స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌లో ఎవ‌రీ బ్యూటీ?

ఐపీఎల్‌లో చీర్ గాల్స్ మాత్ర‌మే కాదు.. ఫ్రాంచ‌జీ ఓన‌ర్స్ సైతం జిల్ జిల్ జిగాలా మెరుస్తున్నారు. వీఐపీ గ్యాల‌రీల్లో కాకుండా.. ఐపీఎల్ వేలంలోనూ గ్లామ‌ర్ పంచుతున్నారు. ఈసారి ఐపీఎల్ యాక్ష‌న్‌లో స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచారు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ య‌జ‌మాని కావ్య మార‌న్‌. బ్యూటిఫుల్ లుక్స్‌తో, సినిమా హీరోయిన్‌లా ఉన్న కావ్య గురించి సోష‌ల్ మీడియాలో తెగ సెర్చింగ్ జ‌రుగుతోంది. ఎవ‌రీ కావ్య మార‌న్ అంటూ నెజిజ‌న్లు స‌ర్ఫింగ్ చేస్తున్నారు. 

ఇప్ప‌టికే ఐపీఎల్ వేలంలో.. షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్, కుమార్తె సుహానా ఖాన్‌ల‌తో పాటు జూహ్లీ చావ్లా కూతురు జాహ్న‌వి చావ్లాల‌కు క్రేజ్ పెరిగింది. లేటెస్ట్‌గా ఐపీఎల్‌-2022లో అందరి దృష్టిని ఆకర్షించింది సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్. ఆమె వేలం టేబుల్ ద‌గ్గ‌ర‌ కూర్చున్న ఫోటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గూగుల్ సెర్చ్‌లు మరియు సోషల్ మీడియాలో 'హూ ఈజ్ కావ్య మారన్', 'ఎస్‌ఆర్‌హెచ్ ఓనర్ ఎవరు' వంటి ప్రశ్నలు ట్రెండింగ్ అవుతున్నాయి. 

IPL 2022 మెగా వేలంలో 30 ఏళ్ల కావ్య మారన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ డైరెక్టర్ టామ్ మూడీ మరియు ముత్తయ్య మురళీధరన్‌తో కలిసి టేబుల్‌ పంచుకున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని త‌మిళ‌నాడుకు చెందిన క‌ళానిధి మార‌న్ కుమార్త‌నే ఈ కావ్య మారన్. ఆమె మాజీ ముఖ్య‌మంత్రి క‌రుణానిధికి మునిమ‌న‌వ‌రాలు. డీఎంకే ఎంపీ ద‌యానిధి మార‌న్ కావ్య‌కు మేన‌మామ‌.  ఇప్ప‌టికే ఆమె మార‌న్‌ కుటుంబం ఆధ్య‌ర్యంలో న‌డుస్తున్న‌ స‌న్ టీవీ యొక్క విభాగాలైన స‌న్‌ మ్యూజిక్‌తో పాటు FM ఛానెల్‌ల బాధ్య‌త‌లు చూస్తున్నారు. ప్ర‌స్తుతం స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ప‌నులూ ఆమెనే టేక‌ప్ చేశారు. త‌న నిర్ణ‌యాల‌తో పాటు అందంతోనూ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు వెలుగులు తీసుకొస్తున్నారు కావ్య‌.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu