జగన్ కు మరోషాక్.. ఇంటివారే..
posted on Mar 22, 2016 10:18AM

ఇప్పటి వరకూ వైసీపీ నుండి అనేక మంది నేతలు టీడీపీలోకి జంప్ అయి వైసీపీ అధినేత జగన్ కు షాకిస్తే ఇప్పుడు ఏకంగా కుటుంబ సభ్యులే ఆయనకు షాకివ్వడానికి రెడీ అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఆయన మామ పీటర్ షాకిచ్చారు. సోమవారం హైదరాబాద్ వచ్చిన ఆయన ఏపీ సీఎం.. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. కడప కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవి కోసం వెళ్లిన తనకు పార్టీ నేతలు షాకింగ్ ప్రతిపాదన ముందు పెట్టారని చెప్పారు. రూ.కోటి ఇస్తే డిప్యూటీ మేయర్ పదవి గురించి ఆలోచిస్తామంటూ వైసిపి నేతలు చెప్పడంతో తాను ఏం చేయలేకపోయానన్నారు. స్టాండింగ్ కౌన్సిల్ సభ్యత్వం కోసం నామినేషన్ వేస్తే ఒత్తిడి తెచ్చి మరీ ఉపసంహరించుకునేలా చేశారని ఆరోపించారు. మొత్తానికి ఇంటి మనిషే జగన్ పై ఆరోపణలు చేసే పరిస్థితి వచ్చింది.