జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం సీజ్

 

వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు సీజ్ చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన పోలీసులు.. ఇన్ఛార్జ్ అప్పిరెడ్డికి నోటీసులు అందజేశారు. అనంతరం జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును సీజ్ చేసి తీసుకెళ్లారు. జగన్ రెంటపాళ్ల పర్యటనలో సింగయ్య ఆ కారు కింద పడి చనిపోయినట్లు వీడియోలో ఉందని నిన్న పోలీసులు వెల్లడించారు. 

పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సందర్భంగా సింగయ్య అనే వ్యక్తి మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. జగన్ వాహనం కింద పడి సింగయ్య మృతి చెందినట్టు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోల ఆధారంగానే పోలీసులు ఈ కేసులో సెక్షన్లు మార్చి  జగన్ ను కూడా నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో జగన్ ను ఏ2గా పేర్కొన్న పోలీసులు... తాజాగా ఆయనకు నోటీసులు జారీ చేశారు.  అంతేకాదు, సింగయ్య మృతికి కారణమైనదిగా భావిస్తున్న ఫార్చ్యూనర్ (AP 40 DH 2349) వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu