వైఎస్‌ఆర్‌ని విమర్శిస్తున్న పార్టీలో ఉండలేను: వైఎస్.వివేకా

వైఎస్.వివేకానంద రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెబుతున్నట్టు ప్రకటించారు. ఈరోజు ఆయన కడప జిల్లాలో విలేకరులతో మాట్లాడాతు, తన రాజకీయ భవిష్యత్తును తన కార్యకర్తలే నిర్ణయిస్తారని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో ఉండలేకపోతున్నానని ఆయన అన్నారు. దాంతో కాంగ్రెస్‌కు దూరంగా ఉండాలనుకుంటున్నానని ఆయన తెలిపారు. భవిష్యత్ కార్యచరణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని వివేకానంద అన్నారు. పులివెందులలో కార్యకర్తలతో, వైఎస్ అభిమానులతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం పార్టీని వీడుతున్నట్టు వైఎస్ వివేకానందరెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu