ‌యిత సిరాశ్రీ రాసిన ఈ పాట‌ను ఆర్జీవీ స్వ‌యంగా త‌న బొంగురు గొంతుతో ఆల‌పించ‌డం గ‌మ‌నార్హం. పాట చివ‌ర‌లో "ఇంత చెప్పినా నువ్వెవ‌డివిరా నాన్న అంటే చంప‌ట‌మో, చంపించ‌ట‌మో త‌ప్పా?" అని ప్ర‌శ్నించారు. డీఎస్ఆర్ సంగీతం స‌మ‌కూర్చ‌గా, జ‌గ‌దీశ్ చీక‌టి సినిమాటోగ్రాఫీ అందించారు. ఆనంద్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో తండ్రీ కూతుళ్లుగా ప్ర‌ధాన పాత్ర‌ల‌ను శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, సాహితి పోషించారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా తొలి ట్రైలర్ గత మంగళవారం  విడుదలై నెంబర్ వన్ ట్రెండింగ్ లో ఉందని  నిర్మాతలు నట్టి కరుణ, నట్టి క్రాంతి తెలిపారు. దాదాపు 70 లక్షల మంది ఈ ట్రైలర్ ను చూశారని, ఒక ఫ్యామిలీ చిత్రంలా ఎంతో బావుందన్న ప్రశంసలు ప్రేక్షకుల నుంచి లభించాయని వారు వెల్లడించారు. త్వరలో మరో ట్రైలర్ ను, రెండో పాటను విడుదల చేస్తామని వారు తెలిపారు. దాదాపు రెండు గంటల వ్యవధి గల ఈ సినిమాను థియేటర్లలు ఓపెన్ చేసిన తర్వాత విడుదల చేస్తామని వారు వివరించారు. ఆగస్ట్ నెలలో సినిమా తొలికాపీ సిద్ధమవుతుంద‌నీ, అదే నెలలో సెన్సార్ కు పంపుతామ‌నీ తెలిపారు.

రాజకీయాలకు బలౌతున్న ఐఏఎస్ అధికారులు

ఇద్దరు అధికారులు దివంగత వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కీలకమైన శాఖలు నిర్వహించిన వారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ చేతిలో వీరిద్దరూ తీరని అవమానాలకు గురౌతున్నారు. తండ్రి చేతిలో ఎత్తులు చుసిన వారు తనయుడి చేతిలో లోతులు చూస్తున్నారు. వారిద్దరూ సీనియర్ ఐఏఎస్ అధికారులు. ఒకరినైతే మెడపట్టుకుని బయటకు గెంటేశారు. మరొకరిని కులం పేరుతో కుళ్లపొడుస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ఈ ఇద్దరు అధికారులూ కూడా చంద్రబాబు అంటే గిట్టనివారే. ఇద్దరు అధికారులు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిన్న చూపుకు గురి అయిన వారే. ఒకరు బలయ్యారు.. మరొకరు అవుతున్నారు. ఆ ఇద్దరూ ఎవరంటే ఒకరు ఎల్‌వి సుబ్రహ్మణ్యం. రెండో వారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీనియర్ అయినా ఎల్‌వి సుబ్రహ్మణ్యంకు జగన్ కేసుల్లో సహా ముద్దాయిగా ఉన్నారని ప్రాధాన్య పోస్టులు ఇవ్వలేదు. ఒక సందర్భంలో కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి పోస్టు ఇచ్చినా మళ్ళీ ఆయనను అక్కడ నుంచి తీసి అత్యంత చిన్నదైన యువజన శాఖకు మార్చారు. ఇక రమేష్ కుమార్ పరిష్తితి కూడా దాదాపుగా అంతే. చంద్రబాబు హయాంలో ఆయనకు ఏ కీలక శాఖ లభించలేదు. ఈ ఇద్దరూ వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రతిభకు తగిన గుర్తింపు పొందారు. ఎల్‌వి సుబ్రహ్మణ్యం, రమేష్ కుమార్ ఇద్దరూ ఆర్ధిక శాఖను నిర్వహించిన వారే. ఆర్ధిక శాఖలో ఈ ఇద్దరిదీ ప్రత్యేకమైన శైలి అని వారితో సాన్నిహిత్యం ఉన్న అధికారులు అంటారు. రాష్ట్రంలో ఆర్ధిక క్రమశిక్షణ తీసుకురావడంలో బిల్లుల చెల్లింపు తదితర విషయాలలో ఎలాంటి వివాదాలు రాకుండా చూసిన వారన్న విషయాన్ని మర్చిపోలేం అని చెప్తున్నారు. ఆర్ధిక క్రమశిక్షణ తీసుకురావడం, జవాబుదారీతనం, దుబారా తగ్గించడం వంటి విషయాల్లో ఈ ఇద్దరూ అనేక చర్యలు తీసుకున్నారు.వీరికి ఇంకో పోలిక కూడా ఉంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎల్‌వి సుబ్రహ్మణ్యం ఇద్దరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారులుగా పని చేశారు. ఈ ఇద్దరి హయాంలో తిరుమల పవిత్రత రెండింతలు పెరగడమే కాకుండా క్రమ శిక్షణ ఉండేదన్న విషయం మర్చిపోరాదు. భక్తుల సౌకర్యార్ధం ఈ ఇద్దరి హయాంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎంతో సీనియర్ రాజకీయ నాయకులు ట్రస్టు బోర్డు చైర్మన్లుగా ఉన్నా కూడా ఎల్‌వి సుబ్రహ్మణ్యం, రమేష్ కుమార్ ఈవోలుగా ఉన్నప్పుడు వీరు చెప్పినట్లే నడచుకునేవారన్న పేరుండేది. వృత్తి పట్ల అంతటి నిబద్ధతతో ఈ ఇద్దరు అధికారులు పని చేశారు. అత్యంత సీనియర్ అయిన ఎల్‌వి సుబ్రహ్మణ్యం ను పక్కన పెట్టి ఆయన కన్నా జూనియర్లకు చంద్రబాబునాయుడు చీఫ్ సెక్రటరీ పదవిని అప్పగించారు. అయినా ఎల్‌వి సుబ్రహ్మణ్యం ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యని విషయం మనం చూసాం. సార్వత్రిక ఎన్నికల సమయంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునేటాను పక్కన పెట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఎల్‌వి సుబ్రహ్మణ్యంను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఎన్నికల కమీషన్ ప్రధాన కార్యదర్శిగా నియమించాక సహ ముద్దాయిని సిఎస్ గా ఎలా నియమిస్తారని విమర్శించారు కూడా.   ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్ ఎల్‌వీ ని కొనసాగించగా జగన్ ను అందరూ మెచ్చుకున్నారు కూడా. అయితే ఏమైందో ఏమూ కానీ కొద్ది కాలంలోనే ఎల్‌వి ని అత్యంత అవమానకరంగా పదవి నుంచి జగన్ తొలగించిన విధానం కూడా తెలిసిందే. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు కూడా దాదాపుగా అలానే జరిగింది. ఆయనను రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమించడం చంద్రబాబుకు అస్సలు ఇష్టం లేదు. చంద్రబాబు దగ్గర పని చేయడం రమేష్ కుమార్ కూ ఇష్టం లేదని అంటారు. అయితే తన కార్యదర్శిగా పని చేసిన రమేష్ కుమార్ కు రాష్ట్ర ఎన్నికల సంఘానికి నియమించాలని అప్పటి గవర్నర్ ఇ ఎస్ ఎల్ నర్సింహన్ చంద్రబాబుపై వత్తిడి తెచ్చారనీ. గత్యంతరం లేని పరిస్థితుల్లో చంద్రబాబు రమేష్ కుమార్ కు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని అప్పగించారనీ అంటున్నారు. రమేష్ కుమార్ పేరు బదులు వేరే అధికారి పేరు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేశామని చంద్రబాబు కూడా చెప్పారు. అటువంటి రమేష్ కుమార్ ఇప్పుడు చంద్రబాబు ఏజెంటుగా జగన్ చేతిలో ముద్ర వేయించుకోవడం దురదృష్టం. ఈ ఇద్దరూ ముక్కుసూటిగా మాట్లాడే అధికారులు. ఎలాంటి మొహమాటం లేకుండా విధులు నిర్వర్తించే వారన్న పేరుంది. అలాంటి ఈ ఇద్దరూ కూడా అత్యంత ఘోరమైన అవమానాన్ని పొందారు. ఈ అవమానాలకు వీరు అర్హులు కాదని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చని అధికార వర్గాలు అనుకుంటున్నారు. నాయకులు తమ స్వంత ప్రయోజనాల కోసం అఖిల భారత సర్వీసు అధికారులకు కులాలు, ప్రాంతాలు అంటగట్టడం ఏంటని కొందరు ఆవేదన చెందుతున్నారు.

ఆంధ్ర లో బీజేపీ 'పంచ్' తంత్రం...

  * దిగుమతి నాయకులు, బిజినెస్ లీడర్లు, లాబీయిస్టులు కలిసి బీ జె పి ని ఎటు నడిపిస్తారో....  * ఇంతకీ స్థానిక సమరం లో సత్తా చూపించే ట్యాలెంట్ ఆ పార్టీకి ఉన్నట్టా, లేనట్టా....  * జి వి ఎల్ ఋతుపవనాల్లాంటి వారు... ఇలావచ్చి అలా పలకరించి, అటు నుంచి ఆటే మాయమైపోతారు  * సి ఎం రమేష్ లాబీ మాస్టర్ గా ఢిల్లీ లో ప్రసిద్ధులు.. నోకియా మాదిరి ఈయన కూడా కనెక్టింగ్ పీపుల్ నినాదాన్ని బలంగా నమ్మిన వారు  * సుజనా చౌదరి... గత్యంతరం లేని పరిస్థితుల్లో అమరావతి నినాదాన్ని భుజాన వేసుకుని చందమామ కథలో విక్రమార్కుడి మాదిరి ... వై ఎస్ ఆర్ సి పి లోని బేతాళుడి తో జగడమాడుతుంటారు  * టీ జీ వెంకటేష్.. అవసరార్ధ రాజకీయాల కు కేరాఫ్ అడ్రెస్ .... రాయలసీమ అనేది ఈయనకు ట్యాగ్ లైన్ ...దురదపుట్టినప్పుడు గోక్కోవటానికి ఉపయోగపడే ఆరో వేలుగా ఆయన ఆ నినాదాన్ని బాగా వాడేస్తారు..  * అంగ వంగ కళింగ రాజ్యాలను అవలీలగా గెలిచిన చక్రవర్తి, చివరకు ఆముదాలవలస లో ఓడిపోయినట్టు, రాష్ట్ర బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ , చివరకు పవన్ కళ్యాణ్ తో కలిసి స్థానిక సమరం లో బీజేపీకి కాస్తో కూస్తో ఉన్న ఇమేజ్ ని పణం గాపెట్టే సాహసానికి ఒడిగట్టారు  ఆ ఐదుగురూ ఇంతకీ ఏమి చేస్తున్నట్టు..భారతీయ జనతా పార్టీ దిగుమతుల విభాగం నుంచి డంప్ అయిన జి వి ఎల్ నరసింహారావు , అలాగే తెలుగు దేశం నుంచి బీ జె పి లోకి దిగుమతి అయిన సుజనా చౌదరి, సి ఎం రమేష్, టీ జీ వెంకటేష్ , కాంగ్రెస్ లో నుంచి బీ జె పి లోకి షిఫ్ట్ అయిన  బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ  నారాయణ కలిసి ఈ స్థానిక సమరం లో రాష్ట్రం మొత్తం మీద కనీసం ఒక్కొక్కరికి 50 చొప్పున 250 మంది ఎం పి టి సి లు, జెడ్ పీ టి సి లను  గెలిపించుకురాగలరా అనేది చాలా పెద్ద సందేహం గా కనిపిస్తోంది. ఎందుకంటే, నిన్ననే విజన్ డాక్యుమెంట్ ని కలిసి ఆవిష్కరించిన బీ జె పి , జన సేన కంబైన్ నేతలు , చాలా పెద్ద  దృశ్యాన్నే జనం ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. వై ఎస్ ఆర్ సి పి, తెలుగుదేశం పార్టీ లకు తామే ప్రత్యామ్నాయమన్నట్టు గా ప్రకటించుకున్న ఈ ఐదుగురిదీ  వాస్తవానికి తలో దారీ.. ఎవరు , ఎప్పుడు, ఎందుకు, ఎలా మాట్లాడతారో తెలీని గందర గోళం ....  జి వి ఎల్ నరసింహ రావు ది అయితే సొంత రాజ్యాంగం, పూర్తిగా పార్టీ రాష్ట్ర శాఖ తో  గానీ, లేదా బీ జె పి లో ఉన్నతెలుగుదేశం మాజీ లతో  కానీ ఈయనకు ఎలాంటి సంబంధాలు ఉండవు.  రాష్ట్రాన్ని ఎప్పుడైనా పలకరించడానికి రుతు పవనాల మాదిరి అలా చుట్టపు చూపు గా వచ్చేసి ,  ఇలా మాయమైపోయే  జి వి ఎల్ వ్యవస్థ ల గురించి రాష్ట్ర బీ జె పి లో ఎవరికీ ఎలాంటి క్లూలు ఉండవు. ఈయన దారి రహదారి. ఈయన వ్యవస్థ ఇలాఉంటే, బీ జె పి లో ఉంటూ కూడా ఇంకాతెలుగు దేశం ఎజెండా , జెండా రెండూ మోస్తున్నట్టు కనిపించే సుజనా చౌదరి ఒక్క అమరావతి అంశం మీద తప్పించి, ఇతరత్రా ఏదీ మాట్లాడటానికి ఎక్కువగాఇష్టపడరు. జీ వీ ఎల్ కు, సుజనా కూ క్షణం పడదు. ఆయన ఎడ్డెం అంటే ఈయన తెడ్డెం అనే రకం.. ఏ మాత్రం పొసగని,పొంతన లేని పరస్పర భిన్నమైన అభిప్రాయాలు గల వీరిద్దరూ ఉత్తర ధృవం, దక్షిణ ధృవం మాదిరి ఒకే పార్టీ లో ఉంటూ కూడా కామన్  ఎజెండా తో పని చేసిన దాఖలాలు ఇప్పటివరకూ అయితే లేవు.   ఇహ, సి ఎం రమేష్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఆయన తన బిజినెస్ వ్యవహారాలను బీ జె పి తో ముడి కట్టేసి, ఏ పార్టీ లో ప్రయాణిస్తున్నాడో కూడా మర్చే పోయి, మొన్నటికి మొన్న పరిమళ్ నత్వాని ని జగన్ మోహన్ రెడ్డి దగ్గర ప్రవేశ పెట్టడం లో కీలక పాత్ర పోషించిన  ఘనుడు. గుర్తు చేస్తే కానీ తానూ బీ జె పి లో ఉన్నాననే విషయం గుర్తుండని ఈయన కు  బీ జె పి, జన సేన కలిసి పోటీ  చేస్తున్న విషయం తెలుసో లేదో అని కూడాపార్టీ శ్రేణులు గుసగుస లాడుకుంటున్నాయి.  ఇహ వీరందరినీ సమన్వయము చేసుకుని  ముందుకెళ్తున్నట్టు భావిస్తూ , బాహ్య ప్రపంచం ముందు ఆవిష్కృతమయ్యే  వ్యక్తి మరెవరో కాదు... సాక్షాత్తూ  రాష్ట్ర బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ. ఈయన, పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రయాణించటానికి అంతగాసుముఖం గా లేదు...కారణమేమిటంటే, చంద్రబాబు నాయుడు లాంటి యోధులతో పోరాడిన తన రాజకీయం , చివరకు ఇలా ఏ పూట ఎక్కడ ఉంటారో కూడా తెలీని పవన్ కళ్యాణ్ పార్టీతో కలిసి పని చేయాల్సిన దుస్థితికి దిగజారటమేమిటని  తరచూ తనలో తానె కుమిలి పోతున్నట్టు సమాచారం.  ఇహ, టీ జీ వెంకటేష్ అయితే మరీను..... రాయలసీమ నినాదాన్ని తన ట్యాగ్ లైన్ గాచేసుకుని కాలక్షేపం చేసేస్తూ... ప్రస్తుతానికి బీ జె పి లో నివసిస్తూ ....ఈ స్థానిక ఎన్నికల సమరం లో తన పాత్ర ఏమిటో కూడాతెలీకుండా జీవనం వెళ్లదీస్తున్నారు. మొత్తానికి ఈ పంచ పాండవులు స్థానిక సమరం లో తమ 'పంచ్ ' పవర్ ఏమిటో ఈ నెలాఖరు లోగా చుపిస్తారేమోననే బోలెడు , ఇంకా గంపెడాశతో బీ జె పి అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.

ఏపీలో వంద కోట్ల దందా.. రియల్ క్రైమ్ స్టోరీ

సినిమాలలో ఎన్నో క్రైమ్ స్టోరీలు, ఎన్నో కిడ్నాప్ సీన్లు చూసుంటారు. అయితే.. కాకినాడలో జరిగిన ఈ రియల్ స్టోరీ ముందు ఆ రీల్ స్టోరీలన్నీ చిన్నబోతాయి. పేరున్న రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్న అధికారులు.. ఇలా భారీ తారాగణం నటించిన.. ఆ రియల్ స్టోరీ టైటిల్ వచ్చేసి.. "ఓ కిడ్నాప్, వంద కోట్ల స్కాం". 'నేనే రాజు నేనే మంత్రి' మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది. మీరు ఏ పార్టీకి ఓటేసినా మేమే అధికారంలో ఉంటామని. అవును.. కొందరు రాజకీయ నాయకులు.. ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీని గెలిపిస్తే.. ఆ పార్టీలోకి జంప్ చేస్తారు. అలాగే అధికారులు కూడా.. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నేతలని కాకాపడుతూ వారి ఆటలు సాగిస్తుంటారు. ఈ రియల్ స్టోరీ వింటే అది నిజమని మీకే అర్ధమవుతుంది. కాకినాడలోని సర్పవరంకి చెందిన ఆకుల గోవిందరాజు అనే వ్యక్తికి భోగాపురంలో వంద కోట్ల విలువైన 18 ఎకరాల ల్యాండ్ ఉంది. ఈ ఒక్క విషయం చాలదా.. మాఫియా కన్ను ఆయన మీద పడటానికి. ఎక్కడో ఆకాశంలో ఎగురుతున్న గద్దకి కింద ఉన్న కోడిపిల్ల కనిపించినట్టు.. మాఫియా వాళ్ళకి ఎక్కడున్నా విలువైన ల్యాండ్స్ కనిపిస్తాయి కదా. అలాగే, బలగ ప్రకాష్ అనే మాఫియా లీడర్ కి.. ఆకుల గోవిందరాజుకి చెందిన ల్యాండ్ పై కన్నుపడింది. ఇంకేముంది ఏకంగా పోలీసులనే రంగంలోకి దింపాడు. ఇక పోలీసులైతే ఓ అడుగు ముందుకేసి ఏకంగా కిడ్నాప్ కే తెరలేపారు. 2017.. సెప్టెంబర్ 19 .... శూన్యమాసం.. అమావాస్య.. మంగళవారం.. మధ్యాహ్నానికి- సాయంత్రానికి నడుమ సూర్యుడు మండిపోతున్న సమయం... అబ్బా ఏమన్నా ముహూర్తమా... శూన్యమాసం.. అమావాస్య.. మంగళవారం.. ఇదే కిడ్నాప్ కి సరైన ముహూర్తం అనుకున్నారేమో పోలీసులు... AP 30 AB 6655 నెంబర్ గల ఇన్నోవా కార్ లో.. పోలీసులు ఆకుల గోవిందరాజు ఇంటికి వచ్చారు. కారు నెంబర్ ఫ్యాన్సీగా ఉన్నా, ఆ ఖాకీలు చేసే పని మాత్రం ఏ మాత్రం పద్దతిగా లేదు. వాళ్ళు చేసే పనేంటో ఆ చుట్టుపక్కల ఉన్నవారికి తెలియదు. కొత్త మొహాలు కావడంతో.. చుట్టుపక్కల వారు కొందరు ఆశ్చర్యంతో, కొందరు అనుమానంతో చూస్తున్నారు. వాళ్ళు అలా చూస్తుండగానే.. దొంగల రూపంలో వచ్చిన పోలీసులు.. గోవిందరాజుని ఇన్నోవాలో పడేసి.. జెట్ స్పీడ్ లో హైవే ఎక్కారు. పోలీసుల భాషలో చెప్పాలంటే దీనినే కిడ్నాప్ అంటారు. కారు హైవే మీద దూసుకెళ్తుంది. ఆ స్పీడ్ చూస్తే.. అంబులెన్స్ డ్రైవర్ కావాల్సిన వ్యక్తి ఇన్నోవా డ్రైవ్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. డ్రైవర్ స్టీరింగ్ పట్టుకుంటే.. మనం ఖాళీగా ఉండి ఏం చేస్తాం అనుకున్నారేమో.. మిగతా పోలీసులు గోవిందరాజు పనిపెట్టారు. కారు.. కాకినాడ నుంచి భోగాపురం చేరేవరకు.. అంటే దాదాపు నాలుగు గంటల పాటు... గోవిందరాజుని భయపెట్టారు.. బెదిరించారు.. చిత్రహింసలు పెట్టారు. ఒక్కమాటలో చెప్పాలంటే నరకం చూపించారు. కారు సాయంత్రం 6 గంటలకు భోగాపురం సబ్ రిజిస్టార్ ఆఫీస్ కి చేరుకుంది. ఖాకీలకు భయపడ్డాడో, కాసులకు కక్కుర్తి పడ్డాడో తెలియదు కానీ.. సబ్ రిజిస్టార్ పందిళ్లపల్లి రామకృష్ణ.. సాయంత్రం 4:30 కే రిజిస్ట్రేషన్ కాగితాలు సిద్ధం చేసి.. పదేళ్ల తర్వాత ఫారెన్ నుంచి రిటర్న్ వస్తున్న ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తున్నట్టు.. గుమ్మం వైపు చూస్తూ పోలీసుల కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో పోలీసులు గోవిందరాజుని తీసుకొని గుమ్మంలోకి అడుగు పెట్టనే పెట్టారు. గుమ్మంలో వాళ్ళ అడుగు పడిందో లేదో.. సబ్ రిజిస్టార్ మోహంలో వెలుగు వచ్చింది. గోవిందరాజు మోహంలో భయం పెరిగింది. భయంతో చూస్తుండగా ఎదురుగా కుర్చీలో కూర్చొని ఉన్న మాఫియా లీడర్ బలగ ప్రకాష్ కనిపించాడు. జర్నీలో పోలీసుల చిత్రహింసలతో భయపడిపోయిన గోవిందరాజు.. బలగ ప్రకాష్ ని చూసి మరింత భయపడ్డాడు. బలగ ప్రకాష్.. పోలీసుల మాదిరి సాగదియ్యలేదు.. కమర్షియల్ సినిమాల్లో విలన్ లాగా ఒక్కటే డైలాగ్ కొట్టాడు.. "సంతకం పెడతావా? సమాధిలో పడుకుంటావా?".... ఆ ఒక్క డైలాగ్ తో గోవిందరాజు భయం చావుభయంగా మారిపోయింది. ఎదురుగా మాఫియా లీడర్.. చుట్టూ భోగాపురం సీఐ నర్సింహారావు, ఎస్సైలు తారక్, మహేష్.. హెడ్ కానిస్టేబుల్ గోవిందరావు.. ఉన్నారు. ఎస్సైల పేర్లు తారక్, మహేష్ అని హీరోల పేర్లు ఉన్నాయి కానీ.. వాళ్ళ బిహేవియర్ మాత్రం పెద్ద విలన్ల పక్కన ఉండే చెంచా విలన్లు లాగా ఉంది. అన్యాయాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులే.. మాఫియా లీడర్ తో కలిసిపోయి.. చిత్రహింసలు చేసి బెదిరిస్తుంటే.. తప్పనిసరి పరిస్థితుల్లో, వంద కోట్లు కంటే విలువైన ప్రాణం కోసం, అన్యాయం ముందు తలవంచి గోవిందరాజు సంతకం పెట్టాడు. ఆ ఒక్క సంతకంతో.. గోవిందరాజు మొహంలో తప్ప.. అక్కడున్న అందరి మొహాల్లో లక్ష్మీకళ ఉట్టిపడింది. అన్నట్టు ఇంత జరుగుతున్నా అక్కడ ఇతరులు ఎవరూ లేరా? అని మీకు అనుమానం రావొచ్చు. అక్కడ నిజంగానే ఎవరూ లేరు.. ఎందుకంటే వాళ్ళు పెట్టిన ముహూర్తం అలాంటిది మరి. శూన్యమాసం-అమావాస్య.. బుద్ధి ఉన్నోడు ఎవడైనా రిజిస్ట్రేషన్ పెట్టుకుంటాడా? వీళ్లంటే.. వంద కోట్ల కబ్జా ల్యాండ్ కాబట్టి.. బుద్ధిని పక్కనపెట్టి.. బెదిరించి.. రిజిస్ట్రేషన్ చేపించుకున్నారు. ఇప్పుడు అర్థమైందా వాళ్ళ శూన్యమాసం-అమావాస్య కాన్సెప్ట్ ఏంటో?!!.. ఈ కిడ్నాప్- కబ్జా వ్యవహారంపై.. సర్పవరం పోలీస్ స్టేషన్ లో 330/217 నెంబర్ తో కేస్ రిజిస్టర్ అయింది. అదేంటో.. FIR కూడా అయిన తరువాత.. చార్జిషీట్ దాఖలు చేయడానికి.. రాజమౌళి RRR చేయడానికి తీసుకునే టైం కన్నా ఎక్కువ తీసుకుంటున్నారు సర్పవరం పోలీసులు. రెండున్నరేళ్లుగా నాన్చుతూనే ఉన్నారు. ఈ విషయం గురించి.. ఏపీ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కాకినాడ పోలీసులు రిపోర్ట్ కూడా పంపారు. కానీ చార్జిషీట్ దాఖలు చేసే విషయంలో సర్పవరం సీఐ డిలే చేస్తూనే ఉన్నాడు. ఏంటి ఆ సీఐ ధైర్యం?.. భయపడితే భయపడటానికి ఆయన పోస్ట్ మ్యాన్ కాదు.. పోలీసోడు.. దానికితోడు పొలిటిషీయన్స్ సపోర్ట్ ఉన్నోడు. అవును.. ఈ వ్యవహారంలో.. బడా పొలిటిషీయన్స్ సపోర్ట్ కూడా ఉంది. అదే పోలీసుల ధైర్యం... శ్రీకాకుళం జిల్లాకి చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ నేత.. అలాగే గత ప్రభుత్వ హయాంలో విప్ గా పనిచేసిన నేత.. వీరిద్దరి సాయంతో సర్పవరం పోలీస్ స్టేషన్ ని ఫుల్ గా influence చేసే ప్రయత్నం బలంగా నడుస్తుంది. అందుకే చార్జిషీట్ కి మోక్షం కలగట్లేదు. ఇంత పెద్ద కిడ్నాప్- కబ్జా జరిగితే అస్సలు చర్యలే తీసుకోకుండా ఎలా ఉన్నారని అనుకుంటున్నారేమో... అబ్బో చాలా పెద్ద చర్య తీసుకున్నారు. భోగాపురం ఇన్స్పెక్టర్ ని బదిలీ చేసారు. అదేంటి!!.. అంత జరిగితే కేవలం బదిలీనా అనుకోవద్దు.. రాజకీయ ఒత్తిళ్లు అలాంటివి మరి.. అర్థంచేసుకోవాలి... ఇంకో విషయం ఏంటంటే.. ఈ వ్యవహారం డీజీపీ ఆఫీస్ కి కూడా చేరింది. మరి ఇంకేంటి.. వెంటనే అందరి మీద చర్యలు తీసుకొని ఉంటారుగా అంటారా? అబ్బో.. మీరు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ సినిమాలు చూసి బాగా మోసపోయారు... అలాంటి పప్పులు ఇక్కడ ఉడకవు. వాస్తవానికైతే... CRPC 41A కింద డీజీపీ నియమించే ఓ సీనియర్ అధికారి.. విచారణ జరిపి.. తదుపరి చర్యల వరకు.. ఆ సీఐని సస్పెండ్ చేసే అవకాశముంది. కానీ ఇక్కడ అలాంటిదేం జరగలేదు. ఏదో ఫార్మాలిటీకి బదిలీతో సరిపెట్టారు. గోవిందరాజు ని బెదిరించి వంద కోట్ల విలువైన ల్యాండ్ అన్యాయంగా లాక్కున్నారు. అయినా తప్పు చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు. పైగా గోవిందరాజునే ఇంకా టార్చర్ చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లలో భాగంగా.. ప్రస్తుత సర్పవరం సీఐ మరియు అర్బన్ డీఎస్పీ.. గోవిందరాజుని పదేపదే తిప్పించుకుంటున్నారు. ఇక కాకినాడలో ఉద్యోగం వెలగపెడుతున్న.. ఇప్పటి ఓ మంత్రిగారి బావమరిది.. రంగంలోకి దిగడంతో ఈ కేసు మరింత డైల్యూట్ అయింది. అసలే భోగాపురంలో ఎయిర్ పోర్ట్ అంటున్నారు. రెక్కలున్న విమానాలు వస్తున్నాయి అంటే.. ఆటోమేటిక్ గా భూముల ధరలకు రెక్కలొస్తాయి కదా.. అందుకే పోలీసులు- పొలిటీషియన్స్ అండతో మాఫియా ఇంతలా రెచ్చిపోతుంది. అంతేకాదు.. ఈ వ్యవహారం వెనుక.. 2017 ప్రాంతంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పనిచేసిన ఓ కలెక్టర్ మరియు ఎస్పీ పాత్ర ఉన్నట్టు.. సెక్రటేరియట్ వర్గాల వద్ద స్పష్టమైన సమాచారం ఉంది. టీడీపీ పెద్దతలకాయలకు సన్నిహితులైన ఈ ఐఏఎస్, ఐపీఎస్ లు.. వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా తమ హవా కొనసాగించడం... అందరినీ ముక్కు, మూతి ఇలా అన్నింటి మీదా వేలేసుకునేలా చేస్తుంది. ఇంతకీ ఆ ఐఏఎస్ & ఐపీఎస్ ఎవరు? * ఒకరు.. పరుల అవినీతి మీద కాంతివంతంగా దండెత్తే ఐఏఎస్... * ఇంకొకరు.. పొద్దునలేస్తే సుభాషితాలు చెప్పే పాలమీగడ లాంటి ఐపీఎస్.. ఈయనకి టెక్నాలజీ మీద గ్రిప్ బాగా ఎక్కువ. ఈ వ్యవహారంలో వీరిద్దరి పాత్ర కూడా ప్రముఖంగా ఉంది. 'వంద గొడ్లను తిన్న రాబందు కూడా ఒక్క గాలివానకు కూలిపోతుంది' అన్నట్టు.. ఈ అవినీతి రాబందులను భయపెట్టే గాలివాన ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. మాఫియా లీడర్ బలగ ప్రకాష్ కనుసన్నల్లో.. ఐఏఎస్, ఐపీఎస్లు, పోలీసులు, పొలిటీషియన్స్ అండతో జరిగిన ఈ అన్యాయంపై.. గోవిందరాజు కొద్ది నెలలుగా పోరాడుతూనే ఉన్నాడు. న్యాయం కోసం ఆయన ఎక్కని గుమ్మం దిగని గుమ్మం లేదు. సన్నిహితుల సాయంతో న్యాయం కోసం పోరాడుతున్నాడు. ఆ పోరాడంతో కొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. వాస్తవానికి అప్పుడు జరిగింది తప్పుడు రిజిస్ట్రేషన్ అని పేర్కొంటూ... భోగాపురం రిజిస్టార్ డాక్యుమెంట్ రైటర్.. 2019 అక్టోబర్ 19 తేదీన.. 164 CRPC స్టేట్మెంట్ ని.. కాకినాడ ఫస్ట్ అడిషనల్ జ్యూడిషల్ సివిల్ జడ్జ్.. ముందట ఇచ్చాడు. అంతేకాదు.. సీసీ కెమెరాలతో దొంగలని పట్టుకునే పోలీసులు.. ఆ సీసీ కెమెరాల పుణ్యమా అని అడ్డంగా బుక్ అయ్యారు. సర్పవరం లో కిడ్నాప్ చేసి.. భోగాపురం తీసుకెళ్లిన.. నాలుగు గంటల తతంగమంతా.. పలు చోట్ల సీసీ కెమెరాలలో రికార్డు అయింది. క్షవరం అయితే కానీ ఇవరం రాదని.. సీసీ కెమెరాలు చూసి దోషులని పట్టుకునే పోలీసులు.. ఆ సీసీ కెమెరాల సంగతి మర్చిపోయి ఇలా దొరికిపోవడం కామెడీగా ఉంది. మొత్తానికి కొద్దికొద్దిగా కదులుతున్న తీగతో.. దందా చేసి ఇన్నాళ్లు డొంకలో దాక్కున్నవారు.. ఇప్పుడిప్పుడే భయంతో వణుకుతున్నారు. ముఖ్యంగా డీజీపీకి కంప్లైంట్ వెళ్లడంతో ఐఏఎస్, ఐపీఎస్ ఒణికిపోతున్నారట. మరి ముఖ్యంగా ఆ ఐపీఎస్ అయితే.. డైపర్ వేసుకొని తిరుగుతున్నాడని టాక్... ఇప్పటికే ఆ ఐపీఎస్ గడిచిన రెండు నెలల్లో.. బలగ ప్రకాష్ టీం తో.. ఒకే హోటల్ లో 17 సార్లు సిట్టింగ్ వేశాడు. దీన్నిబట్టే అర్థంచేసుకోవచ్చు ఆ ఐపీఎస్ ఎంతలా వణికిపోతున్నాడో!! తప్పుని సరిదిద్దాల్సిన పోలీసులే.. ఇంత పెద్ద తప్పు చేశారు. ఈ విషయం డీజీపీ దృష్టికి కూడా వెళ్ళింది. మరి ఆయన ఈ కిడ్నాప్-కబ్జా వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినవారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు?.. బాధితుడికి ఎప్పుడు న్యాయం చేస్తారు? ఆయన ఇలాగే మౌనంగా ఉంటే ప్రజలకు పోలీసు వ్యవస్థ మీదే నమ్మకం పోతుంది. ఇక ఈ విషయంలో సర్కార్ కూడా అడుగు ముందుకేసి బాధితుడికి న్యాయం చేయాల్సిన అవసరముంది. అవినీతి రహిత పాలనే అందించడమే తమ లక్ష్యమని చెప్పుకునే అధికారపార్టీ.. అవినీతి-అన్యాయం చేసిన వారికి.. పరోక్షంగా అండగా ఉండటం ఎంత వరకు కరెక్ట్? గత ప్రభుత్వం మీద, అప్పుడు వారికి సన్నిహితంగా ఉన్న కొందరు అధికారులపైనా.. ఇప్పటి అధికారపార్టీ నేతలు పదేపదే అవినీతి ఆరోపణలు చేస్తుంటారు. మరి ఈ వ్యవహారం మీద ఎందుకు నోరు మెదపడం లేదు? ఇందులో తమ పార్టీ నేతలు కూడా ఉన్నారా? లేక పార్టీ సీనియర్ నేతైన మంత్రి గారి బావమరిది ఇన్వాల్వ్ అయ్యాడని వెనకడుగు వేస్తున్నారా? ప్రభుత్వం దీనిపై స్పందించాలి. ఈ భోగాపురం భాగోతం వెనుకున్న వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి.. బాధితుడికి న్యాయం చేయాలి. లేదంటే ప్రభుత్వం మీద కూడా నమ్మకం పోతుంది.  

క‌విత‌, ష‌ర్మిలా రాజ్య‌స‌భ‌కు వెళ్తారా?

తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ సీట్ల కోసం అధికార టీఆర్ఎస్‌లో పోటాపోటీ నెలకొంది. షెడ్యూల్‌ ప్రకారం రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్‌ మార్చి 6న జారీ కానుంది. 13వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది.  సామాజిక కోణంలో తమకు అవకాశం దక్కుతుందని పలువురు సీనియర్లు భావిస్తుండగా, ఇప్పటివరకు పార్టీ తరఫున రాజ్యసభ పదవులు దక్కని వర్గాల వారూ ఆశగా ఎదురుచూస్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్‌ నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.  నిజామాబాద్‌ మాజీ ఎంపీ కవితను ఈసారి పార్టీ తరఫున రాజ్యసభకు పంపిస్తార‌నే ప్ర‌చారం విస్తృతంగా జరుగుతోంది. అయితే సి.ఎం. కేసీఆర్ ఆలోచ‌నే ఎలా వుందో ఎవ‌రూ అంచ‌నా వేయ‌లేక‌పోతున్నారు. కెటిఆర్ సి.ఎం. అవుతారా? క‌వితా రాజ్య‌స‌భ‌కు వెళ్తారా?  అయితే హ‌రిష్‌రావు ఈ ప‌రిణామాల‌పై ఎలా స్పందిస్తారు? అనే అంశంపై టిఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌ల్లో విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతోంది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్న సీఎం కేసీఆర్‌ తన తరఫున ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు ప్రయత్నాలకు నమ్మకమైన వారి కోసం అన్వేషిస్తున్నారు.  రాజ్యసభ సీటు భర్తీ సామాజిక కోణంలోనే ఉంటుందని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు భావిస్తున్నారు. ఏపీ కోటాలో పదవీ విరమణ చేస్తున్న టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావుకు వయసు రీత్యా ఈసారి అవకాశం ఉండకపోవచ్చన్న అంచనాలున్నాయి. రెడ్లకు అవకాశం లభిస్తే, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, మాజీీ స్పీకర్‌ కె.ఆర్‌.సురే్‌షరెడ్డి, ఎమ్మెల్సీ నాయిని నర్సింహారెడ్డి మధ్య పోటీ ఉంటుందని చెబుతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే మండవ వెంకటేశ్వరావు, తుమ్మల నాగేశ్వరరావు పేర్లు పరిశీలించవచ్చని అంటున్నారు. బీసీలకు అవకాశం ఇస్తే సిరికొండ మధుసూదనాచారి, బస్వరాజు సారయ్య పేర్లు పరిశీలిస్తారని చెబుతున్నారు. ఎస్సీ కోటాలో భర్తీ చేయాలని భావిస్తే కడియం శ్రీహరి, మాజీ ఎంపీ మంద జగన్నాథం పేర్లు పరిశీలిస్తారని అంటున్నారు. ఎస్సీల్లోనే మాలలకు అవకాశం ఇవ్వాలని అనుకుంటే, టీఎ్‌సఐఐసీ చైర్మన్‌ గాదరి బాలమల్లు, ఎస్టీ అయితే సీతారాంనాయక్‌ పేరు ఉండొచ్చని అంటున్నారు. అనూహ్యంగా ఒక పారిశ్రామికవేత్తను టీఆర్‌ఎస్‌ తరఫున రాజ్యసభకు పంపాలని అనుకుంటే హెటిరో అధినేత పార్థసారథిరెడ్డి పేరు పరిశీలించవచ్చని చెబుతున్నారు.  ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజ్యసభ స్థానాలు ఎవరికీ కేటాయించాలని ఇన్నాళ్లు చర్చించిన అధికార పార్టీ ఓ నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది. ఈ మేరకు ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే వారి జాబితా సిద్ధమైనట్టు సమాచారం.  కీలకమైన పదవులు కావడంతో పార్టీ నమ్ముకున్నోళ్లు.. తమకు అండగా నిలబడిన వ్యక్తులను ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాల్లో వార్త వినిపిస్తోంది.  మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి - సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మాజీమంత్రి - ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రఘువీరారెడ్డి కాకుంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ జాబితా ఫైనలైనట్టు తెలుస్తోంది.  షర్మిల ఆపద సమయంలో జ‌గ‌న్‌కు తోడుగా నిలిచారు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ పాదయాత్ర చేశారు. కష్టకాలంలో పార్టీకి షర్మిల పెద్ద దిక్కుగా నిలిచారు. తన సొంత మీడియా సాక్షి ప్రారంభించినప్పటి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ తో ఉన్నారు. సాక్షి పత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ గా కొనసాగుతూనే జగన్ కు రాజకీయాలపై సలహాలు సూచనలు ఇచ్చారు. ఆ తర్వాత సజ్జలను పార్టీలోకి ఆహ్వానించి పెద్ద పదవే ఇచ్చారు. విజయ సాయిరెడ్డి తర్వాత జగన్ కు అత్యంత నమ్మకస్తుడు సజ్జలనే. ఆయన పార్టీలో జగన్ రాజకీయ సలహాదారుడిగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో పని చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడిగా కొనసాగుతున్నారు. కడప జిల్లాకు చెందిన వ్యక్తి. ఎప్పుడూ తన తోడు ఉండడంతో ఆయనను రాజ్యసభకు జగన్ పంపించనున్నట్టు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాకు చెందిన వైవీ సుబ్బారెడ్డి జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు. గతంలో ప్రకాశం ఎంపీగా సుబ్బారెడ్డి పని చేశారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో సుబ్బారెడ్డి పోటీ చేయలేదు. అప్పుడు ఆయన పదవులు ఆశించకపోవడంతో ఇప్పుడు రాజ్యసభకు పంపించాలని నిర్ణయానికి వచ్చారు. పార్టీలో కీలక నాయకుడిగా గుర్తింపు పొందిన సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపితే న్యాయం జరుగుతుందనే భావనలో జగన్ ఉన్నారంట. అనూహ్యంగా రాజ్యసభకు పంపే జాబితాలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రఘువీరారెడ్డి ఉండడం గమనార్హం. అనంతపురము జిల్లాకు చెందిన రఘువీరారెడ్డికి పిలిచి మరి రాజ్యసభ సీటు ఇస్తామంటున్నారు. యాదవ సామాజికి వర్గానికి చెందిన రఘువీరారెడ్డి జగన్ తండ్రి వైఎస్సార్ తో మంచి అనుబంధం ఉంది. అయితే రఘువీరారెడ్డి కాకుంటే మరొకరిని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జిగా పని చేసిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ను రాజ్యసభకు పంపించాలని భావిస్తున్నారంట.  కృష్ణాజిల్లా యాదవ సామాజిక వర్గానికి చెందిన చలమేశ్వర్ సేవలను వినియోగించుకునేలా పార్టీ ఒక నిర్ణయానికి వచ్చిందంట. ఎందుకంటే తరచూ జగన్ న్యాయస్థానాల్లో చిక్కులు ఎదుర్కొంటున్నారు. చలమేశ్వర్ సేవలు వినియోగించుకుంటే జగన్ సేఫ్ గా ఉండడంతో పాటు న్యాయ కోవిదుడికి గౌరవంగా రాజ్యసభను ఇద్దామనే ఆలోచనలో ఉన్నారంట.

అధికారంలో ఉంటే ఒకలా... ప్రతిపక్షంలో ఉంటే మరోలా... వైజాగ్ ఎపిసోడ్ నీతి ఏంటి?

రాజకీయాల్లో ఓడలు బళ్లు అవుతాయి. బళ్లు ఓడలవుతాయి. ప్రజాస్వామ్యంలో ఇది సాధారణమే. ప్రస్తుతం దేశంలోనూ, అనేక రాష్ట్రాల్లోనూ ఇదే జరుగుతోంది. నిన్నమొన్నటివరకు దేశంలోనూ, ఆయా రాష్ట్రాల్లో చక్రం తిప్పినవారంతా, అనామకులుగా మారిపోయారు. దశాబ్దాల తరబడి రాజ్యాన్ని ఏలినవారు, ఇప్పుడు సైడైపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో పలువురు ఉద్దండుల పరిస్థితి ఇప్పుడలాగే కనిపిస్తోంది. ఎంతోమంది ముఖ్యనేతలు తీవ్ర గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మళ్లీ వాళ్లకు మంచి రోజులు వస్తాయని మాత్రం కచ్చితంగా చెప్పలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటిలోనూ ఊహించని రాజకీయ మార్పులు జరగడంతో ఓడలు బళ్లు... బళ్లు ఓడలయ్యాయి.  అయితే, అధికారంలో ఉండగా ఒకలా, ప్రతిపక్షంలా ఉంటే మరోలా వ్యవహరించడం సర్వసాధారణంగా కనిపిస్తుంది. విపక్ష నేతగా ఉన్న సందర్భాల్లో నేతలు వ్యవహరించే తీరు ఒక్కోసారి సాధారణ ప్రజాస్వామిక సూత్రాలకు విరుద్ధంగా ఉంటుంది. నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడేళ్ళ క్రితం విపక్ష నేతగా ఉన్నారు. అప్పట్లో ఆయన ప్రత్యేక హోదా కోసం పట్టుదలతో ఉన్నారు. క్యాండిల్ ర్యాలీ నిర్వహించేందుకు వైజాగ్ పర్యటనకు వెళ్లారు. అప్పటికే అక్కడ సీఐఐ పార్ట్ నర్ షిప్ సమ్మిట్ జరుగుతోంది. ఆ నేపథ్యంలో క్యాండిల్ ర్యాలీకి అనుమతిని ప్రభుత్వం నిరాకరించింది. అయినా కూడా జగన్ వైజాగ్ చేరుకున్నారు. అక్కడి నుంచి నగరంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పట్లో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. తనను అడ్డుకోవడంపై అప్పట్లో విపక్ష నేతగా ఉన్న జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇక, ఇప్పడు ఏపీలో రాజధాని రగడ కొనసాగుతోంది. అందులో భాగంగా చంద్రబాబు చేపట్టిన వైజాగ్ యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇందులో పోలీసులను తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. అయితే, ఇలాంటి సమయంలో విపక్ష నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎలాగైనా పోలీసు వలయాన్ని ఛేదించుకోవాలని తాము అనుకున్నది చేయాలని చూస్తుంటారు. పొలిటికల్ మైలేజ్ పొందాలని ప్రయత్నిస్తుంటారు. చంద్రబాబు వైజాగ్ టూర్లోనూ అదే జరిగిందనే మాట వినిపిస్తోంది. నాయకులు విపక్షంలో ఉన్నప్పుడు పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నించడంలో తప్పు లేదు. కాకపోతే...ఆ ప్రయత్నాలు సమాజంలో ఉద్రిక్తతలు పెంచేవిగా మాత్రం ఉండకూడదంటున్నారు. అదే సమయంలో అధికారంలో ఉన్న నాయకులు ప్రజాస్వామ్యంలో విపక్షాలకు ఉండే ప్రాధాన్యాన్ని గుర్తించాలని సూచిస్తున్నారు. అధికారపక్షం, విపక్షం....రెండూ ప్రజాస్వామ్యానికి రెండు చక్రాల్లాంటివని, ఏ ఒక్కటి సరిగా లేకున్నా ప్రజాస్వామ్యం కుంటుపడుతుందని గుర్తుచేస్తున్నారు.

రాజీవ్ గాంధీ మరణించాక ఆ సీక్రెట్ బయటపెట్టిన వాజపేయి!!

అమావాస్య రోజు చందమామని చూడాలనుకోవడం, రాజకీయాలలో విలువలు గురించి మాట్లాడాలనుకోవడం ఒకటే అంటుంటారు. అవును ఈ తరం రాజకీయాలను చూస్తే నిజమే అనిపిస్తుంది. ఒకరిపై ఒకరు హద్దు మీరి విమర్శలు చేసుకోవడమే తప్ప.. విలువైన రాజకీయాలు చేసేవారు ఎంతమంది ఉన్నారు ఈరోజుల్లో. ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రతిపక్ష నేతల మీద కక్ష తీచుకోవాలన్న ధోరణే తప్ప.. ప్రజల కోసం ఒకరి సూచనలను ఒకరు గౌరవించుకుంటూ విలువైన రాజకీయాలు చేసేవారు ఎక్కడున్నారు?. ఈతరం రాజకీయ నాయకులు ముందుతరం వారిని చూసి ఎంతో నేర్చుకోవాలి. మాజీ ప్రధానులు రాజీవ్ గాంధీ- వాజపేయి మధ్య జరిగిన ఓ సంఘటన తెలిస్తే.. ఈ తరం రాజకీయ నాయకులు సిగ్గుతో తలదించుకుంటారు. అది రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయం. అప్పుడు వాజపేయి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వారి మధ్య జరిగిన ఓ అపురూప సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  " సార్..ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు లైన్ లో వున్నారు..మీతో మాట్లాడుతారుట ".. ఫోన్ పట్టుకుని వాజపేయి దగ్గరికి వచ్చి చెప్పాడు ఆయన వ్యక్తిగత కార్యదర్శి.." ఫోన్ అందుకున్న వాజపేయి ప్రధానమంత్రి తో రెండు నిమిషాలు మాట్లాడారు. ఫోన్ పెట్టేసి వాజపేయి కార్యదర్శి వంక చూసి "మనం ప్రధానమంత్రి తో పాటు ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనటానికి అమెరికా వెళ్తున్నాం.. ఏర్పాట్లు చూడండి" అనడంతో తను విన్నది నిజమేనా అని ఆశర్యంతో మరోమారు అటల్జీ ని అడిగి కన్ఫర్మ్ చేసుకున్నాడు కార్యదర్శి. " సార్..పత్రికలకు ప్రెస్ నోట్ పంపమంటారా?" నసిగాడు కార్యదర్శి వాజపేయి ఒక్క క్షణం అతనివంక చూసి నవ్వుతూ "నిక్షేపంగా" అన్నారు. ఈ వార్త అప్పట్లో ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ, అటు బీజేపీ లోనూ పెద్ద దుమారం సృష్టించింది. రాజీవ్ గాంధీ నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు సైతం ముక్కున వేలేసుకున్నారు. "సాక్షాత్తు ప్రధానమంత్రి హోదాలో ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి అటెండ్ అవుతూ ప్రతిపక్షపార్టీ నేతను వెంటపెట్టుకెళ్లటం ఏంటి?" అంటూ పార్టీలో సన్నాయి నొక్కులు నొక్కారు. కానీ రాజీవ్ గాంధీ మాత్రం వాజపేయి ని తీసుకెళ్లడం వెనుక అసలు కారణాన్ని ఎవరికీ చెప్పలేదు. కానీ ఆయన మరణానంతరం వాజపేయే అసలు విషయాన్ని ప్రపంచానికి చెప్పారు.. ఆన్ టోల్డ్ వాజపేయి అనే పుస్తకం ద్వారా.. అదీ ఆయన మాటల్లోనే.. "1985 లోనే నాకు ఒక కిడ్నీ దెబ్బ తిని వైద్యం తీసుకుంటున్నా.1988 నాటికి రెండో కిడ్నీ కూడా దెబ్బతింది. డాక్టర్లు తక్షణం వైద్య చికిత్స అవసరం అన్నారు. ఇక్కడ కన్నా అమెరికాలో మెరుగైన వైద్యం అందుబాటులో ఉన్నందున అక్కడికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఈ విషయం తెలుసుకున్న రాజీవ్ గాంధీ ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి నన్ను కూడా రమ్మని ఫోన్ లో కోరారు. కానీ చివరగా ఆయన ఒక మాట చెపుతూ.. 'అటల్ జీ.. ఈ పర్యటనను పూర్తిగా మీ వైద్యానికి ఉపయోగించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇండియా కి రండి' అని చెప్పారు. ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే అది రాజీవ్ గాంధీ నాకు చేసిన ఉపకారం వల్లనే. నా కన్నా ఇరవై ఏళ్ళ చిన్నవాడు అయిన రాజీవ్ నాకు తమ్ముడిలాంటి వాడే" అని వాజపేయి అన్నారు. అది విలువలతో కూడిన రాజకీయమంటే. రాజీవ్ గాంధీ, వాజపేయి రాజకీయంగా ప్రత్యర్థులు కావచ్చు కానీ ఒకరినొకరు గౌరవించుకుంటూ విలువైన రాజకీయాలు చేశారు. వారిని చూసి ఈ తరం రాజకీయ నాయకులు ఎంతో నేర్చుకోవాలి. పొద్దున్న లేస్తే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే అధికార-ప్రతిపక్ష పార్టీల నాయకులు.. రాజకీయాలు పక్కన పెట్టి అప్పుడప్పుడన్నా నైతిక విలువలు పాటించాలన్న సూత్రం.. ఇలాంటి విషయాలు తెలుసుకుని అయినా పాటిస్తే బాగుండు..!

ఇలా చేస్తే భయం కాస్తా పారిపోతుంది

ఏం జరగబోతోందో అన్న అనుమానమే భయానికి దారితీస్తుంది అంటారు పెద్దలు. మనలో ఏర్పడే భయాలు కొంతవరకూ సహేతుకమే కావచ్చు. ప్రమాదాల నుంచి పరాజయాల నుంచి మనల్ని కాపాడవచ్చు. కానీ చీటికీ మాటికీ భయపడుతూ కూర్చుంటే జీవితమే ఒక జాగ్రత్తగా మారిపోతుంది. అందుకనే భయాలను దాటినవారికే విజయం లభిస్తుందని చెబుతుంటారు నిపుణులు. మరి ఆ భయాలను దాటేందుకు వారు ఇచ్చే సలహాలు...   భయాన్ని పసిగట్టండి మెదడులో అసంకల్పితంగా ఏర్పడే భయం తన ప్రభావాన్ని శరీరం మీద చూపి తీరుతుంది. ఆ లక్షణాలను పసిగట్టే ప్రయత్నం చేస్తే... మనలో ఉన్న భయం అవసరమా కాదా అని తర్కించే అవకాశం దొరుకుతుంది. గుండె వేగంగా కొట్టుకోవడం, తల దిమ్మెక్కిపోవడం, చెమటలు పోయడం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది... లాంటి లక్షణాలు ఏర్పడిన వెంటనే, వాటికి భయమే కారణమేమో గమనించాలి.   అలవాటు చేసుకోండి ఇదివరకు ఎప్పుడూ చేయని పని అనుమానానికి దారితీస్తుంది. ఆ ఆనుమానం భయాన్ని రేకెత్తిస్తుంది. కాబట్టి మీకు భయం కలిగిస్తున్న పనిని నెమ్మది నెమ్మదిగా అలవాటు చేసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు మీ భయం నిర్హేతుకం అని తేలిపోతుంది. పరీక్షలంటే భయముంటే మాక్ టెస్టులు రాసే ప్రయత్నం చేయండి, కొత్త వ్యక్తులను కలవడంలో భయం ఉంటే చొరవగా నలుగురిలో కలిసే ప్రయత్నం చేయండి.   భయపడే పని చేసేయండి ఒక పని చేయాలంటే మీకు చాలా భయం. కానీ ఆ పని విజయవంతం అయితే మీ జీవితమే మారిపోతుందని తెలుసు! అలాంటప్పుడు భయపడుతూ కూర్చుంటే లాభం లేదు కదా! ఒక్కసారి గుండెని అదిమిపట్టి అనుకున్న పనిని చేసేయండి. శరీరాన్ని ముందుకు దూకించండి. ఉదాహరణకు మీకు ఇంటర్వ్యూ అంటే భయం. కానీ ఫలానా కంపెనీలో మీలాంటివారికి ఉద్యోగం ఉందని తెలిసింది. వెంటనే మీ రెజ్యూమ్ని తీసుకుని ఆఫీసుకి చేరిపోండి. ఆ తర్వాత ఎలాగూ ఇంటర్వ్యూని ఎలాగూ ఎదుర్కోక తప్పదు.   తాత్సారంతో లాభం లేదు భయపడే పనిని వాయిదా వేసి, ఆ భయం నుంచి తాత్కాలికంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తాం. ఫలితంగా పని మరింత క్లిష్టతరం అయిపోతుంది. దాంతో భయమూ అంతకంతకూ పెరిగిపోతుంది. కాబట్టి వాయిదా వల్ల హాని తప్ప ఉపయోగం లేదు. అందుకనే అనుకున్న పని పూర్తిచేయడానికి కొన్ని నిర్దిష్టమైన డెడ్లైన్స్ పెట్టుకోండి. పని చేయబోతున్నానని ఇతరులతో ఒప్పేసుకోండి. తప్పించుకునే అవకాశం లేని విధంగా బాధ్యతని తలకెత్తుకోండి.   చిన్నపాటి టెక్నిక్స్ పాటించండి భయాన్ని ఎదుర్కోవడానికి చాలా చిట్కాలే ఉన్నాయి. వాటిలో మీకు అనువుగా ఉండేదాన్ని ఎన్నుకోండి. ఊపిరి నిదానంగా పీల్చుకుని వదలడం, ఉద్వేగంతో బిగుసుకుపోయిన కండరాల మీద ధ్యాస నిలపడం... లాంటి చిట్కాలు చాలావరకూ సాయపడతాయి. - నిర్జర.  

సోదర ప్రేమకు చిహ్నాం

వేదకాలం నుంచి నేటివరకు మన జీవనవిధానంలో భాగంగా నిర్వహించే పండుగలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కుటుంబవ్యవస్థ పునాదులపై విరాజిల్లుతున్న భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగ ఆత్మీయానురాగాలను పెంచేవే. సోదరప్రేమకు చిహ్నాంగా మనం జరుపుకోనే రాఖీ చరిత్ర పురాణాల నుంచే ప్రారంభమైంది. భారతీయ వారసత్వవైభవానికి ప్రతికగా నేటికీ కొనసాగుతోంది. శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమిని రాఖీ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమిగా మన తెలుగు నాట పిలిస్తే  రక్షా మంగళ్‌, రక్షా దివస్‌, రాఖీ పూనవ్‌,  కజారి పౌర్ణమి, నారియల్ పౌర్ణమి, గ్రహ పౌర్ణమి, సలోని ఉత్సవ్‌ తదితర పేర్లతో దేశంలో వివిధ ప్రాంతాల్లో వ్యవహరిస్తారు. పేర్లు ఎన్నైనా రాఖీ మనుషుల మధ్య, ప్రకృతికి, మనిషికి మధ్య అనుబంధాన్ని గుర్తుచేసే పర్వదినం. హిందువులు, సిక్కులు, జైనులు కూడా ఈ పర్వదినాన్ని జరుపుకొంటారు. ‘రాకా’ అంటే నిండుదనం, సంపూర్ణత్వం. రాకా చంద్రుడు అంటే పున్నమి చంద్రుడు. ఈ పూర్ణిమనాడు ధరించే రక్షను రాఖీగా వ్యవహరిస్తారు. ఈ రోజు అక్కచెల్లెల్లు తమ అన్నాతమ్ముళ్లకు నుదట  తిలకం దిద్ది చేతికి రాఖీ కడితే వారికి ఎలాంటి ఆపదలు రావని నమ్ముతారు. రాఖీ కట్టించుకున్న సోదరులు తమకు అండగా ఉంటారని విశ్వసిస్తారు. పురాణాల్లో. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు తిరిగి విజయం సాధించేలా అతని భార్య  శచీదేవి శ్రావణపౌర్ణమి రోజు అతని చేతికి రక్ష కట్టగా దేవతలందరూ కూడా రక్షలను తీసుకువచ్చి కట్టారట. దాంతో రెట్టింపు శక్తితో యుద్ధరంగానికి వెళ్ళిన ఇంద్రుడు విజయుడై తిరిగివచ్చాడట. శిశుపాలుడిని శిక్షించే సమయంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందట. అది గమనించిన ద్రౌపది తన చీర కొంగు చింపి వేలికి కట్టు కట్టిందట. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని  శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇచ్చాడట. అందుకు ప్రతిగా కౌరవసభలో ద్రౌపదీ వస్త్రాపరణంలో ఆమెకు కృష్టుడు చీరలను ఇచ్చి దుశ్సాసనుడి  దురాగతం నుండి ఆమెను కాపాడాడని చెప్తారు. చరిత్రలో.. ప్రపంచాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలన్న తపనతో భారతదేశం పైకి దండెత్తి వచ్చిన గ్రీకు రాజు అలెగ్జాండర్ ప్రాణాలను రాఖీ కాపాడిందన్నవిషయం చరిత్ర పుటల్లో కనిపిస్తుంది. తక్షశిల రాజు పురుషోత్తముడు  అలెగ్జాండర్ పై యుద్ధం గెలిచినా అతడిని చంపకుండా వదిలేస్తాడు. ఇందుకు కారణం అలెగ్జాండర్ భార్య  రుక్సానా తన భర్తను చంపవద్దని కోరుతూ పురుషోత్తముడికి రాఖీ పంపుతుందట. వివిధ రాష్ట్రాల్లో... ఉత్తరభారత్ లో  చాలా పెద్దఎత్తున ఈ పండుగ చేస్తారు. తమ సోదరి ఇంటికి అన్మదమ్ముళ్లు ఊరేగింపుగా వస్తారు. సోదరితో రాఖీ కట్టించుకుని ఆమెకు కానుకలు ఇస్తారు. సముద్రతీర రాష్ట్రాలైన మహారాష్ట్ర, గోవా, గుజిరాత్ లలోశ్రావణ పౌర్ణమిని నారియల్ పౌర్ణమిగా భావిస్తారు. పంటలు బాగా పండాలని, సకాలంలో వర్షాలు కురవాలని వరుణదేవుడిని ప్రార్థిస్తారు. అంతేకాదు మత్యకారులు సముద్రుడిని ప్రార్థించి ఈ రోజు తమ చేపల వేటను ప్రారంభిస్తారు.  జార్ఖండ్, బీహార్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ ఒడిశా రాష్ట్రంలో ఈ రోజు తమ పశుసంపదను అలంకరిస్తారు. వాటికి పూజలు చేస్తారు. కరోనా వ్యాప్తి కారణంగా ఎక్కువ మంది తమ సోదరులకు రాఖీ స్వయంగా కట్టలేకపోయినా అందుబాటులోకి వచ్చిన సోషల్ మీడియాతో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

పరాజయం నేర్పే పాఠాలు

జీవితం అంటేనే ఆటుపోట్ల సమాహారం. అందులో ఎప్పుడూ విజయాలే ఉండాలని కోరుకోవడం అత్యాశే అవుతుంది. ఒకోసారి పరాజయాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఆ పరాజయాలనే పరమపదసోపానాలుగా మల్చుకుంటే బతుకు కావడికుండలాగా సమంగా సాగిపోతుంది. ఇంతకీ ఆ పరాజయాలు నేర్పే పాఠాలు ఏమిటో!   డబ్బు విలువ నేర్పుతుంది చాలా పరాజయాలు ధననష్టంతోనే ముడిపడి ఉంటాయి. అప్పటి వరకూ ఈ చేతికి తెలియకుండా ఆ చేతితో ఖర్చుపెట్టేసిన బంగారుబాబులకి దరిద్రం ఎప్పుడైనా, ఎవరినైనా వరించవచ్చని తెలిసొస్తుంది. నిజంగా అవసరమైనప్పుడు మన దగ్గర డబ్బు లేకుండా పోవచ్చునని అర్థమవుతుంది. వెరసి... డబ్బు విలువ తెలిసొస్తుంది.   మనుషుల విలువ నేర్పుతుంది ‘విజయానికి బంధువులు ఎక్కువ’ అని పెద్దలు అంటూ ఉంటారు. కాస్తంత కష్టం రాగానే తుపాకీ దెబ్బకి కూడా దొరక్కుండా మన చుట్టుపక్కల జనాలంతా కనిపించకుండా పోవచ్చు. అలాంటి కష్ట సమయాల్లోనే ఎవరు మనవారో, ఎవరు కాదో అర్థమవుతుంది. ఇతరుల దృష్టిలో మన విలువ ఏమిటో తెలిసొస్తుంది. ఎవరి తత్వం ఏమిటో బోధపడుతుంది.   వినయం విలువ నేర్పుతుంది అంతాబాగున్నప్పుడు ఎగిరెగిరి పడుతూ ఉంటాము. మనంతటి వాడు లేడని మిడిసి పడుతూ ఉంటాము. ఒక్కసారి ఎదురుదెబ్బ తగిలితే కానీ మనం కూడా సాధారణ మనుషులమే అని తెలిసిరాదు. కష్టాలకీ, కన్నీళ్లకీ, పరాజయాలకీ, పరాభవాలకీ ఎవ్వరూ అతీతం కాదని తెలిసొస్తుంది. అంతేకాదు! ఇతరులని కూడా ఇక నుంచి గౌరవంగా చూడాలనీ, వినయంతో మెలగాలనీ అనిపిస్తుంది.   లక్ష్యం విలువ నేర్పుతుంది కష్టపడితే ఏదీ కాళ్లదగ్గరకి రాదు. అలా వచ్చేదానికి విలువ ఉండదు. లక్ష్యం ఎంత అసాధ్యంగా ఉంటే దాని ఛేదనలో అంత తృప్తి ఉంటుంది. ఒకటి రెండు సార్లు ఆ లక్ష్యాన్ని తప్పిపోయినప్పుడు దాని విలువ ఏమిటో తెలిసొస్తుంది. దాన్ని ఏలాగైనా ఛేదించి సాధించాలన్న పట్టుదలా పెరుగుతుంది.   జీవితం విలువ నేర్పుతుంది అప్పటివరకూ ఎడాపెడా సాగిపోయిన జీవితం పరాజయంతో ఒక్కసారిగా నిలిచిపోయినట్లు అవుతుంది. ఆ క్షణంలో మనకి కాలం, కష్టం, కరుణ, దురలవాట్లు, సంతోషం, అడ్డంకులు, ప్రణాళికలు... వంటి అనేక విషయాల గురించి అవగాహన ఏర్పడుతుంది. మన వ్యక్తిత్వం గురించీ, ఆలోచనా విధానం గురించి ఒక స్పష్టత కలుగుతుంది.   - నిర్జర.

విశాఖలో మరో అగ్ని ప్రమాదం

విశాఖపట్నంలో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా విశాఖలో మరో పేలుడు ఘటన చోటు చేసుకుంది. అచ్యుతాపురం సెజ్‌లోని విజయశ్రీ ఫార్మా కంపెనీలో ఈరోజు ఉదయం పేలుడు సంభవించింది. భారీగా మంటలు ఎగసిపడ్డాయి. పేలుడు ఘటనతో కంపెనీలోని కార్మికులు భయంతో పరుగులు తీశారు. సమీపంలో ఉన్న ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయి. ఘటనాస్థలికి దగ్గరలోనే అగ్నిమాపక యంత్రం ఉండటంతో, వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది.

కర్ణాటక మాజీ సీఎం సిద్ధ రామయ్యకు కరోనా

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు కరోనా పాజిటివ్‌ గా తేలింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. వైద్యుల సూచన మేరకు ఆసుపత్రిలో చేరానన్నారు. ఇటీవల తనను కలిసిన వారు క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పతో పాటు పలువురు ప్రముఖులు కరోనా బారినపడ్డారు. వరుసగా రాష్ట్ర ప్రముఖ నాయకులు కరోనా బారిన పడుతుండటంతో.. మిగతా నేతలు, సన్నిహితుల్లో ఆందోళన నెలకొంది.  కాగా, ఇప్పటి వరకు కర్ణాటకలో 1,39,571 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ప్రస్తుతం 74,469 యాక్టివ్‌ కేసులున్నాయి.

అప్పు తీర్చలేదని మహిళా రైతును ట్రాక్టర్ తో తొక్కించి చంపిన వైసీపీ నేత..

గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అప్పు వసూలు కోసం వైసీపీ నేత ఒకరు అరాచకానికి పాల్పడ్డాడు. వడ్డీకి తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదన్న కోపంతో ఓ గిరిజన మహిళా రైతును ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశాడు ఆ దుర్మార్గుడు. గుంటూరు జిల్లా నకరికల్లు శివారులో ఉన్న శివాపురం తండాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసుల కథనం మేరకు...శివాపురం తండాకు చెందిన గిరిజన దంపతులు రమావత్ మంత్రూ నాయక్, మంత్రుభాయి (55) అటవీ భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ రెండున్నర ఎకరాల అటవీ భూములపై వారు హక్కులు సాధించారు. ఐతే సాగు ఖర్చులు, కుటుంబ అవసరాల కోసం అదే మండలంలోని బోనముక్కల శ్రీనివాస రెడ్డి వద్ద రెండేళ్ల కిందట పొలం తాకట్టు పెట్టి రూ.3.80 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఐతే కొంత కాలంగా వ్యవసాయం లాభసాటిగా లేకపోవడంతో వారు శ్రీనివాస్ రెడ్డి దగ్గరి తీసుకున్న అప్పును తిరిగి చెల్లించలేకపోయారు.   దీంతో గత కొన్ని నెలలుగా అప్పుగా ఇచ్చిన సొమ్మును వడ్డీతో పాటు చెల్లించాలని శ్రీనివాసరెడ్డి పట్టుబడుతున్నాడు. అంతే కాకుండా అప్పు చెల్లించనిదే తాకట్టు పెట్టిన భూమిలో అడుగుపెట్టొద్దని హుకుం జారీ చేశాడు. అప్పును కనుక చెల్లించకుంటే తాకట్టుపెట్టిన భూమిని కూడా స్వాధీనం చేసుకుంటానని హెచ్చరిస్తూ వచ్చాడు. ఐతే ఇప్పటికిప్పుడు మా వద్ద అంత డబ్బు లేదు కాబట్టి పొలం అమ్మి అప్పు తీరుస్తాం.. లేదంటే భూమి మీరు తీసుకుని మిగిలిన మొత్తం మాకివ్వండి అని ఆ గిరిజన దంపతులు వేడుకున్నా శ్రీనివాస్ రెడ్డి కనికరించలేదు. ఈ విషయంలో గిరిజన దంపతులకు, అప్పు ఇచ్చిన శ్రీనివాస రెడ్డికి మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో గిరిజన దంపతులు పొలం సాగుచేసేందుకు పొలాల్లోకి రాగా సమాచారం అందుకున్న శ్రీనివాస రెడ్డి ట్రాక్టర్‌తో వారి గ్రామానికి చేరుకుని అప్పు చెల్లించకుండా పొలంలో అడుగుపెడితే ఊరుకోనని హెచ్చరించాడు. ఈ విషయంలో గిరిజన దంపతులకు, శ్రీనివాస్ రెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపంతో ఊగిపోయిన శ్రీనివాస రెడ్డి ట్రాక్టర్‌తో మంత్రుభాయిని తొక్కించి వెళ్లిపోయాడు. దీంతో రక్తపు మడుగులో ఆ ముయ్యల రైతు అక్కడికక్కడే కన్నుమూసింది. ఈ సంఘటన పై పోలీసులు కేసు నమోదుచేసి ట్రాక్టర్‌తో పాటు పరారీలో ఉన్న శ్రీనివాస్ రెడ్డి కోసం గాలిస్తున్నారు. మరో పక్క శ్రీనివాస్ రెడ్డిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని గిరిజన సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.

A Harmful Cup Of Tea!

Most people in India and in some other parts of the world, like to start their day with a delicious cup of tea. This is supported by the health benefits associated with having tea. But, its time people know the other side of the story. Tea is not as good as you may think it is. Most often it causes harm than doing good. Doctors agree with this claim after conducting a survey on people who drink tea, all over India. Research has revealed that over consumption of this beverage over many years, results in severe anemia. This is why instances of anemia are greater in the eastern part of the country, than elsewhere. In fact the trend of low hemoglobin starts in the east with 52.4% of the population suffering from anemia, followed by 48.6% in north, 39.3% in west and 27% in south. Coffee being the popular beverage in the southern region, people there are the least effected. Low hemoglobin is a direct result of lack of absorption of iron by the body. Having excessive amounts tea, prevents your body from absorbing the required amount of iron. Doctors say that tannins in tea bind with iron and stop the absorption process. Earlier it was believed that women were at a greater risk of being anemic because of menstruation and the habit of being the last one to eat in the family. However, this underwent a change because of the improvement in their social status and a drastic increase in the consumption of tea. Now the men are also equally at risk. So, next time you pick up a cup of tea, ask yourself if your ready to be deprived of iron. Kruti Beesam

యాలకులలో దాగున్న అమేజింగ్ హెల్త్ బెన్ఫిట్స్

రాత్రి నిద్రకు ముందు యాలకులు తిని వేడి నీళ్లు తాగితే కలిగే ప్రయోజనాలకు ఆశ్చర్యపోతారు! సుగంధ ద్రవ్యాల్లో యాలుకులు ప్రధానమైనవి.. బ్రిటీషర్లు మన దేశంపై దండెత్తి తొలి రోజుల్లో ఇక్కడ తిష్ట వేసిన ప్రధాన కారణాల్లో సుగంధ ద్రవ్యాలు మన దేశంలో దొరకడమే. అవి ఆరోగ్యానికి, అందానికి, ఆనందానికి, రుచికి.. బహుళ ప్రయోజనాలెన్నో ఉన్నాయి. ముఖ్యంగా యాలకులు మన . ఆరోగ్యానికి చేసే మేలు ఏంటో తెలిస్తే ఆశర్య పోతారు. అయితే రాత్రి పడుకోపోయే ముందు ఒక్క యాలుక్కాయను తిని గోరు వెచ్చని నీళ్ళను తాగితే ఏమవుతుందో తెలుసుకుందాం. ప్రతిరోజూ యాలుక్కాయను తిని గోరు వెచ్చని నీళ్ళను తాగడం వల్ల మన శరీరానికి ఎలాంటి మెడిసిన్ తో అవసరం ఉండదు. ఈ మద్య కాలంలో బరువు తగ్గించుకోవడాని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు చాలా మంది. సింపుల్ గా బరువును తగ్గించాలనుకునే వారు రోజూ రాత్రి ఒక యాలుక్కాయను తిని, ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగడం వల్ల శరీరం లో ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఫలితంగా అధిక బరువును, చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది. ఇంకా చెప్పాలంటే..   నిత్యం ఒక యాలుక్కాయను తిని వేడి నీళ్ళు తాగడం వల్ల శరీరం లో హానికరమైన మలినాలు, చెడు పదార్దాలు తొలగిపోతాయి. అంతేకాదు రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అన్ని అవయవాలాను శుద్ధి చేసి ఆరోగ్యం కాపాడుతుంది. మనం తీసుకునే ఆహారంలో చాలా పదార్దాలు జీర్ణం కాక ఎసిడిటి, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ కారణంగా అనేక మంది మలబద్దకం సమస్యతో బాధపడుతూ ఉంటారు. అలాటి వారు ఈ నియమాలను ఫాలో అవ్వడం వల్ల మలబద్దకం సమస్య నుండి విముక్తి అవుతారు.   తిన్న ఆహారం కూడా బాగా జీర్ణమవుతుంది. మరీ ముఖ్యంగా.. చాలా మంది రాత్రి నిద్ర పట్టక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటివారు రాత్రి పడుకోబోయే ముందు ఒక యాలుక్కాయను తిని ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉంటే నిద్రలేమీ సమస్య తొలగిపోయి హాయిగా పడుకోగానే నిద్రలోకి జారుకుంటారు. అలాగే నిద్రలో గురక శబ్ధం చేసేవారు కూడా ప్రతిరోజూ రాత్రి ఒక యలక్కయను తిని వేడి నీళ్ళు తాగడం వల్ల ఒక మెడిసిన్ లా పని చేసి నిధానంగా నిద్రలో గురక తగ్గుతుంది. రోజూ ఇలా చేస్తే ఎముకలను బలంగా మార్చుతుంది. అంతేకాదు ఇది చర్మాన్ని ఎలాంటి ఇన్ఫెక్షన్ భారిన పడకుండా ఆరోగ్యంగా కాపాడుతుంది. జుట్టు రాలడాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఒత్తుగా పెంచేందుకు సహాయపడుతుంది.  

CHANGE THE LIFESTYLE THAT CAN KILL!

  There are many health problems that can be avoided by human beings. Simply by changing their lifestyle. We have all heard of the new category called Lifestyle Diseases. As the name suggests, these are a result of a bad lifestyle that includes bad eating habits, not eating at the right intervals, not sleeping for the right number of hours and no exercise. These are some of the ways in which we invite diseases like diabetes, hypertension, obesity and heart problems. Therefore it is important for us to be aware of things we can do, to avoid lifestyle diseases. If we start talking about each of them, it could be depressing. Did you know? India ranks second with 155 million obese people. Sedentary life and easy access to unhealthy fast food like at the root of obesity. You know exactly what to do to avoid that. Cancer! Its not fate that brings some cancers, but our lifestyles. Lung cancer is a very good example of a lifestyle disease. It is the gift smokers give their lungs. Avoid that and your lungs will be clean and healthy. All these diseases will not trouble you, if you don’t want them to. Stop being lazy, start living - Kruti Beesam
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.