ఇప్పుడు భయపడి ఏం లాభం జకీర్ నాయక్..

 

ఇస్లామిక్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు, ఇస్లాం బోధకుడు జకీర్ నాయక్ తాను తెలిసి చేసినా, తెలియక చేసినా.. తన ప్రసంగాల వల్ల కొంతమంది ఉగ్రవాదులుగా తయారవుతున్నారని.. ఉగ్రదాడులకు ఆయన బోధనలు కూడా కారణమవుతున్నాయన్న సంగతి బయటపడింది. అయితే తాను ఉగ్రవాదానికి పూర్తి వ్యతిరేకుడినని తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని చెబుతున్నా.. ఉగ్రవాదులకు బోధనలు వినిపిస్తున్నారన్నట్లు తేలిపోయింది. దీంతో ఆయన ఎప్పుడు ఇండియా వస్తాడో.. అప్పుడు సమన్లు జారీ చేయడానికి సిద్దంగా ఉన్నారు. అంతేకాదు ముంబైలో జకీర్‌ కదలికపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ విభాగాలు, కౌంటర్ టెర్రరిజం ఏజెన్సీలు నిరంతర నిఘాకు సిద్ధమవుతున్నాయి. ఆయన పీస్ టీవీ అనే ఛానల్‌ను సైతం బంగ్లాదేశ్లో నిషేందించారు.

 

ఇదిలా ఉండగా జకీర్ నాయక్ మాత్రం ఇండియా రావడానికి భయపడుతున్నట్టు తెలుస్తోంది. భారత్ వచ్చేది ఉన్నా.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడప్పుడే రానున్నట్టు తెలుస్తోంది. అతని షెడ్యూల్ ప్రకారం.. ఈరోజు ఆయన ముంబై రావాల్సి ఉంది..అంతేకాదు రేపు జరగాల్సిన ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా పాల్గొనాల్సి ఉంది. కానీ జకీర్ నాయక్ ఈ కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నారు.

 

మరోవైపు శివసేన పార్టీ కూడా జకీర్ నాయక్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తుంది. పాకిస్తాన్‌ నివాస కేంద్రంగా ఉన్న అజ్హర్‌ మసూద్‌ వంటివారు బహిరంగంగానే విషం చిమ్ముతారని, కానీ జకీర్‌నాయిక్‌ వంటి వారు సామాజిక సేవ పేరుతో, శాంతిని కోరుతున్న వ్యక్తులుగా కనిపిస్తూ పరోక్షంగా జాతి వ్యతిరేకులను ప్రోత్సహిస్తుంటారని శివసేన పేర్కొంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu