షియోమి నుంచి కొత్త ఫోన్, టాబ్లెట్

 

చైనా యాపిల్ గా పేరొందిన షియోమి కంపెనీ రెడ్ ఎంఐ2 స్మార్ట్ ఫోన్ తోపాటు ఎంఐ ప్యాడ్ టాబ్లెట్ పేరుతో మరో రెండు కొత్త డివైజ్ లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. వీటిలో రెడ్ ఎంఐ2 ధరను రూ. 6999గా, ఎంఐ ప్యాడ్ ధరను రూ. 12,999గా నిర్ణయించింది. రెడ్ ఎంఐ2 స్మార్ట్ ఫోన్ రిజిస్ట్రేషన్ గురువారం సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభం.మార్చి 24వ తేదీ నుండి ఫ్లిప్ కార్ట్ల్ లో ఫ్లాష్ అమ్మకాలు ఉంటాయి. మొదటి విడతలో 30 వేల నుండి 40 వేల ఫోన్లు అమ్మే అవకాశం ఉందని షియోమి ఇండియా హెడ్ మను జైన్ చెప్పారు.

రెడ్ ఎంఐ2 ప్రత్యేకతలు:

* 4.7 అంగుళాల డిస్ప్లే
* క్వాడ్ కోర్ 64 బిట్ స్నాప్డ్రాగన్ 410 ప్రాసెసర్,
* 4జి డ్యూయల్ సిమ్
* 8 ఎంపీ బ్యాక్ కెమెరా
* 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా

ఎంఐ ప్యాడ్ ప్రత్యేకతలు: 7.9 అంగుళాల డిస్ప్లే.  అయితే వీటిలో కేవలం వై-ఫై ఆధారంగానే నెట్ అందుబాటులోకి వస్తుంది.