ALSO ON TELUGUONE N E W S
  టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్‌, కోలీవుడ్‌లోకి రీమేక్ అవుతుండ‌టం ప‌రిపాటి. అయితే ఇటీవ‌ల మ‌ల‌యాళం సినిమాలంటే టాలీవుడ్ చెవి కోసుకుంటోంది. మ‌ల‌యాళంలో హిట్ట‌వుతున్న సినిమాల‌ను తెలుగులో రీమేక్ చేయ‌డానికి ఇక్క‌డి నిర్మాత‌లు ఒక‌రితో ఒక‌రు పోటీప‌డుతున్నారు. 'లూసిఫ‌ర్‌', 'అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌', 'డ్రైవింగ్ లైసెన్స్' వంటి సినిమాల రీమేక్ హ‌క్కుల‌ను మ‌న‌వాళ్లు తీసుకోగా, తాజాగా 'క‌ప్పేలా' మూవీ రీమేక్ హ‌క్కుల‌ను సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ చేజిక్కించుకుంది. కొద్ది కాలం క్రిత‌మే ఆ సంస్థ 'అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్' సినిమా రీమేక్ హ‌క్కులు పొందడం, దాన్ని ర‌వితేజ‌, రానా హీరోలుగా తెర‌కెక్కించేందుకు స‌న్నాహాలు చేస్తున్న విష‌యం తెలుగు ఒన్ పాఠ‌కుల‌కు తెలిసిందే. కొద్ది రోజుల క్రితం 'క‌ప్పేలా' మూవీపై డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించాడు. అయితే ఆ సినిమాను మెచ్చుకుంటూ మ‌రోవైపు తెలుగు సినిమాల‌పై అత‌ను రాండ‌మ్‌గా చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారాన్ని రేకెత్తించాయి. ఇప్పుడు 'క‌ప్పేలా' మూవీ రీమేక్ హ‌క్కుల్ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పొంద‌డం అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తోంది. మ‌హ‌మ్మ‌ద్ ముస్త‌ఫా డైరెక్ట్ చేయ‌గా ఈ ఏడాది మార్చిలో విడుద‌లైన ఆ సినిమా ఘ‌న విజ‌యం సాధించింది. ఒక హీరోయిన్‌, ఇద్ద‌రు హీరోలు ఉండే ఈ మూవీని యంగ్ హీరోలతో, యంగ్ డైరెక్ట‌ర్‌తో తీసేందుకు ఆ సంస్థ ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం.
  'మ‌ర్డ‌ర్' మూవీ డైరెక్ట‌ర్ రామ్‌గోపాల్ వ‌ర్మ‌, ప్రొడ్యూస‌ర్ న‌ట్టి క‌రుణ‌పై న‌ల్గొండ జిల్లా మిర్యాల‌గూడ పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. కోర్టు ఆదేశాలు మేర‌కు పోలీసులు ఈ కేసు న‌మోదు చేశారు. 'మ‌ర్డ‌ర్' సినిమా ప్ర‌మోష‌న్ కోసం త‌న కుమారుడు ప్ర‌ణ‌య్‌, కోడ‌లు అమృత‌, ఆమె తండ్రి మారుతీరావు ఫొటోలు వాడారంటూ బాల‌స్వామి మిర్యాల‌గూడ ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధ‌క చ‌ట్టం న్యాయ‌స్థానంలో ఫిర్యాదు చేశారు. ఆ సినిమా చిత్రీక‌ర‌ణ‌ను నిలిపి వేయాల్సిందిగా కోర్టును అభ్యర్థించారు. ఈ కేసును విచారించిన కోర్టు సినిమా షూటింగ్‌ను నిలిపివేయాల‌నే అభ్య‌ర్థ‌న‌ను తోచిపుచ్చింది. అయితే ప్ర‌ణ‌య్‌, అమృత‌, మారుతీరావు ఫొటోల‌ను ప్ర‌చారం కోసం ఉప‌యోగించ‌డంపై నిర్మాత‌, ద‌ర్శ‌కుల‌పై కేసు న‌మోదు చేయాల్సిందిగా పోలీసుల‌ను ఆదేశించింది. ఈ మేర‌కు ఆర్జీవీ, న‌ట్టి క‌రుణ‌పై కేసు న‌మోదు చేసిన‌ట్లు న‌ల్గొండ జిల్లా ఎస్పీ వెంక‌ట రంగ‌నాథ్ తెలిపారు. "హ్యాపీ ఫాదర్స్ డే రోజున శాడ్ ఫాదర్స్ డే సినిమా ప్రకటిస్తున్నా. కూతురుని తండ్రి అతిగా ప్రేమించడం వల్ల వచ్చే అనర్థాల ఫలితాలను సినిమాలో చూపిస్తున్నా. అమృత, మారుతీరావు కథతో రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్షకులను హృదయాలను కదిలిస్తుంది" అని రామ్ గోపాల్ వర్మ జూన్ 22న ట్వీట్ చేశారు. అంతకు ముందు అమృత, మారుతీరావు ఫొటోలతో వాళ్లపై సినిమా తీస్తున్నట్టు మరో ట్వీట్ చేశారు. సినిమాకు 'మర్డర్' అని టైటిల్ పెట్టారు. దీనిబట్టి ప్రణయ్ హత్య ప్రధానాంశంగా వర్మ సినిమా తీస్తున్నారని అర్థమైంది. 
  ప‌లు చిత్రాల‌లో న‌టించిన బ‌హు భాషా న‌టిపై కార్పొరేట్ కంపెనీ సీఈఓ ఒక‌రు అత్యాచారానికి పాల్ప‌డిన ఘ‌ట‌న బెంగ‌ళూరులో చోటు చేసుకుంది. త‌న‌కు ఎదురైన చేదు అనుభ‌వం గురించి ఆ న‌టి నేరుగా పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో, బెంగ‌ళూరు పోలీసులు కేసు న‌మోదు చేశారు. పోలీసులు చెప్పిన దాని ప్ర‌కారం.. 30 సంవ‌త్స‌రాల బాధిత న‌టి బెంగ‌ళూరులోని జేజే న‌గ‌ర్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో నివాస‌ముంటున్నారు. ఆమె ప‌లు త‌మిళ‌, క‌న్న‌డ చిత్రాల‌లో న‌టించారు. 2018లో బ‌స‌వ‌న‌గుడి ప్రాంతంలోని గాంధీబ‌జార్‌లో స‌ద‌రు కార్పొరేట్‌ కంపెనీ సీఈఓ మోహిత్‌ ప‌రిచ‌య‌మ‌య్యాడు. అప్ప‌ట్నుంచీ ఆమెతో స‌న్నిహితంగా మెల‌గుతూ వ‌చ్చాడు. ఆమెను త‌మ కంపెనీ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా నియ‌మించాడు. ఆ క్ర‌మంలో ఆ ఇద్ద‌రూ గోవా, మ‌రికొన్ని ప్ర‌దేశాల‌లో ప‌ర్య‌టించారు. కొద్ది రోజుల త‌ర్వాత త‌మ కంపెనీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంద‌ని ఆమెను న‌మ్మించి, ఆమె ద‌గ్గ‌ర కొంత డ‌బ్బు వ‌సూలు చేశాడు. 2019 జూన్ 22 త‌న పుట్టిన‌రోజంటూ మోహిత్ త‌న ఇంట్లో ఆమెకు పార్టీ ఇచ్చాడు. మ‌రుస‌టి రోజు న‌టి పుట్టిన‌రోజు కావ‌డంతో ఇద్ద‌రూ పార్టీ చేసుకున్నారు. అప్పుడే మోహిత్ కూల్‌డ్రింక్‌లో మ‌త్తుమంతు క‌లిపి ఇచ్చాడ‌నీ, త‌ను మ‌త్తులోకి వెళ్లాక అత‌ను త‌న‌పై అత్యాచారం చేశాడ‌నీ పోలీసుల‌కిచ్చిన ఫిర్యాదులో ఆ న‌టి పేర్కొన్నారు. త‌న‌పై అత్యాచారం చేసిన త‌తంగాన్నంతా అత‌ను సెల్‌ఫోన్‌లో వీడియో తీసి, బ్లాక్‌మెయిల్ చేస్తూ వ‌చ్చాడ‌ని ఆమె ఆరోపించారు. ఆ వీడియోను చూపి బెదిరిస్తూ.. ఇప్ప‌టివ‌ర‌కూ రూ. 20 ల‌క్ష‌ల వ‌ర‌కూ త‌న నుంచి బ‌ల‌వంతంగా గుంజాడని ఆమె తెలిపారు. మోహిత్‌ బెదిరింపులు పెరిగిపోవ‌డంతో, అత‌ని త‌ల్లిదండ్రుల‌ను క‌లిసి త‌న బాధ‌లు చెప్పుకుంటూ, వారూ బెదిరించార‌ని ఆమె త‌న ఫిర్యాదులో ఆవేద‌న వ్య‌క్తం చేశారు. న‌టిని మోసం చేసి, అత్యాచారం చేసిన కేసులో పోలీసులు ద‌ర్యాప్తు సాగిస్తున్నారు. ప‌రారీలో ఉన్న మోహిత్ కోసం వేట సాగిస్తూ, అత‌ని త‌ల్లిదండ్రుల‌ను ప్ర‌శ్నిస్తున్నారు.
  రామ్‌గోపాల్‌వ‌ర్మ‌కు ఎమోష‌న్స్‌, ఎథిక్స్ లేవ‌ని చాలామంది అనుకోవ‌చ్చు కానీ, తాను మాత్రం ఆయ‌న‌లో ఆ రెండూ చూశాన‌ని శ్రీ రాపాక అంటున్నారు. ఇటీవ‌ల ఆర్జీవీ తీసిన న‌గ్నం ఫిల్మ్‌లో ఆమె ప్ర‌ధాన పాత్ర పోషించారు. ఏటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజైన ఆ షార్ట్ ఫిల్మ్‌కు మంచి స్పంద‌నే ల‌భించింది. తాజాగా తెలుగు ఒన్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆర్జీవిని శ్రీ ప్రశంస‌ల్లో ముంచెత్తారు. భ‌విష్య‌త్తులో త‌న‌కు ఆఫ‌ర్లు రాక‌పోయినా బాధ‌ప‌డ‌న‌నీ, త‌న వ్యాపారాలు త‌న‌కు ఉన్నాయ‌నీ ఆమె అన్నారు. "రామ్‌గోపాల్ వ‌ర్మ గారితో 'న‌గ్నం' సినిమా కోసం నేను రెండు రోజులు షూటింగ్ చేశాను. ఆయ‌న‌లో నేను గ‌మ‌నించింది.. ఆయ‌న ఎథిక్స్ ఉన్న వెరీ ఎమోష‌న‌ల్ ప‌ర్స‌న్‌. 'ఆయ‌న‌కేం ఎమోష‌న్స్, ఆయ‌న‌కేం ఎథిక్స్‌.. కూతురినే చూడ‌టం లేదు' అని చాలామంది అనుకోవ‌చ్చు. ఆయ‌న‌ ద‌గ్గ‌ర ఎమోష‌న్స్‌, ఎథిక్స్ అనేవి లేక‌పోతే ఆయ‌న‌ను ఇష్ట‌ప‌డి ప‌దిమంది ఎందుకు ప‌నిచేస్తారో చెప్పండి. అలా ఆయ‌న ద‌గ్గ‌ర కేవ‌లం శాల‌రీ కోసం కాకుండా ఇష్ట‌ప‌డి ప‌నిచేసేవాళ్ల‌ను నేను చూశాను. ఆయ‌న క్యారెక్ట‌ర్‌ను బ‌ట్టే ఆయ‌న వ‌ర్క్ వ‌స్తోంది. రోజూ ఎంజాయ్ చేస్తుంటే ఎవ‌రూ వ‌ర్క్ చెయ్య‌లేరు. నాలుగు సినిమాలు ఒకేసారి ఆయ‌న చేస్తున్నారంటే.. అది చిన్న విష‌యం కాదు. ఆయ‌న‌లో ఆ వ‌ర్క్ చేసే గుణం నాకు బాగా న‌చ్చింది" అని శ్రీ చెప్పారు. "ఆర్జీవీ హీరోయిన్లెవ‌రూ హిట్ట‌వ‌ర‌నే పేరుంది క‌దా?" అనే ప్ర‌శ్న‌కు, "అది నా ఫేస్ మీద‌, నా యాక్టింగ్ మీద ఆధార‌ప‌డి ఉంటుంది. ఆయ‌న‌తో శ్రీ‌దేవి, ఊర్మిళ లాంటి వాళ్లు చేశారు క‌దా. వాళ్లు స‌క్సెస్‌ఫుల్ క‌దా. ఏదైనా మ‌నం ఎంచుకునే దానిమీద ఆధార‌ప‌డి ఉంటుంది. ఆఫ‌ర్స్ రాలేద‌నుకోండి.. నా బిజినెస్ నాకుంది. ఈ సినిమా చెయ్య‌క‌ముందు నేన‌దే చేస్తున్నాను క‌దా. ఏది చేసినా చెయ్య‌క‌పోయినా టీవీ షోస్ అయితే ప‌క్కా చేస్తా. పైగా ఒక‌రిని మ‌నం బ్లేమ్ చెయ్య‌కూడ‌దు. ఆర్జీవీ గారితో ప‌నిచెయ్య‌డం వ‌ల్ల ఇలా అయిపోయారు, అలా అయిపోయారు అన‌డం క‌రెక్ట్ కాద‌నేది నా అభిప్రాయం. నాకేమీ ఎక్స్‌పెక్టేష‌న్స్ లేవు. అవ‌కాశాలు వ‌స్తే చేస్తా. లేదంటే నా జాబ్ నాకుంది" అని తేల్చి చెప్పారు శ్రీ‌.
  త‌మిళ డ‌బ్బింగ్ సినిమా 'ప్రేమ‌దేశం' (కాద‌ల్ దేశ‌మ్‌)తో రాత్రికి రాత్రే కుర్ర‌కారులో య‌మ క్రేజ్ సంపాదించుకున్న న‌టుడు అబ్బాస్‌. ఆ క్రేజ్‌తోటే డైరెక్ట‌ర్‌ ముప్ప‌ల‌నేని శివ అత‌డిని 'ప్రియా ఓ ప్రియా మూవీ'తో నేరుగా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చారు. చూపుల‌కు చాక్లెట్ బాయ్‌లా ఉండే అబ్బాస్‌.. ఆ త‌ర్వాత రాజ‌హంస‌, రాజా, అన‌గ‌న‌గా ఒక అమ్మాయి, అల్లుడుగారు వ‌చ్చారు, నీ ప్రేమ‌కై, శ్వేత‌నాగు వంటి సినిమాల్లో హీరోగానో లేక‌పోతే కీల‌క పాత్ర‌ధారిగానో న‌టించాడు. మ‌రోవైపు ప‌లు ఎండార్స్‌మెంట్స్ కూడా అత‌ను చేశాడు. 1999లో డిజైన‌ర్ ఎరుమ్ అలీని వివాహ‌మాడిన అబ్బాస్‌.. ఆ త‌ర్వాత న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో స్థిర‌ప‌డ్డాడు. ఆ దంప‌తుల‌కు అయ్‌మాన్ అనే కొడుకు, ఎమిరా అనే కూతురు ఉన్నారు. ఇప్పుడు ఎమిరా ఫొటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. చ‌క్క‌ని రూప‌లావ‌ణ్యాల‌తో మెరిసిపోతున్న ఎమిరాను చూసి నెటిజ‌న్లు ఫ్లాటైపోతున్నారు.  
బంధం నిలబడాలన్నా.. సమస్యల నుంచి బయటపడాలన్నా.. మీ సత్తా ఏంటో మీకు తెలియలన్నా చిన్న మెచ్చుకోలు చాలు అని చెప్పే ఓ టీచర్ కథ. ఎప్పుడు మీపై మీకు అపనమ్మకం కలిగినా ఈ వీడియో చూడండి. https://www.youtube.com/watch?v=usBw5K-4DoQ    
ఓ గురువుగారు సీతాపురం అనే పల్లెటూరి గుండా వెళ్తున్నారు. ఆ పల్లెటూరు అలాంటి ఇలాంటిది కాదు. అందులో అందరూ వీరులే! రాజుగారికి ఉన్న సైన్యంలో సగభాగం అక్కడి నుంచే వస్తుంటారు. సాక్షాత్తూ రాజుగారి సైన్యాధ్యక్షుడు కూడా అక్కడి వాడే. మల్లవిద్య, కర్రసాము, కత్తియుద్ధం… ఇలా ఎలాంటి యుద్ధవిద్యలో అయినా సరే, ఆ ఊరి జనానికి సాటి లేదు. అలాంటి సీతాపురం గుండా గురువుగారు వెళ్తున్నారు. అదే సమయంలో వారికి ఆ ఊరిలోనే విడిది చేసి ఉన్న సైన్యాధ్యక్షుడు ఎదురుపడ్డాడు. గురువుగారిని చూసిన సైన్యాధ్యక్షుడు `గురువుగారూ మీ గురించి చాలా విన్నాను. ఇవాళ మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఎన్నాళ్ల నుంచో ఒక అనుమానం పీడిస్తోంది. దయచేసి నివృత్తి చేయండి` అని అడిగాడు. `నాకు చేతనైతే తప్పక నివృత్తి చేస్తాను. ఏమిటా అనుమానం` అన్నారు గురువుగారు. `మన పెద్దవాళ్లు ఎంతసేపూ స్వర్గం, నరకం అని ఊదరగొడుతుంటారు కదా! నిజంగా స్వర్గం, నరకం అనేవి ఉన్నాయంటారా? ఒకవేళ ఉంటే వాటికి ద్వారాలు ఎక్కడ ఉన్నాయి?` అని అడిగాడు. `ఇంత మంచి ప్రశ్న అడిగావు. ఎవరు నువ్వు` అని అడిగారు గురువుగారు. `నేను ఈ రాజ్యానికే సైన్యాధ్యక్షుడిని. రాజుగారి విజయాలన్నింటికీ కారణం నేనే!` అని గర్వంగా బదులిచ్చాడు సైన్యాధ్యక్షుడు. `అబ్బే నిన్ను చూస్తే సైన్యాధ్యక్షునిలా లేవే. ఎవరో పగటివేషగాడిలా ఉన్నావు. నిన్ను చూస్తే నవ్వు వస్తోంది కానీ భయం వేయడం లేదు` అని ఎగతాళిగా అన్నారు గురువుగారు. `ఎంతమాట! నేను పగటివేషగాడిలా ఉన్నానా! నన్ను చూస్తుంటే నవ్వులాటగా ఉందా! నీ నవ్వుని గొంతులోనే ఆగిపోయేలా చేస్తాను. ఉండు!`అంటూ తన కత్తిని దూసి గురువుగారి కంఠానికి గురిపెట్టాడు సైన్యాధ్యక్షుడు. `ఇదే నాయనా నువ్వు చూడాలనుకున్న నరక ద్వారం. నీ కోపంతోనూ, ఉద్వేగంతోనూ, అహంకారంతోనూ… దాన్ని ఇప్పుడే నువ్వు తెరిచావు` అన్నారు గురువుగారు. గురువుగారి మాటలకు సిగ్గుపడి సైన్యాధ్యక్షుడు తన కత్తిన తీసి ఒరలో ఉంచుకుని బాధగా నిలబడ్డాడు. `ఇప్పుడు నువ్వు స్వర్గంలోకి అడుగుపెట్టావు. నీ ఆలోచనతోనూ, ప్రశాంతతతోనూ, పశ్చాత్తాపంతోనూ స్వర్గపు ద్వారాలను తెరిచావు` అన్నారు గురువుగారు చిరునవ్వుతో! అపై సైన్యాధ్యక్షుడిని చూస్తూ ఇలా అన్నారు `చూశావా! స్వర్గం, నరకం రెండూ నీలోనే ఉన్నాయి. నువ్వు అనాలోచితంగా ప్రవర్తించిన రోజు నరకానికి దారిని తెరుస్తావు. జాగ్రత్తగా, ఖచ్చితంగా ఆలోచించగలిగిన రోజు స్వర్గానికి తలుపులు తీస్తావు. స్వర్గనరకాలు ఎక్కడో కాదు, నీ మనసులోనే ఉన్నాయి.` అంటూ సాగిపోయారు గురువుగారు.
21వ శ‌తాబ్దం వ‌చ్చేసింది. ప్ర‌పంచీక‌ర‌ణ పుణ్య‌మా అని అంద‌రికీ అన్ని సౌక‌ర్యాలూ అందుబాటులో ఉంటున్నాయి. ఆరోగ్య‌ప‌రంగానూ, సాంకేతికంగానూ మున్ముందుకి అడుగులు వేస్తున్నాం. అన్నింటికీ మించి ఆడ‌పిల్ల‌ల ప‌ట్ల వివ‌క్ష‌త త‌గ్గింద‌న్న అంచ‌నాలూ ఉన్నాయి. నిజానికి ఆడ‌పిల్లల జీవితాలు ఏమాత్రం మార‌లేదంటూ ఓ ప‌రిశోధ‌న వెలువ‌డింది. ఇంగ్లండులోని లివ‌ర్‌పూల్ విశ్వ‌విద్యాల‌యానికి చెందిన ప‌రిశోధ‌కులు ఆడ‌పిల్ల‌ల మ‌న‌స్థితి మీద ఒక అధ్య‌య‌నం చేశారు. ఒక‌టీ రెండూ కాదు... ఏకంగా 14 ఏళ్ల పాటు గ‌ణాంకాల‌ను సేక‌రించారు. ఇందుకోసం 2000-2001లో జ‌న్మించిన దాదాపు ప‌దివేల మంది పిల్ల‌ల‌ను నిశితంగా గ‌మ‌నించారు. 3, 5, 7, 1, 14 ఏళ్ల‌లో వారి మ‌న‌స్త‌త్వం ఎలా ఉందో అంచ‌నా వేసే ప్ర‌య‌త్నం చేశారు. అనేక ప్ర‌శ్నాప‌త్రాల ద్వారా పిల్ల‌ల మ‌న‌స్థితిని గ‌మ‌నించారు. మ‌గ‌పిల్ల‌లైనా, ఆడ‌పిల్ల‌లైనా చిన్న‌ప్పుడు అంతా సంతోషంగానే క‌నిపించారు. వారి మ‌న‌సుల్లో పెద్ద‌గా క‌ల‌త క‌నిపించ‌లేదు. కానీ వ‌య‌సు పెరుగుతున్నకొద్దీ... ఆడ‌పిల్ల‌ల మ‌న‌సు కుంగిపోవ‌డాన్ని గ‌మ‌నించారు. ఇలా కాస్తోకూస్తో కాదు... ప‌ధ్నాలుగో ఏడు వ‌చ్చేసరికి దాదాపు నాలుగోవంతు మంది ఆడ‌పిల్ల‌లలో డిప్రెష‌న్ తాలూకు ల‌క్ష‌ణాలు క‌నిపించాయి. అదే మగ‌పిల్ల‌లో అయితే కేవ‌లం ప‌దిశాతం లోపుమంది పిల్ల‌ల‌లోనే డిప్రెష‌న్ సూచ‌న‌లు క‌నిపించాయి. కుటుంబ ఆర్థిక‌ప‌రిస్థితులు క‌నుక బాగోలేక‌పోతే.... డిప్రెష‌న్‌కు లోన‌య్యే ప్ర‌మాదం మ‌రింత తీవ్రంగా ఉండ‌టం మ‌రో విషాదం. సాధార‌ణంగా పిల్ల‌లు త‌మ మ‌న‌సులోని దుగ్ధ‌ను స్ప‌ష్టంగా చెప్పుకోలేరు. కుటుంబంలోని పెద్ద‌లే, పిల్ల‌ల మ‌న‌సులోని విచారాన్ని ఊహించే ప్ర‌య‌త్నం చేయాలి. దుర‌దృష్ట‌వ‌శాత్తూ మ‌గ‌పిల్ల‌లని మ‌న‌సుని ప‌సిగ‌ట్టేసే పెద్ద‌లు, ఆడ‌పిల్ల‌ల మ‌న‌సులో ఏం మెదులుతోందో ఏమాత్రం ఊహించలేక‌పోతున్నార‌ట‌. దాంతో ఆడ‌పిల్ల‌ల మ‌న‌సుని సాంత్వ‌న ప‌రిచే ప‌రిస్థితులు లేక‌, వారు మ‌రింత‌గా డిప్రెష‌న్‌లోకి కూరుకుపోతున్నారు. పైగా మ‌గ‌పిల్ల‌ల‌తో పోలిస్తే ఆడ‌పిల్ల‌లు ఎదుర్కొనే ప‌రిస్థితులు విభిన్నంగా ఉంటాయి. శారీరికంగానూ, మాన‌సికంగానూ వారు ఎన్నో స‌వాళ్ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ఎదిగేకొద్దీ ఏదో ఒక రూపంగా వారికి వివ‌క్ష ఎదుర‌వుతూనే ఉంటుంది. ఇవ‌న్నీ కూడా వారి మ‌న‌సుల మీద చెర‌గ‌ని గాయం చేస్తాయి. మ‌గ‌పిల్ల‌లతో పోలిస్తే, ఆడ‌పిల్ల‌ల‌ని మ‌రింత కంటికిరెప్ప‌లా కాపాడుకోవాల్సిన అవ‌స‌రాన్ని ఈ ప‌రిశోధ‌న గుర్తుచేస్తోంది. దీనిని త‌ల్లిదండ్రులు ఓసారి జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే... ఆడ‌పిల్ల‌ల భ‌విష్య‌త్తు మ‌రింగ బాగుంటుందేమో! - నిర్జ‌ర‌.  
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన... కరోనా వ్యాప్తిని అరికట్టడానికి భౌతిక దూరం పాటించాలని, మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని.. పార్టీలు, ఫంక్షన్స్ చేయవద్దని ప్రభుత్వం ఎంత చెప్పినా ప్రయోజనం లేదు. మాకెందుకు వస్తుంది అన్న ధీమా చాలామందిలో కనిపిస్తోంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇతరులు కూడా కరోనా బారిన పడుతున్నారు. దాంతో కరోనా రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక సంఘటన ప్రజలకు కరోనా పై ఎంత మాత్రం భయం లేదన్న విషయం స్పష్టం చేస్తుంది. హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో  ఒక బంగారు, వజ్రాల వ్యాపారి తమ పుట్టిన రోజు సందర్భంగా స్నేహితులు, బంధు మిత్రులతో కలిసి పార్టీ చేసుకున్నారు. నగరంలోని ప్రముఖ బంగారు వ్యాపారులు , రాజకీయ నాయకులు 150 మంది వరకు హాజరయ్యారు. అంతా బాగానే జరిగింది అనుకున్నారు. అయితే రెండు రోజుల క్రితం ఈ పార్టీకి హాజరైన ఒక బంగారు వ్యాపారి కరోనా వ్యాధితో చనిపోయారు. దాంతో పార్టీకి హజరైన మిగతవారిలో భయం మొదలైంది. వారంతా పరీక్షలు నిర్వహించుకోగా దాదాపు 20 మందికి పైగా కరోనా సోకినట్లు సమాచారం. 15 రోజుల కిందట జరిగిన ఈ పార్టీలో తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కూడ పాల్గొనట్లు వినికిడి.
వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శుల తో కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ దేశంలో వేలాది సంఖ్యలో కొత్తగా నమోదు అవుతున్న కరోనా కేసులను కట్టిడి చేసేందుకు తీసుకోవల్సిన చర్యలపై కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శుల తో కోవిడ్ -19 నియంత్రణ పై ఆయన చర్చించారు. కంటైన్ మెంట్ జోన్లలో లాక్ డౌన్ కు సంబంధించి కఠినంగా చర్యలు చేపట్టాలన్నారు. పరీక్షా సామర్థ్యాలను పెంచడం, ట్రేసింగ్, టెస్టింగ్, ఇతర చర్యల కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం తదితర అంశాలపై ఆయా రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. కరోనా రోగుల మరణాల సంఖ్య సాధ్యమైనంత తగ్గించడం పై దృష్టి పెట్టాలని వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల కు సూచించారు.  పీపీఈ సూట్స్, , N-95  మాస్క్ ల లభ్యత, క్లినికల్ మేనేజ్ మెంట్ , ఇతర మౌళిక సదుపాయాల సమస్యల పై ప్రధాన కార్యదర్శులు వ్యక్తిగతంగా సమీక్షించాలన్నారు. రాష్ట్రానికి కేంద్ర బృందం సందర్శన అనంతరం పరీక్షా సదుపాయాలను పెంచడం , కంటైన్ మెంట్ జోన్లలో కరోనా నియంత్రణ కు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటున్నదని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కేంద్ర క్యాబినెట్ కార్యదర్శికి వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో డి.జి.పి. మహేందర్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ముఖ్యకార్యదర్శులు రవి గుప్త, వికాస్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. రానున్న రోజుల్లో కరోనా కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయని, ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు ప్రభుత్వాలు మరింత అప్రమత్తంగా ఉండాలని రాజీవ్ గౌబా సూచించారు.
ఖైదీలతో కలిసి మొక్కలు నాటారు.. ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల పరిశీలన.. ఎంపికి తమ సమస్యలపై వినతిపత్రం అందించిన ఖైదీలు.. చర్లపల్లి జైలులో జీవితఖైదు అనుభవిస్తున్న వారి సమస్యలను, వారిలో సత్ ప్రవర్తన కలిగిన వారిని జాతీయ పండుగల సందర్భంగా విడుదల చేసే విషయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకువెళ్తానని ఎంపి సంతోష్ కుమార్ హామీ ఇచ్చారు. జైలు శాఖాధిపతి రాజీవ్ త్రివేది, ఐ.పి.యస్ తో కలిసి ఆయన శనివారం చర్లపల్లిలోని కే౦ద్ర కారాగారం సందర్శించారు. జైలు ఆవరణలో ఖైదీల కోసం ఏర్పాటు చేసిన సంజీవని(హాస్పిటల్) సందర్శించి అక్కడ కల్పిస్తున్న వైద్య సదుపాయాలను పరిశీలించారు. వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లను అభినందించారు. ప్రొఫెసర్ సి. బీనా గారి ఆధ్వర్యంలో ఖైదీలకు కల్పించిన M.Sc. Psychology Lab ను సందర్శించారు. ఖైదీలకు అందిస్తున్న ఆహారం టెస్ట్ చేసి బాగున్నాయని మెచ్చుకున్నారు. స్వర్ణముఖి బ్యారక్ లో ఖైదీలు  తమ క్షమాభిక్ష అంశాన్ని సిఎం గారి చెప్పాలని కోరుతూ వినతిపత్రం అందించారు. జైలులో ఉన్న ఖైదీల శిక్షణ కోసం ఏర్పాటు చేసిన పరిశ్రమల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే దిశగా నూతనంగా నిర్మించబడిన శానిటైజర్ పరిశ్రమను మెచ్చుకున్నారు. ఇతర ఉపాధి శిక్షణా అంశాలను పరిశీలించి ఖైదీలతో కలిసి మొక్కలు నాటారు.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో మాస్క్ లు ధరించడం, భౌతిక దూరం పాటించడంతో పాటు మన శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. ఇందుకోసం కొన్ని రకాల కషాయాలను ఇంట్లో చేసుకుని రోజూ రెండు పూటలు తాగడం ఆరోగ్యకరం. తులసి ఆకులు, దాల్చిన చెక్క, శొంఠి, నల్ల మిరియాలను నీళ్లలో వేసి బాగా మరగబెట్టి బెల్లం లేదా తేనెతో.. హెర్బల్‌ టీ మాదిరిగా తాగితే శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది.   ధనియాలు, మిరియాలు, దాల్చినచెక్క, శొంఠి సమపాళ్ళలో తీసుకుని పొడి చేయాలి. ఒక స్పూన్ పొడిని గ్లాస్ నీటిలో వేసి ఐదు నిమిషాలు మరిగించాలి. తులసి, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, యాలకులు, శొంఠి, ఎండుద్రాక్ష, బెల్లం, నిమ్మరసం తీసుకోవాలి. వీటిలో దాల్చిన చెక్క, నల్లమిరియాలు, యాలకులు, శొంఠి పొడి చేసుకోవాలి. ఒక లీటర్ నీటిని వేడి చేస్తూ అందులో ఎండు ద్రాక్ష, ముందుగా చేసుకున్న పొడి, తులసి ఆకులు వేయాలి. పది నిమిషాల పాటు మరిగిన తర్వాత చల్లార్చాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు నిమ్మరసం, బెల్లం కలిపి తాగాలి. ఒక లీటర్ నీటితో చేసుకునే ఈ కషాయం ఇంట్లో నలుగురికి సరిపోతుంది. అల్లం, పసుపు, మిరియాలు, బెల్లం. రెండు గ్లాసుల వేడి నీటిలో స్పూన్ అల్లం రసం, అర స్పూన్ పసుపు, పావు స్పూన్ మిరియాల పొడి వేయాలి. ఐదు నిమిషాలు మరిగిన తర్వాత బెల్లం వేయాలి. వేడివేడిగా ఈ కషాయం తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితులలో ఎన్నో ఇంటి చిట్కాలు చక్కర్లు కొడుతున్నాయి. దేశ ప్రధాని సైతం కషాయాలతో కరోనాను తరిమి కొట్టవచ్చని చెప్పారు. పక్కింటివారు చెప్పినా.. ప్రధాని చెప్పినా వాటిలో మనకు కామన్ గా కనిపించేవి మిరియాలు, అల్లం, వెల్లుల్లి, పసుపు, దాల్చిన చెక్క, శొంఠి, లవంగాలు. వీటి కాంబినేషన్ తో తయారు చేసే కొన్ని రకాల కషాయాలు కరోనా మన దరికి రాకుండా తరిమికొడతాయి అని చెప్తున్నారు. మరి ఇంతకీ వీటిలో ఏముంది? వీటిని ఎందుకు ఔషధాలుగా మనం చెప్పవచ్చు. అది తెలుసుకోవాలంటే మనం మన సాంప్రదాయ ఆహార పద్ధతులలో ఉన్న ఔషధ గుణాలను తెలుసుకోవాల్సిందే... క్రీస్తు పూర్వం  2000 కన్నా ముందు బంగారం కన్న గొప్ప విలువ సంపదగా సుగంధ ద్రవ్యాలను భావించేవారు.  దాల్చిన చెక్క, నల్ల మిరియాల తదితర దినుసుల  వాణిజ్యం ద్వారా ఆయా దేశాలు ఆర్థికాభివృద్ధి సాధించేవి. ప్రపంచవ్యాప్తంగా వినియోగించే సుగంధద్రవ్యాల్లో 70శాతం మన దేశంలోనే పండుతాయి. వీటిని పండించే రాష్ట్రాల్లో కేరళదే అగ్రస్థానం.  క్వీన్ ఆఫ్ స్పైసెస్‌గా పిలవబడే నల్ల మిరియాలను మన దేశంలో ఒకప్పుడు ఎక్కువగా పండించేవారు. ఆహారంలో రుచిని పెంచడానికే కాదు ఔషధంగా కూడా దీన్ని ఉపయోగిస్తారు. ప్రస్తుతం మిరియాలను వాడుతున్న దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది. సుగంధ ద్రవ్యాలు మనకు ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి.. అందుకు కారణం వాటిలో ఉండే  ఆక్సిజన్ రాడికల్ అబ్సర్వేషన్ కెపాసిటీ. దీన్నే మనం ఓఆర్ఏసి గా పేర్కొంటారు జింజర్, తులసి, పసుపు మొదలైనవాటిలో ఓఆర్ఏసి 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. వీటిని తక్కువ మోతాదులో తీసుకోవడం వలన మనలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.  విటమిన్ సి, ఒమేగా త్రీ, విటమిన్ డి వంటి సూక్ష్మ పోషకాలను మనం తీసుకున్న ఆహారం నుంచి  శరీరం గ్రహించడానికి కూడా ఇవి దోహదం చేస్తాయి.
తేనంత తియ్యనిది మరొకటి లేదు" అంటూ మనం తియ్యదనానికి పోలిక కోసం తేనెని సూచిస్తాం. ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరం ఈ తేనే అని చెప్పవచ్చు. అద్భుతమైన తియ్యదనం, అరుదైన లక్షణాలు స్వంతం చేసుకున్న తేనే సహజసిద్ధమైన యాంటీబయోటిక్. అందుకే మన పెద్దవాళ్ళు తేనెని "సర్వరోగ నివారిణి" అంటారు. ఎన్నో అనారోగ్యాలకు తేనే చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. సరే అసలు మనం ఉపయోగించే తేనే మంచిదా...? కాదా..? ఎలా తెలుసుకోవాలి..? ఈ వీడియో చూస్తే సరే. https://www.youtube.com/watch?list=PLvS3k4MyaWFe6JbWpk_Syg1nJcwWkRFtQ&v=sMINAsZuqGM
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.