సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం.. రేపే విడుదల!!

 

ఏపీ సీఎం వైఎస్ జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది. కర్నూలు లో ఏపీ హైకోర్టు ఏర్పాటు పైన కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అమరావతిలో ఏపీ హైకోర్టు కొనసాగుతోంది. అయితే, అన్ని కీలక విభాగాలు ఒకే చోట ఏర్పాటు చేయకుండా.. అధికార వికేంద్రీకరణ 13 జిల్లాల్లోనూ ఉండాలని జగన్ భావిస్తున్నారు. అందులో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇదే సమయంలో విశాఖలోనూ హైకోర్టు బెంచ్ ఏర్పాటు దిశగా జగన్ ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో సీఎం జగన్ ఈ మేరకు స్పష్టత ఇస్తారని సమాచారం.

తమ ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు చేయాలని రాయలసీమ వాసులు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. దీంతో..కర్నూలు లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని మాజీ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అది అమలు కాలేదు. ఇక, జగన్ సీఎం కావటం తో ఇప్పుడు ఈ ప్రతిపాదన ఆచరణ రూపం సంతరించుకుంటోంది. అందులో భాగంగా మొత్తంగా హైకోర్టును కర్నూలు ఏర్పాటు చేయాలని జగన్ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే, బెంచ్ ఏర్పాటు సరైన నిర్ణయమని.. అదే సమయంలో విశాఖలోనూ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని మరి కొంత మంది సీఎం జగన్ కు సూచిస్తున్నట్లు తెలుస్తోంది.

కర్నూలు లో ఏపీ హైకోర్టు ఏర్పాటు ఖాయమని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. జగన్ హైకోర్టు ఏర్పాటు వైపే మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం. అయితే, కొత్త నిర్ణయాలతో సమస్యలు రాకుండా ముందుగా అక్కడ హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రకటన వరకే పరిమితం కావాలని కొందరు సీఎంకి సూచిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో.. ఇప్పుడు స్వాతంత్య్ర దినోత్సవం నాడు సీఎం చేయబోయే ప్రకటన మీద అంతా ఆసక్తి నెలకొని ఉంది.