వరంగల్ ఉపఎన్నిక.. తప్పుకున్నరాజయ్య.. సర్వేకు టికెట్
posted on Nov 4, 2015 10:31AM

కాంగ్రెస్ అభ్యర్ది సిరిసిల్ల రాజయ్య ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలీండర్ లీక్ అయి అతని కోడలు సారిక, ముగ్గురు మనుమలు సజీవ దహనమయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా వరంగల్ ఉపఎన్నికకు కాంగ్రెస్ పార్టీ నుండి బరిలోకి రాజయ్య దిగనున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగ ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు. అయితే ఇప్పుడు ఈ సంఘటనతో వరంగల్ ఉపఎన్నికకు రాజయ్య విముఖత చూపినట్టు తెలుస్తోంది. దీనిపై అధిష్టానం కూడా ఎవరిని బరిలోకి దింపాలనే దానిపై కసరత్తు చేసి ఆఖరికి రాజయ్య స్థానంలో సర్వే సత్య నారాయణ పేరును కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ రోజు మధ్యాహ్నం సర్వే నామినేషన్ వేయనున్నారు.