షర్మిలాకు గాయం, పాదయాత్ర కు బ్రేక్
posted on Dec 15, 2012 11:23AM
.jpg)
వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిలా నిర్వహిస్తున్న పాద యాత్ర కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. గత రాత్రి హైదరాబాద్ నగర శివారు ఎల్ బి నగర్ లో తన వాహనం దిగుతుండగా ఆమె మోకాలికి గాయం అయింది.
ఆమెకు నొప్పి అధికంగా ఉండడంతో ఈ యాత్రకు విరామం ఇవ్వాల్సి వచ్చిందని షర్మిలా పాద యాత్ర సమన్వయకర్త మహేంద్ర రెడ్డి పత్రికా ప్రకటన ఇచ్చారు. ఈ రోజు ఆమెకు ప్రత్యేక డాక్టర్లు చికిత్స చేయనున్నారు. అయితే, ఈ యాత్ర ఒక్క రోజు మాత్రమే వాయిదా పడే అవకాశం ఉందని పార్టీ నాయకులు చెపుతున్నారు.
షర్మిలా పాద యాత్రకు బ్రేక్ ఇవ్వడం ఇది రెండో సారి. ఈ నెల 9 వ తేదిన, చికిత్స నిమిత్తం ఆమె ఒక్క రోజు తన పాద యాత్రకు విరామం ఇచ్చారు. డాక్టర్ల సలహా అనంతరమే తిరిగి ఎప్పుడు పాద యాత్ర నిర్వహించేదీ చెప్పగలమని ఆ పార్టీ నేతలు అంటున్నారు.