Publish Date:Oct 22, 2019
Publish Date:Oct 14, 2019
Publish Date:Oct 5, 2019
Publish Date:Oct 1, 2019
Publish Date:Sep 30, 2019
Publish Date:Sep 27, 2019

EDITORIAL SPECIAL
శాసనమండలి రద్దు దిశగా జగన్ సర్కారు అడుగులు వేస్తోంది. 50శాతం ఓట్లు, 151మంది ఎమ్మెల్యేలతో తిరుగులేని విజయం సాధించి అధికారంలోకి వచ్చినా... శాసనమండలిలో మాత్రం ప్రతిపక్ష తెలుగుదేశం బలమే ఎక్కువగా ఉండటంతో జగన్ ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా వైసీపీ సర్కారు ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లుకు మండలిలో చుక్కెదురు కావడంతో కౌన్సిల్ రద్దు దిశగా జగన్ ప్రభుత్వం అడుగులేస్తోంది. అయితే, మండలిని రద్దు చేయాలంటే మొదటగా శాసనసభలో తీర్మానం చేయాల్సి ఉంటుంది. శాసనసభలో ఎలాగూ జగన్ ప్రభుత్వానిదే మెజారిటీ కనుక తీర్మానం ఆమోదం పొందడం ఖాయమే. అయితే, శాసనసభ చేసిన తీర్మానాన్ని పార్లమెంట్లో చర్చించి లోక్ సభ, రాజ్యసభల్లో ఆమోదించాల్సి ఉంటుంది. అయితే, పార్లమెంట్ కి విచక్షణాధికారాలు ఉన్నాయి. దాంతో, కేంద్రానికి ఇష్టంలేకపోతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పంపిన తీర్మానాన్ని ఆమోదించకుండా వెనక్కి పంపే అవకాశమూ ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో బీజేపీ-జనసేన కలిసి పనిచేస్తున్న తరుణంలో జగన్ ప్రభుత్వ తీర్మానాన్ని ఆమోదించకుండా తిప్పిపంపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే, మూడు రాజధానులను జనసేన వ్యతిరేకిస్తుండటం... అదే సమయంలో ఏపీ బీజేపీ కూడా అమరావతే... ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగాలని తీర్మానం చేసిన నేపథ్యంలో...  మండలి రద్దు అంత సులువు కాదనే మాట వినిపిస్తోంది. అయితే, శాసన మండలి అనేది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేదని, దీనిపై కేంద్రానికి ఎలాంటి హక్కూ ఉండదని వైసీపీ నేతలు అంటున్నారు. మండలి రద్దుకు శాసనసభ తీర్మానంచేసి పంపితే, దాన్ని కచ్చితంగా పార్లమెంట్ ఆమోదించి తీరుతుందని అంటున్నారు. ఇందులో రాజకీయాలు ఏమీ ఉండవని చెబుతున్నారు. అందుకు, ఎన్టీఆర్ హయాం నాటి ఘటనను గుర్తుచేస్తున్నారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు... ఎన్టీఆర్ కూడా శాసనమండలి రద్దు చేశారని, అయితే, ఆనాడు కాంగ్రెస్ నేతలంతా రాజీవ్ కు మొరపెట్టుకున్నా... ఎన్టీఆర్ సూచన మేరకు మండలిని రద్దు చేశారని చెబుతున్నారు. ఇక, ఇప్పుడు కూడా ఆర్ధిక భారం పేరుతో మండలిని రద్దు చేయాలంటూ కేంద్రాన్ని కోరితే... కేంద్రం చేయక తప్పదని అంటున్నారు.
మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది. న్యాయపరంగా ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటొంది. ఈ నెల 18న క్యాబినెట్ సమావేశం కాగా 20 నుంచి 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరపాలని భావించినా రెండూ ఒకే రోజు జరిపితే మంచిదన్న అభిప్రాయానికి వచ్చింది ఏపీ సర్కార్. దీని ప్రకారం 20 ఉదయం 9:30 గంటలకు క్యాబినెట్ సమావేశం నిర్వహించి హైపవర్ కమిటీ నివేదికను ముందుగా ఆమోదిస్తారు.11:30 నిమిషాలకు అసెంబ్లీ భేటీ జరుగుతుండగా రాజధానితో పాటు అభివృద్ధి, పాలన వికేంద్రీకరణ విషయంలో చట్ట పరంగా ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. తరలింపు విషయంలో ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలను అధిగమించాలంటే ప్రత్యేక చట్టాలు ఏర్పాటు చేయాల్సిందేనన్న ఆలోచనల్లో జగన్ ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు రాజధాని విభజన విషయంలోనూ అలాగే వికేంద్రీకరణ విషయంలోనూ కొత్త చట్టాన్ని తెచ్చే దిశగా కసరత్తు చేయడమే కాక రాజధాని పేరు లేకుండా కొత్త చట్టం రూపొందించే పనిలో పడింది ఏపీ సర్కార్. ఏపీ డిజిటలైజేషన్ అంటూ ఈక్వల్ డెవలప్ మెంట్ ఆఫ్ ఓల్డ్ రీజన్స్ బెల్ ట్వంటీ ట్వంటీ పేరుతో కొత్త బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టి సూచనలు వెలువడనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ బిల్లును అధికారులు సిద్ధం చేస్తున్నారు.ఏపీలో ఉన్న మూడు ప్రాంతాల్లో వివిధ జోన్ లుగా ఏర్పాటు చేసే దిశగా కొత్త బిల్లు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.ప్రతి జోన్ కు ప్రత్యేకంగా 9 మంది సభ్యులతో బోర్డును ఏర్పాటు చేస్తారు. ప్రతి బోర్డుకు ఒకరు చైర్మన్ గా వ్యవహరిస్తారు, అలాగే వైస్ చైర్మన్ ను కూడా ఏర్పాటు చేస్తారు. ప్రాంతీయ బోర్డులో సభ్యులుగా 1 ఎంపి, 2 ఎమ్మెల్యేలు, మరో 4 ప్రతి నిధులు వుండేలా బిల్లును సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సదరు ప్రాంతీయ బోర్డు కార్యదర్శిగా ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారిని నియమించే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఏఏ జోన్లలో ఏఏ ప్రభుత్వ కార్యాలయాలు ఉండాలి,ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే అంశాలను, కర్ణాటక మోడల్ తరహాలో బిల్లును రూపొందిస్తున్నారు.జీఎన్ రావు కమిటీ నివేదికతో పాటు బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదిక కూడా దాదాపు ఇలాంటి సూచనలే చేశాయి. కొత్త చట్టాన్ని తీసుకు రావడంతో పాటు ఇప్పటికే ఉన్న సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయాలని కూడా సర్కారు నిర్ణయం తీసుకునే సూచనలు ఉన్నాయి. ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు అధికారులు సీఆర్డీఏ రద్దుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సీఆర్డీఏ చట్టం రద్దు చేస్తే ఉత్పన్నమయ్యే సమస్యలను ప్రభుత్వం ఏ విధంగా అధిగమిస్తుందో వేచి చూడాలి.
రాజధాని అమరావతి కోసం ప్రతి ఇల్లు ఉద్యమించాలని.. ప్రతి ఇంటి నుంచి ఒకరు ముందుకు రావాలని.. అందరూ సంఘటిత శక్తిగా మారాలని.. టిడిపి అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. రాజధానిని అమరావతి లోనే ఉంచాలి అంటూ అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో  తొలిసారిగా మచిలీపట్నం, విజయవాడలో జరిగిన జేఏసీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రజా రాజధానిని రక్షించేందుకు పార్టీలకు అతీతంగా అందరూ ఒకే వేదికపైకి వచ్చామని చంద్రబాబు అన్నారు. అమరావతి పరిరక్షణ సమితి అంటే సీఎం జగన్ భయపడుతున్నారని..అందుకే బస్సు యాత్రకు అన్ని అనుమతులు ఇచ్చి చివర్లో రూట్ పర్మిషన్ లేదంటూ పోలీసులను ఉసిగొలిపి అడ్డుకున్నారని దుయ్యబట్టారు.  ముందుగా ప్రజావేదికను కూల్చేశారన్నారు. అమరావతికి ముంపు భయం లేదని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ చెప్పినా కూడా మునిగిపోతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని తాను అమరావతిలో పెద్ద ఎత్తున భూములు కొన్నానని ప్రచారం చేశారన్నారు. హై కోర్టు న్యాయమూర్తితో విచారణ జరపాలంటే వెనుకడుగువేస్తున్నారు. ఎన్నికల ముందు అమరావతిలో చదరపు గజం రూ 30,000 పలికింది. తాను మళ్లీ వచ్చి ఉంటే లక్ష పలికేదని.. ఆ డబ్బుతోనే అమరావతిని బ్రహ్మాండంగా నిర్మించవచ్చని ఎద్దేవా చేశారు. ఇది ప్రజా రాజధాని దేవుళ్ల మొదలు ప్రజలందరి ఆశీస్సులు ఉన్నాయి. దానిని కదిలించే శక్తి ఎవరికీ లేదన్నారు. ప్రజా రాజధానిని రక్షించుకునేందుకు ఇంటికో వ్యక్తి బయటికి వస్తే.. మనమందరం కలిసి కట్టుగా ఉద్యమిస్తే జగన్ తోక ముడుస్తారని అన్నారు. ఆయన తీరుతో బయటి రాష్ట్రాల్లో మన పరువు పోతుందన్నారు. ఆంధ్ర ప్రజల బతుకు మూడుముక్కలాటయిందని ఇతర రాష్ర్టాల ప్రజలు నవ్వుతున్నారు. అమరావతి కోసం ఉద్యమించే వారిపై తన పత్రిక ద్వారా బురద చల్లుతున్నారని తెలియజేశారు. రాజధానిపై రెఫరెండం పెట్టి.. దమ్ముంటే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవండి.. అప్పుడు మీ ఇష్టం వచ్చిన చోట రాజధానులు పెట్టుకోవాలి అన్నారు.  మంత్రి పేర్ని నాని, పవన్ కళ్యాణ్ ను పవన్ నాయుడు అని సంబోధిస్తున్నారు. మరీ ఆయనేమన్నా నాని రెడ్డా పవన్ స్వశక్తితో ఎదిగిన వాడు. ఆయన వ్యక్తిగత జీవితంపై బురద జల్లుతున్నారు. ఉన్న ఊరి నుంచి రాజధాని తరలిపోతుంటే ఎవరైనా పోరాడతారని అన్నారు. కానీ మంత్రి పేర్ని నానికి ఇక్కడ రాజధాని ఉండటం ఇష్టం లేనట్లే ఉంది.. అందుకే సిగ్గులేకుండా హైపవర్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. తాను ఒక పిలుపు ఇస్తే అమరావతి రైతులు 33,000 ల ఎకరాలను రాజధాని కోసం స్వచ్ఛందంగా ఇచ్చారన్నారు.  విశాఖ నీతి నిజాయితీ ఉండేవాళ్ల నగరం.. అక్కడ అరాచకాలు సృష్టించేందుకు వైసీపీ నాయకులు బయలుదేరారు అని చంద్రబాబు అన్నారు. హుద్ హుద్ ముందు హుద్ హుద్ తర్వాత విశాఖ ఎలా ఉందో అక్కడ ఎవరిని అడిగినా చెబుతారని అన్నారు. దానిని టెక్నాలజీ హబ్ గా, ఫార్మా హబ్ గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే అన్నారు. మచిలీపట్నంలో జరిగిన బహిరంగ సభకు అధికారులు అవంతరాలు సృష్టించేందుకు ప్రయత్నించారు. విద్యుత్ సరఫరాను నిలిపేశారు. సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ ఇలాంటి చర్యలతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు. సభకు వచ్చిన వారందరు తమ సెల్ ఫోన్లలో ఉన్న లైట్ ను వెలిగించాలని పిలుపునిచ్చారు. దీంతో ఒక్కసారిగా సభా ప్రాంగణం వద్ద సెల్ ఫోన్ లైట్ల వెలుగుతో నిండిపోయింది.
ALSO ON TELUGUONE N E W S
నిఖిల్‌ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఆల్రెడీ నిశ్చితార్థం చేసుకున్నాడు. నిఖిల్‌ అంటే టాలీవుడ్‌ యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్ధార్థ కాదు. మాజీ ప్రధాని దేవగౌడ మనవడు, మాజీ కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్‌ గౌడ. తెలుగులో రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌ అందించిన కథతో ‘జాగ్వార్‌’ సినిమా చేసిన హీరో గుర్తున్నాడా? ఆ నిఖిల్‌ గౌడ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. ప్రస్తుతం అధికారంలో లేకపోయినా... కర్ణాటకలో నిఖిల్‌ కుటుంబానికి రాజకీయంగా మంచి పలుకుబడి ఉంది. ఆస్థిపాస్తులు గట్టిగా ఉన్నాయి. సినిమాల్లో హిట్‌ కొట్టలేకపోయినా స్ట్రాంగ్‌ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ ఉండడంతో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్లలో ఒకడిగా నిఖిల్‌కుమార్‌ గౌడను చూసేవారు. మొదటి నుండి అతడు పేరెంట్స్‌ చూసిన సంబంధమే చేసుకుంటానని చెప్పేవాడు. చెప్పినట్టే చేశాడు. పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకుంటున్నాడు. మొన్న 26న నిఖిల్‌కి, రేవతికి ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. ఆ అమ్మాయిది కూడా రాజకీయ నేపథ్యమే. కర్ణాటక మాజీ మంత్రి ఎం. కృష్ణప్ప మేనల్లుడి కుమార్తె రేవతి. ఆమె పేరెంట్స్‌ రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌లో ఉన్నారు. వీలైనంత త్వరలో పెళ్లి తేదీ నిర్ణయించమని దేవగౌడ కుమారుడికి చెప్పారట.
కమెడియన్‌గా సునీల్‌ సూపర్‌ సక్సెస్‌లు అందుకున్నాడు. హీరోగా టర్న్‌ అయ్యాక కొన్ని సక్సెస్‌లు వచ్చాయి. ఒక్కసారి ఫ్లాపులు వచ్చాక మళ్లీ తిరిగి కోలుకోవడం కష్టమైంది. హీరోగా హిట్లు కొట్టలేక... మళ్లీ కమెడియన్‌గా చేయలేక కొన్ని రోజులు ఇబ్బందిపడ్డాడు. చివరికి, కమెడియన్‌గా వచ్చాడు. కానీ, సక్సెస్‌లు రాలేదు. కమెడియన్‌గా సునీల్‌ టాప్‌ పొజిషన్‌కి రావడానికి కారణమైన అతడి ఆప్తమిత్రుడు, మాటల మాంత్రికుడు కూడా అతడికి సక్సెస్‌ ఇవ్వలేకపోయాడు. ‘అరవింద సమేత వీరరాఘవ’, ‘అల వైకుంఠపురములో’ సినిమాల్లో సునీల్‌ నటించాడు. కానీ, ఆశించిన పేరు రాలేదు. ప్రయోగాలు చేయడానికి సునీల్‌ ముందుకొచ్చాడు. ‘డిస్కో రాజా’లో విలన్‌గా ట్రై చేశాడు. మేకవన్నె పులిలా మొదట్లో మొత్తగా ఉండి... క్లైమాక్స్‌లో విలనిజం చూపించాడు. సునీల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ ఆడియన్స్‌కి షాకిచ్చింది. అతడి నటనకు పేరు వచ్చింది. కానీ, సినిమాకు సక్సెస్‌ రాలేదు. దాంతో బాలయ్య మీదే సునీల్‌ ఆశలన్నీ పెట్టుకున్నాడట. ‘సింహ’, ‘లెజెండ్‌’ వంటి సూపర్‌డూపర్‌ సక్సెస్‌ల తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అందులో శ్రీకాంత్‌ విలన్‌గా చేస్తున్నాడు. సునీల్‌కి కూడా విలన్‌ షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్‌ ఏదో దక్కిందట. నటుడిగా సునీల్‌ టాలెంట్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. నవ్వించడమే కాదు, ఏడిపించగలడు కూడా. గతంలో కమెడియన్‌ క్యారెక్టర్స్‌తో పాటు ఎమోషనల్‌ క్యారెక్టర్స్‌ చేసి ఆడియన్స్‌ చేత క్లాప్స్‌ కొట్టించుకున్నాడు. బాలయ్య సినిమాతో విలన్‌గా ఎస్టాబ్లిష్‌ అవుతాడేమో చూడాలి.
కథానాయికులకు ప్రేమ లేఖలు రాసే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువే.‌.. ఇది ఒకప్పటి మాట! మరి, ఇప్పుడు? నేరుగా కథానాయికలకు సోషల్ మీడియాలో లవ్ ప్రపోజల్స్ పెడుతున్నారు. కొందరు ఓ అడుగు ముందుకేసి పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు. నిన్నే పెళ్లి చేసుకుంటామని కథానాయికలకు చెబుతున్నారు. ఆపిల్ బ్యూటీ హన్సికకు ఇటువంటి మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చాయి. సోమవారం రాత్రి ఇ హన్సిక ఓ సినిమా నైట్ షూటింగులో పాల్గొన్నారు. లొకేషన్ లో ఆమెకు కొంత గ్యాప్ దొరకడంతో ఇంస్టాగ్రామ్ లో ప్రేక్షకులకు ఒక అవకాశం ఇచ్చారు. 'నేను నెక్స్ట్ షాట్ కి రెడీ అయ్యే లోపు మీరు ప్రశ్నలు అడగండి' అని!  ఒక నెటిజన్ 'నన్ను పెళ్లి చేసుకుంటావా?' అని అడిగారు. ''షాట్ రెడీ అయ్యింది. లేకపోతే నీ ప్రశ్నకు సమాధానం చెప్పే దాన్ని'' అని హన్సిక తెలివిగా తప్పించుకున్నారు. అంతకుముందే ఇంకొకరు 'నిన్ను పెళ్లి చేసుకోవాలని వెయిట్ చేస్తున్నాను. నేను వస్తాను. మోనా జీతో మాట్లాడతాను' అని అన్నాడు. ''నీకు చాలా ఆశలు ఉన్నాయి. వచ్చి మోనా జీతో మాట్లాడు. నిన్ను ఆవిడ గైడ్ చేస్తుంది'' అని హన్సిక సమాధానం ఇచ్చారు. ఎవరో హన్సికను వాట్సాప్ నంబర్ కూడా అడిగారు. దానికి వెటకారంగా ఒక నంబర్ చెప్పి... తన నంబర్ మర్చిపోయానని ఆమె అన్నారు.
అవును... మీరు చదివింది నిజమే! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ తో 'అశ్వథ్థామ' సినిమా ప్రారంభం కానుంది. అయితే... ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఆయన వాయిస్ ఓవర్ చెప్పలేదు. 'గోపాల గోపాల' చిత్రంలో పవన్ కళ్యాణ్ అశ్వత్థామ గురించి ఒక డైలాగ్ చెప్పారు. ఆ డైలాగ్ ను ఈ సినిమాలో వాడుకున్నారు. ఈ సంగతి 'అశ్వథ్థామ' హీరో, స్టోరీ రైటర్ నాగశౌర్య మంగళవారం ఉదయం మీడియాతో చెప్పారు. ఈ నెల 31న సినిమా విడుదల కానున్న సందర్భంగా నాగ శౌర్య మీడియాతో ముచ్చటించారు. అప్పుడు పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ గురించి మాట్లాడుతూ "మేం 'గోపాల గోపాల'లో పవన్ గారు చెప్పిన డైలాగ్ వాడుకుంటున్నాం.  ఆయనతో పాటు నిర్మాత శరత్ మరార్ గారి అనుమతి తీసుకున్న తర్వాతే మా సినిమాలో ఆ డైలాగు ఉపయోగించాం" అని అన్నారు. మహాభారతంలో అశ్వత్థామ అది కాస్త నెగెటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్. అతని పేరు ఈ సినిమాకు పెట్టడం ఏమిటి? అని నాగశౌర్య అని ప్రశ్నించగా "ప్రతి ఒక్కరి లో మంచి చెడు రెండూ ఉంటాయి. ద్రౌపతి వస్త్రాపహరణం అప్పుడు అశ్వత్థామ అది తప్పని చెప్పాడు. తప్పు అని ప్రశ్నించాడు. మా సినిమాలో హీరో కూడా తప్పుని ప్రశ్నిస్తాడు. అందుకని అతడి పేరు మా సినిమాకు టైటిల్ గా పెట్టాను. నేను అతడిలో మంచిని మాత్రమే తీసుకున్నాను" అని అన్నారు. ఇటీవల హైదరాబాదులో దిశ ఘటన జరిగింది. సమాజంలో ప్రతి రోజు ఏదో ఒక చోట ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. వాటి ఆధారంగా సినిమాలో సన్నివేశాలు రూపొందించామని నాగ శౌర్య తెలిపారు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో సభ్యుల మధ్య విబేధాలు తారా స్థాయికి చేరుతున్నాయి. తాజాగా 'మా' అధ్యక్షుడు నరేష్ పై ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'మా' సంస్థ అభివృద్ధికి నరేష్ అడ్డంకిగా మారారని నిధుల దుర్వినియోగంతో పాటు సభ్యులను అవమానపరుస్తున్నారని ఆరోపిస్తున్నారు. నరేష్ లోపాలను ఎత్తి చూపుతూ క్రమశిక్షణా సంఘానికి లేఖ రాశారు. నిబంధనలు ఉల్లంఘించిన నరేష్ పై చర్యలు తీసుకోవాలని సభ్యులు విజ్ఞప్తి చేశారు. క్రమ శిక్షాణా సంఘానికి రాసిన లేఖలో మొత్తం పదిహేను మంది సభ్యులు ఈ లేఖపై సంతకం చేశారు. పదకొండు నెలలుగా 'మా' లో ఎటువంటి పరిణామాలు జరుగుతున్నాయటువంటి విషయాలన్నిటిపై సవివరంగా ఒక లేఖ రాశారు. క్రమశిక్షణా కమిటీలో చిరంజీవి, మురళీ మోహన్, కృష్ణంరాజు, మోహన్ బాబు, జయసుధ ఐదుగురు సభ్యులుగా ఉన్నారు.  అదేవిధంగా గతంలో అధ్యక్షుడిగా ఉన్నటువంటి శివాజీ రాజా విషయంలో ఎంక్వైరీ కమిటీ ఏర్పాటు చేసి పూర్తిగా ఆయనకి క్లీన్ చిట్  ఇచ్చినప్పటికీ పదేపదే అదే విషయాన్ని ప్రస్తావించడం పట్ల జీవిత రాజశేఖర్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఎన్నికల కంటే ముందు మహేశ్ బాబుని తీసుకువచ్చి ఫండ్ రైజింగ్ కొరకు చాలా రకాల ఆక్టివిటీస్ 'మా' తరపున నరేష్ హామీ ఇచ్చి.. ఆ తర్వాత పదకొండు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకూ ఏ కార్యక్రమం చేపట్టకపోవడంపై కూడా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.  
మండలిలో పరిణామాలు తనను తీవ్రంగా బాధించాయంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం చూస్తుంటే... కౌన్సిల్ రద్దు దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ తో పెట్టుకుంటే ఏమవుతుందో... తెలుగుదేశానికి రుచి చూపించాలన్న పట్టుదలతో... జగన్మోహన్ రెడ్డి ఉన్నారని... దాంతో, మండలి రద్దు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. తన ఏకచత్రాధిపత్యాన్నే ధిక్కరిస్తారా? అనే భావనతో జగన్ పట్టుదలకు పోతేమాత్రం మండలి రద్దు తప్పదంటున్నారు. శాసనసభలో జగన్మోహన్ రెడ్డి ప్రసంగాన్ని విశ్లేషించిన మీడియా, రాజకీయ విశ్లేషకులు సైతం మండలి రద్దు ఖాయమనే చెబుతున్నారు. అయితే, పట్టుదలకుపోయి మండలిని రద్దుచేస్తే, ముందుముందు జగన్మోహన్ రెడ్డి అనేక ఇబ్బందులు ఎదుర్కోక తప్పదంటున్నారు. ఎన్నికల సమయంలో ఎంతోమందికి ఎమ్మెల్సీ ఇస్తానంటూ జగన్ హామీ ఇచ్చారు. మరి, వీళ్లందరికీ ఏం సమాధానం చెబుతారు... ఏవిధంగా పదవుల్లో అకామిడేట్ చేస్తారనేది ప్రశ్నార్ధకమే. హామీలు పొందినవాళ్ల సంగతి పక్కనబెడితే... ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీలుగా ఉన్న 9మంది తమ పదవులు కోల్పోయి రాజకీయ నిరుద్యోగులు మారతారు. ముఖ్యంగా శాసనమండలి సభ్యులుగా ఉంటూ మంత్రులుగా కొనసాగుతున్న పిల్లి సుభాష్ చంద్ర బోస్, మోపిదేవి వెంకటరమణ పరిస్థితి ఏమిటనే చర్చ జరుగుతోంది.  అయితే, మండలి రద్దయితే, ఇప్పటికిప్పుడు పిల్లి సుభాష్ చంద్ర బోస్, మోపిదేవి వెంకటరమణ మంత్రి పదవులకు వచ్చే ముప్పు లేకపోయినా, ఆరు నెలలు తర్వాత మాత్రం కచ్చితంగా రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈలోపు... ఏవైనా అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలొచ్చి... ఎమ్మెల్యేలుగా గెలిస్తే తప్ప.... వీళ్లిద్దరూ మంత్రి పదవుల్లో కంటిన్యూ అయ్యే ఛాన్సుండదు. అయితే, ఏపీలో ప్రస్తుతం ఉపఎన్నికలు జరిగే పరిస్థితే లేదు. దాంతో, మండలి రద్దు జరిగితే మాత్రం ఆర్నెళ్ల తర్వాత కచ్చితంగా పిల్లి సుభాష్ చంద్ర బోస్, మోపిదేవి వెంకటరమణలు మాజీలుగా మారిపోతారు. అయితే, పిల్లి సుభాష్ చంద్ర బోస్, మోపిదేవి వెంకటరమణలు... వైఎస్ కుటుంబానికి ఎంతో నమ్మకస్తులు. పైగా ఎప్పట్నుంచో వైఎస్ ఫ్యామిలీతో అసోసియేటై ఉన్నారు. అదే సమయంలో జగన్ కు కూడా ఇద్దరూ అత్యంత సన్నిహితులు. అందుకే, మోపిదేవి వెంకటరమణ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయినా మంత్రి పదవి కట్టబెట్టారు. పిల్లి సుభాష్ చంద్ర బోస్ ది కూడా దాదాపు అలాంటి పరిస్థితే. అయితే, మండలి రద్దయి ఆర్నెళ్ల తర్వాత మాజీలుగా మారితే... వీళ్లిద్దరికీ కేబినెట్ ర్యాంక్ తో కీలకమైన నామినేటెడ్ పదవులు కట్టబెట్టొచ్చని అంటున్నారు.
ఏపీ రాజధానిని మూడు భాగాలుగా విభజించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్ని విమర్శలు ఎదురైనా.. మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గకుండా జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే అసెంబ్లీలో బిల్లు కూడా పాస్ అయింది. అయితే ఈ మూడు రాజధానుల వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగే అవకాశం కనిపిస్తోంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి కొత్త రాజధానిని నిర్మించడం అంటే.. పసి పిల్లాడిని పెంచి పెద్ద చేయడం లాంటిది. పిల్లోడు పుష్టిగా పెరగాలంటే టైంకి పాలు, ఫుడ్, నీళ్లు సరిగ్గా అందించాలి. అలా కాకుండా పాలు ఒక దగ్గర, ఫుడ్ ఒక దగ్గర, నీళ్లు మరో దగ్గర అంటూ.. అటు ఇటు తిప్పితే పిల్లోడి ఎదుగుదలకే ప్రమాదం. ఇప్పుడు ఏపీ పరిస్థితి కూడా అలానే ఉంది. ముందు రాజధానిగా ఓ పెద్ద నగరాన్ని నిర్మించి అభివృద్ధికి బలమైన పునాది వేయాలి. ఆ రాజధాని మీద వచ్చే ఆదాయంతో రాష్ట్రంలోని మిగతా నగరాలను అభివృద్ధి చేయాలి. దానిని అభివృద్ధి వికేంద్రీకరణ అంటారు. దానివల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అంతేకాని ఇలా పరిపాలన వికేంద్రీకరణ చేయడం వల్ల ఒరిగేదేమి లేదు. ఇలా మూడు నాలుగు రాజధానుల అనుకంటూ పొతే.. ఏపీకి అంటూ ఓ పెద్ద నగరం లేకుండా పోతుంది. ఎక్కడా పూర్తిగా అభివృద్ధి జరగదు. పెద్ద పెద్ద కంపెనీలు రాష్ట్రానికి రావడానికి ఆసక్తి చూపవు. మన దేశంలోని పలు రాష్ట్రాలను తీసుకోండి. వాటికంటూ రాజధానిగా ఓ పెద్ద నగరాన్ని నిర్మించుకున్న తర్వాతే.. రాష్ట్రంలోని మిగతా నగరాలను అభివృద్ధి చేసుకున్నాయి. తమిళనాడుని తీసుకోండి. రాజధాని చెన్నైని బాగా అభివృద్ధి చేసుకుంది. దాంతో పాటే కోయంబత్తూర్, తిర్పూర్, ట్రిచీ, సేలం ఇలా ఎన్నో నగరాలను అభివృద్ధి చేసుకుంది. మహారాష్ట్రని తీసుకుంటే ముంబై, నాగపూర్, పూణే ఇలా ఎన్నో నగరాలు అభివృద్ధి చెందాయి. సాటి తెలుగు రాష్ట్రం తెలంగాణను తీసుకుంటే.. తెలంగాణకు ఆదాయం తెచ్చే కామధేనువు హైదరాబాద్. రాష్ట్రానికి భారీగా ఆదాయం తెచ్చే పునాది హైదరాబాద్ ఉంది కాబట్టే.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం వంటి నగరాలలో.. ఐటీ హబ్ లు, మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుడుతోంది. దాదాపు అన్ని రాష్ట్రాలు.. ముందు రాజధానిగా ఓ పెద్ద నగరాన్ని అభివృద్ధి చేసుకొని.. ఆ తరువాత రాష్ట్రంలోని మిగతా నగరాలని అభివృద్ధి చేసుకొని దూసుకుపోతున్నాయి. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం.. మూడు రాజధానులు పేరుతో.. అసలు ఏపీకి అంటూ ఓ పెద్ద నగరం లేకుండా చేస్తోంది. హైదరాబాద్ కి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయి. వసతులు, ఆదాయ వనరులు ఉండటంతో.. లక్షల్లో ప్రజలు హైదరాబాద్ కి వలస వచ్చారు. ఇప్పుడు ఏపీలో ప్రాంతానికో రాజధాని పెట్టుకుంటే పొతే.. పెట్టుబడులు ఎలా వస్తాయి? రాష్ట్రానికి ఆదాయం ఎలా వస్తుంది?. ఈ మూడు రాజధానుల వల్ల ఏపీకి ఆదాయం తగ్గిపోవడమే కాదు.. భారీగా ఆర్ధిక భారం కూడా పడనుంది. గత ప్రభుత్వం ఏపీ రాజధానిగా అమరావతిని నిర్ణయించింది. వివిధ ప్రభుత్వ శాఖల కోసం పలు భవనాలు నిర్మించింది. అధికారులు, ఉద్యోగుల వసతి కోసం ఏర్పాటు చేసింది. ఇప్పుడు జగన్ సర్కార్ పరిపాలనను విశాఖకు మారిస్తే.. కొత్తగా భవనాలు నిర్మించాలి, ఉద్యోగులకు వసతి కల్పించాలి. ఇదంతా ఆర్ధిక భారం కాదా? వివిధ శాఖలను తీసుకుంటే విశాఖకు తరలి వెళ్లాల్సిన ఉద్యోగులు సుమారుగా లక్షమంది ఉంటారు. ఈ ఉద్యోగులందరికీ విశాఖ వద్ద 200 చదరపు గజాల ఇంటి స్థలాలను నామమాత్రపు రేటుకు ప్రభుత్వం కేటాయిస్తుంది. కొత్త ఇళ్ల నిర్మాణానికి ప్రతి ఒక్కరికి 25 లక్షల రూపాయల ప్రత్యేక గృహనిర్మాణ భత్యం (హెచ్‌బిఎ) ఇవ్వనుంది. ఇళ్ళు నిర్మించే వరకు, ప్రభుత్వం ఉద్యోగులకు నివాస సదుపాయాన్ని ఏర్పాటు చేస్తుంది. ఉద్యోగులకు ఒక్కొక్కరికి రూ .50 వేల నుండి గరిష్టంగా లక్ష రూపాయల వరకు షిఫ్టింగ్ భత్యం ఇవ్వనుంది. 1) ఒక్కొక్కరికి 200 గజాల ప్లాటు గవర్నమెంటు రేటు వైజాగ్ లో గజం 21,000 కంటే తక్కువ ఎక్కడా లేదు. అంటే 1,00,000x 200x 21,000 = 42,000 కోట్లలుతుంది. రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు ఖర్చు పెట్టడటం సాధ్యం కాదన్న వారు.. కేవలం ఉద్యోగుల స్థలాల కోసం 42 వేల కోట్లు ఖర్చు పెట్టడం సాధ్యమేనా? సరే ఎక్కడో సిటీకి దూరంగా ఇచ్చినా గజం రూ. 5,000 కంటే తక్కువ ఎక్కడా వుండదు. పోనీ గజం 5,000 తీసుకున్నా.. 10,000 కోట్లు ఖర్చవుతుంది. 2) ఒక్కొక్కరికి 25 లక్షల గృహ నిర్మాణ భత్యం. 1,00,000 x 25,00,000 = 25 వేల కోట్లు 3) షిఫ్టింగు భత్యం 50,000 నుండి లక్ష వరకు. సగటు గా ఒక్కొక్కరికి 75,000 అనుకుంటే 1,00,000 x 75,000 = 750 కోట్లు అంటే కేవలం ఉద్యోగుల కోసమే దాదాపు 50 వేల కోట్లు వెచ్చించాల్సి వస్తుంది. ఇంకా అయిపోలేదు. పలు శాఖల భవనాలు కూడా ఉన్నాయి. * విజయవాడలో 4 లక్షల చదరపు అడుగులలో వంద కోట్ల ఖర్చుతో R&B భవనాన్ని నిర్మించారు. ఇప్పుడు దాన్నేం చేస్తారు? విశాఖలో వంద కోట్లతో మరో భవనం నిర్మిస్తారా? * మంగళగిరిలో 2 లక్షల చదరపు అడుగులలో 108 కోట్ల ఖర్చుతో ఏపీఐఐసీ భవనాన్ని నిర్మించారు. ఇప్పుడు దాన్నేం చేస్తారు? విశాఖలో 108 కోట్లతో మరో భవనం నిర్మిస్తారా? * మంగళగిరిలో లక్ష చదరపు అడుగులలో 40 కోట్ల ఖర్చుతో పోలీస్ హెడ్ క్వార్టర్స్ నిర్మించారు. ఇప్పుడు దాన్నేం చేస్తారు? విశాఖలో 40 కోట్లతో మరో భవనం నిర్మిస్తారా? * విజయవాడలో లక్ష చదరపు అడుగులలో 143 కోట్ల ఖర్చుతో విద్యుత్ సౌధ నిర్మించారు. ఇప్పుడు దాన్నేం చేస్తారు? విశాఖలో 143 కోట్లతో మరో భవనం నిర్మిస్తారా? * వెలగపూడిలో శాసనసభ, శాసనమండలి మరియు సచివాలయం భవనాలకు కలిపి నిర్మాణానికి సుమారు 500 కోట్లు ఖర్చయింది. ఇప్పుడు మళ్లీ విశాఖలో సచివాలయం కోసం ఎన్ని కోట్లు ఖర్చుపెడతారు? * గొల్లపూడిలో 30 వేల చదరపు అడుగులలో నాలుగున్నర కోట్ల ఖర్చుతో దేవాదాయ భవనాన్ని నిర్మించారు. ఇప్పుడు దాన్నేం చేస్తారు? విశాఖలో మరో భవనం నిర్మిస్తారా? * వెలగపూడిలో 58 కోట్ల ఖర్చుతో కమాండ్ కంట్రోల్ నిర్మించారు. ఇప్పుడు దాన్నేం చేస్తారు? విశాఖలో 58 కోట్లతో మరో భవనం నిర్మిస్తారా? * మంగళగిరిలో 65 వేల చదరపు అడుగులలో 19 కోట్ల ఖర్చుతో ఏపీ పోలీస్ టెక్ టవర్స్ నిర్మించారు. ఇప్పుడు దాన్నేం చేస్తారు? విశాఖలో 19 కోట్లతో మరో భవనం నిర్మిస్తారా? అమరావతిలో ఎన్నో భవనాల నిర్మాణం జరిగింది. వేల ఎకరాల భూమి ఉంది. ఆ భూమి అమ్మగా వచ్చిన డబ్బుతో రాజధానిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయొచ్చు. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం రాజధానిని తరలించాలని నిర్ణయించింది. అసలే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేదు. ఇప్పుడు ఇన్ని వేల కోట్ల ఖర్చుతో రాజధానిని తరలిస్తే.. అదంతా ప్రభుత్వం మీద భారం కాదా? ప్రజా ధనం వృధా కాదా?. ఇప్పటికైనా ఆలోచించండి.
కీడు ఎంచి మేలెంచాలి అంటారు పెద్దలు. ఏపీ రాజధానిగా అమరావతిని నిర్ణయించిన సమయంలో 2015 లో.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇదే మాట గుర్తుచేశారు. "అనేక వేల మంది రైతులు.. వారి నమ్మకాన్ని, వారి భవిష్యత్తుని, వారి పిల్లల భవిష్యత్తుని టీడీపీ ప్రభుత్వం చేతుల్లో పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఒకవేళ టీడీపీ ఓడిపోతే పరిస్థితి ఏంటి?. కీడు ఎంచి మేలెంచమంటారు కదా. ఒకవేళ టీడీపీ అధికారంలోకి రాలేదు అనుకున్నాం. అప్పుడు మంత్రి నారాయణ ఉండరు, పత్తిపాటి పుల్లారావు ఉండరు. మరి రైతుల పరిస్థితి ఏంటి?. వారి భవిష్యత్తుకి గ్యారంటీ ఏంటి?. వారు టీడీపీ ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇస్తున్నారు.. కానీ ఆ నమ్మకానికి గ్యారంటీ ఏంటి?" అని పవన్ ప్రశ్నించారు. పవన్ అనుమానమే నిజమైంది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చింది. రైతులు పెట్టుకున్న నమ్మకం కన్నీటి పాలైంది. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల వైపు అడుగులు వేస్తోంది. అమరావతిలో కేవలం అసెంబ్లీ మాత్రమే ఉంచి.. మిగతా పరిపాలన విభాగమంతా విశాఖకు తరలిస్తోంది. దీంతో రైతులు, మహిళలు.. రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. కానీ వారు ఎంత గొంతు చించుకున్నా, ఎంత కన్నీరు పెట్టుకున్నా ఏం లాభం?. జరగాల్సిన నష్టం జరిగిపోయి.. వారి భవిష్యత్ అంధకారంలోకి వెళ్తోంది. అప్పుడు టీడీపీ నేతలు.. ప్రపంచస్థాయి నగరాన్ని నిర్మిస్తాం.. మీ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు రాకెట్ లా దూసుకుపోతుందని చెప్పారు.. ల్యాండ్ పూలింగ్ చేశారు. ముఖ్యంగా మాజీ మంత్రి నారాయణ, పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా వంటివారు.. ల్యాండ్ పూలింగ్ లో ప్రధాన పాత్ర పోషించారు. మీ భవిష్యత్తు ఆకాశాన్ని తాకుతుంది అంటూ.. రైతుల దగ్గర నుండి వేల ఎకరాల భూములు తీసుకున్నారు. ఇప్పుడు ఏమైంది? పవన్ అనుమానించినట్టుగానే.. టీడీపీ అధికారంలోకి రాలేదు. రైతుల నమ్మకానికి గ్యారంటీ ఏంటని పవన్ ప్రశ్నించినట్టుగానే.. వారి నమ్మకం దుఃఖంగా మారింది. ఇప్పుడు రైతులు రాజధానిని తరలించొద్దు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అప్పుడు రైతులకు మాటలు చెప్పి భూములు తీసుకున్నవారు ఏమైపోయారు?. ముఖ్యంగా 'ల్యాండ్ పూలింగ్' అనే సినిమాకి తానే 'స్టోరీ-డైలాగ్స్- స్క్రీన్ ప్లే- డైరెక్షన్' అన్నట్టు ఫీలైన మాజీ మంత్రి నారాయణ ఏమైపోయారు?. అప్పుడు రైతులు భూములు ఇచ్చేవరకు తిరిగారు కాదా.. మరి ఇప్పుడు అదే రైతులు న్యాయం కోసం పోరాడుతుంటే.. వారి పక్షాన పోరాడరా?. ఏమైపోయారు నారాయణ, పత్తిపాటి పుల్లారావు వంటి నేతలు?. దేవినేని ఉమా వంటి వారు అప్పుడప్పుడు బయటికి వచ్చి డ్రామాలు చేస్తున్నారు కానీ.. నిజంగా రైతులకు మేమున్నామన్న ధైర్యం ఇస్తూ పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారా? లేదు. అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రతిపాదన బిల్లు ప్రవేశపెట్టే సమయంలో.. రైతులతో కలిసి అసెంబ్లీని ముట్టడించాలని టీడీపీ ప్లాన్ చేసింది. కానీ ఏమైంది? టీడీపీ నేతలు ఎంతమంది పాల్గొన్నారు?. ఎవరికివారు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తే చాలు, మేం ఉద్యమంలో పాల్గొన్నట్టే అని ఫీలయ్యారు. ఈ తూతూ మంత్రం పోరాటాలు వల్ల ఒరిగేది ఏంటి?. ఇటీవల తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చినప్పుడు.. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తనని హౌస్ అరెస్ట్ చేస్తారని ముందే తెలిసి.. సీక్రెట్ గా ఒక చోట దాక్కొని, పోలీసుల కళ్ళు గప్పి సడెన్ గా ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షమయ్యారు. అలాంటి దూకుడు ఏపీ టీడీపీ నేతల్లో కరువైంది. ఎలాగూ హౌస్ అరెస్ట్ చేస్తారు.. ఇంట్లోనే హ్యాపీగా రెస్ట్ తీసుకుంటే సరిపోతుందిగా అన్నట్టుంది నేతల తీరు. ఎంపీ గల్లా జయదేవ్ మాత్రమే దూకుడు కనబరిచారు. కొందరి నేతల్లా ఇంట్లో కూర్చొని కాలక్షేపం చేయకుండా.. పొలాల వెంట, గుట్టల వెంట నడిచి.. రైతులకి అండగా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. మరి మిగతా నేతలు ఏం చేస్తున్నారు? అప్పుడు రైతుల పొలాలు తీసుకున్నారు. ఇప్పుడు రైతుల కోసం పోరాడలేరా?
కొద్ది రోజులుగా ఏపీని పట్టి కుదిపేస్తున్న అంశం రాజధాని తరలింపు. అసెంబ్లీ సాక్షిగా మూడు రాజధానుల ప్రతిపాదన అంశాన్ని సీఎం వైఎస్ జగన్ తెరమీదకు తీసుకురావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. విశాఖను పరిపాలన రాజధాని చేస్తామని చెప్పడం.. జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీలు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో ఇక రాజధాని తరలింపు ఖాయమని తెలుస్తోంది. దీంతో రాజధాని తరలింపుని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు, మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వారికి టీడీపీ పూర్తిగా మద్దతిస్తూ ఉద్యమిస్తోంది.  అయితే టీడీపీకి చెందిన కొందరు విశాఖ నేతలు మాత్రం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ప్రకటించారు. స్థానిక ప్రజల మెప్పు కోసమే ఆ ప్రాంత టీడీపీ నేతలు కొందరు జగన్ నిర్ణయాన్ని స్వాగతించారని టీడీపీ శ్రేణులు భావించాయి. మరోవైపు అసలు జగన్ విశాఖకు మంచి చేస్తానంటే గుడ్డిగా ఎలా నమ్ముతున్నారంటూ  కొందరు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు గతంలో విశాఖపై జగన్ ప్రదర్శించిన తీరుని గుర్తుచేస్తున్నారు. 2014 లో హుద్‌హుద్ తుఫాను విశాఖని అతలాకుతలం చేసింది. ఆ సమయంలో అప్పటి సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి విశాఖకు అండగా ఉన్నారు. కొద్దిరోజులపాటు విశాఖలోనే ఉండి అధికారులని ఉరుకులు పెట్టి పనులు చేయించారు. తుఫాను వచ్చి కళ తప్పిన విశాఖకు.. మళ్లీ కళ తెప్పించారు. విశాఖ ప్రజల కళ్ళల్లో ఆనందం తెప్పించారు. కానీ అప్పుడు వైఎస్ జగన్ మాత్రం విశాఖకు అండగా నిలబడలేదు. దానికి కారణం ఆయనకు విశాఖ ప్రజలపై ఉన్న కోపమే అని అప్పుడు ప్రచారం జరిగింది. 2014 ఎన్నికల్లో జగన్ తల్లి విజయమ్మ విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత హుద్‌హుద్ తుఫాను విశాఖను కుదిపేసింది. విజయమ్మని ఓడించిన పాపం విశాఖకు తగిలింది అంటూ ఆ సమయంలో కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టి పైశాచిక ఆనందం పొందారు. ఇక జగన్ అయితే విశాఖ వైపు తిగిరిచూడలేదు. తన తల్లిని ఓడించారన్న కోపంతోనే జగన్ వారిని పరామర్శించలేదు, వారికి అండగా నిలబడలేదని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. రాజకీయాల్లో గెలుపోటములు సహజం గెలిచినా ఓడినా ప్రజలకు అండగా ఉండాలి. 2009 కర్నూల్ లో వరదలు వచ్చిన సమయంలో ప్రతిపక్షంలో ఉన్నా కూడా చంద్రబాబు ప్రజలకు అండగా నిలబడి.. వారికి తన తరఫున, తన పార్టీ తరఫున ఎంతో సేవ చేశారు. కానీ జగన్ మాత్రం తన తల్లిని ఓడించారన్న కోపంతో... ప్రజలు కష్టాల్లో ఉంటే వాళ్ళ కనీళ్ళు తుడవడం కాదు కదా.. కనీసం పలకరించలేదు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. వీటిని గుర్తు చేస్తూ ఇప్పుడు జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న వారిని ప్రశ్నిస్తున్నారు కొందరు. అప్పుడు విశాఖ ప్రజలు కష్టాల్లో ఉంటే కనీసం కన్నెత్తి చూడనివాడు.. ఇప్పుడు విశాఖకు మంచి చేస్తానంటే ఎలా నమ్ముతున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. జగన్ కేవలం చంద్రబాబు మీద కోపంతోనే రాజధానిని అమరావతి నుండి విశాఖకు తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. విజయమ్మ ఓటమిని గుర్తు పెట్టుకొని విశాఖపై ప్రతీకారం తీర్చుకునే కుట్ర చేసినా ఆశ్చర్యం లేదని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు రాజధాని విషయంలో జగన్ మనసులో ఏముందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం జగన్ కి మద్దతుగా కొందరు, జగన్ కి వ్యతిరేకంగా కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన తప్పే మళ్లీ చేస్తున్నాడా? తను తడబడుతూ తన వెంట నడుస్తున్న జనసైనికులను అయోమయానికి గురి చేస్తున్నాడా?. జనసేన ఆవిర్భావం నుండి తాజా రాజకీయ పరిస్థితులు వరకు ఆయన అడుగులు గమనిస్తే అవుననే అభిప్రాయం కలుగుతోంది. సినిమాలకు కామా పెట్టి 2014 లో సొంతంగా జనసేన పార్టీని స్తాపించాడు. సినిమాల్లో ఆయనను ఎంతగానో ఆదరించిన యువత.. రాజకీయాల్లో కూడా ఆయన వెంట నడవడానికి ఉత్సాహం చూపారు. ఆ సమయంలో పవన్ పోటీ చేస్తే గౌరవ ప్రదమైన సీట్లు గెలిపించే అంత ఉత్సాహం చూపించారు జన సైనికులు. కానీ, పవన్ మాత్రం మొదటి అడుగులోనే వారి ఉత్సాహానికి బ్రేకులు వేసాడు. ప్రశ్నించడానికి పార్టీ పెట్టా అంటూ.. ఎన్నికల బరిలోకి దిగకుండా.. బీజేపీ-టీడీపీ పార్టీలకు మద్దతు తెలిపాడు. దీంతో సగం మంది జనసైనికులు నిరుత్సాహ పడ్డారు. మిగతా వారు పవన్ చెప్పినట్టు.. బీజేపీ-టీడీపీ పార్టీలకు ఓటేశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాయి. దీంతో జనసైనికులు అది తమ విజయంగానే భవిస్తూ ఆనంద పడ్డారు. కానీ దానివల్ల జనసేనకు ఒరిగినదేమీ లేదు. బరిలోకి దిగకపోయేసరికి అదో రాజకీయ పార్టీగా ప్రజలు గుర్తించలేదు. పార్టీ గానీ, పవన్ గానీ ప్రజల్లోకి వెళ్ళలేదు. 2014 ఎన్నికల తరువాత కొన్నాళ్ళకు బీజేపీ-టీడీపీ పార్టీలకు పవన్ దూరం జరిగాడు. ప్రశ్నించడం మొదలు పెట్టాడు. 2019 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలతో సంబంధం లేకుండా ఒంటరిగా బరిలోకి దిగాడు. కానీ తాను టీడీపీ, బీజేపీ పార్టీలకు మిత్రుడు అనే ముద్ర పోగొట్టుకోలేకపోయాడు. వైసీపీ నేతలు పవన్ టీడీపీ రహస్య మిత్రుడు అంటూ ఆరోపిస్తుంటే .. పవన్ ఆ ఆరోపణలకు చెక్ పెట్టలేకపోయాడు. అది పవన్ కి బాగానే నష్టం చేసింది. ఎంతలా అంటే.. పార్టీ గెలవడం మాట అటుంచితే.. పవన్ పోటీ చేసిన రెండు చోట్ల పరాజయం మూట గట్టుకున్నాడు. పార్టీ కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే సీటు మాత్రమే గెలుచుకోగలిగింది. పవన్ కి రాజకీయాల్లో అంతటి దారుణమైన ఓటమి ఎదురుకావడానికి ప్రధాన కారణం.. పవన్ కి స్పష్టమైన స్టాండ్ లేదని ప్రజల్లో భావన కలగడమే. పవన్ బీజేపీ-టీడీపీ పార్టీల వ్యక్తిగానే ఎక్కువ మంది భావించారు. అందుకే పవన్ ని పట్టించుకోలేదు. అయినా వీటి నుండి పవన్ పాఠాలు నేర్చుకున్నట్టు లేడు. అందుకేనేమో మళ్లీ అదే తప్పు చేస్తున్నాడు. పవన్ ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్ళాడు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డాని కలిశాడు. ఏపీలో జనసేన-బీజేపీ కలిసి పనిచేయాలని పరస్పరం అంగీకారానికి వచ్చాయని అంటున్నారు. దీంతో జనసైనికుల్లో అయోమయం, అసహనం నెలకొన్నాయి. పవన్ ఓడిపోయినా ఇంకా ఆయన వెంట ఎందరో నడవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ప్రజాసమస్యల మీద పోరాడుతూ, ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే.. ఆయన మీద, ఆయన పార్టీ మీద ప్రజలకు నమ్మకం కలుగుతుంది. కాస్త ఆలస్యమైనా ఆయనపై ప్రజలకు పూర్తి నమ్మకం కలిగే అవకాశం ఉంటుంది. కానీ పవన్ మాత్రం తప్పటడుగులు వేసి ఉన్న నమ్మకాన్ని కూడా పోగొట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఒకవేళ ఆయన బీజేపీ గొడుగు కిందకు చేరితే.. ఆయనకంటూ ఓ స్టాండ్ లేదని ప్రజలు అనుకుంటారు. ఈ అయోమయంలో మరికొందరు జనసైనికులు కూడా దూరం అవుతారు. మరి పవన్ ఇప్పటికైనా ఇలా ఏదోక పార్టీతో జతకట్టడం మానేసి.. తన పార్టీ తరపున ప్రజాసమస్యలపై పోరాడుతూ.. జనసైనికులకు భరోసా, ప్రజలకు నమ్మకం కలిగిస్తారేమో చూద్దాం.
2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. వైసీపీ దూకుడు ముందు నిలబడలేక టీడీపీ కేవలం 23 సీట్లకు పరిమితమైంది. ఇది మామూలు ఓటమి కాదు. టీడీపీ పునాదులనే కదిలించిన ఓటమి. అసలు ఈ ఓటమి నుండి టీడీపీ ఇప్పట్లో కోలుకుంటుందా? అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. టీడీపీ క్యాడర్ లో కూడా నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి. మరోవైపు వైసీపీ ఘన విజయంతో ఆ పార్టీ నాయకత్వం, కేడర్ నూతనోత్సాహంతో పరుగులు పెట్టింది. 151 సీట్లతో ఘన విజయం సాధించిన వైసీపీ జోరు చూసి.. వైఎస్ జగన్ కి ఇక తిరుగులేదు అనుకున్నారంతా. ప్రజలు రికార్డు మెజారిటీ ఇచ్చారు.. ఇక ఇతర పార్టీ నేతలను ఆకట్టుకోవాల్సిన పనికూడా లేదు. జగన్ కూల్ గా తనపని తాను చేసుకుంటూ పొతే చాలు.. వచ్చే ఎన్నికల్లో కూడా ఈజీగా గెలిచి సీఎం అయిపోతారన్న అభిప్రాయం వ్యక్తమైంది. టీడీపీ ఇప్పట్లో ఆ ఓటమి నుండి కోలుకొని జగన్ ని దెబ్బకొట్టే అవకాశమే లేదు అనుకున్నారంతా. కానీ జగన్ మాత్రం తనంతట తానే టీడీపీకి త్వరగా కోలుకునే అవకాశాన్ని ఇస్తున్నారు. ప్రజావేదిక కూల్చివేత, పోలవరం రివర్స్ టెండరింగ్, విద్యుత్ ఒప్పందాల రద్దు, ఇసుక కొరత.. ఇలా కొన్ని సందర్భాలలో టీడీపీకి స్వరం వినిపించే అవకాశాన్ని జగన్ ఇచ్చారు. అయితే ఘోర ఓటమిలో కూరుకుపోయిన టీడీపీని ఇవేవి చెయ్యి పట్టి పైకి లాగలేకపోయాయి. అలాంటి సమయంలో జగన్ నిర్ణయం రూపంలో టీడీపీకి ఓ వరం లభించింది. మూడు రాజధానుల అంశాన్ని జగన్ తెరమీదకు తీసుకురావడం టీడీపీకి కలిసొచ్చింది. మూడు రాజధానుల వ్యవహారం అమరావతి ప్రాంత రైతులు ఉద్యమించేలా చేసింది. రాజధానిని అమరావతి నుండి తరలించవద్దంటూ.. వారు గొంతెత్తి నినదిస్తున్నారు. లాఠీ దెబ్బలకు, అరెస్టులకు భయపడకుండా పిడికిలి బిగించి పోరాడుతున్నారు. వారికి టీడీపీ పూర్తిగా అండగా నిలబడింది. టీడీపీ నాయకత్వం ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొంటూ రైతులకు మేమున్నామన్న భరోసా ఇస్తోంది. ఇన్నిరోజులు ఓటమి చీకటిలో మగ్గిపోయిన టీడీపీ రేపటి వెలుగు కోసం పోరాటం మొదలుపెట్టింది. కార్యకర్తలు స్వచ్చందంగా ఉద్యమంలో పాల్గొంటూ రైతులకు మద్దతుగా నిలుస్తున్నారు. మొత్తానికి టీడీపీ మళ్లీ ప్రజల నోళ్ళలో నానడం మొదలుపెట్టింది. ఒక్కోసారి మనం వేసే ఒక్క అడుగు భారీ మూల్యం చెల్లించుకునేలా చేస్తుంది. ఇప్పుడు రాజధాని విషయంలో జగన్ అలాంటి అడుగే వేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదన వైసీపీపై వ్యతిరేకత ఏర్పడేలా చేసిందని అంటున్నారు. తెలుగువన్ సంస్థ క్షేత్రస్థాయిలో సేకరించిన ప్రజాభిప్రాయంలో కూడా ఇదే విషయం స్పష్టమైంది.  రాజధాని తరలింపు ప్రతిపాదనతో... కృష్ణ, గుంటూరు, గోదావరి, ప్రకాశం జిల్లాలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు రాయలసీమ ప్రజల్లో కూడా.. రాజధానిని విశాఖకు తరలిస్తే తమకి బాగా దూరమువుతుందన్న అసంతృప్తి కనిపిస్తోంది. ఇవే ఇప్పుడు టీడీపీకి కలిసొస్తున్నాయి. రాజధానిపై పోరాటంతో టీడీపీ ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. చిన్న పెద్ద నాయకుల నుండి సాధారణ కార్యకర్తల వరకు రైతులు వెంట పోరుబాట పట్టారు. దీంతో ఆకు పచ్చ జెండా పట్టి ఉద్యమిస్తున్న రైతులకు పసుపు పచ్చ జెండా అండగా ఉందన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తోంది. మొత్తానికి.. 151 సీట్లతో ఘనంగా అధికారంలోకి వచ్చిన జగన్.. ప్రశాంతంగా ఉండకుండా.. మూడు రాజధానుల ప్రతిపాదనను తెరమీదకు తీసుకొచ్చి.. టీడీపీకి పుంజుకునే అవకాశాన్ని ఇచ్చారని అంటున్నారు. జగన్ వేసిన ఈ ఒక్క రాంగ్ స్టెప్.. చంద్రబాబు నెత్తిన పాలు పోసి.. వైసీపీ వారిని తలలు పెట్టుకునేలా చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  
What is that you need to have to ensure continued success in your workplace? With the future of work ever-changing and dynamic  there is also a need for new set of skill development which changes with the pace of technology and time. First, we must understand what is driving change and molding the future of work. The six key drivers of change include: Extreme longevity: People are living longer. The rise of smart machines and systems: Tech will augment and extend our own capabilities. Computational world: There will be an increase in sensors and processing that will make the world a programmable system. New media ecology: There will be new communication tools that will require media literacies beyond text. Super structured organizations: Social technologies will drive new forms of production and value creation. Globally connected world: Diversity and adaptability will be at the center of operations. So what are the skills you should be working on today to ensure you’ll have a job tomorrow? They include: Sense making Social intelligence Novel and adaptive thinking Cross-cultural competency Computational thinking New media literacy Transdisciplinary Design mindset Cognitive load management Virtual collaboration Source: Jen Cohen Crompton
    The latest entrant into home Décor trends is the Shag rugs which have made its way into the international home décor market. It is actually know as flokati a type of rug made with wool, which has been in existence in Greece for centuries. Flokati rugs were cherished as family treasures, and have been a part of brides' dowries and used as wall-hangings and bed covers as well as rugs in Greek tradition. In the current form with its woolly texture and softness, the material is being used as a pillow cover or as a rug to add softness for the feet. In whatever form this bushy soft material has made its way into many homes. Real flokati shag rugs are made with wool -they begin with pure natural sheep's wool that's spun into yarn, and woven to create long loops. The distinctive Flokati pile is then cut by hand. After which a unique process is followed where every Flokati is carried to mountain waterfalls where it's washed for hours in deep vats. The swirling stream fluffs the long yarns into luxurious lively softness. This is the original Flokati technique, but these are extremely expensive and what we get in the market are the nylon and artificially made ones which make up for the original one. Whether your house has a modern touch or a fusion of your native and traditional décor you can use this shag rug on your floor or wrap your special cozy chair with this fabric for the soft and velvety warmth and charm it provides. With new pastel colour schema s that have come you could also look at placing this on your wall and another variation of the rug is for the new born babies where you could put baby on it! But don’t forget to clean the rugs periodically with the vacuum cleaner or use a plastic rake to clean the soft wool and dust it.  
    With spoons and forks replacing the usage of hands and the influence of Western culture on Indian households, eating with hands is slowly fading. Perceived as unhygienic and primitive, the practice of eating with hands seems to be perceived only as primitive. To appreciate the habit of eating with hands we must delve into our Vedic wisdom to know the reasons why it is good for us. For centuries Indians have been eating with hands as the people of yore knew the Power of the hand. The ancient Hindu teachings talk about eating food with your hands, feeds not only the body but also the mind and the spirit. The hands are considered the most important organs of action. It is mentioned in the Vedic prayer-“Karagre Vasate Lakshmi Karamule Sarasvati Karamadhye Sada Gouri Prabhate Karadarsanam”, which means on the tip of your fingers is Goddess Lakshmi; on the base of your fingers is Goddess Sarasvati; in the middle of your fingers is Gouri Parvati. In this manner, look at your palm and while looking at the palm, thus sanctifying all the actions that will be done during the day. Thus, one prays in the morning to reinforce the attitude that all actions are performed as a service to the Lord. This is one simple explanation through a prayer. There is also another scientific reason from the Vedic texts and Ayurveda that our hands and feet are said to be the channels of the five elements. Each finger is an extension of one of the five elements. Through the thumb - space; forefinger- air; mid-finger-fire; ring finger-water and through the little finger - earth. While taking the food into the mouth, each finger aids in the conversion of food, before it passes on to the internal digestive system. Gathering the fingertips as they touch the food stimulates the five elements and invites Agni (fire) to bring forth the digestive juices. As well as improving digestion the person becomes more conscious of the tastes, textures and smells of the foods they are eating, which all adds to the pleasure of eating and healthy living. With the knowledge and scientific reasoning behind eating with the hands explained, let us enjoy the benefits of eating with hands with a higher awakening. Now even etiquette experts say it's acceptable to eat with your hands except that you don’t lick them in public!
  ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని రద్దు చేయాలని శాసన సభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. కేబినెట్ సమావేశంలో ఆమోదించిన తీర్మానాన్ని సీఎం జగన్ ఆ తరవాత అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సభకు హాజరు కాకూడదని టిడిపి సభ్యులు నిర్ణయించుకోవడంతో సీఎంతో సహా అందరు అధికార పక్ష సభ్యులే దీనిపై మాట్లాడారు. సభ్యులందరూ మండలి రద్దుకు సానుకూలంగా మాట్లాడారు. అభివృద్దిని ఆ సభ అడ్డుకుంటోందని ఖర్చు దండక తప్పా ప్రజా ప్రయోజనాలు లేవని ఆక్షేపించారు. దేశంలో ఆరు రాష్ట్రాల్లో మాత్రమే మండల ఉందని మిగతా రాష్ట్రాలు వద్దనుకున్నాయని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవడం కోసమే శాసన మండలి రద్దుకు తీర్మానం చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో చెప్పారు. మండలికి ఎటువంటి ప్రజా ప్రయోజనాలు లేవని దీనిపై డబ్బు ఖర్చు చేయడం శుద్ధ దండగని తేల్చి చెప్పారు. క్యాబినెట్ అనేది కేవలం శాసన సభకే జవాబుదారీగా ఉంటుంది కానీ శాసన మండలికి కాదని స్పష్టం చేశారు. బిల్లులకు అడ్డు తగులుతూ దిక్కుమాలిన ఆలోచనలు చేసే మండలి అవసరం లేదని దానిని రద్దు చేస్తున్నానని చెప్పడానికి గర్వపడుతున్నానని సీఎం చెప్పారు. శాసన మండలి రద్దుకు తీర్మానం చేసిన సీఎం జగన్ కు దమ్ముంటే అసెంబ్లీని కూడా రద్దు చేసి ప్రజల ముందుకు రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ విసిరారు. వైసీపీ గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. రాజధాని బిల్లులు మండలిలో సెలెక్ట్ కమిటీకి పంపడంతో జగన్ అహం దెబ్బతిందని ఆరోపించారు. గతంలో మండలి పునరుద్ధరణ సమయంలో దానిని తమ పార్టీ వ్యతిరేకించిన మాట వాస్తవమని అపుడు అది తమ పార్టీ విధానమని చంద్రబాబు స్పష్టం చేశారు. చర్చ ముగిసిన అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారం తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు. రద్దు తీర్మానానికి అనుకూలంగా సభలో ఉన్నవారంతా లేచి నిలబడ్డారు. జనసేన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ 132 మంది వైసీపీ సభ్యులు నిల్చున్నారు. దీంతో తీర్మానాన్ని ఆమోదించిన వారి సంఖ్య 133 గా స్పీకర్ ప్రకటించారు. ఓటింగ్ సమయంలో కొంత గందరగోళం నెలకొంది. మండలి సభ్యులైన మంత్రి మోపిదేవి వెంకట రమణరావు, ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ బయటకు వెళ్లాలని తలుపులు మూసేయాలని స్పీకర్ ఆదేశించారు. తర్వాత అసెంబ్లీ సిబ్బంది సభ్యుల సంఖ్యను లెక్కించారు. దాని ప్రకారం అనుకూలంగా 121 మంది ఉన్నారని స్పీకర్ తొలుత ప్రకటించారు. ఈ లేక్క పై మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంకా ఎక్కువ మంది ఉన్నారని మరోసారి లెక్కించాలని కోరారు. దీంతో అసెంబ్లీ సిబ్బంది మళ్లీ లెక్కించారు, ఈలోగా బయటి నుంచి ఎమ్మెల్యేలు సంతకాలు చేసే హాజరు పట్టికను తీసుకు రావాలని స్పీకర్ పురమాయించారు. రెండోవ సారి లెక్కింపు పూర్తయ్యాక సభలో 133 మంది మండలి రద్దు తీర్మానానికి అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు. తీర్మానాన్ని సభ ఆమోదించిందని తెలిపారు. అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
ఏపీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న అమ్మ ఒడి పథకం రివర్స్ సీన్ మొదలైంది. పథకంలో భాగంగా తల్లుల ఖాతాల్లో రూ.15,000 రూపాయలు జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు విరాళం సాకుతో అందులో రూ.1000 రూపాయలు వెనక్కి తీసుకునేందుకు సిద్ధమైంది. దీన్ని ఆప్షన్ గా కాకుండా తప్పని సరి చేస్తూ తాజాగా పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.  జనవరి 9వ తేదీన చిత్తూరులో అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ సీఎం జగన్ ఇచ్చిన పిలుపు మేరకే ఈ ఆదేశాలిచ్చినట్లు తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తల్లుల నుంచి వెనక్కి తీసుకునే వెయ్యి రూపాయలతో రాష్ట్రం లోని 44,570 ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణను మెరుగు పరచాలని ఆ ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. స్కూళ్ల లోని బాత్రూమ్ లు శుభ్రం చేసే ఆయాలకు నెలకు రూ.4000 వేతనంగా ఇవ్వాలని అలాగే బ్రష్ లు, చీపుర్లు , ఫినాయిల్ కు నెలకు అయ్యే రూ.2000 రూపాయలను కాంపోజిట్ గ్రాంట్ కింద ఖర్చు పెట్టుకునేలా ఈ సర్క్యులర్ జారీ చేశారు.  తల్లులందరి నుంచి జమ చేసిన సొమ్ముతో పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీలు పారిశుధ్య నిర్వహణకు తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రధానోపాధ్యాయులు ఈ నెల 30 న తల్లిదండ్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసి పారిశుధ్య నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించి.. వారిని చైతన్యపరచాలి. సమావేశానికి హాజరైన వారు తమ వంతు విరాళంగా రూ.1000 రూపాయలను తల్లిదండ్రుల కమిటీకివ్వాలని అభ్యర్థించాలి. తల్లిదండ్రుల కమిటీ బ్యాంకు ఖాతాకు జమ చేసిన సొమ్ముని జిల్లా స్థాయిలో డీఈవో ప్రత్యేకంగా తెరిచిన బ్యాంకు ఖాతాకు జమ చేయాలి.  పాఠశాల కమిషనర్ ఆదేశాలతో ప్రధానోపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. చాలా చోట్ల ఇప్పటి వరకు ఎంతమందికి అమ్మఒడి నగదు పడిందో స్పష్టత లేదు. ఇప్పటికే నగదు జమ కాలేదని చాలా మంది తల్లితండ్రులు ప్రధానోపాధ్యాయులను నిలదీస్తున్నారు. ఈ నేపధ్యంలో అమ్మఒడి లబ్దిదారుల నుంచి వెయ్యి రూపాయల వసూలు చేయాలని చెప్పడంతో వారు గగ్గోలు పెడుతున్నారు. ఒకసారి డబ్బు చెల్లించాక మళ్లీ కొంత ఇచ్చేయాలని అడిగితే ఎవరూ ముందుకు రారని, ఇది సాధ్యమయ్యే పని కాదని మండిపడుతున్నారు. పైగా ఫిబ్రవరి ఒకటి నుంచి బాత్రూంల నిర్వహణ అమలు చేయాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొనడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. అమ్మ ఒడి లబ్దిదారులు ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ల లో కూడా ఉన్నారు. ఆ పాఠశాలల్లో పిల్లల ఫీజులలోనే అన్ని రకాల నిర్వహణ ఖర్చులు కలిపి వసూలు చేస్తున్నారు. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో లబ్ధిదారుల నుంచి వెయ్యి రూపాయలు వసూలు చేసి జేబులు నింపుకోవడం మినహా ఎలాంటి నిర్వహణ ఉండదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  
దేశంలో ఆరు రాష్ట్రాల్లో మాత్రమే శాసన మండలి ఉందని.. మన రాష్ర్టానికి శాసనమండలి అవసరం లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గట్టిగా చెబుతుంటే, మరోవైపు ధర్మాన ప్రపంచంలో ఎగువ సభలు ఎన్నెన్ని దేశాల్లో ఉన్నాయో లెక్కలు వివరిస్తున్నారు. వాటిలో ఎంత నిజముందో వారికే తెలియాలి కానీ ప్రస్తుతం దేశంలో తమ రాష్ర్టానికి శాసనమండలి పెట్టుకునే అవకాశం ఇవ్వాలంటూ 10 రాష్ట్రాలు కేంద్రానికి తీర్మానాలు పెట్టకున్నాయి. వాటి పై కేంద్రం ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు శాసన మండలి ఏర్పాటు చేసుకుందామని ఎదురుచూస్తున్నాయి.  గతంలో శాసనమండలిని రద్దు చేసుకుని మళ్లీ కావాలని కోరుకుంటున్న రాష్ట్రాలు ఐదు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు చేసుకునే ఛాన్స్ ఇవ్వాలని మరో ఐదు రాష్ట్రాలు కోరుతున్నాయి. శాసన మండలిని ఏర్పాటు చేసుకోవడం అనేది రాష్ట్రాల ఇష్టం, ఆ ప్రకారం మొదట్లో కొన్ని రాష్ట్రాలు శాసన మండలి ఏర్పాటు చేసుకున్నాయి. ఆ తర్వాత మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, బెంగాల్ అవసరం లేదని రద్దు చేసుకున్నాయి. మళ్లీ కొన్నేళ్లుగా తమకు మండలి అవసరముందని ఏర్పాటు చేయాలంటూ కేంద్రానికి తీర్మానాలు పంపుతున్నాయి. గతేడాది మధ్యప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేసి పంపింది. మధ్యప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 2018 లో మండలిని పునరుద్దరించాలని మోదీ సర్కార్ కు తీర్మానం పంపారు. పంజాబ్ ఇప్పటికీ మూడు సార్లు తీర్మానాలు చేసి పంపింది. బెంగాల్ 2017 లో తీర్మానం చేసి పంపినా కేంద్రం పట్టించుకోవడం లేదు.  ఇప్పటి వరకు శాసన మండలి ఏర్పాటు చేసుకోని ఐదు రాష్ట్రాలు తమ రాష్ర్టానికి అవకాశమివ్వాలని కోరుతూ కేంద్రానికి తీర్మానాలు పంపాయి. ఒడిష, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఇప్పటి వరకు కౌన్సిల్ లేదు. గత రెండు మూడేళ్లుగా ఈ రాష్ట్రాల అసెంబ్లీలో తీర్మానాలు చేసి పంపినా ఇంత వరకు కేంద్రం స్పందించలేదు. శాసన మండలికి సంబంధించి రాష్ట్రాలు పంపే తీర్మానాలను కేంద్రం వరుసగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ లెక్కన ఏపీ సర్కారు చేసే తీర్మానాన్ని ఈ పది తీర్మానాల తర్వాతే కేంద్రం పరిగణిస్తుంది. వాటినే ఏళ్ల తరబడి పెండింగ్ లో పెట్టిన కేంద్రం జగన్మోహనరెడ్డి సర్కారు చేసిన తీర్మానాన్ని ఆఘమేఘాల మీద పరిష్కరిస్తుందా అన్నది చర్చ నీయాంశంగా మారింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.