ఎర్రన్నాయుడు స్మృతికి నివాళి!

 

కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో మరణించి సంవత్సరం అయింది. ఆయన ప్రథమ వర్ధంతిని హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో శనివారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడితోపాటు పార్టీ ముఖ్య నాయకులు ఎర్రన్నాయుడు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఆయన స్మృతికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఎర్రన్నాయుడితో తనకున్న అనుబంధాన్ని, తెలుగుదేశం పార్టీకి, దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఎర్రన్నాయుడి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా వుంటుందని చెప్పారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం ఎర్రన్నాయుడు చేసిన కృషి మరువలేనిదని శ్లాఘించారు. ఎంతో ఉజ్వల భవిష్యత్తు వున్న ఎర్రన్నాయుడి మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటని చెబుతూ, ఈ సంవత్సర కాలంలో పార్టీలో ఆయన లేని లోటు కనిపించిందని చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu