కడియం శ్రీహరిపై చెప్పు విసిరిన రైతు..? కావాలనే చేశారు.. టీఆర్ఎస్

వరంగల్ ఉపఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ తరుపున పసునూరి దయాకర్ బరిలో దిగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికలకు పసునూరి తరుపున ప్రచారంలో పాల్గొనడానికి వెళ్లిన కడియం శ్రీహరికి ఓ చేధు అనుభవం ఎదురైంది. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా పసునూరి దయాకర్ రావు, కడియం శ్రీహరి, మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంకా ఇతర టీఆర్ఎస్ నేతలు శాయంపేట మండలానికి వెళ్లారు. అయితే అక్కడ కడియం శ్రీహరి ప్రసంగిస్తున్న సమయంలో ఆయనపై ఓ రైతు చెప్పు విసిరాడు. దీంతో కార్యకర్తలు అతనిని పోలీసులకు అప్పగించారు. అయితే రైతు మాట్లాడుతూ తమకు గిట్టుబాటు ధర కూడా కల్పించడం లేదని.. అందుకే కోపంతో చెప్పు విసిరానని చెప్పాడు. అయితే టీఆర్ఎస్ నేతలు మాత్రం ఇదంతా కుట్రలో భాగమే అని.. కావాలనే ప్రతిపక్షాలు ఇలా చేయించాయని మండిపడుతున్నారు. కానీ ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీపై రైతులు మాత్రం కోపంగానే ఉన్నారన్నది నిజం. రైతుల ఆత్మహత్యలపై అధికార పార్టీ వ్యవహరిస్తున్నతీరుకు అందరూ విమర్శిస్తూనే ఉన్నారు. దీంతో టీఆర్ఎస్ నేతలు కావాలని చేయించారు అని ఆరోపిస్తున్నా.. రైతులు మాత్రం నిజంగానే కోపంతో ఉన్నారు.. ప్రత్యేకంగా వారితో చేయించాల్సిన అవసరం లేదు.. వారికి ఎక్కడికి వెళ్లినా ఇలాంటి అనుభవాలు ఎదురవ్వకతప్పదు అని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu