లోకేష్ మంత్రి మాత్రమే.. పార్టీ అధ్యక్షుడు కాదు.!!

తాజాగా కర్నూల్ జిల్లా పర్యటనలో మంత్రి నారా లోకేష్.. కర్నూల్ ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.. ఎంపీగా బుట్టా రేణుకని, ఎమ్మెల్యేగా ఎస్వీ మోహన్ రెడ్డిని గెలిపించాలని లోకేష్ పిలుపునిచ్చారు.. దీంతో తన కుమారుడికి టిక్కెట్ ఇప్పించాలనే పట్టుదలతో ఉన్న టీజీ వెంకటేష్, ఈ విషయంపై ఎలా స్పందిస్తారా? అని అంతా అనుకున్నారు.. అయితే ఈ విషయంపై టీజీ కాస్త భిన్నంగా స్పందించారు.. లోకేష్ మంత్రి మాత్రమేనని.. పార్టీ అధ్యక్షుడు కాదని.. ముఖ్యమంత్రి కాదని టీజీ గుర్తు చేశారు.. బీఫామ్‌ ఖరారయ్యాకే అభ్యర్థులను ప్రకటించే సంప్రదాయం టీడీపీలో ఉందని, ఎస్వీమోహన్‌రెడ్డి లోకేష్ను హిప్నటైజ్‌ చేసి ఉంటారని అన్నారు.

 

 చంద్రబాబు టికెట్‌పై తుది నిర్ణయం తీసుకున్నాకే తాను స్పందిస్తాన్నారు.. అయితే లోకేష్ టిక్కెట్లు ప్రకటించడంపై ఎస్వీ మోహన్ రెడ్డి తన సంతోషాన్ని వ్యక్తం చేసారు.. లోకేష్ తనను కర్నూలు అసెంబ్లీ అభ్యర్దిగా ప్రకటించడం సంతోషకరమన్నారు.. పరిస్థితులను బట్టి లోకేష్ ముందుగానే అభ్యర్దులను అనౌన్స్ చేశారని.. టీజీకి రాజ్యసభ సీటు ఇచ్చారు కాబట్టి తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తామని హామీ ఇచ్చారని.. అన్నీ ఆలోచించే లోకేష్ నిర్ణయం తీసుకున్నారని ఎస్వీ తెలిపారు.