తరువాత నేనే సీఎం.. జగన్
posted on Aug 18, 2015 10:46AM
.jpg)
మరో మూడేళ్లలో తనే సీఎం అవుతాడంటా ఇది ఎవరో చెప్పిన మాటలు కాదు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. మరో రెండేళ్ల వరకే చంద్రబాబు సీఎంగా ఉంటారని.. వచ్చే ఎన్నికల్లో తానే సీఎం అవుతానని జోస్యం చెపుతున్నారు. మూడు రోజుల కడప జిల్లా పర్యటనలో ఉన్న ఆయన పులివెందులలోని తన ఇంట్లో ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో మూడేళ్లు ఆగండి.. ముఖ్యమంత్రిగా నేనే వస్తా. మీ సమస్యలు తీరుస్తా'' అని ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. కాగా రాష్ట్రానికి ప్రత్యేక హోదాకోసం గట్టిగా ప్రయత్నిస్తున్నానని.. తనతో పాటు అందరూ ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేయాలని అన్నారు. అలాగే ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ బంద్ నిర్వహించనున్న నేపథ్యంలో అందరూ బంద్ లో పాల్గొనాలని.. బంద్ విజయవంతంగా అయ్యేలా అందరూ కృషిచేయాలని కోరారు.